
RJIL: దేశంలో నెంబర్ వన్ మొబైల్ ఆపరేటర్ హోదాలో ఉన్న జియో ప్రభుత్వానికి బకాయిలు చెల్లించింది. 2014 నుంచి 2016 వరకు వరుసగా జరిగిన స్పెక్ట్రం వేలంలో జియో కూడా పాల్గొంది. ఆ తర్వాత మొబైల్ ఆపరేషన్స్‌లోకి వచ్చింది. కాగా స్పెక్ట్రం వినియోగానికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు రూ. 30, 971 కోట్లు ఇప్పుడు చెల్లించింది.
ఇటీవల వోడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్ వంటి సంస్థలు ప్రభుత్వానికి స్పెక్ట్రం బకాయిలు చెల్లించలేకపోయాయి. బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం మారటోరియం కూడా విధించింది. ఐనప్పటికీ బకాయిలకు బదులు ఆయా సంస్థల్లో ప్రభుత్వానికి భాగస్వామం కల్పించే ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. ఈ తరుణంలో మారటోరియం ఉపయోగించకుండా స్పెక్ట్రం బకాయిలు జియో ముందుగానే చెల్లించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment