Spectrum licene
-
వేలం ప్రక్రియే మేలు: రిలయన్స్
వ్యక్తిగత లేదా గృహ వినియోగదారుల కోసం శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని రిలయన్స్ తెలిపింది. దేశంలో గృహ వినియోగానికి సంబంధించిన ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించాలని ట్రాయ్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై రిలయన్స్ స్పందించింది. నిర్దిష్ట స్థాయి కలిగిన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించడం కంటే వేలం నిర్వహించాలని తెలిపింది.దేశంలో గృహ వినియోగ శాటిలైట్ సేవలకు స్పెక్ట్రమ్‌ను ఎలా కేటాయిస్తారని గతేడాది నుంచి చర్చలు సాగుతున్నాయి. ఇలొన్మస్క్కు చెందిన స్టార్‌లింక్, అమెజాన్ ఆధ్వర్యంలోని ప్రాజెక్ట్ కూపర్ వంటి వాటికోసం అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లో స్పెక్ట్రమ్‌కు సంబంధించి నేరుగా అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపులు చేశారు. అయితే ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో విస్తరణకు సిద్ధమవుతున్న రిలయన్స్ జియో మాత్రం హోమ్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం వేలం ప్రక్రియ నిర్వహించాలని తెలుపుతుంది. ఈమేరకు ట్రాయ్‌కు ఇటీవల లేఖ రాసినట్లు పేర్కొంది. మస్క్ కోరుకున్న విధంగా గతేడాది స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించేందుకు ట్రాయ్ నిబంధనలు సవరించనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: రూపాయి భారీ పతనానికి కారణాలుటెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ దీనికి సంబంధించిన నిబంధనలపై ప్రస్తుతం పబ్లిక్ కన్సల్టేషన్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియపై మరింత స్పష్టత రావడానికంటే ముందే రిలయన్స్ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ట్రాయ్ తన కన్సల్టేషన్ పేపర్లో ఎలాంటి చట్టపరమైన అధ్యయనాలు నిర్వహించకుండానే స్పెక్ట్రమ్ కేటాయింపులపై నిర్ణయం తీసుకోబోతుందని రిలయన్స్ తన లేఖలో పేర్కొంది. -
ఓటీటీలకూ భారీ షాక్.. ఇకపై అలా కుదరదండి!
న్యూఢిల్లీ: కమ్యూనికేషన్ సేవలు అందించే సంస్థలన్నింటికీ ఒకే రకం నిబంధనలు అమలు చేయాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డిమాండ్ చేసింది. తమకు వర్తింపచేస్తున్న నిబంధనలను ఓటీటీ (ఓవర్–ది–టాప్) కమ్యూనికేషన్ యాప్స్‌కు కూడా వర్తింపచేయాలని కోరింది. అలా చేయని పక్షంలో తమ లైసెన్సులు, నియంత్రణపరమైన నిబంధనలనైనా సడలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అన్ని ‘ఓటీటీ కమ్యూనికేషన్ సేవల విషయంలో అన్ని టెక్నాలజీలకు సమానంగా రూల్స్‌ను అమలు చేయాలి. తద్వారా పరిశ్రమలో సముచితమైన, ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది‘ అని ఒక ప్రకటనలో సీవోఏఐ పేర్కొంది. ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసులను కూడా ఇటీవలి టెలికమ్యూనికేషన్స్ బిల్లు ముసాయిదాలో పొందుపర్చడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఈ తరహా సేవల విషయంలో ఎటువంటి గందరగోళం లేకుండా స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని కోరుకుంటున్నామని వివరించింది. టెలికం సంస్థలు స్పెక్ట్రం కొనుగోలు చేయం మొదలుకుని నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకోవడం వరకూ భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, అనేక నిబంధనలను పాటించాల్సి ఉంటోందని సీవోఏఐ తెలిపింది. మరోవైపు ఓటీటీలు మాత్రం టెలికం సర్వీసులను ఇలాంటి బాదరబందీలేమీ లేకుండా, ఎలాంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేకుండా అందించడం ద్వారా ప్రయోజనాలు పొందుతున్నాయని పేర్కొంది. సీవోఏఐలో టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొదలైనవి సభ్యులుగా ఉన్నాయి. వాట్సాప్ వంటి ఓటీటీ కమ్యూనికేషన్ యాప్‌లు .. ఇంటర్నెట్ టెక్నాలజీ ఆధారంగా టెలికం సంస్థల తరహాలోనే వాయిస్, వీడియో కాలింగ్ సేవలను అందిస్తున్నాయి. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
ప్రైవేట్ టెలికం నెట్‌వర్క్‌ల ఏర్పాటుకు డాట్ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రైవేట్ టెలికం నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడంపై ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర టెలికం శాఖ (డాట్) ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రూ. 100 కోట్ల పైగా నికర విలువ ఉండి, డాట్ నుండి నేరుగా స్పెక్ట్రం తీసుకోవడం ద్వారా క్యాప్టివ్ నాన్–పబ్లిక్ నెట్‌వర్క్‌లను (సీఎన్‌పీఎన్) నెలకొల్పాలనుకునే సంస్థలు ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 9 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. సీఎన్‌పీఎన్ ఏర్పాటు చేసే సంస్థలకు నేరుగా స్పెక్ట్రంను కేటాయించేందుకు నెలకొన్న డిమాండ్‌ను అధ్యయనం చేసేందుకు కూడా డాట్ ఈ ప్రక్రియను ఉపయోగించుకోనుంది. ‘సీఎన్‌పీఎన్ నెలకొల్పే సంస్థలు స్పెక్ట్రంను టెలికం సంస్థల నుంచి లీజుకు తీసుకోవచ్చు లేదా డాట్ నుంచి నేరుగా తీసుకోవచ్చు’ అని డాట్ తెలిపింది. ప్రస్తుత టెలికం ఆపరేటర్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎన్‌పీఎన్ కోసం స్పెక్ట్రం నేరుగా కేటాయించే ప్రతిపాదనను డాట్ తెరపైకి తెచ్చింది. -
5జీ నెట్ వర్క్‌లో 700 ఎంహెచ్‌జెడ్..దాని ఉపయోగం ఏంటంటే
కేంద్రం 72 గిగా హెడ్జ్‌ల రేడియా తరంగాలను వేలానికి పెట్టింది. ఈ బిడ్డింగ్‌లో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అత్యధికంగా రూ.80వేల 100కోట్లతో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. 700ఎంహెచ్‌జెడ్ బ్యాండ్ స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. దేశ వ్యాప్తంగా 22 టెలికాం సర్కిల్స్‌లో జియో 700 ఎంహెచ్‌జెడ్‌ను కొనుగోలు చేయగా..ఆ స్పెక్ట్రం పాత్రపై యూజర్లు ఆసక్తి చూపిస్తున్నారు. 700 ఎంహెచ్‌జెడ్ క్రేజ్ ►వరల్డ్ వైడ్‌గా 5జీ నెట్ వర్క్ అందించడంలో 700ఎంహెచ్‌జెడ్ బ్యాండ్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ సైతం 5జీ సేవల్ని అందించడంలో ప్రీమియం బ్యాండ్ అని పేర్కొన్నాయి. ►కనెక్టివిటీ తక్కువగా ఉన్న ఏరియాలో 700ఎంహెచ్‌జెడ్ నెట్ వర్క్ పనీతీరు బాగుంటుంది ►జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం ఈ స్పెక్ట్రంతో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ►700 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్ టవర్ 10 కిలోమీటర్ల వరకు కవరేజీని అందిస్తుంది. దీని కవరేజీ కారణంగా టెలికాం ఆపరేటర్లు తక్కువ టవర్లను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఖరీదైనది అయినప్పటికీ, ఈ బ్యాండ్ 5జీ సేవలకు అనువుగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ముగిసిన 5G స్పెక్ట్రమ్ వేలం.. రూ.1.50లక్షల కోట్ల ఆదాయం
-
ముగిసిన 5జీ స్పెక్ట్రం వేలం, టాప్ బిడ్డర్‌గా జియో!
5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. ఏడురోజుల పాటు స్పెక్ట్రంకు సంబంధించిన వేలం కొనసాగింది. మొత్తం రూ.1,50,173 కోట్ల బిడ్లు దాఖలైనట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బిడ్డింగ్‌లో 10కోట్లకు పైగా కనెక్షన్లు ఉన్న ఉత్తర్ ప్రదేశ్ ఈస్ట్ సర్కిల్‌కి స్పెక్ట్రం దక్కించుకునేందుకు సంస్థలు పోటీ పడడంతో వేలం మరో రోజు పొడిగింపు జరిగినట్లు తెలుస్తోంది. 2022సంవత్సరానికి గాను 72గిగా హెడ్జ్‌ల రేడియా తరంగాలను వేలానికి పెట్టింది కేంద్రం. వీటి విలువ రూ.4.3లక్షల కోట్లుగా ఉంది. ఇందులో 600మెగా హెడ్జ్ నుంచి అత్యధికంగా 26 గిగా హెడ్జ్‌ల స్పెక్ట్రానికి సంబంధించి వేలం కొనసాగింది. జులై 26 నుంచి జరిగిన ఈ వేలం సోమవారం ముగియగా..గతంలో జరిగిన 3జీ, 4జీ స్ప్రెక్టం వేలం కంటే 5జీ స్పెక్ట్రం వేలం రికార్డ్ స్థాయిలో రూ.1,50,173కోట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. టాప్ బిడ్డర్‌గా జియో ఈ బిడ్డింగ్‌లో ముఖేష్ అంబానీ నేతృత్వం వహిస్తున్న రిలయన్స్ జియో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. రెండో స్థానంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 5జీ స్పెక్ట్రం బిడ్డింగ్‌లో జియో రూ.80వేల 100కోట్లు, ఎయిర్టెల్ రూ.50వేల కోట్లుకు, ఐడియా వొడాఫోన్ రూ.15వేల కోట్లకు, తొలిసారి 5జీ స్పెక్ట్రం బిడ్డింగ్‌లో పాల్గొన్న అదానీ గ్రూప్ రూ.500కోట్లనుంచి రూ.1000 కోట్ల మధ్యలో పాల్గొంది. మొత్తం 10బ్యాండ్లలో వేలం మొత్తం 10బ్యాండ్లలో 72 జీహెచ్‌జెడ్ స్పెక్ట్రం వేలం వేయడం జరిగింది. 600mhz (మిలియన్ హెర్ట్జ్) 700 mhz, 800mhz, 900mhz, 1800mhz, 2100mhz, 2300mhz, 2500mhz తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు, మిడ్ రేంజ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ 3300 మెగా హెర్జ్‌తో పాటు హై ఫ్రీక్వెన్సీ 26 గాగా హెర్జ్ల వేలానికి ఉంచింది. మిడ్, హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 4జీ కంటే 10రెట్లు వేగవంతమైన 5జీ సేవల కోసం వినియోగించుకుంటున్నాయి. కేంద్రం నిర్వహించిన వేలంలో తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కోసం ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. కానీ 3,300 మెగా హెడ్జెట్, 22 గిగా హెడ్జెట్లకు ఎక్కువ బిడ్డింగ్‌లు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జియోకే ఎక్కువ స్పెక్ట్రం వేలంలో ఎక్కువ మొత్తాన్ని జియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో జరిగిన వేలంలో కేంద్రం భారీ ఆదాయాన్ని గడించింది. 3జీ వేలంలో రూ.50,968.37కోట్లకు, 4జీకి రూ.77,815 కోట్ల ఆదాయం రాగా.. ఆల్ట్రా హై స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించేందుకు జరిగిన 5జీ వేలంలో మాత్రం అత్యధికంగా రూ.1,50,173కోట్ల ఆదాయం గడించింది. కేంద్రం షరతు.. అంతలోనే గతంలో జరిగిన ఈ 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు ఉత్సాహాం చూపించలేదు. స్పెక్ట్రం ఎంత వాడుకుంటే అంత మొత్తానికి యూసేజీ ఛార్జీలు చెల్లించాలని టెలింకాం కంపెనీలకు కేంద్రం షరతు విధించింది. కేంద్రం నిర్ణయంతో 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు టెలికాం కంపెనీలు ముందుకు రాలేదు. ఇక తాజాగా జరిగిన 5జీ వేలంలో యూసేజీ ఛార్జీలను తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాదు బిడ్డింగ్ దక్కించుకున్న టెలికాం కంపెనీలకు 20 సంవత్సరాల లోపు దాఖలు చేసిన బిడ్డింగ్ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించే వెసులు బాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది. తాజా కేంద్రం నిర్ణయంతో ఈసారి జరిగిన 5జీ స్పెక్ట్రం బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు టెలికాం కంపెనీలు పోటీ పడ్డాయి. -
5G Issue: 5జీతో నిజంగానే విమానాలకు ఇబ్బందా?
5జీ.. ఫిఫ్త్ జనరేషన్ మొబైల్ ఫోన్ టెక్నాలజీ. 4జీ ఎల్‌టీఈకు నెక్స్ట్ వెర్షన్. వేగవంతమైన ఇంటర్నెట్ అందించే సెల్యూలార్ టెక్నాలజీ. హైపర్ఫార్మెన్స్, ఎక్కువ నెట్వర్క్ సామర్థ్యం, ఇంటర్నెట్ డేటా వేగం, ఎక్కువ మంది యూజర్లు పొందే అనుభవం-సేవలు ఒక్కరికే అందించడం, కొత్త పరిశ్రమలకు అనుసంధానం చేయడం లాంటి వెసులుబాట్లు 5జీతో కలగనున్నాయి . త్వరలో భారత్‌లోనూ 5జీ సేవలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. అమెరికాలో 5జీ సేవలపై అభ్యంతరం-విమాన సర్వీసులు నిలిపివేస్తామనే బెదిరింపుల నడుమ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘5జీ నెట్వర్క్ సేవలతో విమానాలకు విపత్తు పొంచి ఉంది’. అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ల బాసుల నుంచి వెల్లువెత్తుతున్న అభ్యంతరం. ఈ మేరకు ప్రముఖ యూఎస్ టెలికాం కంపెనీలు వెరిజోన్, ఏటీ&టీ కంపెనీలు చాలాకాలం నుంచి 5జీ సేవలను మొదలుపెట్టాలనే ప్రయత్నాల్లో ఉండగా.. ఆ ప్రయత్నాలకు అడ్డుపడుతూ వస్తున్నాయి ఎయిర్‌లైన్స్ కంపెనీలు. ఈ క్రమంలోనే విమాన సర్వీసులకు విఘాతం ఏర్పడుతోంది. అభ్యంతరాలు ఇవే.. సాధారణంగా విమానాలు ఎక్కిన ప్రయాణికులను.. ప్రత్యేకించి టేకాఫ్ అయ్యే లేదంటే ల్యాండ్ అయ్యే సమయంలో ఫోన్ స్విచ్ఛాప్ చేయమని కోరతారు సిబ్బంది. అందుకు కారణం.. రేడియో ఫ్రీక్వెన్సీ సమస్యలు ఎదురు కావొచ్చని!. అయితే టెక్నాలజీ అప్డేట్ అవుతున్నా కొద్దీ ఈ తరహా రిక్వెస్టులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. కానీ, అమెరికా ఎయిర్‌లైన్స్ వినిపిస్తున్న వాదన ఏంటంటే.. 5జీ ఏర్పాట్ల వల్ల ఎయిర్‌క్రాఫ్ట్ భద్రత వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రస్తావించిన అభ్యంతరాలు ఏంటంటే.. 5జీ టెలిఫోన్ నెటవర్క్స్- విమానాల్లో ఉపయోగించే రేడియో అల్టిమీటర్స్లో జోక్యం చేసుకుంటాయట. తద్వారా వాతావరణం సరిగా లేనప్పుడు విమానాల అత్యవసర ల్యాండింగ్, లోఅల్టిట్యూడ్లో హెలికాఫ్టర్లు ఎగరడం లాంటి అంశాలపై ప్రభావం పడుతుందని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆటో పైలెట్ వ్యవస్థను సైతం ప్రభావితం చేయొచ్చని అంటున్నాయి యూఎస్ ఎయిర్‌లైన్ సంస్థలు. ఈ మేరకు 2009లో టర్కీష్ ఎయిర్‌లైన్స్ ప్రమాదంలో సాంకేతిక వ్యవస్థ విఫలం కావడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపెడుతున్నారు.(ఆ ప్రమాదంలో 9 మంది చనిపోగా.. 120 మందికి గాయపడ్డారు). అమెరికాకే నొప్పా? 5జీ సేవలు ప్రపంచంలో ఇప్పటిదాకా 40 దేశాల్లో కొనసాగుతున్నాయి. అయితే అగ్రరాజ్యంలోనే ఇంత చర్చా జరగడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ, మిగతా దేశాల్లోనూ ఇలాంటి సమస్యలు, అభ్యంతరాలు వచ్చాయి. 2021 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ సివిల్ ఏవియేషన్ కూడా ఇలాంటి అభ్యంతరాలనే లేవనెత్తింది. ఆ సందర్భంలో అమెరికా ఎయిర్‌లైన్స్ సర్వీసుల్లాగా రాద్ధాంతం చేయకుండా.. కెనడాలో మాదిరి ఫోన్ మాస్ట్‌లను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రయాణికులను టేకాఫ్, ల్యాండ్ అయిన సమయంలో ఫోన్లు స్విచ్ఛాఫ్ మాత్రమే చేయాలని కోరింది. ఇక యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ.. ‘సమస్యలను నివారించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారులు, ఎయిర్‌లైన్స్, స్టేట్ స్పెక్ట్రమ్ రెగ్యులేటర్లతో కలిసి పని చేస్తున్నామని, యూరప్‌లో ఎలాంటి ఘటలను గుర్తించలేద’ని స్పష్టం చేసింది. ఈయూతో పోలిస్తే.. అమెరికాలో రేడియో ఫ్రీకెన్సీ జోక్యం, ఇతర ఇబ్బందులు తక్కువేనని సేప్టీ డివైజ్‌లు తయారు చేసే అమెరికన్ కంపెనీ రెసోనాంట్ కంపెనీ ప్రతినిధి జార్జ్ హోమ్స్ చెప్తున్నారు. ఫ్రీక్వెన్సీ ఇష్యూ.. కొన్ని దేశాలు 5జీ విషయంలో 600 మెగాహెర్ట్జ్ నుంచి 900 మెగాహెర్ట్జ్ మధ్య ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తున్నాయి. మరికొన్నిదేశాలు 2.3 గిగాహెర్ట్జ్ నుంచి 4.7 గిగాహెర్ట్జ్ మధ్య ఫ్రీక్వెన్సీతో డేటా స్పీడ్‌ను పెంచుతున్నాయి. ఇంకొన్ని దేశాల్లో అయితే ఏకంగా 24 గిగాహెర్ట్జ్ నుంచి 47 గిగాహెర్ట్జ్ మధ్య ఉపయోగిస్తున్నాయి. ఈ ఫ్రీక్వెన్సీలో ఎక్కువ టవర్లు అవసరం పడినప్పటికీ.. డేటా కూడా అంతే స్పీడ్‌గా వస్తుంది. ఇక అమెరికా విషయానికి వస్తే.. వెరిజోన్, ఏటీ&టీ కంపెనీలు ఏర్పాటు చేయబోయే 5జీ నెట్వర్క్స్ కోసం 3.7 గిగాహెర్ట్జ్ నుంచి 3.8 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్స్ బ్యాండ్‌కు అప్‌గ్రేడ్ లభించింది. మరోవైపు ఏవియేషన్ ఉపయోగిస్తున్న రేడియో అల్టిమీటర్స్ ఏమో 4.2 గిగాహెర్ట్జ్ నుంచి 4.4 గిగాహెర్ట్జ్ బాండ్ మధ్య నడుస్తోంది. సీ-బ్యాండ్(5జీ సేవల కోసం ఉపయోగిస్తున్న ఫ్రీక్వెన్సీ), విమానాల కోసం ఉపయోగించే ఫ్రీక్వెన్సీలు దగ్గరదగ్గరగా ఉండడమే అసలు సమస్యగా మారింది. సీ-బ్యాండ్ ఎయిర్‌వేవ్స్‌తో.. ఏవియేషన్ కమ్యూనికేషన్ దెబ్బతింటుందనేది ఎయిర్‌లైన్స్ ఓనర్ల వాదన. ఎఫ్ఏఏ హెచ్చరికల తర్వాతే.. చాలా దేశాల్లో ప్రభుత్వ ఏజెన్సీలు రేడియో US స్పెక్ట్రమ్‌ను నియంత్రిస్తుంటాయి. అలాగే అమెరికాలో ఎఫ్‌సీసీ ‘ఫ్రీక్వెన్సీ కంట్రోల్’ చేస్తోంది. వాస్తవానికి 5జీ స్పెక్ట్రమ్‌లో చాలా భాగాలను 2016లోనే పక్కన పెట్టేసింది. ఆ సమయంలోనే ఎయిర్‌క్రాఫ్ట్‌ల సమస్యనే అభ్యంతరంగా లేవనెత్తింది ఎఫ్ఏఏ Federal Aviation Administration. అంతేకాదు కిందటి ఏడాది నవంబర్‌లో ఎయిర్‌లైన్స్‌ను హెచ్చరిస్తూ ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. ‘5G ట్రాన్స్మీటర్లు, ఇతర సాంకేతికత జోక్యం చేసుకోవడం వల్ల నిర్దిష్ట భద్రతా పరికరాలు పనిచేయకపోవడం లాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. విమాన కార్యకలాపాలను ప్రభావితం చేసే చర్యలను తగ్గించడం అవసరం అంటూ ఎయిర్‌లైన్స్ సంస్థలను సూచించింది ఎఫ్ఏఏ. ఒకరిని మించి ఒకరు అమెరికాలోనే అతిపెద్ద టెలికాం కంపెనీలుగా ఉన్నాయి వెరిజోన్, ఏటీ&టీ కంపెనీలు. వాస్తవానికి వీటికి అనుమతులు ఎప్పుడో లభించాయి. కానీ, భద్రత కారణాల దృష్ట్యా లాంచింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ తరుణంలో జనవరి 19 నుంచి 5జీ సేవల్ని కొన్ని ప్రధాన ఎయిర్‌పోర్ట్‌ల పరిధిలో మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాయి. ఈలోపు ఏవియేషన్ సేఫ్టీని లేవనెత్తుతూ సర్వీసులు నిలిపివేస్తామని బెదిరింపులకు దిగాయి ఎయిర్‌లైన్స్ కంపెనీలు. 5జీ సర్వీసు మొదలైతే. విమాన సర్వీసులను బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నాయి ఎయిర్‌లైన్స్. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశాయి. ఈలోపు కొన్ని దేశాలు(భారత్ కూడా) సర్వీసుల రద్దు, వేళల్లో మార్పునకే మొగ్గుచూపాయి. ఏం జరగనుంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఏటీ అండ్ టీ కంపెనీ 5జీ సేవల మొదలును మరోసారి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అమెరికా టెలికాం పరిశ్రమ, విమానయాన పరిశ్రమ రెండూ భారీగా లాభపడే ఈ వ్యవహారానికి పరిష్కారం మాత్రం త్వరగా దొరికేలా కనిపించడం లేదు. ఇది టెలికాం సహా ఇతర విభాగాలు, ప్రభుత్వాలకు సంబంధించిన సమస్య. వేర్వేరు ఫ్రీక్వెన్సీలను ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ, అమెరికాలో రెండూ సీ-బ్యాండ్‌నే ఉపయోగిస్తున్నాయి. ఈ విషయంలోనే రాజీకి రాలేకపోతున్నాయి. ఒకవేళ ఇప్పటికే ఉన్న ఆల్టిమీటర్‌లు సురక్షితమైనవిగా రేట్ చేసే అవకాశం ఉంది. లేదంటే 5G జోక్యానికి వ్యతిరేకంగా మరింత పటిష్టంగా ఉండేలా కొత్త నిబంధనల్ని ప్రభుత్వం రూపొందించొచ్చు. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్, ఎఫ్‌సీసీFederal Communications Commission, ఎయిర్‌లైన్స్ నిర్వాహకుల్ని కూర్యోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తోంది బైడెన్ ప్రభుత్వం. ఈ సమస్య పరిష్కారానికి ఎంత టైం పడుతుందన్నది కచ్చితంగా తెలియడం లేదు. సమస్య ఇదేనా? ఇక్కడ సేమ్ ఫ్రీక్వెన్సీ సమస్య ఒక్కటే కాదని తెలుస్తోంది. అమెరికాలో కమర్షియల్ ఫ్లయిట్లు వాతావరణం సరిగా లేని టైంలోనూ ఆపరేట్ చేసుకునేందుకు(లిమిట్ ఆక్యుపెన్సీతో) అనుమతులు ఉన్నాయి. అయితే హజారర్డ్స్(ప్రమాదాలు) జరిగే జోన్లో విమానాలు ఎగరడం పట్ల పైలెట్లను హెచ్చరిస్తూ ఇప్పటివరకు 1450 నోటీసులు జారీ అయ్యాయి. విశేషం ఏంటంటే.. ఈ జోన్లోనే 5జీ టవర్స్ ఏర్పాటు అయ్యాయి. ఈ విషయంలోనే 5జీ సేవలపై గుర్రుగా ఉన్న విమానయాన సంస్థల బాసులు అమెరికా ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఆ రూల్స్ ప్రకారం వెళ్తే.. విమానాల్ని రద్దు చేసుకోవాల్సి వస్తుందని, వాణిజ్య రంగానికి ఆటంకం వాటిల్లుతుందని లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు. ::: సాక్షి, వెబ్‌స్పెషల్ -
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..!
Air India Cancels Some US Flights: 5జీ టెక్నాలజీ వల్ల విమాన సేవలు నిలిచిపోవడం ఏంటి ఆశ్చర్యపోతున్నారా?. కానీ, ఇది మాత్రం నిజం.. 5జీ టెక్నాలజీ వల్ల అమెరికాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేస్తున్నట్లు విమానయాన సంస్థ తెలిపింది. అమెరికాలో ఎయిర్ పోర్ట్ దగ్గర ప్రాంతాలలో 5జీ టెక్నాలజీ ఇన్స్టాల్ చేస్తుండటం వల్ల జనవరి 19, 2022 నుంచి భారతదేశం-అమెరికాకు వెళ్లే వాటిలో కొన్ని విమానాల టైమింగ్స్ మార్చడంతో పాటు మరికొన్నింటి సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. మిగతా వివరాలు తర్వాత అప్డేట్ చేయనున్నట్లు సంస్థ ట్విటర్ వేదికగా పేర్కొంది. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం రోల్ అవుట్ చేస్తున్న 5జీ టెక్నాలజీలో వినియోగించే కొత్త సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ విమానయాన సేవల మీద వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుందని, సంక్షోబాన్ని సృష్టిస్తుందని యునైటెడ్ ఎయిర్ లైన్స్ తెలిపింది. ప్రతి ఏడాది దేశంలోని 40కి పైగా అతిపెద్ద విమానాశ్రయాల గుండా కనీసం 15,000 విమానాలు 1.25 మిలియన్ల యునైటెడ్ ప్రయాణీకులను, చాలా అవసరమైన వస్తువులను కార్గో విమానాలు రవాణా చేస్తున్నట్లు ఎయిర్ లైన్స్ పేర్కొంది. విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. #FlyAI: Due to deployment of the 5G communications in USA,we will not be able to operate the following flights of 19th Jan'22: AI101/102 DEL/JFK/DEL AI173/174 DEL/SFO/DEL AI127/126 DEL/ORD/DEL AI191/144 BOM/EWR/BOM Please standby for further updates.https://t.co/Cue4oHChwx — Air India (@airindiain) January 18, 2022 లేకపోతే పెను ప్రమాదం... "మేము భద్రత విషయంలో రాజీపడము. కానీ, ఇతర దేశాల్లోని ప్రభుత్వాలు వినియోగించే 5జీ టెక్నాలజీని ఇక్కడ వినియోగించాలని మేము అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. లేకపోతే ఆటోపైలెట్, హెడ్-అప్ డిస్ ప్లేలు, భూభాగ హెచ్చరికలు, పిచ్ నియంత్రణ వంటి ఇతర భద్రతా వ్యవస్థలకు సమాచారాన్ని అందించే కొన్ని విమానాల రేడియో ఆల్టిమేటర్లు మీద ఆ సిగ్నల్స్ ప్రభావం పడుతుంది. అంతిమంగా, పెను ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో హ్యూస్టన్, నెవార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో వంటి ప్రధాన నగరాల్లో ప్రాంతీయ విమానాలపై గణనీయమైన ఆంక్షలు విధించాల్సి ఉంటుంది" అని ఆ దేశ విమానయాన సంస్థలు సూచించాయి. దేశం వాణిజ్యం ఆగిపోతుంది "నిస్సంకోచంగా చెప్పాలంటే దేశం వాణిజ్యం ఆగిపోతుంది" అని కంపెనీలు వైట్ హౌస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ బ్రియాన్ డీస్, రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) అడ్మినిస్ట్రేటర్ స్టీవ్ డిక్సన్, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(FCC) చైర్మెన్ జెస్సికా రోసెన్‌వోర్సెల్‌లకు లేఖ రాశాయి. కొన్ని కీలక విమానాశ్రయాల్లో "విమానాశ్రయ రన్ వేలకు సుమారు 2 మైళ్ల (3.2 కిలోమీటర్ల)లోపల మినహా దేశంలో ప్రతిచోటా 5జీ అమలు చేయాలని" విమానయాన సంస్థలు కోరుతున్నాాయి. గత ఏడాది 80 బిలియన్ల డాలర్లను వెచ్చించి మొత్తం 5జీ టెక్నాలజీ సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను ఎటీ అండ్ టీ, వెరిజోన్ సంస్థలు కొనుగోలు చేశాయి. (చదవండి: 5జీ దెబ్బకు విమాన సేవలకు బ్రేక్..!) -
టెలికం బాకీలు... రిజర్వ్‌లో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: టెలికం సంస్థలు కట్టాల్సిన ఏజీఆర్ బాకీలపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఆర్‌కామ్ తదితర సంస్థల నుంచి స్పెక్ట్రం తీసుకున్నందుకు గాను రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కూడా అదనంగా బాకీలు కట్టాల్సి ఉంటుందా అన్న దానిపై కూడా స్పష్టతనివ్వనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) ఫార్ములా ప్రకారం టెలికం సంస్థలు కట్టాల్సిన స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బాకీలకు సంబంధించిన కేసుపై సోమవారం కూడా విచారణ కొనసాగింది. ఒకవేళ స్పెక్ట్రం విక్రేత గానీ బాకీలు కట్టకుండా అమ్మేసిన పక్షంలో ఆ బకాయీలన్నీ కొనుగోలు సంస్థకు బదిలీ అవుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఒకవేళ టెల్కోలు గానీ బాకీలు కట్టేందుకు సిద్ధంగా లేకపోతే స్పెక్ట్రం కేటాయింపును పూర్తిగా రద్దు చేయాలని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. అయితే, స్పెక్ట్రం రద్దు చేసిన పక్షంలో ప్రభుత్వానికి గానీ బ్యాంకులకు గానీ దక్కేది ఏమీ ఉండదని జియో తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే తెలిపారు. విక్రేత, కొనుగోలుదారు నుంచి విడివిడిగా లేదా సంయుక్తంగా బాకీలను తాము వసూలు చేసుకోవచ్చని టెలికం శాఖ (డాట్) వెల్లడించింది. ఈ వాదనల దరిమిలా దివాలా చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థలు.. స్పెక్ట్రంను విక్రయించవచ్చా అన్న అంశంతో పాటు వాటి నుంచి ప్రభుత్వం ఏజీఆర్‌పరమైన బాకీలను ఎలా రాబట్టాలి అన్న దానిపైన సుప్రీం కోర్టు ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. ఏజీఆర్ బకాయిల విషయంలో సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపునకు విజ్ఞప్తి మరోవైపు, ఏజీఆర్ బకాయిలపై సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ కేంద్రాన్ని కోరింది. అదనంగా లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను కట్టాల్సి రానుండటంతో దీనికి సర్వీస్ ట్యాక్స్ కూడా తోడైతే మరింత భారం అవుతుందని జూలై 17న కేంద్ర టెలికం శాఖకు రాసిన లేఖలో సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 2016 – మార్చి 2017 మధ్యకాలంలో సర్వీస్ ట్యాక్స్ బాకీల కింద టెలికం సంస్థలు రూ. 6,600 కోట్లు కట్టినట్లు తెలిపారు. -
స్పెక్ట్రమ్ షేరింగ్ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలకు సంబంధించి సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) కేసు విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన టెలికం కంపెనీలకు సంబంధించి స్పెక్ట్రమ్ పంపిణీ వివరాలను (షేరింగ్) ఇవ్వాలని శుక్రవారం నాటి విచారణ సందర్భంగా టెలికం శాఖను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దివాలా ప్రక్రియలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రిలయన్స్ జియో మధ్య స్పెక్ట్రమ్ పంపకం జరగ్గా.. ఆర్ కామ్ స్పెక్ట్రమ్ ను వాడుకున్నందుకు, ఆ కంపెనీ స్పెక్ట్రమ్ బకాయిలను జియో ఎందుకు చెల్లించకూడదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం లోగడ విచారణలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్ కామ్ తోపాటు, వీడియోకాన్ దివాలా చర్యలను ఎదుర్కొంటున్న విషయం గమనార్హం. ‘‘వీడియోకాన్ స్పెక్ట్రమ్ బదలాయించాలంటే, దాని కంటే ముందు గత బకాయిలను కంపెనీ చెల్లించాలి’’ అంటూ వీడియోకాన్ విషయమై ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ వీడియోకాన్ చెల్లించకపోతే, ఆ స్పెక్ట్రమ్ ను సొంతం చేసుకున్న భారతీ ఎయిర్ టెల్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి వీడియోకాన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కార్పొరేట్ దివాలా చర్యల ప్రక్రియకు వెలుపల తాము ఎటువంటి బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కలిగిలేమని నివేదించారు. ఏజీఆర్ బకాయిలను ఐబీసీ కింద నిర్వహణ బకాయిలుగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్ కామ్ స్పెక్ట్రమ్ ను జియో వినియోగించుకున్నందున ఆ మొత్తానికి సంబంధించి జియో చెల్లించాల్సిన బకాయిల వివరాలను అడిగినా ఇవ్వలేదేమంటూ ధర్మాసనం టెలికం శాఖను ప్రశ్నించింది. అనంతరం దివాలా చర్యల పరిధిలో ఉన్న కంపెనీల స్పెక్ట్రమ్ పంపిణీకి సంబంధించి ఎంత మేర బకాయిలు రావాలన్న వివరాలను సమర్పించాలని టెలికం శాఖను ఆదేశించింది. 1999 నుంచి ఏ కంపెనీలు స్పెక్ట్రమ్ ను వినియోగించుకున్నదీ, వాటి మధ్య వాణిజ్య ఒప్పంద వివరాలను తమ ముందుంచాలని ధర్మాసనం కోరింది. ఏజీఆర్ బకాయిలను ఏటా కొంత చొప్పున కొన్నేళ్ల పాటు చెల్లించేందుకు అనుమతించాలని భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు ధర్మాసనాన్ని అభ్యర్థించాయి. ఈ రెండు కంపెనీలు కలసి రూ.లక్ష కోట్లకు పైగా ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. టెలికం శాఖ డిమాండ్ ప్రకారం వొడాఫోన్ ఐడియా రూ.58,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.8,000 కోట్లను ఇప్పటి వరకు జమ చేయగలిగింది. భారతీ ఎయిర్ టెల్ రూ.43,000 కోట్ల బకాయిలకు గాను రూ.18,000 కోట్లను చెల్లించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా అధ్యక్షతన గల సుప్రీం ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. -
జియోపై మీ వైఖరి చెప్పండి
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు ప్రభుత్వానికి కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల వివాదం కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. వివరాల్లోకి వెడితే.. దివాలా తీసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కట్టాల్సిన బాకీలను ఆ కంపెనీ స్పెక్ట్రంను వాడుకుంటున్నందున రిలయన్స్ జియో సంస్థ కట్టాలని సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఆర్‌కామ్ దివాలా ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో జియోకు స్పెక్ట్రం విక్రయ అంశంపై కేంద్ర టెలికం శాఖ (డాట్), ఇటు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దివాలా ప్రక్రియ జరుగుతుండగా స్పెక్ట్రంను విక్రయించడానికి లేదన్నది డాట్ భావన కాగా, గరిష్ట విలువను రాబట్టేందుకు విక్రయమే సరైన మార్గమని ఎంసీఏ భావిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం సుప్రీం కోర్టులో జరిగిన వాదనల సందర్భంగా తెలిపారు. దీనికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఏ ఉత్తర్వులు ఇచ్చినా సమ్మతమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్ కట్టాల్సిన బాకీలను జియో చెల్లించే అంశంపై అసలు కేంద్రం వైఖరి ఏమిటన్నది తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఏయేడాదికాయేడు ఆర్‌కామ్ కట్టాల్సిన బాకీల వివరాలను సమర్పించాలంటూ డాట్‌కు సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. -
విస్తారా విమానాల్లో డేటా సర్వీసులు
న్యూఢిల్లీ: విస్తార ఎయిర్‌లైన్స్ కంపెనీ త్వరలోనే తన విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్నది. భారత్‌లో విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్న తొలి విమానయాన సంస్థ విస్తార కానున్నది. విమానాల్లో డేటా సర్వీసులను అందించడం కోసం విస్తార కంపెనీ టాటా గ్రూప్‌నకు చెందిన నెల్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం ఈ సంస్థలు ఇస్రో నుంచి ఒక ట్రాన్స్‌పాండర్‌ను తీసుకున్నాయని, దీనికి అవసరమైన స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని తమను కోరాయని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్ తెలిపారు. ఈ సంస్థలు కోరిన స్పెక్ట్రమ్‌ను కేటాయించామని, వీలైనంత త్వరలోనే విస్తార విమానయాన సంస్థ, తన విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్నదని ఆయన వివరించారు. డేటా సర్వీసులే ముందు... వాయిస్ కాల్స్ కంటే ముందు డేటా సేవలు అందుబాటులోకి వస్తాయని, దీంతో ఓవర్–ద–టాప్(ఓటీసీ) సేవలు పొందవచ్చని, వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చని ప్రకాశ్ పేర్కొన్నారు. వీటి టారిఫ్‌ల నియంత్రణ ప్రభుత్వ పరిధిలో ఉండదని తెలిపారు. ఈ సేవలను ఉచితంగా అందించాలో, లేదా డబ్బులు వసూలు చేయాలో ఆ యా సంస్థలే నిర్ణయిస్తాయని వివరించారు. కాగా విమానాల్లో డేటా సర్వీసులను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెచ్చేది ఇంకా ఖరారు చేయలేదని విస్తార ప్రతినిధి పేర్కొన్నారు. 2015లో కార్యకలాపాలు ప్రారంభించిన విస్తార ప్రస్తుతం 39 విమానాలతో రోజుకు 200 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో టాటా సన్స్‌కు 51% వాటా, మిగిలింది సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఉంది. -
టెలికం ప్యాకేజీపై కమిటీ రద్దు
న్యూఢిల్లీ: స్పెక్ట్రం చార్జీలు చెల్లించడానికి కేంద్రం మారటోరియం రూపంలో వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో టెలికం రంగ సమస్యలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ (సీవోఎస్) రద్దయింది. టెలికం రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తీసుకోతగిన చర్యలపై పలు మార్లు సమావేశమైన సీవోఎస్ ఈ నెల తొలినాళ్లలో కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కమిటీ సిఫార్సుల మేరకే స్పెక్ట్రం యూసేజీ చార్జీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించాయి. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల చెల్లింపునకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో కేంద్రం జోక్యం చేసుకోరాదని భావించిన నేపథ్యంలో సీవోఎస్ రద్దు ప్రాధాన్యం సంతరించుకుంది. సంక్షోభం నుంచి బయటపడేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని, వాయిస్ కాల్స్.. డేటా టారిఫ్‌లను పెంచడం మొదలైన అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేయాలని టెలికం సంస్థలకు ప్రభుత్వం సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) అంశంపై ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో టెల్కోలు దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. టెలికం రంగానికి ఇది మరింత భారమవుతుందని, తోడ్పాటు అందించాలని కేంద్రాన్ని టెల్కోలు కోరుతున్నాయి. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు.. సుప్రీం ఉత్తర్వులపై అదే కోర్టులో రివ్యూ పిటీషన్ కూడా దాఖలు చేశాయి. -
మూడు నెలల్లో బాకీలు కట్టేయాల్సిందే
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మూడు నెలల్లోగా లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తదితర బాకీలన్నీ కట్టేయాలంటూ టెల్కోలకు టెలికం శాఖ(డాట్) ఆదేశాలు జారీ చేసింది. స్వయం మదింపు ప్రాతిపదికన బకాయిలను తీర్చవచ్చంటూ నోటీసుల్లో పేర్కొన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. లైసెన్సు ఫీజు మొదలైన వాటికి ప్రాతిపదిక అయిన ఏజీఆర్‌ను (సవరించిన స్థూల ఆదాయం) లెక్కించే ఫార్ములా విషయంలో.. ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు అక్టోబర్ 24న తీర్పు ఇవ్వడం తెలిసిందే. దీని ప్రకారం 3 నెలల్లోగా వడ్డీ సహా బాకీలు చెల్లించాలంటూ టెల్కోలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. డాట్ అంతర్గతంగా వేసిన లెక్కల ప్రకారం టెల్కోల నుంచి రూ. 1.33 లక్షల కోట్ల దాకా వసూలు కావాల్సి ఉంది. ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 62,188 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 54,184 కోట్లు, బీఎస్ఎన్ఎల్.. ఎంటీఎన్ఎల్ రూ. 10,675 కోట్లు బాకీ పడ్డాయి. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న టెలికం పరిశ్రమ.. ఈ బాకీల చెల్లింపులతో మరింత సంక్షోభంలోకి జారిపోతుందని టెల్కోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
లెసైన్సు పొడిగింపుపై టెల్కోలకు సుప్రీంలో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: స్పెక్ట్రం లెసైన్సుల గడువును పొడిగించాలంటూ సుప్రీం కోర్టుకు వెళ్లిన టెలికం కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలింది. వాటి వాదనల్లో పసలేదంటూ పిటీషన్లను జస్టిస్ జె. చలమేశ్వర్ సారథ్యం లోని బెంచ్ తోసిపుచ్చింది. వొడాఫోన్, భారతీ ఎయిర్టెల్ తదితర సంస్థలు ఈ పిటీషన్లు వేశాయి. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం లెసైన్సుల గడువును మరో పదేళ్ల పాటు పొడిగించకపోవడంతో పాటు తమ వద్దనున్న స్పెక్ట్రంను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుని వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ కంపెనీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. 20 ఏళ్ల పాటు వర్తించేలా గతంలో ఇచ్చిన లెసైన్సు ఒప్పంద నిబంధనల ప్రకారం ప్రభుత్వం మరో 10 ఏళ్ల పాటు పొడిగించాల్సి ఉంటుందని టెల్కోలు వాదించాయి. అయితే, నిబంధనల్లో ‘పొడిగించవచ్చు’ అని మాత్రమే ఉంది కనుక, దానిపై నిర్ణయం తీసుకోవడం అన్నది పరిస్థితులను బట్టి తన విచక్షణపై ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం వాదించింది.