రాయ్‌పూర్: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కాంగ్రెస్, ఇండియా కూటమిలు కోపంతో ఉన్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. బస్తర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 500 ఏళ్ల కల నెరవేరి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తయినందుకు రాముని మాతృమూర్తి పుట్టినల్లు అయిన ఛత్తీస్‌గఢ్ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
అయితే రాముని గుడి విషయంలో కాంగ్రెస్ ఇండియా కూటమి మాత్రం కోపంగా ఉన్నాయని సెటైర్లు వేశారు. రాముని ప్రాణ ప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ తిరస్కరించిందని ఎద్దేవా చేశారు. ఆహ్వానం తిరస్కరించడం తప్పని మాట్లాడిన నేతలను ఆ ఫ్యామిలీ పార్టీ నుంచి బయటికి పంపించిందన్నారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని దోచుకునేందుకు తమకు లైసెన్స్ ఉందని కాంగ్రెస్ భావించిందని, అయితే 2014లో మోదీ ప్రభుత్వం వచ్చి ఆ లూఠీ లైసెన్స్‌ను రద్దు చేసిందన్నారు. ప్రజలు మోదీకి లైసెన్స్ ఇవ్వడం వల్లే కాంగ్రెస్ దోపిడీ లైసెన్స్‌ను మోదీ రద్దు చేయగలిగాడని చెప్పారు. గిరిజనులను కాంగ్రెస్ ఎప్పుడూ అవమానించిందని, బీజేపీ మాత్రం గిరిజన మహిళన రాష్ట్రపతిని చేసిందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి.. ప్రధానిపై పోటీ.. ఈ ట్రాన్స్‌జెండర్ గురించి తెలుసా
Comments
Please login to add a commentAdd a comment