Spectrum
-
5జీ స్పెక్ట్రమ్ వేలానికి మార్గం సుగమం
టెలికాం సేవల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు ట్రాయ్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా 22 సర్కిళ్లలో 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో రూ.17,940 కోట్ల విలువైన కొత్త 5జీ స్పెక్ట్రమ్(spectrum) వేలానికి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆమోదం తెలిపింది. అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో హై-స్పీడ్ కనెక్టివిటీని అందించేందుకు టెలికాం శాఖ ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.వేలంలోని కీలక అంశాలుమిల్లీమీటర్ వేవ్ (ఎంఎంవేవ్) స్పెక్ట్రమ్‌లో భాగమైన 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌ను వేలం వేయనున్నారు. టెలికాం ఆపరేటర్లకు మరింత నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ బ్యాండ్ కీలకం కానుంది. అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు ఇది అనువైందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో ఒక్కో సర్కిల్‌కు మొత్తం 3,000 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ అందుబాటులో ఉంటుంది. స్పెక్ట్రమ్ రిజర్వ్ ధర సర్కిళ్లను అనుసరించి మారుతూ ఉంటుంది. ఢిల్లీ సర్కిల్లో అత్యధికంగా మెగాహెర్ట్జ్‌కు రూ.76 లక్షలు, ముంబైలో మెగాహెర్ట్జ్‌కు రూ.67 లక్షలు, మహారాష్ట్రలో రూ.54 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో మెగాహెర్ట్జ్‌కు రూ.49 లక్షలుగా ఉంది.మారటోరియం తిరస్కరణభవిష్యత్తులో జరగబోయే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రమ్‌పై 5-6 సంవత్సరాల వడ్డీ లేని చెల్లింపు వ్యవధి లేదా మారటోరియం కోసం టెలికాం ఆపరేటర్ల అభ్యర్థనను ట్రాయ్ తిరస్కరించింది. ముందస్తు చెల్లింపు, 20 సమాన వార్షిక వాయిదాల్లో చెల్లింపు నిబంధనల్లో మార్పులుండవని తేల్చి చెప్పింది. ఈ స్పెక్ట్రమ్‌ను టెలికాం ఆపరేటర్లకు 20 ఏళ్ల వ్యాలిడిటీ కాలానికి అందిస్తారు.ఇదీ చదవండి: అక్రమ జామర్స్‌తోనే కాల్ డ్రాప్స్ఈ వేలంలో హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, 5జీ సేవల ప్రారంభానికి మద్దతు ఇవ్వడానికి టెలికాం ఆపరేటర్లకు అవసరమైన స్పెక్ట్రమ్‌ను అందించనున్నారు. 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్ ముఖ్యంగా హైస్పీడ్ కనెక్టివిటీ అవసరమైన పట్టణ ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ వేలంలో యూనిఫైడ్ లైసెన్స్ కింద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ), మెషిన్ టు మెషిన్ సర్వీస్ ప్రొవైడర్లను వేలంలో పాల్గొనేందుకు అనుమతించాలని ట్రాయ్ సూచించింది. -
స్పెక్ట్రమ్‌ను సమానంగా కేటాయించాలని డిమాండ్
బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (BIF) ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశంలోని టెక్ సంస్థలు(Tech firms) 6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌ను సమానంగా కేటాయించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. స్పెక్ట్రమ్(Spectrum) 5జీ సేవలు, వై-ఫై రెండింటికీ ఈ బ్యాండ్ కీలకం కావడంతో దీని కేటాయింపుపై చర్చ తీవ్రమైంది.టెలికాం ఆపరేటర్లకు ప్రత్యేకంగా 6 గిగాహెర్ట్జ్ బ్యాండ్ (6425-7125 మెగాహెర్ట్జ్)లో ఎగువ భాగాన్ని కేటాయించేందుకు టెలికమ్యూనికేషన్ల శాఖ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై మెటా, అమెజాన్, గూగుల్‌తో సహా ఇతర టెక్ కంపెనీల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ విధానం వల్ల తమ వినియోగదారులకు పేలవమైన కనెక్టివిటీ ఉంటుందని ఆయా సంస్థలు వాదిస్తున్నాయి.టెక్ సంస్థల వాదనలుఇండోర్ కనెక్టివిటీ: ప్రస్తుతం 80% కంటే ఎక్కువ డేటా వినియోగం ఇండోర్(ఇంటి లోపల)లో ఉండే కస్టమర్ల ద్వారానే జరుగుతుంది. టెలికాం ఆపరేటర్లకు ఎక్కువ బ్యాండ్ కేటాయించడం వల్ల అధిక ఫ్రీక్వెన్సీ కారణంగా తమ సేవలు సమర్థంగా ఉండవని టెక్ కంపెనీలు చెబుతున్నాయి.ప్రపంచ దేశాల మాదిరగానే..: వై-ఫై, ఇన్నోవేషన్ కోసం అమెరికా సహా 84 దేశాలు 6 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 500 మెగాహెర్ట్జ్ లైసెన్స్ పొందాయి. వై-ఫై, మెరుగైన కనెక్టివిటీని అందించడానికి ఇండియాలోనూ ప్రపంచ దేశాల మాదిరిగానే వ్యవహరించాలని టెక్ సంస్థలు వాదిస్తున్నాయి.నేషనల్ డిజిటల్ ఎకానమీ: కేవలం టెలికాం ఆపరేటర్లకే అధిక బ్యాండ్(Band) కేటాయించడం సరికాదని అంటున్నాయి. విశ్వసనీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే జాతీయ లక్ష్యానికి ఇది విరుద్ధమని టెక్ సంస్థలు భావిస్తున్నాయి.టెలికాం ఆపరేటర్ల వాదనలుస్పెక్ట్రమ్ కొరత: అంతరాయం లేని 5జీ సేవలను అందించడానికి స్పెక్ట్రమ్ కొరత ఉంది. దాన్ని పరిష్కరించడానికి 6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ అవసరమని టెలికాం ఆపరేటర్లు అంటున్నారు.మౌలిక సదుపాయాలకు ఖర్చులు: వై-ఫై కోసం తక్కువ బ్యాండ్ కేటాయించడం వల్ల మౌలిక సదుపాయాల ఖర్చులు పెరుగుతాయి. సర్వీస్ క్వాలిటీ నిలిపేందుకు తక్కువ దూరాల్లో ఎక్కువ టవర్లు అవసరమవుతాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ అంచనాలకు డేటా ఆధారిత విధానంప్రభుత్వ వైఖరి..టెలికాం శాఖ తన నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ కార్యదర్శుల కమిటీ వివరాల ప్రకారం బ్యాండ్‌లో ఎక్కువ విభాగాన్ని 5జీ, 6జీ వంటి అంతర్జాతీయ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ (IMT) సేవల కోసం రిజర్వ్ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ విభాగంలో మరింత సమర్థంగా సేవలందేలా ఉపగ్రహ కార్యకలాపాలను అధిక కెయు-బ్యాండ్ (12 గిగాహెర్ట్జ్)కు మార్చాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
వేలం వేస్తేనే పోటీ.. ట్రాయ్‌కి జియో లేఖ
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్‌కి ఉపయోగించే స్పెక్ట్రంను వేలం వేస్తేనే విదేశీ దిగ్గజాలతో దేశీ టెల్కోలు పోటీపడేందుకు అవకాశాలు లభిస్తాయని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి రాసిన లేఖలో రిలయన్స్ జియో పేర్కొంది. దేశీయంగా మూడు టెల్కోలు అనేక సంవత్సరాలుగా నిర్మించుకున్న సామర్థ్యాల కన్నా స్టార్‌లింక్, క్విపర్ శాట్‌కామ్ బ్యాండ్‌విడ్త్ అధికమని తెలిపింది.శాట్‌కామ్ సంస్థలు కేవలం టెరెస్ట్రియల్ కవరేజీ లేని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే సేవలు అందిస్తాయి కాబట్టి వాటికి ప్రాధాన్యతనిస్తామనడం సరికాదని జియో వ్యాఖ్యానించింది. స్టార్‌లింక్, క్విపర్, ఇతరత్రా శాట్‌కామ్ దిగ్గజాలు తాము పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ సర్వీసులను కూడా అందించేందుకు పోటీపడతామని ఇప్పటికే వెల్లడించినట్లు తెలిపింది.ఇదీ చదవండి: వాట్సాప్ గ్రూప్‌లకు లైసెన్స్.. ఫీజు కూడా!ఈ నేపథ్యంలో స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించిన పక్షంలో వాటితో పోటీపడేందుకు దేశీ సంస్థలకు సమాన అవకాశాలు దొరకవని పేర్కొంది. అంతర్జాతీయ విధానాలకు తగ్గట్లుగా శాట్‌కామ్ స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుండటంతో జియో లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
మస్క్ వైపే కేంద్రం మొగ్గు..
న్యూఢిల్లీ: శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రంను అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాలకు తగ్గట్లే కేటాయిస్తామే తప్ప వేలం వేయబోమని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరోసారి స్పష్టం చేశారు. అయితే దీన్ని ఉచితంగా ఇవ్వబోమని, టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయించే ధరను కంపెనీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు ఉపయోగించే స్పెక్ట్రంను కేటాయించాలే తప్ప భారతీయ టెల్కోలు కోరుతున్నట్లుగా వేలం వేయరాదని కోరుతున్న స్టార్‌లింక్ చీఫ్ ఎలాన్ మస్క్‌కు ఈ పరిణామం సానుకూలం కానుంది. ఈ స్పెక్ట్రంను వేలం వేయాలని దేశీ దిగ్గజాలు జియో, ఎయిర్టెల్ కోరుతున్నాయి. -
రెండేళ్లలో రూ.5 లక్షల కోట్ల ఆదాయం
దేశీయంలో టెలికాం సంస్థల వార్షిక ఆదాయం వచ్చే రెండేళ్లలో రూ.ఐదు లక్షల కోట్లకు చేరుతుందని భారత టెలికా విభాగం(డాట్) తెలిపింది. ప్రభుత్వం గతంలో తీసుకున్న సులభతర వాణిజ్య చర్యల వల్ల ఇది సాధ్యమవుతుందని డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ సభ్యుడు మనీశ్ సిన్హా అంచనా వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే రెండేళ్లలో టెలికాం కంపెనీల వార్షికాదాయాలు రూ.5 లక్షల కోట్లకు చేరవచ్చు. ప్రభుత్వం కొంతకాలంగా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా సులభతర వ్యాపార చర్యలను అనుసరిస్తున్నారు. దాంతో ఈ రంగం వృద్ధి బాటలో పయనిస్తోంది. అయితే స్పెక్ట్రమ్ కేటాయింపు విషయంలో మాత్రం ప్రస్తుత పద్ధతులను సమీక్షించుకోవాలి. స్పెక్ట్రమ్‌ను ప్రస్తుతం పది లేదా ఇరవై ఏళ్లకు కేటాయిస్తున్నారు. ఈ కాలపరిమితి మార్చాల్సి ఉంది. తక్కువ గడువుకు స్పెక్ట్రమ్‌ను మంజూరు చేయాలి. స్పెక్ట్రమ్ వినియోగం, సామర్థ్యం, ఆర్థిక విలువల విషయంలో సమస్యలున్నాయి. నిత్యం కంపెనీల వృద్ధి పెరుగుతోంది. అందుకు భిన్నంగా పదేళ్లు, ఇరవై ఏళ్ల వరకు స్పెక్ట్రమ్ అనుమతులుండడంపై చర్చించాలి’ అన్నారు.ఇదీ చదవండి: రూ.5.18 లక్షలు.. జీతం కాదు.. ఇంటి అద్దె!టెలికాం నియత్రణ సంస్థ ట్రాయ్ నివేదిక ప్రకారం.. 2023-24లో టెలికాం నెట్వర్క్ కంపెనీలు రూ.3.36 లక్షల కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేశాయి. ఈ ఏడాది వీటి ఆదాయం రూ.4 లక్షల కోట్లకు చేరుతుందని సిన్హా అంచనా వేశారు. ఇదిలాఉండగా, టెలికాం కంపెనీలు తమకు తోచినట్లుగా టారిఫ్‌ను పెంచుతూ పోతున్నాయనే వాదనలున్నాయి. జులైలో జియో, ఎయిర్టెల్ వంటి ప్రముఖ సంస్థలు గతంలో కంటే 20 శాతం వరకు టారిఫ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. చేసేదేమిలేక వినియోగదారులు దాన్ని చెల్లిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్ఎన్ఎల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అన్ని ప్రదేశాల్లో 4జీ, 5జీ సేవలందిస్తే మరింత మేలు జరుగుతుందని కస్టమర్లు భావిస్తున్నారు. -
శాట్‌కామ్ స్పెక్ట్రంపై చర్చిస్తున్నాం: ట్రాయ్ చైర్మన్
శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కి (శాట్‌కామ్) ఉపయోగించే స్పెక్ట్రంను వేలం వేయాలా లేక కేటాయించాలా అనే అంశంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో దీనిపై చర్చల ప్రక్రియ కొనసాగుతోందని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ తెలిపారు. టెల్కోలతో సమానంగా శాటిలైట్ సంస్థలతో కూడా వ్యవహరించాలన్న టెలికం సంస్థల డిమాండ్‌పై స్పందిస్తూ వివిధ వర్గాలు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అంతర్జాతీయంగా అమల్లో ఉన్నట్లుగా ఈ స్పెక్ట్రంను కేటాయించాలంటూ అమెరికన్ దిగ్గజం స్టార్‌లింక్ కోరుతుండగా, దేశీ టెల్కోలు మాత్రం వేలం వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాన్నే దేశీయంగానూ అమలు చేస్తామంటూ కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ట్రాయ్ నిర్దిష్ట రేటు సిఫార్సు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సింధియా నిర్ణయాన్ని స్టార్‌లింక్ చీఫ్ ఎలాన్ మస్క్ ప్రశంసించారు. -
వేలం ప్రక్రియే మేలు: రిలయన్స్
వ్యక్తిగత లేదా గృహ వినియోగదారుల కోసం శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని రిలయన్స్ తెలిపింది. దేశంలో గృహ వినియోగానికి సంబంధించిన ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించాలని ట్రాయ్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై రిలయన్స్ స్పందించింది. నిర్దిష్ట స్థాయి కలిగిన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించడం కంటే వేలం నిర్వహించాలని తెలిపింది.దేశంలో గృహ వినియోగ శాటిలైట్ సేవలకు స్పెక్ట్రమ్‌ను ఎలా కేటాయిస్తారని గతేడాది నుంచి చర్చలు సాగుతున్నాయి. ఇలొన్మస్క్కు చెందిన స్టార్‌లింక్, అమెజాన్ ఆధ్వర్యంలోని ప్రాజెక్ట్ కూపర్ వంటి వాటికోసం అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లో స్పెక్ట్రమ్‌కు సంబంధించి నేరుగా అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపులు చేశారు. అయితే ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో విస్తరణకు సిద్ధమవుతున్న రిలయన్స్ జియో మాత్రం హోమ్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం వేలం ప్రక్రియ నిర్వహించాలని తెలుపుతుంది. ఈమేరకు ట్రాయ్‌కు ఇటీవల లేఖ రాసినట్లు పేర్కొంది. మస్క్ కోరుకున్న విధంగా గతేడాది స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించేందుకు ట్రాయ్ నిబంధనలు సవరించనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: రూపాయి భారీ పతనానికి కారణాలుటెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ దీనికి సంబంధించిన నిబంధనలపై ప్రస్తుతం పబ్లిక్ కన్సల్టేషన్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియపై మరింత స్పష్టత రావడానికంటే ముందే రిలయన్స్ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ట్రాయ్ తన కన్సల్టేషన్ పేపర్లో ఎలాంటి చట్టపరమైన అధ్యయనాలు నిర్వహించకుండానే స్పెక్ట్రమ్ కేటాయింపులపై నిర్ణయం తీసుకోబోతుందని రిలయన్స్ తన లేఖలో పేర్కొంది. -
వడ్డీతో కలిపి రూ.8,465 కోట్లు చెల్లించిన ఎయిర్టెల్
ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సేవల సంస్థ భారతీ ఎయిర్టెల్ టెలికాం విభాగానికి చెల్లించాల్సిన బకాయిలను కొంత తీర్చినట్లు ప్రకటించింది. 2016లో సంస్థకు కేటాయించిన స్పెక్ట్రమ్‌కు సంబంధించిన బకాయిను 9.3 శాతం వడ్డీతో కలిపి మొత్తం రూ.8,465 కోట్లను తిరిగి చెల్లించినట్లు సంస్థ పేర్కొంది.టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలకు సంబంధించిన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో కంపెనీలు చేసేదేమిలేక బకాయిలు చెల్లిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏజీఆర్ లెక్కింపులో తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలంటూ గతంలో వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ సంస్థలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ బకాయిలపై బహిరంగ విచారణ జరపాలని కోరాయి. ఈమేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల కొట్టివేసింది. ప్రభుత్వానికి ఇచ్చే పూర్తి బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: పావుశాతం వరకు పెరిగిన అమ్మకాలుటెలికాం కంపెనీలు లైసెన్స్ రెన్యువల్ చేయడానికి, స్పెక్రమ్ వినియోగించుకున్నందుకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల బకాయిలు చెల్లించకపోతే తిరిగి వడ్డీతో సహా జమ చేయాలి. ఇవి ఏజీఆర్ కిందకు వస్తాయి. కొన్ని సంస్థల నివేదిక ప్రకారం వొడాఫోన్ఐడియా 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏజీఆర్ బకాయిలు రూ.70,320 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.43,980 కోట్లు కట్టాల్సి ఉంది. -
ముగిసిన స్పెక్ట్రం వేలం.. ఎయిర్టెల్ టాప్!
న్యూఢిల్లీ: ఈసారి టెలికం స్పెక్ట్రం వేలం ప్రక్రియ రెండు రోజుల్లోనే ముగిసింది. మొత్తం రూ. 96,238 కోట్ల బేస్ ధరతో 800 మెగాహెట్జ్ నుంచి 26 గిగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో 10 గిగాహెట్జ్ స్పెక్ట్రంను వేలానికి ఉంచగా.. ఏడు రౌండ్లలో 141.4 మెగాహెట్జ్ మాత్రమే అమ్ముడైంది. టెల్కోలు సుమారు రూ. 11,340.78 కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలు చేశాయి. ప్రధానంగా గడువు తీరిపోతున్న స్పెక్ట్రంను రెన్యువల్ చేసుకోవడం, కవరేజీని పెంచుకునేందుకు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీల్లోనే కొనుగోలు చేసేందుకు టెల్కోలు ప్రాధాన్యమివ్వడం ఇందుకు కారణం. భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా స్పెక్ట్రం కొనుగోలు చేసింది. తొలిరోజైన జూన్ 25న (మంగళవారం) అయిదు రౌండ్లు జరగ్గా, రెండో రోజున పెద్దగా స్పందన లేకపోవడంతో వేలం ముగిసినట్లు బుధవారం అధికారులు ప్రకటించారు.టెల్కోలు తమ సర్వీసులను కొనసాగించడంతో పాటు కార్యకలాపాలను విస్తరించేందుకు కూడా స్పెక్ట్రంను కొనుగోలు చేసినట్లు కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈసారి విక్రయానికి ఉంచిన స్పెక్ట్రంలో 12 శాతానికి మాత్రమే బిడ్లు వచ్చాయి. గత వేలంలోనే టెల్కోలు గణనీయంగా స్పెక్ట్రం తీసుకోవడంతో నిర్దిష్ట బ్యాండ్లకు ఈసారి పెద్దగా డిమాండ్ కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.900, 1800 మెగాహెట్జ్ బ్యాండ్లపై ఎక్కువగా ఆసక్తి నెలకొంది. 2022లో జరిగిన స్పెక్ట్రం వేలం బ్లాక్‌బస్టర్‌గా నిల్చింది. అప్పట్లో ఏడు రోజులు సాగిన వేలంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను టెల్కోలు కొనుగోలు చేశాయి. జియో అత్యధికంగా రూ. 88,078 కోట్లతో దాదాపు సగం స్పెక్ట్రంను దక్కించుకుంది. ఎయిర్టెల్ రూ. 6,857 కోట్ల బిడ్.. భారతీఎయిర్‌టెల్ అత్యధికంగా రూ.6,856.76 కోట్లు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) రూ. 3,510 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 973.6 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. ఎయిర్టెల్ 97 మెగాహెట్జ్, వీఐఎల్ 30 మెగాహెట్జ్, జియో ఇన్ఫోకామ్ 14.4 మెగాహెట్జ్ దక్కించుకున్నాయి. కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఎప్పటికప్పుడు అవసరమైనంత స్పెక్ట్రంను సమకూర్చుకుంటామని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు.బిహార్, పశ్చిమ బెంగాల్ సర్కిళ్లలో 1,800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కొనుగోలు చేయడం ద్వారా తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ చెప్పారు. నిర్దిష్ట మార్కెట్లలో స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా స్పెక్ట్రంను కొనుగోలు చేసినట్లు వీఐఎల్ సీఈవో అక్షయ ముంద్రా తెలిపారు. -
5జీ స్పెక్ట్రమ్ వేలం.. రూ.11వేల కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ వేలం మొదటి రోజున మంచి డిమాండ్ కనిపించింది. మంగళవారం మొత్తం ఐదు రౌండ్లలో టెలికం ఆపరేటర్లు రూ.11వేల కోట్ల మేర బిడ్లు దాఖలు చేశారు. రూ.96,238 కోట్ల విలువ చేసే 10,500 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచింది. 900, 1800, 2100, 2500 మెగాహెర్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ కోసం ఆపరేటర్లు ఆసక్తి చూపించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వేలంలో పాల్గొన్నాయి.అత్యధికంగా రిలయన్స్ జియో రూ.3,000 కోట్లను ముందస్తుగా డిపాజిట్ చేసింది. దీంతో ఎక్కువ స్పెక్ట్రమ్ కోసం రిలయన్స్ పోటీ పడనున్నట్టు తెలుస్తోంది. భారతీ ఎయిర్టెల్ రూ.1,050 కోట్లను, వొడాఫోన్ రూ.300 కోట్ల చొప్పున డిపాజిట్ చేశాయి. 2010లో ఆన్లైన్లో బిడ్డింగ్ మొదలైన తర్వాత ఇది పదో విడత స్పెక్ట్రమ్ వేలం కావడం గమనార్హం. కేంద్ర సర్కారు చివరిగా 2022 ఆగస్ట్‌లో వేలం నిర్వహించింది. వేలం బుధవారం తిరిగి ప్రారంభమవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
స్పెక్ట్రమ్ వేలం వాయిదా..కొత్త తేదీ ఖరారు
స్పెక్ట్రమ్ వేలాన్ని జూన్ 25కు వాయిదా వేస్తున్నట్లు టెలికా విభాగం(డాట్) ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం ఈ వేలం జూన్ 6(గురువారం)న నిర్వహించాల్సి ఉంది. వాయిదాకుగల కారణాలను మాత్రం డాట్ వెల్లడించలేదు.మొబైల్ ఫోన్ సేవల కోసం ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్లను రూ.96,317 కోట్ల కనీస ధరతో వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 800 - 900 - 1800 - 2100 - 2300 - 2500 - 3300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్‌ను వేలంలో విక్రయించనుంది. అందులో ఎలాగైనా గరిష్ఠవాటాను సొంతం చేసుకోవాలని టాప్ కంపెనీలు ఈఎండీ చెల్లించి, అధిక పాయింట్లు పొందేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రక్రియ కోసం రిలయన్స్ జియో రూ.3,000 కోట్ల మొత్తాన్ని (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్-ఈఎండీ) డిపాజిట్ చేయడం ద్వారా అత్యధిక రేడియో తరంగాలకు బిడ్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధ చేసింది. భారతీ ఎయిర్టెల్ రూ.1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.300 కోట్ల ఈఎండీని డిపాజిట్ చేశాయి.ఇదీ చదవండి: జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐస్పెక్ట్రమ్ అంటే?సెల్ఫోన్లు, రేడియోలు వంటి వైర్లెస్ సాధనాలకు సిగ్నళ్లు కావాలి. వీటి మధ్య సమాచార మార్పిడికి విద్యుదయస్కాంత తరంగాలు అవసరం. వీటినే రేడియో తరంగాలు అని కూడా అంటారు. ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాల శ్రేణినే స్పెక్టమ్ అంటారు. ఒక సాధనం నుంచి ఇంకో సాధనానికి సమాచారం చేరవేతకు నిర్దిష్ట పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీలు) ఉంటాయి. రేడియోకు వేరేగా.. సెల్ఫోన్లకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. ఫ్రీక్వెన్సీని బట్టి స్పెక్ట్రమ్‌ను వివిధ బ్యాండ్లుగా వర్గీకరించారు. -
86శాతం తగ్గిన ధరావతు సొమ్ము.. స్పెక్ట్రమ్ అంటే..?
నెట్వర్క్ సేవల స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలంలో కంపెనీలు సమర్పించిన ధరావతు సొమ్ము(ఈర్నెస్ట్ మనీ డిపాజిట్లు-ఈఎండీ) 2022 కంటే సుమారు 86శాతం తక్కువగా ఉందని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి.తాజా కథనాల ప్రకారం..5జీ స్పెక్ట్రమ్ వేలం కోసం టెలికాం కంపెనీలు సమర్పించిన ఈఎండీ రూ.300-రూ.3,000 కోట్లుగా ఉంది. గత పదేళ్లలో అత్యల్ప ఈఎండీ నమోదవడం ఇదే తొలిసారి. 2022లో జరిగిన వేలంలో కంపెనీలు సమర్పించిన ఈఎండీల కంటే ఇది దాదాపు 79-86% తక్కువగా ఉంది.స్పెక్ట్రమ్‌లో ఈఎండీలు బిడ్డింగ్ వ్యూహాన్ని, కొనుగోలు సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఆక్షన్‌లో పాల్గొనేందుకు కావాల్సిన అర్హత పాయింట్లను ఈఎండీల ద్వారా పొందవచ్చు. ఈసారి దాదాపు రూ.97,000 కోట్ల (దాదాపు 12 బిలియన్లు డాలర్లు) విలువైన 5జీ ఎయిర్‌వేవ్‌లలో ప్రభుత్వం 21% స్పెక్ట్రమ్‌ను అమ్మే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాగైనా గరిష్ఠవాటాను సొంతం చేసుకోవాలని టాప్ కంపెనీలు ఈఎండీ చెల్లించి, అధిక పాయింట్లు పొందుతుంటారు. తర్వాత ఆక్షన్‌లో పాల్గొని స్పెక్ట్రమ్‌ను చేజిక్కించుకుంటారు.రిలయన్స్ జియో 2022లో ఈఎండీలు రూ.14000 కోట్లు, ఈసారి రూ.3000 కోట్లు.భారతీఎయిర్‌టెల్ 2022లో ఈఎండీలు రూ.5500 కోట్లు, ఈసారి రూ.1050 కోట్లు.వొడాఫోన్ ఐడియా 2022లో ఈఎండీలు రూ.2200 కోట్లు, ఈసారి రూ.300 కోట్లు.స్పెక్ట్రమ్ అంటే?సెల్ఫోన్లు, రేడియోలు వంటి వైర్లెస్ సాధనాలకు సిగ్నళ్లు కావాలి. వీటి మధ్య సమాచార మార్పిడికి విద్యుదయస్కాంత తరంగాలు అవసరం. వీటినే రేడియో తరంగాలు అని కూడా అంటారు. ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాల శ్రేణినే స్పెక్టమ్ అంటారు. ఒక సాధనం నుంచి ఇంకో సాధనానికి సమాచారం చేరవేతకు నిర్దిష్ట పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీలు) ఉంటాయి. రేడియోకు వేరేగా.. సెల్ఫోన్లకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. ఫ్రీక్వెన్సీని బట్టి స్పెక్ట్రమ్‌ను వివిధ బ్యాండ్లుగా వర్గీకరించారు.ఇదీ చదవండి: అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండిగతంలో 5జీ కోసం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెర్జ్ స్పెక్ట్రాన్ని వేలానికి ఉంచారు. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz, 26GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు ప్రస్తుతం వేలం నిర్వహించనున్నారు. -
స్పెక్ట్రమ్ వేలంలో జియో ముందంజ
మొబైల్ ఫోన్ సేవల స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలంలో రిలయన్స్ జియో ముందంజలో నిలించింది. టెలికాం డిపార్ట్మెంట్ తాజాగా ప్రచురించిన వివరాల ప్రకారం.. రాబోయే స్పెక్ట్రమ్ వేలం కోసం ధరావతు సొమ్ము కింద రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 3,000 కోట్లను డిపాజిట్ చేసింది.టెలికమ్యూనికేషన్స్ విభాగం విడుదల చేసిన ప్రీ-క్వాలిఫైడ్ బిడ్డర్ వివరాల ప్రకారం.. భారతి ఎయిర్టెల్ రూ. 1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 300 కోట్ల విలువైన మనీ డిపాజిట్‌ను సమర్పించాయి. కంపెనీలు డిపాజిట్ చేసిన ఈఎండీ మొత్తం ఆధారంగా పాయింట్లను పొందుతాయి. ఇది వారికి కావలసిన సర్కిల్ల సంఖ్య, స్పెక్ట్రమ్ పరిమాణానికి వేలం పాడేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్ని ఎక్కువ పాయింట్లు ఉంటే వేలం దక్కించుకునేందకు అంత సామర్థ్యం ఉంటుంది.రిలయన్స్ జియో ఇప్పటి వరకు పాల్గొన్న అన్ని స్పెక్ట్రమ్ వేలంలో చార్ట్‌లో ముందుంది. జియో నెట్‌వర్త్ రూ.2.31 లక్షల కోట్లు కాగా, ఎయిర్టెల్ నెట్‌వర్త్ రూ.86,260.8 కోట్లు. ఇక వొడాఫోన్ ఐడియా నెట్‌వర్త్ విషయానికి వస్తే రూ. 1.16 కోట్ల వద్ద ప్రతికూల జోన్లో ఉంది.జూన్ 6 నుంచి సుమారు రూ.96,317 కోట్ల బేస్ ధరతో మొబైల్ ఫోన్ సేవల కోసం ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పెక్ట్రమ్ 20 సంవత్సరాల పాటు కేటాయిస్తారు. దక్కించుకున్న బిడ్డర్లు 20 సమాన వార్షిక వాయిదాలలో చెల్లింపులు చేయవచ్చు. వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్‌ను పదేళ్ల తర్వాత సరండర్ చేసే అవకాశం ఉంటుంది. -
రూ.96వేల కోట్ల స్పెక్ట్రమ్ వేలానికి తేదీ ఖరారు.. అసలు స్పెక్ట్రమ్ అంటే..
కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ సేవల కోసం నిర్దేశించిన స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలాన్ని మే 20న ప్రారంభించనుంది. వీటి ప్రాథమిక ధరను రూ.96,317.65 కోట్లుగా నిర్ణయించింది. వేలానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ టెలికాం విభాగం ఇటీవల నోటీసు జారీ చేసింది. దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీల వద్ద ఉన్న స్పెక్ట్రమ్‌ను వేలానికి పెట్టనున్నారు. అదే సమయంలో కొన్ని టెలికాం కంపెనీల వద్ద ఉన్న స్పెక్ట్రానికి ఈ ఏడాది గడువు తీరనుండడంతో ఆ ఫ్రీక్వెన్సీలనూ ఈ వేలంలో జత చేయనున్నారు. దీంతో ప్రస్తుతం 800, 900, 1800, 2100, 2300, 2500, 3300 మెగాహెర్ట్జ్‌తో పాటు 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 22గా నిర్ణయించారు. తుది బిడ్డర్ల జాబితా మే 9న విడుదల చేస్తారు. నమూనా వేలం మే 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు. వాస్తవ వేలాన్ని మే 20 నుంచి చేపడతారు. బిడ్డింగ్‌ను వేలంలో గెలుచుకున్నవారికి 20 ఏళ్ల పాటు స్పెక్ట్రమ్ కేటాయిస్తారు. 20 సమాన వార్షిక వాయిదాల్లో ఇందుకు చెల్లింపులు చేయాలి. దీనికి వడ్డీ రేటు 8.65 శాతంగా నిర్ణయించారు. కనీసం 10 ఏళ్ల అనంతరం స్పెక్ట్రమ్ సరెండర్ అవకాశం ఇస్తారు. ఈసారి వేలంలో స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు(ఎస్‌యూసీ) లేవు. బ్యాంకు హామీలనూ సమర్పించాల్సిన అవసరం లేదు. స్పెక్ట్రమ్ అంటే? సెల్ఫోన్లు, రేడియోలు వంటి వైర్లెస్ సాధనాలకు సిగ్నళ్లు కావాలి. వీటి మధ్య సమాచార బట్వాడాకు విద్యుదయస్కాంత తరంగాలు అవసరం. వీటినే రేడియో తరంగాలు అని కూడా అంటారు. ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాల శ్రేణినే స్పెక్టమ్ అంటారు. ఒక సాధనం నుంచి ఇంకో సాధనానికి సమాచారం చేరవేతకు నిర్దిష్ట పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీలు) ఉంటాయి. రేడియోకు వేరేగా.. సెల్ఫోన్లకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. ఫ్రీక్వెన్సీని బట్టి స్పెక్ట్రమ్‌ను వివిధ బ్యాండ్లుగా వర్గీకరించారు. ఇదీ చదవండి: ‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’ గతంలో 5జీ కోసం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెర్జ్ స్పెక్ట్రాన్ని వేలానికి ఉంచారు. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz, 26GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు ప్రస్తుతం వేలం నిర్వహించనున్నారు. -
Telecom Bill 2023: టెలికం సేవలపై కేంద్రం నియంత్రణ
న్యూఢిల్లీ: జాతి భద్రత దృష్ట్యా టెలికమ్యూనికేషన్ సేవలను తాత్కాలికంగా నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కలి్పంచే కీలకమైన టెలికమ్యూనికేషన్స్ బిల్లు–2023ను గురువారం పార్లమెంట్ ఆమోదించింది. వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా గ్లోబల్ సర్విస్ ప్రొవైడర్లకు శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపేందుకు కూడా ఈ బిల్లులో నిబంధనలున్నాయి. టెలికమ్యూనికేషన్స్ బిల్లు– 2023ను లోక్‌సభ బుధవారమే ఆమోదించగా గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. బిల్లును టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సభలో ప్రవేశపెట్టారు. టెలికం బిల్లు ప్రభుత్వ జోక్యానికి ఎక్కువ తావిచ్చేలా ఉందంటూ పలువురు వ్యక్తం చేసిన ఆందోళనలపై మంత్రి బదులిస్తూ.. వలస పాలన కాలం నాటి పురాతన చట్టాల స్థానంలో ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు. ‘టెలికం రంగంలో ఎంతో క్లిష్టమైన నిబంధనలతో కూడిన 100కు పైగా రకాల లైసెన్సులున్నాయి. ఈ బిల్లులో వీటన్నిటినీ తొలగించి, ఒకే ఒక అధికార వ్యవస్థ కిందికి తెచ్చాం. స్పెక్ట్రమ్ కేటాయింపులు పారదర్శకంగా ఉండేందుకు పలు చర్యలు ప్రతిపాదించాం. ఒకటో షెడ్యూల్లోని ఏవో కొన్ని ప్రత్యేక కేటగిరీలను మినహాయిస్తే స్పెక్ట్రమ్ కేటాయింపులన్నీ ఇకపై వేలం ద్వారానే జరుగుతాయి’అని మంత్రి వివరించారు. ‘బిల్లులో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. జాతి భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం టెలికం సేవలను తాత్కాలికంగా అధీనంలోకి తెచ్చుకునేందుకు ఉద్దేశించిన నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. తాజాగా దీనిని మరింత బలోపేతం చేశాం. కొత్తగా ఏర్పాటు చేసిన డిజిటల్ భారత్ నిధి దేశంలో టెలికం రంగ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది’అని మంత్రి వివరించారు. పార్లమెంట్ ఆమోదం అనంతరం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో చట్ట రూపం దాల్చనుంది. బిల్లు ముఖ్యాంశాలు.. ► శాంతి భద్రతలు, దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే పరిస్థితులున్నాయని భావించినప్పుడు టెలికం నెట్వర్క్ మొత్తాన్ని ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. ప్రజాప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం సందేశా(మెసేజీ)లను రహస్యంగా వినొచ్చు, ప్రసారాలను నిలిపివేయవచ్చు. ► ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ ప్రభుత్వానికి ఇటువంటి అధికారాలు దఖలు పడతాయి. ► పై పరిస్థితుల్లో కేంద్రం నేరుగా, లేదా కేంద్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రత్యేక అధికారికి టెలికం సర్వి సులను లేదా టెలికం నెట్‌వర్క్‌ను నియంత్రణలోకి తీసుకునే అధికారం సమకూరుతుంది. ► ఎవరైనా అనధికారి టెలికం నెట్‌వర్క్‌ను, పరికరాలను, రేడియోలను వినియోగిస్తున్నారని తేలితే ప్రభుత్వం ఏ భవనాన్ని లేదా విమానం, నౌక సహా ఎటువంటి వాహనాన్ని అయినా తనిఖీ చేయొచ్చు, స్వా«దీనం చేసుకోవచ్చు. ► వాణిజ్య అవసరాలకు స్పెక్ట్రమ్‌లను వేలం ద్వారానే కేటాయించాలన్న దేశీయ టెలికం సేవల సంస్థలు జియో, వొడాఫోన్ ఐడియా అభ్యర్థనలను తోసిపుచ్చుతూ ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ సేవలందించే కంపెనీలకు పాలనా అనుమతుల ద్వారానే స్పెక్ట్రమ్‌లను కేటాయించేలా నిబంధనలను బిల్లులో పొందుపరిచారు. ► పాలనా అనుమతుల ప్రకారం..స్పెక్ట్రమ్ కేటాయింపులను దేశంలో, అంతర్జాతీయంగా సుదూర శాటిలైట్ సర్వి సెస్, విశాట్..విమానయానం, సముద్రయానంతో అనుసంధానమయ్యే నెట్‌వర్క్‌లు, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి సంస్థలు పొందగలవు. ► ఇంటర్నెట్ ఆధారిత సందేశాలకు, కాల్స్ చేసుకోవడానికి వీలు కలి్పంచే వాట్సాప్, టెలిగ్రామ్, గూగుల్ మీట్ వంటి యాప్‌లకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. వీటిని టెలికం చట్ట పరిధి నుంచి తొలగిస్తారు. ► ఓటీటీ(ఓవర్ ది టాప్) యాప్‌లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) పరిధి నుంచి తొలగిస్తూ బిల్లులో ప్రతిపాదించారు. అనధికార ట్యాపింగ్‌లకు.. మూడేళ్ల జైలు, రూ.2 కోట్ల జరిమానా అక్రమంగా, అనుమతుల్లేకుండా ఫోన్ సందేశాలను రహస్యంగా విన్నా, ట్యాపింగ్‌కు పాల్పడినా భారీ జరిమానాతోపాటు కఠిన శిక్ష విధించే నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి. దేశ ప్రయోజనాలకు, మిత్రదేశాలతో సత్సంబంధాలకు భంగం కలిగించేలా టెలికం సేవలను దుర్వినియోగపరచడం నేరంగా పరిగణిస్తారు. దోషులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.2 కోట్ల వరకు జరిమానా, నేర తీవ్రతను బట్టి ఈ రెండూ విధించే అవకాశం ఉంది. నేరగాళ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా టెలికం సేవలను అందించే సంస్థలపైనా చర్యలుంటాయి. కాల్ డేటా, ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డుల విషయంలో అక్రమాలకు పాల్పడినా శిక్ష, జరిమానా తప్పదు. టెలికం నెట్‌వర్క్‌లకు, టెలీకం సదుపాయాలకు ఉద్దేశ పూర్వకంగా నష్టం కలిగించే వారికి రూ.50 లక్షల వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాద నలున్నాయి. తప్పుడు ధ్రువ పత్రాలతో సిమ్.. రూ. 50 లక్షల జరిమానా, జైలు తప్పుడు ధ్రువపత్రాలతో సిమ్ కార్డు పొందే వారికి రూ.50 లక్షల జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్షకు ఈ బిల్లు వీలు కలి్పస్తోంది. ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులను వాడి ‘సిమ్‌బాక్స్’తో అక్రమాలకు పాల్పడే వారికి, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఇతరుల ఫోన్ నంబర్లను స్పూఫింగ్ చేస్తూ మోసాలకు పాల్పడే వారికి కూడా ఇవే శిక్షలుంటాయి. సిమ్ దురి్వనియోగాన్ని అడ్డుకట్ట వేయడంతోపాటు ఇతరులకు వివిధ మార్గాల్లో ఇబ్బంది కలిగించే కాలర్లపైనా చర్యలకు ఇందులో వీలుంది. వినియోగదారులు తమ ఫిర్యాదులను ఆన్లైన్ లో నమోదు చేసుకుని, పరిష్కారం పొందేందుకు సైతం బిల్లులో ఏర్పాట్లున్నాయి. -
కేంద్రానికి రూ. 2,400 కోట్లు చెల్లించనున్న వొడా ఐడియా
న్యూఢిల్లీ: రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా .. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల కింద సెప్టెంబర్ కల్లా కేంద్రానికి రూ. 2,400 కోట్ల మొత్తాన్ని చెల్లించే యోచనలో ఉంది. గతేడాది వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌నకు సంబంధించి కంపెనీ .. జూలై నాటికి లైసెన్సు ఫీజు కింద రూ. 770 కోట్లు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల కింద రూ. 1,680 కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వొడాఫోన్ ఐడియా 30 రోజుల వ్యవధి కోరింది. ఈ నేపథ్యంలో సకాలంలో కట్టకపోవడం వల్ల 15 శాతం వడ్డీ రేటుతో బాకీ మొత్తాన్ని కంపెనీ చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
బీఎస్ఎన్ఎల్కు రూ.89,047 కోట్ల ప్యాకేజీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు కంపెనీలకు దీటుగా దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవల ప్రారంభించేందుకు కీలక అడుగు పడింది. స్పెక్ట్రమ్ కేటాయింపులతో కూడిన రూ.89,047 కోట్ల విలువ చేసే మరో పునరుద్ధరణ ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈక్విటీ రూపంలో బీఎస్ఎన్ఎల్కు 4జీ, 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంది. రూ.46,338 కోట్లు విలువ చేసే 700 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్, 3300 మెగాహెర్జ్ బ్యాండ్‌లో 70 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ (రూ.26,184 కోట్లు), 26 గిగాహెర్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ (రూ.6,565 కోట్లు), 2500 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ (రూ.9,428 కోట్లు) కేటాయించనుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ అధీకృత మూలధనం రూ.1,50,000 కోట్ల నుంచి రూ.2,10,000 కోట్లకు పెరగనుంది. ఈ స్పెక్ట్రమ్ కేటాయింపులతో బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలను గ్రామీణ ప్రాంతాల్లోనూ అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 2019లో మొదటిసారి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు రూ.69,000 కోట్ల విలువ చేసే ప్యాకేజీ ప్రకటించింది. 2022లో మరో రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ఇచ్చింది. కేంద్రం సాయంతో బీఎస్ఎన్ఎల్ రుణ భారం రూ.22,289 కోట్లకు దిగొచ్చింది. -
స్పెక్ట్రం కోసం ఎయిర్టెల్ రూ. 8 వేల కోట్లు చెల్లింపు
న్యూఢిల్లీ: ఇటీవల వేలంలో కొనుగోలు చేసిన 5జీ స్పెక్ట్రంనకు సంబంధించి టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ కేంద్రానికి రూ. 8,312.4 కోట్లు చెల్లించింది. నాలుగేళ్లకు సరిపడా వాయిదాల మొత్తాన్ని టెలికం శాఖకు (డట్) ముందస్తుగా చెల్లించినట్లు సంస్థ తెలిపింది. దీనితో తాము ఇక పూర్తిగా 5జీ సేవలను అందుబాటులోకి తేవడంపైనే దృష్టి పెట్టేందుకు వీలవుతుందని సంస్థ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. తగినంత స్పెక్ట్రం, అత్యుత్తమ టెక్నాలజీ, పుష్కలంగా నిధుల ఊతంతో ప్రపంచ స్థాయి 5జీ సేవల అనుభూతిని అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎయిర్టెల్ రూ. 43,039.63 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. ఇందులో ముందుగా రూ. 3,849 కోట్లు, తర్వాత 19 ఏళ్ల పాటు మిగతా మొత్తాన్ని విడతలవారీగా చెల్లించేందుకు ఎయిర్‌టెల్‌కు అవకశం ఉంది. -
స్పెక్ట్రం కేటాయింపు ప్రక్రియ వేగవంతం
న్యూఢిల్లీ: 5జీ వేలంలో పాల్గొన్న కంపెనీలకు స్పెక్ట్రం కేటాయింపుల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడానికి కసరత్తు జరుగుతోందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ముందుగా ప్రకటించినట్లు ఆగస్టు 12 కల్లా కేటాయించే దిశగా ప్రభుత్వం వేగంగా పని చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే కార్యదర్శుల కమిటీ అనుమతుల ప్రక్రియను పూర్తి చేసిందని మంత్రి తెలిపారు. (Zomato: జొమాటోకు మరో ఎదురు దెబ్బ) అలాగే, స్పెక్ట్రం సమన్వయ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని వివరించారు. దీని కింద ఒక్కో సంస్థకు ఒక్కో బ్యాండ్‌లో విడివిడిగా ఉన్న స్పెక్ట్రంను ఒక్క చోటికి చేరుస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియకు నెలల తరబడి సమయం పట్టేస్తుంది. కానీ దీన్ని ఈసారి ఒక్క రోజులోనే పూర్తి చేయగలిగినట్లు వైష్ణవ్ చెప్పారు. టెల్కోలు మరింత సమర్థమంతంగా సేవలు అందించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడగలదని ఆయన తెలిపారు. జూలై 26 నుంచి ఆగస్టు 1 వరకూ కొనసాగిన 5జీ స్పెక్ట్రం వేలంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలైన సంగతి తెలిసిందే. 10 బ్యాండ్స్‌లో 72,098 మెగాహెట్జ్ స్పెక్ట్రంను వేలానికి ఉంచగా 51,236 మెగాహెట్జ్ స్పెక్ట్రం (సుమారు 71 శాతం) అమ్ముడైంది. విక్రయించిన మొత్తం స్పెక్ట్రంలో దాదాపు సగభాగాన్ని రిలయన్స్ జియో రూ. 88,078 కోట్ల బిడ్లతో దక్కించుకుంది. (చదవండి: అయిదేళ్లలో రెండింతలు: డిజిటల్ రేడియోకు అదరిపోయే వార్త) -
అబ్ క్యా హోగా జీ?
దేశ టెలికమ్యూనికేషన్ రంగ సాంకేతిక ప్రస్థానంలో ఇది పెద్ద ముందడుగు. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న 5జీ సాంకేతికతను అందిపుచ్చుకొని, అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ ఇక జోరందుకోనుంది. ఇప్పుడిక భారత్ సైతం అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్, కెనడా, బ్రిటన్ సరసన ప్రపంచ 5జీ పటంలో స్థానం సంపాదించుకోనుంది. ఆ ప్రక్రియలో ఓం ప్రథమంగా దేశంలో మునుపెన్నడూ లేనంతటి అతి పెద్ద 5జీ స్పెక్ట్రమ్ వేలం సోమవారం ముగిసింది. ఏడు రోజుల్లో దాదాపు 40 రౌండ్ల పాటు సాగిన వేలంలో, వివిధ బ్యాండ్ల విక్రయంతో ప్రభుత్వం ఊహించిన దాని కన్నా చాలా ఎక్కువగా రూ. 1.5 లక్షల కోట్ల పైగా ఆదాయం సమకూరడం విశేషమే. ఇక అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది ముగిసే లోగా కనీసం దేశంలోని కొన్ని నగరాల్లోనైనా మొబైల్ ఇంటర్నెట్ ఇప్పటి 4జీ సేవల కన్నా పది రెట్ల వేగం పుంజుకుంటుంది. మూడు రోజుల్లోనే ముగిసిపోతుందన్న అంచనాకు భిన్నంగా ఏడు రోజులు దిగ్విజయంగా వేలం సాగింది. మొత్తం 72 గిగాహెర్ట్›్జ మేర స్పెక్ట్రమ్ వేలానికి పెడితే... అందులో 51.2 గిగా హెర్ట్›్జ, అంటే 71 శాతం అమ్ముడైంది. దేశంలోని అన్ని సర్కిళ్ళలో వ్యాపించడానికి ఇది సరిపోతుం దని సర్కారు వారి మాట. రాగల రెండు, మూడేళ్ళలో 5జీ సేవలు విస్తరిస్తాయని అంచనా. తాజా వేలంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియా, కొత్తదైన అదానీ ఎంటర్ ప్రైజెస్... ఈ నాలుగు ప్రధాన సంస్థలే పాల్గొన్నాయి. అయినా, అన్ని బ్యాండ్లలోనూ గణనీయ మొత్తంలో స్పెక్ట్రమ్ అందుబాటులో ఉండడం, వేలంపాటదార్ల అతి దూకుడుతో ధరలు అతిగా పెరగకుండా తగినన్ని నియంత్రణలు పెట్టడంతో మొత్తం మీద ప్రక్రియ బాగానే సాగిందను కోవాలి. రిలయన్స్ జియో అత్యంత భారీగా రూ. 88 వేల కోట్ల పైగా వెచ్చించి, 5జీ స్పెక్ట్రమ్‌లో దాదాపు సగం చేజిక్కించుకుంది. అంతేకాక, ప్రపంచవ్యాప్తంగా 5జీ వ్యవస్థ బాగా అభివృద్ధి అయిన అతి కీలక 700 మెగాహెర్ట్›్జ బ్యాండ్‌ను ఇప్పుడు దక్కించుకున్న ఏకైక సంస్థ కూడా జియోనే! 5జీకి వాడే మూడు బ్యాండ్లలోనూ స్పెక్ట్రమ్ కోసం సంస్థలు పోటీపడ్డాయి. మిడ్–ఫ్రీక్వెన్సీ ‘సి’ బ్యాండ్ పట్ల ఆసక్తి అధికంగా వ్యక్తమైంది. మిగిలిన బ్యాండ్ల కన్నా 700 మెగాహెర్ట్›్జ బ్యాండ్‌ది అధిక ధర. కాబట్టి 2016, 2021లలో స్పెక్ట్రమ్ వేలంపాటల్లో లానే ఈసారీ అది అమ్ముడుపోక పోవచ్చని సర్కార్ భావించింది. తీరా ఆ బ్యాండ్ అమ్ముడై, 600 మెగాహెర్ట్›్జ బ్యాండ్ అమ్ముడవకుండా మిగిలి పోయింది. వినియోగదారుల సాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కవరేజ్‌కు 700 బ్యాండ్ అత్యుత్తమం. 6 నుంచి 10 కిలోమీటర్ల పరిధి దాకా దాని కవరేజ్ ఉంటుందని ఓ లెక్క. అలా డేటా నెట్‌వర్క్‌లకూ, కస్టమర్ల సేవలకూ అది అనుకూలం. అందుకే, మొత్తం అన్ని బిడ్లలోకీ రెండో అత్యధిక మొత్తానికి (రూ. 39,720 కోట్లకు) అది అమ్ముడైంది. వెరసి, ఇతర పోటీదార్లతో పోలిస్తే, 5జీతో వినియోగదారుల్లో ముందుగా చొచ్చుకుపోవడానికి జియో చేతిలో ఇది పెద్ద అస్త్రం కానుంది. 2010 నుంచి ఇప్పటి దాకా జరిగిన 8 వేలంపాటలూ చూస్తే– ప్రభుత్వానికి ఈసారి 5జీలో వచ్చిన రూ. 1.5 లక్షల పైచిలుకు కోట్లే అత్యధిక ఆదాయం. గత ఏడాది 4జీ వేలంలో వచ్చిన రూ. 77,815 కోట్లకు ఇది రెట్టింపు. అలాగే, 2010లో 3జీ వేలంలో దక్కిన రూ. 50,968 కోట్లకు ఇది మూడు రెట్లు. నిన్నటి దాకా 2015లో వచ్చిన రూ. 1.10 లక్షల కోట్లే అత్యధికం కాగా, తాజా వేలం దాన్ని అధిగమించింది. ఇక, దాదాపు 10 కోట్ల సెల్‌ఫోన్ కనెక్షన్ల ఉత్తరప్రదేశ్ (తూర్పు) సర్కిల్ ఉండడంతో ఒక్క 1800 బ్యాండ్‌కే ఈసారి ఎక్కడ లేని పోటీ జరిగింది. మిగిలిన బ్యాండ్లన్నీ తమ తమ రిజర్వ్ ధరల్లోనే అమ్ముడవగా, ఈ ఒక్కటీ దాన్ని దాటి, 80 శాతం ఎక్కువకు అమ్ముడ వడం విశేషం. ఇక్కడా ఎయిర్టెల్ మీద జియోదే పైచేయి అయింది. ఇప్పుడు స్పెక్ట్రమ్‌ను కొన్న సంస్థలు మొత్తం 20 సమాన వాయిదాల్లో, ప్రతి ఏడాదీ ఆరంభంలోనే ముందస్తుగా ప్రభుత్వానికి చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఒకవేళ 5జీలో అనుకున్నంత విజయం సాధించకపోతే, ఈ సంస్థలు పదేళ్ళ తర్వాత కావాలంటే తమ స్పెక్ట్రమ్‌ను వెనక్కి అప్పగించేయవచ్చనేది వెసులుబాటే. నిజానికి ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ను కొట్టి, ప్రైవేటుకు పంచిపెట్టడంలో ముందున్న మన సర్కార్లు 5జీలోనూ ఆ పనే చేశాయి. అయితే, 5జీలో మనం ఇప్పటికే ఆలస్యమయ్యాం. బ్యాండ్లు కొన్న ప్రైవేట్ టెలికామ్ సంస్థలకూ ఇల్లలకగానే పండగ కాదు. గతంలో పాత టెక్నాలజీల నుంచి 3జీ, 4జీ టెక్నాలజీలకు ఎగబాకినప్పుడల్లా కస్టమర్లు వాడే డేటా పెరిగింది. కానీ, 5జీ ద్వారా ఇప్పటికిప్పుడు అలా డేటా వినియోగం పెరగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మొత్తం చందా దార్లలో వైర్లెస్ డేటా చందాదార్లు నూటికి 70 మందికి పైనే ఉన్నారు. కాబట్టి, 5జీ తీసుకున్న సంస్థలు తమ నెట్‌వర్క్‌ను మరింత ఉన్నతీకరించుకోవడానికి కొంత వ్యవధి పడుతుంది. అలాగే, ప్రపంచంలో ఎక్కడా తొలి ఏళ్ళలోనే 5జీ భారీగా ఆదాయం తెచ్చిపెట్టలేదు. ఇది కఠోర వాస్తవం. ఆ పాఠాలకు తగ్గట్టే సంస్థలు తమ ఆదాయవ్యయాలను అదుపులో పెట్టుకోవాలి. మరో సవాలేమిటంటే – అంతర్గత వినియోగ నిమిత్తం టెక్ సంస్థలకు నామమాత్రపు ధరకే 5జీ అందుబాటులోకి రానుంది. ఈ పోటీని టెలికామ్ సంస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోపక్క మన దేశంలో ఎక్కువమంది ఇప్పటికీ చౌకైన ఫోన్లే వాడుతున్నారు. మరి, అందరినీ 5జీకి అనువైన కొత్త ఫోన్ల వైపు మళ్ళించడమూ సులభమేమీ కాదు. అసలు కథ ఇప్పుడే షురూ అయిందిజీ! -
5జీ నెట్ వర్క్‌లో 700 ఎంహెచ్‌జెడ్..దాని ఉపయోగం ఏంటంటే
కేంద్రం 72 గిగా హెడ్జ్‌ల రేడియా తరంగాలను వేలానికి పెట్టింది. ఈ బిడ్డింగ్‌లో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అత్యధికంగా రూ.80వేల 100కోట్లతో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. 700ఎంహెచ్‌జెడ్ బ్యాండ్ స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. దేశ వ్యాప్తంగా 22 టెలికాం సర్కిల్స్‌లో జియో 700 ఎంహెచ్‌జెడ్‌ను కొనుగోలు చేయగా..ఆ స్పెక్ట్రం పాత్రపై యూజర్లు ఆసక్తి చూపిస్తున్నారు. 700 ఎంహెచ్‌జెడ్ క్రేజ్ ►వరల్డ్ వైడ్‌గా 5జీ నెట్ వర్క్ అందించడంలో 700ఎంహెచ్‌జెడ్ బ్యాండ్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ సైతం 5జీ సేవల్ని అందించడంలో ప్రీమియం బ్యాండ్ అని పేర్కొన్నాయి. ►కనెక్టివిటీ తక్కువగా ఉన్న ఏరియాలో 700ఎంహెచ్‌జెడ్ నెట్ వర్క్ పనీతీరు బాగుంటుంది ►జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం ఈ స్పెక్ట్రంతో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ►700 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్ టవర్ 10 కిలోమీటర్ల వరకు కవరేజీని అందిస్తుంది. దీని కవరేజీ కారణంగా టెలికాం ఆపరేటర్లు తక్కువ టవర్లను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఖరీదైనది అయినప్పటికీ, ఈ బ్యాండ్ 5జీ సేవలకు అనువుగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
71% అమ్ముడైన స్పెక్ట్రం
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలంలో నాలుగో రోజు (శుక్రవారం) ముగిసే నాటికి రూ. 1,49,855 కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలయ్యాయి. కొత్తగా రూ. 231.6 కోట్ల బిడ్లు వచ్చాయి. వేలానికి ఉంచిన మొత్తం స్పెక్ట్రంలో ఇప్పటివరకూ 71 శాతం అమ్ముడైనట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నాలుగో రోజైన శుక్రవారం మరో ఏడు రౌండ్లు జరిగాయని, దీంతో మొత్తం రౌండ్ల సంఖ్య 23కి చేరినట్లు వివరించారు. అయిదో రోజైన శనివారం కూడా వేలం కొనసాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు, టెలికం పరిశ్రమ వృద్ధి తీరుతెన్నులపై చర్చించేందుకు పీఈ ఫండ్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్వెస్టర్లు, బ్యాంకులతో మంత్రి శనివారం ముంబైలో భేటీ కానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
‘క్యాప్టివ్’ స్పెక్ట్రం కేటాయింపు విధానాలేవీ?
న్యూఢిల్లీ: వివిధ విభాగాల సొంత అవసరాలకు (క్యాప్టివ్) కేటాయించే స్పెక్ట్రం విషయంలో ఇప్పటివరకూ నిర్దిష్ట విధానమేదీ ఖరారు చేయకపోవడంపై టెలికం శాఖ (డాట్) తీరును కాగ్ ఆక్షేపించింది. అలాగే, క్యాప్టివ్ యూజర్లకు కేటాయించే స్పెక్ట్రం ధరలను సమీక్షించే యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పు పట్టింది. క్యాప్టివ్ స్పెక్ట్రం నిర్వహణ విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించే శాఖలు, విభాగాలు, ఏజెన్సీలను ప్రోత్సహించేలా ధరల విధానాన్ని సత్వరం సమీక్షించాలని సూచించింది. అందరికీ ఒకే ధర పెట్టకుండా వినియోగం, ప్రత్యేకతలను బట్టి వివిధ రేట్లు నిర్ణయించే అవకాశాలను డాట్ పరిశీలించాలని పేర్కొంది. పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఈ అంశాలు ప్రస్తావించింది. స్పెక్ట్రం లభ్యత, కేటాయింపులు, ప్రణాళికలు, ధర తదితర అంశాలను తరచుగా సమీక్షించేందుకు సంబంధిత వర్గాలందరితోనూ డాట్ శాశ్వత ప్రాతిపదికన ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. స్పెక్ట్రంను సమర్ధవంతంగా వినియోగించుకునేలా వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని కాగ్ తెలిపింది. మరిన్ని సూచనలు.. ► ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు వాస్తవంగా వినియోగించుకుంటున్న స్పెక్ట్రం వివరాలన్నీ ఒకే దగ్గర లభించేలా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) ఉండాలి. ► కేటాయింపుల విషయంలో వర్కింగ్ గ్రూప్‌ల సిఫార్సుల ఖరారు, ► సెక్రటరీల కమిటీ నిర్ణయాల అమలు కోసం అన్ని విభాగాలతో కలిసి డాట్ క్రియాశీలకంగా పనిచేయాలి. ► 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఎల్టీఈ (లాంగ్ టర్మ్ ఎవల్యూషన్) ఆధారిత నెట్వర్క్ ప్రాజెక్టు సత్వరం పూర్తయ్యేలా డాట్, రైల్వేస్ ఎప్పటికప్పుడు పనులను సమీక్షిస్తుండాలి. ఇది పూర్తయితే ప్రస్తుతం రైల్వేస్ వినియోగిస్తున్న 900 మెగాహెట్జ్ బ్యాండ్‌ను ఇతరత్రా వాణిజ్యపరమైన అవసరాల కోసం కేటాయించవచ్చు. ► తమ దగ్గర నిరుపయోగంగా ఉన్న ఇంటర్నేషనల్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ (ఐఎంటీ) స్పెక్ట్రంను వేలం వేసేందుకు/వినియోగంలోకి తెచ్చేందుకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో సంప్రదింపులు జరపడం ద్వారా డాట్ సత్వరం నిర్ణయం తీసుకోవాలి. ► ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థలకు కేటాయించిన స్పెక్ట్రంను అవి పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా, నిరుపయోగంగా ఉన్న ఫ్రీక్వెన్సీలను వాపసు చేసేలా చర్యలు తీసుకోవాలి. -
అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
న్యూఢిల్లీ: బడా టెక్ కంపెనీలు టెలికం రంగంలోకి దొడ్డిదారిన ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న వార్తలను బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (బీఐఎఫ్) ఖండించింది. టెక్ కంపెనీలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. సొంత అవసరాలకు ఉపయోగించుకునే క్యాప్టివ్ నెట్‌వర్క్‌లకు (సీఎన్‌పీఎన్) కావాల్సిన స్పెక్ట్రం కోసం కూడా వేలంలో పాల్గొనాలన్న వాదనలు పూర్తిగా అసంబద్ధమైనవని వ్యాఖ్యానించింది. రెండు వేర్వేరు రకాల సర్వీసులు, పబ్లిక్..ప్రైవేట్ నెట్‌వర్క్‌లను నిర్వహించే కంపెనీలకు ఒకే తరహాలో సమాన వ్యాపార అవకాశాలు కల్పించాలంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని బీఐఎఫ్ పేర్కొంది. టెక్ కంపెనీలు తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు మాత్రమే క్యాప్టివ్ నెట్‌వర్క్‌లు ఉపయోగపడతాయి తప్ప ప్రజలకు సర్వీసులు అందించేందుకు కాదని స్పష్టం చేసింది. సీఎన్‌పీఎన్‌లకు స్పెక్ట్రం ఇచ్చేందుకు ప్రతిపాదించిన నాలుగు విధానాల్లోనూ టెల్కోల ప్రమేయం ఉంటుందని బీఐఎఫ్ తెలిపింది. వాస్తవానికి ఒక విధానంలో ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే టెల్కోల వైపే ఎక్కువ మొగ్గు కూడా ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో టెల్కోలకు దీటుగా తమకే సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంటుందని బీఐఎఫ్ పేర్కొంది. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌లకు స్పెక్ట్రంను కేటాయించడం సరికాదంటూ టెల్కోల సమాఖ్య సీవోఏఐ ఆక్షేపించిన నేపథ్యంలో బీఐఎఫ్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. క్యాప్టివ్ నెట్‌వర్క్‌ల కోసం స్పెక్ట్రం కేటాయించడమంటే టెక్ కంపెనీలకు దొడ్డిదారిన టెలికంలోకి ఎంట్రీ ఇచ్చినట్లే అవుతుందంటూ సీవోఏఐ ఆరోపించింది. -
స్పెక్ట్రం వేలం కోసం రూ. 21,800 కోట్ల బయానా
న్యూఢిల్లీ: త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు టెలికం సంస్థలు రూ. 21,800 కోట్లు బయానాగా (ఈఎండీ) చెల్లించాయి. వీటిలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అత్యధికంగా రూ. 14,000 కోట్లు, భారతి ఎయిర్టెల్ రూ. 5,500 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 2,200 కోట్లు, అదానీ డేటా నెట్వర్క్స్ రూ. 100 కోట్లు డిపాజిట్ చేశాయి. టెలికం శాఖ పోర్టల్‌లో పొందుపర్చిన ప్రీ–క్వాలిఫైడ్ బిడ్డర్ల జాబితా ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం మీద 2021లో మూడు సంస్థలు బరిలో ఉన్నప్పుడు వచ్చిన రూ. 13,475 కోట్లతో పోలిస్తే తాజాగా మరింత ఎక్కువగా రావడం గమనార్హం. బిడ్డింగ్‌కు సంబంధించి డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి జియోకి అత్యధికంగా 1,59,830 అర్హత పాయింట్లు, ఎయిర్‌టెల్‌కు 66,330, వొడాఫోన్‌కు 29,370, అదానీ డేటా నెట్వర్క్స్కు 1,650 పాయింట్లు కేటాయించారు. జులై 26న ప్రారంభమయ్యే వేలంలో వివిధ ఫ్రీక్వెన్సీల్లో 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను కేంద్రం విక్రయించనుంది. బేస్ ధర ప్రకారం దీని విలువ రూ. 4.3 లక్షల కోట్లు. కంపెనీలు డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి స్పెక్ట్రం కొనుగోలు చేయడంలో వాటి ఆర్థిక స్థోమత, వ్యూహాలు మొదలైన వాటిపై అంచనాకు రావచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
టెక్ కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించవద్దు
న్యూఢిల్లీ: బడా టెక్ కంపెనీలు ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రంను కేటాయించవద్దని కేంద్రానికి టెల్కోల సమాఖ్య సీవోఏఐ విజ్ఞప్తి చేసింది. అలా చేస్తే అవి దొడ్డిదారిన టెలికం రంగంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఇచ్చినట్లే అవుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ‘టెల్కోలకు వర్తించే నిబంధనలు, పెనాల్టీలు వంటి బాదరబందీలేవీ బడా టెక్ కంపెనీలకు ఉండవు. క్యాప్టివ్ (సొంత అవసరాలకు) 5జీ నెట్‌వర్క్‌ల కోసం ప్రభుత్వం స్పెక్ట్రం కేటాయిస్తే.. భారత్‌లోని కంపెనీలకు 5జీ సర్వీసులు, సొల్యూషన్స్ అందించడానికి బడా టెక్నాలజీ సంస్థలకు దొడ్డిదారిన ఎంట్రీ ఇచ్చినట్లే అవుతుంది. వేలంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండా స్పెక్ట్రం కేటాయిస్తే, అన్ని సంస్థలకూ సమానంగా అవకాశాలు కల్పించాలన్న సూత్రానికి విఘాతం కలుగుతుంది‘ అని సీవోఏఐ వివరించింది. ఆదాయాలకు దెబ్బ.. ఇతరత్రా కంపెనీలు ప్రైవేట్ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేస్తే టెల్కోల ఆదాయం గణనీయంగా పడిపోతుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ పేర్కొన్నారు. అలాంటప్పుడు ఇక తాము ప్రత్యేకంగా 5జీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడం అర్ధరహితంగా మారుతుందని తెలిపారు. టెక్ కంపెనీలు తమ ప్రైవేట్ నెట్వర్క్ కోసం టెల్కోల నుంచి స్పెక్ట్రంను లీజుకు తీసుకోవచ్చని, డిమాండ్‌ను బట్టి వాటికి నేరుగా కూడా కేటాయించే అవకాశాలను పరిశీలిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సీవోఏఐ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 5జీ స్పెక్ట్రం కావాలనుకుంటున్న కంపెనీలు వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవడం సంతోషించతగ్గ విషయమని సీవోఏఐ పేర్కొంది. జులై నెలాఖరులో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో అదానీ గ్రూప్ కూడా పాల్గొంటోంది. ఈ వేలంలో రూ. 4.3 లక్షల కోట్లు విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను విక్రయించనున్నారు. టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా దరఖాస్తు చేసుకున్నాయి. -
హాట్ రేసు: ‘నువ్వా.. నేనా..సై’ అంటున్న దిగ్గజాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేగవంతమైన 5జీ సేవలు అందించే ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. త్వరలోనే 5జీ స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధమవుతోంది. టెలికాం శాఖ మంగళవారం విడుదల చేసిన జాబితా ప్రకారం జూలై 26న 5జీ స్పెక్ట్రమ్ వేలంప్రారంభం కానుంది. ఈ మేరకు దరఖాస్తులను కంపెనీలనుంచి ఇప్పటికే స్వీకరించామని డాట్ వెల్లడించింది. దరఖాస్తుల ఉపసంహరణకు జూలై 19 వరకు సమయం ఉంది. దీంతో ఇండస్ట్రీ దిగ్గజాలు నువ్వా నేనా అన్నట్టుగా రంగంలోకి దిగిపోయాయి. బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ డేటా నెట్వర్క్స్ తోపాటు, టెలికాం దిగ్గజాలు భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా తమ దరఖాస్తులను సమర్పించాయి. ఈ మేరకు టెలికాం డిపార్ట్మెంట్ జాబితాను విడుదల చేసింది. ముఖ్యంగా అదానీ డేటా నెట్వర్క్స్, రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలు 5 జీ వేలాన్ని దక్కించుకుని టెలికాం ఇండస్ట్రీలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోనున్నాయి. 600 ఎంహెచ్‌జెడ్, 700 ఎంహెచ్‌జెడ్, 800 ఎంహెచ్‌జెడ్, 900 ఎంహెచ్‌జెడ్, 1800 ఎంహెచ్‌జెడ్, 2100 ఎంహెచ్‌జెడ్, 2300 ఎంహెచ్‌జెడ్, 2500 ఎంహెచ్‌జెడ్, 3300 ఎంహెచ్‌జెడ్, 26 గిగాహెడ్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్‌ను వాడుకునే హక్కును పొందేందుకు 5జీ వేలాన్ని డాట్ నిర్వహిస్తోంది. రూ. 4.3 లక్షల కోట్ల విలువైన 72,097.85 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్ వేలం జూలై 26 ప్రారంభం కానుంది. ఈ వేలం పూర్తయితే శరవేగంగా, ప్రస్తుతం 4జీ నెట్వర్క్ స్పీడ్‌తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ స్పీడ్‌తో 5జీ సర్వీసులు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. -
షెడ్యూల్ ప్రకారమే 5జీ ప్రక్రియ..
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించిన ప్రక్రియ .. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే ముందుకెడుతోందని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అయితే, టెలికం రంగ నియంత్రణ ట్రాయ్ చేసిన సిఫార్సులపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. మరికొన్ని వారాల్లో ఇతర సమస్యలకు తగిన పరిష్కారం కనుగొనగలమని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ’ఫిన్‌క్లువేషన్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. స్పెక్ట్రం వేలానికి సంబంధించి ధరను తగ్గిస్తూ, ఇతరత్రా విధి విధానాలపై ట్రాయ్ ఇటీవలే సిఫార్సులు చేయగా.. తగ్గించిన రేటు కూడా చాలా ఎక్కువేనంటూ టెలికం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వైష్ణవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశీ స్టార్టప్‌లకు గుర్తింపు.. భారత స్టార్టప్ వ్యవస్థ అంతర్జాతీయంగా గుర్తింపు, గౌరవం పొందుతోందని వైష్ణవ్ చెప్పారు. బడుగు, బలహీన వర్గాల జీవితాలను మార్చే వినూత్న ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని స్టార్టప్‌లు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆయన సూచించారు. ధర తగ్గించండి: సునీల్ మిట్టల్ 5జీ స్పెక్ట్రం కోసం భారీ రేటును నిర్ణయించవద్దంటూ భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ కేంద్రాన్ని కోరారు. టెల్కోలు.. స్పెక్ట్రం కొనుగోలు కోసం ఉన్న డబ్బంతా వెచ్చించేసే బదులు ఆ నిధులను నెట్వర్క్ ఏర్పాటుపై ఇన్వెస్ట్ చేస్తే సర్వీసులను మరింత వేగవంతంగా అందుబాటులోకి తెచ్చే వీలుంటుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. చదవండి: 5జీ స్పెక్ట్రం బేస్ ధర 35% తగ్గించవచ్చు -
5జీ స్పెక్ట్రం బేస్ ధర 35% తగ్గించవచ్చు
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించి నిర్దిష్ట ఫ్రీక్వెన్సీల కనీస ధరను 35 శాతం మేర తగ్గించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. 5జీ మొబైల్ సర్వీసులకు ఉపయోగించే 3300–3670 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రం రేటును మెగాహెట్జ్‌కు రూ. 317 కోట్లుగా నిర్ణయించవచ్చని పేర్కొంది. ట్రాయ్ గతంలో సూచించిన రూ. 492 కోట్లతో (మెగాహెట్జ్‌కు) పోలిస్తే ఇది సుమారు 35 శాతం తక్కువని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక కీలకమైన 700 మెగాహెట్జ్ బ్యాండ్‌కు సంబంధించి బేస్ రేటును గతంలో ప్రతిపాదించిన దానికన్నా 40 శాతం తక్కువగా రూ. 3,927 కోట్లుగా నిర్ణయించవచ్చని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. 700 మెగాహెట్జ్ మొదలుకుని 2500 మెగాహెట్జ్ వరకూ ఉన్న ప్రస్తుత ఫ్రీక్వెన్సీలతో పాటు కొత్తగా చేర్చిన 600, 3300–3670, 24.25–28.5 మెగాహెట్జ్ బ్యాండ్లను కూడా వేలంలో విక్రయించనున్నట్లు వివరించింది. టెలికం రంగం నిలదొక్కుకోవడానికి, దీర్ఘకాలంలో వృద్ధి సాదించడానికి.. పెట్టుబడులను ప్రోత్సహించడం, ద్రవ్య లభ్యతను పెంచడం, స్పెక్ట్రం కోసం సులభతర చెల్లింపుల విధానాలను అమలు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని ట్రాయ్ తెలిపింది. అత్యంత వేగవంతమైన 5జీ మొబైల్ సర్వీసులను 2022–23 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తెచ్చే దిశగా ఈ ఏడాదే స్పెక్ట్రం వేలం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
అదిగో 5జీ..త్వరలో ట్రాయ్ కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ ధర, ఇతర పద్ధతులపై 7–10 రోజుల్లో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిఫార్సులు వెల్లడి కానున్నాయి. సూచనలు తుది దశలో ఉన్నాయని ట్రాయ్ సెక్రటరీ వి.రఘునందన్ తెలిపారు. ఈ విషయాలను నేడో రేపే ట్రాయ్ వెల్లడించే అవకాశం ఉందని పరిశ్రమ ఎదురు చూస్తోంది. విలువ, రిజర్వ్ ధర, పరిమాణం, వేలంలో పాల్గొనడానికి అర్హతలు, ఇతర షరతులతో సహా వివిధ బ్యాండ్స్‌లో స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన విధానాల గురించి చర్చించడానికి గత ఏడాది నవంబర్ చివరలో వివరణాత్మక సంప్రదింపు పత్రాన్ని ట్రాయ్ విడుదల చేసింది. మార్చి 2021లో జరిగిన చివరి రౌండ్ వేలంలో 855.6 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ కోసం రూ.77,800 కోట్లకు పైగా బిడ్స్‌ను గెలుచుకుంది. మొత్తం స్పెక్ట్రమ్‌లో దాదాపు 63 శాతం అమ్ముడుపోలేదు. -
5G: రిలయన్స్ జియో ‘5జీ’ కసరత్తు.. ఓ రేంజ్‌లోనే!
Reliance Jio About 5G Plan: దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్వర్క్ రిలయన్స్ జియో భారీ ప్రణాళికకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వెయ్యి నగరాల్లో 5జీ నెట్వర్క్ కవరేజ్‌ను విస్తరించేందుకు ప్లానింగ్ పూర్తి చేసుకున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఫైబర్ సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు ఆయా సైట్లలో పైలట్‌ను నిర్వహిస్తోంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జరిగిన ఓ ప్రదర్శనలో జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ వివరాల్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1,000 టాప్ సిటీలకు 5G కవరేజ్ ప్లానింగ్ పూర్తయింది. 5జీ టెక్నాలజీతో హెల్త్ కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో అధునాతన సదుపాయాలను ఉపయోగించి జియో ట్రయల్స్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. అంతేకాదు త్రీడీ మ్యాప్స్, రే ట్రేసింగ్ టెక్నాలజీ ద్వారా 5జీ సేవల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నట్లు థామస్ తెలిపారు. నెట్వర్క్ ఫ్లానింగ్ కోసం అత్యాధునిక సేవల్ని వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే జియో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ రూ.151.6 కు పెరిగింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఇది 8.6 శాతం ఎక్కువ. ఇటీవల జియో తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. 2021 డిసెంబర్ నాటికి భారత్ లో జియో వినియోగదారుల సంఖ్య 42.1 కోట్లకు చేరింది. 2020తో పోలిస్తే దాదాపు కోటి మంది వినియోగదారులు జియోకు పెరిగారు. స్పెక్ట్రమ్ సంబంధిత బకాయిలన్నింటినీ టెలికం శాఖకు జియో ఇటీవలే ముందస్తుగా చెల్లించింది. 2021 మార్చి వరకు వడ్డీతో కలిపి మొత్తంగా రూ.30,791కోట్ల చెల్లింపు చేసింది. 5g స్పెక్ట్రమ్ వేలం ఈ వేసవిలోపే జరిగే అవకాశం ఉండగా.. ఈ లోపు జియో కసరత్తులు పూర్తి చేసుకోవడంతో పాటు 6జీ మీద ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. -
జియో స్పెక్ట్రమ్ బకాయిలు క్లియర్
న్యూఢిల్లీ: టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో తాజాగా స్పెక్ట్రమ్ సంబంధ బకాయిలన్నిటీని చెల్లించింది. టెలికం శాఖ(డాట్)కు రూ. 30,791 కోట్లు జమ చేసింది. తద్వారా 2021 మార్చివరకూ వడ్డీసహా స్పెక్ట్రమ్ సంబంధ బకాయిలను పూర్తిగా తీర్చివేసినట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. వీటిలో 2014, 2015, 2016లలో వేలం ద్వారా చేజిక్కించుకున్న స్పెక్ట్రమ్‌తోపాటు.. 2021లో ఎయిర్టెల్ ద్వారా సొంతం చేసుకున్న రేడియో తరంగాల బకాయిలు సైతం ఉన్నట్లు వివరించింది. వెరసి వేలం, ట్రేడింగ్‌ల ద్వారా మొత్తం 585.3 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను పొందినట్లు వెల్లడించింది. ప్యాకేజీకి నో... స్పెక్ట్రమ్ బకాయిలను పూర్తిగా చెల్లించడం ద్వారా ఏడాదికి రూ. 1,200 కోట్లమేర వడ్డీ వ్యయాలను ఆదా చేసుకోనున్నట్లు రిలయన్స్ జియో తెలియజేసింది. ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం అంచనాలను మదింపు చేసింది. దీంతో ప్రభుత్వం టెలికం రంగానికి గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన ఉపశమన ప్యాకేజీని వినియోగించుకోబోమని చెప్పినట్లయ్యింది. ఇటీవల వొడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్, టాటా టెలీ(మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి వాటాలను కేటాయించిన విషయం విదితమే. తద్వారా వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుండగా, టాటా టెలీ సర్వీసెస్, టాటా టెలీ(మహారాష్ట్ర) 9.5 శాతం చొప్పున వాటాలు కేటాయించనున్నాయి. ఈ నేపథ్యంలో జియో చెల్లింపులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
తగ్గేదేలే ! ముందుగానే రూ.30 వేల కోట్లు చెల్లించిన జియో
RJIL: దేశంలో నెంబర్ వన్ మొబైల్ ఆపరేటర్ హోదాలో ఉన్న జియో ప్రభుత్వానికి బకాయిలు చెల్లించింది. 2014 నుంచి 2016 వరకు వరుసగా జరిగిన స్పెక్ట్రం వేలంలో జియో కూడా పాల్గొంది. ఆ తర్వాత మొబైల్ ఆపరేషన్స్‌లోకి వచ్చింది. కాగా స్పెక్ట్రం వినియోగానికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు రూ. 30, 971 కోట్లు ఇప్పుడు చెల్లించింది. ఇటీవల వోడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్ వంటి సంస్థలు ప్రభుత్వానికి స్పెక్ట్రం బకాయిలు చెల్లించలేకపోయాయి. బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం మారటోరియం కూడా విధించింది. ఐనప్పటికీ బకాయిలకు బదులు ఆయా సంస్థల్లో ప్రభుత్వానికి భాగస్వామం కల్పించే ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. ఈ తరుణంలో మారటోరియం ఉపయోగించకుండా స్పెక్ట్రం బకాయిలు జియో ముందుగానే చెల్లించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. -
రూ.15,519 కోట్ల చెల్లించిన ఎయిర్టెల్.. కారణం ఇదే
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ గతంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంనకు సంబంధించిన బాకీ మొత్తాన్ని ముందస్తుగా, పూర్తిగా చెల్లించేసింది. రూ. 15,519 కోట్లు ప్రభుత్వానికి కట్టినట్లు సంస్థ వెల్లడించింది. దీనితో కనీసం రూ. 3,400 కోట్ల మేర వడ్డీ వ్యయాల భారం తగ్గినట్లవుతుందని పేర్కొంది. 2014లో నిర్వహించిన వేలంలో ఎయిర్టెల్ రూ. 19,051 కోట్లకు 128.4 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. స్పెక్ట్రమ్ కొనుగోలుకు సంబంధించి 2026–27 నుంచి 2031–32 వరకూ 10 శాతం వడ్డీ రేటుతో వార్షికంగా వాయిదాల్లో చెల్లింపులు జరపాల్సి ఉంది. అయితే, ముందుగానే కట్టేయడం వల్ల ఆ మేరకు వడ్డీ భారం తగ్గినట్లవుతుంది. మూలధనాన్ని సమర్ధమంతంగా ఉపయోగించుకోవడంపై మరింత దృష్టి పెట్ట డం కొనసాగిస్తామని ఎయిర్టెల్ పేర్కొంది. -
‘సబ్సిడీపై స్మార్ట్ఫోన్లు’.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందన
న్యూఢిల్లీ: దేశీయంగా ఇంకా ఫీచర్ ఫోన్లను వినియోగిస్తున్న వారిని స్మార్ట్ఫోన్ల వైపు మళ్లించడానికి సబ్సిడీపై హ్యాండ్సెట్లను అందించాలన్న ప్రతిపాదనలపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ప్రభుత్వం ఇప్పటికే దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుందన్నారు. ‘ప్రస్తుతం మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించి ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్ ఉంది. గత నాలుగైదేళ్లుగా తీసుకుంటున్న చర్యలతో మెరుగైన మొబైల్ ఫోన్ల ధరలు రూ. 10,000 కన్నా తక్కువ స్థాయికి దిగివచ్చాయి. ఇది కీలక స్థాయి. ఎందుకంటే అల్పాదాయ వర్గాలకూ ఇది అందుబాటు రేటుగానే భావించవచ్చు. ఇక దేశీయంగా విడిభాగాలు, చిప్‌ల తయారీ కోసం కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనివల్ల సరఫరాపరమైన ఖర్చులు తగ్గుతాయి. ఫలితంగా స్మార్ట్ఫోన్ల తయారీ వ్యయాలు తగ్గి, మరింత అందుబాటు ధరల్లో లభించగలవు‘ అని చెప్పారు. కాబట్టి సబ్సిడీ అవసరం ఉండదనే అర్థం వచ్చేట్టుగా మంత్రి వ్యాఖ్యానించారు. స్పెక్ట్రం ధరలపై కొనసాగుతున్న చర్చలు టెలికం స్పెక్ట్రం ధరకు సంబంధించిన చర్చల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీటిలో చురుగ్గా పాల్గొనాలని, టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్)కి తగు సూచనలివ్వాలని టెల్కోలకు ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన భాగస్వామ్య సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ట్రాయ్ తుది డాక్యుమెంటు రూపొందిస్తుందని, దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. స్పెక్ట్రం ధరల నిర్ణయంలో ’ప్రజా ప్రయోజనాల’ను కూడా దృష్టిలో ఉంచుకుంటున్న విషయాన్ని అంతా గుర్తిస్తున్నారని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆదాయాన్ని గరిష్టంగా పెంచుకోవడం.. అదే సమయంలో బడుగు వర్గాలకు సర్వీసులను మరింతగా మెరుగుపర్చడానికి మధ్య సమతూకం పాటించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కోవిడ్ పరిణామాలతో అంతా డిజిటల్ బాట పట్టాల్సి రావడంతో టెలికం ప్రాధాన్యతకు గణనీయంగా గుర్తింపు లభించిందని వైష్ణవ్ తెలిపారు. చదవండి: స్పెక్ట్రం బేస్ ధరపై టెలికాం సంస్థల పేచీ -
స్పెక్ట్రం బేస్ ధరపై టెలికాం సంస్థల పేచీ
న్యూఢిల్లీ: ప్రతిపాదిత 5జీ స్పెక్ట్రం బేస్ ధరను సగానికి పైగా తగ్గించాలని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ.. కేంద్రాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎంతమేర తగ్గించాలని విజ్ఞప్తి చేసిన విషయంలో టెల్కోలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ దాదాపు 50 శాతం పైగా మాత్రం తగ్గించాలని కోరినట్లు పేర్కొన్నాయి. తగ్గింపు స్థాయి 50–60 శాతం ఉండాలని విజ్ఞప్తి చేసినట్లు ఒక టెల్కో ప్రతినిధి తెలపగా, మరో సంస్థ ప్రతినిధి 60–70 శాతం తగ్గింపు కోరినట్లు పేర్కొన్నారు. 3.3–3.6 గిగాహెట్జ్ ఫ్రీక్వెన్సీలో ప్రతీ మెగాహెట్జ్ స్పెక్ట్రంనకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూ.492 కోట్ల బేస్ ధరను సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఒకో బ్లాక్‌లో 20 మెగాహెట్జ్ చొప్పున విక్రయించాలని సూచించింది. దీని ప్రకారం టెల్కోలు .. స్పెక్ట్రం కొనుక్కోవాలంటే కనీసం రూ. 9,840 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో స్పెక్ట్రం వేలం వేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) వినతి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితి ఇది.. ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన స్పెక్ట్రంతో టెలికం కంపెనీలు 5జీ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ స్పెక్ట్రం కాలపరిమితి 2022 మే వరకూ .. లేదా స్పెక్ట్రం వేలం ఫలితాలు వెల్లడయ్యే వరకూ (ఏది ముందైతే అది) ఉంటుంది. అయిదేళ్ల తర్వాత 2021 మార్చిలో నిర్వహించిన వేలంలో దాదాపు రూ. 4 లక్షల కోట్ల బేస్ ధరతో ప్రభుత్వం ఏడు బ్యాండ్లలో 2,308.8 మెగాహెట్జ్ స్పెక్ట్రంను వేలం వేసింది. అయితే, భారీ బేస్ ధర కారణంగా ఖరీదైన 700 మెగాహెట్జ్, 2,500 మెగాహెట్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రం అమ్ముడు పోలేదు. అప్పట్లో 3.3–3.6 గిగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంను కొన్ని కారణాల వల్ల వేలానికి ఉంచలేదు. -
ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!
ప్రస్తుత ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకి వేగంగా పెరుగుతుంది. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT) టెక్నాలజీ మాయం అయిపోయింది. అయితే, చాలా దూరంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను కనెక్ట్ చేయాలంటే వైర్ ద్వారా చేయాల్సి వస్తుంది. అయితే, ఇక ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. తక్కువ విద్యుత్ వినియోగంతో 1 కిలోమీటరు దూరం వరకు సిగ్నల్ వచ్చే Wi-Fi HaLow టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్త కంపెనీల నెట్వర్క్ Wi-Fi కూటమి ఈ విషయాన్ని దృవీకరించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరికరాల వినియోగం భారీగా పెరుగుతున్న తరుణంలో Wi-Fi HaLow రూపొందించబడింది. పరిశ్రమలు, గృహాలలో IoT అప్లికేషన్లు పెరుగుతున్నందున మరిన్ని ఎక్కువ పరికరాలకి ఇంటర్నెట్ నిరంతరం కనెక్ట్ అయి ఉండాలి. Wi-Fi కూటమి తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ Wi-Fi కొత్త రూపం ప్రస్తుత Wi-Fiతో పోలిస్తే విద్యుత్ శక్తిని భారీగా ఆదా చేస్తుంది. వై-ఫై ఉన్న స్థానం నుంచి 1 కిలోమీటరు దూరంలో మీ కనెక్షన్లకు కనెక్ట్ అవ్వవచ్చు. అలాగే, Wi-Fi HaLow ఇప్పటికే ఉన్న వై-ఫై ప్రోటోకాల్‌ల ఆధారంగా రూపొందించబడింది. ప్రస్తుత వై-ఫై పరికరాలతో కూడా పనిచేస్తుంది. Wi-Fi HaLow ఎలా పని చేస్తుంది? సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలను ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడానికి ఎక్కువగా 2.4GHz నుంచి 5GHz రేడియో ఫ్రీక్వెన్సీ గల వై-ఫై వాడుతాము. ఇవి తక్కువ సమయంలో అధిక మొత్తంలో డేటాను ప్రసారం చేస్తాయి. Wi-Fi HaLow భారీ రేడియో ఫ్రీక్వెన్సీ బదులుగా సబ్-1 గిగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో పని చేస్తుంది. తక్కువ-ఫ్రీక్వెన్సీ వేవ్ ఎక్కువ తరంగదైర్ఘ్యాన్ని అనుమతిస్తుంది. అంటే సిగ్నల్లు సాధారణంగా స్పెక్ట్రమ్‌లతో పోలిస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అందుకే, ఒక Wi-Fi HaLow యాక్సెస్ పాయింట్ నుంచి 1 కిలోమీటరు వ్యాసార్ధం వరకు విస్తరిస్తుంది. అయితే, దీని వల్ల కలిగే ప్రధాన నష్టం డేటా స్పీడ్ అనేది తగ్గిపోతుంది. అయినప్పటికీ, అటువంటి అప్లికేషన్ IoT పరికరాలకు ఖచ్చితంగా సరిపోతుంది. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ఎక్కువగా స్పీడ్ వచ్చే ఇంటర్నెట్ అవసరం. స్మార్ట్ డోర్ లాక్‌లు, కెమెరాలు, ఎయిర్ కండిషనర్లు మొదలైన వాటిని ఎక్కడ ఉన్న ఆపరేట్ చేయాలంటే IoT అప్లికేషన్ అవసరం. వీటికి తక్కువ ఇంటర్నెట్ అవసరం. ఈ Wi-Fi HaLow కిలోమీటరు దూరంలో ఉన్న 80 ఎంబీపీస్ వరకు వస్తుంది. (చదవండి: ఎక్కువ మైలేజ్ ఇచ్చే మారుతి కారు.. ధర ఎంతో తెలుసా?) -
ఏజీఆర్ లెక్కింపుపై టెల్కోలకు ఊరట
న్యూఢిల్లీ: టెలికం సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించే దిశగా లైసెన్స్ నిబంధనలను కేంద్రం సవరించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కించే విధానంలో మార్పులు చేసింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల విధింపునకు సంబంధించి టెలికంయేతర ఆదాయాలు, డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం మొదలైన వాటిని ఏజీఆర్ నుంచి మినహాయించింది. ఇకపై టెల్కోల స్థూల ఆదాయం నుంచి ముందుగా వీటిని మినహాయిస్తారు. ఆ తర్వాత మిగిలే మొత్తం నుంచి ఇప్పటికే మినహాయింపులు అమలవుతున్న రోమింగ్ ఆదాయాలు, ఇంటర్కనెక్షన్ చార్జీల్లాంటి వాటిని తీసివేసి తుది ఏజీఆర్‌ను లెక్కిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచే ఈ సవరణను వర్తింపచేస్తున్నట్లు టెలికం శాఖ (డాట్) తెలిపింది. గత ఏజీఆర్ లెక్కింపు విధానం కారణంగా టెల్కోలపై ఏకంగా రూ. 1.47 లక్షల కోట్ల బకాయిల భారం పడుతోంది. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల్లో ఏజీఆర్ సవరణ కూడా ఒకటి. ‘మారటోరియం’కు ఎయిర్టెల్ ఓకే! సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్), స్పెక్ట్రమ్ బకాయిల చెల్లింపుపై నాలుగు సంవత్సరాల మారటోరియం తనకు అంగీకారమేనని భారతీ ఎయిర్టెల్ ప్రభుత్వానికి తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెలికం రంగానికి ఇటీవల ప్రకటించిన సహాయక ప్యాకేజీలో భాగంగా టెల్కోలకు బకాయిలపై మారటోరియం అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. -
మారుమూల ప్రాంతాలకూ డిజిటల్ సేవలు
న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాలకు డిజిటల్ సేవలు అందించేందుకు స్పేస్ టెక్నాలజీ, టెలికం సాంకేతికల మేళవింపు తోడ్పడగలదని కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనితో సమ్మిళిత వృద్ధి సాధ్యపడగలదని పేర్కొన్నారు. అంతరిక్ష టెక్నాలజీలు, ఉపగ్రహ కంపెనీల సమాఖ్య ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ఐఎస్‌పీఏ) ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అటవీ ప్రాంతాలు, ఆదివాసీలు నివసించే మారుమూల ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు.. హిమాలయాలు, ఎడారి గ్రామాలు మొదలైన ప్రాంతాలకు సంప్రదాయ విధానాల్లో డిజిటల్ సేవలను చేర్చడం కష్టం. ఇలాంటి ప్రాంతాలకు చేరుకునేందుకు స్పేస్ టెక్నాలజీలు ఉపయోగపడగలవని ఆశిస్తున్నా‘ అని ఆయన వివరించారు. స్పెక్ట్రంపై తగు సూచనలివ్వండి.. స్పెక్ట్రం నిర్వహణ తదితర అంశాల విషయంలో అంతర్జాతీయంగా పాటిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించిన విధానాల రూపకల్పనకు తగు సిఫార్సులు చేయాలని పరిశ్రమ వర్గాలకు ఆయన సూచించారు. స్పెక్ట్రం విషయంలో స్పేస్, టెలికం రంగాలు రెండూ ఒకదానితో మరొకటి అనుసంధానమైనవేనని ఆయన చెప్పారు. ఫైబర్, టెలికం టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో సంక్షోభాల నిర్వహణ, ప్లానింగ్, రైళ్ల రాకపోకల నియంత్రణ తదితర అంశాలకు సంబంధించి భారతీయ రైల్వేస్.. ఎక్కువగా స్పేస్ టెక్నాలజీలనే వినియోగిస్తోందని వైష్ణవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వేస్ విభాగం మరింత సమర్ధమంతంగా పనిచేసేందుకు ఉపయోగపడే సాధనాల గురించి రైల్వే, స్పేస్ విభాగాల అధికారులతో చర్చించి, అధ్యయనం చేయాలని, తగు పరిష్కార మార్గాలు సూచించాలని ఆయన పేర్కొన్నారు. ఐఎస్‌పీఏ ఆవిషఅకరణతో పరిశ్రమ, రీసెర్చ్ సంస్థలు, విద్యావేత్తలు, స్టార్టప్‌లు, తయారీ సంస్థలు, రైల్వేస్ వంటి సర్వీస్ సంస్థలు మొదలైన వాటికి కొత్త అవకాశాలు లభించగలవని వైష్ణవ్ చెప్పారు. త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి.. స్పేస్ టెక్నాలజీ రంగంలో పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించాలని, నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు వేగవంతమయ్యేలా చూడాలని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిబంధనలను సరి చేయాలని స్పేస్ సంస్థలు కోరాయి. తక్కువ వ్యయాల భారంతో రుణాలు లభించేలా తోడ్పాటు అందించాలని స్టార్టప్ సంస్థలు, చిన్న.. మధ్య తరహా కంపెనీలు ప్రధానికి విజ్ఞప్తి చేశాయి. ‘చాలా మటుకు అనుమతుల ప్రక్రియలు మందకొడిగా సాగుతున్నాయి. అనుమతులు లభించడానికి ఏడాదిన్నర పైగా పట్టేస్తోంది. మీరు వ్యక్తిగతంగా ఈ రంగాన్ని పర్యవేక్షించాలని కోరుతున్నాం. పురోగతి నివేదికలను ఎప్పటికప్పుడు మీరు పరిశీలిస్తుంటే, పనులు వేగవంతంగా జరిగే అవకాశం ఉంది‘ అని ప్రధానితో ఆన్లైన్లో పరిశ్రమ వర్గాలు నిర్వహించిన చర్చల సందర్భంగా భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తదితరులు కోరారు. దిగ్గజాలకు సభ్యత్వం.. ఐఎస్‌పీఏ తొలి చైర్మన్‌గా ఎల్అండ్టీ నెక్సŠట్ సీనియర్ ఈవీపీ జయంత్ పాటిల్ చైర్మన్‌గాను, భారతి ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వత్స్ వైస్ చైర్మన్‌గాను వ్యవహరిస్తారు. అంతరిక్ష, శాటిలైట్ టెక్నాలజీ దిగ్గజాలు లార్సన్ అండ్ టూబ్రో, భారతి ఎయిర్టెల్, నెల్కో (టాటా గ్రూప్), మ్యాప్‌మైఇండియా, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్, వన్‌వెబ్, అనంత్ టెక్నాలజీ మొదలైనవి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి. గోద్రెజ్, బీఈఎల్ తదితర సంస్థలకు సభ్యత్వం ఉంది. -
టెలికం కంపెనీలకు కేంద్రం భారీ ఊరట!
న్యూఢిల్లీ: దాదాపు రూ. 40,000 కోట్ల వసూళ్ల వివాదాలకు సంబంధించి టెలికం కంపెనీలపై దాఖలు చేసిన లీగల్ కేసులను ఉపసంహరించుకోవాలని టెలికం శాఖ (డాట్) యోచిస్తోంది. ఇందులో భాగంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై కేసు విషయంలో ప్రస్తుత అప్పీలును కొనసాగించాలా లేదా అన్న దానిపై తగు నిర్ణయం తీసుకునేందుకు అవకాశమివ్వాలంటూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టెల్కోలు సంక్షోభంలో కూరుకుపోతే బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తమకు విజ్ఞప్తి పంపిందని అఫిడవిట్లో డాట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్పీళ్లపై ముందుకెళ్లే విషయాన్ని పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని వివరించింది. కేసు విచారణ సదర్భంగా ఇదే విషయాన్ని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోవలసిందని సూచిస్తూ, కేసు విచారణను నవంబర్ 17కు ధర్మాసనం వాయిదా వేసింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా వివిధ స్థాయుల్లో అప్పీళ్లపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని అఫిడవిట్లో పేర్కొంది. సముచిత నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి మూడు వారాల వ్యవధినివ్వాలని, కేసును నాలుగు వారాల పాటు వాయిదా వేయాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం వివిధ టెలికం ఆపరేటర్ల నుంచి ఈ కేసుల ద్వారా ఖజానాకు సుమారు రూ. 40,000 కోట్లు రావాల్సి ఉంది. టెలికం రంగాన్ని ఆదుకునే దిశగా బకాయిలు, పెనాల్టీలు చెల్లించడానికి సమయమిస్తూ సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వం ఉపశమన ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో టెల్కోలపై ఉన్న కేసులను కూడా ఉపసంహరించే యోచన చేయడమనేది గత సమస్యలను సరిచేసే ప్రయత్నంలో భాగంగా చూడవచ్చని న్యాయసేవల సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ సమీర్ చుగ్ అభిప్రాయపడ్డారు. -
జియో నుంచి ఎయిర్‌టెల్‌కు రూ.1,005 కోట్లు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌తో ఒప్పందం పూర్తి చేసుకున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా మూడు సర్కిళ్లలో ఎయిర్టెల్ ఆధీనంలో ఉన్న 800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునే హక్కులు రిలయన్స్ జియోకు లభించినట్టు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ఇందుకు సంబంధించి రూ.1,005 కోట్లను అందుకున్నట్టు పేర్కొంది. అలాగే, ఈ స్పెక్ట్రమ్‌కు సంబంధించి భవిష్యత్తులో రూ.469 కోట్ల చెల్లింపుల బాధ్యత కూడా జియోపై ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో జియోకు ఎయిర్టెల్ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునే అవకాశం లభించినట్టయింది. ఈ రెండు సంస్థలు ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించడం గమనార్హం. 800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ వల్ల జియో నెట్వర్క్ యూజర్లకు ఇండోర్ (భవనాల్లోపల) కవరేజీ మెరుగుపడనుంది. -
ఎయిర్టెల్, జియో మధ్య ముగిసిన భారీ డీల్..!
టెలికమ్యూనికేషన్స్ దిగ్గజాలు ఎయిర్టెల్, రిలయన్స్ జియోల మధ్య కీలక ఒప్పందం ముగిసింది. టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మూడు సర్కిల్స్‌లో 800 Mhz ఎయిర్‌వేవ్‌ల(స్పెక్ట్రమ్)ను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు విక్రయించే ఒప్పందం నేటితో ముగిసింది. రెండు దిగ్గజ టెలికాం ప్రత్యర్థుల మధ్య డీల్ జరగడం ఇదే మొదటిసారి. స్టాక్ ఎక్స్ఛేంజీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎయిర్టెల్ తన మూడు సర్కిల్లలోని 800 MHz స్పెక్ట్రంను బదిలీ చేయడానికి రిలయన్స్ జియోతో తన వాణిజ్య ఒప్పందాన్ని ముగిసినట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లోని ఎయిర్టెల్ 800Mhz స్పెక్ట్రమ్‌ను జియో పొందనుంది. ఒప్పందం ప్రకారం జియో ఎయిర్‌టెల్‌కు సుమారు రూ. 1004.8 కోట్లను ముట్టచెప్పింది. అంతేకాకుండా జియో అదనంగా స్పెక్ట్రమ్ బాధ్యతలు చేపట్టడానికి సుమారు రూ. 469. 3 కోట్లను ఎయిర్‌టెల్‌కు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఎయిర్టెల్ తన 800 Mhz స్పెక్ట్రంను రిలయన్స్ జియోకు విక్రయించడానికి ఒక ట్రేడింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రెగ్యులేటరీ చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్‌లో 3.75 Mhz, ఢిల్లీలో 1.25 Mhz ముంబైలో 2.5 Mhz బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను విక్రయించడానికి జియోకు ఆఫర్‌చేసింది. -
జియోకి స్పెక్ట్రమ్ అమ్మేసిన ఎయిర్టెల్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తాజాగా కొన్ని సర్కిళ్లలో మరో టెల్కో భారతీ ఎయిర్టెల్ స్పెక్ట్రంలో కొంత భాగాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో ఎయిర్‌టెల్‌కి ఉన్న 800 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంలో కొంత భాగాన్ని కొనుగోలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్‌టెల్‌కు జియో సుమారు రూ.1,038 కోట్లు చెల్లిస్తుంది. అలాగే సదరు స్పెక్ట్రంనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.459 కోట్లు కూడా చెల్లిస్తుంది. ‘800 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 3.75 మెగా హెర్ట్జ్, ఢిల్లీలో 1.25 మెగా హెర్ట్జ్, ముంబైలో 2.50 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రంను వినియోగించుకునే హక్కులను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు బదలాయించేందుకు ఒప్పందం కుదిరింది‘ అని ఎయిర్టెల్ తెలిపింది. దీనికి నియంత్రణ సంస్థల అనుమతి రావాల్సి ఉంటుంది. ట్రాయ్ గణాంకాల ప్రకారం 2021 జనవరి నాటికి 41.07 కోట్ల యూజర్లతో జియో అగ్రస్థానంలో ఉండగా, 34.46 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్‌తో ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉంది. చదవండి: చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే! -
ముగిసిన స్పెక్ట్రం వేలం.. టాప్‌లో జియో
సాక్షి, ఢిల్లీ: రెండు రోజుల పాటు సాగిన టెలికం స్పెక్ట్రం వేలం మంగళవారం ముగిసింది. టెలికం సంస్థలు.. వివిధ బ్యాండ్లలో 855.60 మెగాహెట్జ్ పరిమాణం స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. దీని విలువ సుమారు రూ. 77,815 కోట్లని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు. రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 57,123 కోట్ల విలువ చేసే స్పెక్ట్రం, భారతీ ఎయిర్టెల్ రూ. 18,699 కోట్ల స్పెక్ట్రం కొనుగోలు చేశాయి. వొడాఫోన్ ఐడియా అయిదు సర్కిళ్లలో స్పెక్ట్రం దక్కించుకుంది. దీని విలువ రూ. 1,993.40 కోట్లని అన్షు ప్రకాష్ తెలిపారు. వేలానికి ఉంచిన స్పెక్ట్రంలో దాదాపు 60 శాతం అమ్ముడైందని, చాలా మటుకు బిడ్లు కనీస రేటుకే దాఖలయ్యాయని పేర్కొన్నారు. ఇక గత వేలంలో అమ్ముడు కాని 700 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంపై టెల్కోలు ఈసారి కూడా ఆసక్తి చూపలేదు. బేస్ రేటు భారీగా ఉందనే అభిప్రాయమే ఇందుకు కారణం. 2500 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రం కూడా అమ్ముడు కాలేదు. (భారీగా పెరిగిన అదానీ, అంబానీల సంపద) మెరుగైన కవరేజీకి ఉపయోగకరం.. 5జీ సర్వీసులకు కూడా ఉపయోగపడేలా తాము 488.35 మెగాహెట్జ్ స్పెక్ట్రం తీసుకున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. దేశీయంగా డిజిటల్ సేవలను మరింతగా విస్తరించేందుకు ఇది తోడ్పడగలదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు, వివిధ బ్యాండ్లలో 355.45 మెగాహెట్జ్ పరిమాణంలో స్పెక్ట్రంను కొనుగోలు చేసినట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కవరేజీని మెరుగుపర్చుకునేందుకు, భవిష్యత్‌లో 5జీ సేవలు అందించేందుకు కూడా ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. ‘3.5 గిగాహెట్జ్ బ్యాండ్‌తో పాటు 700 మెగాహెట్జ్ బ్యాండ్ కూడా కలిస్తే టాప్ డిజిటల్ దేశాల్లో ఒకటిగా భారత్ కూడా ఎదగవచ్చు. కాబట్టి ఈ బ్యాండ్ల రిజర్వ్ ధర సముచితంగా ఉండేలా చూడటంపై సత్వరం దృష్టి సారించాలి‘ అని తెలిపింది. మరోవైపు, తమ కంపెనీల విలీనానంతరం కొన్ని సర్కిళ్లలో సర్వీసులను మెరుగుపర్చుకోవడానికి అవసరమైన స్పెక్ట్రంను సమకూర్చుకునేందుకు ఈసారి వేలాన్ని ఉపయోగించుకున్నట్లు వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) తెలిపింది. టెలికం రంగం 5జీ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో దానికి అవసరమయ్యే స్పెక్ట్రం .. సముచిత రేటుకే అం దుబాటులోకి రాగలదని ఆశిస్తున్నట్లు పేర్కొంది. (పెట్రో భారం : త్వరలోనే శుభవార్త?!) -
స్పెక్ట్రం బిడ్డింగ్‌కు రూ. 13,475 కోట్ల డిపాజిట్
న్యూఢిల్లీ: రాబోయే విడత స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు టెలికం సంస్థలు మొత్తం రూ. 13,475 కోట్ల డిపాజిట్ (ఈఎండీ) సమర్పించాయి. రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 10,000 కోట్లు, భారతి ఎయిర్టెల్ రూ. 3,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 475 కోట్ల ఈఎండీ ఇచ్చాయి. టెలికం శాఖ (డాట్) గురువారం ఈ వివరాలు వెల్లడించింది. మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే స్పెక్ట్రం వేలం నిబంధనల ప్రకారం దీని ఆధారంగానే నిర్దిష్ట పరిమాణం స్పెక్ట్రం కోసం పోటీపడేందుకు అనుమతిస్తారు. మొత్తం అన్ని స్పెక్ట్రం బ్లాకుల కోసం బిడ్ చేయాలంటే రూ. 48,141 కోట్ల ఈఎండీ చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే వేలంలో పెద్దయెత్తున స్పెక్ట్రం అమ్ముడు కాకపోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
మార్చి నుంచి స్పెక్ట్రం వేలం
న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్లు ఎదురుచూస్తున్న స్పెక్ట్రం వేలం నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మార్చి 1 నుంచి ఆరో విడత వేలం నిర్వహించనున్నట్లు టెలికం శాఖ ఒక నోటీసులో పేర్కొంది. జనవరి 12న ప్రీ–బిడ్డింగ్ సమావేశం నిర్వహించనుండగా, నోటీసులోని అంశాలపై సందేహాలు నివృత్తి చేసుకునేందుకు జనవరి 28 ఆఖరు తేదీగా ఉంటుందని తెలిపింది. వేలంలో పాల్గొనేందుకు ఫిబ్రవరి 5లోగా టెలికం ఆపరేటర్లు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 24న బిడ్డర్ల తుది జాబితా ప్రకటిస్తారు. రూ. 3.92 లక్షల కోట్ల విలువ చేసే 2,251.25 మెగాహెట్జ్ పరిమాణం స్పెక్ట్రంను ప్రభుత్వం వేలం వేయనుంది. 700 మెగాహెట్జ్, 800, 900, 2,100, 2,300, 2,500 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు వీటిలో ఉంటాయి. నాలుగేళ్ల విరామం తర్వాత.. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత స్పెక్ట్రం వేలాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బేస్ ధరను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రెండేళ్ల క్రితమే సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర క్యాబినెట్ గతేడాది డిసెంబర్ 17న ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం నిర్వహించబోయే వేలంలో 5జీ సేవల కోసం ఉపయోగించే 3,300–3,600 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌ను చేర్చలేదు. దేశవ్యాప్తంగా ప్రీమియం 700 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రం కోసం బిడ్డర్లు కనీసం రూ. 32,905 కోట్లు చెల్లించాల్సి రానుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో స్పెక్ట్రం వేలానికి ఒక మోస్తరుగానే స్పందన ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.30,000–రూ.60,000 కోట్ల శ్రేణిలో బిడ్లు రావొచ్చని పేర్కొన్నాయి. 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో రూ.30,000 కోట్లకు మాత్రమే బిడ్లు పరిమితం కావొచ్చనేది జేఎం ఫైనాన్షియల్స్ అంచనా. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రకారం.. రూ. 55,000–రూ. 60,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చు. నిబంధనలిలా.. మొత్తం 22 టెలికం సర్కిళ్లలో 700 మెగాహెట్జ్ బ్యాండ్, 800, 2,300 మెగాహెట్జ్ బ్యాండ్‌ను వేలం వేయనున్నారు. మిగతా ఫ్రీక్వెన్సీల్లో స్పెక్ట్రంను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేయనున్నారు. ముందస్తుగా పూర్తి చెల్లింపులు జరిపేందుకు సిద్ధపడే బిడ్డర్లు .. ఫలితాలు వెల్లడైన 10 రోజుల్లోగా కట్టేయాల్సి ఉంటుంది. ఒకవేళ విడతలవారీగా చెల్లించే విధానాన్ని ఎంచుకుంటే బ్యాండ్ ఫ్రీక్వెన్సీని బట్టి బిడ్డింగ్ మొత్తంలో నిర్దేశిత శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 1800, 2,100, 2,300, 2,500 మెగాహెట్జ్ బ్యాండ్లకు సంబంధించి 50 శాతం కట్టాలి. 700, 800, 900 మెగాహెట్జ్ బ్యాండ్ల కోసం 25 శాతం చెల్లించాలి. టెలికం శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసిన పది రోజుల్లోగా చెల్లింపులు జరపాలి. బిడ్డింగ్ మొత్తంతో పాటు సవరించిన స్థూల ఆదాయంపై (వైర్‌లైన్ సేవలు మినహా) మూడు శాతాన్ని స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద కట్టాల్సి ఉంటుంది. కొన్ని సర్కిళ్లలో వొడాఫోన్ దూరం.. తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా .. కొన్ని సర్కిళ్లలో వేలం ప్రక్రియలో పాల్గొనపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్పెక్ట్రం వినియోగ హక్కులను పునరుద్ధరించుకోవడంపై టెలికం కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టొచ్చని పేర్కొన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌కు సంబంధించి 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 12.4 మెగాహెట్జ్ పరిమాణం, 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 47 మెగాహెట్జ్ పరిమాణం, ప్రస్తుతం 800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో రిలయన్స్ జియో ఉపయోగించుకుంటున్న 44 మెగాహెట్జ్ స్పెక్ట్రం రెన్యువల్‌కు రానున్నాయి. వొడాఫోన్ ఐడియా 900, 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రంను పునరుద్ధరించుకోవాల్సి ఉంది. ఈ రెన్యువల్స్ కోసం భారతీ ఎయిర్టెల్ సుమారు రూ. 15,000 కోట్లు, రిలయన్స్ జియో రూ. 11,500 కోట్లు వెచ్చించాల్సి రావొచ్చని క్రెడిట్ సూసీ అంచనా వేస్తోంది. -
స్పెక్ట్రమ్ వేలానికి సై!
న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో భారీ స్థాయి స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో మరో రౌండ్ స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ బిడ్డింగ్ ద్వారా 2,251.25 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను విక్రయించనున్నారు. ఈ మొత్తం స్పెక్ట్రమ్ కనీస వేలం ధర (బేస్ ప్రైస్) రూ.3.92 లక్షల కోట్లుగా అంచనా. ఈ నెలలోనే దరఖాస్తుల ఆహ్వానానికి ప్రకటన జారీ చేస్తామని, బిడ్డింగ్ మార్చిలో నిర్వహిస్తామని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేబినెట్ సమావేశం అనంతరం వెల్లడించారు. కాగా, 5జీ సేవల కోసం నిర్దేశించిన 3,300–3,600 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ ్రïఫీక్వెన్సీలను మాత్రం ఈ తాజా వేలంలో విక్రయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ‘‘700, 800, 900, 2100, 2300, 2500 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ ఫ్రీక్వెన్సీల్లో 2,251.25 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వేలంలో అందుబాటులో ఉంటుంది. మొత్తం 20 ఏళ్ల వ్యవధికి గాను ఈ బిడ్డింగ్‌లో స్పెక్ట్రమ్‌ను దక్కించుకోవచ్చు. బేస్/రిజర్వ్ ధర ప్రకారం ఇప్పుడు వేలం వేయనున్న స్పెక్ట్రమ్ విలువ రూ.3,92,332.70 కోట్లు’’ అని ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది. ప్రస్తుతానికి 5జీ వేలం లేనట్టే...! 5జీ సేవలకు ఉద్దేశించిన స్పెక్ట్రమ్‌తో పాటు మొత్తం రూ.5.22 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ వేలం ప్రణాళికలకు టెలికం శాఖ (డాట్)కు చెందిన అత్యున్నత సంస్థ అయిన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఈ ఏడాది మే నెలలోనే లైన్ క్లియర్ చేసింది. అయితే, 5జీ సేవల కోసం నిర్దేశించిన స్పెక్ట్రమ్‌లో 300 మెగాహెట్జ్‌ను నేవీ ఉపయోగించుకుంటోంది, అలాగే భారత అంతరిక్ష విభాగం కూడా ఈ 5జీ స్పెక్ట్రమ్‌లో పెద్దమొత్తాన్ని తమకు కావాలని కోరింది. మరోపక్క, టెలికం పరిశ్రమ కూడా 5జీ స్పెకŠట్రమ్ బేస్ ధరను ప్రభుత్వం తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ వస్తోంది. 5జీ సేవల కోసం అవసరమైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయడానికి ఒక్కో టెలికం ఆపరేటర్ దాదాపుగా రూ.50,000 కోట్లు వెచ్చించాల్సి వస్తుందనేది కంపెనీల వాదన. అయితే, 5జీ స్పెక్ట్రమ్ వేలం పరిస్థితిపై అడిగిన ప్రశ్నలకు మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమివ్వలేదు. రానున్న వేలంలో కూడా చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం 2016లో నిర్ధేశించిన నిబంధనలనే కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు. చైనా టెలికం పరికరాలకు చెక్ చైనా నుంచి దేశంలోకి దిగుమతయ్యే టెలికం పరికరాలకు మరింతగా అడ్డుకట్ట వేసేవిధంగా కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. టెలికం మౌలిక వసతుల భద్రతను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా, ‘‘నమ్మకమైన విక్రేత (సోర్స్)’’ నుంచి మాత్రమే దేశీ టెలికం సేవల సంస్థలు తమకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారత జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని టెలికం రంగానికి సంబంధించిన జాతీయ భద్రత నిబంధనలను రూపొందించినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఈ నిబంధనల ప్రకారం... దేశీ టెలికం నెట్‌వర్క్‌లో ఉపయోగించదగిన నమ్మకమైన విక్రేతలు అలాగే పరికరాల జాబితాను డాట్ ప్రకటిస్తుంది. ‘‘డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని కమిటీ ఈ నమ్మకమైన సోర్స్ అలాగే ఉత్పత్తుల జాబితాను రూపొందిస్తుంది. ఆయా సంస్థలు, పరికరాలను మాత్రమే ఇకపై దేశీ టెల్కోలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ‘టెలికం రంగంలో జాతీయ భద్రత కమిటీ’గా వ్యవహరించే ఈ బృందంలో సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన సభ్యులతో పాటు టెలికం పరిశ్రమ, స్వతంత్ర నిపుణుల నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటారు’ అని రవిశంకర్ ప్రసాద్ వివరించారు. నెట్‌వర్క్‌లలో ఇప్పటికే వినియోగిస్తున్న పరికరాలకు తాజా నిబంధన వర్తించదని, వాటిని మార్చాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఖజానాకు దండిగా నిధులు... వేలంలో స్పెక్ట్రమ్‌ను దక్కించుకునే టెలికం ఆపరేటర్లు తమ బిడ్ ధరతో పాటు ఏటా ప్రభుత్వానికి తమ సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)లో 3 శాతం వాటాను స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. వైర్‌లైన్ సేవల ఆదాయాన్ని మినహాయించి ఏజీఆర్‌ను లెక్కగడతారు. ‘‘స్పెక్ట్రమ్‌లో విజయవంతమైన బిడ్డర్లు తమ బిడ్ మొత్తాన్ని ఒకే విడతలో ముందుగానే చెల్లించవచ్చు లేదా కొంత మొత్తాన్ని (700, 800, 900 మెగాహెట్జ్ బ్యాండ్లలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌కు బిడ్ ధరలో 25%; 1800, 2100, 2300, 2500 మెగాహెట్జ్ బ్యాండ్లలో అయితే 50%) ముందుగా చెల్లించి, మిగతా మొత్తాన్ని గరిష్టంగా 16 సమాన వార్షిక వాయిదాల్లో (రెండేళ్ల మారటోరియం తర్వాత నుంచి) చెల్లించేందుకు వీలుంటుంది’’ అని ప్రభుత్వ అధికార ప్రకటన వివరించింది. చక్కెర పరిశ్రమకు 3,500 కోట్లు్.. చెరకు రైతులకు బకాయిలను చెల్లించేందుకు వీలుగా చక్కెర పరిశ్రమకు ప్రభుత్వం రాయితీలను ప్రకటించింది. ప్రస్తుత 2020–21 మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర మిల్లులకు 60 లక్షల టన్నుల పంచదార ఎగుమతులపై రూ.3,500 కోట్ల సబ్సిడీకి కేంద్రంæ ఆమోదం తెలిపింది. ఈ మొత్తం నేరుగా రైతులకు చెల్లించడం జరుగుతుందని కేబినెట్ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. గడిచిన రెండు మూడేళ్లుగా చక్కెర పరిశ్రమ, అలాగే చెరుకు రైతులు కూడా అధిక దేశీ ఉత్పత్తి కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ ఏడాది కూడా వార్షిక డిమాండ్ 260 లక్షల టన్నులు కాగా, 310 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. -
5జీపై రూ. 2.3 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 5జీ సేవలందించేందుకు స్పెక్ట్రం, సైట్లు, ఫైబర్ నెట్‌వర్క్‌పై టెలికం కంపెనీలు దాదాపు రూ. 1.3–2.3 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు పెట్టాల్సి రావొచ్చని మోతీలాల్ ఓస్వాల్(ఎంవోఎఫ్ఎస్) ఒక నివేదికలో అంచనా వేసింది. ఒక్క ముంబై సర్కిల్లోనే 5జీ నెట్‌వర్క్‌పై రూ. 10,000 కోట్లు, ఢిల్లీలో రూ. 8,700 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని పేర్కొంది. మధ్య లేదా కనిష్ట స్థాయి బ్యాండ్ స్పెక్ట్రం రిజర్వ్ ధర ప్రాతిపదికన ఎంవోఎఫ్ఎస్ ఈ లెక్కలు వేసింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రిజర్వ్ ధర ప్రకారం ముంబైలో 100 మెగాహెట్జ్ మిడ్ బ్యాండ్ స్పెక్ట్రం కోసం రిజర్వ్ ధర రూ. 8,400 కోట్లుగా ఉండనుంది. మరిన్ని కంపెనీలు తీవ్రంగా పోటీపడితే బిడ్డింగ్ ధర మరింతగా పెరగవచ్చు. కవరేజీ కోసం కనీసం 9,000 సైట్లు అవసరమయిన పక్షంలో వీటిపై సుమారు రూ. 1,800 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి రావొచ్చు. దీంతో ముంబైలో 5జీ నెట్‌వర్క్‌పై వెచ్చించాల్సిన మొత్తం రూ. 10,000 కోట్ల స్థాయిలో ఉండనుంది. -
ఆ డిమాండ్ వెనక్కి తీసుకుంటాం
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల విషయంలో టెలికంయేతర ప్రభుత్వ రంగ సంస్థలకు ఊరట లభించనుంది. దాదాపు రూ. 4 లక్షల కోట్లు కట్టాలంటూ ఇచ్చిన నోటీసులో 96% మొత్తానికి డిమాండ్‌ను ఉపసంహరించుకుంటామంటూ సుప్రీం కోర్టుకు కేంద్ర టెలికం శాఖ (డాట్) తెలియజేసింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం ఫీజుల లెక్కింపునకు టెలికం కంపెనీల సవరించిన ఆదాయాలను (ఏజీఆర్) పరిగణనలోకి తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు గతేడాది అక్టోబర్‌లో ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే టెలికం సంస్థలతో పాటు స్పెక్ట్రం తీసుకున్న గెయిల్, పవర్‌గ్రిడ్, ఆయిల్ ఇండియా వంటి పీఎస్‌యూలకు రూ. 4 లక్షల కోట్ల మేర బాకీలు కట్టాలని డాట్ నోటీసులు పంపింది. తమ ప్రధాన వ్యాపారం టెలికం కార్యకలాపాలు కావు కాబట్టి తమకు ఇది వర్తించదంటూ నోటీసులను సవాలు చేస్తూ అవి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు, ఏజీఆర్ బాకీల విషయంలో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ తదితర ప్రైవేట్ టెల్కోలు దాఖలు చేసిన అఫిడవిట్లకు కౌంటరు దాఖలు చేసేందుకు మరికాస్త సమయం ఇవ్వాలంటూ సుప్రీంను డాట్ కోరింది. టెల్కోలు తమ ఆర్థిక వివరాలను సమర్పించాలని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను జూలై మూడో వారానికి వాయిదా వేసింది. -
ఎయిర్‌టెల్‌కు భారీ నష్టాలు
న్యూఢిల్లీ : టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కంపెనీకి ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌కు రూ.5,237 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. వన్‌టైమ్ స్పెక్ట్రమ్ చార్జీలకు సంబంధించి తాజా తీర్పు కారణంగా రూ.7,004 కోట్లు చెల్లించడంతో ఈ నష్టాలు ఈ స్థాయిలో పెరిగాయని కంపెనీ తెలిపింది. గత ఏడాది మార్చి క్వార్టర్లో రూ.107 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం రూ.20,602 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.23,723 కోట్లకు పెరిగింది. ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి (ఏఆర్పీయూ) రూ.123 నుంచి రూ.154కు పెరిగింది. ఈ కంపెనీ గత ఏడాది డిసెంబర్లోటెలికం సేవల ధరలను పెంచింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేర్ 2.6 శాతం నష్టంతో రూ.540 వద్ద ముగిసింది. -
టెల్కోలకు భారీ ఊరట
సాక్షి, న్యూడిల్లీ: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం కంపెనీలకు ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించింది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దీంతో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సంస్థలకు సుమారు రూ. 42,000 కోట్ల మేర ఊరట లభించనుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే. -
ఉద్యోగులకు వీఆర్ఎస్, సాహసోపేత విలీన నిర్ణయం
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనానికి ఆమోదం లభించింది. ప్రైవేటు రంగం దిగ్గజాల నుంచి పోటీ కారణంగా సంక్షోభంలో పడిపోయిన బీఎస్ఎన్ఎల్ను గట్టెక్కించేలా కేంద్ర కేబినెట్ ఎట్టకేలకు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగుల కోసం ఆకర్షణీయమైన స్వచ్ఛంద విరమణ పథకం(వీఆర్ఎస్)ప్యాకేజీ 4జీ స్పెక్ట్రం కేటాయింపులకు కూడా క్యాబినెట్ ఆమోదించింది. పునరుజ్జీవనం కోసం రూ. 15,000 కోట్లు సార్వభౌమ బాండ్ల జారీకి సూత్రప్రాయంగా ఆమోదం ఇచ్చింది. అయితే 4జీ స్పెక్ట్రం కేటాయింపు 2016 ధరల కనుగుణంగా ఉంటుందని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్‌ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. అలాగే వీటి ఆస్తుల మానిటైజ్ ద్వారా రూ.38,000 కోట్ల రూపాయల డబ్బునున ఆర్జించనున్నట్టు చెప్పారు. వీఆర్ఎస్ ప్యాకేజీని రెండు కంపెనీలకు వర్తింపచేస్తామని కేంద్రమంత్రి వివరించారు. 53 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్న ఉద్యోగి వీఆర్ఎస్ను ఎంచుకుంటే, 60 సంవత్సరాల వయస్సు వరకు జీతం, పెన్షన్, 125 శాతం గ్రాట్యుటీ అందిస్తామన్నారు. జాతీయ ప్రయోజనాలకోసం సాహసోపేతమైన పునరుద్ధరణ ప్యాకేజీతో బీఎస్ఎన్ఎల్,ఎంటీఎన్ఎల్ విలీన నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయన ఈ సంస్థలను లాభదాయకంగా మార్చడానికి రెండు సంస్థల ఉద్యోగులు తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. #Cabinet has decided to offer an attractive Voluntary Retirement plan to the employees of BSNL and MTNL. pic.twitter.com/jaAsIvByrJ — Ravi Shankar Prasad (@rsprasad) October 23, 2019 -
ఈ ఏడాదే స్పెక్ట్రం వేలం
న్యూఢిల్లీ: 5జీ సేవలకు సంబంధించి టెలికం స్పెక్ట్రం వేలాన్ని ఈ ఏడాదే నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. అలాగే వచ్చే 100 రోజుల్లో 5జీ ట్రయల్స్ కూడా ప్రారంభించాలని భావిస్తోంది. కొత్తగా టెలికం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రవి శంకర్ ప్రసాద్ సోమవారం ఈ విషయాలు తెలిపారు. ‘స్పెక్ట్రం వేలంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సులు సమర్పించింది. స్థాయీ సంఘం, ఆర్థిక కమిటీ మొదలైనవి పరిశీలిస్తున్నాయి. ఒక నిర్ణయానికొచ్చాక ప్రతిపాదన క్యాబినెట్ ముందుకొస్తుంది. ప్రస్తుతానికి తగినంత స్పెక్ట్రం అందుబాటులో ఉంది. ఈ ఏడాదే వేలం కూడా నిర్వహించవచ్చని భావిస్తున్నాను‘ అని మంత్రి తెలిపారు. 5జీ సేవలకు కూడా ఉపయోగపడే 8,644 మెగాహెట్జ్ స్పెక్ట్రంను వేలం వేయొచ్చని ట్రాయ్ సూచించింది. దీనికి మొత్తం బేస్ ధర రూ.4.9 లక్షల కోట్లుగా నిర్దేశించవచ్చని పేర్కొంది. అయితే, ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న తాము ఇంత భారీ రేటును భరించలేమంటూ టెల్కోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మార్కెట్‌ను ప్రతిబింబించే సూచీ .. 100 రోజుల్లో 5జీ సేవల ప్రయోగాత్మక పరీక్షలు ప్రారంభించడంతో పాటు దేశీయ మార్కెట్లో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే బ్రాడ్‌బ్యాండ్ సంసిద్ధత సూచీని (బీఆర్ఐ) ఏర్పాటు చేయడం కూడా మంత్రి ఎజెండాలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఇన్ఫ్రా, అనుమతుల ప్రక్రియ, హై స్పీడ్ ఇంటర్నెట్ వినియోగం తదితర అంశాలను బీఆర్ఐ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే అయిదు లక్షల వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు, దేశీయంగా టెలికం పరికరాల తయారీని ప్రోత్సహించడం వంటి వాటిపైనా దృష్టి పెట్టనున్నారు. ‘అణగారిన వర్గాల సంక్షేమానికి, విద్య .. వైద్యం వంటి వాటిని మెరుగుపర్చేందుకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సాంకేతికతను చేరువ చేసేందుకు 5జీ టెక్నాలజీని వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం‘ అని ప్రసాద్ చెప్పారు. మరోవైపు, 5జీ ట్రయల్స్‌లో చైనా కంపెనీ హువావేని కూడా అనుమతించే విషయంపై స్పందిస్తూ.. ఇది భద్రతాపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున.. మరింత లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని యన చెప్పారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయనివ్వొద్దు ఉగ్రవాదం, మతతత్వాలకు సోషల్ మీడియా వేదిక కాకూడదని రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా సైట్లు దుర్వినియోగం కాకుండా ఆయా సంస్థలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. డేటా భద్రత బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందేందుకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ఇక పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో 10 నగరాల్లో ఆధార్ సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన తెలిపారు. -
ఆర్‌కామ్ దివాలా పిటీషన్‌పై ఎన్సీఎల్ఏటీ దృష్టి
న్యూఢిల్లీ: రుణభారం పేరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) దివాలా అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దివాలా పిటీషన్‌పై విచారణ కొనసాగించాలా లేదా అన్న దానిపై తానే తుది నిర్ణయం తీసుకుంటామని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. తమకు రావాల్సిన రూ. 550 కోట్ల బాకీల కోసం స్విస్ టెలికం సంస్థ ఎరిక్సన్ గతంలో ఈ పిటీషన్ వేసింది. అయితే, ఆ తర్వాత బాకీలు వసూలు కావడంతో పిటీషన్‌ను ఉపసంహరించుకుంటామని తెలిపింది. కానీ, ఇతర రుణదాతలకు బాకీలు చెల్లింపులు జరిపే పరిస్థితుల్లో తాము లేమని, దివాలా పిటీషన్‌పై ప్రొసీడింగ్స్ కొనసాగించాలని ఎన్సీఎల్ఏటీని ఆర్‌కామ్ కోరుతోంది. ఎరిక్సన్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది. రూ.550 కోట్లు ఎరిక్సన్ తిరిగి ఇచ్చేయాలా? ఈ నేపథ్యంలో ఎన్సీఎల్ఏటీ తాజాగా సోమవారం తన అభిప్రాయం వెల్లడించింది. ఒకవేళ ఆర్‌కామ్ దివాలా ప్రక్రియకు అనుమతించిన పక్షంలో ఎరిక్సన్ తనకు దక్కిన రూ. 550 కోట్లు కూడా వాపసు చేయాల్సి ఉంటుందని ద్విసభ్య బెంచ్ చైర్మన్ జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ పేర్కొన్నారు. ‘రుణాలిచ్చిన మిగతావారందరినీ కాదని ఒక్కరే మొత్తం బాకీ సొమ్మును ఎలా తీసుకుంటారు‘ అని ప్రశ్నించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా ప్రొసీడింగ్స్ కొనసాగించడమా లేదా నిలిపివేయడమా అన్నదానిపై ఎన్సీఎల్ఏటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఎన్సీఎల్ఏటీ ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఐఎల్ఎఫ్ఎస్ 4 సంస్థల వివరాలివ్వండి.. మరో నాలుగు గ్రూప్ కంపెనీల వివరాలు సమర్పించాల్సిందిగా రుణ సంక్షోభం ఎదుర్కొంటున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. వాటిల్లో పెన్షను, ప్రావిడెంట్ ఫండ్స్ పెట్టుబడులు, వాటి రుణాల వివరాలు ఇవ్వాల్సిందిగా సూచించింది. ఉద్యోగులకు చెందాల్సిన పింఛను నిధులను తొక్కిపెట్టి ఉంచకూడదని, ఆ మొత్తాన్ని ముందుగా విడుదల చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. హజారీబాగ్ రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే, జార్ఖండ్ రోడ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కంపెనీ, మొరాదాబాద్ బరైలీ ఎక్స్‌ప్రెస్‌వే, వెస్ట్ గుజరాత్ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థలు వీటిలో ఉన్నాయి. చెల్లింపులు జరపగలిగే సామర్థ్యాలను బట్టి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలను మూడు వర్ణాలుగా వర్గీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కాషాయ వర్ణం (నిర్వహణపరమైన చెల్లింపులు జరిపే సామర్థ్యం ఉన్నవి) కింద వర్గీకరించిన నాలుగు సంస్థల విషయంలో ఎన్సీఎల్ఏటీ ఆదేశాలిచ్చింది. మొత్తం 13 కాషాయ వర్ణ సంస్థల్లో మిగతా తొమ్మిది సంస్థలు తదుపరి విచారణ తేదీ అయిన ఏప్రిల్ 16లోగా రుణాల చెల్లింపు ప్రణాళికను సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉండాలని పేర్కొంది. -
అనిల్ అంబానీని జైల్లో పెట్టండి!!
న్యూఢిల్లీ: దాదాపు 550 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడంలో పలుమార్లు విఫలమైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) చీఫ్ అనిల్ అంబానీపై స్వీడన్ టెలికం పరికరాల దిగ్గజం ఎరిక్సన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ బాకీలు చెల్లించడంలో డిఫాల్ట్ అవుతున్న ఆయన్ను కోర్టు ధిక్కరణ నేరం కింద జైలుకు పంపాలని, బాకీలు చెల్లించేదాకా దేశం విడిచి వెళ్లకుండా ఆదేశాలివ్వాలని అభ్యర్థించింది. ఈ మేరకు ఒక ఆంగ్ల ఫైనాన్షియల్ డెయిలీ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆర్‌కామ్ జరపాల్సిన చెల్లింపులకు సంబంధించి అనిల్ అంబానీ వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడంతో దీని ఆధారంగానే ఎరిక్సన్ కోర్టును ఆశ్రయించింది. మరోవైపు, స్పెక్ట్రం విక్రయాన్ని జాప్యం చేయడంపై టెలికం శాఖపై (డాట్) ఆర్‌కామ్ కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసింది. స్పెక్ట్రం విక్రయంలో డాట్ జాప్యం చేయకుండా ఉండి ఉంటే ఎరికన్స్, ఇతర రుణదాతల బకాయిలు తీర్చేసేందుకు ఉపయోగకరంగా ఉండేదని పేర్కొంది. ఈ రెండు పిటీషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది. ‘ఆర్‌కామ్‌తో పాటు తత్సంబంధిత వర్గాలు సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో తాజాగా మరో పిటిషన్ వేయాల్సి వచ్చింది. మేం చాలా కాలంగా బాకీల చెల్లింపు కోసం ఎదురుచూస్తున్నాం. కానీ వారు చెల్లించకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. కోర్టు ఆదేశాల ధిక్కరణ రుజువైన పక్షంలో ఆరు నెలల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది‘ అని ఎరిక్సన్ తరఫు న్యాయవాది అనిల్ ఖేర్ తెలిపారు. స్పెక్ట్రం విక్రయంపై ఆర్‌కామ్ ఆశలు.. ఎరిక్సన్కు రూ.550 కోట్ల బకాయిలు చెల్లించడంలో ఆర్‌కామ్ విఫలం కావడం ఇది రెండోసారి. తొలిసారి డిఫాల్ట్ అయిన తర్వాత ఆర్‌కామ్‌కు సుప్రీం కోర్టు మరో అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 15లోగా ఏటా 12 శాతం వడ్డీ రేటుతో బాకీలు చెల్లించాలని ఆదేశించింది. కానీ ఆర్‌కామ్ రెండో సారి కూడా విఫలమైంది. మరో టెలికం సంస్థ రిలయన్స్ జియోకు వైర్లెస్ స్పెక్ట్రంను విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో రుణదాతలకు బకాయిలు చెల్లించేయాలని ఆర్‌కామ్ ఆశిస్తోంది. అయితే, ఆర్‌కామ్ బాకీలకు బాధ్యత వహించడానికి జియో సిద్ధంగా లేనందున కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్పెక్ట్రం డీల్‌కు అనుమతించలేమంటూ డిసెంబర్ నెలలో టెలికం శాఖ తోసిపుచ్చింది. ఈ పరిణామాల దరిమిలా ఆర్‌కామ్, ఎరిక్సన్ వివాదం మరోమారు కోర్టుకెక్కింది. మరోవైపు, ఇరు కంపెనీల మధ్య స్పెక్ట్రం డీల్‌కు సంబంధించిన ప్రక్రియపై స్పష్టతనివ్వాలంటూ రిలయన్స్ జియో, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కలిసి కేంద్ర టెలికం శాఖకు లేఖ రాసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్పెక్ట్రంనకు సంబంధించిన బకాయీలను తీర్చే బాధ్యత ఆర్కామే తీసుకుంటోందని జియో తెలిపినట్లు వివరించాయి. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్‌తో స్పెక్ట్రం ట్రేడింగ్ ఒప్పందం కుదుర్చుకోవడానికి తాము సిద్ధమేనని జియో స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. స్పెక్ట్రం విక్రయం ద్వారా రిలయన్స్ జియో నుంచి వచ్చే రూ. 975 కోట్లలో ఎరిక్సన్కు రూ. 550 కోట్లు, మైనారిటీ వాటాదారైన రిలయన్స్ ఇన్ఫ్రాటెల్కు రూ. 230 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆర్‌కామ్ యోచిస్తోంది. వివాదమిదీ.. దేశవ్యాప్తంగా ఆర్‌కామ్ టెలికం నెట్వర్క్ నిర్వహణకు సంబంధించి 2014లో ఎరిక్సన్ ఏడేళ్ల కాంట్రాక్టు దక్కించుకుంది. అయితే, 2016 నుంచి చెల్లింపులు నిల్చిపోవడంతో సెప్టెంబర్ 2017లో ఆర్‌కామ్‌తో పాటు ఆ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ ఇన్ఫ్రాటెల్, రిలయన్స్ టెలికంలపై ఎరిక్సన్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ వేసింది. ఆర్‌కామ్ నుంచి తమకు రూ. 978 కోట్లు రావాలని, నోటీసులిచ్చినా చెల్లింపులు జరపకపోవడంతో ఇది రూ.1,600 కోట్లకు పెరిగిందని ఎరిక్సన్ పేర్కొంది. అయితే, దీనిపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆర్‌కామ్ ఆశ్రయించగా.. దివాలా చర్యలపై స్టే విధించింది. సెటిల్మెంట్ ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ ఆఖరు నాటికి ఎరిక్సన్కు రూ.550 కోట్లు కట్టాలని ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. కానీ, గడువులోగా ఆర్‌కామ్ కట్టకపోవడంతో ఎరిక్సన్ మళ్లీ కోర్టుకెళ్లింది. దీంతో ఈసారి న్యాయస్థానం డిసెంబర్ 15 దాకా గడువిచ్చింది. ఆర్‌కామ్ ఈసారి కూడా డిఫాల్ట్ కావడంతో ఎరిక్సన్ మళ్లీ కోర్టునాశ్రయించింది. ప్రస్తుతం ఆర్‌కామ్ రుణ భారం రూ. 46,000 కోట్ల పైచిలుకు ఉంది. అనిల్ అంబానీ ప్రణాళిక ప్రకారం రిలయన్స్ జియో తదితర సంస్థలకు ఆర్‌కామ్ అసెట్స్ విక్రయానంతరం ఇది సుమారు రూ.6,000 కోట్లకు తగ్గవచ్చని అంచనా. అయితే, స్పెక్ట్రం ట్రేడింగ్‌కు సంబంధించి టెలికం శాఖ నుంచి అనుమతులు వీటికి కీలకం. ఆర్‌కామ్ ప్రభుత్వానికి కట్టాల్సిన స్పెక్ట్రం బకాయిలకు రిలయన్స్ జియో బాధ్యత వహించడానికి ఇష్టపడకపోవడంతో.. డాట్ నుంచి అనుమతులు రావడం లేదు. న్యాయస్థానం ఆదేశాలున్నా డాట్ కావాలనే జాప్యం చేస్తోందని, దీనివల్ల తాము రుణదాతలకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోవడం వల్ల అన్ని వర్గాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్‌కామ్ వాదిస్తోంది. -
స్పెక్ట్రం డీల్ : అంబానీకి భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కాం)కు సుప్రీంకోర్ టుభారీ ఊరట కల్పించింది. సోదరుడు ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం సంస్థ జియోకు స్పెక్ట్రం అమ్మకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా జియోకు ఆస్తుల అమ్మకానికి సంబంధించిన అడ్డంకులను అత్యున్నత న్యాయస్థానం తొలగించింది. అయితే గ్యారంటీ నగదు చెల్లించిన తరువాత మాత్రమే తుది ఆమోదం లభిస్తుందంటూ నిబంధన విధించింది. డాట్ వద్ద గ్యారంటీ నగదు చెల్లించిన అనంతరం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లభిస్తుందని సుప్రీకోర్టు స్పష్టం చేసింది. సేల్కున్నఅడ్డంకులను తొలగిస్తూ సుప్రీం శుక్రారం కీలక తీర్పునిచ్చింది. రెండు రోజుల్లో 1400 కోట్ల రూపాయల కార్పొరేట్ గ్యారంటీ చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం చెల్లించిన అనంతరం వారం రోజుల్లో ఎన్వోసీ జారీ చేయాల్సిందిగా టెలికాం విభాగం (డాట్)ను సుప్రీం కోరింది. రూ.46వేల కోట్ల రుణభారం అప్పుల భారం నుంచి బయటపడేందుకు వైర్లెస్ స్పెక్ట్రం, టవర్, ఫైబర్, మీడియా కన్వర్జెన్స్ నోడ్ (ఎంసిఎన్) ఆస్తులను జియోకు విక్రయించేందుకు ఆర్‌కాం సిద్ధమైంది. సుమారు రూ.46వేల కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే వ్యూహంలో స్పెక్ట్రం ఆస్తుల అమ్మకం ఆర్‌కాంకు చాలా ముఖ్యం. -
5జీ వేలానికి ద్వితీయార్ధం మేలు: సీవోఏఐ
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో నిర్వహిస్తే శ్రేయస్కరమని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. దీనివల్ల తదుపరి తరం సర్వీసులకు ఉండే డిమాండ్, ఆదాయ అవకాశాలు మొదలైన వాటన్నింటినీ అంచనా వేసుకునేందుకు టెల్కోలకు వీలు చిక్కుతుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. అలాగే, 5జీ స్పెక్ట్రం ధర కూడా వేలం విషయంలో కీలకంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న టెలికం సంస్థలు 5జీ స్పెక్ట్రం వేలంపై ఎంత వెచ్చించగలవన్నది కూడా చూడాల్సి ఉందన్నారు. ప్రస్తుతం టెలికం పరిశ్రమ సుమారు రూ. 7.7 లక్షల కోట్ల మేర రుణభారంలో ఉంది. కొత్త సంస్థ రిలయన్స్ జియో చౌక ఆఫర్లతో పలు దిగ్గజాల ఆదాయాలు, లాభాలు గణనీయంగా పడిపోయిన సంగతి తెలిసిందే. మరింత వేగవంతమైన టెలికం సర్వీసుల కోసం ఉద్దేశించిన 5జీ టెక్నాలజీ అమల్లో అన్ని దేశాల కన్నా ముందుండాలని భారత్ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా తగు మార్గదర్శ, కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు టెలికం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగాల కార్యదర్శులతో అత్యున్నత స్థాయి కమిటీని కూడా వేసింది. సుమారు 12 బ్యాండ్లలో దాదాపు 6,000 మెగాహెట్జ్ స్పెక్ట్రంను వేలం వేయొచ్చని ఈ కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. -
స్పెషల్ బాండ్.. స్పెషల్ డైరెక్టర్!
బాండ్.. జేమ్స్‌బాండ్. 56 సంవత్సరాల బ్రాండ్ అది. 24 సినిమాల ఎంటర్టైన్మెంట్. ఎంతో మంది దర్శకులు మారిపోయారు. ఎంతో మంది నటులూ మారిపోయారు. ఆ బ్రాండ్ ఇప్పటికీ అలాగే ఉంది. బాండ్ సినిమా వస్తోందంటే యాక్షన్ సినిమా అభిమానులకు పండగే. ఇక ఈసారి వచ్చేది 25వ సినిమా కదా! కాబట్టి ఈ స్పెషల్ బాండ్ సెట్స్‌పైకి వెళ్లకముందు నుంచే రోజూ వార్తల్లో కనిపిస్తోంది. ఇంతకుముందు నేటితరం టాప్ డైరెక్టర్ క్రిస్టొఫర్ నోలన్ బాండ్ 25వ సినిమాకు డైరెక్టర్ అని వినిపించింది. ఆ తర్వాత వరుసగా టాప్ డైరెక్టర్స్ పేర్లన్నీ ఒక్కొక్కటిగా వినిపిస్తూ వచ్చాయి. ఇక ఎట్టకేలకు స్పెషల్ బాండ్ దర్శకుడు ఫిక్స్ అయిపోయాడు. ఆయనే మన డేనీ బోయల్. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘127 అవర్స్’ సినిమాలతో ఇండియన్ సినిమా అభిమానులకూ బాగా దగ్గరైన డేనీ, జేమ్స్‌బాండ్ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని స్వయంగా ప్రకటించాడు. ఇప్పుడే అసలైన చర్చ మొదలైంది. డ్రామా, థ్రిల్లర్ జానర్‌కు పెట్టింది పేరైన డేనీ బోయల్, బాండ్ లాంటి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడా అన్నది ఆసక్తికరం.ఇప్పటికే దర్శకులు మారినప్పుడల్లా బాండ్ సినిమా ప్లాట్, కోర్ ఎమోషన్, టోన్ మారిపోతూ వచ్చింది. ముఖ్యంగా స్కై ఫాల్, స్పెక్టర్ సినిమాలతో శామ్ మెండిస్ బాండ్ రూపు రేఖలనే మార్చేశాడు. దీంతో ఇప్పుడు కొత్తగా, అదీ స్పెషల్ సినిమాకు, ఈ స్పెషల్ డైరెక్టర్ డేని బోయల్ ఏ టోన్ పట్టుకొస్తాడో చూడాలి. గత నాలుగు జేమ్స్‌బాండ్ సినిమాలకు హీరో అయిన డేనియల్ క్రెయిగ్ ఈ సినిమాలోనూ నటిస్తున్నాడు. -
టెలికం కంపెనీలకు భారీ ఊరట
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న టెలికం రంగానికి ఉపశమనం కల్పించే ప్యాకేజీకి కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిన కంపెనీలు అందుకు సంబంధించిన ఫీజు చెల్లింపులకు మరింత వ్యవధి ఇవ్వడం ఇందులో ప్రధానమైంది. అలాగే, స్పెక్ట్రమ్ హోల్డింగ్ గరిష్ట పరిమితిని కూడా సరళీకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్ మంత్రిత్వ శాఖల బృందం చేసిన సిఫారసుల మేరకు ఈ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. టారిఫ్‌ల క్షీణతతో లాభాలు అడుగంటిపోయి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న టెలికం రంగంపై అధ్యయనానికి కేంద్రం పలు శాఖలతో కూడిన అధికారులతో కమిటీని గతేడాది ఏర్పాటు చేసింది. స్పెక్ట్రమ్ ఫీజుల చెల్లింపునకు 10 ఏళ్లుగా ఉన్న గడువును 15 ఏళ్లకు పెంచాలని ఈ కమిటీ సిఫారసు చేయగా దానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశీయ టెలికం రంగం ప్రస్తుతం రూ.4.6 లక్షల కోట్ల రుణభారాన్ని మోస్తోంది. చెల్లింపులకు అదనపు సమయం ఇవ్వడం వల్ల వాటికి నిధుల లభ్యత పెరుగుతుందని, స్పెక్ట్రమ్ పరిమితిని సరళీకరించడం వల్ల స్థిరత్వం ఏర్పడి భవిష్యత్తు స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
అక్టోబర్ 25న తేలనున్న స్పెక్ట్రమ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీః 2జీ స్పెక్ట్రం కేసులు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయి. ఈ కేసుల్లో తుది విచారణను సీబీఐ కోర్టు అక్టోబర్ 25న చేపట్టనుంది. స్పెక్ట్రం కేటాయింపుల కేసులో మాజీ టెలికాం మంత్రి ఏ రాజా, డీఎంకే రాజ్యసభ సభ్యులు కనిమొళి ఇతరులు నిందితులుగా ఉన్నారు. కేసులో సమర్పించిన పత్రాలు భారీగా ఉండటం, సాంకేతిక అంశాలతో ముడిపడిన క్రమంలో వీటిని ఇంకా పరిశీలించాల్సి ఉందని విచారణను వాయిదా వేస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ పేర్కొన్నారు. తదుపరి విచారణ సందర్భంగా తీర్పును ఎప్పుడు వెలువరించేదీ వెల్లడిస్తామని చెప్పారు. స్పెక్ర్టం కేసులకు సంబంధించి రెండు వేర్వేరు కేసులను కోర్టు విచారిస్తుంది. వీటిలో ఒక కేసును సీబీఐ, మరో కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు నిర్వహించాయి. ఏప్రిల్ 26న కోర్టులో ఈ కేసులపై తుది వాదనలు ముగిశాయి. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో మాజీ మంత్రి రాజా కొన్ని టెలికాం సంస్థల పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపిస్తోంది. -
క్రీడలతోనే జాతీయ సమైక్యాభివృద్ధి
గైట్‌లో ప్రారంభమైన స్పెక్ట్రా – 16 వెలుగుబంద (రాజానగరం) : క్రీడల వల్ల జాతీయ సమైక్యతాభావం వృద్ధి చెందుతుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. క్రీడాకారులకు దేశ భక్తి ఉంటేనే తాను దేశం కోసం ఆడుతున్నానన్న భావనతో ఆడతారన్నారు. స్థానిక గైట్ పాలిటెక్నిక్ కళాశాలలో సాంకేతిక, క్రీడా, సాంస్కృతిక ఉత్సవం ‘స్పెక్ట్రా–16’ ఉత్సవాలను జ్యోతిప్రజ్వలన చేసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రతి విద్యార్థి మంచి క్రీడాకారుడిగా భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలన్నారు. అందుకు తల్లిదండ్రులు కూడా చొరవచూపాలన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు వేదిక అవుతాయని విశిష్ట అతిథిగా పాల్గొన్న ఏపీ సాంకేతిక విద్య శిక్షణ బోర్డు ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు బీకే సూర్యప్రకాష్ అన్నారు. విద్యా బోధనలో జీవననైపుణ్యాలు కూడా భాగమేనన్నారు. అనంతరం స్పెక్ట్రా–16 క్రీడోత్సవాన్ని, పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన స్టాల్స్‌ని ఆయన ప్రారంభించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం తొలిసారిగా ఈ సంవత్సరం నుంచి ఉత్సవం నిర్వహిస్తున్నామని కళాశాల ఎండీ కె. శశికిరణ్‌వర్మ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు. ఏటా డిసెంబరులో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. విజేతలకు బహుమతి ప్రదానం పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. 800 మీటర్ల పరుగు పందెంలో ద్రాక్షారామ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి టి. వెంకటేష్ ప్రధమ బహుమతిని, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు వి.సుధీర్‌కుమార్, హెచ్.లక్ష్మీపతి ద్వితీయ, తృతీయ బహుమతులను కైవసం చేసుకున్నారు. కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మిశశికిరణ్, సీఈఓ డాక్టర్ డీఎల్ఎ¯ŒS రాజు, ప్రిన్సిపాళ్లు డాక్టర్ డీవీ రామ్మూర్తి, డాక్టర్ ఎస్.శ్రీనివాçసన్, డైరెక్టర్లు డాక్టర్ ఎల్ఎస్ గుప్త, కె. ఆనందరావు, డీ¯ŒS డాక్టర్ ఎం. వరప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. -
స్పెక్ట్రం ఆదాయం తగ్గుదలకు ఐడీఎస్తో చెక్
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... న్యూఢిల్లీ: నల్లధనం అడ్డుకట్ట కోసం స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) ద్వారా సమీకరించిన పన్నుల ద్వారా స్పెక్ట్రం వేలం ఆదాయంలో తగ్గుదలను కొంతమేరకు పూడ్చుకోనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. సోమవారమిక్కడ ఒక వార్తా చానల్‌తో మాట్లాడుతూ ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. నాలుగు నెలలపాటు అమలు చేసిన ఐడీఎస్(సెప్టెంబర్ 30తో ముగిసింది) ద్వారా సుమారు రూ.62,250 కోట్ల విలువైన నల్లధనం వ్యవస్థలోకి వచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల ఖజానాకు పన్నుల రూపంలో రూ.29,362 కోట్లు లభించనున్నాయని, ఇందులో సగం మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలోనే సమకూరనుందని అంచనా. అయితే, గతవారంలో ముగిసిన అతిపెద్ద స్పెక్ట్రం వేలంలో ప్రభుత్వం అంచనాలు తలకిందులయ్యాయి. దాదాపు రూ.5.6 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రంను వేలానికి ఉంచగా.. కేవలం రూ.65,789 కోట్లకు మాత్రమే టెలికం కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో ఈ ఏడాది(2016-17) రూ.37,000 కోట్లు ప్రభుత్వానికి లభించనున్నాయి. ఒక్క 700 మెగాహెర్ట్జ్ ప్రీమియం బ్యాండ్‌విడ్త్ విభాగం వేలంలో టెల్కోలు ముఖం చాటేసినప్పటికీ... ఇతర బ్యాండ్‌విడ్త్‌లలో స్పెక్ట్రం అమ్మకం ఆదాయం రికార్డు స్థాయిలోనే నమోదైందని జైట్లీ పేర్కొన్నారు. ‘ఈ ఏడాది ద్రవ్యలోటు కట్టడి విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకావని భావిస్తున్నా. ఎందుకంటే స్పెక్ట్రం ఆదాయం అంచనాల కంటే తగ్గినప్పటికీ.. ఐడీఎస్ రూపంలో ప్రస్తుత, వచ్చే ఏడాది లభించనున్న పన్నుల ఆదాయం దీనికి కొంత తోడ్పాటును అందించనుంది. కేంద్రంలో మా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో నల్లధనం కట్టడికి అనేక చర్యలు తీసుకున్నాం. అసలు మా సర్కారు కొలువుదీరిన వెంటనే దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్)ను ఏర్పాటు చేస్తూ తొలి నిర్ణయం తీసుకున్నాం కూడా’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 1 నుంచే జీఎస్టీ అమల్లోకి... కీలకమైన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ నెల 18-20 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదిత పన్ను రేట్లు, బ్యాండ్స్(పరిమిత శ్రేణులు)పై చర్చించనుందని కూడా ఆయన తెలిపారు. డిజిన్వెస్ట్‌మెంట్ జోరు... ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ ఆదాయం ఇదివరకెన్నడూ లేనంత స్థాయిలో లభించనుందని జైట్లీ చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల షేర్ల బైబ్యాక్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే భారీ మొత్తమే ఖజానాకు జమకానుందన్నారు. ఇక బ్యాంకుల మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్య పరిష్కారానికి చర్యలు జోరందుకున్నాయని వెల్లడించారు. ఇప్పటికే బ్యాంకులు రంగంలోకి దిగాయని, ఆర్బీఐ కూడా కొన్ని కీలక చర్యలు(కంపెనీలను అధీనంలోకి తీసుకోవడం ఇతరత్రా) చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సమస్య అడ్డుకట్టకు ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలను కూడా సవరించిందని తెలిపారు. -
ఎయిర్‌టెల్‌కు 173.8 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్
• రూ.14,244 కోట్ల వ్యయం • ఐడియా సెల్యులార్కు రూ.12,798 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ న్యూఢిల్లీ: టెలికం శాఖ నిర్వహిస్తున్న స్పెక్ట్రమ్ వేలంలో భారతీ ఎయిర్టెల్ 173.8 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది. దీని విలువ రూ.14,244 కోట్లని ఎయిర్టెల్ గురువారం వెల్లడించింది. వచ్చే 20 ఏళ్ల కాలానికి సరిపడా స్పెక్ట్రమ్‌ను తాము సొంతం చేసుకున్నామని, అన్ని సర్కిళ్లలో తాము 3జీ, 4జీ సర్వీసులకు స్పెక్ట్రమ్ కలిగి ఉన్నామని తెలిపింది. ఈ స్పెక్ట్రమ్‌ను 1800, 2100, 2300 మెగాహెర్జ్ బ్యాండ్లలో ఎయిర్టెల్ సొంతం చేసుకుంది. ఐడియా సెల్యులార్ సైతం రూ.12,798 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను తాజా వేలంలో సొంతం చేసుకుంది. మరోవైపు టెలికం శాఖ స్పెక్ట్రమ్ వేలం గురువారంతో ఐదు రోజుకు చేరుకుంది. మొత్తం 26 రౌండ్లకు గాను రూ.66 వేల కోట్ల విలువైన బిడ్లు దాఖల య్యాయి. ప్రభుత్వం 2,354.55 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీలను వేలానికి ఉంచగా... ఇప్పటి వరకు 960 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీల స్పెక్ట్రమ్ కోసం బిడ్లు వచ్చినట్టు అధికారిక వర్గాల సమాచారం. ప్రస్తుత వేలంలో 4జీ సర్వీసులకు అనుకూలించే 1800, 2300 మెగాహెర్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్ కోసం టెలికం కంపెనీల నుంచి అధిక స్పందన ఉంది. 3జీ/4జీ సర్వీలకు ఉపకరించే 2100 మెగాహెర్జ్, 4జీ సర్వీలకు అనుకూలించే 2500 మెగాహెర్జ్, 2జీ/4జీ సేవలకు వీలు కల్పించే 800 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌లకు కూడా స్పందన ఫర్వాలేదు. అత్యంత ఖరీదైన 700 మెగాహెర్జ్తోపాటు 900 మెగాహెర్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్‌కు కంపెనీలు దూరంగా ఉన్నాయి. వీటి రిజర్వ్ ధర (రూ.4 లక్షల కోట్లు) చాలా ఎక్కువ స్థాయిలో ఉందని, ఇది తమకు అనుకూలం కాదని ఎయిర్టెల్ తెలిపింది. -
700, 900 బ్యాండ్లలో ఒక్క బిడ్ రాలేదు
స్పెక్ట్రమ్ వేలం రెండో రోజు పలు సర్కిళ్లలో అధిక స్పందన న్యూఢిల్లీ: కేంద్ర టెలికం శాఖ నిర్వహిస్తున్న స్పెక్ట్రమ్ వేలంలో రెండో రోజైన సోమవారం ముంబై, రాజస్తాన్, గుజరాత్ సర్కిళ్లలో అధిక బిడ్లు దాఖలు అయ్యాయి. అత్యంత ఖరీదైన 700 మెగాహెడ్జ్‌తోపాటు 900 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో ఇంత వరకు ఒక్క బిడ్ కూడా నమోదు కాలేదు. మొదటి రెండు రోజుల్లో మూడు రౌండ్ల వేలం పూర్తయింది. ఈ నెల 1న మొదటి రోజు ఐదు మొబైల్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ కోసం రూ.53,531 కోట్ల విలువైన బిడ్లు దాఖలు అయ్యాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం రెండో రోజు వేలం కొనసాగింది. ఈ స్పెక్ట్రమ్ వేలం ఎప్పుడు ముగిసేదీ టెలికం శాఖ ఇంతవరకు ప్రకటించలేదు. అధిక ఆదరణ వీటికే..: 1800 మెగాహెడ్జ్ బ్యాండ్‌విడ్త్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌కు టెల్కోల నుంచి మంచి స్పందన వస్తోంది. మహారాష్ట్ర ముంబై సహా ఐదు సర్కిళ్లలో ఈ బ్యాండ్‌విడ్త్ కోసం అధిక బిడ్లు వచ్చాయి. అలాగే, 2300, 2100, 2500 మెగాహెడ్జ్ బ్యాండ్లకూ ఆదరణ బావున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రూ.5.63 లక్షల కోట్ల ఆదాయ అంచనాతో కేంద్రం 2,354.55 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీలను వేలానికి ఉంచింది. -
ఒక్కరోజులోనే స్పెక్ట్రమ్ వేలానికి ఇన్నికోట్లా!!
దేశంలోనే అతిపెద్ద స్పెక్ట్రమ్ వేలానికి అనూహ్య స్పందన వస్తోంది. శనివారం ప్రారంభమైన ఈ వేలం ప్రక్రియలో ఒక్కరోజులోనే రూ.53,531 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి.ప్రధాన టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, జియో, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, టాటా టెలీలు ఈ వేలంలో పాల్గొంటున్నాయి. ఏడు బ్యాండ్లలో మొత్తం 2,354.55 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ వేలానికి వచ్చింది. రూ.5.66 లక్షల కోట్లను రిజర్వ్ ధరగా కేంద్ర సర్కారు ఖరారు చేసింది.ఐదు రౌండ్లలో మొత్తం రూ.53,531 కోట్ల బిడ్స్ దాఖలైనట్టు అధికారులు వర్గాలు తెలిపాయి. 700మెగాహెడ్జ్, 900 మెగాహెడ్జ్ ప్రీక్వెన్సీలపై కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. 1800 మెగాహెడ్జ్ బ్యాండులపై ఆపరేటర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు ఐదు రౌండ్ల ముగింపు అనంతరం టెలికాం డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా 2జీ/4జీ సర్వీసులను ఆపరేటర్లు వినియోగదారులకు అందించే అవకాశముంటుంది. 2100మెగాహెడ్జ్ (3జీ/4జీ)బ్యాండ్స్, 2500మెగాహెడ్జ్(4జీ) బ్యాండ్, 2300మెగాహెడ్జ్(4జీ), 800మెగాహెడ్జ్(2జీ/4జీ) బ్యాండ్స్‌పై కూడా ఆపరేటర్లు బిడ్స్ దాఖలు చేస్తున్నట్టు టెలికాం డిపార్ట్మెంట్ పేర్కొంది. ఎక్కువ వేలం 1800మెగాహెడ్జ్ బ్యాండులో జరుగుతుందని తెలిపింది. ఢిల్లీ, ముంబాయి, కోల్కత్తా, గుజరాత్, యూపీ(ఈస్ట్/వెస్ట్)లోని మొత్తం 22 టెలికాం సర్కిళ్లలో 19 వాటిలో ఈ బ్యాండ్‌కు ఎక్కువగా బిడ్డింగ్ దాఖలైనట్టు తెలిపింది.3జీ సర్వీసుల కోసం 2100మెగాహెడ్జ్ బ్యాండుకు 9 టెలికాం సర్కిళ్లలో డిమాండ్ ఉన్నట్టు వెల్లడించింది.2300మెగాహెడ్జ్, 2500మెగాహెడ్జ్ బ్యాండులకు కూడా వివిధ సర్కిళ్లలో డిమాండ్ వస్తున్నట్టు చెప్పింది. -
స్పెక్ట్రమ్ మెగా వేలం నేటి నుంచే
-
స్పెక్ట్రమ్ మెగా వేలం నేటి నుంచే
♦ రేసులో ఏడు కంపెనీలు ♦ రిజర్వ్ ధర రూ.5.66 లక్షల కోట్లు న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే తొలిసారిగా భారీ స్థాయిలో నిర్వహిస్తున్న స్పెక్ట్రమ్ వేలం శనివారం నుంచి ప్రారంభమవుతోంది. ఏడు బ్యాండ్లలో మొత్తం 2,354.55 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ వేలానికి రానుంది. రూ.5.66 లక్షల కోట్లను రిజర్వ్ ధరగా కేంద్ర సర్కారు ఖరారు చేసింది. పాల్గొనే కంపెనీలు: భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, టాటా టెలి ధరావతు సొమ్ము: ఏడు టెలికం సంస్థలు రూ.14,653 కోట్లను ధరావతు సొమ్ము కింద జమ చేశాయి. ఓ ఆపరేటర్... తాను బిడ్ వేసే స్పెక్ట్రమ్ విలువలో సుమారు పది శాతాన్ని ధరావతు కింద జమ చేయాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) రూ.6,500 కోట్లు, వొడాఫోన్ రూ.2,740 కోట్లు, ఐడియా రూ.2,000 కోట్లు, ఎయిర్టెల్ రూ.1,980 కోట్లు జమ చేశాయి. వేలం అంతా ఆన్లైన్లోనే: వేలం ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే కొనసాగుతుంది. ఈ బాధ్యతలను ఎం-జంక్షన్ సర్వీసెస్ అనే సంస్థకు సర్కారు అప్పగించింది. ఈ వారం ప్రారంభంలో డమ్మీ వేలం నిర్వహించి అంతా సాఫీగానే ఉన్నట్టు ప్రభుత్వం నిర్ధారించుకుంది. వేలం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరుకు కొనసాగుతుంది. -
స్పెక్ట్రమ్ వేలం కోసం రూ.14,653 కోట్లు జమ
700 మెగాహెడ్జ్ బ్యాండ్‌పై కన్నేసిన జియో న్యూఢిల్లీ: అక్టోబర్ 1 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు వీలుగా టెలికం కంపెనీలు ధరావతు సొమ్మును జమ చేశాయి. అందరికంటే అధికంగా జియో రూ.6,500 కోట్లు జమ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 22 సర్కిళ్లలో ఏ సర్కిల్లో అయినా, ఏ బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం అయినా బిడ్ దాఖలు చేసే అర్హత సాధించింది. ఈ మేరకు టెలికం శాఖ సోమవారం వివరాలు వెల్లడించింది. వొడాఫోన్ ఇండియా రూ.2,740 కోట్లు, ఐడియా రూ.2,000 కోట్లు, ఎయిర్టెల్ రూ.1,980 కోట్లు జమ చేశాయి. టాటా టెలీ రూ.1,000 కోట్లు, ఆర్‌కామ్ రూ.313 కోట్లు, ఎయిర్‌సెల్ రూ.120 కోట్లు ధరావతుగా సమర్పించాయి. దేశవ్యాప్తంగా 700 మెగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం బిడ్ దాఖలు చేయాలంటే రూ.5,610 కోట్లు జమ చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఒక్క జియో మాత్రమే దేశవ్యాప్తంగా ఈ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ వేలం వేయడం దేశంలో ఇదే ప్రథమం. దేశవ్యాప్తంగా 700 మెగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ సొంతం చేసుకున్న సంస్థ రూ.57,425 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. స్పెక్ట్రమ్ వేలం ద్వారా రూ.5.63 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
కాల్ డ్రాప్స్ సమస్య తగ్గింది: కేంద్రం
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ సమస్య గడచిన రెండు నెలలుగా గణనీయంగా తగ్గిందని టెలికం మంత్రి మనోజ్ సిన్హా శుక్రవారం పేర్కొన్నారు. అయితే సేవల నాణ్యత మరింత పెరగాలని ఆపరేటర్స్‌కు ఆయన సూచించారు. లేదంటే పోటీపూర్వక మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టమని ఒక ఇంటర్వ్యూలో అన్నారు. రానున్న స్పెక్ట్రమ్ వేలం ఆపరేటర్స్‌కు మరిన్ని రేడియోవేవ్స్ అందుబాటులోకి తెస్తుందని పేర్కొన్న మంత్రి, సేవల మెరుగుదల, ఆదాయాల పెం పునకు ఇది మార్గం సుగమం చేస్తుందని వివరించారు. రానున్న మూడు-నాలుగు నెలల్లో సేవల్లో నాణ్యత మరింత మెరుగుపడుతుం దన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ దిశలో ఫలితాలను సాధించుకోడానికి కంపెనీలు రానున్న స్పెక్ట్రమ్ ఆక్షన్‌లో కంపెనీలు ఉత్సాహంగా పాల్గొంటాయన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తం చేశారు. స్పెక్ట్రమ్‌లో పాల్గొనని కంపెనీలు సేవల మెరుగుదలలో తమ లక్ష్యాలను చేరలేవని కూడా మంత్రి పేర్కొన్నారు. వచ్చే నెల నుంచీ ప్రారంభం కానున్న స్పెక్ట్రమ్ వేలం ఇప్పటివరకూ జరిగిన వేలంలో అతి భారీదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఎయిర్‌సెల్ 7 సర్కిళ్లు ఎయిర్టెల్ సొంతం
భారతీ ఎయిర్టెల్, ఎయిర్‌సెల్ కు మధ్య మొత్తం ఏడు సర్కిళ్లలో స్పెక్ట్రమ్ ట్రేడింగ్ డీల్ కుదిరింది. ఒడిశాలోని ఎయిర్‌సెల్ 4 జీ ఎయిర్వేవ్స్కు సంబంధించిన స్పెక్ట్రమ్ హక్కులను ఎయిర్టెల్ సొంతం చేసుకుంది. ఈ కొనుగోలుతో మొత్తం ఎయిర్‌సెల్ ఎనిమిది సర్కిళ్లలో ఏడింటినీ ఎయిర్‌టెలే నిర్వహించనుంది. తమిళనాడు(చెన్నైతో కలిపి), బీహార్, జమ్మూ అండ్ కశ్మీర్, పశ్చిమ బెంగాల్, అస్సాం, నార్త్ ఈస్ట్, ఒడిశా సర్కిళ్లలో పూర్తి 4జీ ఎయిర్‌వేవ్స్ హక్కులను ఎయిర్టెల్ కొనుగోలు చేసింది. గతనెలే టెలికాం సంస్థలు కుదుర్చుకోబోయే ఈ స్పెక్ట్రమ్ షేరింగ్ డీల్‌కు టెలికాం శాఖ నుంచి డీఓటీ నుంచి అనుమతి లభించింది. ఈ కొనుగోలు హక్కులతో ఎయిర్‌సెల్ కు చెందిన 20 మెగాహెడ్జ్ 2300 బ్యాండ్ బీడబ్ల్యూఏ స్పెక్ట్రమ్ హక్కులను ఎయిర్టెల్ వాడుకోనున్నట్టు బీఎస్ఈకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. ఒడిశా సర్కిల్ ప్రతిపాదన లావాదేవీలను విజయవంతంగా ముగించినట్టు ఎయిర్టెల్ తెలిపింది. స్పెక్ట్రమ్ ట్రేడింగ్ డీల్‌తో రూ.3500 కోట్లకు ఎయిర్‌సెల్ కు చెందిన ఎనిమిది సర్కిళ్ల 4జీ ఎయిర్‌వేవ్స్‌ను సొంతంచేసుకోబోతున్నామని భారతీ ఎయిర్టెల్ ఏప్రిల్ 8న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిర్టెల్, ఎయిర్‌సెల్ మధ్య జరిగిన ఈ స్పెక్ట్రమ్ డీల్ 2030 సెప్టెంబర్ 20 వరకు కొనసాగనుంది. -
సెప్టెంబర్ 29 నుంచి స్పెక్ట్రమ్ వేలం..
♦ దరఖాస్తులకు ఆహ్వానం పలికిన టెలికం శాఖ ♦ విక్రయానికి 2,354 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్ ♦ ఊపందుకోనున్న 4జీ సేవలు ♦ 700 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో తొలిసారిగా వేలం ♦ రూ.5.63 లక్షల కోట్లు వస్తాయని అంచనా న్యూఢిల్లీ : దేశ చరిత్రలో అతిపెద్ద స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 29 నుంచి వేలం ప్రారంభం కానుంది. వేలంలో భాగంగా కేంద్రం రూ.5.63 లక్షల కోట్ల ప్రాథమిక విలువతో స్పెక్ట్రమ్‌ను విక్రయానికి పెడుతోంది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కేంద్రం ప్రకటన (ఎన్ఐఏ) విడుదల చేసింది. పెద్ద మొత్తంలో స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నామని, ఫ్రాగ్మంటేషన్, సేవల్లో నాణ్యత తదితర సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుందని టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ ప్రకటన విడుదల సందర్భంగా చెప్పారు. కాగా, ప్రభుత్వం 700 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో తొలిసారిగా వాయు తరంగాలను వేలానికి ఉంచనుంది. ఒక్క ఈ బ్యాండ్ స్పెక్ట్రమ్ ద్వారానే రూ.4 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. దరఖాస్తుల ప్రక్రియపై సందేహాలు, విచారణలకు గాను టెలికం శాఖ ఈ నెల 13న సమావేశం నిర్వహించనుంది. బిడ్డింగ్ విశేషాలు... ⇔ 2,354.55 మెగాహెడ్జ్‌ల వాయు తరంగాలను ప్రభుత్వం వేలం వేయనుంది. ఈ తరంగాలు 700 మెగాహెడ్జ్, 800, 900, 1,800, 2,100, 2,300, 2,500 మెగాహెడ్జ్ బ్యాండ్లలో ఉంటాయి. ⇔ వేలానికి ఉంచే మొబైల్ రేడియో వాయు తరంగాలు అన్నీ కూడా అధిక వేగంతో కూడిన 4జీ సర్వీసులకు అనుకూలించేవి. ⇔ ఈ వేలం ద్వారా రూ.64వేల కోట్లు, వివిధ రకాల పన్నుల ద్వారా రూ.98,995 కోట్ల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమకూరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ⇔ 700, 800, 900 మెగాహెడ్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ గెలుచుకున్న కంపెనీలు బిడ్ మొత్తంలో కనీసం 25 శాతాన్ని వేలం ముగిసిన 10 రోజుల్లోపు కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల విరామం తర్వాత మిగిలిన మొత్తాన్ని 10 వార్షిక వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన బ్యాండ్లలో స్పెక్ట్రమ్ విజేతలు బిడ్ మొత్తంలో 50 శాతాన్ని వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. ⇔ టెలికం కంపెనీల అభ్యర్థన మేరకు కేంద్రం వాయిదా చెల్లింపులపై వడ్డీని 10 శాతం నుంచి 9.3 శాతానికి తగ్గించింది. వేలం ప్రక్రియ ఆగస్ట్ 13: దరఖాస్తుల ప్రక్రియపై సమావేశం ఆగస్ట్ 29: వేలంపై సందేహాలను తీరుస్తూ వివరణ సెప్టెంబర్ 13: దరఖాస్తుల సమర్పణకు గడువు. కంపెనీలకు ఇదో అవకాశం భారీ స్పెక్ట్రమ్ వేలం కావడం, నిబంధనలను అనుకూలంగా మార్చడంతో బిడ్డర్ల నుంచి అనూహ్య స్పందన రానుంది. గతంలో నిర్వహించిన ఏ వేలం ప్రక్రియలోనూ ఇంత భారీ పరిమాణంలో స్పెక్ట్రమ్‌ను వేలానికి ఉంచలేదు. వేలంలో పాల్గొని అధిక మొత్తంలో స్పెక్ట్రమ్‌ను గెలుచుకోవడంతో అంతర్జాతీయ స్థాయి నాణ్యత సేవలను అందించే అవకాశం లభిస్తుంది. - జేఎస్ దీపక్, టెలికం శాఖ కార్యదర్శి -
టెలినార్ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన కూడదని ప్రముఖ టెలికాం సంస్థ టెలినార్ నిర్ణయించింది. త్వరలో జరగబోయే ఈ వేలంలో పాల్గొనడం లేదని ఒక ప్రకనటలో వెల్లడించింది. ప్రస్తుత ప్రతిపాదిత స్పెక్ట్రం ధరలు తమకు ఆమోదయోగ్య లేవని, వేలం కోసం ప్రతిపాదించిన కనీస ధరలు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని టెలినార్ గ్రూప్ సీఈవో సిగ్వే బ్రెక్కి తెలిపారు. సంస్థ ఆర్థిక ఫలితాల వెల్లడించిన సందర్భంగా ఆయన ఈ వివరణ ఇచ్చారు. భారతదేశంలో ప్రస్తుతం ఏడు సెక్టార్స్‌లో 1800 ఎంహెచ్ జెడ్ బ్యాండ్ లో 4జీ ప్రసారాలు ఉన్నా, వాటిలో ఆరు రాష్ట్రాల్లో 2 జి సేవలను అందిస్తున్నామని తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ , బీహార్, గుజరాత్, మహారాష్ట్రలో2 జీ సేవలు అందిస్తుండగా అస్సాంలో ఇంకా ప్రారంభించలేకపోయామని అందుకే ఈ స్పెక్ట్రం వేలం పాల్గొనబోమని టెలినార్ స్పష్టం చేసింది. దేశీయ వ్యాపారాలకు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నామని టెలినార్ తెలిపింది. దేశీయంగా ఇతర టెలికాం సంస్థలతో పోటీ పడుతూ, దీర్ఘకాలం కొనసాగాలంటే మరింత స్పెక్ట్రమ్ కావాలి. అయితే అయితే దేశీయ టెలికాం రంగం నుంచి ఇప్పుడే తప్పుకోవడం లేదని, తక్కువ నష్టంతో బయట పడేందుకు కొంతకాలం సేవలు కొనసాగిస్తామన్నారు. త్వరలో జరగబోయే స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నామని సంస్థ ప్రకటించింది. కాగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టెలినార్ ఇండియా రూ.105 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.71.3 కోట్లు. ఆదాయం మాత్రం రూ.1,080 కోట్ల నుంచి రూ.1230 కోట్లకు పెరిగింది. మరోవైపు టెలినార్ తో విలీనం చర్చలను వోడా ఫోన్ మరింత వేగవంతం చేసింది. -
మెగా స్పెక్ట్రమ్ వేలానికి డేట్ ఫిక్స్
న్యూఢిల్లీ : మెగా స్పెక్ట్రమ్ వేలానికి డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ లో ఈ వేలం నిర్వహించనున్నట్టు టెలికాం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఈ వేలంతో ప్రభుత్వ ఖజానాకు రూ.5.66లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. సిన్హా తన మొదటి మీడియా మీటింగ్ లో ఈ విషయాన్ని సిన్హా వెల్లడించారు. అదేవిధంగా కాల్ డ్రాప్స్ సమస్యను కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకుని, పరిస్థితిని చక్కబెడతామన్నారు. గత నెలలో మెగా స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సారి నిర్వహించబోయే వేలమే అన్ని స్పెక్ట్రమ్ వేలంలో కెల్లా అతిపెద్దది. ట్రాయ్ సిఫారసులతో 3జీ, 4జీ ఆఫర్ చేసే క్వాంటమ్ 2,200 మెగాహెడ్జ్ పైగా స్పెక్ట్రమ్ ను ప్రభుత్వం తొలిసారిగా వేలం వేయబోతోంది. అయితే అందుబాటులో ఉన్న అన్ని స్పెక్ట్రమ్ లను ప్రభుత్వం విక్రయించబోదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ధర ఆందోళనలు, మునుపటి అమ్మకాల అవసరాలతో పోలిస్తే ఆపరేటర్ల పరిమిత అవసరాలు.. అన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ వేలాన్ని వేయనున్నట్టు తెలుస్తోంది. 20 రోజుల తర్వాత కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారంపై కూడా పూర్తి వివరాలను వెల్లడిస్తామని సిన్హా తెలిపారు. వచ్చే నాలుగు, ఐదు నెలలో ఈ సమస్య నుంచి వినియోగదారులు పూర్తిగా ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీల ద్వారా 90శాతం టెలి డెంసిటీ టార్గెట్లను టెలికాం ఇండస్ట్రి సాధించిందని సిన్హా తెలిపారు. టెలికాంలో దాదాపు రూ.46వేల కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని.. దాన్ని కేంద్రప్రభుత్వం చాపకింద దాచిపెడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వాలపై రుద్దకూడదన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అలాంటి ఫిర్యాదులేమి రాలేదని, నిర్దేశిత గడువులోగానే టెలికాం ఆపరేటర్ల నుంచి సొమ్మును వసూలుచేస్తున్నామని సిన్హా తెలిపారు. -
ఈ ఇద్దరూ కాదట!
కొత్త జేమ్స్ బాండ్ చిత్రానికి సరికొత్త టీమ్ రెడీ అవుతోంది. ‘క్యాసినో రాయల్’ నుంచి ఇటీవల వచ్చిన ‘స్పెక్టర్’ సినిమా వరకూ బాండ్‌గా నటించిన డేనియల్ క్రెగ్ ఇక తాను ఆ పాత్ర చేయలేనని చెప్పడంతో మరో హాలీవుడ్ నటుడు టామ్ హిడెల్స్టెన్ని బాండ్‌గా ఎంపిక చేశారని వార్తలు కూడా వచ్చాయి. అయితే కొత్త బాండ్‌గా టామ్ నటించే అవకాశం లేదని ‘స్కైఫాల్’, ‘స్పెక్టర్’ వంటి బాండ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శామ్ మెండెస్ చెప్పారు. అంతే కాకుండా ఇక తదుపరి బాండ్ చిత్రాలకు తాను కూడా దర్శకుణ్ణి కాదని ఆయన ప్రకటించడం విశేషం. ‘‘నాకు ఎప్పటికప్పుడు కొత్త పాత్రలతో, సరికొత్త కథాంశాలతో సినిమాలు చేయా లని ఉంటుంది. ఆ కారణంగానే నెక్ట్స్ బాండ్ చిత్రానికి నో చెప్పేశాను. టామ్‌ని కూడా బాండ్‌గా తీసుకునే ఉద్దేశం నిర్మాతలకు లేదు. బాండ్‌గా ఎవరూ ఊహించని నటుణ్ణి ఎంపిక చేసే అవకాశం ఉంది’’ అని శామ్ పేర్కొన్నారు. మరి... కొత్త బాండ్ చిత్రానికి డెరైక్టర్ ఎవరు? బాండ్‌గా ఎవరు నటిస్తారు? అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. ఏదేమైనా కొత్త టీమ్‌తో నెక్ట్స్ జేమ్స్‌బాండ్ మూవీ ఇప్పటివరకూ వచ్చిన బాండ్ చిత్రాలకు భిన్నంగా, కొత్తగా ఉంటుందని ఆశించవచ్చు. -
ట్రాయ్ నిర్ణయానికి మద్దతు తెలిపిన టెలికం ప్యానెల్
న్యూఢిల్లీ: స్పెక్ట్రం కొనుగోలు అంశంలో ట్రాయ్ సిఫార్సులకు టెలికం ప్యానెల్ మద్దతు తెలిపింది. ఈ మేరకు టెలికం కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారి ఒకరు శనివారం వెల్లడించారు. జరగబోయే వేలంలో 700 ఎంహెచ్‌జెడ్ ఎయిర్‌వేవ్ బ్యాండ్‌ను కూడా అమ్మకానికి ఉంచనున్నారు. ట్రాయ్ నిర్ణయించిన ప్రాథమిక ధరలకే ఈ వేలం జరగనుంది. ఈ వేలం ద్వారా మొత్తం రూ.5.60 లక్షల కోట్లు సమకూరుతాయని అంచనా. ఢిల్లీ పరిధిలో ట్రాయ్ చేసిన సిఫార్సులు... 700 ఎంహెచ్‌జెడ్‌కు రూ. 1595 కోట్లు, 800 ఎంహెచ్‌జెడ్‌కు రూ. 848 కోట్లు, 900 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌కు రూ. 673 కోట్లుగా, 1800 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌కు రూ.399 కోట్లుగా, 2100 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌కు రూ.554 కోట్లు, 2300, 2500 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్లకు రూ. 143 కోట్లు స్పెక్ట్రం ధరలుగా నిర్ణయించింది. అత్యధిక ఫ్రీక్వెన్సీ గల స్పెక్ట్రంను సొంతం చేసుకున్న టెలికం కంపెనీలు ముందస్తుగా 50 శాతం, పదేళ్లలో మిగతా మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. -
ఐడియాకు వడ్డీ వ్యయాల భారం
♦ రెండు రెట్లకు పైగా పెరిగిన వడ్డీవ్యయాలు ♦ 39 శాతం తగ్గిన నికర లాభం న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం ఐడియా సెల్యులర్ నికర లాభంపై వడ్డీ వ్యయాలు ప్రభావం చూపాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి ఈ కంపెనీ నికర లాభం 39 శాతం తగ్గింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.942 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.576 కోట్లకు పడిపోయిందని ఐడియా సెల్యులర్ తెలిపింది. అయితే కంపెనీ ఆదాయం రూ.8,423 కోట్ల నుంచి 13 శాతం పెరిగి రూ.9,484 కోట్లకు పెరిగిందని వివరించింది. వడ్డీ వ్యయాలు రూ.292 కోట్ల నుంచి రెండు రెట్లకు పైగా పెరిగి రూ. 808 కోట్లకు చేరాయని పేర్కొంది. డేటా సర్వీస్ ఆదాయం ఒక్కో మెగాబైట్‌కు 44.8 పైసల నుంచి 22.9 పైసలకు, అలాగే వాయిస్ కాల్స్ ఆదాయం 33.9 పైసల నుంచి 33.3 పైసలకు తగ్గాయని తెలిపింది,. ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ బకాయిలతో సహా తమ నికర రుణ భారం ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.38,750 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం విషయానికొస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.3,193 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) 4 శాతం క్షీణించి రూ.3,080 కోట్లకు తగ్గిందని ఐడియా సెల్యులర్ తెలిపింది. ఆదాయం రూ.31,571 కోట్ల నుంచి 14 శాతం వృద్ధి చెంది రూ.35,981 కోట్లకు పెరిగిందని వివరించింది. -
భారత్‌కు గుడ్‌బై చెప్తాం!
♦ టెలినార్ సంకేతాలు... ♦ అధిక స్పెక్ట్రం రేట్లే కారణం... ♦ రూ.2,530 కోట్ల నిర్వహణ ♦ నష్టాల్లో ఉన్నామని వెల్లడి ♦ విశాఖపట్నంలో 4జీ సేవలు షురూ వైజాగ్/ఓస్లో: తక్కువ ధరలకు స్పెక్ట్రం గనుక లభిం చకపోతే తాము భారత్ కార్యకలాపాలకు గుడ్‌బై చెప్పకతప్పదని నార్వే టెలికం దిగ్గజం టెలినార్ సంకేతాలిచ్చింది. భారత్‌లో టెలికం వ్యాపారానికి సంబంధించి తాము దాదాపు రూ.2,350 కోట్ల(310 కోట్ల నార్వేజియన్ క్రోన్స్) నిర్వహణపరమైన నష్టాల్లో కూరుకుపోయామని పేర్కొంది. నార్వేలో కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా టెలినార్ గ్లోబల్ సీఈఓ సెగ్వీ బ్రెకీ మాట్లాడుతూ ఈ అంశాలను ప్రస్తావించారు. ‘భారత్‌లో దీర్ఘకాలంపాటు మేం కొనసాగుతామా లేదా అనేది అదనపు స్పెక్ట్రం కొనుగోళ్లపై ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్న డేటా మార్కెట్‌కు అనుగుణంగా ఇప్పుడు మాకున్న స్పెక్ట్రంతో ప్రత్యర్థి కంపెనీలతో పోటీపడలేకపోతున్నాం. అందుకే మరింత స్పెక్ట్రంను కొనుగోలు చేయడంపై దృష్టిసారిస్తున్నాం. అయితే, ధర మాకు సమ్మతంగా ఉండాలి. రానున్న స్పెక్ట్రం వేలంలో పాల్గొనడంతోపాటు ఇతర కంపెనీల నుంచి కొనుగోలు చేసే ప్రణాళికలు కూడా ఉన్నాయి’ అని బ్రెకీ వ్యాఖ్యానించారు. భారత్‌లో లాభదాయకమైన వ్యాపారం చేయడానికే వచ్చామని, అనుకున్నట్లు రాబడులు లేకపోతే ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సి వస్తుందని టెలినార్ సీఎఫ్ఓ మార్టెన్ కార్ల్సన్ సార్బీ పేర్కొన్నారు. ప్రస్తుత 2016 జనవరి-మార్చి క్వార్టర్లో టెలినార్ ఇండియా ఆపరేటింగ్ నష్టాలు 310 కోట్ల నార్వేజియన్ క్రోన్స్(ఎన్‌ఓకే)కు ఎగబాకాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు 15.9 కోట్ల ఎన్‌ఓకే మాత్రమే. ఆదాయం మాత్రం 11% వృద్ధితో 130.6 కోట్ల ఎన్ఓకేలకు చేరినట్లు టెలినార్ తెలిపింది. 4జీ సేవల విస్తరణ... అయితే, టెలినార్ ఇండియా మాత్రం 4జీ సేవలను విస్తరణపై దృష్టిపెట్టింది. టెలినార్ ఇండియా కమ్యూనికేషన్స్ సీఈఓ శరద్ మెహరోత్రా బుధవారం విశాఖపట్నంలో 4జీ సర్వీసులను ప్రారంభించారు. కం పెనీ ఇప్పటికే వారణాసిలో ఈ సేవలను ఆరంభిం చింది. కాగా, వచ్చే 45-60 రోజుల్లో మరో 6-8 నగరాల్లో 4జీని ప్రవేశపెట్టనుంది. మాస్ మార్కెట్లో తమ కు మంచి పట్టుందని.. అత్యంత చౌక టారిఫ్‌లతో సర్వీసులను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని మెహరోత్రా ఈ సందర్భంగా పేర్కొన్నారు. సేవలు ఆరు సర్కిళ్లలోనే... దేశవ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లు ఉండగా... ఆరు సర్కిళ్లలో(ఆంధ్రప్రదేశ్-తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ ఈస్ట్, ఉత్తర ప్రదేశ్ వెస్ట్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర) మాత్రమే టెలినార్ ఇండియా కార్యకలాపాలు ఉన్నాయి. ఫిబ్రవరి చివరినాటికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 5.16 కోట్లుగా నమోదైంది. వాయిస్ సేవల వినియోగం తగ్గడంతో కంపెనీకి ఒక్కో కస్టమర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం(ఏఆర్పీయూ) 8 శాతం మేర తగ్గి.. రూ.90కి దిగజారింది. కాగా, రానున్న స్పెక్ట్రం వేలానికి సంబంధించి 700 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం ధరను ఒక్కో మెగాహెర్ట్జ్‌కు రూ.11,485గా ట్రాయ్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అన్ని బ్యాండ్‌విడ్త్‌లోనూ చూస్తే ఇదే అత్యధిక వేలం రేటుగా నిలవనుంది. -
ఆర్ కామ్, ఆర్‌జియో స్పెక్ట్రం డీల్‌కు ఆమోదం
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజాలు అంబానీ సోదరుల సారథ్యంలోని రెండు టెలికం సంస్థల మధ్య 9 సర్కిళ్లలో స్పెక్ట్రం షేరింగ్ ఒప్పందానికి టెలికం విభాగం (డాట్) ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (ఆర్‌జియో), అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) 9 సర్కిళ్లలో స్పెక్ట్రంను పంచుకునేందుకు వీలవుతుంది. 7 సర్కిళ్లలో తమకున్న 800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను, 2 సర్కిళ్లలో ఆర్‌జియో అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికం (ఆర్టీఎల్)కు ఉన్న స్పెక్ట్రంను పరస్పరం పంచుకోనున్నట్లు ఆర్‌కామ్ తెలిపింది. ఆర్‌కామ్, ఆర్‌జియో సంస్థలు 4జీ టెలికం సర్వీసులు అందించేందుకు ఈ డీల్ ఉపయోగపడనుంది. అలాగే మరో 13 సర్కిళ్లలో కూడా ట్రేడింగ్ ద్వారా ఆర్‌కామ్ స్పెక్ట్రంను ఆర్‌జియో కొనుగోలు చేయడానికి తాజా అనుమతులు మార్గం సుగమం చేయనున్నాయి. మే 4 నుంచి ఆర్‌కామ్ 4జీ టెలికం సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తోంది. ఐపీ ఆధారిత ఇంటర్‌కనెక్షన్‌కు డాట్ ఓకే.. 4జీ వంటి ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారిత సర్వీసులకు సంబంధించి సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఇంటర్‌కనెక్షన్‌కు అనుమతినిస్తూ డాట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిబంధనల్లో సవరణ చేసింది. దీనితో టెలికం ఆపరేటర్లు ఐపీ ఆధారిత నెట్వర్క్ ఉన్న మరో టెలికం ఆపరేటరుకు ఇంటర్‌కనెక్షన్‌ను నిరాకరించడం కుదరదు. ఇప్పటిదాకా సర్క్యూట్ స్విచ్ విధాన నెట్‌వర్క్‌లకు మాత్రమే ఇంటర్కనెక్షన్ వెసులుబాటు ఉంది. తాజా పరిమాణంపై సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య (సీవోఏఐ) హర్షం వ్యక్తం చేసింది. -
ఎయిర్ టెల్ చేతికి వీడియోకాన్ స్పెక్ట్రం
6 సర్కిళ్లలో కొనుగోలు డీల్ విలువ రూ. 4,428 న్యూఢిల్లీ: వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్కి(వీటీఎల్) 6 సర్కిళ్లలో ఉన్న 1800 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను భారతీ ఎయిర్టెల్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 4,428 కోట్లు వెచ్చించనుంది. దీనికి సంబంధించి వీటీఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ (ఈస్ట్), ఉత్తర్‌ప్రదేశ్ (వెస్ట్), గుజరాత్ సర్కిళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. స్పెక్ట్రం కాలావధి 2032 డిసెంబర్ 18 దాకా ఉంది. డీల్‌కు సంబంధించి ఎయిర్టెల్ రూ. 642 కోట్లు సేవా పన్ను కింద ప్రభుత్వానికి చెల్లించనుంది. తాజా స్పెక్ట్రం కొనుగోలుతో ఎయిర్టెల్ 4జీ సర్వీసులు ప్రస్తుత మున్న 15 సర్కిళ్ల నుంచి 19 సర్కిళ్లకు విస్తరిస్తాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో త్వరలో దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు ప్రారంభించనున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి గుజరాత్, యూపీ (వెస్ట్)సర్కిళ్లలో స్పెక్ట్రంను వీడియోకాన్ నుంచి కొనుగోలు చేసేందుకు ఐడియా సెల్యులార్ గత నవంబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ. 3,310 కోట్లు చెల్లించేందుకు కూడా సిద్ధపడింది. అయితే, పలు కారణాల రీత్యా ఈ ఒప్పందాన్ని ఇరు కంపెనీలు ఇటీవలే రద్దు చేసుకున్నాయి. -
స్పెక్ట్రమ్ అమ్మకంతో ద్రవ్యలోటు భర్తీ..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) స్థూల దేశీయోత్పత్తిలో 3.5 శాతానికి కేంద్ర ఆర్థిక మంత్రి పరిమితం చేస్తారన్న అంచనాలను దేశీయంగా ఫిచ్ రేటింగ్స్ అనుబంధ విభాగం- ఇండియా రేటింగ్స్ వెలువరించింది. ఇందుకు స్పెక్ట్రమ్ అమ్మకాలు దోహదపడతాయని సైతం విశ్లేషించింది. ఫిబ్రవరి 29న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ వెలువరించిన అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... రెవెన్యూ యేతర ఆదాయాల ద్వారా ద్రవ్యలోటును ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇందులో స్పెక్ట్రమ్ అమ్మకాలు ఒకటి. ఏడవ వేతన కమిషన్ సిఫారసుల అమలు వల్ల ఏర్పడే ఆదాయలోటును ఇతర ఆదాయాలు భర్తీ చేస్తాయి.పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం అదనపు వ్యయాలు ఎలా చేయగలుగుతుందన్న అంశాన్ని భారత పరిశ్రమ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం దాదాపు 1.7%కి (జీడీపీలో) పరిమితమవుతున్న మూలధన పెట్టుబడులను 2 శాతానికి పెంచాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.9%కన్నా అధికంగా 4.1%కి (రూ.5.6 లక్షల కోట్లు) పెంచవచ్చు.ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనానికి బడ్జెటరీ మద్దతు ఒక సవాలే. బాసెల్ 3 ప్రమాణాల అమలుకు 2017 ఏప్రిల్ నుంచి 2019 మార్చి మధ్య బ్యాంకులకు రూ.3.7 లక్షల కోట్ల మూలధనం అవసరం.మౌలిక రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. అయితే పెట్టుబడులకు సంబంధించి కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సిన అవసరం ఉంటుంది. నిలిచిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణకు ఒక వ్యూహం అవసరం.కాలం తీరిన వాణిజ్య వాహనాల స్థానంలో కొత్త వాటిని తీసుకురావడానికి ఒక ‘స్క్రాపింగ్ పథకాన్ని’ బడ్జెట్ తీసుకువచ్చే వీలుంది. పెద్ద కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్‌పై ఎక్సైజ్ సుంకాలు తగ్గించే అవకాశం ఉంది. జీవిత బీమా పరిశ్రమకు ఊతం... దేశాభివృద్ధిలో జీవిత బీమా పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకించి మౌలిక రంగంలో పెట్టుబడులు సమకూర్చడానికి ఈ పరిశ్రమ ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రంగం మరింత పురోభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దేశంలోని మారుమూల ప్రాంతాలన్నింటికీ ఈ రంగం విస్తరించాలి. అందువల్ల 2016-17 బడ్జెట్ ఈ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నా. ముఖ్యంగా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పట్ల ఆకర్షణ మరింత పెంచేందుకు ‘డెత్ బెనిఫిట్’ను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి. 80సీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత 1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచడం పొదుపులను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది. - అరిజిత్ బసు, ఎస్బీఐ లైఫ్ ఎండీ అండ్ సీఈఓ ఆరోగ్య భద్రతపై దృష్టి... ఆరోగ్య భద్రత విషయంలో లక్ష్యాలు నెరవేరడానికి ఒక సమర్థవంతమైన ప్రణాళిక అవసరం. ఇలాంటి ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ రంగానికి కేటాయింపుల్లో 15 నుంచి 16 శాతం మేర నిరుపయోగంగా మిగిలిపోతోంది. 2011 నుంచీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజా బడ్జెట్ ఈ విషయాన్ని గమనించి సమస్య పరిష్కారం దిశలో చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం. ఆరోగ్య సంరక్షణ విషయంలో ముందుగానే ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలి. ఒక వ్యాధి ముదరకముందే దానిని గుర్తించి, చికిత్స వ్యయ భారాలను తగ్గించే దిశలో ప్రభుత్వం తగిన వ్యూహ రచన చేయాలి. ఈ రంగంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆరోగ్య భద్రతా విభాగంలో తగిన ఫలితాలు రాబట్టవచ్చని భావిస్తున్నాం. - అమీరా షా, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ ఎండీ, సీఈఓ వాహన రంగంలో డిమాండ్ వృద్ధి.. తయారీ, ఉపాధి కల్పన మార్గాల ద్వారా దేశాభివృద్ధిలో వాహన రంగం భాగస్వామ్యం కీలకం. వినియోగదారు సెంటిమెంట్ బలపడ్డానికి, డిమాండ్ మెరుగుదలకు బడ్జెట్ కీలక చర్యలు ప్రకటిస్తుందని భావిస్తున్నాం. వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రైసింగ్, పన్ను విధానాలు విభిన్నంగా ఉన్నాయి. ఈ పన్ను వ్యవస్థను సరళీకరించడంపై బడ్జెట్ దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం. వ్యాపార పటిష్టత దిశలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు కీలక పాత్ర పోషిస్తుంది. కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు వల్ల పరిశ్రమ సెంటిమెంట్ బలపడుతుందని భావిస్తున్నాం. రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుదలకు తీసుకునే చర్యలు కూడా వాహన పరిశ్రమ పురోభివృద్ధికి దోహదం చేస్తుంది. - జో కింగ్, ఆడీ ఇండియా హెడ్