కేంద్రం 72 గిగా హెడ్జ్‌ల రేడియా తరంగాలను వేలానికి పెట్టింది. ఈ బిడ్డింగ్‌లో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అత్యధికంగా రూ.80వేల 100కోట్లతో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. 700ఎంహెచ్‌జెడ్ బ్యాండ్ స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. దేశ వ్యాప్తంగా 22 టెలికాం సర్కిల్స్‌లో జియో 700 ఎంహెచ్‌జెడ్‌ను కొనుగోలు చేయగా..ఆ స్పెక్ట్రం పాత్రపై యూజర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
700 ఎంహెచ్‌జెడ్ క్రేజ్
►వరల్డ్ వైడ్‌గా 5జీ నెట్ వర్క్ అందించడంలో 700ఎంహెచ్‌జెడ్ బ్యాండ్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ సైతం 5జీ సేవల్ని అందించడంలో ప్రీమియం బ్యాండ్ అని పేర్కొన్నాయి.
►కనెక్టివిటీ తక్కువగా ఉన్న ఏరియాలో 700ఎంహెచ్‌జెడ్ నెట్ వర్క్ పనీతీరు బాగుంటుంది
►జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం ఈ స్పెక్ట్రంతో ఎలాంటి ఆటంకాలు ఉండవు.
►700 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్ టవర్ 10 కిలోమీటర్ల వరకు కవరేజీని అందిస్తుంది. దీని కవరేజీ కారణంగా టెలికాం ఆపరేటర్లు తక్కువ టవర్‌లను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఖరీదైనది అయినప్పటికీ, ఈ బ్యాండ్ 5జీ సేవలకు అనువుగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment