అక్కడ వాట్సాప్ గ్రూప్‌ను నిర్వహించడమంటే ఆషామాషీ కాదు. గ్రూప్ అడ్మిన్‌కు లైసెన్స్ ఉండాలి. ఇందుకోసం ఫీజు కూడా చెల్లించాలి. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? పూర్తి వివరాల కోసం ఈ కథనంలో చదివేయండి..
వాట్సాప్ గ్రూప్ నిర్వహణకు సంబంధించి జింబాబ్వే ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేసింది. దీని ప్రకారం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లందరూ జింబాబ్వే పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (POTRAZ)లో నమోదు చేసుకోవాలి. వారి గ్రూప్ నిర్వహణకు లైసెన్స్ పొందాలి. ఈ లైసెన్స్ కోసం ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం కనీసం 50 డాలర్లు (సుమారు రూ.4,200) ఖర్చవుతుంది. ఈ విషయాన్ని జింబాబ్వే సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పోస్టల్ అండ్ కొరియర్ సర్వీసెస్ (ICTPCS) మంత్రి తటెండా మావెటెరా ప్రకటించారు.
కొత్త రూల్ ఎందుకంటే..
తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా, దేశంలో శాంతి నెలకొనేందుకు ఆ దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఈ కొత్త వాట్సాప్ నిబంధనను రూపొందించారు. ఈ చట్టం ప్రకారం, ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుర్తించడానికి ఉపయోగించే ఏదైనా సమాచారాన్ని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల వద్ద సభ్యుల ఫోన్ నంబర్లు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రకారం, వారు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వస్తారు.
ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!
Comments
Please login to add a commentAdd a comment