ఎయిర్సెల్ 7 సర్కిళ్లు ఎయిర్టెల్ సొంతం | Airtel Acquires Spectrum in 7 Circles in Trading Deal With Aircel | Sakshi
Sakshi News home page

ఎయిర్సెల్ 7 సర్కిళ్లు ఎయిర్టెల్ సొంతం

Published Fri, Aug 12 2016 11:56 AM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM

ఎయిర్సెల్ 7 సర్కిళ్లు ఎయిర్టెల్ సొంతం - Sakshi

ఎయిర్సెల్ 7 సర్కిళ్లు ఎయిర్టెల్ సొంతం

భారతీ ఎయిర్టెల్, ఎయిర్సెల్ కు మధ్య మొత్తం ఏడు సర్కిళ్లలో స్పెక్ట్రమ్ ట్రేడింగ్ డీల్ కుదిరింది. ఒడిశాలోని ఎయిర్సెల్ 4 జీ ఎయిర్వేవ్స్కు సంబంధించిన స్పెక్ట్రమ్ హక్కులను ఎయిర్టెల్ సొంతం చేసుకుంది. ఈ కొనుగోలుతో మొత్తం ఎయిర్సెల్ ఎనిమిది సర్కిళ్లలో ఏడింటినీ ఎయిర్టెలే నిర్వహించనుంది. తమిళనాడు(చెన్నైతో కలిపి), బీహార్, జమ్మూ అండ్ కశ్మీర్, పశ్చిమ బెంగాల్, అస్సాం, నార్త్ ఈస్ట్, ఒడిశా సర్కిళ్లలో పూర్తి 4జీ ఎయిర్వేవ్స్ హక్కులను ఎయిర్టెల్ కొనుగోలు చేసింది.


గతనెలే టెలికాం సంస్థలు కుదుర్చుకోబోయే ఈ స్పెక్ట్రమ్ షేరింగ్ డీల్కు టెలికాం శాఖ నుంచి డీఓటీ నుంచి అనుమతి లభించింది. ఈ కొనుగోలు హక్కులతో ఎయిర్సెల్ కు చెందిన 20 మెగాహెడ్జ్ 2300 బ్యాండ్ బీడబ్ల్యూఏ స్పెక్ట్రమ్ హక్కులను ఎయిర్టెల్ వాడుకోనున్నట్టు బీఎస్ఈకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది. ఒడిశా సర్కిల్ ప్రతిపాదన లావాదేవీలను విజయవంతంగా ముగించినట్టు ఎయిర్టెల్ తెలిపింది.

స్పెక్ట్రమ్ ట్రేడింగ్ డీల్తో రూ.3500 కోట్లకు ఎయిర్సెల్ కు చెందిన ఎనిమిది సర్కిళ్ల 4జీ ఎయిర్వేవ్స్ను సొంతంచేసుకోబోతున్నామని భారతీ ఎయిర్టెల్ ఏప్రిల్ 8న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిర్టెల్, ఎయిర్సెల్ మధ్య జరిగిన ఈ స్పెక్ట్రమ్ డీల్ 2030 సెప్టెంబర్ 20 వరకు కొనసాగనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement