జేమ్స్‌ బాండ్‌: ‘నో టైమ్‌ టు డై’ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతో తెలుసా! | No Time To Die 1st Day Collection: James Bond Film Earns Above Rs 2 Crore In India | Sakshi
Sakshi News home page

No Time To Die 1st Day Collections: ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లు వసూళ్లు

Published Fri, Oct 1 2021 8:09 PM | Last Updated on Fri, Oct 1 2021 9:18 PM

No Time To Die 1st Day Collection: James Bond Film Earns Above Rs 2 Crore In India - Sakshi

జేమ్స్‌ బాండ్‌.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరుకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ నుంచి సిరీస్‌ వస్తుందంటే చాలు చిన్న వారి నుంచి పెద్దవారి వరకు అన్ని వయసుల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పటి వరక జేమ్స్‌ బాండ్‌ నుంచి 24పైగా సిరీస్‌లు వచ్చాయంటే ఈ బాండ్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది. హాలీవుడ్‌ చిత్రమైనప్పటికీ ఇండియాలో కూడా ఈ సిరీస్‌ అత్యంత క్రేజ్‌ను సంపాదించుకుంది. 

చదవండి: జేమ్స్‌ బాండ్‌.. బై బై డేనియల్‌

ఇటీవల ఈ సిరీస్‌ నుంచి నో టైమ్‌ టు డై’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. గురువారం(సెప్టెంబర్‌ 30) ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌ విడుదలైంది. భారత్‌లో కూడా ఈ మూవీ అన్ని భాషల్లో రిలీజ్‌ అయ్యింది. ఇక భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన తొలి రోజే భారత్‌లో ఈ సిరీస్‌ రూ. 2. 25 ​కోట్లు వసూళ్లు చేయగా.. యూకేలో రూ. 4.5 మిలియన్ల యూరోలు రాబట్టింది. అయితే దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది.

చదవండి: OTT: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో వచ్చే సినిమాలివే

కరోనా కాలంలో కూడా ఈ మూవీ ప్రపంచ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన ఒక్క రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే బాండ్‌ సిరీస్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన సిరీస్‌ ఇది. ఈ సిరీస్‌లో 5 సార్లు జేమ్స్‌ బాండ్‌గా నటించిన డేనియల్‌ క్రెగ్‌కు ఇది చివరి చిత్రం. ‘నో టైమ్‌ టు డై’ చిత్రాన్ని లండన్‌, జమైకా, ఇటలీలో చిత్రీకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement