licence
-
లైసెన్స్‌లు వెనక్కి ఇచ్చేసిన ఎన్బీఎఫ్సీలు
రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, ఐడీఎఫ్సీ లిమిటెడ్ తమ ఎన్బీఎఫ్సీ లైసెన్స్‌లను వెనక్కిచ్చేశాయి. ఇలా మొత్తం 20 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (సీవోఆర్)లను స్వాధీనం చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇందులో మనోవే ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎన్బీఎఫ్సీ వ్యాపారం నుంచి తప్పుకున్నాయి.ఐడీఎఫ్సీ లిమిటెడ్, ఐడీఎఫ్సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ తదితర 16 సంస్థలు విలీనాల కారణంగా సీవోఆర్ను స్వాధీనం చేశాయి. వీటికి అదనంగా ఆర్బీఐ తనంతటగా 17 ఎన్‌బీఎఫ్‌సీల సీవోఆర్లను రద్దు చేసింది. వీటి రిజిస్టర్డ్ కార్యాలయం పశ్చిమబెంగాల్లో ఉన్నట్టు ఆర్బీఐ తెలిపింది. మరోవైపు కామధేను ఫైనాన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ లైసెన్స్‌ను పునరుద్ధరించినట్టు ప్రకటించింది.ఎన్బీఎఫ్సీ అంటే.. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) అనేది కంపెనీల చట్టం, 1956 కింద నమోదైన ఒక కంపెనీ. ఇది రుణాలు ఇవ్వడం, ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు జారీ చేసిన షేర్లు, స్టాక్‌లు, బాండ్లు, డిబెంచర్లు, సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, బీమా వ్యాపారం, చిట్ వ్యాపారం వంటి కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటుంది. ఎన్బీఎఫ్సీలు, బ్యాంకులకు తేడాఎన్బీఎఫ్సీలు రుణాలు ఇస్తాయి. పెట్టుబడులు పెడతాయి. కాబట్టి వాటి కార్యకలాపాలు బ్యాంకుల కార్యకలాపాలను పోలి ఉంటాయి. అయితే వీటి మధ్య ప్రధానంగా కొన్ని తేడాలు ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ డిమాండ్ డిపాజిట్లను అంగీకరించదు. ఎన్బీఎఫ్సీలు చెల్లింపు, సెటిల్మెంట్ వ్యవస్థలో భాగం కావు. తమపైనే చెక్కులను జారీ చేయలేవు. బ్యాంకుల మాదిరిగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఎన్‌బీఎఫ్‌సీల డిపాజిటర్లకు అందుబాటులో లేదు. -
'ఏఏ' వ్యాపారానికి ఫోన్‌పే గుడ్‌బై.. లైసెన్స్ వెనక్కి..
ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే (PhonePe) అకౌంట్ అగ్రిగేషన్ (ఏఏ) వ్యాపారం నుంచి వైదొలిగినట్టు ప్రకటించింది. ఈ సేవలు అందించేందుకు సరిపడా భాగస్వాములను పొందలేకపోయినట్టు తెలిపింది. ఎన్బీఎఫ్సీ–ఏఏ లైసెన్స్‌ను (license) ఆర్బీఐకి (RBI) స్వాధీనం చేయాలని నిర్ణయించినట్టు, అకౌంట్ అగ్రిగేషన్ కార్యకలాపాలను మూసివేసే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.తన యూజర్ల ఆమోదం మేరకు వారి ఆర్థిక సమాచారాన్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లతో పంచుకోవడం ద్వారా రుణాలు, క్రెడిట్ కార్డులు తదితర సేవలు అందించేందుకు ఈ లైసెన్స్ కింద అనుమతి ఉంటుంది. 2023 జూన్‌లో ఫోన్‌పేకు ఎన్బీఎఫ్సీ–ఏఏ లైసెన్స్ రావడం గమనార్హం. ‘‘రెండేళ్లలోపే మా ఏఏ ప్లాట్‌ఫామ్‌పై 5 కోట్ల మంది భారతీయులను చేర్చుకోవడం గర్వకారణంగా ఉంది. పోటీ ప్రాధాన్యతల దృష్ట్యా ఎక్కువ మంది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్లను మా ప్లాట్‌ఫామ్ వైపు ఆకర్షించలేకపోయాం. దీంతో ఫోన్‌పే గ్రూప్ అకౌంట్ అగ్రిగేషన్ వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీనికి బదులు మార్కెట్లో ఉన్న ఇతర ఏఏలతో జట్టు కడతాం’’అని ఫోన్‌పే ప్రకటించింది. తమ ఏఏ యూజర్లకు త్వరలోనే ఈ విషయాన్ని తెలియజేస్తామని తెలిపింది. -
భారత్‌లోకి స్టార్‌లింక్.. లైన్ క్లియర్..?
దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన షరతులను ఎలాన్‌మస్క్(Elonmusk) ఆధ్వర్యంలోని స్టార్‌లింక్(StarLink) అధికారికంగా అంగీకరించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని స్టార్‌లింక్ ఎప్పటినుంచో యోచిస్తోంది.షరతులు సడలించాలని వినతిప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్లింగ్ అంగీకరించింది. అయితే ఇటీవల టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (DoT) రాసిన లేఖలో స్టార్‌లింక్ కొన్ని షరతులను సడలించాలని అభ్యర్థించింది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత కాలక్రమేణా వాటిని పాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, స్టార్‌లింక్, అమెజాన్‌కు చెందిన కూపర్ వంటి గ్లోబల్ సంస్థలకు ఎలాంటి నిబంధనలను సడలించబోమని ప్రభుత్వం తన వైఖరిని గతంలోనే స్పష్టం చేసింది.చందాదారులను కోల్పోయే ప్రమాదంప్రస్తుతం స్టార్‌లింక్ దరఖాస్తును హోం మంత్రిత్వ శాఖ, భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయి. స్టార్‌లింక్ అధికారికంగా దరఖాస్తు పూర్తి చేసిన తరువాత ప్రభుత్వం ఎలాంటి వివరణ కోరలేదు. ఒకవేళ దీనికి ప్రభుత్వం ఆమోదం లభిస్తే ఈ ఏడాది చివరి నాటికి స్టార్‌లింక్ శాటిలైట్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్టార్‌లింక్ వంటి సంస్థలు పట్టణ ప్రాంతాల్లో సేవలు అందించడం ద్వారా తమ చందాదారులను కోల్పోయే ప్రమాదం ఉందని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: అదానీ గ్రీన్ ఒప్పందంపై శ్రీలంక పునఃసమీక్షప్లాన్ల ధరలు ఇలా..స్టార్‌లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీతో సహా గణనీయమైన ప్రయోజనాలు ఉంటాయని కొందరు భావిస్తున్నారు. కంపెనీ శాటిలైట్ ఇంటర్నెట్ ప్లాన్ల ధర నెలకు 10-500 డాలర్లు(రూ.840-రూ.5,000)గా ఉంటుందని అంచనా. ఈ ధర సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, పరిమిత కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలకు ఎంతో మేలని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
భారత మార్కెట్లోకి స్టార్‌లింక్!
న్యూఢిల్లీ: పలు దేశాలకు ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ భారతీయ విపణిలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధంచేసుకుంటోంది. భారత చట్టాల ప్రకారం సంస్థను నడిపేందుకు స్టార్లింగ్ ముందుకు వచ్చిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ప్రభుత్వ సవరించిన నియమనిబంధనల ప్రకారం ఏదైనా విదేశీ కంపెనీ తమ భారతీయ యూజర్ల సమాచారాన్ని దేశీయంగానే నిల్వచేయాల్సి ఉంటుంది. ఇందుకు స్టార్‌లింక్ ఒప్పుకుందని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో స్టార్‌లింక్ ప్రతినిధులు పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.శాటిటైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల(జీఎంపీసీఎస్) లైసెన్స్ మంజూరుకు అనుసరించాల్సిన విధివిధానాలను పాటిస్తామని సంస్థ తెలిపింది. స్టార్‌లింక్ సంస్థ ఇంకా తమ సమ్మతి పత్రాలను సమర్పించాల్సి ఉంది. సమర్పణ పూర్తయితే సంస్థ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభంకానున్నాయని తెలుస్తోంది. 2022 అక్టోబర్‌లో జీఎంపీసీఎస్ లైసెన్స్ కోసం స్టార్‌లింక్ దరఖాస్తు చేసుకుంది. ఈ రంగంలోని భారత నియంత్రణసంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్–స్పేస్) సంబంధిత అనుమతులను మంజూరుచేయనుంది. ఆలోపు తమ అభ్యంతరాలపై సరైన వివరణ ఇవ్వాలని స్టార్‌లింక్‌ను ఇన్–స్పేస్ కోరింది. స్టార్‌లింక్‌కు పోటీగా మరో ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్ సంస్థలో భాగమైన ‘ప్రాజెక్ట్ కూపర్’సంస్థ సైతం జీఎంపీసీఎస్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది.ఈ రెండు సంస్థల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని ఇన్–స్పేస్ చైర్మన్ పవన్ గోయంకా చెప్పారు. భద్రతా నియమాలకులోబడి సంస్థ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం అన్నారు. అగ్రరాజ్యాధినేతగా తన సన్నిహితుడు ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో భారత్‌సహా కీలక శాటిటైల్ ఇంటర్నెట్ సేవల మార్కెట్లలో మెజారిటీ వాటా కైవసంచేసుకోవాలని మస్క్ ఉవ్విళ్లూరుతున్నారు. స్ప్రెక్టమ్ కేటాయింపులు, తుది ధరలపైనే భారత్‌లో స్టార్‌లింక్ భవితవ్వం ఆధారపడిఉంటుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే భారతి గ్రూప్‌కు చెందిన వన్‌వెబ్, జియా–ఎస్ఈఎస్ సంయుక్త సంస్థ అయిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కు లైసెన్సులు ఇచ్చింది. వీటికి ఇంకా స్ప్రెక్టమ్ కేటాయింపులు జరగలేదు. అయితే స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించిన సిఫార్సులకు ట్రాయ్ డిసెంబర్ 15వ తేదీలోపు తుదిరూపునివ్వనుంది. -
వాట్సాప్ గ్రూప్‌లకు లైసెన్స్.. ఫీజు కూడా!
అక్కడ వాట్సాప్ గ్రూప్‌ను నిర్వహించడమంటే ఆషామాషీ కాదు. గ్రూప్ అడ్మిన్‌కు లైసెన్స్ ఉండాలి. ఇందుకోసం ఫీజు కూడా చెల్లించాలి. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? పూర్తి వివరాల కోసం ఈ కథనంలో చదివేయండి..వాట్సాప్ గ్రూప్ నిర్వహణకు సంబంధించి జింబాబ్వే ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేసింది. దీని ప్రకారం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లందరూ జింబాబ్వే పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (POTRAZ)లో నమోదు చేసుకోవాలి. వారి గ్రూప్ నిర్వహణకు లైసెన్స్ పొందాలి. ఈ లైసెన్స్ కోసం ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం కనీసం 50 డాలర్లు (సుమారు రూ.4,200) ఖర్చవుతుంది. ఈ విషయాన్ని జింబాబ్వే సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పోస్టల్ అండ్ కొరియర్ సర్వీసెస్ (ICTPCS) మంత్రి తటెండా మావెటెరా ప్రకటించారు.కొత్త రూల్ ఎందుకంటే..తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా, దేశంలో శాంతి నెలకొనేందుకు ఆ దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఈ కొత్త వాట్సాప్ నిబంధనను రూపొందించారు. ఈ చట్టం ప్రకారం, ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుర్తించడానికి ఉపయోగించే ఏదైనా సమాచారాన్ని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల వద్ద సభ్యుల ఫోన్ నంబర్లు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రకారం, వారు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వస్తారు.ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు! -
కాంగ్రెస్ లైసెన్స్ రద్దు చేశా.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
రాయ్‌పూర్: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కాంగ్రెస్, ఇండియా కూటమిలు కోపంతో ఉన్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. బస్తర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 500 ఏళ్ల కల నెరవేరి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తయినందుకు రాముని మాతృమూర్తి పుట్టినల్లు అయిన ఛత్తీస్‌గఢ్ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అయితే రాముని గుడి విషయంలో కాంగ్రెస్ ఇండియా కూటమి మాత్రం కోపంగా ఉన్నాయని సెటైర్లు వేశారు. రాముని ప్రాణ ప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ తిరస్కరించిందని ఎద్దేవా చేశారు. ఆహ్వానం తిరస్కరించడం తప్పని మాట్లాడిన నేతలను ఆ ఫ్యామిలీ పార్టీ నుంచి బయటికి పంపించిందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని దోచుకునేందుకు తమకు లైసెన్స్ ఉందని కాంగ్రెస్ భావించిందని, అయితే 2014లో మోదీ ప్రభుత్వం వచ్చి ఆ లూఠీ లైసెన్స్‌ను రద్దు చేసిందన్నారు. ప్రజలు మోదీకి లైసెన్స్ ఇవ్వడం వల్లే కాంగ్రెస్ దోపిడీ లైసెన్స్‌ను మోదీ రద్దు చేయగలిగాడని చెప్పారు. గిరిజనులను కాంగ్రెస్ ఎప్పుడూ అవమానించిందని, బీజేపీ మాత్రం గిరిజన మహిళన రాష్ట్రపతిని చేసిందని గుర్తు చేశారు. ఇదీ చదవండి.. ప్రధానిపై పోటీ.. ఈ ట్రాన్స్‌జెండర్ గురించి తెలుసా -
లైసెన్స్ లేని ‘మ్యూజిక్’
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగం 2022 నుంచి పునఃప్రారంభించిన విధానం ప్రకారం ప్రతి పబ్ కచి్చతంగా అమ్యూజ్మెంట్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. ఇది లేకపోతే కేవలం ఓ బార్ మాదిరిగా వ్యవహరించాలే తప్ప మ్యూజిక్కు అనుమతి ఉండదు. ఇప్పటికీ సిటీలో అనేక పబ్‌లు ఈ అనుమతి లేకుండానే యథేచ్ఛగా కార్యకలాపాలు సాగించేస్తున్నాయి. అప్పుడప్పుడు దాడులు చేస్తున్న పోలీసులు సైతం ఓ బెయిలబుల్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. పోలీసు నిబంధనల్ని పట్టించుకోని వారి విషయం ఇలా ఉంటే.. కొందరు పబ్స్ యజమానులు తాము ఈ అమ్యూజ్మెంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినా అనుమతి లభించట్లేదని ఆరోపిస్తున్నారు. పదేళ్ల క్రితం నిలిచిపోయిన విధానం.. నగరంలో ఒకప్పుడు పబ్స్‌కు లైసెన్సులు జారీ చేయడంలో పోలీసు విభాగానికీ కీలక పాత్ర ఉండేది. వీళ్లు సైతం క్లియరెన్స్ ఇస్తేనే పబ్ నడిచేందుకు అనుమతి ఉండేది. 2015 నుంచి అమలులోకి వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానంతో ఈ పద్ధతికి ఫుల్స్టాప్ పడింది. వ్యాపార సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం కోసమంటూ పబ్స్‌కు పోలీసు లైసెన్స్ విధానాన్ని ప్రభుత్వం అటకెక్కించేసింది. ఫలితంగా కొన్నాళ్లు పరిస్థితులు సజావుగానే ఉన్నా.. ఆపై అసలు సమస్యలు మొదలయ్యాయి. అనేక పబ్స్ ఉల్లంఘనలు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారిపోయాయి. ఈ విషయంపై హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసులు 2022 నుంచి పాత విధానాన్ని పునరుద్ధరించారు. అధికారిక వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు.. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంటర్టైన్మెంట్, ఎమ్యూజ్మెంట్ లైసెన్సుల జారీకి నగర పోలీసులు 2022 డిసెంబర్ 20 నుంచి శ్రీకారం చుట్టారు. పోలీసుస్టేషన్లు, ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే జారీ చేసే విధానం ప్రారంభించారు. ఈ అవకాశంతో కూడిన నగర పోలీసు వెబ్సైట్ ( ఠీఠీఠీ. జిyఛ్ఛీట్చb్చఛీఞౌ జీఛ్ఛి. జౌఠి. జీn) కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా దరఖాస్తును 15 నిమిషాల్లో సబి్మట్ చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. దీన్ని పరిశీలించే పోలీసు విభాగం కొత్త లైసెన్సును 30 రోజుల్లో, రెన్యువల్‌ను 15 రోజుల్లో పూర్తి చేసేలా సమయాన్ని నిర్దేశించారు. దీనికి ముందు స్థానిక శాంతిభద్రతల విభాగం (ఎల్ అండ్ ఓ), ట్రాఫిక్ డీసీపీలు దరఖాస్తుదారుడు పబ్ ఏర్పాటు చేయనున్న భవనాన్ని పరిశీలించేలా నిబంధనలు రూపొందించారు. పక్కా పరిశీలన తర్వాతే అనుమతి... ఈ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అధికారులు ఆ పబ్ ఉన్న ప్రాంతం, చుట్టుపక్కల వారికి ఏవైనా ఇబ్బందులు కలుగుతాయా? సౌండ్ పొల్యూషన్‌కు ఆస్కారం ఉందా? అవసరమైన స్థాయిలో పార్కింగ్ వసతులు ఉన్నాయా? తదితర అంశాలను పరిశీలిస్తారు. అవసరమైన అన్ని నిబంధనల ప్రకారం ఉంటేనే అమ్యూజ్మెంట్ లైసెన్సు జారీ చేయాల్సిందిగా కోరుతూ నగర కొత్వాల్‌కు సిఫార్సు చేస్తారు. ఈ విధానం కొత్తగా ఏర్పాటు చేయబోయే పబ్స్‌కు మాత్రమే కాదు.. అప్పటికే ఉన్న వాటికీ వర్తింస్తుంది. సరైన పార్కింగ్ వసతి లేని వారిని నిర్ణీత సమయం ఇచ్చి పార్కింగ్ వసతి ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తారు. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ బయటకు రాకుండా చర్యలు తీసుకునేలా చేస్తారు. కేవలం రాత్రి వేళల్లోనే కాకుండా ఏ సమయంలో ఈ పబ్స్‌లో వచ్చే శబ్దాలతో స్థానికులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటారు. వాళ్లు తీసుకోరు.. వీళ్లు అడిగినా ఇవ్వరు.. ► ఎమ్యూజ్మెంట్ లైసెన్స్ విధానం పునరుద్ధరించి 14 నెలల దాటుతున్నా.. ఇప్పటికీ నగరంలోని అనేక పబ్స్ ఇది లేకుండా, కేవలం ఎక్సైజ్, జీహెచ్ఎంసీ అధికారులు ఇచి్చన పర్మిషన్లతో నడిపించేస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పబ్‌ల జాబితా రూపొందించి, వాటిలో ఎన్నింటికీ ఈ ఎమ్యూజ్మెంట్ లైసెన్స్ ఉంది? ఎన్ని దరఖాస్తు చేశాయి? ఎన్ని ఈ నిబంధనల్ని పట్టించుకోవట్లేదు? అనే అంశాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ► పోలీసులు మాత్రం అప్పుడప్పుడు దాడులు చేస్తున్నారు. లైసెన్స్ లేదంటూ ఓ కేసు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. లైసెన్స్ తీసుకోని వారి విషయం ఇలా ఉంటే.. కొందరు దీన్ని పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసినా.. పోలీసులు పట్టించుకోవట్లేదు. కొత్త లైసెన్సు జారీ 30 రోజుల్లో, రెన్యువల్ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేసేలా గడువు నిర్దేశించుకున్నా ఇది అమలు కావట్లేదు. ఈ విషయం తెలిసిన మిగిలిన పబ్స్ యజమానులూ దరఖాస్తు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. -
ఆర్బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు
గత కొన్ని రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా రూల్స్ అతిక్రమించిన బ్యాంక్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం.. లేదా భారీ జరిమానాలు విధించడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లోని అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది. ఈ బ్యాంకుకు సరైన ఆదాయం లేకపోవడమే కాకుండా.. ఆదాయ మార్గాలు వచ్చే అవకాశాలు కూడా బాగా క్షిణించడంతో RBI ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడంతో లావాదేవీలన్నీ కూడా వెంటనే నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. అయితే కస్టమర్లు ఆందోళన చెందకుండా ఉండటానికి ప్రతి డిపాజిటర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి రూ.5 లక్షల బీమా క్లెయిమ్ స్వీకరించడానికి అర్హులని వెల్లడించింది. ఇదీ చదవండి: రంగంలోకి గూగూల్ ఏఐ ‘జెమినీ’.. పూర్తి వివరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం ఇదే మొదటి సారి కాదు, గత కొన్ని రోజులకు ముందు కొల్లాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న 'శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్' లైసెన్స్ రద్దు చేస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్ఎ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ వంటి వాటికి భారీ జరిమానాలు విధించింది. -
మరో బ్యాంకు లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ.. కారణం ఇదే!
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది, మరి కొన్ని బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసే దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఈ వరుసలో తాజాగా 'లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్' చేరింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆర్బీఐ ఉత్తరప్రదేశ్‌లోని కోఆపరేటివ్ కమిషనర్ & రిజిస్ట్రార్‌ను కూడా ఈ బ్యాంకును మూసివేయడానికి కావాల్సిన ఉత్తర్వు జారీ చేయాలని, సహకార బ్యాంకుకు లిక్విడేటర్‌ను నియమించాలని వెల్లడించినట్లు సమాచారం. బ్యాంకు దివాళా తీసిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ వద్ద తగిన మూలధనం లేకపోవడమే కాకుండా.. ఆదాయ అవకాశాలు కూడా లేకపోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాల అనుమతిని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే లిక్విడేషన్ మీద ప్రతి డిపాజిటర్, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని రూ. 5 లక్షల వరకు పొందేందుకు అర్హులు. ఇదీ చదవండి: 19 ఏళ్లనాటి కల.. ఇప్పుడు నిజమైంది.. ఈజ్‌మైట్రిప్ కో-ఫౌండర్ బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం, 99.53 శాతం డిపాజిటర్లు డిఐసిజిసి నుంచి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు అని ఆర్బీఐ తెలిపింది. మొత్తం మీద ఇకపై లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎలాంటి వ్యాపార లావాదేవీలు, బ్యాంకింగ్ కార్యకాలపు నిరవహించడం పూర్తిగా నిషేధం. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయి. -
ఈ బ్యాంకు లైసెన్స్ రద్దుచేసిన ఆర్బీఐ: అకౌంట్ ఉందా చెక్ చేసుకోండి!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముంబైకి చెందిన బ్యాంకుకు భారీ షాకిచ్చింది. ది కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రద్దు చేసింది. ఈ మేరకు ఆర్బీఐ ఒక ప్రకటన జారీ చేసింది. ఈ సహకార బ్యాంకుకు తగిన మూలధనం, ఆదాయ అవకాశాలు లేనందున లైసెన్స్‌ను రద్దు చేసినట్లు ఆర్బీఐ సోమవారం తెలిపింది. ఇదీ చదవండి: బాలీవుడ్ స్టార్ బిల్డింగ్‌లో సూపర్‌మార్కెట్: నెలకు అద్దె ఎంతో తెలుసా? అలాగే దీని 'బ్యాంకింగ్' వ్యాపారాన్ని కూడా బ్యాన్ చేసింది. డిపాజిట్ల స్వీకారం, డిపాజిట్ల మనీ తిరిగి చెల్లించడం లాంటి వాటిపై కూడా నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. సహకార మంత్రిత్వ శాఖలోని సహకార సంఘాల అదనపు కార్యదర్శి & సెంట్రల్ రిజిస్ట్రార్‌ను కూడా బ్యాంకును మూసివేసేందుకు ఒక ఉత్తర్వు జారీ చేయాలని , బ్యాంకుకు లిక్విడేటర్‌ను నియమించాలని అభ్యర్థించామని పేర్కొంది. కాగా నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝళిపిస్తున్న ఆర్బీఐ ఎస్బీఐ సహా మూడుప్రభుత్వ రంగ బ్యాంకులకు భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. రరుణాలకు సంబంధించిన మార్గదర్శకాలు పాటించ లేదంటూ ఎస్బీఐకి రూ. 1.30 కోట్లు ద్రవ్య జరిమానా, ఇండియన్ బ్యాంకుకు రూ. 1.62 కోట్లు, అలాగే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుకు రూ. 1 కోటి జరిమానా విధించింది. -
‘ఆలివ్‌రిడ్లే’కు ప్రత్యేక రక్షణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్ల ఫ్యాన్ రెక్కలు తగిలి ప్రాణాలు కోల్పోతున్న అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కాపాడేందుకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇకనుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్లకు లైసెన్స్‌లు తప్పనిసరి చేసింది. మరబోట్లు, మెకనైజ్డ్ బోట్ల ఫ్యాన్ల రెక్కలు ఆలివ్‌రిడ్లే తాబేళ్లకు తగలకుండా ప్రత్యేక పరికరాలను అమర్చాలని నిర్ణయించింది. కొత్త మరబోట్లకు అనుమతిచ్చే సమయంలోనే ఆలివ్‌రిడ్లే తాబేళ్ల రక్షణకు ప్రత్యేక షరతులు విధించనుంది. ఈ తాబేళ్లకు ముప్పు కలిగిస్తే వన్యప్రాణి చట్టం–1972 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది. తాజా నిర్ణయాలపై సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనుంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన దగ్గర ఎక్కువగానే.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వాటిలో జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఐదు రకాల జాతులు ఉండగా, మన దేశంలో రెండు రకాలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశా తీరప్రాంతంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మన రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణాజిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకు, బాపట్ల జిల్లా సూర్యలంక, నిజాంపట్నం తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో తాబేలు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వీటి సంరక్షణకు అటవీశాఖ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతి సంవత్సరం ఈ తాబేళ్ల గుడ్లను సేకరించి సముద్రంలోకి వదులుతుంది. ఈ సంవత్సరం కూడా 46,840 గుడ్లను సముద్రంలోకి వదిలింది. 2009 నుంచి ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 5.18లక్షల ఆలివ్‌రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి వదిలింది. -
దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకే కంప్యూటర్ల దిగుమతిపై ఆంక్షలు
న్యూఢిల్లీ: పర్సనల్ కంప్యూటర్లు (పీసీ), ల్యాప్‌టాప్‌ల దిగుమతి లైసెన్సు కోసం కంపెనీలు/ట్రేడర్లు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ప్రత్యేక పోర్టల్ రూపొందించింది. వివరాలన్నీ సక్రమంగా ఉంటే దరఖాస్తు చేసుకున్న 3–4 రోజుల్లోనే లైసెన్సును జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రవాణాలో ఉన్న కన్సైమెంట్స్ను లైసెన్సు లేకుండా అనుమతిస్తారని వివరించాయి. పీసీలు, ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్ డివైజ్‌లను తయారు చేసుకునేందుకు భారత్‌కు తగినంత సామర్ధ్యం ఉండటం వల్ల నియంత్రణల విధింపుతో కంప్యూటర్ల లభ్యతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భద్రత కోసమే నియంత్రణలు.. దిగుమతైన కంప్యూటర్లలోని హార్డ్‌వేర్‌లో ఏవైనా లొసుగులు ఉంటే, వాటి నుంచి కీలకమైన వ్యక్తిగత, సంస్థాగత డేటాకు ముప్పు కలగకుండా భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఇంటర్నెట్ విస్తృతి పెరుగుతుండటంతో ప్రజలు ఆన్లైన్ మోసాల బారిన పడే అవకాశాలూ మరింతగా పెరిగాయని చెప్పాయి. ఈ నేపథ్యంలోనే దేశం, దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతోనే ప్రభుత్వం తాజా నియంత్రణలు విధించిందని అధికారులు తెలిపారు. అలాగే, చైనాతో వాణిజ్య సమతౌల్యం సాధించేందుకు కూడా ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. టారిఫ్యేతర నియంత్రణలనేవి దిగుమతులపై నిషేధం కిందికి రావని, లైసెన్సు తీసుకున్న వారు దిగుమతి చేసుకోవచ్చని వివరించారు. అటు, హార్డ్‌వేర్.. సిస్టమ్స్ విశ్వసనీయమైనవిగా ఉండేలా చూసేందుకు, దిగుమతులను తగ్గించుకునేందుకు, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. 2022–23లో ల్యాప్‌టాప్‌లు, పీసీల దిగుమతులు 5.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య వ్యవధిలో పీసీలు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఎల్రక్టానిక్స్ దిగుమతుల విలువ 19.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి -
వికారాబాద్ జిల్లాలో అస్తవ్యస్తంగా ఆర్టీఏ వ్యవస్థ... గాడిన పడేదెన్నడో?
వికారాబాద్: మూడేళ్ల ముందునుంచే జిల్లాలో ఆర్టీఏ వ్యవస్థ గాడి తప్పింది. ఈ క్రమంలో అనేక ఆరోపణలను మూటగట్టుకున్న విషయం తెలిసిందే. పైగా అవినీతికి అడ్డాగా మారింది. ఉద్యోగులపై అజమాయిషీ లేకుండాపోయింది. వాహనదారులు విసిగి వేసారి పోయారు. ఇదిలా ఉంటే అధికారి ఓ కేసులో ఇరుక్కుని జైలుపాలైన విషయం తెలిసిందే. ఆయన జైలుకు వెళ్లిన నెల రోజులకు ఇన్చార్జి డీటీఓను నియమించగా ఏడాదిగా ఆయన్నే కొనసాగిస్తూ పూర్తి స్థాయి అధికారిని నయమించడంలో ఈ శాఖ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తూ వస్తున్నారు. మరో పక్క డీటీఓ కార్యాలయానికి సొంత భవనం లేక.. టెస్టింగ్ ట్రాక్లేక ఇబ్బందులు తప్పడంలేదు. ఎలాంటి శాసీ్త్రయ పద్ధతులు పాటించకుండానే లైసెన్సులు అందజేయడం విమర్శలకు తావిస్తోంది. ఇన్చార్జిని అప్పగించి.. ఏడాది క్రితం వరకు వికారాబాద్ డీటీఓగా బాధ్యతలు నిర్వహించి సొంత అన్నను హత్యచేసేందుకు సుపారి ఇచ్చిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం ఆర్టీఏ ఉన్నతాఽధికారులు ఎట్టకేలకు సూర్యాపేట డీటీఓ వెంకట్‌రెడ్డికి వికారాబాద్ డీటీఓగా అదనపు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకొన్నారు. దీంతో ఆయన సూర్యాపేట నుంచి రావాల్సి వస్తుండటంతో వారానికి ఒకటి రెండు రోజులు చుట్టపుచూపుగా వికారాబాద్‌కు వచ్చి వెళుతున్నారు. అయితే అస్తవ్యపస్తంగా తయారైన జిల్లా అర్టీఏను గాడిలో పెట్టాల్సిన సమయంలో ఇలా ఇన్చార్జి డీటీఓను నియమించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిస్థాయి అధికారి అవసరం అస్తవ్యస్తంగా తయారైన వికారాబాద్ ఆర్టీఏను పూర్తిగా గాడిలో పెట్టాలంటే ఫుల్‌టైమ్ డీటీఓను నియమించి చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సూర్యాపేట డీటీఓగా ఉంటూ వికారాబాద్ ఇన్చార్జి డీటీఓగా కొనసాగుతున్న వెంకట్‌రెడ్డినే ఫుల్‌టైమ్ డీటీఓగా బాధ్యతలు అప్పగించడం, లేదంటే ఫుల్‌టైమ్ డీటీఓగా మరొకరిని నియమించాలనే అభిప్రాయం ఆ శాఖ ఉద్యోగులతో పాటు ఆయా వర్గాల్లో వ్యక్తం అవుతుంది. లేదంటే పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. ఏడాది కాలంగా రోడ్డు రవాణా శాఖకు పూర్తి స్థాయి జిల్లా అధికారి లేకపోవటంతో కింది స్థాయి ఉద్యోగులకు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా పరిస్థితి తయారయ్యింది. వాహనదారులు సైతం ఓవర్‌లోడ్‌తో అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఆర్టీఏ (రోడ్డు ట్రాన్స్ పోర్ట్ అథారిటీ) వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మూడేళ్లుగా గాడిన పడటంలేదు. ఏడాది క్రితం వికారాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో డీటీఓగా బాధ్యతలు నిర్వహించిన అధికారి జైలుపాలవగా అప్పటి నుంచి పూర్తి స్థాయి అధికారే లేరు. దీంతో అటు కింది స్థాయి సిబ్బందిలో జవాబుదారీతనం కరువైంది. ఇష్టారాజ్యంగా వసూళ్లపర్వం కొనసాగుతోంది. మరోవైపువాహనదారులు ఓవర్‌లోడ్‌తో అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు. -
వయసు 18 వృత్తి పైలెట్
సాక్షి కొచ్చర్‌కు ఇప్పటి దాకా స్కూటర్ నడపడం రాదు. కారు నడపడం రాదు. కాని ఏకంగా విమానం నడపడం నేర్చుకుంది. ప్రస్తుతానికి యంగెస్ట్ కమర్షియల్ పైలెట్ రికార్డ్ సాక్షి పేరున ఉంది. సంకల్పించాను... సాధించాను అంటోంది సాక్షి. మన దేశంలో అత్యంత చిన్న వయసులో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ సాధించిన రికార్డు మైత్రి పటేల్ పేరున ఉంది. ఆమె 19 ఏళ్ల లైసెన్స్ పొందింది. ఇప్పుడు 18 ఏళ్లకే సాక్షి కొచ్చర్ ఈ లైసెన్స్ పొంది మైత్రి రికార్డును బద్దలు కొట్టింది. సరిగ్గా ఆమె 18వ పుట్టిన రోజున ఈ లైసెన్స్ పొందడం విశేషం. పదేళ్ల వయసు నుంచే సాక్షి కొచ్చర్‌ది హిమాచల్ ప్రదేశ్‌కు ముఖద్వారం వంటిదైన పర్వాను టౌన్. అక్కడ తండ్రి లోకేష్ కుమార్ కొచ్చర్‌కు ఫుట్‌వేర్ వ్యాపారం ఉంది. పదేళ్ల వయసు నుంచి కుమార్తె పైలెట్ కావాలని కోరుకుంటూ ఉంటే అతడు ్ర΄ోత్సహిస్తూ వచ్చాడు. ‘పదో క్లాసు పరీక్షలు అయ్యాక నేను పైలెట్ కావాలని మళ్లీ ఒకసారి గట్టిగా చె΄్పాను. అయితే నాకు కామర్స్ లైన్లో చదవాలని ఉండేది. లెక్కలు పెద్దగా ఇష్టం లేదు. కాని పైలెట్ కావాలంటే ఎంపీసీ చదవాలని తెలిసి ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను’ అని చెప్పింది సాక్షి. ఇంటర్ అయిన వెంటనే ముంబైలోని స్కైలైన్ ఏవియేషన్ క్లబ్లో పీపీఎల్ (ప్రైవేట్ పైలెట్ లైసెన్స్)కు కావలసిన థియరీ క్లాసులను నాలుగున్నర నెలల పాటు చదవింది సాక్షి. ఈ క్లబ్‌లోనే కెప్టెన్ ఏ.డి.మానెక్ దగ్గర ఏవియేషన్ పాఠాలు నేర్చుకుంది మైత్రి పటేల్. సాక్షి కూడా కెప్టెన్ మానెక్ దగ్గరే తొలి పాఠాలు నేర్చుకుంది. ఆ తర్వాత సీపీఎల్ (కమర్షియల్ పైలెట్ లైసెన్స్) కోసం అమెరికా వెళ్లింది. 70 లక్షల ఖర్చు అమెరికాలో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ పొందాలంటే దాదాపు 70 లక్షలు ఖర్చు అవుతుంది. అయినా సరే సాక్షి కుటుంబం ఆ ఖర్చును భరించి సాక్షిని అమెరికా పంపింది. అక్కడ మూడు నెలల పాటు సాక్షి ట్రైనింగ్‌లో పాల్గొంది. ‘ఇన్స్ట్రక్టర్ సహాయంతో విమానం నడపడంలో ఒక రకమైన థ్రిల్ ఉంది. కాని ట్రైనింగ్‌లో భాగంగా మొదటిసారి సోలో ఫ్లయిట్ (ఇన్స్ట్రక్టర్ లేకుండా) ఒక్కదాన్నే విమానం నడిపినప్పుడు కలిగిన థ్రిల్, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. ఆ క్షణం నా జీవితంలో అలాగే ఉండి ΄ోతుంది’ అని చెప్పింది సాక్షి. ‘అయితే పైలెట్ కావడం అనుకున్నంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు, సమస్యలు ఉంటాయి. నా ట్రయినింగ్లో ఒకసారి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయింది. మరోసారి రేడియో ఫెయిల్ అయింది. నేను కంగారు పడకుండా అలాంటి సమయంలో ఏం చేయాలో అది చేసి సేఫ్ లాండింగ్ చేశాను’ అని తెలిపింది సాక్షి. పైలెట్‌గా ఉద్యోగం ‘మా ఊళ్లో నేను పైలెట్ అవుతానని అంటే మా బంధువులు చాలామంది ఎయిర్ హోస్టెస్ అనుకున్నారు. అమ్మాయిలు పైలెట్లు కావచ్చునని వారికి తెలియదు. ఇవాళ మన దేశంలో ఎక్కువమంది మహిళా పైలెట్లు ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. నాకు పైలెట్‌గా ఉద్యోగం రాగానే నా కోర్సు కోసం అయిన ఖర్చు మొత్తం అణాపైసలతో సహా మా అమ్మానాన్నలకు చెల్లిస్తాను’ అంది సాక్షి. ఇంత చిన్న వయసులో లైసెన్స్ పొందిన సాక్షికి ఉద్యోగం రావడం ఎంత సేపనీ. -
ఇళ్లకే మద్యం పంపిణీ అయ్యేలా గ్రీన్ సిగ్నల్..పెళ్లిళ్లలో కూడా తాగొచ్చు..
సాధారణంగా మద్యం విక్రయించాలంటే లైసెన్స్ ఉండాల్సిందే. ఇప్పటి వరకు క్లబ్‌లు, స్టార్ హోటల్స్‌కి మాత్రమే మద్యం వినియోగం కోసం లైసెన్స్ ఇచ్చేవారు. ఇక ఇళ్లలోని ఫంక్షన్స్ ఉత్సవాలు, స్టేడియం నుంచి జాతీయ, అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాల వరకు అన్ని చోట్ల మద్యం సర్వ్ చేయాలన్న లేదా కలిగి ఉండాలన్న లైసెన్స్ ఉండాల్సిందే. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం 'ఎఫ్.ఎల్.12' అనే ఒక ప్రత్యేక లైసెన్స్‌ని తీసుకొచ్చింది తమిళనాడు ప్రభుత్వం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని కూడా ఎక్సైజ్ శాఖ గత నెలలోనే జారీ చేసింది. మద్యం అమ్మకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమీకరించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది తమిళనాడు ప్రభుత్వం. అందులో భాగంగానే మద్య అమ్మకాలు పెంచేలా ఈ ప్రత్యేక లైసెన్స్‌ని తీసుకువచ్చింది. దీంతో పెళ్లిళ్లలోనూ, ఇతర శుభాకార్యల్లోనూ మద్యం సేవించడానికి అధికారికంగా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం వాణిజ్య సముదాయాలు, కాన్ఫరెన్స్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, మ్యారేజ్ హాల్స్, బంక్వెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాల్లోనూ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక లైసెన్స్ వివరాలు.. దీన్ని డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్(ఎక్సైజ్) జారీ చేస్తారు. ఇది ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే చెల్లుబాటవుతుంది. ఈ లైసెన్స్ అతిథులు, సందర్శకుల తోపాటు అంతజర్జాతీయ లేదా జాతీయ ఈవెంట్లలో పాల్గొనేవారికి సర్వ్ చేసేందుకు, కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. దీని ఈవెంట్ తేదీ ఏడు రోజుల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆయా ప్రదేశాల్లో మద్యం విక్రయించాలంటే ఈ ప్రత్యేక లైసెన్సు ఉండాలి. అందుకోసం ప్రభుత్వాన్నికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వాణిజ్యపరమైన ఈవెంట్లకు ప్రత్యేక లైసెన్స్ వార్షిక రుసుము కింద మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. లక్ష, మున్సిపాలటీల్లో రూ. 75వేలు, ఇతర ప్రదేశాల్లో రూ. 50,000 వరకు ఉంటుంది. అదే ఒక్కరోజు ఈవెంట్ నిర్వహణకు అయితే మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. 11 వేలు, మున్సిపాలటీల్లో రూ. 7500, ఇతర ప్రదేశాల్లో రూ. 5వేలు వరకు ఉంటుంది. ఇక గృహ వేడుకల సమయంలో నాన్-కమర్షియల్‌గా ఒక్కరోజుకి ఈ ప్రత్యేక లైసెన్స్‌ను రూ. 11,000 (మునిసిపల్ కార్పొరేషన్లలో), రూ. 7,500 (మున్సిపాలిటీలలో) రూ.5 వేలు(ఇతర ప్రదేశాల్లో). (చదవండి: ఆరోగ్య మంత్రి వీడియో చాట్ దుమారం.. బీజేపీ రాజీనామా డిమాండ్) -
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఏ) రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్)కి విదేశీ నిధుల లైసెన్స్‌ని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్)కి ఉన్న విదేశీ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్‌ని కేంద్రం రద్దు చేసింది. ఇది గాంధీ కుటుంబాలకు చెందిన ప్రభుత్వేతర సంస్థ. ఐతే ఈ సంస్థ విదేశీ నిధుల చట్టాన్ని ఉల్లంఘించిందని, అందువల్ల ఈ లైసెన్స్‌ని రద్దు చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. జూలై 2020లో ఎంహెచ్ఏ దీనిపై ఒక కమిటి నియమించి, వారి ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అంతేగాదు లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ఆర్జీఈఎఫ్ కార్యాలయానికి నోటీసులు జారీ చేశామని కూడా తెలిపింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ ఫౌండేషన్‌కి చైర్ పర్సన్ కాగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరం, పార్లమెంట్ సభ్యులు రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు ట్రస్ట్ సభ్యులు. ఈ ఫౌండేషన్‌ని 1991లో ఏర్పాటు చేశారు. అంతేగాదు ఈ ఫౌండేషన్ 1991 నుంచి 2009 వరకు ఆరోగ్యం, సైన్స్, టెక్నాలజీ, మహిళలు, పిల్లలు, దివ్యాంగులకు మద్దతుతో సహా అనేక క్లిష్టమైన సమస్యలపై పనిచేసింది. పైగా విద్యా రంగానికి సంబంధించి పలు సేవలు అందించింది. (చదవండి: తెలంగాణలోకి రాహుల్ యాత్ర.. జోడో యాత్ర ఇలా కొనసాగుతుంది..) -
జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ దెబ్బ, కోర్టును ఆశ్రయించిన సంస్థ
సాక్షి,ముంబై: జాన్సన్ అండ్ జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మహారాష్ట్రలో మరో ఎదరుదెబ్బ తగిలింది. అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్( ఎఫ్‌డిఎ) జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ తయారీ లైసెన్స్నురద్దు చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేసిసినట్టు ఎఫ్‌డీఏ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. జాన్సన్స్ బేబీ పౌడర్ నవజాత శిశువుల చర్మంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. (Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్) ప్రయోగశాల పరీక్షలో శిశువులకు పౌడర్ నమూనాలు ప్రామాణిక విలువలకు అనుగుణంగా లేవని రెగ్యులేటరీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం 1940, నిబంధనల ప్రకారం జాన్సన్ కంపెనీకి ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది, అంతేకాకుండా మార్కెట్ నుండి జాన్సన్ బేబీ పౌడర్ స్టాక్‌ను రీకాల్ చేయాలని కూడా కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. (లాభాలు కావాలంటే...సారథ్య బాధ్యతల్లో మహిళలు పెరగాలి) ప్రభుత్వ విశ్లేషకుల నివేదికను అంగీకరించని జాన్సన్ అండ్ జాన్సన్ కోర్టులో సవాలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కంపెనీ వివరణాత్మక ప్రకటన రావాల్సి ఉంది. -
ఫ్యాక్టరీలో భారీ పేలుడు... 13 మంది మృతి
లక్నో: ఢిల్లీ సమీపంలోని యూపీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందగా.. ఆరుగురు గాయపడనట్లు తెలిపారు. ఈ ఘటన పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. ఆ సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 30 మంది ఇన్నారని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు తాకిడికి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫ్యాక్టరీల పైకప్పులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఐతే ఈ ఫ్యాక్టరీకి ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కోసం లైసెన్స్ ఇస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం బాణసంచా తయారు చేస్తున్నామని చెబుతుండటం గమనార్హం. దీంతో పోలీసులు ఫ్యాక్టరీ యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ మేరకు ఈ ఘటనలో చనిపోయిన మృతుల పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు గల కారణాల గురించి ప్రత్యేక నిపుణులతో సత్వరమే విచారణ జరపించాలని ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు. అంతేకాదు బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహయం అందించాలని ఆదిత్యనాథ్ జిల్లా పరిపాలనాధికారులను కోరారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు ఆన్లైన్లో తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: ఢిల్లీలో భానుడి భగభగలు... ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ) -
హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తే లైసెన్స్ రద్దు!
న్యూఢిల్లీ: ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు సరికొత్త చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముంబైలో హెల్మెట్ లేకుండా రైడింగ్ చేస్తే మూడు నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తాం అని పోలీసులు చెప్పారు. అంతేకాదు యూట్యూబ్‌లో ఈ కొత్త నిబంధనలకు సంబంధించిన వీడియోని ముంబై పోలీసులు పోస్ట్ చేశారు కూడా. ఆ వీడియోలో ...."హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరం. హెల్మెట్ లేకుండా ప్రయాణించే ప్రతి వ్యక్తి చలాన్ని వెంటనే ఆర్టీవోకి పంపతాం. దీంతో మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా జరిమాన కూడా విధించబడుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి సమీపంలోని ట్రాఫిక్ పోలీస్టేషన్ పంపిస్తాం. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే వీడియోలను చూపిస్తాం." అని డీసీపీ రాజ్ తిలక్ రోషన్ పేర్కొన్నారు. అలాగే ఎరుపు రంగు సిగ్నల్ పడినప్పుడూ హారన్లు మోగించకుండా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డెసిబెల్ మీటర్లను ఏర్పాటు చేశారు. దీంతో ఎవరైన గనుక ఇలా హారన్ మోగిస్తే ఆయా వాహనాల వ్యక్తుల డబుల్ టైం వెయిటింగ్ చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. అదీగాక ముంబై ప్రపంచంలోనే అత్యంత ధ్వనించే నగరాల్లో ఒకటి. పైగా ముంబై వాసులు రెడ్ సిగ్నల్ వద్ద కూడా హారన్లు వేయడంతో శబ్దకాలుష్యం ఎక్కువ అతుతోందని, దీన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ పోలీస్ కమీషనర్ మధుకర్ పాండే అన్నారు. (చదవండి: రిక్షాలో మినీ గార్డెన్...ఫోటోలు వైరల్) -
పబ్‌లో యథేచ్ఛగా మత్తు దందా... డ్రగ్ మారో డ్రగ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పబ్ సంస్కృతి జడలు విప్పుతోంది. యువతలో విష బీజాలు నాటుతోంది. రేవ్ పార్టీల పేరుతో రెక్కలు తొడుగుతోంది. నిబంధనలకు నీళ్లొదిలి తెల్లవార్లూ బార్లా తెరుచుకుంటున్నాయి. నగరంలోని కొన్ని పబ్బుల్లో చాపకింద నీరులా డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా రాడిసన్ బ్లూ హోటల్ ఉదంతం వెలుగులోకి రావడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పబ్బుల్లో యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా ఆబ్కారీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో వందకు పైగా పబ్బులు ఉన్నాయి. అన్ని బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతిచ్చినట్లుగానే ఎక్సైజ్‌శాఖ పబ్బులకు సైతం లైసెన్సులు ఇచ్చింది. బార్ అండ్ రెస్టారెంట్లకు ఉండే నిబంధనలే వీటికీ వర్తిస్తాయి. గ్రేటర్ పరిధిలో అర్ధరాత్రి 12 గంటల వరకు, వీకెండ్స్‌లో మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతినిస్తారు. కానీ కొన్ని పబ్బులు నిబంధనలు ఉల్లంఘించి తెల్లవారుజాము వరకు కొనసాగుతున్నాయి. ఇలాంటి పబ్‌లపై ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. కొరవడిన నిఘా... సాధారణంగా బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణపై నిఘా ఉన్నట్లుగానే పబ్లపైనా ఎక్సైజ్ అదికారులు నిఘా కొనసాగించాలి. తరచుగా తనిఖీలు నిర్వహించాలి. కొన్ని ప్రత్యేక సందర్భా ల్లో ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ నామమాత్రంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు. కొన్ని పబ్‌లపై ఆ మాత్రం కేసులు కూడా నమోదు చేయడం లేదు. మైనర్లను పబ్బుల్లోకి అనుమతించడం, నిర్ణీత వేళలను పాటించకపోవడం, సరైన లెక్కలు చూపించకుండా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. డ్రగ్స్ వాడకంపై మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాలేదని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడకంపై రాడిసన్ బ్లూ హోటల్లో నమోదైన కేసు మాత్రమే మొట్టమొదటిది కావడం గమనార్హం. ప్రత్యేకమైన కేటగిరీ లేదు.. ‘ఎక్సైజ్ శాఖ నిబంధనల మేరకు పబ్‌లు అనే ప్రత్యేకమైన కేటగిరీ లేదు. హోటల్, రెస్టారెంట్ సదుపాయం ఉన్న చోట పెగ్గుల రూపంలో మద్యం విక్రయించేందుకు ఎక్సైజ్ శాఖ లైసెన్సు ఇస్తుంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో బార్లను పబ్బులుగా పిలుస్తారు. ఆ సంస్కృతిలో భాగంగానే హైఫై బార్ అండ్ రెస్టారెంట్లు పబ్‌లుగా కొనసాగుతున్నాయి’ అని ఓ అధికారి వివరించారు. ఈ పబ్బులన్నీ రూ.40 లక్షల బార్ లైసెన్సు ఫీజు చెల్లించి అనుమతి పొందినవే కావడం గమనార్హం. స్టార్ హోటళ్లకు ప్రత్యేక అనుమతి.. ఫోర్ స్టార్ కంటే ఎక్కువ కేటగిరీకి చెందిన హోటళ్లలో మాత్రం 24 గంటలు మద్యం విక్రయించేందుకు ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక అనుమతినిస్తోంది. ఇందుకోసం హోటల్ నిర్వాహకులు సాధారణ బార్ లైసెన్సు ఫీజు రూ.40 లక్షలపై 25 శాతం అదనంగా చెల్లించాలి. అంటే సుమారు రూ.14 లక్షలకుపైగా చెల్లించి ప్రత్యేక అనుమతిని తీసుకోవాల్సిఉంటుంది. రాడిసన్ బ్లూ హోటల్ ఈ కేటగిరీ కిందనే ప్రత్యేక అనుమతిపై 24 గంటల పాటు మద్యం విక్రయిస్తోంది. నగరంలో ఇలాంటి అనుమతి కలిగినవి 20కిపైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: పబ్స్‌పై డ్రగ్స్ పడగ) -
రోజూ తప్పు చేస్తూనే.. 70 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు..!
లండన్: ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రత్యేకంగా గురించి చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే చలాన్లు ఇంటికే వచ్చేస్తున్న రోజులు. చలానా మనకు వచ్చే కొన్ని సందర్భాల్లో మనం ఫలానా చోట ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించామా అనుకోవడం ఒక్కటే మనవంతు అవుతుంది. కాకపోతే ఒక వ్యక్తి మోటర్ వెహికల్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 70 ఏళ్లు తిరిగేశాడు. అది కూడా బ్రిటన్‌లో. తాజాగా నాటింగ్‌హామ్‌లో సదరు వ్యక్తి పోలీసులకు పట్టుబడటంతో అసలు విషయం తెలిసింది. తాను 70 ఏళ్లుగా లైసెన్స్, కారుకు బీమా లేకుండా తిరుగుతున్నానని అతనే వెల్లడించాడు. ఇన్నాళ్లూ తన కారును ఏ ట్రాఫిక్ పోలీసు ఆపలేదని, అందుకు తనకు వాటి అవసరం లేకుండా పోయిందని తన మాటల ద్వారానే వ్యక్తపరిచాడు. 1938లో జన్మించిన ఈ కారు డ్రైవర్ తనకు 12 ఏళ్ల నుంచి లైసెన్స్ లేదా ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాడని పోలీసులకు చెప్పాడు. ఇన్నాళ్ల తన కెరీర్లో తనను ఎప్పుడూ పోలీసులు అడ్డుకోలేదని చెప్పాడు. ఆ వ్యక్తి నడిపి కారు కూడా ఎప్పుడూ యాక్సిడెంట్ కూడా కాలేదట. దాంతోనే సుదీర్ఘకాలం ఇలా రోడ్డుపై హాయిగా తిరిగేశాడు. అతనికి 12 ఏళ్ల వయసు నుంచే కారుకు బీమా లేకుండా లైసెన్స్ లేకుండా తిరుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై బుల్‌వెల్, రైజ్పార్క్ హైబరీ వేల్ పోలీసులు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఆ సమయంలో ఆ వ్యక్తి ఓ పాత తుప్పు పట్టిన కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా గుర్తించారు. వెంటనే ఆ కారు నడిపే వ్యక్తిని అడ్డుకున్నారు. తర్వాత విషయం తెలిసి నోరెళ్ల బెట్టారు పోలీసులు. -
డ్రైవింగ్ టెస్టుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ముందుగా లెర్నింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆరునెలల్లో శాశ్వత లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో ఎంచుకున్న సమయం ప్రకారం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేల కనుక ఆ పరీక్షలో ఫెయిల్ అయితే మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది. అయితే తాజాగా కేంద్రం డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందవచ్చు. డ్రైవింగ్ స్కూళ్లకు, డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు ఈ మేరకు గుర్తింపు ఇవ్వనుంది. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం చేత గుర్తింపబడిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో విజయవంతంగా డ్రైవింగ్ టెస్ట్ పూర్తి చేసిన వారు రాష్ట్ర రవాణా అధికారుల నుండి లైసెన్స్ పొందవచ్చు. అలాగని శిక్షణ కేంద్రాలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వరు. వాటికి అనుమతులు, శిక్షణా కార్యక్రమాల పర్యవేక్షణకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వమే డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను గుర్తిస్తుంది. దీని కోసం ప్రభుత్వం కొన్ని నియమాలను సూచిస్తుంది. ఆ డ్రైవింగ్ కేంద్రాలు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది.(చదవండి: అసోంలో ప్రధాని మోదీ పర్యటన) -
ఓలాకు షాక్ : లండన్‌లో బ్యాన్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ క్యాబ్ సేవల సంస్థ ఓలాకు లండన్‌లో ఎదురు దెబ్బ తగిలింది. ప్రజా రవాణా భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలతో ఓలాకు చెందిన ఆపరేటింగ్ లైసెన్స్ ను లండన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ రద్దు చేసింది. ఓలా భద్రతా చర్యలు నిబంధనలకు అనుగుణంగా లేవని, ప్రయాణీకుల భద్రతను ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. ఈ మేరకు ట్రాన్‌పోర్ట్ ఫర్ లండన్ (టీఎఫ్ఎల్) ఒక ప్రకటన జారీ చేసింది. మరో క్యాబ్ సేవల సంస్థ, ఓలా ప్రధాన ప్రత్యర్థి ఉబెర్ గతంలో భద్రతాపరమైన కారణాల రీత్యా ఇలాంటి చర్యలనే ఎదుర్కొంది. అయితే చట్టబద్ధమైన నిబంధనలు తొలగి, లైసెన్స్ తిరిగి సాధించిన సేవలకు సుగమమైన తరుణంలో ఓలాకు వ్యతిరేకంగా తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. ఓలా సేవల్లో అనేక వైఫల్యాలను కనుగొన్నట్లు టీఎఫ్ఎల్ తెలిపింది. నిబంధనల ఉల్లంఘనలతో సహా, లైసెన్స్ లేని డ్రైవర్లు వాహనాలను నడుపుతున్నారని వాదించింది. దీనిపై అప్పీల్ చేయడానికి ఓలాకు 21 రోజులు (అక్టోబర్ 24) సమయం ఉందని తెలిపింది. దీనిపై స్పందించిన ఓలా డేటా బేస్‌లో సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తిందని వెల్లడించింది. ఈ విషయంలో టీఎఫ్ఎల్ సంస్థతో సంప్రదింపులు జరుపుతామని, పారదర్శకంగా పనిచేయడానికే తమ ప్రాధాన్యత అని ఓలా యూకే ఎండీ మార్క్ రోజెండల్ తెలిపారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. కాగా బెంగళూరుకు చెందిన ఓలా ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్ టాక్సీ మార్కెట్లోకి ప్రవేశించింది. భారతదేశంలో ఉబెర్‌తో పోటీపడుతున్న భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని సంస్థ యుకెతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు తన సేవలను విస్తరించిన సంగతి తెలిసిందే. -
శానిటైజర్ అమ్మకాలపై కీలక ప్రకటన
ఢిల్లీ : శానిటైజర్ విక్రయాలు, నిల్వలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సడలించింది. ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో శానిటైజర్ నిత్యావసర వస్తువుగా మారిన నేపథ్యంలో డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ నిబంధనల నుంచి శానిటైజర్లకు మినహాయింపు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో శానిటైజర్ వాడకం తప్పనిసరి కావడంతో అందరికీ అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శానిటైజర్ అమ్మకాలకు డిమాండ్ పెరడగంతో కొందరు కేటుగాళ్లు దీనిని క్యాష్ చేసుకొని కల్తీ అమ్మకాలు జరుపుతున్నారు. దీన్ని అరికట్టే లక్ష్యంతో ఇకపై శానిటైజర అమ్మకాలు, నిల్వలపై అనుమతులు తప్పనిసరి చేస్తూ కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. (చీరలో మెరిసిపోతూ.. శానిటైజర్ అందిస్తోన్న రోబో) శానిటైజర్ కొరత తలెత్తకుండా కొత్తగా మరో 600 సంస్థలకు తయారీ అనుమతులు ఇచ్చి ఉత్తర్వులు జారీ చేసింది. డిమాండ్ అవసరాలకు తగ్గట్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. శానిటైజర్ ధరలపై కూడా పరిమితులు విధిస్తూ నిర్ణయించింది. ఈ ప్రకటన తర్వాత శానిటైజర్ అమ్మకాలను లైసెన్సు నుంచి మినహాయింపులు కోరుతూ పలు విజ్ఞప్తులు కేంద్రానికి అందాయి. దీంతో ప్రజలకు శానిటైజర్ మరింత అందుబాటులో ఉండేందుకు వీలుగా డ్రగ్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ నిబంధనల నుంచి మినహాయింపు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. (శానిటైజర్ వాడుతున్నారా...) -
పాక్: ప్రతి ముగ్గురు పైలట్లలో ఒకరు ఫేక్
కరాచీ: పాక్‌లో వెలుగు చూసిన ఘోర నిజం తెలిస్తే మనం ముక్కున వేలేసుకుంటాం. కానీ పాక్ ప్రజలు మాత్రం భయంతో వణికిపోవాల్సిందే. దీనికి కారణం పాకిస్తాన్లో పనిచేసే పైలట్లలో ముప్పై శాతం మంది బోగస్ పైలట్లు అని ఆ దేశ మంత్రే పార్లమెంటు సాక్షిగా వెల్లడించారు. అంటే ప్రతి ముగ్గురు పైలట్లలో ఒకరు ఫేక్ పైలట్ అన్నమాట. కరాచీలో జరిగిన విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ విస్తుపోయే విషయం బయటపడింది. ('దయచేసి మమ్మల్ని క్షోభ పెట్టకండి') దీని గురించి బుధవారం ఆ దేశ పౌర విమానయాన శాఖ మంత్రి గులామ్ సర్గార్ ఖాన్ మాట్లాడుతూ.. "పాక్‌లో 860 మంది పైలట్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 262 మంది పరీక్ష రాయనేలేదు. వారికి బదులుగా డబ్బులిచ్చి వేరొకరిని పరీక్షకు పంపించారు. కనీసం వీరికి విమానం నడపడంలో అనుభవం కూడా లేదు" అని తెలిపారు. అంటే ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలపై ఎంత పట్టింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం నకిలీ లైసెన్సులు పొందిన 150 మందిని విధుల నుంచి తొలగించడం అక్కడి ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త. ఇక పాకిస్తాన్‌లోని కరాచీలో మే 22న అత్యంత ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 97 మంది మరణించారు. (ఆ భయం వల్లే విమానం కుప్పకూలింది!) -
'ఇంగ్లీష్ విద్యపై మతపరమైన విమర్శలా'
సాక్షి, అమరావతి : ఇంగ్లీష్ మీడియం విద్యపై మతపరమైన విమర్శలు చేయడం దారుణమని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టనున్న ఇంగ్లీష్ మాధ్యమానికి, క్రిస్టియన్ మతానికి ఏం సంబంధం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు, బలహీన, నిమ్న వర్గాల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించడం తప్పా అని ప్రశ్నించారు. వంగవీటి రంగా హత్యతో కుల రాజకీయాలు చేసిన టీడీపీ ఇప్పుడు మతానికి సంబంధించి రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పర్యాటక శాఖ అధికారులతో సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 300 బోట్లున్నాయని, ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం డివిజన్లలో తనిఖీలు నిర్వహించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 21న 9 కంట్రోల్ రూమ్‌లకు సీఎం శంఖుస్థాపన చేస్తారని, వచ్చే మూడు నెలల్లో కంట్రోల్ రూమ్‌లు నిర్మిస్తామని వెల్లడించారు. ప్రతి కంట్రోల్ రూంకు ఐదుగురు అధికారులు ఉంటారని తెలిపారు. బోటు నడిపేవారు ఎవరయినా అన్ని నిబంధనలను పాటిస్తామని లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి హామీ ఇస్తేనే బోట్లు తిప్పడానికి అవకాశం ఇస్తామని వెల్లడించారు. ఇందుకోసం సారంగులకు పరీక్షలు పెట్టి, బోటుకు ఫిట్నెస్ నిర్వహించాకే అనుమతిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 15 నాటికి అన్ని సిద్ధం చేసి బోటు ఆపరేషన్ ప్రారంభిస్తామని, ప్రతి బోటు ఆపరేటర్ కొత్తగా లైసెన్సుకి దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సీనియర్ సారంగులైనా పరీక్ష రాయాల్సిందేనని, అయితే పరీక్షకు సంబంధించి ముందుగా18 రోజులు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత పరీక్ష పెడతామని వివరించారు. -
హోటళ్ల లైసెన్స్‌లు రద్దు చేశాం: టీటీడీ
సాక్షి, తిరుమల : దైవ దర్శనానికి వచ్చే భక్తుల జేబులు గుళ్ల చేస్తున్న తిరుమలలోని హోటళ్లపై తీసుకున్న చర్యల గురించి హైకోర్టు ధర్మాసనానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నివేదిక సమర్పించింది. పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల దగ్గర హోటల్ యాజమాన్యాలు అక్రమంగా అధికమొత్తంలో వసూలు చేస్తున్నారని ఓ భక్తుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై స్పందించిన ధర్మాసనం టీటీడీ నివేదిక కోరింది. ఈ మేరకు టీటీడి హైకోర్టుకు నివేదిక సమర్పించింది. హోటళ్లపై తనిఖీలు చేసి, అక్రమాలకు పాల్పడుతున్న వారి లైసెన్సులను రద్దు చేశామని ఆ నివేదికలో టీటీడీ తెలిపింది. వాటి స్థానంలో కొత్త టెండర్లు వేశామని, అక్రమాలకు తావివ్వకుండా ఒక నూతన సాఫ్ట్వేర్ తీసుకొచ్చామని పేర్కొంది. టీటీడి ఇచ్చిన నివేదికపై వివరణ ఇవ్వడానికి నాలుగు వారాల సమయం కావాలని పిటిషనర్ కోరాడు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 24కు వాయిదా వేసింది. -
తప్పెవరిది?
రహదారులు మృత్యుదారులుగా.. వాహనాలు మృత్యుశకటాలుగా మారాయి.. బయటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వస్తే చాలు అనుకునే పరిస్థితి నెలకొంది. మైనర్లు, అవగాహన లేని డ్రైవర్లు వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.. ఆయా ప్రమాదాల్లో మృత్యువాతపడిన వారి కుటుంబాలు, క్షతగాత్రులు కోలుకోలేని దెబ్బతింటున్నారు.. గద్వాల క్రైం: ఇతర ప్రాంతాలకు కూలి పనులకు వెళ్లిన వారు.. సొంత పనులపై బయటకు వెళ్లి వారు ప్రస్తుతం క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. మనం సరిగానే వెళ్తున్నా.. ఎదురుగా వచ్చే వారు క్షణకాలంలో చేసే చిన్నపొరపాటు నిండు జీవితాలను నాశనం చేస్తుంది. ఈ క్రమంలో ఎంతో భవిష్యత్ ఉన్న మైనర్లు, యువకులు, కుటుంబం ఆధారపడి ఉన్న యజమానులు మృత్యువాత పడుతూ.. కుటుంబాలను చీకట్లోకి నెట్టేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు, మానవపాడు, ఇటిక్యాల, అ లంపూర్ మండలాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వపరంగా నివారణ చర్యలు చేపడుతున్నా.. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం.. వాహనదారుల అవగాహన లేమితో అవేమీ ప్రమాదాలను అడ్డుకోలేకపోతున్నాయి. రోడ్డు భద్రతపై ఏదీ చిత్తశుద్ధి వాహనాలు నడపడం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం మనిషి ప్రాణం అనే విషయాన్ని డ్రైవర్లు పెడచెవిన పెడుతున్నారు. అయితే ఏ రోడ్డుపై ఎంత వేగంతో వెళ్లాలి.. ఎలా ముందు వెళ్తున్న వాహనాలను దాటాలి.. తదితర విషయాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఒకింత ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ విషయంలో ఇటు రవాణా శాఖ, అటు పోలీసు అధికారులు నామమాత్రంగా తనిఖీలు జరుపుతూ చేతులు దులుపుకొంటున్నారు. మరికొందరు డ్రైవర్లు నిద్రలేమి, మద్యం మత్తులో వాహనాలను నడపడం కూడా గమనార్హం. అవగాహన లేని వారే అధికం ఒక వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురావాలంటే ముందుగా ఆ దారిపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. రవాణా శాఖాధికారులు జారీ చేసే లైసెన్స్ ఉండాలి. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. రాత్రివేళలో హెడ్ ల్యాంపులు, ఇండిగేటర్లు వేస్తూ వాహనాలకు ఎలా సంకేతాలు ఇవ్వాలి.. అనే విషయాలపై ప్రస్తుత డ్రైవర్లకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం లేదు. ఇలాంటి వారిని కట్టడి చేస్తే కొంతమేర ప్రమాదాలను నివారించవచ్చు. ఇవిగో ఘటనలు.. జనవరి 8న ధరూరు మండలం చిన్నపాడు, యమునోనిపల్లికి చెందిన కొంతమంది గద్వాలలోని ఓ పత్తి మిల్లులో కూలికి వెళ్లేవారు. తిరిగి వచ్చే క్రమంలో బొలేరో డ్రైవర్ నిర్లక్ష్యం.. నిద్రలేమి కారణంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు. æ 9వ తేదీన ఉండవెల్లి మండలం మునగాలకు చెందిన మధుసూద న్ అనే విద్యార్థి ద్విచక్రవాహనంపై వస్తుండ గా ఆటో ఢీకొని అక్కడికక్కడే మృతిచెం దాడు. æ 12వ తేదీన మానవపాడు దగ్గర జాతీయ రహదారిపై తమిళనాడుకు చెందిన లారీని వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొనడంతో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. æ 14వ తేదీన బీచుపల్లి వద్ద జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ మృతిచెందారు. నివారణ చర్యలేవీ.. గద్వాల– అయిజ, గద్వాల– ధరూరు, గద్వాల– ఎర్రవల్లి తదితర రోడ్డు మార్గంలో ప్రభుత్వం నూతనంగా రోడ్డు నిర్మాణాలు చేపట్టింది. అయితే వివిధ ప్రాంతాల్లో రోడ్డు వేస్తున్న క్రమంలో అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. రాత్రివేళలో ఎరుపు రంగు రేడియం స్టిక్కర్ సూచకలు పెట్టాలి. మూల మలుపులు, స్పీడ్ బ్రేకర్లు ఇలా ప్రతిచోట ప్రమాదాలను నివారించేలా బోర్డులు ఉంచాలి. కానీ ఈ విషయంలో సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. తూతూమంత్రంగా నిర్వహణ.. ప్రతియేటా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జనవరి 11 నుంచి వారం రోజులపాటు నిర్వహిస్తారు. అలాగే 25వ తేదీ నుంచి ఆర్టీసీ యాజమాన్యం సైతం భద్రతా వారోత్సవాలు జరుపుతుంది. అయితే వీటిని ఆయా అధికారులు నామమాత్రంగా నిర్వహించి చేతులు దులుపుకోవడం తప్ప పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదు. ఇందులో సంబంధిత అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం.. రోడ్డు ప్రమాదాల నివారణకు మా శాఖ పరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రవాణా శాఖతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గూడ్స్ వాహనాల్లో సరుకులను మాత్రమే ట్రాన్స్‌పోర్టు చేయాలి. కొందరు ప్రజలను కూడా తీసుకెళ్తున్నారు. ఇలాంటి వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. అన్ని ప్రధాన రహదారులపై సూచిక బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – విజయ్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల జిల్లా -
అడ్డంగా దొరికిపోయిన మేయర్
-
మీడియాకు అడ్డంగా దొరికిపోయిన మేయర్
సాక్షి, న్యూఢిల్లీ : బవానా భారీ అగ్ని ప్రమాదంపై స్పందిస్తూ ఢిల్లీ(ఉత్తర) మేయర్ అడ్డంగా దొరికిపోయారు. ఈ ప్రమాదంపై ఎటువంటి ప్రకటనలు చెయొద్దంటూ మీడియా ముందే ఆమె అధికారులకు సూచించారు. బీజేపీ నేత, ఉత్తర ఢిల్లీ కార్పొరేషన్ మేయర్ ప్రీతి అగర్వాల్ ప్రమాద ఘటనపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘ఈ ఫ్యాక్టరీ లైసెన్స్ మన దగ్గర ఉంది. మీరెవ్వరూ మీడియాతో మాట్లాడకండి అంటూ ఆమె అధికారులకు సూచించారు. అందుకు వారు సరేనని చెప్పటం ఆ వీడియోలో గమనించవచ్చు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ నిర్మించారని.. ప్రామాణికాలు పాటించలేదన్న అంశాలు వెలుగులోకి వచ్చిన కాసేపటికే.. మేయర్ మాట్లాడిన మాటలు చక్కర్లు కొడుతున్నాయి. బవానా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ బాణ సంచా కర్మాగారంలో శనివారం మంటలు ఎగిసిపడి 17 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మృతుల్లో 10 మంది మహిళలు ఉండగా.. మరో 30 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఊపిరాడక చనిపోయారని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి యాజమాని మనోజ్ జైన్‌ను ఆదివారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అది ఫేక్ వీడియో... బీజేపీ మేయర్ ప్రీతి అగర్వాల్ వ్యాఖ్యల వీడియోపై బీజేపీ స్పందించింది. అది ఫేక్ వీడియో అని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చెబుతున్నారు. మార్ఫింగ్ చేసిన ఆ వీడియోను చివరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తన ట్విటర్లో పోస్టు చేయటం దారుణమని తివారీ అంటున్నారు. మరోవైపు మేయర్ ప్రీతి కూడా అది మార్ఫింగ్ వీడియో అని.. తాను అసలు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెబుతుండటం కొసమెరుపు. -
2జీ స్పెక్ట్రమ్ కేసుల కథాకమామిషు
సీబీఐ వర్సెస్ ఎ.రాజా (ఏ–1),సిద్ధార్ధ బెహురా (ఏ–2), ఆరేకే చందోలియా (ఏ–3),షాహిద్ ఉస్మాన్ బల్వా (ఏ–4) వినోద్ గోయెంకా (ఏ–5), కనిమొళి కరుణానిది (ఏ–17) తదితరులు చార్జిషీట్లోని ప్రధానాంశాలు ః 2008లో యూనిఫైడ్ యాక్సెస్ సర్వీసెస్( యూఏఎస్) లైసెన్స్‌ల ఎంట్రీ ఫీజును టెలికాం శాఖ రూ.1,658గా నిర్ధారించింది. 2001లో టెలికాం శాఖ సెల్యులర్ మొబైల్ టెలిఫోన్ సర్వీస్ (సీఎంటీఎస్)లైసెన్స్‌లను వేలం వేశాక ఎంత మొత్తం వచ్చిందో 2008లోనూ «అవే ధరలను నిర్ణయించారు. యూఏఎస్ లైసెన్సులకు దరఖాస్తు చేసుకోవాలని 2007 సెప్టెంబర్ 25న ప్రకటన జారీచేసి, అక్టోబర్ 1 తరువాత వచ్చే వాటిని స్వీకరించమని టెలికాం శాఖ పేర్కొంది. కొన్ని కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకే ఈ మార్పు చేశారు. లైసెన్సుల కేటాయింపు నియమ నిబంధనల్లో మంత్రి రాజా ఆధ్వర్యంలో పలు మార్పులు జరిగాయి. కొన్ని కంపెనీలు వేలంలో పాల్గొనకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ 1) రాజా, 2) షాహిద్ ఉస్మాన్ బల్వా, 3) వినోద్ గోయెంకా, 4)ఆసిఫ్ బల్వా, 5) రాజీవ్ అగర్వాల్, 6)కరీం మెరానీ 7)శరద్ కుమార్ 8) ఎంకే దయాళు అమ్మాళ్, 9) కనిమొళి కరుణానిధి 10)పి.అమృతం, 11)మెసెర్స్ స్వాన్ టెలికాం 12)మెసెర్స్ సినీయుగ్ మీడియా తదితరులు. ఈడీ ప్రధాన అభియోగాలు ః సీబీఐ కేసుకు అదనంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ. నిందితులు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు రూ.223.55 కోట్ల ఆస్తుల జప్తు సందర్భంగా స్పష్టమైనట్లు వెల్లడి. తాము నమోదుచేసిన కేసుకు సంబంధించి తగిన ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్న ఈడీ. మనీలాండరింగ్ ద్వారా సంపాదించిన సొమ్ము ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయా వ్యక్తులు, సంస్థల వద్దే ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు వెల్లడి. సీబీఐ వర్సెస్ 1) రవికాంత్ రుయా, 2) అన్షుమన్ రుయా, 3) ఐపీ ఖైతాన్, 4) కిరణ్ ఖైతాన్ 5) వికాస్ షరాఫ్ తదితరులు చార్జిషీటులోని అంశాలుః లెటర్ ఆఫ్ ఇంటెంట్ సమర్పించిన అన్ని కంపెనీల అర్హతలను పరిశీలించిన సీబీఐ. 2007 సెప్టెంబర్‌లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న మెసెర్స్ లూప్ టెలికాం మెసెర్స్ ఎస్సార్ గ్రూపు బినామి అని తెలిసింది. యూఏఈ లైసెన్స్‌తో 2005 నుంచే ముంబయి సర్వీస్ ఏరియాలో మెసెర్స్ మొబైల్ ఇండియా కార్యకలాపాలు కొనసాగించింది. మెసర్స్ వొడాఫోన్ ఎస్సార్ లిమిటెడ్‌లో అప్పటికే మెసర్స్ గ్రూపునకు 33 శాతం వాటా ఉన్నట్లు నిర్ధారణ. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆర్ఎంపీలకు లైసెన్సా?
కర్నూలు(హాస్పిటల్): తాము 15 సంవత్సరాలు కష్టపడి చదివి డిగ్రీలు సంపాదిస్తున్నామని, కానీ వైద్యం చేసేందుకు ఎలాంటి అర్హత లేని ఆర్ఎంపీలకు ఎలా లైసెన్స్ ఇస్తారని సీనియర్, జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే జీవో నెం.465ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మెడికల్ కాలేజీలోని సీఎల్జీ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆసుపత్రి ఆవరణ నుంచి మెడికల్ కాలేజీ మీదుగా రాజవిహార్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ వైద్యవిద్యార్థులు మానవహారం, రాస్తారోకో నిర్వహించి, తెలుగునాడు పార మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కలెక్టరేట్ చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూడా కాసేపు రాస్తా ఆందోళన చేసి కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ రెండు రోజుల్లోగా తమ డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 52వేల మంది ఆర్ఎంపీల ఓట్ల కోసం తెలుగుదేశం ప్రభుత్వం వారు వైద్యం చేసేందుకు లైసెన్స్‌లు మంజూరు చేస్తోందని విమర్శించారు. వారు చేసే వైద్యంతో వేలాది మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. పైగా జూనియర్ డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం లేదని తమను విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల పోస్టులు కాంట్రాక్టు పద్ధతిన గాకుండా రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తే గ్రామాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు జూడాలు తెలిపారు. అనంతరం జీఓ 465ను రద్దు చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు వినతి పత్రం సమర్పించారు. వీరి ఆందోళనకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ రామకృష్ణనాయక్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శివశంకర్‌రెడ్డి, డాక్టర్ సి. మల్లికార్జున, కోశాధికారి డాక్టర్ రంగయ్య, జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు అనుదీప్, దీరజ్, శ్రీహరి, శివప్రసాద్, సతీష్ తదితరులు మద్దతు తెలిపి పాల్గొన్నారు. -
ఉబర్‌కు ఎదురుదెబ్బ.. 30 తర్వాత రోడ్లపైకి నో!
లండన్ : ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్‌కు చుక్కెదురైంది. లండన్‌లో తన లైసెన్స్ కోల్పోయింది. దీంతో 40 వేల మంది డ్రైవర్ల భవిష్యత్ గందరగోళంలో పడనుంది. ఈ నెల సెప్టెంబర్ 30 తర్వాత ఉబర్ సంస్థ తన క్యాబ్‌లను లండన్ నగరంలో తిప్పడానికి వీల్లేదంటూ లండన్ ట్రాన్స్పోర్ట్ రెగ్యులేటర్ సంస్థ స్పష్టం చేసింది. ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ నిబంధనల ప్రకారం.. ఉబర్ క్యాబ్‌ల నిర్వహణ తీరు లేదని వ్యాఖ్యానించింది. కార్పొరేట్ తరహా బాధ్యతలు నిర్వహించడంలో వెనుకబాటుతోపాటు ముఖ్యంగా ప్రయాణీకుల భద్రత విషయాన్ని ఉబర్ పట్టించుకోలేదని, తాము సూచించిన భద్రతా పరమైన చర్యలు తీసుకోలేదని పేర్కొంది. కాగా, ఈ నిర్ణయంపై అప్పీల్ చేసుకొనే హక్కు ఉబర్ సంస్థకు ఉంది. 21 రోజుల్లో ఈ అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే, లండన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉబర్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే ఈ సంస్థకు వ్యతిరేకంగా పలు యూనియన్లు, చట్టప్రతినిధులు, నల్లజాతికి చెందిన డ్రైవర్ల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
నిబంధనలు బేఖాతరు
వివాదాల నడుమ వైన్ షాపుల లైసెన్సులు కొన్ని చోట్ల గుడి, బడి సమీపంలోనే షాపులు తెలుగు తమ్ముళ్లకు వర్తించని నిబంధనలు రాజమహేంద్రవరం క్రైం : వివాదాల నడుమ బ్రాందీ షాపులకు లైసెన్సుల మంజూరు జరిగింది. బ్రాందీ షాపులకు జూన్ 30తో గడువు ముగిసి జూలై 1 నుంచి కొత్తగా లైసెన్స్‌లు తీసుకున్న వారు షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ఈ నెల నుంచి ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 534 బ్రాందీషాపులకు, 42 బార్లు, స్టార్ హోటళ్లకు లైసెన్సులు మంజూరు చేశారు. ఆదివారానికి జిల్లాలో 175 బ్రాందీ షాపుల యజమానులు, 3 బార్లకు లైసెన్సులు తీసుకున్నారు. ఇంకా బ్రాందీ షాపులు లైసెన్సులు తీసుకోవాల్సి ఉన్నాయి. తీసుకున్న కొన్ని షాపులతో పాటు, పాత బ్రాందీషాపులకు కొన్ని వివాదాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా గుడి, బడి, హాస్పటల్స్ చూడకుండా ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు ఇవ్వడంతో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ నిబంధనల ప్రకారం బ్రాందీ షాపులకు లైసెన్సులు మంజూరు చేయాలంటే దేవాలయాలు, పాఠశాలలు, హాస్పటల్స్, జాతీయ నాయకుల విగ్రహాలకు 100 మీటర్ల దూరంలో ఇవ్వాలి. దీనితో పాటు స్థానికుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. యజమానులు స్థానికుల అనుమతులు తీసుకోకుండానే షాపులు ఏర్పాటు చేస్తున్నారు. స్థానికుల సంతకాలు ఫోర్జరీ చేసి వారి అనుమతి ఉందని ఎక్సైజ్ అధికారులను నమ్మిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే బ్రాందీషాపులకు లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. బ్రాందీషాపులు ఏర్పాటు చేసిన తరువాత స్దానికులు ఎన్ని అభ్యంతరాలు పెట్టినా షాపులు తొలగించడం లేదు. చేసేది లేక బ్రాందీషాపులు ఏర్పాటు చేసిన ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే కాలం వెళ్లదీస్తున్నారు. రామమందిరం సమీపంలో బ్రాందీ షాపు కొత్తగా ఇచ్చిన బ్రాందీషాపుల లైసెన్సులలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి. రాజమహేంద్రవరం, ఆనాల వెంకట అప్పారావు రోడ్డులో కోదండరామ దేవాలయం సమీపంలో దేవసాయి వైన్స్‌కు అనుమతి ఇచ్చారు. ఈ షాపులు ఏర్పాటు చేయడానికి స్థానిక కోదండరామ దేవాలయం కమిటీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. అయినా షాపు యథాతథంగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. గతంలో జాంపేట మార్కెట్ వద్ద ఉన్న పీఎస్ వైన్స్ ఏర్పాటులో స్థానిక ముస్లిం కుటుంబాలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా స్థానికుల అభ్యంతరాలు పక్కన పెట్టి మళ్లీ ఎక్సైజ్ అధికారులు లైసెన్సును మంజూరు చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బ్రాందీషాపును తరలించాలని పోరాటం చేస్తుంటే ఏటా షాపునకు లైసెన్సులు ఇస్తున్నారని పేర్కొంటున్నారు. దానవాయిపేటలోని చిన గాంధీ బొమ్మ వద్ద ఎస్వీఎస్ వైన్స్ ఏర్పాటు చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ విగ్రహం ఎదురుగా బ్రాందీషాపు ఏర్పాటుపై అభ్యతరం వ్యక్తం చేసినా ఎక్సైజ్ అధికారులు తిరిగి మళ్లీ లైసెన్సులు ఇచ్చి నిబంధనలు తుంగలో తొక్కారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఇచ్చిన లైసెన్సులపై వివాదాలు వ్యక్తమవుతున్నాయి. -
లాలూ కుమారుడికి మరో ఝలక్
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కి మరో సారి ఎదురు దెబ్బ తగిలింది. లాలూ కుమారుడు, బిహార్ ఆరోగ్య శాఖామంత్రి తేజ్ ప్రతాప్‌యాదవ్‌కు ప్రభుత్వం రంగ ఆయిల్ సంస్థ ఝలక్ ఇచ్చింది. ఆయన పెట్రోల్ పంపు లైసెన్సును బీపీసీఎల్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31న కంపెనీ పంపించిన నోటీసులకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కేటాయించిన పెట్రోల్ పంపు లైసెన్సును భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) రద్దు చేసింది. దీనికి సంబంధించి ఆయనకు కేటాయించిన పెట్రోల్ పంప్ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని కోరుతూ ఒక షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. 15 రోజులలోపు సమాధానం ఇవ్వాల్సింది కోరింది. బిపిసిఎల్ టెరిటరీ మేనేజర్ (రిటైల్), పాట్నా, మనీష్ కుమార్ పేరుతో ఈ నోటీసులు అందాయి. దీని ప్రకారం, అసిసాబాడ్ బైపాస్ రహదారిలో ఉన్న పెట్రోల్ పంప్‌ను యాదవ్ అక్రమంగా లీజుకు తీసుకున్నట్టు ఫిర్యాదు చేసింది. 2012 లో పెట్రోల్ పంప్ కోసం యాదవ్ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరి 27న మంత్రి పేరుతో రిజిస్టర్ అయింది. M / S లారా ఆటోమొబైల్స్‌కు రిటైల్ అవుట్ లెటకు దీన్ని అప్పగించారు. అయితే ఇది M / S చెల్లదని ఇన్ఫోసిస్టెమ్స్ ఫిర్యాదు చేసిందని బీపీసీఎల్ ఆ నోటీసులో పేర్కొంది. బీహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి, తేజ్ ప్రతాప్ సోదరుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, త్వరలోనే వివరాలు తెలియజేస్తామన్నారు. ఏక పక్షంగా వ్యవహిరిస్తున్నారనీ, త్వరలోనే వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు. కాగా యూపీఏ పాలనలో తేజ్ ప్రతాప్‌కు పెట్రోల్ పంప్ ను అక్రమంటా కేటాయించారనీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు సుశీల్ మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే -
రైతును దగా చేస్తే.. లైసెన్స్ రద్దు!
-
రైతును దగా చేస్తే.. లైసెన్స్ రద్దు!
వ్యాపారుల ట్రేడ్ లైసెన్సుల రద్దుకు సర్కారు యోచన ప్రభుత్వ ధరలకే పంటలు అమ్ముకునేలా చట్టం? ఖమ్మంలో మిర్చి రైతు దగాపై నివేదిక కోరిన సీఎం సాక్షి, హైదరాబాద్: రైతుకు గిట్టుబాటు ధర రాకుండా అడుగడుగునా దోపిడీ చేస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. అవసరమైతే బాధ్యులైన వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు త్వరలో తీసుకురాబోయే మార్కెటింగ్ చట్టంలో కొత్త అంశాలు జోడించాలని భావిస్తోంది. ఇప్పటికే నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం తయారుచేసిన చట్టంలో అదనంగా కొత్త అంశాలు జోడించి పకడ్బందీగా తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది నుంచి గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మార్కెటింగ్ చట్టం ఆ మేరకు రైతుకు ఉపయోగపడేలా ఉండాలని తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త మార్కెటింగ్ చట్టం ప్రకారం గ్రామ, మండల, జిల్లా రైతు సంఘాలు కలసి ఇతర ప్రాంతాల్లో పంటను విక్రయించి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తాయి. ఎక్కడా ధర లేకపోతే గోదాముల్లో నిల్వ ఉంచి ధర వచ్చాకే విక్రయించేలా ఏర్పాట్లు చేస్తారు. వచ్చే ఏడాది నుంచి ఇటువంటి భూమిక ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మరోవైపు నకిలీ విత్తన నిరోధక, పరిహార చట్టాన్ని త్వరలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ముసాయిదా బిల్లు సిద్ధమైంది. కంపెనీలు నకిలీ విత్తనాలు అమ్మితే సంబంధిత యజమానిని జైలుకు పంపిస్తారు. రైతుకు కంపెనీ నుంచి పరిహారం ఇప్పిస్తారు. ఈ బిల్లును ఇప్పటికే న్యాయశాఖ పరిశీలనకు పంపించారు. కేబినెట్ ఆమోదం తర్వాత శాసనసభలో బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. అకస్మాత్తుగా ధర ఎందుకు తగ్గింది? కొద్ది రోజులుగా రూ. 6 వేల దాకా క్వింటాల్ మిర్చిని కొనుగోలు చేసిన వ్యాపారులు...శుక్రవారం ఖమ్మంలో అకస్మాత్తుగా 50–60 శాతం మధ్య ధరలు తగ్గించడం వెనుక కుట్ర దాగి ఉందేమోనని ప్రభుత్వం అనుమానిస్తోంది. శుక్రవారం ఖమ్మం మార్కెట్లో మిర్చిని రూ.2,500 నుంచి రూ.4,500 వరకే కొనుగోలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరింది. దళారుల ప్రమేయంపైఖమ్మం మార్కెట్ యార్డులో విధ్వంసం వెనుక ఉన్న వారి వివరాలు తెలుసుకోవాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఒక రాజకీయ పార్టీ పథకం ప్రకారం రైతులను రెచ్చగొట్టడం వల్లే విధ్వంసం చోటుచేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే తక్కువ ధరకు మిర్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారులను కట్టడి చేయడంలో విఫలమైన మార్కెటింగ్ అధికారులపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మిర్చి రైతుల హాహాకారాలు... ఊహించని రీతిలో మిర్చి ధర పడిపోవడంతో రైతులు హహకారాలు పెడుతున్నారు. ప్రస్తుతం క్వింటాలుకు సగటున రూ. 4,500 ధర మించడం లేదు. నాణ్యత లేదంటూ కొన్నిచోట్ల రూ. 3 వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. తక్కువ ధరపై రైతులు ప్రశ్నిస్తే కొనుగోలు చేయకుండా వ్యాపారులు సతాయిస్తున్నారు. వాస్తవంగా సీజన్ ప్రారంభంలో మిర్చి ధర కొంతలో కొంత బాగుంది. జనవరి నుంచి ధర పతనం మొదలైంది. ఫిబ్రవరిలో దాదాపు రూ. 1,500 తగ్గింది. ఇక పంట ఉత్పత్తి అధికంగా ఉండే మార్చి, ఏప్రిల్‌లలో అనూహ్యంగా ధర పతనమైంది. గత నెల మొదట్లో రూ. 8 వేలకు పడిపోయింది. మార్చి రెండో వారం నుంచి రూ. 5 వేలకు పడిపోయింది. ఇప్పుడు రూ. 4,500కు పడిపోయింది. ప్రస్తుతం రోజుకు కొంత చొప్పున ధర పడిపోతోంది. రైతుకు ఎకరా పంట సాగు కోసం కోతకు రూ. లక్షన్నర వరకు ఖర్చవుతుంది. ధరల పతనంతో మిర్చి రైతులు హాహాకారాలు చేస్తున్నారు. కొన్ని మార్కెట్లలో మిర్చిని కాలబెడుతున్నారు. ఇంత జరుగుతున్నా మిర్చి కొనుగోలుకు అనుమతిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాసినా ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీకి వెళ్లి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు మిర్చి రైతులకు క్వింటాలుకు రూ. 1,500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ మార్కెటింగ్ శాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించడం తెలిసిందే. -
ఈ బ్యాంక్ లైసెన్స్ రద్దు
లక్నో: ఉత్తరప్రదేశ్ కు చెందిన మెర్కంటైల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ క్యాన్సిల్ చేసింది. గత కొంతకాలంగా ఆంక్షలువిధిస్తూ వచ్చిన మీరట్ లోని ఈ బ్యాంకు లైసెన్స్ ను రద్దు చేస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 5వ తేదీతో ముగియనున్న బ్యాంక్ చెల్లుబాటును సోమవారం రద్దు చేసింది. గత ఏడాది అక్టోబర్ లో సమీక్షించిన కేంద్ర బ్యాంకు ఆరు నెలల పాటు గడువును పొడిగించింది. కాగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 35A, సబ్ సెక్షన్ (1) కింద ప్రకారం సెప్టెంబర్ 30, 2015 మొదట ఆంక్షలు విధించింది. అనంతరం అక్టోబర్ 06, 2015 ఆ తర్వాత ఏప్రిల్ 05, 2017 వరకు పొడిగించింది. మార్చి 29, 2016న జారీ చేసిన ఉత్తరువుల ద్వారా బ్యాంకు గడువును పొడిగించారు/సవరించిన సంగతి తెలిసిందే. -
కావేరీ సీడ్స్ లైసెన్స్ తాత్కాలిక రద్దు
అమరావతి: కావేరీ సీడ్స్ లైసెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. కావేరీ సీడ్స్‌కు చెందిన ‘జాదూ’ పత్తి విత్తనాల నాణ్యత సరిగ్గా లేదని గుంటూరు జిల్లా చిలకలూరిపేట, అచ్చంపేట మండలాల రైతులలు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన వ్యవసాయశాఖ అధికారులు నివేదిక తయారుచేశారు. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని కావేరీ సీడ్స్ లెసైన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు రద్దు ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపింది. -
నా గన్ లైసెన్స్ ఎప్పుడో రదై్దంది
నయీమ్ కేసుకు గన్ లైసెన్స్ రద్ధుకు ఎలాంటి సంబంధం లేదు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నయీమ్‌తో సంబంధాలు వెలుగులోకి వస్తాయి నా పై హత్యకు కుట్ర పన్నారు దుబ్బాక నర్సింహారెడ్డి నల్లగొండ: ‘ఆత్మరక్షణ కోసం నేను కొనుగోలు చేసిన గన్ను ప్రభుత్వానికి ఎప్పుడో సరెండర్ చేశాను. నా గన్ లైసెన్స్ ఎప్పుడో రద్దు అయింది. నయీమ్ కేసుకు నా గన్ లైసెన్స్ రద్దుకావడానికి ఎలాంటి సంబంధం లేదు’ అని టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నయీమ్‌తో సంబంధాలు కలిగిఉన్నట్లు ఆ కారణంగానే ప్రభుత్వం నా గన్ లైసెన్స్ రద్దు చేసినట్లు’ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనను హత్య చేయించడానికి కోమటరెడ్డి బ్రదర్స్ పథకం పన్నారని దాంతో ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం నుంచి గన్‌లైసెన్స్ పొందినట్లు దుబ్బాక పేర్కొన్నారు. నయీమ్‌తో సంబంధాలు కలిగినట్లు విచారణలో తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగానే ఉన్నానని స్పష్టం చేశారు. 2009 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో నయీమ్ భౌతికంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి గెలుపునకు పనిచేశారని, నల్లగొండను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేశారాని ఆరో పించారు. నయీమ్ అనుచరుడు యూసుఫ్ సహకారంతో టీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు పాల్పపడ్డారని, ముస్లింసోదరులను చంపుతామని బెదిరించాడని తెలిపారు. నయీమ్‌తో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సంబంధాలు ఉన్నాయని సిట్విచారణలోత్వరలోనే అవన్నీ వెలు గులోకి వస్తాయన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి కా ర్యక్రమాలు చేపడుతున్నందున ఓర్వలేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నైతికదెబ్బతీసేందుకే తన పై దుష్ప్రచారం చేస్తున్నారని దుబ్బాక విమర్శించారు. నయీమ్ వ్యవహారాల్లో ఎలాంటి సంబంధం ఉన్నా బాధితులు తన పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చునని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అబ్బగోనిరమేష్ గౌడ్, బషీర్, పార్టీ మండల అధ్యక్షుడు బకరం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
'ఇక్కడి' లైసెన్స్ తో 'అక్కడ' హాయిగా తిరగొచ్చు!
భారత్ లో డ్రైవింగ్ లైసెన్సు పొంది ఇతర దేశాలకు వెళ్ళే వారు అక్కడ వాహనాలు నడిపేందుకు తమ లైసెన్సు పని చేస్తుందా లేదా అన్నవిషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఒక్కో దేశంలో ఒక్కో నిబంధనలు కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ తో ప్రపంచంలో ఏఏ దేశాల్లో తిరిగేందుకు అనుమతులు ఉన్నాయో ఓసారి చూద్దాం. వాహనం నడిపేవారి వద్ద తప్పనిసరిగా రవాణా సంస్థ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్న నిబంధన సుమారు అన్ని దేశాల్లోనూ ఉంటుంది. అయితే అది ఇతర దేశాల లైసెన్సు అయినప్పుడు అక్కడ పనికి వస్తుందా లేదా అన్నది గమనించాలి. ముఖ్యంగా ఇండియాలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్సుతో ప్రపంచంలోని 14 దేశాల్లో డ్రైవింగ్ చేసేందుకు అనుమతులు ఉన్నాయి. రవాణా విభాగం అందించిన లైసెన్సు నియమావళిని బట్టి భారత్ లో అందించిన డ్రైవింగ్ లైసెన్స్ తో యూరప్ దేశాల్లో భాగమైన ఫిన్ ల్యాండ్ తోపాటు, మరో అందమైన దేశం, ప్రముఖ పర్యాటక దేశంగా పేరొందిన నార్వే, స్పెయిన్ లోనూ కూడ భారత్ డ్రైవింగ్ లైసెన్స్ తో డ్రైవింగ్ చేయొచ్చు. అమెరికా భూభాగానికి ఉత్తర భాగంలో ఉన్న కెనడా దేశంలో కూడ భారత ప్రభుత్వం జారీ చేసిన వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించవచ్చు. అక్కడ భారత్ లోని నియమావళికి సరిపోయేట్టుగానే డ్రైవింగ్ నిబంధనలు ఉంటాయి. అతిపెద్ద నయాగరా జలపాతంతో పర్యాటకులను ఆకట్టుకునే కెనడాకు ఒట్టావా రాజధాని. అలాగే మధ్యధరా సముద్రానికి ఉత్తర భాగాన ఉన్న ఇటలీలో కూడ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ తో హాయిగా వాహనాలు నడిపేందుకు అనుమతులు ఉన్నాయి. పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన మరో దేశం మారిషస్ లోనూ భారత డ్రైవింగ్ లైసెన్స్ ను వినియోగిచవచ్చు. అయితే సౌత్ ఆఫ్రికాలో మాత్రం భారత్ లో పొందిన లైసెన్స్ ప్రాంతీయ భాషలో లేకుండా ఇంగ్లీషులో ఉన్నట్లయితే ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. అడ్వెంచర్లకు ప్రసిద్ధి చెందిన న్యూజిల్యాండ్ లో మాత్రం అక్కడి రవాణా అధికారులు సూచించిన వాహనాలను మాత్రమే భారత్ లైసెన్స్ తో నడిపే అవకాశం ఉండగా... అస్ట్రేలియాలో భారత ప్రభుత్వం జారీ చేసిన అంతర్జాతీయ పర్మిట్ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ అయితే అక్కడి వాహనాలు నడిపేందుకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ప్రకృతి రమణీయ ప్రదేశాలకు నిలయమైన స్విట్జర్లాండ్ లోనూ భారత్ లైసెన్స్ తో కార్లు నడిపేయచ్చు. అయితే కొన్ని దేశాల్లో భారత్ డ్రైవింగ్ లైసెన్స్ ను వారి వారి భాషల్లోకి మార్పిడి చేయించిన అనంతరం వినియోగించే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా ఫ్రాన్స్ లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ను ఫ్రాన్స్ భాషలోకి మార్చుకోవాలి. అమెరికాలో అయితే ఏడాది పాటు భారత్ లైసెన్స్ కు ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా అనంతరం దీనితోపాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉన్న లైసెన్స్ ను అక్కడి భాషలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ లోనూ, యుకే లోనూ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది పాటు పనికొస్తే... జర్మనీలో ఆరు నెలల పాటు మాత్రేమే వినియోగించవచ్చు. -
కొత్త బ్యాంకులు వచ్చేస్తున్నాయ్..!
మరింత మందికి సేవలు... ♦ తలా పది పేమెంట్, చిన్న బ్యాంకులకు లెసైన్సు ♦ వచ్చే రెండు మూడు నెలల్లో కొన్ని మొదలు ♦ భారీ సక్సెస్ చూసిన చిన్న బ్యాంకుల ఐపీఓలు ♦ మారనున్న బ్యాంకింగ్ ముఖచిత్రం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొండల్లా పేరుకుపోయిన ఎన్పీఏలతో నిత్యం వార్తల్లో ఉంటున్న భారతీయ బ్యాంకింగ్ రంగం... సమూలంగా మారబోతోంది. ఒకవైపు పేమెంట్ బ్యాంకులు, మరోవైపు చిన్న బ్యాంకులు రానుండగా... కొత్తగా యూనివర్సల్ బ్యాంకులకు కూడా లెసైన్సులిస్తామంటూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆర్బీఐ జారీ చేసింది. పేమెంట్ బ్యాంకు లెసైన్సులు పొందిన ఎయిర్టెల్, పేటీఎం కార్యకలాపాలను ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తుండగా... చిన్న బ్యాంకుల లెసైన్సులు పొందిన ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈక్విటాస్ సంస్థలు పబ్లిక్ ఇష్యూకు కూడా వచ్చి దుమ్మురేపాయి. పరిస్థితి చూస్తుంటే త్వరలో ఊరికో బ్యాంకు స్థాయి నుంచి వీధికో బ్యాంకు వచ్చేలా కనిపిస్తోంది. పేమెంట్ బ్యాంకుల్లో దిగ్గజాలు... గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రిజర్వ్ బ్యాంక్ 10 పేమెంట్ బ్యాంకులకు, 10 చిన్న బ్యాంకులకు సూత్రప్రాయ లెసైన్సులిచ్చింది. ఎయిర్టెల్, పేటీఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటివి పేమెంట్ బ్యాంకు లెసైన్సులు పొందగా... ఉజ్జీవన్ ఫైనాన్షియల్, ఈక్విటాస్ హోల్డింగ్స్, ఈఎస్ఏఎఫ్ మైక్రోఫైనాన్స్ వంటివి చిన్న బ్యాంకుల లెసైన్సులు పొందాయి. చిన్న బ్యాంకు లెసైన్సు పొందిన వాటిలో 8 సంస్థలు ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ రంగంలో ఉన్నవే. వీటిలో అన్నింటికన్నా ముందు.. జలంధర్‌కు చెందిన క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఏప్రిల్‌లోనే 10 శాఖలతో కార్యకలాపాలు ప్రారంభించేసింది. ప్రస్తుతం రూ.3,000 కోట్లుగా ఉన్న వ్యాపారాన్ని .. చిన్న బ్యాంకు కార్యకలాపాలతో అయిదేళ్లలో రూ. 12,000 కోట్లకు, శాఖల సంఖ్యను 216కు పెంచుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇక, చెన్నై సంస్థ ఈక్విటాస్ హోల్డింగ్స్ ఈ మధ్యే ఐపీవోకి వచ్చి రూ.2,170 కోట్లు సమీకరించింది. ఈ ఐపీవో ఏకంగా 17 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యిందంటే... వీటి భవిష్యత్‌పై మదుపరులకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉజ్జీవన్ ఫైనాన్షియల్ రూ.885 కోట్ల ఐపీవోకి రాగా ఇది ఏకంగా 41 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. బ్యాంకింగ్ సేవలు లేని ప్రాంతాల్లో కొత్తగా 100 శాఖలు ఏర్పాటు చేయాలని ఉజ్జీవన్ యోచిస్తోంది. ఇప్పటికే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్- మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో దీనికి 11.15% మార్కెట్ వాటా ఉంది. 24 రాష్ట్రాల్లో సుమారు 470 శాఖలు ఉన్నాయి. తొలి దశలో వీటిలో 40 శాతాన్ని బ్యాంకు శాఖలుగా మార్చాలని ఉజ్జీవన్ భావిస్తోంది. టెక్నాలజీపైనే పేమెంట్ బ్యాంకుల దృష్టి... పేమెంట్ బ్యాంకు లెసైన్సు పొందిన ఎయిర్టెల్... ఈ ఏడాది జులై-సెప్టెంబర్ మధ్యలో కార్యకలాపాలు ఆరంభించనుంది. ప్రస్తుతం 800 పట్టణాల్లో ఎయిర్టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్ సంస్థ... మనీ ట్రాన్స్ఫర్, సెమీ క్లోజ్డ్ వాలెట్ సేవలు అందిస్తోంది. అటు డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం కూడా ఆగస్టులో కార్యకలాపాలు ఆరంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలతో ప్రారంభించి మిగతా ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి కావాల్సిన టెక్నాలజీ ఇన్ఫ్రా కోసం విప్రోతో చేతులు కలిపింది. ఆదిత్య బిర్లా నువో, పోస్టల్ విభాగం, ఫినో పేటెక్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్ఎస్డీఎల్), ఆర్ఐఎల్, టెక్ మహీంద్రా, వొడాఫోన్ ఎం-పెసా, దిలీప్ సంఘ్వీ (సన్ ఫార్మా వ్యవస్థాపకుడు), విజయ్ శేఖర్ శర్మ (పేటీఎం సీఈవో) తదితరులకు పేమెంట్ బ్యాంకు లెసైన్సులొచ్చాయి. ఇలాంటి కొత్త బ్యాంకులు రాక ఆహ్వానించ దగ్గదేనని, వీటివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ పరిధి పెరిగి మరింత మందికి సేవలు అందుబాటులోకి వస్తాయని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బ్యాంకుల్లో తేడాలివీ... ♦ చిన్న బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల లక్ష్యాలు, సర్వీసుల్లో తేడాలుంటాయి. చిన్న బ్యాంకులు డిపాజిట్లు స్వీకరించడం, వాణిజ్య బ్యాంకుల నుంచి పెద్దగా రుణాలు పొందలేని వర్గాలకు రుణాలివ్వడం వంటివి చేస్తాయి. చిన్న రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, చిన్న తరహా వ్యాపార సంస్థలకు రుణ సదుపాయం కల్పిస్తుంటాయి. ♦ పేమెంట్ బ్యాంకుల సంగతి తీసుకుంటే... ఇవి పరిమితమైన బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, రెమిటెన్సులు మొదలైన సర్వీసులు అందిస్తాయి. టర్మ్ డిపాజిట్లు స్వీకరించడం, రుణాలివ్వడం వంటివి చేయవు. ఇవి గరిష్టంగా ఒకో ఖాతాదారు నుంచి రూ.లక్ష దాకా మాత్రమే డిపాజిట్లు స్వీకరించగలవు. ఇవి ప్రభుత్వ బాండ్లు మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రాబడులు పొందుతాయి. ♦ వాణిజ్య బ్యాంకులైతే ఖాతాలు, టర్మ్ డిపాజిట్లు, పెద్ద మొత్తాల్లో రుణాలు, ఓవర్ డ్రాఫ్టులు, రెమిటెన్సులు మొదలైన పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. -
కుక్కలకు లైసెన్స్ తప్పని సరి
హైదరాబాద్ : ఇళ్లల్లో పెంచుకునే కుక్కలకు లైసెన్స్ తప్పని సరి అని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆయన కార్పోరేషన్ అధికారులను ఆదేశించారు. అలాగే లైసెన్స్ లేని కుక్కలను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో కుక్కల దాడిలో గాయపడిన వారి సంఖ్య రోజూరోజుకు పెరుగుతుంది. అందులోభాగంగా ఇళ్లలో పెంచుకునే కుక్కలకు లైసెన్స్‌లు తప్పని సరి చేయాలని కమిషనర్ నిర్ణయించారు. -
మద్యం దుకాణాలకు నేడు రీ నోటిఫికేషన్!
హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో మిగిలిపోయిన 95 మద్యం దుకాణాలకు మంగళవారం రీ నోటిఫికేషన్ జారీచేసేందుకు ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 52, రంగారెడ్డి జిల్లా పరిధిలో 33, మెదక్ జిల్లా పరిధిలోని 10 దుకాణాలకు నోటిఫికేషన్ జారీ కానున్నట్లు తెలిసింది. ఈ దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 5 వరకు అవకాశం ఇవ్వనున్నారు. అక్టోబరు 6న ఈ దుకాణాలకు డ్రా నిర్వహించనున్నా రు. తొలిదశలో ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో ఈ దుకాణాలకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో రెండేళ్ల కాలపరిమితికి లెసైన్సు ఫీజు రూ.2.16 కోట్లుగా ఉండడం,దుకాణం ఏర్పాటుకు అవసరమైన వాణిజ్య స్థలం అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో వ్యాపారులెవరూ దరఖాస్తుచేసుకోని విషయం విదితమే.రెండోదశలోనూ ఎవరూ ముందుకురాని పక్షంలో ఆయా దుకాణాలను తెలంగాణా బేవరేజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశాలున్నట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
అధికార పార్టీ నేత అరాచకం
కొడవలూరు: అధికార పార్టీ నేతల అరాచకానికి పరాకాష్ట ఈ ఉదంతం. ఎలాంటి లెసైన్స్ లేకుండానే మద్యం షాపు నిర్వహిస్తుండగా, ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసిన ఘటన మండలంలోని తాటాకులదిన్నెలో బుధవారం సాయంత్రం చోటుచేసుకొంది. ఇక్కడ జూన్ ఆఖరి దాకా కూడా స్థానిక అధికార పార్టీ నేత మద్యం దుకాణం నిర్వహించారు. జూలై నుం చి ప్రారంభమైన నూతన మద్యం దుకాణాల్లో ఇక్కడి దుకాణం అధికార పార్టీ నేతకు రాకుండా మరో వ్యక్తికి వచ్చింది. దీంతో ఏవిధంగానైనా ఆ మద్యం దుకాణాన్ని దక్కించుకోవాలని అధికార పార్టీ నేత ఎమ్మెల్యే అండతో అరాచకానికి దిగారు. పంచాయతీ అనుమతి లేదంటూ మద్యం దుకాణ భవనాన్ని కూలదోయించారు. అతడిని ఎదుర్కోలేకపోయిన మద్యం దుకాణదారు కంటైనర్ తెచ్చి అందులో మద్యం దుకాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయినా వదలని అధికార పార్టీ నేత ఆ దుకాణానికి పక్కనే గదిలో మద్యం నిల్వలు ఉంచి అమ్మకాలు ఆరంభించారు. ఈ సమాచారం ఎక్సైజ్ అధికారుల దృష్టికి పోవడంతో ఎలాంటి అనుమతి లేకుం డా గదిలో మద్యం నిల్వలు ఉండటంతో మద్యంతోసహా ఆ గదిని సీజ్ చేశారు. అయితే ఎక్సైజ్ అధికారులపై ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి రావడంతో సీజ్ చేసిన సరుకును మరలా వదిలేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం గమనార్హం. మద్యం నిల్వలు ఉన్నందునే సీజ్ చేశాం: కోటేశ్వరరావు, ఎక్సైజ్ సీఐ తాటాకులదిన్నెలో మద్యం దుకాణానికి పక్కనే గదిలో మద్యం నిల్వలు ఉన్నాయని సమాచారం అందడంతో వెళ్లి వాటిని సీజ్ చేశాం. కానీ మద్యం నిల్వలు ఉంచిన వ్యక్తికి మరోచోట మద్యం దుకాణానికి లెసైన్స్ ఉంది. కానీ ఇక్కడ మద్యం నిల్వలు ఉంచడం చట్టవిరుద్ధమైనందున సీజ్ చేశాం. మద్యం నిల్వలను రాత్రికిరాత్రే తీయించాలని ప్రయత్నించాం. కానీ గురువారం దాకా గడువు అడిగినందున ఇచ్చాం. -
ఆన్లైన్ గుబులు
ఆన్లైన్ బిల్లింగ్ విధానం మద్యం వ్యాపారుల్లో గుబులు రేపుతోంది. ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగించి భారీగా లాభపడొచ్చన్న ఆశతో లెసైన్స్‌లు దక్కించుకున్న వ్యాపారులు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. లిక్కర్ బాటిళ్లపై హోలోగ్రామ్‌ను అమర్చి.. సూపర్ మార్కెట్ల తరహాలో ఆన్లైన్ కంప్యూటర్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఎక్సైజ్ కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మద్యం దుకాణంలో బిల్లింగ్‌ను కమిషనర్ కార్యాలయంతో అనుసంధానం చేయనున్నారు. ఆగస్టు నుంచి ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. దీనివల్ల ఇటు వ్యాపారులు, అటు ఎక్సైజ్ అధికారుల అక్రమార్జనకు చెక్ పడనుంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం : మద్యం అమ్మకాల్లో సరికొత్త విధానానికి ఎక్సైజ్‌శాఖ రెండేళ్ల కిందటే శ్రీకారం చుట్టింది. అయితే.. అది అమల్లోకి రాలేదు. ప్రస్తుతం ఆ విధానాన్ని అమలు చేసేందుకు ఎక్సైజ్ కమిషనర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ మద్యాన్ని నివారించి, నాణ్యతతో పాటు మద్యం తయారీ, అమ్మకాలపై పారదర్శకత పాటించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మద్యం సీసాలపై హోలోగ్రామ్ వేసి.. నూతన కంప్యూటర్ బిల్లింగ్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం ఆగస్టు నుంచి అమల్లోకి రానుంది. ప్రతి మద్యం దుకాణంలో ఆన్లైన్ కంప్యూటర్ బిల్లింగ్‌కు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తారు. సూపర్ మార్కెట్ తరహాలో మద్యం విక్రయించగానే కంప్యూటర్ స్క్రాచ్ ద్వారా బిల్లు వేయాలి. దాని ప్రతిని కొనుగోలుదారుడికి అందజేయాలి. ఈ బిల్లు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయానికి చేరుతుంటాయి. అలాగే ప్రతి మద్యం సీసాపై హోల్‌గ్రామ్ వేస్తారు. దానిపై సీరియల్ నెంబర్‌ను ముద్రిస్తారు. ఆ నెంబర్ ఆధారంగా సీసాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. బాటిల్‌పై ఓ టోల్‌ఫ్రీ నెంబరును కూడా ముద్రిస్తారు. తాను కొన్న మద్యం సీసా గురించి తెలుసుకోవాలనుకునే కొనుగోలుదారుడు సీసాపై ఉన్న టోల్‌ఫ్రీ నెంబరుకు ఎస్ఎంఎస్ పంపితే చాలు. క్షణాల్లో ఆ సీసా ఎప్పుడు, ఎక్కడ తయారు చేశారు? ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది? ఏ దుకాణానికి అమ్మారు? అనే వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి. అక్రమ ప్రవాహానికి అడ్డుకట్ట ప్రస్తుతం మద్యం సీసాలపై లేబుల్స్ ఉన్నాయి. కొందరు మాఫియా అవతారమెత్తి నకిలీ లేబుళ్లను తయారు చేస్తున్నారు. తద్వారా నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. కర్ణాటక నుంచి అక్కడి మద్యాన్ని భారీగా దిగుమతి చేస్తున్నారు. అక్కడ మద్యం ధరలు తక్కువ. పైగా ట్యాక్స్ వెసులుబాటు ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని మద్యం వ్యాపారులు భారీగా ఆర్జిస్తున్నారు. ఈ చర్యలతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. కొత్త విధానం ద్వారా దీన్ని పూర్తిగా నివారించే అవకాశముంది. అలాగే నకిలీ మద్యం తాగిన వారు అనారోగ్యాలకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. హోల్‌గ్రామ్ విధానం అమలైతే మద్యం సీసాలపై ఉండే నెంబరు ఆధారంగా అది ఎక్కడ తయారైందనే విషయం స్పష్టమవుతుంది. దీనివల్ల నకిలీ మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసే అవకాశముంది. జిల్లాలో ప్రస్తుతం ప్రతి నెలా రూ.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. కొత్త విధానం అమలైతే ఎక్సైజ్ ఆదాయం మరింత పెరిగే అవకాశముంది. వ్యాపారుల వెనకడుగు ఆన్లైన్ విధానం అమలుపై మద్యం వ్యాపారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దుకాణాలు కొత్తగా ప్రారంభమైనా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. బాటిల్‌పై బ్రాండ్‌ను బట్టి రూ.10-30 అధికంగా వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ బిల్లింగ్ పెడితే ఎమ్మార్పీకే విక్రయించాలి. పైగా కంప్యూటర్ల కోసం రూ.90 వేలు చెల్లించాలి. దీంతో వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. అయితే.. ఆబ్కారీ అధికారులు మాత్రం ‘కార్వే’ సంస్థ ద్వారా సాఫ్ట్‌వేర్‌తో పాటు మిషనరీ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రతినెలా రూ.5వేలు అద్దె చెలిస్తే మిషనరీ అమరుస్తారు. లేదంటే రూ.90 వేలు పెట్టి కొనాల్సి ఉంటుంది. గతేడాది కూడా వ్యాపారుల నుంచి రూ.90వేల చొప్పున వసూలు చేశారు. మిషనరీ మాత్రం అమర్చలేదు. దీంతో వారు డబ్బు తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త దుకాణాలు దక్కించుకున్నవారితో ఆ డబ్బు ఇప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందరూ అద్దెకు తీసుకుంటామంటున్నారు ఆన్లైన్ బిల్లింగ్ ఆగస్టు నుంచి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కార్వే సంస్థ సాఫ్ట్వేర్ అందిస్తోంది. అందరూ అద్దె ప్రాతిపదికర మిషనరీ కొనుగోలు చేస్తామంటున్నారు. గతేడాది డబ్బు చెల్లించిన వారికి కొత్త వ్యాపారుల నుంచి ఇప్పిస్తాం. ఇది పెద్ద సమస్య కాబోదు. - జీవన్‌సింగ్, డిప్యూటీ కమిషనర్, ఎకై ్సజ్‌శాఖ -
'గే మ్యారేజ్ లైసెన్సా.. చస్తే ఇవ్వను'
వాషింగ్టన్: అమెరికాలో స్వలింగ వివాహాలకు ఆ దేశ సుప్రీంకోర్టు చట్టబద్ధత కల్పించినప్పటికీ అమలులో మాత్రం అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. తాజాగా 27 ఏళ్లుగా సహజీవనం చేస్తోన్న ఇద్దరు గేలు మ్యారేజ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే 'లైసెన్స్ జారీ చేసేది లేదు' అంటూ ఓ అధికారిణి తేల్చిచెప్పింది. దీంతో ఆమెపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సదరు గేలు. వివరాలు.. టెక్సాస్ రాష్ట్రంలోని హుడ్కౌంటీకి చెందిన జిమ్ కాటో, జో స్టాపెలటన్ 27 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. జూన్ 30న అమెరికా సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇవ్వడంతో తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకోవాలని భావించి, సమీపంలోని రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడి క్లర్కు కేట్ లాంగ్.. గే మ్యారేజ్ లైసెన్స్ మంజూరీకి నిరాకరించింది. పైగా ''ఆడ, మగ పెళ్లి చేసుకోవడమొక్కటే ప్రకృతి ధర్మం. గే, లెస్బియన్స్ వివాహాలను మతం అంగీకరించదు'' అని జిమ్, జోలకు క్లాస్ పీకింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన గే జంట.. కోర్టును ఆశ్రయించింది. మరో ప్రయత్నంగా జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. స్పందించిన అధికారులు అక్కడిక్కడే వారికి మ్యారేజ్ లైసెన్స్ మంజూరు చేశారు. అయితే కింది ఆఫీసులో తమ వివాహం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి, అవమానించిన క్లర్కు కేట్ తీరు మార్చుకునే వరకు దావాను వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేశారు జిమ్, జోల తరఫు న్యాయవాది. -
మద్యం దుకాణాలకు మహా గిరాకీ
ఇదేదో ఓటింగ్ కేంద్రం..వీరంతా ఓటర్లు అనుకుంటే మీరు పొరబడినట్లే. వీరంతా మద్యం దుకాణాల కోసం క్యూ కట్టిన వారు. రెండేళ్ల కాలపరిమితితో లెసైన్స్‌లు ఇస్తుండడం, ఈ వ్యాపారంలో మంచి ఆదాయాలు ఉండండంతో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 2,224 దరఖాస్తులను సమర్పించారు. ఒక్కో దుకాణానికి వంద మందికి పైగా పోటీ పడడం గమనార్హం. వీరంతా ఆదివారం అదృష్ట పరీక్షను ఎదుర్కోనున్నారు. కర్నూలు: మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. గడిచిన ఏడాది మద్యం వ్యాపారులు భారీగా లాభాలు గడించారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో మద్యం వ్యాపారంపై కొత్త వ్యక్తులు కూడా దృష్టి సారించారు. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దతగా ఉండటంతో గతంలో ఆ వ్యాపారంలో ఆర్థికంగా స్థిరపడినవారు, వడ్డీ వ్యాపారులు నువ్వా నేనా అన్నట్లు దరఖాస్తుల దాఖలుకు పోటీ పడుతున్నారు. కొన్నేళ్లుగా బార్లలో సేల్స్మెన్లుగా పనిచేసి ఆర్థికంగా స్థిరపడినవారు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఒక్కొక్క దుకాణానికి పదుల సంఖ్యలో దరఖాస్తులను సమర్పిస్తున్నారు. రెండేళ్ల కాల పరిమితితో లెసైన్స్ ఇస్తుండటం కలసివచ్చే అంశంగా భావించి మద్యం వ్యాపారంతో సంబంధం లేనివారు సైతం ఈసారి లాటరీ లక్కు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. లాటరీ తగిలితే వ్యాపారం చేయకుండానే లక్షల రూపాయలు గుడ్‌విల్ పొందవచ్చని ఔత్సాహికులు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు నగరంతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన్, నంద్యాల వంటి ప్రధాన పట్టణాల్లో దుకాణాలకు పోటీ లేకుండా చేసేందుకు మద్యం సిండికేట్లు ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ లాటరీలో దుకాణం దక్కించుకున్న తర్వాత చూద్దాంలే అన్న ధోరణితో కొత్త వ్యక్తులు టెండర్లకు క్యూ కట్టారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు క్యూలో నిలబడి ఆశావహులు మద్యం దుకాణాలకు దరఖాస్తులు దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, భార్యలతో కూడా చాలామంది టెండర్లు వేయించారు. పదుల సంఖ్యలో మహిళలు దరఖాస్తులు దాఖలు చేశారు. ఈ ఏడాది 194 మద్యం దుకాణాలకు దరఖాస్తులకు ఆహ్వానించగా 181 దుకాణాలకు 2,637 దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం ఒక్క రోజే 2,224 దరఖాస్తులు వచ్చాయి. ఆశావహుల నుంచి పోటీ అధికంగా ఉండటంతో 4 వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా టర్నోవర్ ఉన్న దుకాణాలను దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. గతంలో దుకాణాలు పొందినవారు ఈసారి కూడా తమ చేతులు దాటకూడదని భావించి అనుచరులు, కుటుంబ సభ్యులతో పదుల సంఖ్యలో దరఖాస్తులు వేయించారు. జిల్లాలోని సంతజూటూరు దుకాణానికి గత ఏడాది అత్యధికంగా 41 దరఖాస్తులు దాఖలు చేసి వ్యాపారులు పోటీ పడ్డారు. రుద్రవరం దుకాణానికి 40 దరఖాస్తులు దాఖలయ్యాయి. కానీ ఈసారి నాగలాపురం, దేవనకొండ, కర్నూలులోని చరిత వైన్స్‌కు ఒక్కొక్క దుకాణానికి వందకు పైగా దరఖాస్తులు దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది. మరో రోజు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు వెయ్యి దరఖాస్తులు దాఖలైనట్లు అధికారుల అంచనా. బ్యాంకులు కిటకిట... రూ.5 లక్షలకు మించకుండా ఈఎండీ కూడా దరఖాస్తుతోనే చెల్లించాల్సి ఉంది. ఒక దరఖాస్తు రుసుం రూ.50 వేలతో కలిపి ప్రతి వ్యక్తి రూ.5.50 లక్షలు డబ్బుతో వస్తుండటంతో రెండు రోజులుగా కర్నూలులో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. కనీస సౌకర్యాలు కరువు... వందలాదిగా తరలివచ్చిన వ్యాపారులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎక్సైజ్ అధికారులు విఫలమయ్యారు. కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదని టెండర్లు దాఖలు చేయడానికి వచ్చిన వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు కూడా ఇబ్బంది పడ్డారు. దరఖాస్తు ఫీజు రూపంలో కోట్ల రూపాయలు ఎక్సైజ్ శాఖకు అందుతోంది. ఇంత ఆదాయం వస్తున్నా కనీసం తాగునీరు, కూర్చోడానికి కుర్చీలు ఏర్పాటు చేయలేదని వ్యాపారులు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు మద్యం దుకాణానికి సంబంధించి ఒక వ్యక్తి దరఖాస్తు దాఖలు చేస్తుండగా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అడ్డు తగిలి టెండర్ ఫారాన్ని లాక్కోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు సమాచారం అందడంతో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐలు రంగనాయకులు, ములకన్నతో పాటు భారీ ఎత్తున స్పెషల్ పార్టీ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో దరఖాస్తు దాఖలు చేసుకోవాలని, దౌర్జన్యానికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. సర్కారీ దుకాణాలు ప్రారంభం కర్నూలు: మద్యం నూత న పాలసీ అమలు లో భాగంగా జిల్లా వ్యాప్తం గా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణా లను ఎక్సైజ్ అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస నరేష్ రెండు రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మద్యం నూతన పాలసీ అమలుపై చర్చించారు. కో-ఆపరేటివ్ సొసైటీ, సివిల్ సప్లయ్ గోదాములు, మున్సిపల్ దుకాణాల్లో ప్రభుత్వ ఔట్‌లెట్స్‌ను ప్రారంభించాలని సూచించారు. కొన్నిచోట్ల ప్రభుత్వ దుకాణాలు లేకపోవడంతో అద్దె భవనాల్లోనే ప్రారంభించారు. కర్నూలులో డీవీఆర్ హోటల్ సమీపంలో(కర్నూలు వైన్స్) అద్దె గదిలో దుకాణాన్ని ప్రారంభించారు. కర్నూలు సీఐ పద్మావతి దుకాణాన్ని ప్రారంభించి సేల్స్‌కు అనుమతించారు. ఎక్కడెక్కడ దుకాణాలు.. ఆదోని, ఆళ్లగడ్డ, ఆత్మకూ రు, బనగానపల్లె, బేతంచెర్ల, కోవెలకుంట్ల, కర్నూలు టౌన్, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన్, నందికొట్కూరు, నంద్యాల, గాజులపల్లె, ఓర్వకల్లు, ఆస్పరి, కోసిగి, సున్నిపెంట, చాగలమర్రిలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభించారు. -
కొత్త కిక్కు!
‘అనంత’లో మద్యం ఏరులై పారనుంది. మందుబాబుల జేబులను కొల్లగొట్టేందుకు అబ్కారీ అధికారులు, మద్యం వ్యాపారులు రంగం సిద్ధం చేశారు. కొత్తగా లెసైన్స్‌లు దక్కించుకున్న వ్యాపారులు విక్రయాలు ప్రారంభించారు. భారీ మొత్తం వెచ్చించి దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు వీలైనంత దండుకోవడమే లక్ష్యంగా విక్రయాలు సాగించనున్నారు. ప్రభుత్వం కూడా గల్లాపెట్టె నింపుకోవడమే లక్ష్యంగా కొత్తమద్యం పాలసీని ప్రకటించడంతో మద్యం ప్రవాహం వరదై పారనుంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. ఇక జిల్లాలో మద్యం కిక్కు ఫుల్లుగా ఉండబోతోంది. కొత్తగా కేటాయించిన దుకాణాల దరఖాస్తుల ఫీజు, లెసైన్స్ జారీ ద్వారా ప్రభుత్వానికి రూ.180.31కోట్ల ఆదాయం చేకూరింది. 206 దుకాణాలకు 3,785 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.14.23కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో 204 దుకాణాలకు లెసైన్స్‌లు జారీ చేశారు. (రెండు షాపులకు సంబంధించి లాటరీ దక్కించుకున్న వారు లెసైన్స్‌లు తీసుకోకుండా వెనకడుగు వేశారు.) మొదటి త్రైమాసికానికి రూ.27.69కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త మద్యం పాలసీకి రెండేళ్ల గడువుంది. ఈ లెక్కన లెసైన్స్‌ల ద్వారా మొత్తం రూ.166.14కోట్ల ఆదాయం రానుంది. ఊరూరా... సర్కారీ మద్యం: ప్రతీ పల్లెలోనూ మద్యం లభించేలా ప్రభుత్వ నూతన విధానం ఉంది. గతంలో ఉన్న 5 స్లాబులను 7 స్లాబులుగా మార్చడంతో 5వేలు జనాభా ఉన్న పల్లెలోనూ మద్యం దుకాణానికి లెసైన్స్‌లు జారీ చేశారు. దీంతో పాటు టెట్రాప్యాకెట్ల విక్రయాన్ని ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకువస్తోంది. గతంలో సారాపాకెట్ల తరహాలో టెట్రాప్యాకెట్లను విక్రయించనున్నారు. మద్యం దుకాణాలకు సిట్టింగ్ అనుమతి ఉంటుంది. దీంతో దుకాణానికి వచ్చే మందుబాబులు అక్కడే కూర్చుని మద్యం సేవిస్తారు. బెల్ట్‌షాపులను అదుపు చేస్తామని బీరాలు పలుకుతున్న ప్రభుత్వం, ‘బెల్ట్’ కంటే దారుణమైన విధానం ద్వారా టెట్రాప్యాకెట్లను విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. సైకిళ్లు, మోటరు సైకిళ్ల ద్వారా టెట్రాప్యాకెట్లను పల్లెలకు పంపి విక్రయించాలని చూస్తోంది. అంటే ప్రస్తుతం పిల్లలకు ఐస్‌క్రీములు ఎలా విక్రయిస్తున్నారో... ఇక మందుబాబులకు టెట్రా ప్యాకెట్లు అలా విక్రయిస్తారన్నమాట. బెల్టూ యథాతథమే! జిల్లా వ్యాప్తంగా 1003 పంచాయతీలు ఉన్నాయి. 3,300పైగా గ్రామాలున్నాయి. వీటిలో దాదాపు 2,300 బెల్ట్‌షాపులు గతేడాది నడిచాయి. బెల్ట్‌షాపులను అరికడతామని ముఖ్యమంత్రి ప్రకటనలు గుప్పిస్తున్నా ఆదాయం కోసం అబ్కారీశాఖ అధికారులు అనధికారికంగా ప్రోత్సహించారు. వ్యాపారులు బెల్ట్‌షాపులను ప్రోత్సహించనున్నారు. దీనికి ఎక్సైజ్‌శాఖ అధికారులు కూడా అండగా నిలిచే అవకాశం ఉంది. టెట్రాప్యాకెట్లు, బెల్ట్‌షాపులతో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగనున్నాయి. ఎమ్మార్పీ కంటే అధికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు: మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు వ్యాపారులు భారీగా లెసైన్స్ ఫీజులు చెల్లించారు. ఈ మొత్తాన్ని రాబట్టుకుని, తిరిగా ఆదాయం దక్కించుకునేందుకు ‘వయొలేషన్’ను చేయనున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యాన్ని విక్రయించనున్నారు. గతేడాది బాటిల్‌పై రూ. 5-15లు అధికంగా విక్రయించారు. ఈ ఏడాది రూ.10-30 వరకూ విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా వ్యాపారులంతా సిండికేట్ అయి అధిక ధరలకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారాన్ని ఎక్సైజ్‌శాఖలోని కొందరు సీఐలు చక్కబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే జరిగితే మందుబాబుల జేబులకు చిల్లులు పడటం ఖాయం. ప్రభుత్వ అధీనంలో 23 షాపులు : మొత్తం దుకాణాల్లో 10శాతం ప్రభుత్వం దుకాణాలు విక్రయించాలి. దీంతో 23 షాపులు అబ్కారీ అధికారులే నిర్వహించనున్నారు. ఓ హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ల ద్వారా విక్రయాలు సాగించనున్నారు. -
కోరుకుంటే మద్యం
4,380 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల * ఏడు శ్లాబుల్లో లెసైన్సు రుసుం వసూలు సాక్షి, హైదరాబాద్: గ్రామాలు, హైవేలు, షాపింగ్‌మాల్స్, హైపర్ మార్కెట్లు... ఒకటేమిటి, రాష్ట్రంలో ఇక ఎక్కడ కోరుకుంటే అక్కడ మద్యం దొరుకుతుంది. తాము అధికారంలోకి వస్తే బెల్టు షాపులను రద్దుచేసి, మద్యం ప్రవాహాన్ని కట్టడి చేస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని విస్మరించి టీడీపీ ప్రభుత్వం పల్లెపల్లెలోనూ మద్యం పారించేలా, ఇంటింటికీ మద్యం చేరేలా నూతన మద్యం విధానం ఖరారు చేసింది. రెండేళ్ల లెసైన్సు కాలపరిమితి (1 జూలై 2015 నుంచి 30 జూన్ 2017) రాష్ట్రంలోని 4,380 మద్యం షాపులకు దరఖాస్తులు కోరుతూ ఎక్సైజ్ శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పది శాతం తగ్గకుండా మండలానికో ప్రభుత్వ దుకాణం నిర్వహించేందుకు నిర్ణయించింది. దీంతోపాటు షాపింగ్ మాల్స్, హైబ్రీడ్ హైపర్ మార్కెట్లలోనూ మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వనుంది. గతంలో ఐదు శ్లాబులుగా ఉండే విధానాన్ని ఈ దఫా ఏడు శ్లాబులుగా పెంచారు. జనాభా ప్రాతిపదికను కుదించి లెసైన్సు రుసుం పెంచారు. ఐదు వేల జనాభా లోపు ఉన్న (మైనర్, మేజరు పంచాయతీల్లో) ప్రాంతాలకు ఓ శ్లాబు కేటాయించి రూ.30 లక్షల లెసైన్సు రుసుం విధించారు. ఒక్క శ్లాబులో (50,001-3 లక్షల జనాభా) లెసైన్సు ఫీజు రూ.3 లక్షలు తగ్గించగా, 3,00,001-5 లక్షల జనాభా ఉన్న శ్లాబులో లెసైన్సు ఫీజు యథాతథంగా ఉంచారు. కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసేందుకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాల్ని లాట్ల డ్రా విధానంలో కేటాయించనున్నారు. అయితే మద్యం నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ ప్రతి జిల్లాలో డీఅడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. హైవేల పక్కనా పారనున్న మద్యం... హైవేల పక్కన ఉన్న మద్యం షాపుల్ని తొలగించాలని రవాణా శాఖ సాగించిన లేఖలను ఎక్సైజ్ శాఖ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. 50 మీటర్ల దూరంలో షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఈ మేరకు నోటిఫై చేశారు. రహదారులపై మద్యం తాగి ప్రమాదాలు జరుగుతున్న శాతం నాలుగుశాతం మాత్రమేనని ప్రభుత్వం నిర్ధారించిందని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మూడు లెసైన్సు షాపుల మధ్య ఓ ప్రభుత్వ షాపు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నాటు సారా, కల్తీ మద్యం, లూజు విక్రయాలను నిరోధించేందుకు టెట్రా ప్యాక్ ద్వారా మద్యం విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దరఖాస్తు ఫీజులు.. నిబంధనలు... ♦ రూరల్ ఏరియా (బెల్ట్ ఏరియాతో సహా) రూ.30 వేలు చెల్లించాలి. ♦ మున్సిపాలిటీ/టౌన్లో రూ.40 వేలు, మున్సిపల్ కార్పొరేషన్లో రూ.50వేలు దరఖాస్తు రుసుం చెల్లించాలి. ♦ ప్రతి మద్యం సీసాపై బార్కోడ్ విధానం/హాలోగ్రాఫిక్ అడెసివ్ లేబుల్ విధానం అమల్లోకి తెచ్చే విధంగా షాపులో మెషినరీ ఏర్పాటు చేయాలి. ట్రాక్ అండ్ ట్రేస్ విధానం ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తున్నందున మద్యం షాపు విధిగా కంప్యూటర్, టూ డీ స్కానర్ తదితర సాంకేతిక పరికరాలు సమకూర్చుకోవాలి. ♦ తిరుపతి కార్పొరేషన్ పరిధిలో రైల్వేస్టేషన్ నుంచి అలిపిరివరకు (వయా ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణునివాసం, శ్రీనివాసం, ఎస్వీఆర్ఆర్ ఆస్పత్రి, స్విమ్స్) ఏ ఒక్క మద్యం షాపు అనుమతించరు. సిండికేట్లు ఏర్పడకుండా చర్యలు: కొల్లు నూతన మద్యం పాలసీ ప్రకారం సిండికేట్లు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఆయన సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మద్యం షాపులకు దరఖాస్తు చేసేవారు ఖచ్చితంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెండేళ్ల వ్యాట్ రిటర్న్స్ దరఖాస్తుతోపాటు జత చేయాలన్నారు. నేటి నుంచి (23వ తేదీ) ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తుల స్వీకరణకు గడువిస్తున్నట్లు తెలిపారు. 28న స్క్రూటినీ, 29న జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి 30న ప్రొవిజనల్ లెసైన్సులు ఇవ్వనున్నట్లు వివరించారు. బార్లకు నూతన విధానం రాష్ట్రంలో ఇప్పుడున్న బార్ల లెసైన్సులు రద్దుచేసి కొత్త విధానం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. బార్ల లెసైన్సుల రెన్యువల్ వచ్చే నెల 1వ తేదీ నుంచి చేయాల్సి ఉంది. ఆలోపు కొత్త విధానానికి సమయం సరిపోదని అధికారులు చెప్పారు. దీంతో గత ప్రభుత్వం లెసైన్సులు మంజూరు చేసినందున వాటిని రెన్యువల్ చేయకుండా మూడు నెలల పాటు పొడిగించి, ఆలోగా కొత్తవారికి బార్ల లెసైన్సుల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన నూతన మద్యం విధానంపై జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది శ్లాబులు.. జనాభా ప్రాతిపదిక లెసైన్సు ఫీజు 5 వేల లోపు రూ.30 లక్షలు 5,001-10 వేల లోపు రూ.34 లక్షలు 10,001-25 వేల లోపు రూ.37 లక్షలు 25,001-50 వేల లోపు రూ.40 లక్షలు 50,001-3 లక్షల లోపు రూ.45 లక్షలు 3,00,001-5 లక్షల లోపు రూ.50 లక్షలు 5 లక్షలు ఆపై రూ.65 లక్షలు -
మద్యం సిండికేట్ల దోపిడీ!
సాక్షి, గుంటూరు: జిల్లాలోని మద్యం సిండికేట్లు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నాయి. మరో రెండు నెలల్లో లెసైన్స్‌ల గడువు ముగియనుండటంతో ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతున్నాయి. అధికార టీడీపీ నేతలు, ఎక్సైజ్ అధికారుల అండదండలతో మద్యం ప్రియుల జేబులను కొల్లగొడుతున్నాయి. మద్యం క్వార్టర్ బాటిల్‌పై రూ.25, బీరు బాటిల్‌పై రూ.45 వరకు అధికంగా వసూలు చేస్తున్నాయి. విచ్చలవిడిగా బెల్టుషాపులు ఏర్పాటు చేసి దందా సాగిస్తున్నాయి. అడ్డు తగులుతారనుకున్న ఒకరిద్దరు అధికారులకు ఎమ్మెల్యేలు, మంత్రులతో హెచ్చరికలు ఇప్పిస్తూ తమ జోలికి రాకుండా చూసుకుంటున్నాయి. అక్రమార్జనలో అధికారులకు వాటా.. మద్యం సిండికేట్ల వద్ద చాలామంది ఎక్సైజ్ అధికారులు నెలవారీ మామూళ్లు తీసుకుని వారికి సహకరిస్తున్నారనేది బహిరంగ రహస్యం. కొందరు అధికారులు మరో అడుగు ముందుకేసి అధిక ధరలకు విక్రయించటం వల్ల వచ్చే లాభాల్లో వాటా ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇటీవల గుంటూరు, తెనాలి, నరసరావుపేట మద్యం డిపోలపై ఐటీ అధికారులు దాడులు చేసి గోదాములను సీజ్ చేసిన విషయం తెలిసిందే. మద్యం సిండికేట్లు దీన్ని సైతం తమకు అనుకూలంగా మలచుకున్నాయి. వేసవిలో మందుబాబులు ఇష్టంగా తాగే బీరుకు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఎమ్మార్పీ కంటే రూ.45 వ రకు అదనంగా వసూలు చేస్తున్నాయి. కొనసాగుతున్న బెల్టు షాపులు జిల్లాలో మొత్తం 342 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో 317 లెసైన్స్డ్ దుకాణాలు కాగా 15 దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మరో పది ఖాళీగా ఉన్నాయి. మద్యం దుకాణాల లెసైన్స్‌ల గడువు జూన్ నెలాఖరుతో ముగియనుండటంతో ఇదే అదనుగా వ్యాపారులు బెల్టుషాపులను విస్తరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో క్వార్టరు బాటిల్‌పై పది నుంచి 20 రూపాయల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో క్వార్టర్ బాటిల్‌పై రూ.25 వరకు పెంచి విక్రయిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 70 వరకు బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో దాదాపు 900 బెల్టుషాపులు ఉన్నట్లు అంచనా. ఎక్సైజ్ డీసీ కార్యాలయానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడికొండ మండల పరిధిలోని పలు గ్రామాల్లో బెల్టుషాపులు కొనసాగడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విషయాలన్నీ తెలిసినా ఎక్సైజ్ ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘గదుల’పై గద్దలు
‘మా కార్యకర్తలు చెప్పింది వినండి. వారు చెయ్యమన్న పనులు చేసిపెట్టండి. వారిని చూసుకుంటేనే మా సర్కార్‌ను మరోసారి చూస్తాం. లేదంటే మీకూ ఇబ్బందే.. మాకూ ఇబ్బందే’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్లతో అన్న మాటలివి. ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాటలన్నా ఆ రోజు నుంచీ జిల్లాలో తెలుగుదేశం నేతలు అన్ని పనుల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారు. నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. దక్కినంత సొమ్ము దండుకుంటున్నారు. - ఎస్ఎంసీలు చేపట్టాల్సిన అదనపు గదుల నిర్మాణం - కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్న టీడీపీ నాయకులు - జిల్లావ్యాప్తంగా 10 నుంచి 15 శాతం కమీషన్ వసూలు - కొన్నిచోట్ల వాటాలు కుదరకపోవడంతో పనుల్లో జాప్యం సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘తమను చూసుకోమని’ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న మాటలను తెలుగుదేశం కార్యకర్తలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకోవడానికి లెసైన్సుగా పరిగణించి అన్ని వ్యవహారాల్లో ‘సొంత లాభానికే’ ఆరాటపడుతున్నారు. అది, ఇది అని లేకుండా.. చివరకు విద్యార్థుల కోసం చేపట్టే అదనపు గదుల నిర్మాణంపైనా రాంబదుల్లా వాటి కమీషన్ల కోసం పీక్కుతింటున్నారు. అడిగే నాథుడు లేడన్న బరి తెగింపుతో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లను కాగితాలకే పరిమితం చేస్తున్నారు. జిల్లాలో మూడొంతుల నియోజకవర్గాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల 10 శాతం ముట్టజెప్పేలా ఒప్పందాలు జరుగుతుంటే నోరున్న నేతలున్న ప్రాంతాల్లో 15 శాతం కూడా దండుకుంటున్నారు. కమీషన్లపై నేతల మధ్య పేచీలతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్న పరిస్థితి కూడా జిల్లాలో నెలకొంది. ఈ పరిస్థితుల్లో అదనపు గదులను మార్చి నెలాఖరుకు ఎలా పూర్తి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజీవ్ విద్యామిషన్ పర్యవేక్షణలో జిల్లాలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఇటీవల శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థుల కోసం 927, ఎనిమిదో తరగతి విద్యార్థుల కోసం 184తో కలిపి జిల్లా వ్యాప్తంగా 1111 గదుల నిర్మాణానికి అనుమతి లభించింది. ఈ గదుల నిర్మాణం కోసం జిల్లాకు రూ.58.63 కోట్లు కేటాయించారు. ఒక గదికి గతంలో రూ.3.60 లక్షలు కేటాయించగా ఇప్పుడా మొత్తాన్ని మరో రూ.2.20 లక్షలు పెంచారు.ఆ పెంపుదలే అధికారపార్టీ నేతలకు వరంగా మారింది. రాజీవ్ విద్యామిషన్ పర్యవేక్షణలో పాఠశాలమేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా నిర్మాణ బాధ్యతలు చేపట్టాలనేది నిబంధన. నిర్మాణాన్ని కమిటీలకు అప్పగిస్తే నాణ్యత బాగుంటుందన్నది ప్రభుత్వం ఉద్దేశం. ఎక్కువ కమీషన్ ఇచ్చిన వారికే.. అయితే ఈ వ్యహారమంతా నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్య నేతల కనుసన్నల్లోనే బాహాటంగా జరుగుతుండటంతో పర్యవేక్షించాల్సిన అధికారులు మొక్కుబడి పరిశీలనలకే పరిమితమవుతున్నారు. నేతలు కమిటీలను గుప్పిట్లో పెట్టుకుని నచ్చిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ముందే 10 నుంచి 15 శాతం కమీషన్ మూటగట్టుకుంటున్నారు. ఉదాహరణకు ముమ్మిడివరం నియోజకవర్గం.. తాళ్లరేవు, ఐ. పోలవరం మండలాల్లో నిర్మాణ పనులు మండల స్థాయి నేతలు చెప్పిన వారికే కట్టబెట్టాలని ముఖ్యనేత హుకుం జారీచేశారు. అక్కడ 10 శాతం కమీషన్ ఇస్తామన్న కాంట్రాక్టర్‌ను 15 శాతం కోసం డిమాండ్ చేస్తుండటంతో నేతల మధ్య వివాదం తలెత్తింది. ఆ కమీషన్ ముందుగానే ముట్టచెపితేనే పనులు అప్పగిస్తామంటుండటంతో కాంట్రాక్టర్లు వెనకడుగు వే స్తున్నారని సమాచారం. తాళ్లరేవు మండలంలో 30 అదనపు గదుల నిర్మాణానికి కేవ లం సుంకరపాలెం, ఇంజరం, గాడిమొగల్లో పనులు కిటికీల వరకే వచ్చాయి. మిగిలిన వాటిసై కాంట్రాక్టర్లతో ఒప్పం దాలు ఇప్పుడిప్పుడే కొలిక్కివస్తున్నా యి. ఐ.పోలవ రం మండలంలో అన్ని గదుల నిర్మాణం కాంట్రాక్టర్లకే ఇచ్చేలా ఒప్పందానికి వచ్చినట్టు సమాచారం. రాజోలులో ముఖ్యనేతదే మేత.. రాజోలు నియోజకవర్గంలో ముఖ్యనేతే స్వయంగా 15 శాతం కమీషన్క ఒప్పందాలు చేసుకుంటుండడం తో పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు గుర్రుగా ఉన్నా రు. అధినేత కార్యకర్తలను, తమ వంటి నేతలను చూడమంటే ఇక్కడ మాత్రం ఎన్నికల్లో అప్పుల పాలైపోయామంటూ పెద్ద తలకాయలే కమీషన్లు ఎగరేసుకుపోతున్నారని మండిపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో అదనపు గదుల నిర్మాణంలో కమీషన్‌ను మూడు వాటాలు వేసుకున్నారని సమాచారం. నేతలకు 10 శాతం, పనులు దక్కించుకున్నకాంట్రాక్టర్కు సబ్‌కాంట్రాక్టర్ ఇచ్చే 5 శాతం, క్షేత్రస్థాయిలో సిబ్బందికి 5 శాతం ఇచ్చేలా జరిగాయంటున్నారు. కమీషన్ల ఖరారులో జా ప్యం తో ఇంతవరకు కేవలం 300 గదులనే మొదలు పెట్టా రు. నిర్మాణాల్లో జాప్యంపై శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఎస్ఎంసీలు ముందుకు రాకుంటే టెండర్లు పిలవాలని కలెక్టర్ ఆదేశించడం గమనార్హం. ఇప్పటి వరకూ ఈ పనులన్నీ ఎస్ఎం సీ లే చేపడుతున్నట్టు జిల్లా యంత్రాంగం భావిస్తున్న ట్టు కనిపిస్తోంది. టీడీపీ నేతల నిర్వాకం వల్ల భావి పౌరులు చదువుకునే భవనాల నాణ్యత ప్రశ్నార్థకం కానుంది. దీనికి ఉన్నతాధికారులు చెక్ చెప్పాలి. వారి దండుడు వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలి. మేనేజ్మెంట్ కమిటీలే చేపట్టాలి.. నిబంధనల మేరకు పనులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, హెచ్‌ఎమ్‌ల పర్యవేక్షణలో చేపట్టాలి. ఎక్కడైనా కాంట్రాక్టర్లకు అప్పగించినట్టు మా దృష్టికి వస్తే ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం. - ఎం.శ్రీనివాసరావు, ప్రాజెక్టు అధికారి, రాజీవ్ విద్యామిషన్, కాకినాడ -
నో సెక్యూరిటీ.. నో డిపాజిట్
సాక్షి, గుంటూరు: జిల్లాలో పౌర సరఫరాల శాఖ గాడి తప్పింది. లెసైన్స్‌ల మంజూ రులో నిబంధనలకు తిలోదకాలు ఇస్తోంది. ఇష్టారాజ్యం గా లెసైన్స్‌లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికీ గండి కొడుతోంది. ఫుడ్ సేఫ్టీ యాక్ట్-2006 ప్రకారం ప్రతి ఏటా ఆర్టికల్స్ తయారు చేసే దుకాణాల నుంచి లెసైన్స్ రెన్యువల్ ఫీజును సెక్యూరిటీ డిపాజిట్‌గా వసూలు చేయాలి ఆర్టికల్స్ తయారు చేసే దుకాణాలుగా పిలువబడే రైస్ మిల్లులు, రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్లు, పసుపు, మిరప ట్రేడర్లు, బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తారు. రైస్ మిల్లులకు ఏడాదికి రూ. ఐదు వేలు, మిగతా వాటికి రూ. రెండు వేలు చొప్పున డిపాజిట్‌గా రాబట్టాలి. లెసైన్స్ రెన్యువల్ సమయంలోనే పౌర సరఫరాల శాఖ దీనిని వసూలు చేయాలి.మూడేళ్లుగా అధికారులు సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేయకుండా లెసైన్స్‌లను రెన్యువల్ చేస్తున్నట్లు సమాచారం. అధికారులు తనిఖీలు చేసిన సమయంలో ఏవైనా లోపాలు ఉంటే ఈ డిపాజిట్ నుంచి రికవరీ పెడతారు. ప్రభుత్వానికీ వడ్డీ రూపంలో ఆదా యం సమకూరుతోంది. 2011 నుంచి 2014 వరకు సెక్యూరిటీ డిపాజిట్ కింద పౌర సరఫరాల శాఖ ఫీజు వసూలు చేయడం లేదని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. దీనివల్ల రూ. 2.08 కోట్ల మేర ఆదాయానికి గండి పడినట్లు లెక్కలు కట్టారు. ఈ విషయాన్ని విజిలెన్స్ ఎస్పీ కేవీ మోహన్‌రావు ‘సాక్షి’ వద్ద ధ్రువీకరించారు. ఇష్టారాజ్యంగా లెసైన్స్‌ల మంజూరు... పౌరసరఫరాల శాఖ నిబంధనలు పక్కన పెట్టి జిల్లాలో ఇష్టారాజ్యంగా లెసైన్స్‌లు మంజూరు చేస్తున్నట్లు సమాచారం. దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాల్సిన అధికారులు లంచాల కోసం చూసీచూడనట్టు ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
యోగం ట్రేడర్స్ లెసైన్స్‌ల్లో గందరగోళం?
ఉయ్యూరు : పట్టణంలో యోగం ట్రేడర్స్ మాయాజాలం ఘటనతో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్వామినాథన్ ట్రేడర్స్ ఏర్పాటుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో అంతా మాయ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మునిసిపల్, వాణిజ్య పన్నుల అధికారుల నుంచి తీసుకున్న లెసైన్సులపైనా విచారణ కొనసాగుతోంది. వ్యాపార లెసైన్సులపై ఆరా తీస్తే మరో కొత్త కోణం బయటపడింది. పట్టణంలో సగానికి పైగా దుకాణాలకు చట్టప్రకారం లెసైన్సులు లేనట్లు తెలిసింది. జనం డబ్బుతోనే ! తమిళనాడుకు చెందిన స్వామినాథన్ జనం డబ్బుతోనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాడు. ముందుగా తన వ్యాపారానికి జిల్లాలో అనువైన ప్రాంతాలను ఎంచుకున్నాడు. హనుమాన్‌జంక్షన్, కంకిపాడు, ఉయ్యూరు ప్రాంతాలను ముందుగా ఎంచుకున్నాడు. ఎక్కడ వ్యాపారం ప్రారంభిస్తే ప్రయోజనం ఉంటుందో పరిశీలించాడు. ముందుగా ఉయ్యూరు పట్టణాన్ని ఎంచుకుని కాకాని గిరిజన కాలనీలో యోగం ట్రేడర్స్‌కు శ్రీకారం చుట్టాడు. ఒక వ్యక్తి వ్యాపారాన్ని స్థాపించాలంటే ట్రేడ్ లెసైన్స్, వృత్తి లెసైన్సును వాణిజ్య పన్నుల శాఖ, వ్యాపారం నిర్వహించే చోట సంబంధిత గ్రామ అధికారి నుంచి తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం దుకాణం ఏర్పాటు చేసే భవనం యజమాని ఆమోదంతో లీజ్ అగ్రిమెంట్, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ సమర్పించాలి. నిబంధనల ప్రకారం ఇవేమీ సమర్పించకుండానే యోగం ట్రేడర్స్ వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లు తెలిసింది. మునిసిపల్ అధికారులకు స్వామినాథన్ వృత్తి పన్ను చలానా కట్టినట్లు సమాచారం. ఈ అంశంపై కమిషనర్ శ్రీనివాసరావును ‘సాక్షి’ వివరణ కోరగా, వ్యాపారానికి సంబంధించి స్వామినాథన్ అనే వ్యక్తి తమకు దరఖాస్తు చేసుకోలేదని, ఎలాంటి లెసైన్సు ఇవ్వలేదని చెప్పారు. వృత్తి పన్ను కోసం చలానా కట్టారని వివరణ ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ నుంచి పొందిన లెసైన్సుపై పోలీసులకే స్పష్టత దొరకలేదు. చట్టంలో ఉన్న లొసుగులను, అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకునే యోగం ట్రేడర్స్ లాంటి మాయగాళ్లు అక్రమమార్గంలో వ్యాపార సంస్థలను స్థాపించి జనం నెత్తిన కుచ్చు టోపీ పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ.. కాదు ఇక్కడంటూ.. యోగం ట్రేడర్స్ నిర్వాహకుడు పోలీసులనే ముప్పు తిప్పలు పెడుతున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాలు, ప్రజాప్రతినిధుల సూచన మేరకు స్వామినాథన్ నుంచి సొమ్ము రికవరీ చేసి వచ్చిన మొత్తాన్ని బాధితులందరికీ సర్దే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలోనే రూ.4 లక్షలకుపైగా విలువ చేసే సరుకు ఉన్నట్లు నిర్ధారించారు. మరో రూ.7 లక్షలు ఎక్కడుందో తేలాల్సి ఉంది. ఈ సొమ్ము రాబట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించడంలేదు. ఒంగోలు, నెల్లూరు, తెనాలి, విజయవాడ ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులకు డబ్బులు ఇచ్చానని స్వామినాథన్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో వారు ఆ ప్రాంతాలకు అతడిని తీసుకువెళితే అక్కడ చుక్కెదురైనట్లు సమాచారం. ఇదేమిటని ప్రశ్నిస్తే.. అక్కడ కాదు ఇక్కడ అంటూ పోలీసులనే తికమకపెడుతున్నాడని తెలిసింది. కొందరు బాధితుల తీరు ఇలా.. బాధితుల్లో కొందరు టౌన్ స్టేషన్‌కు వెళ్లి స్వామినాథన్‌ను వదిలేయాలని పోలీసులతో వాదనకు దిగడం కొసమెరుపు. అతడిని వదిలేస్తే ఉన్న వస్తువులు తమకు ఇచ్చేస్తాడని వారు వాదిస్తున్నారు. ఈ పరిణామాలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. స్వామినాథన్‌ను వదిలేస్తే బాధితులందరికీ న్యాయం జరగదనేది పోలీసుల వాదన. -
కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
సాక్షి, హైదరాబాద్: నగరంలో నూతనంగా ప్రారంభించిన కల్లు కాంపౌండ్లలో కల్తీ కల్లు విక్రయిస్తే లెసైన్స్ రద్దు చేయడంతో పాటు సదరు దుకాణాలను మూసివేస్తామని తెలంగాణ ఎక్సైజ్ మంత్రి టి.పద్మారావు హెచ్చరించారు. దసరా సందర్భంగా శుక్రవారం సికింద్రాబాద్ బోయిగూడ కల్లు కాంపౌండ్‌లో కల్లు విక్రయాలను మంత్రి గౌడ సంఘం ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కల్తీ కల్లు విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవ హరిస్తుందన్నారు. నాణ్యమైన కల్లును మాత్రమే విక్రయించాలని ఆయన సూచించారు. కుల వృత్తులను కాపాడి గౌడ కులస్తులకు ఆర్థికంగా చేయూత నివ్వడంతో పాటు ఉపాధి కల్పించడానికి కల్లు కాంపౌండ్లను తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో తమ పార్టీ పేర్కొన్న వి ధంగా నగరంలో కల్లు కాంపౌండ్లను సీఎం కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెరిపించామని గుర్తు చేశారు. కల్లు కాంపౌండ్ల వల్ల సుమారు 50 వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. నగరంలో కల్లు ఉత్పత్తి లేనందున నాణ్యమైన కల్లు ఎక్కడ నుంచి వస్తుందనే వాదనలో పస లేదని మంత్రి అన్నారు. ఇతర జిల్లాల్లో చెట్ల ద్వారా కల్లు ఎంతో ఉత్పత్తి అవుతోందని, నగరంలోని సొసైటీలకు సదరు చెట్ల ద్వారా కల్లు సరఫరా చేస్తామన్నారు. ఉదారతను చాటుకున్న మంత్రి కరీంనగర్ జిల్లాకు చెందిన పేద దళిత కుటుంబం పట్ల ఎక్సైజ్ మంత్రి టి.పద్మారావు ఉదారతను చాటుకున్నారు. ఈనెల 2న బతుకమ్మ పండుగ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎర్రబెల్లి గ్రామానికి చెందిన ఎల్ల చిరంజీవి, సమ్మక్క దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ట్యాంక్‌బండ్‌కు వచ్చారు. అక్కడ వారు మంత్రిని కలిసి తమ దుర్భర పరిస్థితిని చెప్పుకున్నారు. వెంటనే సదరు కుటుంబాన్ని మంత్రి తన ఇంటికి తీసుకువచ్చి రెండు రోజుల పాటు ఇంట్లో ఆతిథ్యమిచ్చారు. అనంతరం చిరంజీవి, సమ్మక్క కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి శనివారం వారి స్వగ్రామం పంపించారు. అన్ని విధాలా వారికి అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. -
ఆర్టీఏ కార్యాలయం..ఏజెంట్ల రాజ్యం
ఖమ్మం క్రైం: ఆర్టీఏ- ఈ పేరు విన్నంతనే అనేకమందికి ‘కరెన్సీ నోట్లు’ గుర్తుకొస్తాయి. ఈ శాఖలో అటు అధికారులు, ఇటు ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు దండుకుంటున్నారు. ఈ శాఖలో అడపాదడపా ఏసీబీ దాడులు జరుగుతున్నా పరిస్థితిలో ఏమాత్రం మార్పుండడం లేదు. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఏజెంట్ల రాజ్యం నడుస్తోంది. లెసైన్స్ కోసమో, రిజిస్ట్రేషన్ కోసమో నేరుగా ఇక్కడకు వెళ్లేవారు చాలా తక్కువ. ఒకవేళ వెళ్లినా.. అనేక కొర్రీలు పెడుతూ రోజులతరబడి తిప్పించుకుంటారు. ఇలా లాభం లేదనుకుని ఏజెంటు వద్దకు వెళితే.. అవసరమైన పత్రాలేవీ లేకపోయినా మీ పని వెంటనే పూర్తవుతుంది. ఏజెంట్ల నుంచి ఇక్కడి అధికారులు, సిబ్బంది కమీషన్లు తీసుకుంటూ.. వారికి పని చేసిపెడుతున్నారు. కేవలం కమీషన్ల కోసమే ఏజెంట్ల వ్యవస్థను ఇక్కడి అధికారులు, సిబ్బంది కొన్నేళ్ల నుంచి పెంచి పోషిస్తున్నారు. లెసైన్స్, ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ ఫీజు కట్టేందుకు వాహనదారులు కౌంటర్ వద్ద గంటలతరబడి లైన్లో నిలుచున్నా సిబ్బంది పట్టించుకోరు. అదే ఏ ఏజెంటో వచ్చి కాగితం కింద నోటు పెట్టి నిలబడగానే.. పనయిపోతుంది. ఈ కార్యాలయ సిబ్బంది ఒకొక్కరికి ఒక్కో ఏజెంట్ చొప్పున ఉన్నారు. వీరంతా సాయంత్రం పూట ‘పంపకాలు’ సాగిస్తుం టారు. ఇదంతా ఇక్కడ బహిరంగ రహస్యమే. అయినప్పటికీ ఉన్నతాధికారులెవరూ ఇప్పటివరకూ స్పందించిన దాఖలాల్లేవు. అవినీతికి కేరాఫ్‌గా... ఆర్టీఏ శాఖ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. లెర్నింగ్ లెసైన్స్ నుంచి పెద్ద పెద్ద వాహనాల పర్మిట్ వరకు లక్షల్లో డబ్బు చేతులు మారుతోంది. ప్రైవేట్ పాఠశాల బస్సులకు ఫిట్నెస్ లేకపోయినా, హెవీ వెహికిల్స్‌కు లెసైన్స్ లేకపోయినా ఏమాత్రం టెన్షన్ అవసరం లేదు. ఈ వాహనాన్ని అధికారులు పట్టుకుంటే... ఎంతోకొంత డబ్బు ముట్టచెప్పి తేలిగ్గా బయటపడొచ్చు. 2006లో ఆర్టీఏ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి, అనధికారికంగా ఉన్న డబ్బును స్వాధీనపర్చుకున్నారు. 2008లో అప్పటి వైరా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావును ఏసీబీ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, ఆయన అక్రమ ఆస్తులను స్వాధీనపర్చుకున్నారు. జిల్లాలోని ఓ వెహికిల్ ఇన్స్పెక్టర్ అవినీతిపై ఇటీవల ఒక టీవీ చానల్ లైవ్ టెలికాస్ట్ చేసినా కూడా ఆర్టీఏ ఉన్నతాధికారుల్లో స్పందన కనిపించలేదు. దీనినిబట్టి ఇక్కడి ఈ శాఖలోని అవినీతిపై ఉన్నతాధికారులు ఎంత ఉదాసీనంగా ఉన్నారో ఊహించుకోవచ్చు. ప్రైవేట్ సైన్యానిదే పెత్తనం ఆర్టీఏ శాఖలో కొంతకాలంగా ప్రైవేట్ సైన్యం పెత్తనం సాగిస్తోంది. ఆర్డీవో దగ్గరి నుంచి ఎంవీఐలు, అసిస్టెంట్ ఎంవీఐలు సొంతంగా తమ కింద ప్రైవేట్ అసిస్టెంట్లను నియమించుకుని, వారి ద్వారా తమ అవినీతి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆ ప్రైవేట్ వ్యక్తులు ఏకంగా అధికారుల సీట్లలోనే కూర్చుని ‘పాలనా వ్యవహారాలు’ చక్కబెడుతున్నారంటే.. ఇక్కడి పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. వీరు లక్షల్లో డబ్బు దండుకుంటూ, అందులతో కొంత వాటాను అధికారులకు, సిబ్బందికి ముట్టచెబుతున్నారు. -
డ్యూటీ వద్దు.. డ బ్బే ముద్దు..
మామునూరు : నవ్విపోతురుగాక మాకేటి సిగ్గు.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వరంగల్ ఆర్డీఏ కార్యాలయం లో పనిచేస్తున్న హోంగార్డులు. లెసైన్స్ కోసం కార్యాల యానికి వస్తున్న వాహనదారులను క్రమపద్ధతిలో పం పించి, పనులను వేగవంతం చేసేందుకు పాటుపడాల్సి న హోంగార్డులు విధులను పక్కనపెట్టి అవినీతి దందా కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయి తే అసలు పనులను పక్కనపెట్టి.. అక్రమ సంపాదన కో సం కక్కుర్తి పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేం పట్టిందిలే అన్నట్లుగా వ్యవహరి స్తున్నారు. దీంతో హోంగార్డుల దందా మూడు పువ్వు లు.. ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో నాలుగేళ్ల నుంచి 13 మంది హోంగార్డులు పనిచేస్తున్నా రు. అయితే లెసైన్స్ కోసం కార్యాలయానికి వస్తున్న వాహనదారులకు తగిన సమాచారం అందిస్తూ, వారికి సహాయపడాల్సిన హోంగార్డులు అక్రమ సంపాదనకు అలవాటుపడ్డారు. కార్యాలయం బయట లెసైన్స్‌లు ఇప్పిస్తున్న ఏజెంట్ల సంపాదనను ప్రత్యక్షంగా గమనిం చిన హోంగార్డులు తాము కూడా కొంత సంపాదించుకోవాలని భావించారు. దీంతో లెసైన్స్‌ల కోసం ఆర్టీఏ కార్యాలయానికి వస్తున్న వాహనదారులతో ముందుగా నే మాట్లాడుకుని వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే తమ అక్రమదందాను గమనిస్తున్న అధికారులను మచ్చిక చేసుకు ని వారికి కూడా తమ సంపాదనలో కొంతవాటా ఇస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, లెసైన్స్‌లు ఇప్పిస్తున్న హోంగార్డుల నెల సంపాదన సుమారు రూ. 60 వేల పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీఏలో నాలుగేళ్ల నుం చి పనిచేస్తున్నప్పటికీ తమ విధులను మార్చకుండా ఆర్ఐ స్థాయి అధికారులను హోంగార్డులు మచ్చిక చేసుకుంటున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఏజెం ట్లను భయబ్రాంతులను గురిచేస్తూ తమ దందాకు అడ్డురాకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, హోంగార్డుల అక్రమ దందాకు సుమారు 100 మంది అనుచరులు పరోక్షంగా సహకరిస్తున్నట్లు సమాచారం. -
భద్రాచలం ఏజెన్సీలో మద్యం బంద్
భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీలో మద్యం బాబులకు నేటి నుంచి కష్టాలు వచ్చిపడినట్లే. అందుకు కారణం సోమవారం రాత్రి 11గం.లకు భద్రాచలం, వెంకటాపురం ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో గల మద్యం దుకాణాలకు ప్రస్తుత లెసైన్స్‌ల గడువు ముగిసింది. దీంతో మంగళవారం నుంచి ఈ దుకాణాలు తెరిచే పరిస్థితి లేదు. మద్యం దుకాణాల ఏర్పాటుకు ఆయా పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభల్లో ప్రజల నుంచి వ్యతిరేకత రాగా మరి కొని చోట్ల కోరం లేక సభలు వాయిదా పడ్డాయి. ఫలితంగా భద్రాచలం ఏజెన్సీలో మద్యం దుకాణాలకు తాళాలు పడనున్నాయి. భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 11, వెంకటాపురం పరిధిలో 5 దుకాణాలకు కొత్తగా గ్రామసభల ఆమోదం లభించే వరకూ తాళాలు వేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. బెల్టుషాపులకు మద్యం తరలింపు..? అధికారికంగా మద్యం దుకాణాలు మూతవేయాల్సి రావడంతో సిండికేట్‌గా ఏర్పడిన కొంతమంది మద్యం వ్యాపారులు మిగిలిన సరుకును గ్రామాల్లోని బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. భద్రాచలం పట్టణంలో ఉన్న ప్రతీ మద్యం దుకణానికి అనుబంధంగా గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం దుకాణాల కాలపరిమితి ముగియడంతో మిగిలిన మద్యాన్ని అక్కడికి తరలించి విక్రయించేందుకు సిండికేట్‌దారులు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. దీనికి అడ్డకట్ట వేసేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్థానిక మహిళా సంఘాల వారు కోరుతున్నారు. భద్రాద్రిలో బెడిసికొట్టిన వ్యూహం : భద్రాచలంలో ఉన్న తొమ్మిది మద్యం దుకాణాలకు ఇప్పటికే టెండర్లు పూర్తి కాగా, వీటిని లాటరీ ద్వారా కేటాయించడం కూడా పూర్తయింది. తొమ్మిది దుకాణాలు కూడా ఇతర మండలాలకు చెందిన గిరిజనులకే దక్కాయి. కానీ ఇప్పటి వరకు బినామీలుగా వ్యవహరించిన సిండికేట్ దారులు ఈ ఏడాది కూడా దుకాణాలు దక్కించుకున్న గిరిజనులకు భారీ నజరానా(గుడ్ విల్) ముట్టజెప్పి షాపులను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించి రెండు రోజుల క్రితం భద్రాచలం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో ఎలాగైనా ఆమోదింపజేసుకునేందుకు వ్యూహం పన్నారు. కానీ చివరకు వారి వ్యూహం బెడిసి కొట్టింది. డబ్బులు ఇచ్చి మరీ ప్రజలను గ్రామసభకు రప్పించారనే ఆరోపణలు వచ్చాయి. కానీ వచ్చిన వారిలో తగినంతమంది గిరిజనులు లేకపోవడంతో గిరిజన చట్టాల మేరకు గ్రామసభను రద్దు చేశారు. మరోమారు నిర్వహించే గ్రామసభలో వీటిని ఆమోదింపజేసుకునేందుకు భద్రాద్రి సిండికేట్ దారులు మళ్లీ పావులు కదుపుతున్నారు. ఆంధ్రాకు పరుగు తీయాల్సిందే... ఏజెన్సీలోని మద్యం ప్రియులు ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరుకు పరుగులు తీయాల్సిందే. అందుకు కారణం చింతూరు మండలంలో రెండు మద్యం దుకాణాలకు గ్రామసభ ఆమోదం లభించింది. దీంతో నూతనంగా దుకాణాలను లాటరీలో దక్కించుకున్న వారికి మంచి వ్యాపారమే సాగనుంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో దుకాణాల ఏర్పాటుకు గ్రామసభ ఆమోదం లేదు. అదే విధంగా చింతూరు మండలం మోతుగూడెంలో గ్రామసభకు కోరం లేక వాయిదా పడింది. దీంతో చింతూరు మండల కేంద్రంలో ఉన్న దుకాణంతో పాటు, ఇదే మండలంలోని ఎర్రంపేట దుకాణాల్లో మాత్రం అధికారికంగా మద్యం లభించనుంది. ఈ పరిణామాలు మద్యం ప్రియులకు కష్టాలు తెచ్చిపెట్టనుండగా, మహిళా సంఘాలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భద్రాచలం ఏజెన్సీలో పూర్తిగా మద్యం లేకుండా చేయాలని వారు కోరుతున్నారు. అదే విధంగా బెల్ట్ షాపులు కూడా లేకుండా ఎక్సైజ్ అధికారులు నిఘా ఏర్పాటు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
మద్యం..@ ఆదాయం
ఒంగోలు టౌన్ : జిల్లాలో ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది రూ.120 కోట్ల ఆదాయం సమకూరనుంది. శుక్రవారంతో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. శనివారం లాటరీ ద్వారా లెసైన్స్‌దారులను ఎంపిక చేశారు. లాటరీని స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 321 మద్యం షాపులున్నాయి. వాటిలో 276 షాపులకు మాత్రమే టెండర్లు వేశారు. మొత్తం మీద 2014-15 సంవత్సరానికిగాను ఎక్సైజ్ శాఖకు మొత్తం రూ. 120 కోట్ల మేర ఆదాయం రానుంది. 276 షాపులకు 6,194 టెండర్లు దాఖలయ్యాయి. టెండర్ ఫారాల ద్వారా 15.38 కోట్ల ఆదాయం వచ్చింది. 45 షాపులకు ఒక టెండర్ కూడా దాఖలు కాలేదు. చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం మద్యం దుకాణానికి జిల్లాలోనే అత్యధికంగా 300 టెండర్లు దాఖలయ్యాయి. మొత్తం 42 మద్యం షాపులకు సింగిల్ టెండర్లు మాత్రమే వచ్చాయి. మధ్యాహ్నం 3 గంటలకు లాటరీ విధానం ద్వారా మద్యం షాపులు కేటాయిస్తామని అధికారులు ప్రకటించినా టెండర్‌దారులకు టోకెన్లు ఇచ్చే ప్రక్రియ వద్ద ఇబ్బందులు తలెత్తడంతో 2 గంటలు ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. సాయంత్రం 4 గంటల నుంచి లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.దేవకుమార్, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్వీఎస్ ప్రసాద్, ఒంగోలు, మార్కాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఎం.భాస్కరరావు, ఆర్.కిషన్, ఏఈఎస్ చంద్రశేఖరరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ ఆనాల ఆవులయ్యతో పాటు జిల్లాలోని 14 సర్కిళ్ల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. ఆ మద్యం షాపు రూటే సప‘రేటు’ చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం మద్యం షాపునకు గుర్తింపు వచ్చింది. మద్యం షాపుల కేటాయింపులో భాగంగా వాటిని మూడు రకాలుగా విభజించారు. 5 వేల లోపు జనాభా ఉన్న మర్రిచెట్లపాలెం షాపునకు లెసైన్సు ఫీజు కింద ఏడాదికి రూ.32.50 లక్షలు కేటాయించారు. 300 మంది ఈ ఒక్క షాపుకే టెండర్లు వేయటంతో ఎక్సైజ్ శాఖకు రూ.75 లక్షల ఆదాయం సమకూరినట్లయింది. ఒక్కో టెండర్‌కు రూ.25 వేలు చొప్పున చెల్లించారు. లాటరీ పద్ధతి ద్వారా కలెక్టర్ సీలు తీసినప్పుడు ఆ 300 మందిలో నిప్పట్లపాడు గ్రామానికి చెందిన మువ్వా మాలకొండరాయుడును అదృష్టం వరించింది. -
‘ఎక్సైజ్’కు కాసుల పంట
- లెసైన్స్‌ల ద్వారా ఏడాదికి రూ.52.75 కోట్లు - దరఖాస్తుల అమ్మకాలపై రూ.9.52 కోట్లు - మద్యం విక్రయాలపై వెయ్యికోట్లకు పైగానే... ఖమ్మంక్రైం: ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండింది. జిల్లాలోని వైన్ షాపులను సోమవారం లాటరీ పద్ధతి ద్వారా కేటాయించారు. అటు దరఖాస్తుల అమ్మకం, ఇటు షాపుల కేటాయింపు ద్వారా ఎక్సైజ్ శాఖ భారీస్థాయిలో ఆర్జించింది. ఈనెల 15 నుంచి 21 వరకు జిల్లాలోని మద్యం షాపులకు దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో మొత్తం 147 షాపులు ఉండగా వీఎం బంజరలో రెండు, గుండాలలో ఒకటి, పెనగడపలో రెండు దుకాణాలకు మినహా 142 షాపులకు3,837 దరఖాస్తులు వచ్చాయి. వీటి చలానాల ద్వారా రూ.9,59,25 వేల ఆదాయం లభించింది. ఖమ్మంలోని న్యూబగ్గా వైన్‌షాపునకు, ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి వద్ద గల పల్లెగూడెం షాపునకు అత్యధికంగా 111 దరఖాస్తులు వచ్చాయి. కేవలం ఈ రెండు షాపుల దరఖాస్తుల అమ్మకం ద్వారానే రూ.55.50 లక్షల ఆదాయం సమకూరింది. ఖమ్మం నగరంలోని షాపులకు వ్యాపారులు ఎక్కువగా పోటీపడ్డారు. ఏజన్సీ ప్రాంతంలోని షాపులకంటే కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్న షాపులపైనే వ్యాపారులు దృష్టి కేంద్రీకరించారు. తొలివిడతలో 17 కోట్లు.. డ్రాలో గెలుపొందిన వ్యాపారి మొదటిసారిగా 33.33 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా తొలి విడతగా 142 మంది వ్యాపారులు చెల్లించిన మొత్తం రూ.17.03 కోట్లకు చేరింది. ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉన్న 18 షాపులకు రూ.42 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 10వేల నుంచి 50వేల వరకు జనాభా ఉన్న 32 షాపులకు రూ.34 లక్షలు, 10వేల లోపు జనాభా ఉన్న 24 షాపులకు రూ.32.50 లక్షలు, కొత్తగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 50 వేల నుంచి 3 లక్షల వరకు జనాభా ఉన్న 26 షాపులు రూ.42 లక్షలు, 10వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న 19 షాపులు రూ.34లక్షలు, 10వేల లోపు జనాభా ఉన్న 23 షాపులు రూ.32.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని మూడు షాపులకు, కొత్తగూడెం సూపరింటెండెంట్ పరిధిలోని రెండు షాపులకు దరఖాస్తులు రాలేదు. మిగితా దరఖాస్తుల చలానాల ద్వారా రూ.9,59,25 వేలు, లెసైన్స్ ఫీజుల ద్వారా రూ.17.03 కోట్లు.. మొత్తం రూ.26,63,25 వేల ఆదాయం ఆబ్కారీ శాఖకు లభించింది. 147 షాపులకు రూ.52.75 కోట్ల ఆదాయం... ప్రతి నాలుగు నెలలకు ఒకసారి షాపులో 1/3 వంతు లెసైన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీటి ద్వారా సంవత్సరం మొత్తంలో 147 షాపుల ద్వారా రూ.52.75 కోట్ల ఆదాయం ఆబ్కారీ శాఖకు లభించనుంది. ఇప్పటికే మొదటి విడత ఆదాయం రూ.17.03 కోట్లు వచ్చింది. మరో రూ.35.72 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. కాగా, పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడంతో ఆ మండలాల్లో ఉన్న తొమ్మిది షాపులు ఆ రాష్ట్రానికి వెళ్లిపోయాయి. వీటి స్థానంలో జిల్లాలో మరో తొమ్మిది కొత్త షాపులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో మొత్తం షాపుల సంఖ్య 156కు చేరుతుంది. ఈ అన్ని షాపులలో మద్యం విక్రయాల ద్వారా జిల్లా ఎక్సైజ్ శాఖకు ఏడాదికి సుమారు వెయ్యికోట్లకు పైగానే ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. -
జీఎంఆర్‌కు ఈఆర్సీ షాక్!
సాక్షి, హైదరాబాద్: జీఎంఆర్‌కు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు విద్యుత్ పంపిణీ లెసైన్సు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ మేరకు ఈఆర్సీ చైర్మన్ భాస్కర్, సభ్యులు రాజగోపాల్‌రెడ్డి, అశోకాచారిలు శనివారం ఆదేశాలు జారీ చేశారు. విమానాశ్రయంలోని సెజ్ ప్రాంతానికి ప్రైవేటుగా విద్యుత్‌ను పంపిణీ చేసుకుంటామని, ఇందుకోసం లెసైన్సు ఇవ్వాలని ఈఆర్సీని జీఎంఆర్ కోరింది. అయితే ప్రైవేట్ విద్యుత్ పంపిణీ లెసైన్సు ఇవ్వాలంటే విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 14లో కొన్ని నిబంధనలున్నాయని.. ఈ నిబంధనలకు అనుగుణంగా జీఎంఆర్ సంస్థ లేదని డిస్కంలు వాదించాయి. ఈ వాదనతో ఈఆర్సీ ఏకీభవించింది. సెక్షన్ 14 ప్రకారం ఏ కంపెనీకైనా విద్యుత్ పంపిణీ లెసైన్స్ ఇవ్వాలంటే.. విద్యుత్ పంపిణీ చేసే ప్రాంత కనీస పరిధి మునిసిపల్ కార్పొరేషన్ లేదా మునిసిపాలిటీ లేదా రెవెన్యూ జిల్లా (ఆపరేషన్ సర్కిల్) అయి ఉండాలి. అలాగైతేనే విద్యుత్ పంపిణీ లెసైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం ఒక ప్రాంతానికి లేదా ఒక కంపెనీకి ఇవ్వకూడదని ఈ సెక్షన్లో స్పష్టంగా ఉంది. ఇందుకు పూర్తి భిన్నంగా కేవలం ఎయిర్‌పోర్టు ప్రాంతానికి మాత్రమే విద్యుత్ పంపిణీ లెసైన్సు ఇవ్వాలని జీఎంఆర్ కోరింది. -
నకిలీ.. మకిలీ
సాక్షి, కర్నూలు: రవాణా శాఖ గాడితప్పింది. నకిలీ పత్రాలతో పరువు బజారున పడుతోంది. లెసైన్స్‌లు.. ఫిట్నెస్ సర్టిఫికెట్లు.. ఇతరత్రా సేవలకు వసూళ్లు సరేసరి. ఇప్పుడు ఆర్టీఏ ఏజెంట్లు సరికొత్త దందాకు తెరతీశారు. ఇన్సూరెన్స్ పత్రాల ఫోర్జరీ వ్యవహారం ఆ శాఖను కుదిపేస్తోంది. ఇరువురు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ముఖ్య సూత్రధారులుగా సాగుతున్న బాగోతానికి జిల్లా రవాణా శాఖ ఉద్యోగులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుండటం గమనార్హం. ఆరు రోజుల క్రితం కర్నూలు నగరంలో వీరి గుట్టు రట్టయింది. స్థానిక ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుడు మహమ్మద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంటు. ఇతను నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలతో వాహనాలు రిజిస్ట్రేషన్ చేయిస్తూ 15 రోజుల క్రితం రవాణా శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఇతన్ని విచారించగా మరికొందరి ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. డీటీసీ శివరాంప్రసాద్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు రంగంలో దిగారు. ఈ నెల 7న ఆర్టీఏ ఏజెంట్లుగా పనిచేస్తున్న నరేష్, రమేష్ శెట్టి, జాకీర్ హుస్సేన్ కార్యాలయాలపై దాడులు చేసి పలు ఫైళ్లను తీసుకెళ్లడం తెలిసిందే. ఆ తర్వాత సీసీఎస్ పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టగా.. నగరంలోనే ఉంటున్న మరో ఆటో యూనియన్ నేతకూ ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన ఇంటిపై దాడి చేసి పలు నకిలీ ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అతనిని ద్వారా కోడుమూరు కేంద్రంగా నడుస్తున్న నకిలీ ఇన్సురెన్స్ పత్రాల బాగోతం బట్టబయలవుతోంది. నిబంధనలేంటి.. ఏం జరుగుతోంది జిల్లాలో 23,966 ఆటోలు ఉండగా.. కర్నూలు నగరంలోనే 16వేలకు పైగా ఉన్నాయి. వీటికి ప్రతిఏటా ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కండీషన్‌తో పాటు ఇన్సురెన్స్ ధ్రువపత్రం తప్పనిసరి. వీటి ఆధారంగా రవాణా శాఖ వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తోంది. ఇన్సూరెన్స్ పత్రాల కోసం ఆయా కంపెనీలకు ఆటో యజమానులు రూ.2,500 నుంచి రూ.3,500 చెల్లించాల్సి ఉంది. ఇదంతా ఎందుకని భావించిన రవాణా శాఖ ఏజెంట్లు కొందరు ఆటో యూనియన్ నేతలతో కలిసి నకిలీ ధ్రువపత్రాల కుంభకోణానికి తెరతీశారు. కోడుమూరు కేంద్రంగా ఓ ముఠా వీటిని సృష్టిస్తూ నగరంలోని కొందరు ఆర్టీఏ, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుల ద్వారా చెలామణి చేస్తోంది. ఒక్కో పత్రానికి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. కొంతకాలంగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం తాజా ఘటనతో వెలుగుచూసింది. త్వరలోనే ఈ రాకెట్‌కు సంబంధం ఉన్న వారందరినీ ఆరెస్టు చూపే అవకాశం ఉంది. 50 శాతం ఇన్సూరెన్స్ పత్రాలు నకిలీవే గత ఏడాది ఆర్టీఏ కార్యాలయంలో 7,500 ఆటోలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేశారు. జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు ఆయా ఆటోల యజమానులు సమర్పించిన ఇన్సూరెన్స్ పత్రాలు నకిలీవా? అసలైనవా? అనే విషయమై విచారణ కొనసాగుతోంది. ఈ విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీల సహకారం తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే 50 శాతం ఇన్సూరెన్స్ పత్రాలు నకిలీవని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఒక్కో ధ్రువపత్రాన్ని రూ.1000 చొప్పున విక్రయించినట్లయితే అక్రమార్కులు రూ.35 లక్షలకు పైగా ఆర్జించినట్లు లెక్కకడుతున్నారు. ఈవిధంగా కంపెనీలు రూ.70 లక్షలకు పైగా నష్టపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.