న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రం వేలం మూడో విడత వచ్చే ఏడాది జనవరి 7న ప్రారంభం కావచ్చు. టెలికం విభాగం (డాట్) ఏర్పాటు చేసిన అంతర్ మంత్రిత్వ శాఖల కమిటీ (ఐఎంసీ) చూచాయగా రూపొందించిన షెడ్యూల్‌ను బట్టి ఇది తెలుస్తోంది. ట్రాయ్ సిఫార్సుల పరిశీలనను పూర్తి చేసి, నవంబర్ 7 కల్లా సాధికారిక మంత్రుల బృందానికి (ఈజీవోఎం) నివేదిక సమర్పించాలని ఐఎంసీ నిర్ణయించింది. మరోవైపు ట్రాయ్ సిఫార్సులపై నిర్ణయం తీసుకునేందుకు టెలికం కమిషన్ ఈ నెల 29న మలి విడతగా సమావేశం కానుంది. ప్రక్రియంతా పూర్తయ్యి.. నవంబర్ 23 నాటికి కేబినెట్ ఆమోదం లభించి, వేలం జనవరి 7న ప్రారంభం కాగలదని గత నెల 20 నాటి ఐఎంసీ సమావేశంలో అంచనా వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడో విడత స్పెక్ట్రం వేలంతో రూ. 11,300 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
జనవరి 7 నుంచి మూడో విడత స్పెక్ట్రం వేలం
Published Tue, Oct 8 2013 1:47 AM | Last Updated on Fri, Nov 9 2018 6:16 PM
Advertisement