మన జేమ్స్‌బాండ్ ఇలా ఉంటాడు! | sanskari James Bond is viral now on twitter | Sakshi
Sakshi News home page

మన జేమ్స్‌బాండ్ ఇలా ఉంటాడు!

Nov 19 2015 12:22 PM | Updated on Nov 9 2018 6:16 PM

మన జేమ్స్‌బాండ్ ఇలా ఉంటాడు! - Sakshi

మన జేమ్స్‌బాండ్ ఇలా ఉంటాడు!

జేమ్స్‌ బాండ్ తాజా చిత్రం 'స్పెక్టర్‌'కు కేంద్ర సెన్సార్‌ బోర్డు భారీగా కోతలు పెట్టింది

జేమ్స్‌ బాండ్ తాజా చిత్రం 'స్పెక్టర్‌'కు కేంద్ర సెన్సార్‌ బోర్డు భారీగా కోతలు పెట్టింది. ఘాటైన ముద్దు సన్నివేశాల నిడివిని సగానికి తెగ్గోసి.. భారత్‌లో విడుదల చేసేందుకు అనుమతించింది. ఈ పరిణామం భారత్‌లోని బాండ్‌ సినిమా అభిమానులకు ఒకింత నిరాశ కలిగించేదే.. అందుకే భారత్‌కు తగ్గట్టు బాండ్‌ను సంస్కరిస్తే ఎలా ఉంటుందనే అంశంపై నెటిజన్లు ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాండ్‌కు మూడు నామాలు పెట్టి.. ఫొటోలు షేర్ చేశారు. బాండ్ గర్ల్‌ భారతీయ నటి అయితే ఎలాంటి దుస్తులు వేసుకుంటోందో.. చిత్రవిచిత్రమైన ఫొటోలతో సరదా వ్యాఖ్యాలు జోడించారు. సంస్కారి జేమ్స్‌బాండ్ (#SanskariJamesBond ) పేరిట ఈ యాష్‌ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

 

బాండ్ దేశీ ఆయుధం ఇదవుతుంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement