న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలంలో నాలుగో రోజు (శుక్రవారం) ముగిసే నాటికి రూ. 1,49,855 కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలయ్యాయి. కొత్తగా రూ. 231.6 కోట్ల బిడ్లు వచ్చాయి. వేలానికి ఉంచిన మొత్తం స్పెక్ట్రంలో ఇప్పటివరకూ 71 శాతం అమ్ముడైనట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
నాలుగో రోజైన శుక్రవారం మరో ఏడు రౌండ్లు జరిగాయని, దీంతో మొత్తం రౌండ్ల సంఖ్య 23కి చేరినట్లు వివరించారు. అయిదో రోజైన శనివారం కూడా వేలం కొనసాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు, టెలికం పరిశ్రమ వృద్ధి తీరుతెన్నులపై చర్చించేందుకు పీఈ ఫండ్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్వెస్టర్లు, బ్యాంకులతో మంత్రి శనివారం ముంబైలో భేటీ కానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment