Delhi market
-
అందరూ చూస్తుండగానే... మహిళ బ్యాగ్ కొట్టేసిన బైకర్!
న్యూఢిల్లీ: శ్రీనగర్‌కి చెందిన షాహిదా బజాజ్ ఢ్లిలీకి వచ్చి ఒక చేదు అనుభవాన్ని ఎదర్కొంది. ఆమె తన భర్తతో కలిసి ఢిల్లీలోని ఒక మార్కెట్‌కి వెళ్లింది. షాపింగ్ పూర్తి అయిన తదనంతరం వారు తిరిగి తాము ఉంటున్న హోటల్‌కి వెళ్తుండగా..ఆమె పక్క నుంచే బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. అందులో ఒక వ్యక్తి ఆమె బ్యాగ్‌ని కొట్టేశాడు. సదరు బైకర్లు ఆమెని గమనిస్తూ పక్క నుంచే వెళ్తూ..ఆమె బ్యాగ్‌ని గుంజుకుని పట్టుకుపోయాడు. ఐతే ఆ దొంగ బ్యాగ్‌ని ఆమె నుంచి లాక్కొనే సమయంలో ఆమె ప్రతిఘటించడంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆమె భర్త సాయంతో లేచింది. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. ఆ దొంగ రద్దీగా ఉండే మార్కెట్లో అదీ కూడా అందురూ చూస్తుండగానే చోరి చేసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దొంగ ఆచూకి కోసం గాలిస్తున్నారు. ఐతే ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. (చదవండి: ఒకే ఇంట్లో ఆరు డెడ్‌బాడీల కలకలం.. ఏం జరిగింది?) -
జీవితకాల గరిష్టస్థాయికి పసిడి
న్యూఢిల్లీ: బంగారం ధర జోరుమీద కొనసాగుతోంది. గతకొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర సోమవారం ఏకంగా జీవితకాల గరిష్టస్థాయిని తిరగరాసింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల (బిస్కెట్ గోల్డ్) బంగారం ధర రూ.35,970 చేరుకుంది. ప్రాంతీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ క్రమంగా పెరిగిన కారణంగా ఇక్కడి ధర రూ.100 పెరిగి ఆల్ టైం రికార్డు హైకి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర జైన్ పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమౌతున్నందున ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపునకు మళ్లడమే డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా విశ్లేషించారు. మరోవైపు సావరిన్ గోల్డ్ ధర కూడా రూ.100 పెరిగి రూ.35,870 వద్దకు చేరుకుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర సోమవారం ఒక దశలో 1,430.35 డాలర్ల గరిష్టస్థాయిని నమోదుచేసింది. వెండి వెలుగులే.. బంగారం దారిలోనే వెండి ధరలు ప్రయాణం చేస్తున్నాయి. స్పాట్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.260 పెరిగి రూ.41,960 చేరుకోగా.. వీక్లీ డెలివరీ సిల్వర్ ధర రూ.391 పెరిగి రూ.41,073 వద్దకు ఎగబాకింది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.84,000 కాగా, అమ్మకం ధర రూ.85,000. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 16.62 డాలర్లకు ఎగసింది. -
మూతపడిన 25వేల మార్కెట్లు
న్యూఢిల్లీ : ఈ వీకెండ్లో షాపింగ్ చేయాలని ఏమైనా ప్లాన్స్ వేసుకున్నారా? అయితే అవన్నీ ఫ్లాపే. ఢిల్లీలో కన్నాట్ ప్లేస్, ఖాన్ మార్కెట్ వంటి ముఖ్యమైన మార్కెట్లన్నీ మూత పడ్డాయి. మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న సీలింగ్ డ్రైవ్‌ను నిరసిస్తూ.. నేడు, రేపు ఢిల్లీలో మార్కెట్లను మూసివేస్తున్నట్టు ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫడరేషన్ ప్రకటించింది. రెండు రోజుల పాటు తాము ఈ బంద్‌ను చేపడతామని తెలిపింది. 2వేల మంది ట్రేడర్స్ అసోసియేషన్స్ ఈ బంద్‌కు మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ పురీ ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటామని మాట ఇచ్చినప్పటికీ ట్రేడర్లు బాడీ మాత్రం నిరసనను పాటించాలనే నిర్ణయించింది. ఈ విషయంపై బీజేపీ ఢిల్లీ లీడర్లు, రాజధాని పరిధిలో ఉన్న మూడు మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్లు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లు సమావేశమయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న ఈ సీలింగ్ డ్రైవ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రవీణ్ ఖండేల్వాల తెలిపారు. మొత్తంగా 25వేల మార్కెట్లను మూసివేస్తున్నట్టు చెప్పారు. 500 మార్కెట్లలో ఆందోళనలు చేపడుతున్నారు. సీపీ, ఖాన్ మార్కెట్‌తో పాటు ఛాందినీ చౌక్, కరోల్ భాగ్, కమలా నగర్, సౌత్ ఎక్స్టెన్షన్, గ్రేటర్ కైలాష్, లజపత్ నగర్, డిఫెన్స్ కాలనీ, గ్రీన్ పార్క్, రాజౌరి గార్డెన్, తిలక్ నగర్ మార్కెట్లు మూతపడ్డాయి. -
భారీగా తగ్గిన బంగారం, వెండి ధర
-
బంగారం హైజంప్..
ఢిల్లీ మార్కెట్లో రూ. 840 అప్ ఒకే రోజు ఇంత పెరగడం ఈ ఏడాది ఇదే ప్రథమం న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా భారత్‌లో కూడా పసిడి ధర గణనీయంగా పెరిగింది. మంగళవారం పది గ్రాముల పసిడి రేటు ఏకంగా రూ. 840 పెరిగింది. ఒక్క రోజులో బంగారం ధర ఇంత పెరగడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి. తాజా పెరుగుదలతో దాదాపు నెల రోజుల తర్వాత న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం మళ్లీ రూ. 27,000 మార్కును దాటింది. మేలిమి బంగారం (99.9 శాతం స్వచ్ఛత) పది గ్రాముల ధర రూ. 27,040 వద్ద ముగిసింది. చివరిగా అక్టోబర్ 30న న్యూఢిల్లీ మార్కెట్లో పసిడి ఈ రేటు వద్ద కదలాడింది. మరోవైపు, తాజాగా ఆభరణాల బంగారం రూ. 26,840 వద్ద ముగిసింది. వరుసగా ఆరు సెషన్లలో పసిడి ధర రూ. 730 మేర క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే దిగుమతులపై పరిమితులను ఆర్బీఐ సడలించడం ప్రస్తుతం మళ్లీ ఊపునిచ్చింది. ఇక వివాహాల సీజన్ నేపథ్యంలో దేశీయంగా డిమాండు పెరగడమూ పసిడికి కలిసొచ్చింది. ఇక పారిశ్రామిక సంస్థలు, నాణేల తయారీ సంస్థల నుంచి డిమాండ్‌తో వెండి కూడా కిలో ధర రూ.2,700 పెరిగి రూ. 37,000 వద్ద ముగిసింది. ముంబై మార్కెట్లోనూ..: స్టాకిస్టులు, ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్‌తో ముంబై మార్కెట్లోనూ పసిడి రేటు పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం రూ.370 పెరిగి రూ.26,485 వద్ద, ఆభరణాల బంగారం కూడా అంతే పెరిగి రూ.26,335 వద్ద ముగిసింది. వెండి ధర కిలోకు రూ.850 మేర పెరిగి రూ.36,965 వద్ద ముగిసింది. -
ఢిల్లీలో వ్యాపారవేత్తపై కాల్పులు
ఢిల్లీలో నిత్యం రద్దీగా ఉండే ఓ మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యాపారవేత్తపై కాల్పులు జరిపారు. సోమవారం మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగులు జితేందర్ సింగ్ (39)పై దాడి చేసినట్టు పోలీసులు చెప్పారు. ఆయనపై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపి వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్టు తెలిపారు. ఢిల్లీలోని తిలక్‌నగర్ ప్రాంతంలో ఆయన ఆఫీసు బయట ఈ సంఘటన జరిగింది. జితేందర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వ్యకిగత వైరంతో ఈ దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్టు చెప్పారు. జితేందర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాముల్ని విచారిస్తున్నారు. -
నిమ్మకు నకిరేకల్ బెడద
అంతర్జాతీయ మార్కెట్లో బంగారు ధరలు మారినట్టుగా నిమ్మధరలు సైతం అమాంతం పెరగడం తిరిగి అదే స్థాయిలో తగ్గిపోవడం జరుగుతోంది. నకిరేకల్ నిమ్మ మార్కెట్‌ను శాసిస్తోంది. అక్కడ దిగుబడులు ఎక్కువగా రావడంతోపాటు విపరీతంగా ఎగుమతి చేస్తున్నారు. దాంతో దిగుబడి తగ్గిన ఈ ప్రాంత రైతులు నిత్యం నకిరేకల్ నుంచి నిమ్మకాయలను దిగుమతి చేసుకుని ద క్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. పొదలకూరు, న్యూస్‌లైన్: ప్రస్తుతం పూర్తిగా దక్షిణ భారత దేశంపై ఆధారపడే నిమ్మమార్కెట్ నడుస్తోంది. సాధారణంగా ఢిల్లీ మార్కెట్ నిమ్మ ధరలను నిర్ణయిస్తుంది. అక్కడి డిమాండ్‌ను బట్టి ఈ ప్రాంతం వ్యాపారులు ధరలను నిర్ణయించి ఎగుమతి చేస్తుంటారు. అయితే కొంతకాలంగా ఢిల్లీ మార్కెట్లో కాయలకు డిమాండ్ తగ్గిపోవడంతో పొదలకూరు నిమ్మమార్కెట్ యార్డు వ్యాపారులు దక్షిణ భారతదేశంలోని చెన్నై, మధురై, కేరళ, బెంగుళూరు తదితర ప్రాంతాలకు కాయలను ఎగుమతి చేస్తున్నారు. దక్షిణభారత దేశ మార్కెట్లో సైతం వ్యాపారులు, రైతులు ఆశించిన స్థాయిలో నిమ్మ ధరలు ఇటీవల పెరిగాయి. ఫలితంగా ఇటీవల ఒక్కసారిగా సైజు బాగున్న కాయలు లూజు(బస్తా) ఒక్కటింటికి రూ.4500 వరకు ధర పలికింది. పండుకాయలు సైతం రూ.2500 వరకు ధరలు పలికాయి. అదే సమయంలో ఒక్కసారిగా నిమ్మకాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం లూజు(బస్తా) ఒక్కటింటికి రూ. 1500 నుంచి రూ.2000 వరకు ధర పలుకుతోంది. అది కూడా కాయల సైజు బాగుంటేనే ఆ ధరలు పలుకుతున్నట్టు వ్యాపారులు తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రాంతం నల్గొండ జిల్లా నకిరేకల్ నిమ్మ మార్కెట్టేనంటున్నారు. అక్కడి కాయల సైజు బాగుండడంతో పాటు, దిగుబడి పెరగడంతో నకిరేకల్ వ్యాపారులు దక్షిణ భారత దేశ నిమ్మమార్కెట్‌ను శాసించే స్థాయికి ఎదిగినట్టు తెలుస్తోంది. అంతేకాక పొదలకూరు వ్యాపారులు సైతం తప్పనిసరి పరిస్థితిల్లో ప్రతి నిత్యం నకిరేకల్ నుంచి సుమారు రూ.10 లక్షల కాయలను దిగుమతి చేసుకుని ప్యాకింగ్ చేసి బయటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కాయల దిగుబడి తగ్గిన ప్రతి సారి వ్యాపారులు నకిరేకల్పైనే ఆధారపడాల్సి వస్తోంది. అక్కడి కాయలు నాణ్యత మెరుగ్గా లేకున్నా సైజు బాగుండడంతో వారి కాయలకు మార్కెట్లో డిమాండ్ ఉంటోంది. పొదలకూరు యార్డు వ్యాపారుల్లో కొందరు పూర్తిగా నకిరేకల్‌పై ఆధారపడి కూడా వ్యాపారం చేస్తున్నారు.