
‘బాండ్.. జేమ్స్‌బాండ్..’ సినీ అభిమానులను దశాబ్దాలుగా ఉర్రూతలూగిస్తున్న క్యారెక్టర్ ఇది. ఇప్పటివరకూ 24 బాండ్ సినిమాలొస్తే అన్నీ యాక్షన్ సినిమా అభిమానులకు పండగలాగానే నిలిచాయి. ఇక 25వ సినిమా కూడా వచ్చేస్తుందనేసరికి ఈ స్పెషల్ బాండ్ ఎంత హంగామా చేస్తాడోనని అభిమానులు ఇప్పట్నుంచే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి చాలామంది బాండ్ క్యారెక్టర్‌లో కనిపించిన నటులు మారిపోయారు. చాలామంది డైరెక్టర్లూ మారిపోయారు. అయినా బాండ్ క్రేజ్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. గత నాలుగు బాండ్ సినిమాలకు హీరో అయిన డానియల్ క్రెయిగ్ ఐదోసారి చివరిసారి ఈ 25వ సినిమాలోనే కనిపిస్తాడట. 2019 నవంబర్‌లో బాండ్ 25వ సినిమా వస్తుందని అనౌన్స్ అయితే చేశారు కానీ, క్రెగ్ కాకుండా ఇంకా ఎవరెవరు ఈ సినిమాకు పని చేస్తున్నారన్నది సస్పెన్సే!
తాజాగా కొద్ది రోజులుగా ఓ పుకారు షికారు చేస్తోంది. అదే.. ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాకు దర్శకుడన్నది. నిజంగానే నోలన్ ఈ సినిమాకు పని చేసున్నాడా? అంటే సమాధానం లేదు. ‘డన్‌కిర్క్’ తర్వాత నోలన్ తన కొత్త సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు. చేస్తే బాండ్ సినిమా చేస్తూ ఉండొచ్చు కూడా. మరి యాక్షన్‌కి పెట్టింది పేరైన బాండ్ సినిమాకు నోలన్ స్టైల్ ఎలా కుదురుతుందో? ఎందుకంటే నోలన్ అంటే ఎక్కువ ఫిలాసఫీకి, లాజిక్‌కీ ఇంపార్టెన్స్ ఇస్తాడు. బాండ్ అంటే లాజిక్‌కి అందకుండా ఫుల్ యాక్షన్ ఉంటుంది. మరి.. నోలన్ బాండ్ ఎలా ఉంటాడో? అని ప్రస్తుతానికి లెక్కలు వేసుకోవాల్సిందే, అనౌన్స్‌మెంట్ వచ్చేవరకూ. 2018 మార్చిలో బాండ్ 25 షూట్ మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment