న్యూఢిల్లీ : టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కంపెనీకి ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌కు రూ.5,237 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. వన్‌టైమ్ స్పెక్ట్రమ్ చార్జీలకు సంబంధించి తాజా తీర్పు కారణంగా రూ.7,004 కోట్లు చెల్లించడంతో ఈ నష్టాలు ఈ స్థాయిలో పెరిగాయని కంపెనీ తెలిపింది. గత ఏడాది మార్చి క్వార్టర్‌లో రూ.107 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం రూ.20,602 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.23,723 కోట్లకు పెరిగింది. ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి (ఏఆర్‌పీయూ) రూ.123 నుంచి రూ.154కు పెరిగింది. ఈ కంపెనీ గత ఏడాది డిసెంబర్‌లోటెలికం సేవల ధరలను పెంచింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్ షేర్ 2.6 శాతం నష్టంతో రూ.540 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment