ఢిల్లీలో మూతపడిన మార్కెట్లు(ఫైల్)
న్యూఢిల్లీ : ఈ వీకెండ్‌లో షాపింగ్ చేయాలని ఏమైనా ప్లాన్స్ వేసుకున్నారా? అయితే అవన్నీ ఫ్లాపే. ఢిల్లీలో కన్నాట్ ప్లేస్, ఖాన్ మార్కెట్ వంటి ముఖ్యమైన మార్కెట్లన్నీ మూత పడ్డాయి. మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న సీలింగ్ డ్రైవ్‌ను నిరసిస్తూ.. నేడు, రేపు ఢిల్లీలో మార్కెట్లను మూసివేస్తున్నట్టు ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫడరేషన్ ప్రకటించింది. రెండు రోజుల పాటు తాము ఈ బంద్‌ను చేపడతామని తెలిపింది. 2వేల మంది ట్రేడర్స్ అసోసియేషన్స్ ఈ బంద్‌కు మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్‌దీప్ పురీ ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటామని మాట ఇచ్చినప్పటికీ ట్రేడర్లు బాడీ మాత్రం నిరసనను పాటించాలనే నిర్ణయించింది.
ఈ విషయంపై బీజేపీ ఢిల్లీ లీడర్లు, రాజధాని పరిధిలో ఉన్న మూడు మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్లు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లు సమావేశమయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న ఈ సీలింగ్ డ్రైవ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రవీణ్ ఖండేల్‌వాల తెలిపారు. మొత్తంగా 25వేల మార్కెట్లను మూసివేస్తున్నట్టు చెప్పారు. 500 మార్కెట్లలో ఆందోళనలు చేపడుతున్నారు. సీపీ, ఖాన్ మార్కెట్‌తో పాటు ఛాందినీ చౌక్, కరోల్ భాగ్, కమలా నగర్, సౌత్ ఎక్స్‌టెన్షన్, గ్రేటర్ కైలాష్, లజపత్ నగర్, డిఫెన్స్ కాలనీ, గ్రీన్ పార్క్, రాజౌరి గార్డెన్, తిలక్ నగర్ మార్కెట్లు మూతపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment