వికారాబాద్ ఆర్టీఏ కార్యాలయం
వికారాబాద్: మూడేళ్ల ముందునుంచే జిల్లాలో ఆర్టీఏ వ్యవస్థ గాడి తప్పింది. ఈ క్రమంలో అనేక ఆరోపణలను మూటగట్టుకున్న విషయం తెలిసిందే. పైగా అవినీతికి అడ్డాగా మారింది. ఉద్యోగులపై అజమాయిషీ లేకుండాపోయింది. వాహనదారులు విసిగి వేసారి పోయారు. ఇదిలా ఉంటే అధికారి ఓ కేసులో ఇరుక్కుని జైలుపాలైన విషయం తెలిసిందే. ఆయన జైలుకు వెళ్లిన నెల రోజులకు ఇన్‌చార్జి డీటీఓను నియమించగా ఏడాదిగా ఆయన్నే కొనసాగిస్తూ పూర్తి స్థాయి అధికారిని నయమించడంలో ఈ శాఖ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తూ వస్తున్నారు. మరో పక్క డీటీఓ కార్యాలయానికి సొంత భవనం లేక.. టెస్టింగ్ ట్రాక్‌లేక ఇబ్బందులు తప్పడంలేదు. ఎలాంటి శాసీ్త్రయ పద్ధతులు పాటించకుండానే లైసెన్సులు అందజేయడం విమర్శలకు తావిస్తోంది.
ఇన్‌చార్జిని అప్పగించి..
ఏడాది క్రితం వరకు వికారాబాద్ డీటీఓగా బాధ్యతలు నిర్వహించి సొంత అన్నను హత్యచేసేందుకు సుపారి ఇచ్చిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం ఆర్టీఏ ఉన్నతాఽధికారులు ఎట్టకేలకు సూర్యాపేట డీటీఓ వెంకట్‌రెడ్డికి వికారాబాద్ డీటీఓగా అదనపు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకొన్నారు. దీంతో ఆయన సూర్యాపేట నుంచి రావాల్సి వస్తుండటంతో వారానికి ఒకటి రెండు రోజులు చుట్టపుచూపుగా వికారాబాద్‌కు వచ్చి వెళుతున్నారు. అయితే అస్తవ్యపస్తంగా తయారైన జిల్లా అర్టీఏను గాడిలో పెట్టాల్సిన సమయంలో ఇలా ఇన్‌చార్జి డీటీఓను నియమించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తిస్థాయి అధికారి అవసరం
అస్తవ్యస్తంగా తయారైన వికారాబాద్ ఆర్టీఏను పూర్తిగా గాడిలో పెట్టాలంటే ఫుల్‌టైమ్ డీటీఓను నియమించి చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సూర్యాపేట డీటీఓగా ఉంటూ వికారాబాద్ ఇన్‌చార్జి డీటీఓగా కొనసాగుతున్న వెంకట్‌రెడ్డినే ఫుల్‌టైమ్ డీటీఓగా బాధ్యతలు అప్పగించడం, లేదంటే ఫుల్‌టైమ్ డీటీఓగా మరొకరిని నియమించాలనే అభిప్రాయం ఆ శాఖ ఉద్యోగులతో పాటు ఆయా వర్గాల్లో వ్యక్తం అవుతుంది. లేదంటే పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. ఏడాది కాలంగా రోడ్డు రవాణా శాఖకు పూర్తి స్థాయి జిల్లా అధికారి లేకపోవటంతో కింది స్థాయి ఉద్యోగులకు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా పరిస్థితి తయారయ్యింది. వాహనదారులు సైతం ఓవర్‌లోడ్‌తో అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు.
జిల్లాలో ఆర్టీఏ (రోడ్డు ట్రాన్స్ పోర్ట్ అథారిటీ) వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మూడేళ్లుగా గాడిన పడటంలేదు. ఏడాది క్రితం వికారాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో డీటీఓగా బాధ్యతలు నిర్వహించిన అధికారి జైలుపాలవగా అప్పటి నుంచి పూర్తి స్థాయి అధికారే లేరు. దీంతో అటు కింది స్థాయి సిబ్బందిలో జవాబుదారీతనం కరువైంది. ఇష్టారాజ్యంగా వసూళ్లపర్వం కొనసాగుతోంది. మరోవైపువాహనదారులు ఓవర్‌లోడ్‌తో అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment