న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించిన ప్రక్రియ .. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే ముందుకెడుతోందని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అయితే, టెలికం రంగ నియంత్రణ ట్రాయ్ చేసిన సిఫార్సులపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. మరికొన్ని వారాల్లో ఇతర సమస్యలకు తగిన పరిష్కారం కనుగొనగలమని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ’ఫిన్‌క్లువేషన్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. స్పెక్ట్రం వేలానికి సంబంధించి ధరను తగ్గిస్తూ, ఇతరత్రా విధి విధానాలపై ట్రాయ్ ఇటీవలే సిఫార్సులు చేయగా.. తగ్గించిన రేటు కూడా చాలా ఎక్కువేనంటూ టెలికం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వైష్ణవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దేశీ స్టార్టప్‌లకు గుర్తింపు..
భారత స్టార్టప్ వ్యవస్థ అంతర్జాతీయంగా గుర్తింపు, గౌరవం పొందుతోందని వైష్ణవ్ చెప్పారు. బడుగు, బలహీన వర్గాల జీవితాలను మార్చే వినూత్న ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని స్టార్టప్‌లు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆయన సూచించారు.
ధర తగ్గించండి: సునీల్ మిట్టల్
5జీ స్పెక్ట్రం కోసం భారీ రేటును నిర్ణయించవద్దంటూ భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ కేంద్రాన్ని కోరారు. టెల్కోలు.. స్పెక్ట్రం కొనుగోలు కోసం ఉన్న డబ్బంతా వెచ్చించేసే బదులు ఆ నిధులను నెట్‌వర్క్ ఏర్పాటుపై ఇన్వెస్ట్ చేస్తే సర్వీసులను మరింత వేగవంతంగా అందుబాటులోకి తెచ్చే వీలుంటుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.
చదవండి: 5జీ స్పెక్ట్రం బేస్ ధర 35% తగ్గించవచ్చు
Comments
Please login to add a commentAdd a comment