న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్‌కి ఉపయోగించే స్పెక్ట్రంను వేలం వేస్తేనే విదేశీ దిగ్గజాలతో దేశీ టెల్కోలు పోటీపడేందుకు అవకాశాలు లభిస్తాయని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి రాసిన లేఖలో రిలయన్స్ జియో పేర్కొంది. దేశీయంగా మూడు టెల్కోలు అనేక సంవత్సరాలుగా నిర్మించుకున్న సామర్థ్యాల కన్నా స్టార్‌లింక్, క్విపర్ శాట్‌కామ్ బ్యాండ్‌విడ్త్ అధికమని తెలిపింది.
శాట్‌కామ్ సంస్థలు కేవలం టెరెస్ట్రియల్ కవరేజీ లేని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే సేవలు అందిస్తాయి కాబట్టి వాటికి ప్రాధాన్యతనిస్తామనడం సరికాదని జియో వ్యాఖ్యానించింది. స్టార్‌లింక్, క్విపర్, ఇతరత్రా శాట్‌కామ్ దిగ్గజాలు తాము పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ సర్వీసులను కూడా అందించేందుకు పోటీపడతామని ఇప్పటికే వెల్లడించినట్లు తెలిపింది.
ఇదీ చదవండి: వాట్సాప్ గ్రూప్‌లకు లైసెన్స్.. ఫీజు కూడా!
ఈ నేపథ్యంలో స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించిన పక్షంలో వాటితో పోటీపడేందుకు దేశీ సంస్థలకు సమాన అవకాశాలు దొరకవని పేర్కొంది. అంతర్జాతీయ విధానాలకు తగ్గట్లుగా శాట్‌కామ్ స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుండటంతో జియో లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment