కొత్త బాండ్ ఎవరో! | Daniel Craig quits James Bond 007 role for US telly series | Sakshi
Sakshi News home page

కొత్త బాండ్ ఎవరో!

Published Wed, Feb 17 2016 10:16 AM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

కొత్త బాండ్ ఎవరో!

కొత్త బాండ్ ఎవరో!

హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో జేమ్స్ బాండ్కు ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా ఈ సినిమాల్లో బాండ్ పాత్రల్లో నటించే నటీనటులు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంటారు. ఇప్పటికే 26 సినిమాల్లో కనిపించిన బాండ్ పాత్రల్లో సీన్ కానరీ, డేవిడ్ నివెన్, జార్జ్ లెజెన్బే, రోగర్ మోర్, టిమోతీ డాల్టన్, పియర్స్ బ్రోస్నన్ నటించగా చివరి నాలుగు చిత్రాల్లో డానియల్ క్రెగ్ బాండ్ పాత్రలో అలరించాడు.

తాజాగా రిలీజ్ అయిన స్పెక్టర్ సినిమా ప్రమోషన్ సందర్భంగా క్రెగ్ ఇక పై తనకు బాండ్ పాత్రలో నటించటం ఇష్టం లేదంటూ ప్రకటించాడు. దీంతో కొత్త బాండ్ ఎవరన్న చర్చ మొదలైంది. అయితే ఇప్పటివరకు మరో బాండ్ ఎవరన్నది తేలకపోయినా డానియల్ క్రెగ్ మాత్రం బాండ్ పాత్రకు గుడ్ బై చెప్పినట్టే అన్నటాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం క్రెగ్ ప్యూరిటీ అనే అమెరికన్ టీవీ సీరీస్కు అంగీకరించాడు. ఈ సీరీస్ పూర్తి కావటానికి చాలా సమయం పడుతుంది కనుక క్రెగ్ ఇక బాండ్ సినిమాకు అంగీకరించే ఛాన్స్ లేదు. దీంతో కొత్త బాండ్ కోసం అన్వేషణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement