Daniel Craig
-
Aaron Taylor-Johnson: కొత్త జేమ్స్ బాండ్?
హాలీవుడ్ ‘జేమ్స్ బాండ్’ ఫ్రాంచైజీ సూపర్‌హిట్. ‘జేమ్స్ బాండ్’ సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 25 సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ ఎక్కువ సార్లు జేమ్స్ బాండ్‌గా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. 2021లో వచ్చిన జేమ్స్ బాండ్ 25వ చిత్రం ‘జేమ్స్ బాండ్: నో టైమ్ టు డై’లోనూ డేనియల్ క్రెగ్ బాండ్‌గా కనిపించారు. తాజాగా జేమ్స్ బాండ్ 26వ సినిమా గురించిన వార్తలు హాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు తొలుత డేనియల్ క్రెగ్ పేరు వినిపించింది. కానీ మరోసారి బాండ్‌గా కనిపించేందుకు డేనియల్ ఆసక్తికరంగా లేరట. దీంతో కొత్త జేమ్స్ బాండ్‌గా ఎవరు కనిపిస్తారు? అనే చర్చ హాలీవుడ్లో మొదలైంది. ఈ క్రమంలో ఆరోన్ టేలర్ జాన్సన్ పేరు తెరపైకి వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం, వయసు రీత్యా కూడా జేమ్స్ బాండ్‌గా ఆరోన్ పర్ఫెక్ట్ చాయిస్ అంటున్నారు కొందరు హాలీవుడ్ సినీ ప్రేమికులు. అలాగే ‘జేమ్స్‌బాండ్ 26’వ చిత్రానికి క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక హాలీవుడ్ చిత్రాలు ‘కిక్కాస్’, ‘చాట్ రూమ్’, ‘గాడ్జిల్లా’, ‘అవెంజర్స్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు ఆరోన్ టేలర్. -
జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెగ్‌కి అరుదైన గౌరవం
ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో నటించిన యాక్టర్స్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. సుదీర్ఘకాలం అలాంటి కేరక్టర్ చేసిన హాలీవుడ్ స్టార్ డేనియల్ క్రెగ్. ఆయనకి అరుదైన గౌరవం లభించింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్‌తో డేనియల్ని సత్కరించింది హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. లెజెండరీ బాండ్ నటుడు రోజర్ మూర్ తర్వాత ఈ గౌరవాన్ని పొందిన 2,704 నటుడు ఈయనే. అయితే ఇప్పటి వరకు అయిదు బాండ్ సినిమాల్లో నటించిన డేనియల్‌కి తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’ చివరిది. దీంతో తన టీంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ 53 ఏళ్ల స్టార్ బాండ్ చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు. వారు లేకుండా తాను అలాంటి అరుదైన గౌరవాన్ని పొందేవాన్ని కాదని చెప్పాడు. అయితే ఇటీవలే విడుదలైన 24 వ జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైమ్ టు డై’ హాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలోనూ మంచి వసూళ్లను సాధించింది. ఈ తరుణంలో 2006లో ‘క్యాసినో రాయల్’తో బ్రిటీష్ గూఢచారిగా ప్రస్థానం ప్రారంభించి.. సుదీర్ఘకాలం బాండ్ పాత్రలో జీవించిన డేనియల్‌కి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది హాలీవుడ్. చదవండి: ఓకే ఫైట్‌సీన్‌కి 32వేల లీటర్ల కూల్‌డ్రింక్స్! -
జేమ్స్ బాండ్: ‘నో టైమ్ టు డై’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా!
జేమ్స్ బాండ్.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ నుంచి సిరీస్ వస్తుందంటే చాలు చిన్న వారి నుంచి పెద్దవారి వరకు అన్ని వయసుల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పటి వరక జేమ్స్ బాండ్ నుంచి 24పైగా సిరీస్‌లు వచ్చాయంటే ఈ బాండ్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది. హాలీవుడ్ చిత్రమైనప్పటికీ ఇండియాలో కూడా ఈ సిరీస్ అత్యంత క్రేజ్‌ను సంపాదించుకుంది. చదవండి: జేమ్స్ బాండ్.. బై బై డేనియల్ ఇటీవల ఈ సిరీస్ నుంచి ‘నో టైమ్ టు డై’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. గురువారం(సెప్టెంబర్ 30) ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ విడుదలైంది. భారత్‌లో కూడా ఈ మూవీ అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇక భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన తొలి రోజే భారత్‌లో ఈ సిరీస్ రూ. 2. 25 కోట్లు వసూళ్లు చేయగా.. యూకేలో రూ. 4.5 మిలియన్ల యూరోలు రాబట్టింది. అయితే దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. చదవండి: OTT: ఈ వారం థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలివే కరోనా కాలంలో కూడా ఈ మూవీ ప్రపంచ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన ఒక్క రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే బాండ్ సిరీస్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన సిరీస్ ఇది. ఈ సిరీస్‌లో 5 సార్లు జేమ్స్ బాండ్‌గా నటించిన డేనియల్ క్రెగ్‌కు ఇది చివరి చిత్రం. ‘నో టైమ్ టు డై’ చిత్రాన్ని లండన్, జమైకా, ఇటలీలో చిత్రీకరించారు. -
జేమ్స్ బాండ్.. బై బై డేనియల్
No Time To Die: బ్రిటిష్ నటుడు డేనియల్ క్రెయిగ్ బాండ్ క్యారెక్టర్ హోదాలో చివరిసారిగా రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో రాబోతున్న 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ ఈ నెల 30న యూకేతో పాటు భారత్‌లోనూ(తెలుగులో కూడా) రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో మంగళవారం లండన్‌లో స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రదర్శనకు నో టైం టు డై నటీనటులతో పాటు ప్రముఖ బ్రిటిష్ యాక్టర్స్ తరలివచ్చారు. ఇక బాండ్ క్యారెక్టర్ హోదాలో చివరిసారిగా యాభై మూడేళ్ల డేనియల్ క్రెయిగ్ రెడ్ కార్పెట్‌పై కనిపించారు. క్రెయిగ్‌తో పాటు ఈ సినిమాలో బాండ్‌గర్ల్‌గా కనిపించనున్న అన డె ఆర్మస్, విలన్ పాత్ర పోషించిన రామీ మాలేక్ కూడా సందడి చేశారు. Rami Malek, the villainous Safin in #NoTimeToDie, has made his appearance at the @RoyalAlbertHall. pic.twitter.com/vwj4u59aMl — James Bond (@007) September 28, 2021 Ana de Armas (Paloma) is lighting up the @RoyalAlbertHall's red carpet at the #NoTimeToDie World Premiere. pic.twitter.com/oyzjLVou8d — James Bond (@007) September 28, 2021 ఇదిలా ఉంటే బాండ్ ఫ్రాంచైజీలో ఏడో జేమ్స్ బాండ్ డేనియల్ క్రెయిగ్. ఈ బ్రిటిష్ స్పై సిరీస్‌లో డెనియల్ క్రెయిగ్ 2006 కాసినో రాయల్‌లో తొలిసారి బాండ్‌గా కనిపించాడు. మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత తన నటనతో అలరిస్తూ వచ్చాడు. క్వాంటమ్ ఆఫ్ సోలేస్(2008), స్కైఫాల్(2012), Spectre (2015)లో బాండ్‌గా అలరించాడు డేనియల్ క్రెయిగ్. నిజానికి నో టైం టు డై సినిమా కంటే ముందే రిటైర్ అవ్వాలని భావించినప్పటికీ.. భారీ రెమ్యునరేషన్ కమిట్మెంట్ కారణంగా చేయాల్సి వచ్చిందని క్రెయిగ్ క్లారిటీ ఇచ్చాడు. We've been expecting you... Daniel Craig has arrived on the red carpet at the World Premiere of #NoTimeToDie at the @RoyalAlbertHall. pic.twitter.com/WhG226rKus — James Bond (@007) September 28, 2021 క్రెయిగ్ రిటైర్మెంట్ తరుణంలో తర్వాతి బాండ్ ఎవరనే చర్చ కూడా నడుస్తోంది. నాన్-బ్రిటిష్ ఆర్టిస్ట్, బ్లాక్ ఆర్టిస్ట్‌ను లేదంటే ఫిమేల్ బాండ్‌ను జేమ్స్ బాండ్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనలో నిర్మాణ సంస్థ ఈయోన్ ప్రొడక్షన్స్ ఉన్నట్లు సమాచారం. చదవండి: జేమ్స్ బాండ్‌కు శ్రీరామరక్ష ఏదో తెలుసా? -
త్రీడీలో విడుదల కానున్న మొదటి జేమ్స్‌బాండ్ మూవీ ఇదే..!
ప్రపంచవ్యాప్తంగా జేమ్స్‌బాండ్ చిత్రాలకి ఉన్న ఫ్యాన్ బేస్ తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 సినిమాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం డేనియల్ క్రేగ్ ప్రధాన పాత్రలో 25వ మూవీగా ‘నో టైమ్ టూ డై’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మొట్టమొదటి సారి ఓ బాండ్ మూవీని ఇండియాలో 3డీలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కరోనా ఉన్న ఈ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారో లేదోనని అందరూ సంశయంలో ఉన్నారు. ఈ తరుణంలో విడుదలైన హాలీవుడ్ మూవీ ‘షాంగ్ ఛీ: ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ ఇండియాలో కూడా మంచి కలెక్షన్స్‌ని కొల్లగొట్టింది. దీంతో జేమ్స్‌బాండ్ ‘నో టైమ్ టూ డై’ చిత్రాన్ని భారీ స్థాయిలో 1600పైగా స్క్రీన్లలో సెప్టెంబర్ 30న చిత్రాన్ని 2డీ, త్రీడీలో విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది. ఇంతకుముందు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 వంటి ఇతర సినిమాలు ప్రపంచం అంతా త్రీడిలో విడుదలైన ఇక్కడ మాత్రం 2డీలోనే రిలీజ్ చేశారు. ఈ సమయంలో ఈ సినిమాని 3డీ విడుదల చేయనుండడం విశేషం. అయితే గతేడాది విడుదల అవ్వాల్సిన ఈ మూవీ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకాదరణని పొందింది. కారీ జోజి దర్శకత్వం వహిస్తున్న ‘నో టైమ్ టూ డై’ అమెరికాలో మాత్రం కొంచెం లేట్‌గా అక్టోబరు 8న ప్రేక్షకులను పలకరించనుంది. చదవండి: జేమ్స్‌బాండ్ ఫైట్‌సీన్‌కి 32వేల లీటర్ల కూల్‌డ్రింక్స్! -
ఒకే ఫైట్‌సీన్‌కి 32వేల లీటర్ల కూల్‌డ్రింక్స్!
హాలీవుడ్ మూవీస్‌లో జేమ్స్‌బాండ్ సిరీస్‌కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వాటిలో ఉండే యాక్షన్ సీన్స్ అయితే మరో రేంజ్లో ఉంటాయి. అంతేకాకుండా వాటికి అదే రేంజ్ ఖర్చు కూడా పెడుతుంటారు మేకర్స్. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ సిరీస్‌లో ప్రస్తుతం 25 జేమ్స్‌బాండ్ మూవీగా ‘నో టైమ్ టు డై’ రూపొందుతోంది. ఇటలీలో ఇటీవల ఓ ఫైట్ సీన్‌ని చిత్రికరించింది చిత్రబృందం. దాని కోసం ఏకంగా 32వేల లీటర్ల కూల్‌డ్రింక్స్‌ను ఉపయోగించారంట. ఆ ఒక్క సీన్ కోసమే ఏకంగా 50లక్షలకు పైగా ఖర్చుయిందట. గత నాలుగు చిత్రాల్లో జేమ్స్‌బాండ్‌గా నటించిన డేనియల్ క్రేగ్ ఈ సినిమాలోనూ గూఢచారిగా చేస్తున్నారు. దాదాపు 2000 వేల కోట్ల బడ్జెట్ ఈ సినిమాకి క్యారీ జోజి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం 2019 నుంచి అభిమానులు నిరీక్షిస్తున్నప్పటికీ అది ఇంతవరకూ రిలీజ్ కాలేదు. కరోనా వైరస్ కారణంగా ఆ సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది. దాదాపు ఏడాది నుంచి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్న అది సాధ్యపడటం లేదు. ప్రధానంగా లాక్డౌన్ నిబంధనలు కారణంగా నో టైమ్ టు డై’ విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. -
తారల పారితోషికం: ఇది యాపారం!
Hollywood Stars Remuneration: డేనియల్ క్రెయిగ్.. బాండ్ సినిమాలు చూసేవాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 53 ఏళ్ల ఈ బ్రిటిష్ యాక్టర్ తాజాగా భారీ రెమ్యునరేషన్‌తో వార్తల్లో నిలిచాడు. నైవ్స్ అవుట్ సీక్వెల్స్ కోసం ఏకంగా 100 మిలియన్ల డాలర్ల(744 కోట్ల రూపాయల) పారితోషికం నెట్‌ఫ్లిక్స్ నుంచి అందుకున్నాడు డేనియల్ క్రెయిగ్. తద్వారా హాలీవుడ్లో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా(సింగిల్ మూవీ సిరీస్‌తో) నిలిచాడు. ఇది బాండ్ సినిమాలన్నింటి ద్వారా క్రెయిగ్ అందుకున్న రెమ్యునరేషన్ కంటే చాలా ఎక్కువే కావడం విశేషం!.. సినిమా.. ఎప్పటికీ ఓ భారీ వ్యాపారం. అందుకే ఈ కరోనా టైంలో పెద్ద సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కోసం వేచిచూసే ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రతీదాంట్లోనూ అడ్వాన్స్డ్గా ఉండే హాలీవుడ్.. ఇప్పుడు తారల రెమ్యునరేషన్ విషయంలోనూ తొలి అడుగు వేసింది. థియేటర్లకు ఆడియొన్స్ దూరం అవుతున్నారని పసిగట్టి.. ఓటీటీ సర్వీసులతో వ్యూయర్స్‌ను ఎంగేజ్ చేస్తున్నాయి. తారలకు గాలం వేసి సొంత సినిమాలు తీస్తున్నాయి. ఈ క్రమంలో తారల రెమ్యునరేషన్‌ని.. ఇప్పుడు పూర్తి స్థాయి బిజినెస్‌గా మార్చేసింది. నెట్‌ఫ్లిక్స్ ముందంజ సాధారణంగా డిస్నీ, వార్నర్ బ్రదర్స్ లాంటి సంప్రదాయ నిర్మాణ సంస్థలు, తారలకు భారీ పారితోషికాలను ఆఫర్ చేస్తుంటాయి. సినిమాలు రిలీజ్ అయ్యాక డిజిటల్ రైట్స్ కొనుగోలు స్టేజ్ నుంచి నిర్మాణ దశలోనే హక్కులు కొనుక్కునేంత స్థాయికి చేరింది పరిస్థితి. ఇక ఓటీటీ వినియోగం కరోనా వల్ల పెరిగాక.. నేరుగా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాయి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్. ఈ క్రమంలోనే భారీ రెమ్యునరేషన్లతో తారల్ని టెంప్ట్ చేస్తున్నాయి. స్టార్డమ్.. రెమ్యునరేషన్ ఫిక్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఇప్పుడు. సినిమా పేరు - నటుడు/నటి - రెమ్యునరేషన్- ఓటీటీ ►నైవ్స్ అవుట్( సీక్వెల్స్)- డెనియల్ క్రెయిగ్ - 744 కోట్లు - నెట్‌ఫ్లిక్స్ ►రెడ్ వన్ - డ్వెయిన్ జాన్సన్ - 372కోట్లు -అమెజాన్ ►డోంట్ లుక్ అప్ - లియోనార్డో డికాప్రియో - 222 కోట్లు -నెట్‌ఫ్లిక్స్ ► " - జెన్నిఫర్ లారెన్స్ - 185 కోట్లు - " ►లీవ్ ది వరల్డ్ బిహైండ్ - జూలియా రాబర్ట్స్ -185 కోట్లు -నెట్‌ఫ్లిక్స్ ►ది గ్రేమ్యాన్ - ర్యాన్ గోస్లింగ్ -148 కోట్లు - నెట్‌ఫ్లిక్స్ మిగతావాటి పరిస్థితి థోర్ సీక్వెల్స్ కోసం నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్, సాండ్రా బుల్లోక్ ‘ది లాస్ట్ సిటీ ఆఫ్ డీ’.. కోసం 148 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఇక వార్నర్ మీడియా వాళ్లు మాత్రం థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్ ఫలితాల ఆధారంగా తారలకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉదాహరణకు ఒక సినిమా థియేటర్స్-హెచ్‌బీవో మాక్స్‌లో కొద్దిరోజుల గ్యాప్‌తో రిలీజ్ అయితే.. లాభాల ఆధారంగానే రెమ్యునరేషన్‌ను పెంచుతాయి. ఇక రాబర్ట్ పాటిసన్ బ్యాట్మన్ సినిమా కోసం కేవలం 22 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ మాత్రమే ఇస్తున్నారు. ఒకవేళ సినిమా హిట్ అయినా.. ఓటీటీ ద్వారా వ్యూయర్షిప్ దక్కించుకున్నా లేదంటే సీక్వెల్స్‌కు సిద్ధపడినా.. అప్పుడు మాత్రమే పాటిసన్‌కు రెమ్యునరేషన్‌ను పెంచుతారని ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికే హాలీవుడ్లో పాతుకుపోయిన ఈ రెమ్యునరేషన్ బిజినెస్.. ఓటీటీ జోరు కొనసాగుతున్న తరుణంలో ఈ తరహా పారితోషిక విధానం త్వరలో మన సినిమాకు వ్యాపించే ఛాన్స్ ఉందని సినీ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బాండ్ మళ్లీ వాయిదా
జేమ్స్ బాండ్ చెప్పిన చోటుకి, చెప్పిన టైమ్‌కి వచ్చేస్తాడు. కానీ జేమ్స్ బాండ్ చిత్రం మాత్రం చెప్పిన టైమ్‌కి రావడంలేదు. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో వస్తున్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. జేమ్స్ బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్ నటించారు. ఆయన నటించిన ఐదో బాండ్ చిత్రం ఇది. గత ఏడాది వేసవిలో థియేటర్స్‌లోకి ఈ సినిమా రావాల్సింది. కోవిడ్ వల్ల నవంబర్‌కి వాయిదా వేశారు. నవంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌కి వాయిదా వేశారు. అయితే ఏప్రిల్‌లో కాదు ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదలవుతుందని తాజాగా ప్రకటించారు. అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. -
నెక్ట్స్ బాండ్ ఎవరు?
చురుకైన చూపులు, బులెట్లకు ఎదురెల్లే నైజం, దిగాలన్నా, దూకాలన్నా మరో ఆలోచన చేయని ధైర్యం, శత్రువుల ఎత్తుల మీద ఎక్కిÐð ళ్లే సాహసం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అన్నీ జేమ్స్ బాండ్‌కి నిర్వచనాలే. ‘మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్. 007’ అంటూ 58 ఏళ్లుగా స్క్రీన్ మీద సీక్రెట్ ఏజెంట్‌గా ఎన్నో ఆపరేషన్స్ విజయవంతం చేస్తున్నాడు బాండ్. ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన ఈ సీక్రెట్ ఏజెంట్ ఆన్ స్క్రీన్ సూపర్ సక్సెస్ఫుల్. 58 ఏళ్లలో 25 బాండ్ చిత్రాలు తెరకెక్కాయి. ఆరుగురు హీరోలు జేమ్స్ బాండ్‌గా ఈ బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. తాజాగా మరోసారి బాండ్ ముఖం మారనుంది. జేమ్స్ బాండ్‌గా కొత్త హీరో తెరమీదకు రానున్నాడు. ఇప్పటివరకు కనిపించిన బాండ్లు 1962లో విడుదలయిన ‘డాక్టర్ నో’తో తొలి బాండ్‌గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత వచ్చిన ఐదు జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్‌గా చేశారాయన. ‘ఫ్రమ్ రష్య విత్ లవ్, గోల్డ్‌ఫింగర్, తండర్‌బాల్, యూ ఓన్లీ లివ్ ట్వైస్, డైమండ్స్ ఆర్ ఫరెవర్’ సినిమాల్లో బాండ్‌గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత ‘ఆన్ హర్ మెజెస్టిక్ సీక్రెట్ సర్వీస్’ సినిమాలో జార్జ్ లెజెన్బీ బాండ్ అయ్యారు. ఆ తర్వాత రోజర్ మూరే రికార్డు స్థాయిలో ఏడు సినిమాల్లో బాండ్ అవతారమెత్తారు. ‘లివ్ అండ్ లెట్ డై, ది మ్యాన్ విత్ ది గోల్డెన్ గన్, ది స్పై హూ లవ్డ్ మీ, మూన్రాకర్, ఫర్ యువర్ ఐస్ ఓన్లీ, ఆక్టోపస్సీ, ఏ వ్యూ టు ఏ కిల్’ సినిమాల్లో రోజర్ మూరే నటించారు. ఓ రెండు సినిమాల్లో (ది లివింగ్ డే లైట్స్, లైసెన్స్ టు కిల్) తిమోతీ డాల్టన్, నాలుగు సినిమాల్లో (గోల్డెన్ ఐ, టుమారో నెవర్ డైస్, ది వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్, డై అనదర్ డే) పీర్స్ బ్రోస్నన్ బాండ్‌గా కనిపించారు. ప్రస్తుతం బాండ్‌గా ఉన్న డేనియల్ క్రెగ్ తాజాగా విడుదలవనున్న ‘నో టైమ్ టు డై’తో కలిపి ఐదు సినిమాల్లో జేమ్స్ బాండ్ పాత్రలో కనిపించారు. ‘కాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సోలస్, స్కై ఫాల్, స్పెక్ట్రే’ గతంలో ఆయన బాండ్‌గా చేసిన సినిమాలు. ‘నో టైమ్ టు డై’ విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్‌లో ప్రకటన? బాండ్ 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ విడుదల సందర్భంగా నెక్ట్స్ బాండ్ ప్రకటన ఉంటుందని టాక్. జూన్‌లో టామ్ హార్డీ బాండ్ పాత్ర కోసం ఆడిషన్ చేశారని టాక్. తదుపరి బాండ్ ఆయనే అని హాలీవుడ్ పత్రికలు రాసేస్తున్నాయి. ‘మ్యాడ్ మాక్స్ ఫరీ రోడ్, ది డార్క్ నైట్ రైసస్, వెనమ్, ది రెవనంట్’ వంటి సినిమాల్లో పాపులారిటీ పొందారు హార్డీ. మరి రాబోయే కొత్త బాండ్ ఈ జేమ్స్ బాండ్ ఇమేజ్ను ఎలా ముందుకు తీసుకెళతాడన్నది కాలమే చెబుతుంది. బాండ్ రేసులో ఎవరున్నారు? ‘ఇక నేను బాండ్ సినిమాల్లో నటించను’ అని డేనియల్ క్రెగ్ ప్రకటించేశారు. మరి.. తదుపరి బాండ్ చిత్రాల్లో జేమ్స్ బాండ్ ఎవరు? అనే చర్చ జరుగుతోంది. హాలీవుడ్ నటులు టామ్ హార్డీ, టామ్ హిడిల్స్టన్, ఇద్రిస్ ఎల్బా వంటి నటులు నెక్ట్స్ బాండ్‌గా కనిపించేందుకు రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి చాన్స్ ఉందని హాలీవుడ్ టాక్. ఈ ముగ్గురూ కాకుండా హెన్రీ కావిల్ పేరు కూడా వినిపిస్తోంది. మరి.. నెక్ట్స్ బాండ్ ఎవరు? -
బాండ్ మళ్లీ వాయిదా
కరోనా వైరస్ కారణంగా అన్ని సినిమాల్లానే బాండ్ సినిమా పరిస్థితి కూడా అయోమయంగా మారింది. జేమ్స్ బాండ్ సిరీస్‌లో వస్తున్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. ఇందులో డానియల్ క్రెగ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సింది. కోవిడ్ వల్ల నవంబర్‌కి విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకువస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ అన్నింట్లో మా సినిమాను చూపించాలనుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యపడేలా లేదు. అందుకే విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేశాం’ అన్నారు నిర్మాతలు. -
బాండ్ వస్తున్నాడు
చెప్పిన డేట్‌కి, చెప్పిన టైమ్‌కి, చెప్పిన చోటుకి రావడం బాండ్ స్టయిల్. బాండే కాదు బాండ్ సినిమా కూడా ఇదే స్టయిల్‌ను పాటిస్తుందని చిత్రబృందం అంటోంది. జేమ్స్ బాండ్ సిరీస్‌లో రానున్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. కరోనా వల్ల ఈ చిత్రం విడుదలను నవంబర్‌కు వాయిదా వేశారు. ఇప్పుడు నవంబర్‌లో అయినా వస్తుందా? అని సందేహాలు ఉన్నాయి. కానీ నవంబర్‌లో బాండ్ రావడం పక్కా అని తెలుస్తోంది. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన కొత్త టీజర్‌ను విడుదల చేయనున్నారు. అందులో నవంబర్‌లో రిలీజ్ అని డేట్ కూడా ప్రకటిస్తారట. ప్రపంచవ్యాప్తంగా కొన్నిచొట్లే థియేటర్స్‌ను తెరిచారు. మరి.. బిజినెస్ పరంగా బాండ్ ఎలా లాక్కొస్తాడో చూడాలి. -
తెలుగు జేమ్స్ బాండ్ రెడీ
ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ హీరో డేనియల్ క్రేగ్ నటించిన జేమ్స్ బాండ్ సిరీస్ నో టైమ్ టు డై. సంచలనాత్మక విజయాలు నమోదు చేసుకున్న జేమ్స్ బాండ్ సిరీస్‌లో డేనియల్ ఐదుసార్లు హీరోగా నటించారు. ఈ సిరీస్ తర్వాత జేమ్స్ బాండ్ సినిమాలకు ఆయన గుడ్‌బై చెప్పనున్నారు. దీంతో ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యాక్షన్ ప్రియులను ఎంతగానో అలరించింది. మరోవైపు ఈ సినిమాను ఇండియాలో ఇంగ్లిష్తో పాటు, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందుకవసరమైన డబ్బింగ్ కూడా పూర్తైపోయింది. (మరింత ‘ఎమోషనల్ బాండ్’ని చూడబోతున్నాం) ఈ సినిమా నిర్మాణానికి 200 మిలియన్ పౌండ్లు(దాదాపు 1837 కోట్ల రూపాయలు) ఖర్చవడం విశేషం. కథ విషయానికొస్తే సీఐఏ సంస్థ డేనియల్‌కు ఓ శాస్త్రవేత్తని రక్షించే మిషన్ అప్పగిస్తుంది. కానీ డేనియల్ మిషన్‌కు విలన్లు అడుగుడుగునా ఆటంకాలు సృష్టిస్తుంటారు. దాన్ని డేనియల్ ఎలా ఎదుర్కొన్నారనేది వెండితెరపై చూడాల్సిందే. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో యాక్షన్ సన్నివేశాల్లో డేనియల్ పలు మార్లు గాయపడ్డారు. కాగా 'నో టైమ్ టు డై' గత ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి అని టైమ్ ఫిక్స్ చేసుకున్నారు. అదీ కుదరలేదు. ఎలాగైనా సరే.. ఏప్రిల్‌లో థియేటర్లలో సందడి చేస్తాం అన్నారు. కానీ కరోనా వైరస్ దెబ్బతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో పరిస్థితులు బాగోలేవని నవంబర్‌లో వస్తాం అంటున్నారు. ఈ చిత్రాన్ని మెట్రో గోల్డ్ విన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్ సంయుక్తంగా తెరకెక్కించాయి. (కరోనా దెబ్బకు తేదీలు తారుమారు) -
డాడీ బాండ్
జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. అందుకే బాండ్ సిరీస్‌లో రాబోతున్న 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. గత ఏడాదే ఈ సినిమా విడుదల కావాల్సింది. షూటింగ్ సమయంలో ఏర్పడిన భారీ ప్రమాదం వల్ల విడుదల వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాండ్ రావాల్సింది. కానీ కరోనా రానివ్వలేదు. ఏడాది చివర్లో థియేటర్లు మళ్లీ ఓపెన్ అయితే అప్పుడు బాండ్ వచ్చేస్తాడు. ఈలోపు ఓ స్పెషల్ న్యూస్. గత 24 సినిమాల్లో బాండ్‌కి ప్రేయసి ఉంది. బైక్ ఛేజ్‌లు, భారీ స్టంట్ సీన్స్ అద్భుతంగా చేసే బాండ్ ప్రేయసితో రొమాంటిక్ సీన్స్‌లోనూ అలరించాడు. ఈసారి మనం మరింత ‘ఎమోషనల్ బాండ్’ని చూడబోతున్నాం అని తెలుస్తోంది. ఎందుకంటే ‘నో టైమ్ టు డై’లో బాండ్ తండ్రిగా కనిపించబోతున్నాడట. దానికి ఆధారం సినిమా చిత్రీకరణంలో భాగంగా బయటపడిన ఫొటో ఒకటి. సినిమాలో జేమ్స్ బాండ్ ప్రేయసి డా. మడేలిన్ స్వాన్, ఐదేళ్ల పాప (పాత్ర పేరు మాథిల్డే) కాంబినేషన్లో దక్షిణ ఇటలీలో చిత్రీకరించిన సీన్‌కి సంబంధించిన ఫొటో ఇది. దాంతో బాండ్, మడేలిన్లకు పాప ఉంటుందని, 25వ సిరీస్‌లో బాండ్ తండ్రిగా కనిపించబోతున్నాడని వార్తలు మొదలయ్యాయి. సినిమాలో తండ్రీ కూతురి బంధం చాలా ఎమోషనల్‌గా ఉంటుందని ఊహించవచ్చు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ లాంటి ఓ వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడే బాండ్ కథతో ఈ 25వ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో బాండ్‌గా డేనియల్ క్రెగ్, ఆయన ప్రేయసిగా లియా డౌక్స్ నటించారు. ఐదేళ్ల పాపగా లిసా డోరా సోన్నె నటించింది. -
‘నో టైమ్ టు డై’ వెరీ కాస్ట్లీ గురూ..
డేనియల్ క్రేగ్ నటించిన ‘నో టైమ్ టు డై’ హాలీవుడ్ జేమ్స్ బాండ్ చిత్ర నిర్మాణానికి ఇంతవరకు వచ్చిన అన్ని బాండ్ చిత్రాలకన్నా ఎక్కువ ఖర్చు అయిందట. డేనియల్ క్రేగ్ నటించిన ‘స్పెక్టర్’కు అత్యధికంగా 182 మిలియన్ పౌండ్లు ఖర్చుకాగా, ‘స్కైఫాల్’ చిత్రానికి 138 మిలియన్ పౌండ్లు ఖర్చు కాగా తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’ నిర్మాణానికి 200 మిలియన్ పౌండ్లు (దాదాపు 1837 కోట్ల రూపాయలు ) ఖర్చయ్యాయని చిత్ర నిర్మాణ సంస్థ ‘బీ 25’ తాజాగా వెల్లడించింది. ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన ‘నో టైమ్ టు డై’ చిత్రం కరోనా వైరస్ విజృంభణ కారణంగా డిసెంబర్ నెలకు వాయిదా పడింది. జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రేగ్ నటించిన మొదటి చిత్రం ‘స్కైఫాల్’కాగా, ఆ తర్వాత వరుసగా క్యాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సొలేస్, స్పెక్టర్ చిత్రాల్లో నటించారు. నో టైమ్ టు డై ఆయన ఐదవ చిత్రం. శియాన్ క్యానరీ నటించిన తొలి జేమ్స్ బాండ్ చిత్రం ‘డోర్ నెం.’ నిర్మాణానికి 1962లో 800కే పౌండ్లు (దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు) ఖర్చుకాగా ఇప్పుడు 200 మిలియన్ పౌండ్లు ఖర్చవడం విశేషమని హాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వాస్తవానికి నో టైమ్ టు డై చిత్ర నిర్మాణానికి మరో 47 పౌండ్లు ఖర్చు అయ్యేవని, హాలీవుడ్ స్టూడియోలు రాయితీలు ఇవ్వడం ఈ మేరకు ఖర్చు తగ్గిందని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. -
తెల్లజుట్టు బాండ్
మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్. సుమారు 57 ఏళ్లుగా ఈ పంచ్ డైలాగ్‌ను వింటూనే ఉన్నాం. జేమ్స్ బాండ్ చిత్రాలకు ఉన్న పాపులారిటీ అలాంటిది. ప్రస్తుతం బాండ్ 25వ సినిమా రూపొందుతోంది. ‘నో టైమ్ టు డై’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదోసారి బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో 8 విభిన్న లుక్స్‌లో బాండ్ కనిపిస్తారట. అలాగే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ (సగం నెరిసిన జుట్టు)లోనూ కనిపిస్తారట. వచ్చే ఏడాది ఏప్రిల్ 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. -
బాండ్ ఈజ్ బ్యాక్, అమేజింగ్ ట్రైలర్
డేనియల్ క్రేగ్ హీరోగా నటిస్తున్న జేమ్స్ బాండ్ సినిమా ‘నో టైమ్ టు డై’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కారీ జోజి ఫుకునాగా (ట్రూ డిటెక్టివ్) దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం యూనిట్ రిలీజ్ చేసింది. జేమ్స్ బాండ్ సిరీస్‌లో 25వ సినిమాగా వస్తున్న ఈ మూవీలోని యాక్షన్ సీన్లు బాండ్ సినిమా ఫ్యాన్స్నుఒక రేంజ్లో అలరిస్తున్నాయి. అంతేకాదు గత సినిమాలతో పోలిస్తే..లేటెస్ట్ మూవీలో క్రేగ్ మరింత స్టయిలిష్‌గా, స్టన్నింగ్‌గా కనిపిస్తున్నాడు. కాగా ఇటీవల రిలీజైన 15 సెకన్ల టీజర్‌కూడా బాగానే ఆసక్తిని రేపింది. ఆస్కార్ విజేత రామీ మాలిక్ విలన్ పాత్ర పోషిస్తున్న ఈ మూవీని మొదట నవంబర్ 2019న విడుదల చేయాలనుకున్నప్పటికీ అది సాధ్యంకాలేదు. దీంతో 2020 ఫిబ్రవరికి వాయిదా పడింది. చివరకు ఇండియాలో వచ్చే ఏడాది ఏప్రిల్ 3న, ఏప్రిల్ 8న అమెరికాలో, ఏప్రిల్ 2న కెనడాలో విడుదల చేయనున్నారు. ఇక కథ విషయానికి వస్తే..జమైకాలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న బాండ్‌ను సీఐఏ మళ్లీ సహాయం కోరుతుంది. కిడ్నాప్ అయిన శాస్త్రవేత్తను రక్షించడమనే మిషన్‌ను అప్పగిస్తుంది. ఈ మిషన్ ఊహించినదానికంటే మరింత క్లిష్టంగా మారడం, విలన్ల చేతిలో అతి ప్రమాదకరమైన ఆయుధాలు, అత్యాధునిక టెక్నాలజీ, ఛేజింగ్‌లు ఈ కథలో ముఖ్యమైన అంశాలు. -
‘జేమ్స్ బాండ్స్’కు స్పైబార్
‘ఎంఐ5, ఎంఐ6’ బ్రిటన్‌కు చెందిన రెండు గూఢచారి సంస్థలు. ఎంఐ5, అంటే మిలటరీ ఇంటలెజెన్స్ 5. ఇది దేశ అంతర్గత ఇంటెలిజెన్స్ కార్యకలాపాలకు పరిమితం కాగా, ఎంఐ6, అంటే మిలటరీ ఇంటలిజెన్స్ 6. అంతర్జాతీయ కార్య కలాపాలకు పరిమితం అవుతుంది. వీటిల్లో గూఢచారులుగా పనిచేసే సిబ్బంది ఎవరికి తమ వృత్తి వివరాలను వెల్లడించడానికి వీల్లేదు. చివరకు భార్యకు కూడా చెప్పరాదు. ఎవరైనా ఏదో గుమాస్తా ఉద్యోగమో చేస్తున్నట్లు చెప్పుకుంటారు. ఇక అస్తమానం విదేశాలు తిరిగే ఎంఐ6 గూఢచారులకు పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంటుంది. అందుకేనేమో వారిలో ఎక్కువ మంది పెళ్ళిళ్లు చేసుకోరు. ఇంటా బయట తాము పడుతున్న పాట్ల గురించి ఎంత ఆప్త మిత్రులకైనా ఏమీ చెప్పుకోవడానికి వీల్లేదు. మరి వారు తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలి ? ఎలా సేదతీరాలి? ఎంఐ5 గూఢాచారుల గురించి తెలియదుగానీ ఎంఐ6 గూఢాచారుల కోసం ఓ ప్రత్యేకమైన ‘స్పై బార్’ ఉందట. ఆ బారులోకి వెళ్లాక వారు ఏమైనా తాగవచ్చు. ఏమైనా మాట్లాడుకోవచ్చు. గోడలకు ఎలాంటి చెవులుండవట. ఈ విషయాన్ని మొట్టమొదటి సారిగా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎస్ఐఎస్) చీఫ్ సర్ అలెక్స్ యంగర్ తెలియజేశారు. రెండు ఇంటెలిజెన్స్ సర్వీసులు ఎస్ఐఎస్ పరిధిలోకి వస్తాయి, ఈ స్పైబార్ ఎంఐ6 ప్రధాన కార్యాలయంలో ఉందని ‘సీ’ కోడ్ నేమ్‌తో వ్యవహరించే సర్ అలెక్స్ చెప్పారు. ఈ ప్రధాన కార్యాలయం పశ్చిమ లండన్‌లోని ‘వాక్సాహాల్ వంతెన’కు సమీపంలో ఉంది. 20 అంతస్తులుగల ఆ భవనంలో ‘స్పైబార్’ ఏ అంతస్తులో ఉందో తెలపలేదు. బ్రిటన్ ఎస్ఐఎస్ తరఫున తెరపై ‘007 జేమ్స్ బాండ్’గా కనిపించే ప్రస్తుత పాత్రధారి డేనియల్ క్రేగ్ తాగే ‘మార్టిని’ మందు ఆ స్పైబార్లో దొరుకుతుందో, లేదో కూడా చెప్పలేదు. థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఈ భవనంకు సరైన భద్రత కూడా లేదని ఆ మధ్య విమర్శలు కూడా వచ్చాయి. థేమ్స్ నది గుండా ఓ నౌకలో వచ్చిన రష్యా గూఢాచారులు భవనంపైకి కాల్పులు జరిగినప్పుడు ఈ విమర్శలు వచ్చాయి. భవనానికి ఎక్కువ అద్దాలు ఉండడం కూడా భద్రతకు ముప్పు. -
ఒకటికి మూడు
‘జేమ్స్‌బాండ్’ సిరీస్ చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఎప్పటికీ తగ్గకపోవడం వల్లే జేమ్స్ బాండ్ సిరీస్‌లో ఇప్పటివరకు 24 చిత్రాలు వచ్చాయి. తాజాగా బాండ్ సిరీస్‌లో వస్తోన్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. క్యారీ జోజీ ఫుకునాగ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో డేనియల్ క్రేగ్ హీరోగా నటిస్తున్నారు. ఆస్కార్ విజేత రమీ మాలిక్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. నోమి హ్యారిస్, లియా సేడౌస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఒకటికి మూడు క్లైమాక్స్‌లను చిత్రీకరించాలనుకుంటున్నారట క్యారీ జోజీ. అలా చిత్రీకరణ జరిపేలా యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేస్తున్నారట. ఏ క్లైమాక్స్‌ను ఫైనల్‌గా ఫిక్స్ చేస్తారో హీరోకి కూడా చివరివరకు చెప్పరట. సాధారణంగా ఇలా మూడు క్లైమాక్స్‌లను చిత్రీకరించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారట క్యారీ. మరి. .‘నో టైమ్ టు డై’ సినిమాలో ఫైనల్‌గా ఏ క్లైమాక్స్ ఉండబోతుందో తెలిసేది వెండితెరపైనే అన్నమాట. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘బాండ్ 25’ టైటిల్ ఫిక్స్!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన యాక్షన్ మూవీ సీరిస్ జేమ్స్ బాండ్. ఇప్పటికే ఈ సిరీస్‌లో 24 సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా ఈ సిరీస్‌లో 25వ సినిమా తెరకెక్కుతోంది. డేనియల్ క్రెగ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘నో టైం టు డై’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 ఏప్రిల్ 3న యూకేలో, 2020 ఏప్రిల్ 8న అమెరికాలో విడుదల కానుందని తెలిపారు. ముందుగా ఈ సినిమాకు ఏ రీజన్ టు డైగా నిర్ణయించినా చివరి నిమిషంలో నో టైం టు డైగా మార్చారు. కారీ జోజి ఫుకునాగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మోట్రో గోల్డెన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. Daniel Craig returns as James Bond, 007 in… NO TIME TO DIE. Out in the UK on 3 April 2020 and 8 April 2020 in the US. #Bond25 #NoTimeToDie pic.twitter.com/qxYEnMhk2s — James Bond (@007) August 20, 2019 -
బాండ్ ఈజ్ బ్యాక్
జమైకా లొకేషన్లోకి జేమ్స్ బాండ్ తిరిగొచ్చారు. డేనియల్ క్రెగ్ హీరోగా క్యారీ జోజీ ఫుకునాగ దర్శకత్వంలో బాండ్ సిరీస్‌లో 25వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జమైకాలో జరిగిన ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ యాక్షన్ సీక్వెన్లో భాగంగా హీరో డేనియల్ కాలికి గాయమైన సంగతి గుర్తుండే ఉంటుంది. దాదాపు నెల రోజుల విరామం తీసుకున్న క్రెగ్ తిరిగి సెట్లోకి అడుగుపెట్టారు. జమైకా యాక్షన్ షూట్లో జాయిన్ అయ్యారు. ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ రమీ మాలిక్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. నోమి హ్యారిస్, లియా సేడౌస్ కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. -
జేమ్స్ బాండ్ సినిమా షూటింగ్లో పేలుడు
జేమ్స్ బాండ్ సినిమాలు అంటేనే భారీ ఎత్తున తెరకెక్కుతున్నాయి. కళ్లు చెదిరే బడ్జెట్‌తో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో ఒకింత రియలిస్టిక్‌గా తెరకెక్కే ఈ సినిమా షూటింగ్లలో అపశ్రుతులు దొర్లడం పరిపాటే. తాజాగా తెరకెక్కుతున్న జేమ్స్ బాండ్ 25వ సినిమా షూటింగ్‌లోనూ అపశ్రుతి చోటుచేసుకుంది. లండన్ శివార్లలోని పైన్‌వుడ్ స్టూడియోలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సెట్లో పేలుడు చోటుచేసుకుంది. సినిమా షూటింగ్లో భాగంగా పేలుడును ప్లాన్ చేసినప్పటికీ.. అది శ్రుతి మించడంతో ఇక్కడ ఏర్పాటుచేసిన వేదిక ధ్వంసమైంది. ఒక వ్యక్తి గాయపడ్డారు. ఈ విషయాన్ని ట్విటర్లో తెలియజేసిన చిత్రయూనిట్ అదృష్టవశాత్తు తమ బృందంలోని ఎవరికీ గాయాలు కాలేదని, వేదిక బయట ఉన్న క్రూ మెంబర్‌కు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయని వెల్లడించింది. ఈ అనూహ్య పేలుడు చిత్ర నిర్మాణ బృందానికి మరో ఎదురుదెబ్బేనని పరిశీలకులు భావిస్తున్నారు. జమైకాలో యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తుండగా చిత్ర హీరో డానియెల్ క్రెయిగ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో రెండు వారాలపాటు క్రెయిగ్ విశ్రాంతి తీసుకొని.. షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. చిత్ర దర్శకుడైన డ్యానీ బోయ్లే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్ర విడుదల దాదాపు ఆరు నెలలు వాయిదాపడి.. అక్టోబర్ 2019 నుంచి ఏప్రిల్ 2020కి మారింది. -
ట్రాక్‌లోనే ఉన్నాం
జేమ్స్‌బాండ్ చిత్రాలకు ప్రేక్షకుల్లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది. బాండ్ సినిమా ఎప్పుడు విడుదలైనా థియేటర్స్‌కు క్యూ కడతారు. అందుకే బాండ్ 25వ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే పనిలో ఉన్నారు టీమ్. క్యారీ జోజి ఫుకునాగ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాండ్‌గా డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ జమైకాలో ప్రారంభమైంది. ఓ యాక్షన్ సీన్లో భాగంగా డేనియల్ క్రెగ్ గాయపడ్డారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమేనని టీమ్ ధృవీకరించింది. ‘‘క్రేగ్ గాయపడ్డ మాట నిజమే. ఆయన చీలమండల గాయంతో బాధపడుతున్నారు. సర్జరీ జరగాల్సి ఉంది. ఈ ట్రీట్మెంట్ తర్వాత రెండు వారాలు ఆయన విశ్రాంతి తీసుకుని తిరిగి సెట్లో జాయిన్ అవుతారు. రిలీజ్ విషయంలో ఏ మార్పు లేదు. ట్రాక్‌లోనే ఉన్నాం. ముందు చెప్పినట్లుగానే 2020, ఏప్రిల్‌లోనే రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బాండ్‌కి బ్రేక్
బాండ్ స్పీడ్‌కి బ్రేక్ పడింది. ‘జేమ్స్‌బాండ్’ సిరీస్ 25వ చిత్రంలో హీరోగా నటిస్తున్న డేనియల్ క్రెగ్ గాయపడ్డారు. క్యారీ జోజి ఫుకునాగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత రామీ మాలిక్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. నోమి హ్యారిస్, లియా సేడౌస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ జమైకాలో ప్రారంభం అయ్యింది. ఓ యాక్షన్ సీన్‌ను షూట్ చేస్తున్న సమయంలో డేనియల్ క్రెగ్ కాలికి గాయం అయ్యిందని హాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. కానీ గాయం పెద్దదేం కాకపోవడంతో మరో వారంలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని టాక్. బాండ్ సీరిస్‌లో 21వ చిత్రం ‘క్యాసినో రాయల్’ (2006)తో బాండ్ చిత్రాల్లో హీరోగా వచ్చారు క్రెగ్. ఈ సినిమా షూటింగ్ అప్పుడు కూడా క్రెగ్ గాయపడ్డారు. గత నాలుగు బాండ్ చిత్రాల్లో క్రెగ్నే హీరోగా నటించారు. ఇక బాండ్ సిరీస్ 25వ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 8న రిలీజ్ కానుంది. -
బాండ్ 0025
‘మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్’ అంటూ 57 ఏళ్లుగా, 24 సినిమాలతో అలరిస్తోంది ‘జేమ్స్ బాండ్’ సిరీస్. లేటేస్ట్‌గా సిల్వర్ జూబ్లీ సినిమాకు రెడీ అయింది బాండ్ సిరీస్. గత నాలుగు సినిమాల్లో బాండ్‌గా యాక్ట్ చేసిన డానియల్ క్రెగ్ ఇందులోనూ హీరోగా యాక్ట్ చేయనున్నారు. జమైకా విల్లాలో బాండ్ సృష్టికర్త ఐయాన్ ఫ్లెమింగ్ 25వ సినిమాలోని నటీనటులను అనౌన్స్ చేశారు. క్యారీ జోజీ ఫుకునాగ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఆస్కార్ అవార్డ్ విజేత రామీ మలేక్ విలన్‌గా నటించనున్నారు. నోమి హ్యారిస్, లియా సేడౌస్ బాండ్ గాళ్స్గా కనిపిస్తారు. సినిమా టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నారు. -
ఆస్కార్ హీరో... బాండ్‌కి విలన్!
జేమ్స్ బాండ్ చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పటివరకూ వచ్చిన బాండ్ చిత్రాల వసూళ్లే అందుకు నిదర్శనం. తాజాగా ఈ జేమ్స్‌బాండ్ ఫ్రాంచైజీలో 25వ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘షట్టర్ హ్యాండ్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. డేనియల్ క్రెగ్ హీరోగా నటిస్తారు. ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ నటుడిగా నిలిచిన రమీ మాలిక్ ఈ చిత్రంలో విలన్‌గా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు డానీ బోయిలే దర్శకత్వం వహించాల్సింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు కారీ జోజి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. బాండ్ సినిమాను డైరెక్టర్ చేయనున్న ఫస్ట్ అమెరికన్ ఇతనేనట. ఈ సినిమాను ఏప్రిల్ 2020లో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘జేమ్స్ బాండ్ 25’ మరోసారి వాయిదా!
వెండితెర మీద బాండ్ చేసే సాహసాలను ఇష్టపడని సినీ ప్రేక్షకుడు ఉండడు. జేమ్స్ బాండ్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ఈ సిరీస్‌లో ఇప్పటికే 24 సినిమాలు విడుదలై సంచలనాలు నమోదు చేశాయి. తాజాగా ఈ సిరీస్‌లో 25వ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే ప్రాజెక్ట్ మొదలైన దగ్గరనుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. ముందుగా బాండ్ పాత్రలో నటించేందుకు డేనియల్ క్రేగ్ అంగీకరించలేదు. భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ అతన్ని ఒప్పించాల్సి వచ్చింది. తరువాత చిత్ర దర్శకుడు డేని బాయ్లే తప్పుకున్నాడు. దీంతో మరో దర్శకుడిని లైన్లోకి తీసుకువచ్చారు. క్యారీ జోజి దర్శకత్వంలో జేమ్స్‌బాండ్ 25 త్వరలో పట్టాలెక్కనుంది. ముందుగా ఈ సినిమాను 2019 నవంబర్ లేదా 2020 ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ.. చిత్రీ కరణ ఆలస్యం కావటంతో 2020 ఏప్రిల్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా చిత్ర నిర్మాతలు వెల్లడించారు. -
కొత్త జేమ్స్ బాండ్ హీరో ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : నవంబర్ నెలలో విడుదల కానున్న డేనియల్ క్రేగ్ నటించిన జేమ్స్ బాండ్ చిత్రం ‘బాండ్ 25’ ఆయనకు ఆఖరి బాండ్ చిత్రం కానుంది. ఆ తర్వాత వచ్చే బాండ్ చిత్రాల్లో జేమ్స్ బాండ్‌గా ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ‘నావెల్ ఇంటెలిజెన్స్ డివిజన్’లో పనిచేసిన బ్రిటన్ రచయిత ఐయాన్ ఫ్లెమింగ్, జేమ్స్ బాండ్ నవలల సృష్టికర్త. ఆయన తన ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినప్పుడు తారసపడిన పలువురు గూఢచారలను దృష్టిలో పెట్టుకొని జేమ్స్ బాండ్ పాత్రకు ప్రాణం పోశారు. ఆయన పాత్ర ‘కోల్డ్ బ్లడెడ్ మర్డరర్’గా కన్నా ‘ప్లేబోయ్’గానే ఎక్కువగా కనిపిస్తుంది. ‘007’ కోడ్ నేమ్ కలిగిన జేమ్స్ బాండ్, ఎం16గా పిలిచే బ్రిటీష్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌లో ఏజెంట్‌గా పనిచేసే పాత్ర. ఈ పాత్రను ప్రధానంగా తీసుకొని ఐయాన్ ఫ్లెమింగ్ 1953 నుంచి 1966 మధ్య 12 జేమ్స్ బాండ్ నవలలు, రెండు చిన్న కథల సంపుటాలు రాశారు. ఆయన అన్ని నవలలను సినిమాలుగా తీసిన తర్వాత ఆయన చిన్న కథల ఆధారంగా ఇతర రచయితలు బాండ్ నవలలను రాయగా వాటిని కూడా సినిమాలుగా తీశారు. వాటిలో కాసినో రాయల్ (1953), లివ్ అండ్ లెట్డై (1954), మూన్‌రేకర్ (1955), డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ (1956), ఫ్రమ్ రష్యా, విత్ లౌ (1957), డాక్టర్ నో (1958), గోల్డ్ ఫింగర్ (1959), ఫర్ యువర్ ఐస్ ఓన్లీ (1960), థండర్ బాల్ (1961), ది స్పై వూ లవ్డ్ మీ (1963), ఆన్ హర్ మేజెస్ట్రీస్ సీక్రెట్ సర్వీస్ (1963), యూ ఓన్లీ లీవ్ ట్వైస్, (1964), ది మేన్ విత్ గోల్డెన్ గన్ (1965), ఆక్టోపసీ, లీవింగ్ డే లైట్స్ (1966) తదితర నవలు, కథలు సినిమాలుగా వచ్చాయి. ఐయాన్ ఫ్లెమింగ్‌కు కొనసాగింపుగా కింగ్స్లే ఆమిస్, జాన్ పియర్సన్, క్రిస్టోఫర్ వుడ్, జాన్ గార్డనర్ తదితర రచయితలు బాండ్ నవలలు రాశారు. సినిమాలుగా రాకముందే చాలా బాండ్ పుస్తకాలు విశేషంగా అమ్ముడుపోయాయి. మొట్టమొదటి బాండ్ చిత్రాల హీరోగా శాన్ కానరీ ఎంపికయ్యారు. అయితే ఆయన వయస్సు మీరిన స్టంట్ మేన్‌గా కనిపించడంతో ముందుగా ఐయాన్ ప్లెమింగ్‌కు ఆయన నచ్చలేదట. సినిమా విడుదలయ్యాక ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట. శాన్ కానరీ చురుకైనా స్కాటిష్ చూపులు, ముఖంలో ఉండే తేజస్సు, ముఖ్యంగా ప్రత్యేకమైన ఆయన స్టైల్ ఆయన్ని మంచి కరిష్మాటిక్ నటుడిగా నిలబెట్టాయి. దాంతో ఆయన తొలి ఐదు బాండ్ చిత్రాల్లో వరుసగా నటించి, ఆ తర్వాత మరో రెండు బాండ్ చిత్రాల్లో నటించారు. డాక్టర్ నో, ఫ్రమ్ రష్యా విత్ లవ్, గోల్డ్ ఫింగర్, థండర్‌బాల్, యూ ఓన్లీ లివ్ ట్వైస్ సినిమాల్లో వరుసగా నటించిన ఆయన కొన్నేళ్ల విరామం అనంతరం డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్, నెవర్ సే నెవర్ అగేన్ చిత్రాల్లో నటించారు. శాన్ కానరీయే ఇప్పటి వరకు అందరికన్నా ఎక్కువ ఆధరణ పొందిన బాండ్ నటుడిగా చరిత్రలో మిగిలిపోయారు. అంతేకాకుండా ఆయన్ని సినిమా చరిత్రలోనే మూడవ అతి గొప్ప నటుడిగా అమెరికా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఎంపిక చేసింది. 1969లో శాన్ కానరీకి విరామం ఇచ్చి బ్రాండ్ చిత్రాల నిర్మాత బార్బర బ్రొకోలీ ‘ఆన్ హర్ మాజెస్టీస్ సీక్రెట్ సర్వీస్’ చిత్రంలో 29 ఏళ్ల ఆస్ట్రేలియా నటుడు, మోడల్ జార్జ్ లాజెన్బైని తీసుకున్నారు. బాండ్ చిత్రాల్లో అత్యంత పిన్న వయస్కుడైన లాజెన్బై ప్రేక్షకులను మెప్పించలేక పోయారు. ఆ తర్వాత శాన్ కానరీకి నిజమైన వారసుడిగా 1973లో లీవ్ అన్ లెట్ డై సినిమాతో రోజర్ జార్జ్ మోర్ వచ్చారు. ఏడు బాండ్ చిత్రాల్లో నటించిన ఆయన సుదీర్ఘకాలం పాటు అంటే, 12 ఏళ్లపాటు కొనసాగిన బాండ్ హీరోగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఇంగ్లీషు నటుడు టిమోతి డాల్టన్ రెండు చిత్రాల్లో, ఐరిస్ నటుడు పియర్స్ బ్రాస్నన్ నాలుగు చిత్రాల్లో, ప్రస్తుత ఇంగ్లీష్ నటుడు డేనియల్ క్రేగ్ ఐదు చిత్రాల్లో నటించారు. వీరంతా శ్వేత జాతీయులు, వారిలో ఎక్కువ మంది ఇంగ్లీషు నటులు. కొత్త జేమ్స్ బాండ్‌కు స్వాగతం పలికేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఏ దేశం, ఏ జాతికి చెందిన వ్యక్తయినా తనకు ఫర్వా లేదని బార్బర బ్రొకోలీ ఇటీవల ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు. దాంతో నల్ల జేమ్స్ బాండ్ ఎందుకు ఉండకూడదనే ప్రశ్న తలెత్తింది. ఆకర్షణీయంగా కనిపించే నల్లజాతీయ ఇంగ్లీషు నటుడు ఇద్రీస్ ఎల్బా పేరును పరిశీలిస్తున్నారు. డెంజల్ వాషింగ్టన్, మోర్గాన్ ఫ్రీమన్, విల్‌స్మిత్ లాంటి నల్లజాతీయులు హాలీవుడ్లో రాణించినప్పుడు ఇద్రీస్ ఎల్బా ఎందుకు రాణించరని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అయితే శ్వేతజాతీయుడి స్థానంలో ఓ నీగ్రోను ప్రేక్షకులు అంగీకరిస్తారా? హాలీవుడ్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బాండ్ గర్ల్స్‌గా అకికో వాకబయాషి, గ్లోరియా ఎండ్రీ, గ్రేస్ జోన్స్, మిచెల్లీ యెయో లాంటి వివిధ జాతులకు చెందిన మహిళలను తీసుకున్నప్పుడు బాండ్ హీరోగా ఓ నీగ్రో ఎందుకు తీసుకోకూడదన్నదే ప్రశ్న. -
దర్శకుడు కావలెను
హీరో ఫిక్స్ అయ్యాడు. స్క్రిప్ట్ పనులన్నీ కంప్లీట్. షూటింగ్ షెడ్యూల్ వేసేశారు. రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. ఇంకో రెండు నెలల్లో సినిమా సెట్స్ మీదకు వెళ్లాలి. సడన్‌గా ‘ఈ సినిమా నుంచి నేను తప్పుకుంటున్నాను’ అనేశారు దర్శకుడు. బాండ్ సినిమాలో ట్విస్ట్ లాంటిదే ఆఫ్ స్క్రీన్ ఇచ్చారు దర్శకుడు డ్యానీ బోయేల్. జేమ్స్ బాండ్ సిరీస్‌లో వస్తున్న 25వ సినిమా నుంచి తప్పుకున్నారాయన. ఆల్రెడీ నాలుగుసార్లు బాండ్‌గా కనిపించిన డేనియల్ క్రేగ్ ఐదోసారి బాండ్‌గా కనిపించనున్నారు. ‘‘జేమ్స్ బాండ్ 25వ సినిమా దర్శకత్వ బాధ్యతలు నుంచి డానీ బోయేల్ తప్పుకుంటున్నారు. క్రియేటీవ్ డిఫరెన్స్‌లే అందుకు కారణం’’ అని నిర్మాతలు మైఖెల్ జీ విల్సన్, బార్బరా బ్రూకలీ, హీరో డేనియల్ క్రేగ్ ‘జేమ్స్ బాండ్007’ అఫీషియల్ ట్వీటర్ అకౌంట్ నుంచి అధికారికంగా అనౌన్స్ చేశారు. అక్టోబర్ 25 (యూకే) నవంబర్ 8, 2019 (యుఎస్) రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రబృందానికి కొత్త దర్శకుడు ఎవరు వస్తారు? అనే విషయం పై క్లారిటీ లేదు. -
మాటలు నేర్పిన మైనా
యూనీస్ గేసన్ / 1928–2018 – ఫస్ట్ జేమ్స్‌బాండ్ గర్ల్ ఆమె సాహసం అతడిని ముగ్ధుణ్ణి చేసింది. ఆమె వైపు ఆరాధనగా చూశాడు. ‘ఐ అడ్మైర్ యువర్ కరేజ్, మిస్..’ అంటూ ఆగాడు. ఆమె పేరేమిటో అతడికి తెలీదు. అందమైన అమ్మాయిని నేరుగా నీ పేరేమిటని ఎలా అడగ్గలడు? అందుకే .. మిస్.. అంటూ ఆగిపోయాడు. ‘‘ట్రెంచ్.. సిల్వియా ట్రెంచ్’’.. చెప్పిందా అమ్మాయి. చెప్పి ఊరుకోలేదు. ‘ఐ అడ్మైర్ యువర్ లక్, మిస్టర్.. ’ అంటూ ఆగిపోయింది. తనూ అతడి పేరు తెలుసుకోవాలి కదా. ‘బాండ్.. జేమ్స్‌బాండ్..’’ చెప్పాడతడు.‘ట్రెంచ్.. సిల్వియా ట్రెంచ్’ అని ఆమె తన పేరును ఎలాగైతే చెప్పిందో, సరిగ్గా అలాగే తన పేరును ‘బాండ్.. జేమ్స్బాంyŠ ’ అని చెప్పాడతను.\జేమ్స్‌బాండ్ ఫస్ట్ మూవీ ‘డాక్టర్ నో’ (1962) లోని సీన్ ఇది. అందులో జేమ్స్‌బాండ్.. సీ(షా)న్ కానరీ. సిల్వియా ట్రెంచ్.. యూనీస్ గేసన్. యూనీస్ గేసన్ (90) శుక్రవారం చనిపోయారు. ‘మా తొలి బాండ్ గర్ల్ యూనీస్ గేసన్ కన్నుమూశారని తెలిసి చాలా బాధపడ్డాం. ఆమె కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం’ అని బాండ్ చిత్రాల నిర్మాతలు మైఖేల్ జి విల్సన్, ఆయన సోదరి బార్బారా బ్రొకోలి ట్విట్టర్లో యూనీస్ గేసన్కు నివాళులు అర్పించారు. ‘బాండ్.. జేమ్స్‌బాండ్’ అని ఆ ఒక్క చిత్రంలోనే చెప్పి ఆగిపోలేదు జేమ్బాండ్. తర్వాత వచ్చిన ఇరవై నాలుగు చిత్రాల్లోనూ బాండ్‌గా నటించినవాళ్లంతా ఆ మాటను అదే టోన్‌లో చెప్పారు. ఇప్పుడు మేకింగ్‌లో ఉన్న ఇరవై ఐదవ బాడ్ మూవీలో డేనియల్ క్రెయిగ్ కూడా అలాగే చెప్తాడు.‘బాండ్.. జేమ్స్‌బాండ్’ అని తన పేరును చెప్పడం.. జేమ్స్‌బాండ్ పాత్రకు ఒక సిగ్నేచర్ స్టెయిల్ అయింది. అలా అతడు చెప్పడానికి ఓ స్టెయిలిష్ ప్రేరణగా (సిల్వియా ట్రెంచ్ పాత్రలో) యూనీస్ గేసన్ నిలిచిపోయారు. ‘డాక్టర్ నో’ తర్వాత వచ్చిన ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’ చిత్రంలోనూ బాండ్ గర్ల్‌గా నటించారు యూనీస్. తొలి అధికారిక బాండ్ గర్ల్ యూనీస్! ఈ రెండు బాండ్ చిత్రాల్లో మాత్రమే ఆమె నటించారు. యూనీస్ బ్రిటిష్ నటి. 1948 నుంచి 1963 వరకు ఇరవై ఒక్క చిత్రాల్లో నటించారు. వీటిల్లో రెండే జేమ్స్‌బాండ్ చిత్రాలు. 1995లో వచ్చిన బాండ్ మూవీ ‘గోల్డెన్‌ఐ’లో యూనీస్ కూతురు కేట్ గేసన్ ఒక పాత్రలో కనిపిస్తారు. -
కళ్లు చెదిరే పారితోషకం.. టెంప్ట్ అయ్యాడు
హాలీవుడ్లో జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 56 ఏళ్ల బ్రాండ్.. ఏడుగురు హీరోలు మారారు. అయినా ప్రేక్షకుల ఆదరణ, కలెక్షన్ల హవా ఏ మాత్రం తగ్గట్లేదు. అయితే ప్రస్తుతం బాండ్ హీరో అయిన డేనియల్ క్రెయిగ్.. ఇకపై ఈ సీరిస్‌లో నటించకూడదని బలంగా నిర్ణయించుకున్నాడు. దీంతో కళ్లు చెదిరే రీతిలో నిర్మాతలు అతనికి పారితోషకం ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ది మిర్రర్ కథనం ప్రకారం... కొత్త బాండ్ చిత్రానికి డానీ బోయెల్ దర్శకత్వ బాధత్యలు చేపట్టనున్నాడు. ఈ క్రమంలో తన చిత్రంలో డేనియల్ క్రెయిగ్‌నే హీరోగా పెట్టాలని డానీ నిర్ణయించుకున్నాడంట. ఎలాగోలా క్రెయిగ్‌ను ఒప్పించిన దర్శకుడు.. ఈ డిసెంబర్ చివరి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించాడు. కేవలం భారీ పారితోషకంతోనే టెంప్ట్ అయిన క్రెయిగ్ ఈ చిత్రం కోసం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 50 మిలియన్ బ్రిటీష్ పౌండ్లు(భారత కరెన్సీ ప్రకారం రూ. 450 కోట్లు) రెమ్యునరేషన్ ఈ చిత్రం కోసం అతను తీసుకోబోతున్నాడు. క్రెయిగ్ క్రేజ్ కారణంగానే గత రెండు బాండ్ చిత్రాలు కలెక్షన్ల ప్రభంజనం సృష్టించాయి. అందుకే అతగాడికి ఇంత పెద్ద మొత్తం ముట్టజెప్పేందుకు మేకర్లు ముందుకొచ్చారంట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో డేనియల్ మాట్లాడుతూ...‘బాండ్ చిత్రాలు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఒకవేళ నేను ఇంకో చిత్రం చేయాల్సి వస్తే మాత్రం. అది కేవలం డబ్బు కోసమే’ అని స్పష్టం చేశాడు కూడా. బాండ్ ఫ్రాంచైజీలో ఇది 25వ చిత్రం కాగా, డేనియల్‌కు 5వ చిత్రం. వచ్చే ఏడాది నవంబర్‌లో సినిమా విడుదల కానుంది. -
స్పెషల్ బాండ్.. స్పెషల్ డైరెక్టర్!
బాండ్.. జేమ్స్‌బాండ్. 56 సంవత్సరాల బ్రాండ్ అది. 24 సినిమాల ఎంటర్టైన్మెంట్. ఎంతో మంది దర్శకులు మారిపోయారు. ఎంతో మంది నటులూ మారిపోయారు. ఆ బ్రాండ్ ఇప్పటికీ అలాగే ఉంది. బాండ్ సినిమా వస్తోందంటే యాక్షన్ సినిమా అభిమానులకు పండగే. ఇక ఈసారి వచ్చేది 25వ సినిమా కదా! కాబట్టి ఈ స్పెషల్ బాండ్ సెట్స్‌పైకి వెళ్లకముందు నుంచే రోజూ వార్తల్లో కనిపిస్తోంది. ఇంతకుముందు నేటితరం టాప్ డైరెక్టర్ క్రిస్టొఫర్ నోలన్ బాండ్ 25వ సినిమాకు డైరెక్టర్ అని వినిపించింది. ఆ తర్వాత వరుసగా టాప్ డైరెక్టర్స్ పేర్లన్నీ ఒక్కొక్కటిగా వినిపిస్తూ వచ్చాయి. ఇక ఎట్టకేలకు స్పెషల్ బాండ్ దర్శకుడు ఫిక్స్ అయిపోయాడు. ఆయనే మన డేనీ బోయల్. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘127 అవర్స్’ సినిమాలతో ఇండియన్ సినిమా అభిమానులకూ బాగా దగ్గరైన డేనీ, జేమ్స్‌బాండ్ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని స్వయంగా ప్రకటించాడు. ఇప్పుడే అసలైన చర్చ మొదలైంది. డ్రామా, థ్రిల్లర్ జానర్‌కు పెట్టింది పేరైన డేనీ బోయల్, బాండ్ లాంటి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడా అన్నది ఆసక్తికరం.ఇప్పటికే దర్శకులు మారినప్పుడల్లా బాండ్ సినిమా ప్లాట్, కోర్ ఎమోషన్, టోన్ మారిపోతూ వచ్చింది. ముఖ్యంగా స్కై ఫాల్, స్పెక్టర్ సినిమాలతో శామ్ మెండిస్ బాండ్ రూపు రేఖలనే మార్చేశాడు. దీంతో ఇప్పుడు కొత్తగా, అదీ స్పెషల్ సినిమాకు, ఈ స్పెషల్ డైరెక్టర్ డేని బోయల్ ఏ టోన్ పట్టుకొస్తాడో చూడాలి. గత నాలుగు జేమ్స్‌బాండ్ సినిమాలకు హీరో అయిన డేనియల్ క్రెయిగ్ ఈ సినిమాలోనూ నటిస్తున్నాడు. -
జేమ్సా? హ్యారీనా?
హాలీవుడ్‌ని వదిలేసి, ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకుని బ్రిటన్ వెళ్లిపోవాలని డిసైడ్ అయిన అమెరికన్ నటి మేఘన్ మార్కల్ని.. హాలీవుడ్ మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లుంది! టీవీలో ‘సూట్స్’ అనే లీగల్ డ్రామా సిరీస్‌లో ‘రేచల్ జేన్’గా ఆడియెన్స్‌ని ఇంప్రెస్ చేసిన మార్కల్ని జేమ్స్ బాండ్ గర్ల్‌గా తీసుకునేందుకు ఆ సినిమా నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే మార్కల్ ఆల్రెడీ వాళ్లకు ‘నో’ అని చెప్పేశారు. ఈ ఏడాది మే 19న మార్కల్, ప్రిన్స్ హ్యారీల వివాహం. పెళ్లి పనులు కూడా ఆల్రెడీ మొదలైపోయాయి. ఆ లోపే నటిగా తన ష్కెడ్యూళ్లన్నింటినీ పూర్తి చేసుకుని, కొత్త ఒప్పందాలేవీ ఒప్పుకోకూడదని మార్కల్ నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు 25వ బాండ్ మూవీకి ఆమె పేరు షార్ట్‌లిస్ట్ అయింది! ఆమె ‘నో’ అంటున్న కొద్దీ వాళ్లు ‘ప్లీజ్’ అంటున్నారు. అందులో బాండ్‌గా నటించబోయే డేనియల్ క్రెయిగ్ పక్కన బాండ్ గర్ల్‌గా 36 ఏళ్ల మార్కల్ అయితే బాగుంటుందని ప్రొడ్యూసర్లు ముచ్చట పడుతున్నారు మరి. జేమ్స్ బాండ్ సిరీస్‌లోని 24వ చిత్రం ‘స్పెక్టర్’ 2015లో విడుదలైంది. స్పెక్టర్ అంటే.. వెంటాడే భయం. అంత మంచి చాన్స్‌ను మిస్ చేసుకోకూడదని మార్కల్ అనుకుంటే.. కొత్త పెళ్లి కూతురు కారణంగా బాండ్ మూవీ షూటింగ్‌కి, షూటింగుల కారణంగా వీళ్ల కొత్త దాంపత్యానికీ ‘స్పెక్టర్’లాంటి ప్రాబ్లం ఏదైనా తప్పకపోవచ్చు. చూడాలి! బాండ్ గెలుస్తాడా? బాండింగ్ నిలుస్తుందా? -
‘జేమ్స్‌బాండ్ 25’ నోలన్ చేస్తాడా?
‘బాండ్.. జేమ్స్‌బాండ్..’ సినీ అభిమానులను దశాబ్దాలుగా ఉర్రూతలూగిస్తున్న క్యారెక్టర్ ఇది. ఇప్పటివరకూ 24 బాండ్ సినిమాలొస్తే అన్నీ యాక్షన్ సినిమా అభిమానులకు పండగలాగానే నిలిచాయి. ఇక 25వ సినిమా కూడా వచ్చేస్తుందనేసరికి ఈ స్పెషల్ బాండ్ ఎంత హంగామా చేస్తాడోనని అభిమానులు ఇప్పట్నుంచే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి చాలామంది బాండ్ క్యారెక్టర్లో కనిపించిన నటులు మారిపోయారు. చాలామంది డైరెక్టర్లూ మారిపోయారు. అయినా బాండ్ క్రేజ్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. గత నాలుగు బాండ్ సినిమాలకు హీరో అయిన డానియల్ క్రెయిగ్ ఐదోసారి చివరిసారి ఈ 25వ సినిమాలోనే కనిపిస్తాడట. 2019 నవంబర్‌లో బాండ్ 25వ సినిమా వస్తుందని అనౌన్స్ అయితే చేశారు కానీ, క్రెగ్ కాకుండా ఇంకా ఎవరెవరు ఈ సినిమాకు పని చేస్తున్నారన్నది సస్పెన్సే! తాజాగా కొద్ది రోజులుగా ఓ పుకారు షికారు చేస్తోంది. అదే.. ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాకు దర్శకుడన్నది. నిజంగానే నోలన్ ఈ సినిమాకు పని చేసున్నాడా? అంటే సమాధానం లేదు. ‘డన్కిర్క్’ తర్వాత నోలన్ తన కొత్త సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు. చేస్తే బాండ్ సినిమా చేస్తూ ఉండొచ్చు కూడా. మరి యాక్షన్‌కి పెట్టింది పేరైన బాండ్ సినిమాకు నోలన్ స్టైల్ ఎలా కుదురుతుందో? ఎందుకంటే నోలన్ అంటే ఎక్కువ ఫిలాసఫీకి, లాజిక్కీ ఇంపార్టెన్స్ ఇస్తాడు. బాండ్ అంటే లాజిక్‌కి అందకుండా ఫుల్ యాక్షన్ ఉంటుంది. మరి.. నోలన్ బాండ్ ఎలా ఉంటాడో? అని ప్రస్తుతానికి లెక్కలు వేసుకోవాల్సిందే, అనౌన్స్మెంట్ వచ్చేవరకూ. 2018 మార్చిలో బాండ్ 25 షూట్ మొదలవుతుంది. -
జేమ్స్ బాండ్ ఈజ్ బ్యాక్
-
ఆ హీరోకు వెయ్యికోట్ల బంపర్ ఆఫర్
తదుపరి జేమ్స్ బాండ్ ఎవరు అన్నదానిపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. దీనికోసం తెరవెనుక పెద్ద ఎత్తున చర్చలు, ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు తాజా జేమ్స్ బాండ్ సినిమా గురించి కుప్పలు తెప్పలుగా కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే, తదుపరి జేమ్స్ బాండ్‌గా డానియెల్ క్రేగ్నే కొనసాగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఏజెంట్ 007గా మరో రెండు సినిమాలు నటిస్తే ఏకంగా ఆయనకు 150 మిలియన్ డాలర్లు (రూ. 996 కోట్లు) ఇస్తామని చిత్ర నిర్మాతలు ఆఫర్ చేసినట్టు 'రాడర్ ఆన్లైన్' తెలిపింది. బాండ్‌గా క్రెయిగ్‌ను ఒప్పించేందుకు నిర్మాత అయిన సోనీ సంస్థ తెరవెనుక చాలా ప్రయత్నాలే చేస్తున్నదని, అందులో భాగంగా కనీవినీ ఎరుగనిరీతిలో పారితోషికాన్ని ఆయనకు ఆఫర్ చేసిందని ఆ వెబ్సైట్ తెలిపింది. ఇప్పటికిప్పుడు బాండ్ పాత్రలో కొత్త వ్యక్తిని తీసుకోవడం సోనీకి ఇష్టం లేదని, తదుపరి రెండు సినిమాలకూ బాండ్‌గా క్రెయిగ్ ఉంటేనే బాగుంటుందని సోనీ టాప్ బాసులు భావిస్తున్నట్టు పేర్కొంది. తాజాగా 'స్పెక్టర్' సినిమాతో 007గా క్రెయిగ్ అలరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాండ్ సిరీస్ సినిమాల్లో నటించబోనని ఆయన తేల్చిచెప్పారు. 'కావాలంటే నా మణికట్టు కోసుకోమన్న కోసుకుంటాను కానీ, బాండ్ పాత్రను మాత్రం చేయను. ఈ పాత్ర చేయడం వల్ల స్టంట్లతో నా ఒళ్లంతా హూనం అయిపోయింది' అని క్రెయిగ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఆయనను మరోసారి 007గా చూపించేందుకు సోనీ, బాండ్ రూపకర్తలు కృతనిశ్చయంతో ఉన్నారని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి బాండ్‌గా మరోసారి క్రెయిగ్ తెరపై కనిపిస్తాడా? లేదా? అన్నది చూడాలి. -
ఈ ఇద్దరూ కాదట!
కొత్త జేమ్స్ బాండ్ చిత్రానికి సరికొత్త టీమ్ రెడీ అవుతోంది. ‘క్యాసినో రాయల్’ నుంచి ఇటీవల వచ్చిన ‘స్పెక్టర్’ సినిమా వరకూ బాండ్‌గా నటించిన డేనియల్ క్రెగ్ ఇక తాను ఆ పాత్ర చేయలేనని చెప్పడంతో మరో హాలీవుడ్ నటుడు టామ్ హిడెల్స్టెన్ని బాండ్‌గా ఎంపిక చేశారని వార్తలు కూడా వచ్చాయి. అయితే కొత్త బాండ్‌గా టామ్ నటించే అవకాశం లేదని ‘స్కైఫాల్’, ‘స్పెక్టర్’ వంటి బాండ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శామ్ మెండెస్ చెప్పారు. అంతే కాకుండా ఇక తదుపరి బాండ్ చిత్రాలకు తాను కూడా దర్శకుణ్ణి కాదని ఆయన ప్రకటించడం విశేషం. ‘‘నాకు ఎప్పటికప్పుడు కొత్త పాత్రలతో, సరికొత్త కథాంశాలతో సినిమాలు చేయా లని ఉంటుంది. ఆ కారణంగానే నెక్ట్స్ బాండ్ చిత్రానికి నో చెప్పేశాను. టామ్‌ని కూడా బాండ్‌గా తీసుకునే ఉద్దేశం నిర్మాతలకు లేదు. బాండ్‌గా ఎవరూ ఊహించని నటుణ్ణి ఎంపిక చేసే అవకాశం ఉంది’’ అని శామ్ పేర్కొన్నారు. మరి... కొత్త బాండ్ చిత్రానికి డెరైక్టర్ ఎవరు? బాండ్‌గా ఎవరు నటిస్తారు? అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. ఏదేమైనా కొత్త టీమ్‌తో నెక్ట్స్ జేమ్స్‌బాండ్ మూవీ ఇప్పటివరకూ వచ్చిన బాండ్ చిత్రాలకు భిన్నంగా, కొత్తగా ఉంటుందని ఆశించవచ్చు. -
నెట్ బాండ్ బడ!
సమస్త సమస్యలకీ, సమాచారానికీ ఇప్పుడు ఇన్స్టంట్ గైడ్ - గూగుల్, వికీపీడియాలే. నెట్ ఇలా మన నట్టింటిలోకి వచ్చాక, వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌ల లాంటి సోషల్ మీడియా కూడా పెరిగిపోయాక, నెట్లో రకరకాల వింత చర్చలు, విచిత్రమైన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ మధ్య ‘500 కోట్లు కాదు... వెయ్యి కోట్లిచ్చినా సరే, నేనిక బాండ్ పాత్రలు చేసేది లేదు’ అంటూ హాలీవుడ్ స్టార్, ఇటీవలి పాపులర్ సినీ జేమ్స్‌బాండ్ డేనియల్ క్రేగ్ తేల్చేసిన విషయం బయటకొచ్చాక నెట్ వరల్డ్‌లో దీనిపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. జేమ్స్‌బాండ్ వారసుడెవరా అని ఒళ్లంతా కళ్లు చేసుకుని మరీ వెతుకుతున్నాయి ఇంటర్నెట్ సెర్చింజన్లు. కొందైరె తే ‘జేమ్స్‌బాండ్ పాత్రకు అంతంత డబ్బెందుకు... బ్యాండు కాకపోతే ! అందులో సగం కాదు... పావు వంతు ఇచ్చినా అంతకన్నా మంచివాళ్లే దొరుకుతారు’ అంటున్నారు. అందుకు ఉదాహరణగా మైఖేల్ ‘ఫాస్బాండర్’ను చూపుతున్నారు. మరోపక్క, తాజాగా తీసే 25వ జేమ్స్‌బాండ్ చిత్రంలో బాండ్ పాత్రకు టామ్ హిడెల్స్టన్ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చేశాయి. అయినా సరే, నెట్లో మాత్రం కొత్త బాండ్ పాత్ర, క్రెగ్ నిరాకరణ సహా అనేక విషయాల గురించి రకరకాల బొమ్మలు, వార్తలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఆ మాటకొస్తే జేమ్స్‌బాండ్ పాత్ర చేయడానికి బ్రిటీష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్‌కి ఏమి తక్కువ అంటూ కొందరు బయల్దేరారు. ఏకంగా డేవిడ్ కామెరాన్ ముఖాన్ని ఫొటోషాపులో జేమ్స్‌బాండ్ బొమ్మకు అతికించి మరీ, బాండ్‌గా చిత్రీకరిస్తున్నారు ఇంకొందరు వీరాభిమానులు. ఇక్కడే కథ కొత్త మలుపు తిరిగింది. ‘జేమ్స్ బాండ్ అంటే ఎప్పుడూ మగవాళ్లేనా? లేడీ బాండ్లు ఎందుకు ఉండకూడదు? వాళ్లయితే బాగా ఒళ్ళు వంచగలరు. పైగా వెరైటీగా కూడా ఉంటుంది’ అని కొందరు అంటున్నారు. అలా ఇప్పుడు కొత్త జేమ్స్‌బాండ్ పాత్రధారి ఎవరనే విషయంలో లింగ విచక్షణ అనే కొత్త కోణం వచ్చి చేరింది. ‘ఉబుసుపోక కబుర్లు... ఉచిత సలహాలకేం గానీ, ఎమిలీ బ్లంట్ ఐతే ఎలా ఉంటుందీ’ అని ఒకరు, ‘యాబ్సల్యూట్లీ ఫ్యాబ్యులస్’ అనే ప్రఖ్యాత టీవీ షో చేసిన ‘ప్యాట్సీ స్టోన్ అయితే అద్దిరిపోతుంది’ అని మరొకరు- ఇలా రకరకాల మాటలు, బొమ్మలు అంతర్జాలంలో ఇప్పుడు షికారు చేస్తున్నాయి. అయితే వీటన్నిటి కన్నా అధికంగా ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్న గమ్మత్తై నెట్ క్రియేషన్ ఒకటి ఉంది. అది ఏమిటంటే... నటి గిలియన్ ఆండర్సన్‌ను ప్రసిద్ధ జేమ్స్‌బాండ్ సినిమా ‘స్కైఫాల్’ పోస్టర్లో బాండ్ పాత్రలో సూపర్ ఇంపోజ్ చేస్తూ పెట్టిన ఫొటో. తమాషాగా చేసిన ఈ అభూత నెట్ కల్పన వీక్షకులందరినీ ఆకట్టుకుంటోంది. ‘అవును! ఈమె బాండ్... ‘జేన్’ బాండ్!’ అంటూ దాని కింద రాసిన ఫొటో క్యాప్షన్ అయితే మరీనూ! ‘జేన్’ అంటే ఏమిటని ఖంగారు పడకండి! పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న పెద్దోళ్ళు ‘స్త్రీ మూర్తి’ని ‘జేన్’ అంటారు లెండి! ఇక్కడ ‘జేన్’ బాండ్ అంటే... ‘లేడీ బాండ్’ అని ప్రతిపదార్థమూ, తాత్పర్యమున్నూ అని ఇంగ్లిపీసు బాగా తెలిసినవాళ్ళ ఉవాచ. ఈ భాషాతత్త్వ విచార చర్చ మాటెలా ఉన్నా, ఈ కొత్త నెట్ కల్పన, ఆ ఫొటో, క్యాప్షన్ - హంగామా అంతా సదరు గిలియాన్ ఆండర్సన్ దృష్టికి వెళ్లింది. అంతే! ‘‘లేడీ బాండ్‌గా నేనైతే బాగుంటానని అనడం సంతోషంగా ఉంది. ఈ పోస్టర్ ఎవరు రూపొందించారో తెలియదు కానీ, దీని రూపకర్తలకు నా కృతజ్ఞతాభివందనాలు’’ అంటూ గిలియన్ ఆండర్సన్ సంతోషంతో ట్వీట్ చేసింది. ఇది ఇలా ఉంటే, ‘జీవితంలో మీ గురించి చలామణీ అయిన పుకార్లలో మిమ్మల్ని అమితంగా ఆకట్టుకున్నది ఏమిటి?’ అని ఎవరో ఆమెను కొంటెగా క్వశ్చన్ చేశారు. ‘‘నన్ను జేమ్స్‌బాండ్‌ను చేస్తూ జరుగుతున్న ఈ ప్రచారం కన్నా సంచలనమైనది ఇంకేమైనా ఉంటుందా?’’ అంటూ అంతకన్నా కొంటెగా జవాబిచ్చారు గిలియన్. మొత్తానికి, ఈ కొత్త చర్చకు చాలా మందే మద్దతు పలికారు. గతంలో నాలుగేసి సార్లు బాండ్ పాత్ర చేసిన పియర్స్ బ్రోస్నన్, డేనియల్ క్రెగ్లు ఇద్దరూ నల్ల బాండ్ అయినా, లేడీ బాండ్ అయినా తప్పేముంది అన్నారు. చివరకు ఏమవుతుందో వేచి చూడాలి. తిమ్మిని బమ్మి... బమ్మిని తిమ్మి చేసేది ఏమైనా ఉంటే - అది నెట్టే! అదేనండీ... ఇంటర్నెట్! ‘ఎన్ని కోట్లిచ్చినా, నేను బాండ్ పాత్ర వేయను’ అని డేనియల్ క్రెగ్ అనడంతో ఇప్పుడు నెట్లో రకరకాల బాండ్లు తయారయ్యారు. దాంట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్... లేడీ బాండ్! గిలియన్ ఆండర్సన్! కొత్త బాండ్ ఎవరు? త్వరలో తెరకెక్కనున్న 25వ జేమ్స్‌బాండ్ చిత్రానికి బాండ్ ఎవరనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్బాండ్గా టామ్ హిడెల్‌స్టన్ చేస్తా రని ఒక వార్త. మరోపక్క బాండ్ పాత్రకోసం తొలిసారిగా ఆడవారి పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. ‘ఎక్స్-ఫైల్స్’ ఫేమ్ గిలియన్ ఆండర్సన్ పేరు అందరి కన్నా టాప్‌లో నెట్లో సందడి చేస్తోంది. ‘ఘోస్ట్ బస్టర్స్’, ‘ఓషన్స్2’ లాంటి కొత్త చిత్రాల్లో ఆడవాళ్ళదే ప్రధానపాత్ర. జేమ్స్‌బాండ్ సిరీస్‌లోనూ ఈ మార్పు ఎందుకు రాకూడదన్నది కొత్త వాదన. ఇక, వర్ణ వివక్ష వ్యవహారం తెర మీదకు తెచ్చి, నల్లజాతీయుడైన 45 ఏళ్ళ ఇడ్రిస్ ఎల్బా ఎలా ఉంటారనే చర్చ వచ్చింది. ఆ మాటకొస్తే క్రెగ్‌ను తొలిసారిగా బాండ్ పాత్రకు తీసుకున్నప్పుడూ ఇలానే చర్చలు జరిగాయి. కొత్త బాండ్ ఎవరన్నది కొద్దిరోజుల్లో కానీ అధికారికంగా తేలదు. క్రెగ్ మాటెలా ఉన్నా, వీళ్ళకెంత పారితోషికమి స్తారో తెలీదు. అయినా, పాపులర్ బాండ్ పాత్రకు మించి పారితోషికం ఏముంటుంది! బాండ్... లేడీ బాండ్... జేమ్స్‌బాండ్ సినిమాలో లేడీ బాండ్‌నే హీరోగా పెట్టడమనేది ఇప్పుడిప్పుడే ఎంతవరకు జరుగుతుందో అనుమానమే కానీ, లేడీ బాండ్‌గా అందరి కన్నా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాత్రం గిలియన్ ఆండర్సన్. అమెరికన్ - బ్రిటీష్ సినీ, టీవీ, రంగస్థల నటి అయిన అమెరికన్ సైన్స్ - ఫిక్షన్ సిరీస్ ‘ఎక్స్-ఫైల్స్’లో అమెరికన్ నేర దర్యాప్తు సంస్థలో స్పెషల్ ఏజంట్ పాత్రధారిణిగా జనంలో ఫేమస్. కుటుంబాన్ని పోషించడం కోసం 22 ఏళ్ళ వయసులో హోటల్లో పనిచేస్తూ, రంగస్థలంపై నటిగా కాలుమోపారు. ఆ పైన టీవీ సిరీస్‌లలో నటిగా పేరు తెచ్చుకున్నారు. నవలా రచయిత్రి, ఉద్యమకారిణి అయిన ఆమె తెరపై బలమైన స్త్రీ పాత్రల్ని పోషిస్తుంటారు. పలు మహిళా సంస్థలకు, ఉద్యమాలకు మద్దతుదారైన గిలియన్ తనను తాను ‘ఫెమినిస్టు’గా అభివర్ణించుకుంటారు. ‘‘మహిళల గురించి ఎవరైనా కాస్త తేడాగా మాట్లాడినా, ప్రవర్తించినా నేను ఊరుకోలేను’’ అని బాహాటంగా అంటారు. అన్నట్లు భారతీయ సంతతి మహిళా డెరైక్టర్ గురిందర్ చద్ధా దేశ విభజన నేపథ్యంలో తీస్తున్న ‘వైస్రాయ్స్ హౌస్’లో మౌంట్‌బాటెన్ భార్య ఎడ్వినా మౌంట్బాటెన్గా గిలియన్ నటిస్తున్నారు. లేడీ బాండ్‌గా నటించినా, నటించకపోయినా - నెట్ ఫ్యాన్స్ పుణ్యమా అని ఇంత ప్రచారం వచ్చినందుకు గిలియన్ సహజంగానే సంతోషిస్తున్నారు. కోట్లిస్తానన్నా... బాండ్ అంటే భయమెందుకు? ‘జేమ్స్‌బాండ్‌గా నటించడం కన్నా మణికట్టు కోసుకుని చావడం బెటర్’ అని హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 24 బాండ్ చిత్రాలు వస్తే, ఆ మధ్య విడుదలైన ‘స్పెక్టర్’ సహా 4 చిత్రాల్లో టైటిల్ రోల్ చేశారు క్రెగ్. ఇక బాండ్‌గా నటించనని ప్రకటించారు. ఎక్కువ డబ్బిస్తే క్రెగ్ నిర్ణయం మార్చుకుంటారని భావించి, దర్శక - నిర్మాతలు అనుకున్నారు. ఏకంగా 100 మిలియన్ డాలరు ్ల(రూ. 674 కోట్లపైగా) ఆఫర్ చేశారట. అంత డబ్బు అన్నా క్రెగ్ మనసు చలించలేదు. బాండ్ సినిమాల్లోని రిస్కీ యాక్షన్ సీన్స్ కారణంగా క్రెగ్‌కు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట. పైగా, బాండ్ సినిమాల షూటింగ్ కోసం విమానం మీద నుంచి వేలాడడం, అతి వేగంగా వెళుతున్న కారులో ప్రయాణం లాంటి వాటితో ఆయనకు ఒళ్ళంతా దెబ్బలేనట! దాంతో, డబ్బు కన్నా ఆరోగ్యానికి ఓటేశారు. -
కొత్త బాండ్ ఎవరో!
హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో జేమ్స్ బాండ్‌కు ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా ఈ సినిమాల్లో బాండ్ పాత్రల్లో నటించే నటీనటులు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంటారు. ఇప్పటికే 26 సినిమాల్లో కనిపించిన బాండ్ పాత్రల్లో సీన్ కానరీ, డేవిడ్ నివెన్, జార్జ్ లెజెన్బే, రోగర్ మోర్, టిమోతీ డాల్టన్, పియర్స్ బ్రోస్నన్ నటించగా చివరి నాలుగు చిత్రాల్లో డానియల్ క్రెగ్ బాండ్ పాత్రలో అలరించాడు. తాజాగా రిలీజ్ అయిన స్పెక్టర్ సినిమా ప్రమోషన్ సందర్భంగా క్రెగ్ ఇక పై తనకు బాండ్ పాత్రలో నటించటం ఇష్టం లేదంటూ ప్రకటించాడు. దీంతో కొత్త బాండ్ ఎవరన్న చర్చ మొదలైంది. అయితే ఇప్పటివరకు మరో బాండ్ ఎవరన్నది తేలకపోయినా డానియల్ క్రెగ్ మాత్రం బాండ్ పాత్రకు గుడ్ బై చెప్పినట్టే అన్నటాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం క్రెగ్ ప్యూరిటీ అనే అమెరికన్ టీవీ సీరీస్‌కు అంగీకరించాడు. ఈ సీరీస్ పూర్తి కావటానికి చాలా సమయం పడుతుంది కనుక క్రెగ్ ఇక బాండ్ సినిమాకు అంగీకరించే ఛాన్స్ లేదు. దీంతో కొత్త బాండ్ కోసం అన్వేషణ ప్రారంభించారు. -
ఎప్పటిలానే... 'స్పెక్టర్' బాండ్
చిత్రం - ‘స్పెక్టర్’ తారాగణం - డేనియల్ క్రెగ్, క్రిస్టఫ్ వాల్ట్జ్, లీ సేడాక్స్, మోనికా బెలూచీ కెమేరా - హొయ్‌టే వాన్ హోయ్టెమా దర్శకత్వం- శామ్ మెన్‌డెస్ నిడివి- 147 నిమిషాలు ‘బాండ్... జేమ్స్‌బాండ్...’ ప్రపంచం మొత్తాన్నీ ఊపేసిన డైలాగ్ ఇది. తెరపై ఆ డైలాగ్.., ‘ట..డ..ట్టడా...య్...’ అనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వినని వాళ్ళూ, విని ఇష్టపడనివాళ్ళూ అరుదు. జేమ్స్‌బాండ్ జానర్ సినిమాలకున్న ఎడ్వాంటేజ్ అది. అశేష అభిమానులు, నిర్ణీతంగా సినిమాకొచ్చే ప్రేక్షకులూ ఎప్పుడూ రెడీ! తాజా జేమ్స్‌బాండ్ చిత్రం ‘స్పెక్టర్’ మీద అమితమైన ఆసక్తికి అదే కారణం. హాలీవుడ్ జేమ్స్‌బాండ్ చిత్రాల సిరీస్‌లో ఇది 24వ సినిమా. ఒకప్పుడు సీన్ క్యానరీ, రోజర్ మూర్, పీర్స్ బ్రోస్నన్ లాంటి నటులు జేమ్స్‌బాండ్‌గా అలరిస్తే, ‘క్యాసినో రాయల్’, ‘క్వాంటమ్ ఆఫ్ సోలేస్’, ‘స్కై ఫాల్’ లాంటి సినిమాల నుంచి డేనియల్ క్రెగ్ ఆ పాత్రను చేపట్టారు. ‘ఇదే నా ఆఖరి బాండ్ సినిమా’ అని డేనియల్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్న ఈ సినిమా కథ కూడా సగటు జేమ్స్‌బాండ్ సినిమాల్లో కథలానే ఉంటుంది. కాకపోతే, హీరోపై విలన్‌కు కాస్తంత పాత వ్యక్తిగత ద్వేషం కూడా ఉన్నట్లు కలిపారు. ‘స్పెక్టర్’ అనేది ఒక రహస్య సంస్థ పేరు. దాన్ని నడిపే ఒక విలన్. పేరు ఫ్రాంజ్ ఒబెర్‌హాసర్ (క్రిస్టఫ్ వాల్ట్జ్). అతను అలా సరికొత్త ఇంటెలిజెన్స్ సర్వీస్ నడుపుతూ దేశాల రహస్యాలను కనిపెట్టి, అందరినీ ఆట ఆడిస్తుంటాడు. ఆ టైమ్‌లో జేమ్స్‌బాండ్ 007 (డేనియల్ క్రెగ్) రంగప్రవేశం. ‘స్పెక్టర్’ కథా కమామిషు తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆ క్రమంలో కథ లండన్, మొరాకో, ఆస్ట్రియా - ఇలా పది దేశాల మీదుగా తిరుగుతుంది. ఒకప్పుడు ‘స్పెక్టర్’లో పనిచేసిన ఒక ముసలి వ్యక్తిని హీరో కలుసుకుం టాడు. డాక్టరైన అతని కూతుర్ని (లీ సేడౌక్స్) కాపాడతానంటూ వాగ్దానం చేస్తాడు. వెంటాడుతున్న విలన్ అనుచరుల నుంచి తప్పించుకుంటూ, వాళ్ళ బారి నుంచి ఆ అమ్మాయిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో కారు ఛేజ్‌లు, వైమానిక విన్యాసాలు, కాల్పులు, పేలుళ్ళ లాంటి అంశాలన్నీ మామూలే. చివరకు ‘స్పెక్టర్’ను నడిపే ప్రధాన విలన్ ఆటకట్టించాడన్నది మన తెలుగు సినిమాల లెక్కన రెండున్నర గంటలు తెరపై చూడాల్సిన కథ. ‘క్యాసినో రాయల్’ మొదలు మొన్నటి ‘స్కై ఫాల్’, ఇవాళ్టి ‘స్పెక్టర్’ దాకా జేమ్స్‌బాండ్ అంటే... డేనియల్ క్రెగ్గే. అతని బాడీ లాంగ్వేజ్, చేసిన యాక్షన్ ఘట్టాలు బాండ్ పాత్రకు కొత్త రూపం తెచ్చాయి. ప్రపంచాన్ని ఒంటిచేత్తో కాపాడే బ్రిటీష్ గూఢచారి పాత్రలో ఎప్పటికప్పుడు జీవించడానికి ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. విశేషమేమంటే, ఈ సినిమాలో విలన్ అంతే దీటుగా ఉండడం. ఆస్కార్ లాంటి అత్యున్నత పురస్కారాలెన్నో అందుకున్న క్రిస్టఫ్ వాల్ట్జ్ విలన్ పాత్రనూ, క్రూరత్వాన్నీ నేర్పుగా చూపించారు. ఈ సినిమా కోసం భారీయెత్తున పెట్టిన ఖర్చు, చాలా శ్రమతో చేసిన యాక్షన్ సీన్లు, వేసిన సెట్లు, తిరిగిన దేశదేశాలు తెరపై కనిపిస్తుంటాయి. విజువల్స్ వండర్ఫుల్ అనిపిస్తాయి. ముఖ్యంగా, రీ-రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రత్యేకించి చెప్పుకోవాలి. కానీ, కథ మాత్రం పాత సినిమాల్లోని ఘట్టాలకు కొత్త తిరగమోత. అలాగే, పాత్రల మధ్య ఎమోషన్లూ సహజమనిపించవు. యాక్షన్ సీన్లను మినహాయిస్తే, మిగిలిన సందర్భాల్లో కథ సుదీర్ఘంగా సాగు తుంది. అందుకే, ‘స్కైఫాల్’ దర్శకుడు, రచయితల బృందమే ఈ సినిమాకూ పనిచేస్తోందంటే కలిగిన ఉత్సాహం ఈ సినిమా చూస్తుండగా నిలవదు. అయితే, జేమ్స్‌బాండ్ తరహా సినిమాలను ఇష్టపడేవాళ్ళకు ఈ సినిమా మంచి కాలక్షేపమే. వరుసగా జేమ్స్‌బాండ్ సినిమాలన్నీ చూస్తూ వస్తున్న వాళ్ళకు వీటిలో కొత్త సంగతులు ఉండకపోవచ్చు. సరికొత్త విశేషాలు కనపడకపోవచ్చు. చాలా భాగం సంఘటనలు పదే పదే రిపీట్ అవుతున్నవే కావచ్చు. కానీ, వాటన్నిటినీ ఎప్పటికప్పుడు కొత్త తరహా దృశ్యాలుగా... ఉద్విగ్నభరితమైన సన్నివేశాలుగా... కుర్చీ అంచున కూర్చొని చూడాల్సిన విన్యాసాలుగా... తీర్చిదిద్దడంలోనే నేర్పు ఉంది. సక్సెస్ఫుల్ జేమ్స్‌బాండ్ సినిమాలు తీసేవాళ్ళకు అది తెలియాలి. చూసేవాళ్ళు అది తెలిసీ చూడాలి. హాలీవుడ్ మేకింగ్ వ్యాల్యూస్‌తో ‘స్పెక్టర్’ అలానే అనిపిస్తుంది. మునుపటి చిత్రాలతో పోలిస్తే నిరాశపరిచినా, లాజిక్ వెతకని సామాన్య బాండ్ ప్రేమి కుల్ని అలరిస్తుంది. పైగా, నాలుగు భాషల్లో (ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం) వెయ్యికి పైగా హాళ్ళలో రిలీజవడం ‘స్పెక్టర్’కు కలిసొచ్చే అంశం. నిజానికి, ‘స్పెక్టర్’ చిత్రం బ్రిటన్‌లో ఈ అక్టోబర్ 26న, అమెరికాలో, ఇతర ప్రాంతాల్లో ఈ నెల 6న రిలీజైపోయింది. మన దేశంలో మాత్రం ఆలస్యంగా వచ్చింది. ‘ప్రేమ్త్రన్ ధన్ పాయో’ లాంటి భారీ చిత్రాలు ఉండడంతో పంపిణీదారులైన సోనీ పిక్చర్స్ ఇండియా వారు ఈ చిత్రాన్ని ఇక్కడ ఆలస్యంగా రిలీజ్ చేశారని ఒక కథనం. -
బాండ్ హీరో బ్యాచిలర్ కాదట..!
బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంటుంది. అందుకే ఆ పాత్రల్లో నటించే నటీనటులకు కూడా అదే స్ధాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం బాండ్ పాత్రలో నటిస్తున్న డానియల్ క్రెగ్‌కు అంతర్జాతీయ స్థాయిలో భారీ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇలాంటి సమయంలో బాండ్ సినిమాలను ఫాలో అవుతున్న లేడీ ఫ్యాన్స్‌ను ఓ న్యూస్ షాక్‌కి గురి చేసింది. తెర మీద బాండ్ గర్ల్స్‌తో హాట్ హాట్ సీన్లలో కనిపించే జేమ్స్ బాండ్ తెర వెనుక మాత్రం ఫ్యామిలీ మ్యాన్ అట. ఈ విషయం ఆయన భార్య రచెల్ వెయిజ్ స్వయంగా వెల్లడించింది. 2010లో 'డ్రీమ్ హౌస్' సినిమా షూటింగ్ సమయంలో తొలిసారి కలిసిన వీరిద్దరు ...2011లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి తమ వివాహబంధాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్‌గానే మెయిన్ టెయిన్ చేస్తున్నారు. ముఖ్యంగా బాండ్ పాత్రలో నటిస్తున్న డానియల్‌కు ప్రపంచ వ్యాప్తంగా లేడీస్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో క్రెగ్ బ్యాచిలర్ కాదన్న విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియనీయలేదని చెప్పింది రచెల్. ప్రస్తుతం డానియల్ క్రెగ్ బాండ్‌గా నటించిన 'స్పెక్టర్' ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా బాండ్ సీరీస్‌లో ఆఖరిది అన్న ప్రచారం జరుగుతుండటంతో, ఇక బాండ్ బ్యాచిలర్ కాదన్న విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదని భావించిన ఈ సెలబ్రిటీ కపుల్ తమ పెళ్లి గురించి, డానియల్ గురించి ఎన్నో విషయాలను 'మోర్' మేగజైన్‌తో పంచుకుంది. -
మన జేమ్స్‌బాండ్ ఇలా ఉంటాడు!
జేమ్స్ బాండ్ తాజా చిత్రం 'స్పెక్టర్'కు కేంద్ర సెన్సార్ బోర్డు భారీగా కోతలు పెట్టింది. ఘాటైన ముద్దు సన్నివేశాల నిడివిని సగానికి తెగ్గోసి.. భారత్‌లో విడుదల చేసేందుకు అనుమతించింది. ఈ పరిణామం భారత్‌లోని బాండ్ సినిమా అభిమానులకు ఒకింత నిరాశ కలిగించేదే.. అందుకే భారత్‌కు తగ్గట్టు బాండ్‌ను సంస్కరిస్తే ఎలా ఉంటుందనే అంశంపై నెటిజన్లు ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాండ్‌కు మూడు నామాలు పెట్టి.. ఫొటోలు షేర్ చేశారు. బాండ్ గర్ల్ భారతీయ నటి అయితే ఎలాంటి దుస్తులు వేసుకుంటోందో.. చిత్రవిచిత్రమైన ఫొటోలతో సరదా వ్యాఖ్యాలు జోడించారు. సంస్కారి జేమ్స్‌బాండ్ (#SanskariJamesBond ) పేరిట ఈ యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. బాండ్ దేశీ ఆయుధం ఇదవుతుంది! Weapon of #SanskariJamesBond pic.twitter.com/xzNzdJkimv — Patakha Chikna (@Madan_Chikna) November 18, 2015 మేరే పాస్ మా హై డైలాగ్ ఉంటుంది Pic 1 : M as Head of MI6 in James Bond Series. Pic 2: M as Head of MotherIndia6(MI6) in #SanskariJamesBond pic.twitter.com/8EXyYAbriY — N33R4J (@_N33R4J_) November 18, 2015 బాండ్ గర్ల్ కొత్త అవతారం ఇలా ఉంటుంది Left: James Bond Girl Right: #SanskariJamesBond Girl pic.twitter.com/JhOZJ8jXaT — Anand Ranganathan (@ARangarajan1972) November 18, 2015 -
జేమ్స్ బాండ్‌గా చేసేకన్నా చచ్చిపోవడం బెటర్!
‘బాండ్.. జేమ్స్ బాండ్.. నేను జేమ్స్ బాండ్ 007’ అంటూ తమ ధైర్యసాహసాలను ప్రదర్శించడానికి ఆ పాత్రతో తమను పోల్చుకుంటారు పిల్లలు. అంతలా ఈ క్యారెక్టర్ పిల్లలకు దగ్గరైపోయింది. ఇక, పెద్దల సంగతి సరే సరి. తెరపై ఈ సీక్రెట్ ఏజెంట్ చేసే విన్యాసాలు వారినీ ఆకట్టుకుంటాయి. అలా ఇంటిల్లిపాదికీ దగ్గరైన ఈ పాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. జంపింగులూ, రన్నింగులూ, చాకచక్యంగా తుపాకీ పేల్చడం.. వాట్ నాట్.. బోల్డన్ని చేయాలి. అందుకే, ఈ పాత్ర చేసేవాళ్లను అద్భుతమైన నటులుగా కితాబులిస్తారు. ఇప్పటివరకూ సీన్ కానరీ, రోజర్ మూర్.. ఇలా పలువురు నటులు జేమ్స్ బాండ్‌గా అలరించారు. ఆ తర్వాత డేనియల్ క్రెగ్ ఈ పాత్రను పోషించడం మొదలుపెట్టారు. 2006లో ‘కాసినో రాయల్’, 2008లో ‘క్వాంటమ్ ఆఫ్ సోలెస్’, 2012లో ‘స్కైఫాల్’ చిత్రాల్లో జేమ్స్ బాండ్‌గా నటించారాయన. త్వరలో విడుదల కానున్న ‘స్పెక్టర్’లో నాలుగో సారి ఈ పాత్ర చేశారు. ఐదో సారి మాత్రం ఈ పాత్ర చేయడానికి ఆయన సిద్ధంగా లేరు. ‘మళ్లీ జేమ్స్ బాండ్‌గా నటించేకన్నా చచ్చిపోవడం బెటర్. ఒకవేళ నటించాల్సిన పరిస్థితి వస్తే ఏదైనా గాజు ముక్కతో నా మణికట్టుని కోసేసుకుంటా’ అంటున్నారు డేనియల్. దీన్నిబట్టి జేమ్స్ బాండ్ పాత్ర పోషణ పరంగా ఆయన ఎంత అలసిపోయారో ఊహించవచ్చు. ఎవరైనా మరీ బలవంతం చేస్తే, కనీసం మరో రెండేళ్లు ఆగమంటానని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత ఒకవేళ ఒప్పుకోవాలనిపిస్తే, అది డబ్బు కోసమే తప్ప వేరే కారణాలేవీ ఉండవని కూడా స్పష్టం చేశారు. -
ఈ జేమ్స్‌బాండ్ పెద్ద తాగుబోతట..!
ఇటీవలే బాండ్‌గా అవతారం ఎత్తిన డానియల్ క్రెగ్ మరో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు బాండ్ క్యారెక్టర్లలో నటించిన అందరి కంటే డానియల్ క్రెగ్ తాగుబోతు బాండ్‌గా రికార్డ్ సృష్టించాడు. తన ప్రతి సినిమాలో 20 యూనిట్ల ఆల్కాహాల్ తీసుకుంటున్న క్రెగ్ ఈ రికార్డ్ సాధించాడు. ఇయాన్ ఫ్లెమింగ్ రాసిన పాత్రకు తగ్గట్టుగా బాండ్ క్యారెక్టర్లో కనిపించిన నటులు ఆల్కహాల్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. గతంలో బాండ్ క్యారెక్టర్లలో కనిపించిన పియర్స్ బ్రోసన్ 12 యూనిట్లు, సీన్ కానరీ, రొగర్ మూర్లు 11 యూనిట్ల ఆల్కాహాల్‌ను సిప్ చేయగా ఒకే ఒక్క సినిమాలో బాండ్ గా కనిపించిన జార్జ్ తొమ్మిది యూనిట్ల ఆల్కాహాల్ మాత్రమే తీసుకున్నాడు. 2006లో కాసినోరాయల్ సినిమాతో తొలిసారిగా బాండ్ క్యారెక్టర్లో కనిపించిన డానియల్ క్రెగ్ తరువాత క్వాంటమ్ ఆఫ్ సోలేస్, స్కైఫాల్ సినిమాలలో కూడా 20యూనిట్లకు పైగా ఆల్కహాల్ తీసుకున్నాడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న స్పెక్టర్ సినిమాలో కూడా ఇదే తరహాలో దర్శనమిస్తున్నాడు డానియల్ క్రెగ్. -
బాండ్గర్ల్ కాదు బాండ్లేడి
హాలీవుడ్ హాట్ బ్యూటి మోనిక బెలూసి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసింది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న బాండ్ మూవీ స్పెక్టర్ లో బాండ్ గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తున్న ఈ సీనియర్ నటి, తను బాండ్ గర్ల్ ను కాదు, బాండ్ లేడిని అంటోంది. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి తరువాత నటిగా మారిన బెలూసి వయసు ప్రస్తుతం 50 సంవత్సరాలు, అందుకే తనను బాండ్గర్ల్ అనటం కన్నా బాండ్ఉమన్ అనటమే సమంజసం అంటుంది ఈ బ్యూటి. డానియల్ క్రెగ్ బాండ్ పాత్రలోనటిస్తున్న స్పెక్టర్ సినిమాలో జేమ్స్ బాండ్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తుంది ఈ ఓల్డేజ్ బ్యూటి. మ్యాట్రిక్స్ సీరిస్‌లో నటించిన బెలూసి బాండ్ సీరిస్ లోనే పెద్ద వయసు బాండ్‌గర్ల్‌గా రికార్డ్ సొంతం చేసుకుంది. సామ్ మెన్డీస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పెక్టర్ ప్రస్థుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. -
బాండ్గర్ల్ కాదు బాండ్లేడి
హాలీవుడ్ హాట్ బ్యూటి మోనిక బెలూసి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసింది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న బాండ్ మూవీ స్పెక్టర్ లో బాండ్ గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తున్న ఈ సీనియర్ నటి, తను బాండ్ గర్ల్ ను కాదు, బాండ్ లేడిని అంటోంది. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి తరువాత నటిగా మారిన బెలూసి వయసు ప్రస్తుతం 50 సంవత్సరాలు, అందుకే తనను బాండ్గర్ల్ అనటం కన్నా బాండ్ఉమన్ అనటమే సమంజసం అంటుంది ఈ బ్యూటి. డానియల్ క్రెగ్ బాండ్ పాత్రలోనటిస్తున్న స్పెక్టర్ సినిమాలో జేమ్స్ బాండ్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తుంది ఈ ఓల్డేజ్ బ్యూటి. మ్యాట్రిక్స్ సీరిస్‌లో నటించిన బెలూసి బాండ్ సీరిస్ లోనే పెద్ద వయసు బాండ్‌గర్ల్‌గా రికార్డ్ సొంతం చేసుకుంది. సామ్ మెన్డీస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పెక్టర్ ప్రస్థుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. -
జేమ్స్‌బాండ్ షూటింగ్లో మళ్లీ ప్రమాదం
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కథానాయక పాత్ర అంటే జేమ్స్ బాండే. తెరపై జేమ్స్‌బాండ్ చేసే వీరోచిత విన్యాసాలకు ముగ్ధులు కానివాళ్లు ఉండరు. ఇప్పటివరకు 23 జేమ్స్ బాండ్ చిత్రాలొస్తే, వాటిలో దాదాపు అన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు 24వ బాండ్ తయారవుతున్నాడు. బాండ్‌గా డేనియల్ క్రెగ్ నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ మెండెస్ దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం కోసం వారం రోజుల క్రితం ఓ పోరాట దృశ్యం తీస్తున్నప్పుడు డేనియల్ క్రెగ్ మోకాలికి గాయమైంది. తాజాగా ఈ షూటింగ్ లొకేషన్లో మరో ప్రమాదం జరిగింది. కెమెరా ఉన్న ఓ ట్రక్ అదుపు తప్పి, దూసుకు రావడంతో సెకండ్ యూనిట్ డెరైక్టర్‌గా చేస్తున్న టెర్రీ మాడ్డెన్కి గాయాలయ్యాయి. ఇవి బలమైన గాయాలు కావడంతో హుటాహుటిన అతణ్ణి ఆస్పత్రిలో చేర్చారు. ప్రాణభయం లేదని డాక్టర్లు పేర్కొనడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
జేమ్స్ బాండ్ కథ చోరీ!
జేమ్స్ బాండ్... నేర పరిశోధనలో వీర పనితనం చూపించే ఈ కారెక్టర్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడతారు. బాండ్ బరిలోకి దిగాడంటే విలన్లు బాప్రే అని పారిపోవాల్సిందే. బాండ్ చేసే వీరోచిత విన్యాసాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయి. అందుకే ఇప్పటివరకు 23 జేమ్స్ బాండ్ చిత్రాలొచ్చినా విసుగు లేకుండా చూశారు. ఇప్పుడు 24వ బాండ్ రానున్నాడు. ఈ చిత్రం ఇటీవలే లండన్‌లో ఆరంభమైంది. ‘స్పెక్ట్రె’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. అయితే... కథ తస్కరణకు గురి కావడం చిత్రబృందాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ చిత్రానికి ఓ నిర్మాణ సంస్థ అయిన సోనీ కార్యాలయంలోని కంప్యూటర్లలో ఉన్న ‘స్పెక్ట్రె’ కథను హాకర్స్ దొంగిలించారు. కానీ, చిత్రబృందానికి ఊరటనిచ్చే విషయం ఏంటంటే... ఈ కథకు కాపీ రైట్ రక్షణ ఉందట. ఒకవేళ ఎవరైనా ఈ కథను కాపీ కొట్టడానికి ప్రయత్నించినా, ఇందులోని సన్నివేశాలను పోలిన సన్నివేశాలు తీసినా చట్టరీత్యా నేరమవుతుందని సోనీ సంస్థ ప్రతినిథి పేర్కొన్నారు. కథను తస్కరించినంత మాత్రాన షూటింగ్ ఆగిపోతుందని దొంగలు ఆనందపడతారేమోననీ, షూటింగ్ ఆపే ప్రసక్తే లేదని కూడా తెలిపారు. జేమ్స్ బాండ్‌గా డానియల్ క్రెగ్ నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ మెండెస్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది నవంబర్‌లో ఈ కొత్త బాండ్ తెరపైకి రానున్నాడు.