ప్రధాన వార్తలు

అక్రమ మద్యం కేసు.. ‘సిట్’ మరో కొత్త నాటకం
సాక్షి, హైదరాబాద్: అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి సిట్ తెరతీసింది. సోదాల పేరుతో హడావుడి సృష్టించేందుకు సిట్ ప్రయత్నించింది. హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో మరోసారి సోదాల పేరుతో సిట్ అధికారులు హల్చల్ చేశారు. గతంలోనే బాలాజీ గోవిందప్ప ఇంటిలో సిట్ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు.మే 13న బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసింది. 74 రోజులుగా ఆయన రిమాండ్‌లో ఉన్నారు. బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు సిట్ పెట్టలేకపోయింది. ఏసీబీలో కోర్టులో బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌పై ఈనెల 29న కోర్టు విచారణ చేపట్టనుంది.బాలజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకునేందుకు సోదాల పేరుతో సిట్ అధికారులు మరో కొత్త నాటకానికి తెరలేపారు. కొత్తగా ఆధారాలు దొరికాయంటూ చెప్పేందుకే ఈ నాటకం చేస్తున్నారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బాలాజీ గోవిందప్ప.. ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ వికాట్ ఇంటర్నేషనల్‌లో ఫుల్‌టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వికాట్ గ్రూప్‌కు సంబంధించిన కార్యాలయంలో కూడా సిట్ అధికారులు సోదాలు చేపట్టారు.

మరింతగా దిగజారిన ఏపీ ఆర్థిక స్థితి.. వైఎస్ జగన్ ఆందోళన
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా పేర్కొన్నారాయన. కాగ్ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్ ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఆ నివేదికలో.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు (పన్నులు, పన్నేతర ఆదాయాలు) అత్యంత మందగమనం చూపించాయని అన్నారాయన. జీఎస్టీ, సేల్స్ టాక్స్ ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆదాయాలు లేకపోగా శరవేగంగా అప్పులు పెరుగుతున్నాయ్‌ప్రభుత్వ విధానాలతో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందిమొదటి త్రైమాసికంలో రాష్ట్రంపై ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందిఏపీలో ఆర్థిక స్థిరత్వం, నిర్వహణ సరిగా లేనేలేదువిభజనతో మొదలైన సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందిఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందిఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందిపన్ను ఆదాయం, పన్నేతర ఆదాయాలు పేలవంగా ఉన్నాయిగతేడాది త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది.. జీఎస్టీ ఆదాయాలు, అమ్మకపు పన్ను ఆదాయాలు తక్కువగా ఉన్నాయికొన్ని శాఖల్లో అత్యంత అధ్వాన్నమైన వృద్ధిరేటు ఉందిరాష్ట్ర సొంత ఆదాయాలు కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయికేంద్రం నుంచి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు 6.14 శాతం మాత్రమే పెరిగిందిఅప్పులు మాత్రం మూడు నెలల్లో ఏకంగా.. 15.61శాతం వేగంతో పెరిగాయిఇది ఏపీపై ఆర్థిక ఒత్తిడికి సంకేతం అని జగన్ అన్నారు. అలాగే.. చంద్రబాబు ప్రభుత్వం ఖర్చులు, సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడుతున్నాయని, ఇది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారిందని జగన్ అభిప్రాయపడ్డారు.Fiscal stress worsens in the first quarter of this financial yearThe CAG uploaded the Monthly Key Indicators for the first quarter of this financial year and these figures very clearly suggest a precarious outlook for the financial stability of the State Government, Public… pic.twitter.com/0tYnKfNSQi— YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2025వైఎస్సార్సీపీ హయాంలో అప్పులపై చంద్రబాబు చేసిన తప్పుడు లెక్కల ప్రచారం(రూ.14 లక్షల కోట్లంటూ..) గురించి తెలిసిందే. అంతేకాదు.. ఆ సమయంలో ఏపీ మరో శ్రీలంక అయిపోతోందంటూ గగ్గోలు పెట్టారాయన. అయితే మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమేనని కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇంకోవైపు.. ప్రతీ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసుకున్న చంద్రబాబు, కేవలం 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేయడం విశేషం.

బాబుకు టెన్షన్!.. అమరావతి పుంజుకునేది ఇంకెన్నడు?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కోసం రైతులకు ఇస్తున్న ప్యాకేజీ బాగుందా? లేక పంజాబ్‌లో ఇటీవల ప్రకటించింది మెరుగ్గా ఉందా?. అమరావతి రైతులు ఈ విషయంపై కొంత విశ్లేషణ చేసుకోవడం మేలు. పంజాబ్ ప్రభుత్వం గృహ నిర్మాణం, పారిశ్రామిక రంగం కోసం ఇటీవలే 21 ప్రాంతాల్లో సుమారు 65 వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైంది. పరిహారం కోసం ముందుగా ఒక ప్యాకేజీ ప్రకటించింది కానీ విపక్షాలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సవరించాల్సి వచ్చింది.కొత్త ప్యాకేజీతో పూర్తిగా సంతృప్తి చెందకపోయినా కొన్నిచోట్ల మాత్రం రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు పంజాబ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. వాణిజ్య అవసరాల కోసం ఇస్తే ఎకరా భూమికి 800 గజాల ప్లాట్ కేటాయించారు. పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తే వెయ్యి గజాల పారిశ్రామిక ఫ్లాట్, 300 గజాల నివాస ప్రాంతం, వంద గజాల వాణిజ్య ప్లాట్ ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎకరాకు రూ.30 వేల కౌలు ముందు ప్రకటించారు. వ్యతిరేకతతో దీన్ని రూ.50 వేలకు పెంచారు. సేకరించిన భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత రైతులకు ఎకరాకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. భూమి అభివృద్దిలో ఆలస్యం జరిగితే కౌలు మొత్తాన్ని ఏడాదికి పది శాతం చొప్పున పెంచుతారు. సేకరించిన భూమి సెంట్లలో మాత్రమే ఉన్నా వారికి కూడా వాణిజ్య ప్లాట్లు ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు.అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీని పంజాబ్‌తో పోల్చి చూస్తే ఎన్నో లోటుపాట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత కౌలు మొత్తం రూ.లక్ష చెల్లించే అంశం ఉన్నట్లు లేదు. ప్రభుత్వం ఆ స్థలంలో అభివృద్ధి చేపట్టేలోగా క్రయ విక్రయాలు జరుపుకోవచ్చని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆ భూములలో పట్టణాభివృద్ధి పనులు ఆరంభం అయ్యే వరకు రైతులు వ్యవసాయం కొనసాగించుకోవచ్చు. ఏపీలో అసలు అభివృద్ది పనులు ఆరంభం కాకముందే వేల ఎకరాలలో గట్లను తొలగించి, రైతులు పంటలు వేసుకునే అవకాశం లేకుండా చేశారు. దాంతో అవి పిచ్చి చెట్లతో నిండిపోయాయి. ఇప్పుడు ఆ కంప కొట్టడానికి ఏపీ ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తోంది.మరోవైపు రైతులు స్వచ్చందంగా ఇస్తేనే భూమి తీసుకుంటామని, బలవంతంగా సమీకరించబోమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చెప్పడం విశేషం. అయినప్పటికీ అక్కడి విపక్షం రైతుల భూములు దోచుకుంటున్నారని, ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం ఈ స్కీమును ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించాయి. ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఇస్తామని చేసిన హామీ మాటేమిటని ప్రశ్నించాయి. విపక్షాల ప్రచారాన్ని భగవంత్ సింగ్ మాన్ కొట్టిపారేసి, రైతులకు మేలైన ప్యాకేజీ ప్రకటించామని చెబుతున్నారు. ఈ రకంగా ఆలోచిస్తే ఏపీలో ఇప్పటికే 13 నెలల్లోనే సుమారు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని తరచూ ప్రకటిస్తోంది. సూపర్ సిక్స్‌లో ఒకటి అర హామీలు మాత్రమే అమలు చేసింది. అమలు చేయని వాటిలో ఆడబిడ్డ నిధి కూడా ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి సేకరణకు సిద్ధమైంది. ఈ విషయంలో ఇక వెనక్కు తగ్గేదే లేదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.పోలీసులు, మీడియాను అడ్డం పెట్టుకుని, అమరావతి సెంటిమెంట్‌ను ప్రయోగించి విపక్ష గొంతు నొక్కి అయినా తాను అనుకున్న విధంగా లక్ష ఎకరాల భూమిని తన అధీనంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర సఫలమవుతాయన్నది చర్చనీయాంశంగా ఉంది. పంజాబ్ రైతుల మాదిరి మరింత గట్టిగా నిలబడితే అమరావతి ప్రాంత రైతులకు కాని, కొత్తగా భూములు తీసుకోబోతున్న గ్రామాల రైతులకు కానీ ప్రయోజనం ఉండవచ్చు. ప్రభుత్వం సకాలంలో భూమిని అభివృద్ధి చేసి వారికి ప్లాట్లు ఇస్తే, వాటికి మంచి ధర పలికితేనే రైతులకు, లేదా భూమి సొంతదారులకు ఉపయోగం ఉండవచ్చు. కానీ, ఏపీలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో లేకపోవడం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వం సృష్టించిన విపరీతమైన హైప్ వల్ల భూముల రేట్లు భారీగా పెరిగాయి. కానీ ఆచరణలో ప్రభుత్వం భూమిని అభివృద్ది చేయలేకపోవడం, ఓవరాల్‌గా ఆర్థిక వ్యవస్థ దేశవ్యాప్తంగా కొంత మందగించడం మొదలైన కారణాలు రియల్ ఎస్టేట్‌ను ప్రభావితం చేశాయి. దాంతో అమరావతి గ్రామాలలో కొనుగోలు, అమ్మకపు లావాదేవీలు తగ్గుముఖం పట్టాయన్న అభిప్రాయం ఉంది. ధరలు కూడా గతంలో ఉన్న స్థాయిలో లేవని చెబుతున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీడియా బలంతో ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకుని ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పిస్తుంటారు. కొన్నిసార్లు ఆ వ్యూహం సక్సెస్ అయినా, ఎక్కువ సార్లు విఫలమవుతుంటుంది. అప్పుడు దానిని వదలిపెట్టి కొత్తదేదో చేపడుతుంటారు. అమరావతి రాజధాని విషయంలో కూడా అలాగే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. తొలుత అమరావతి రాజధాని నిర్ణయాన్ని రకరకాలుగా ప్రచారం చేయడంతో కొన్ని ప్రాంతాల వారు ముఖ్యంగా నూజివీడు పరిసర ప్రాంతాలలో భూములు కొన్నవారు అప్పట్లో తీవ్రంగా నష్టపోయారు. కానీ, అంతర్గత సమాచారం ఆధారంగా ప్రస్తుతం రాజధానిగా పరిగణిస్తున్న గ్రామాలలో టీడీపీ నేతలు పలువురు భూములు కొని లాభపడ్డారని చెబుతారు. కానీ, అది కూడా తాత్కాలికమే అయింది. రైతుల వద్ద కాస్త అధిక ధరకు కొనుగోలు చేసి, అంతకన్నా ఎక్కువకు అమ్ముకున్న వారు లాభపడ్డారు. కానీ, ఇంకా బాగా లాభాలు వస్తాయన్న భావనతో ఉన్నవారు మాత్రం కొంతమేర నష్టాల పాలయ్యారు.2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూముల ధరలు పెరుగుతాయని టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. ఎన్నికలలో కూడా ఆ పాయింట్ ఆధారంగా లబ్ది పొందే యత్నం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. భూముల రేట్లు కృత్రిమంగా పెంచడం కోసం టీడీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా జనం పెద్దగా విశ్వసిస్తున్నట్లు కనబడడం లేదు. దానికి తోడు ప్రభుత్వం మరో 44వేల ఎకరాల భూమి సేకరించబోతుందన్న ప్రకటన రావడంతో మొత్తం అప్సెట్ అయ్యారు. ప్రభుత్వం ముందు రైతుల నుంచి తీసుకున్న 33 వేల ఎకరాలతోపాటు, ప్రభుత్వ భూములు 20 వేల ఎకరాలు అభివృద్ది చేసిన తర్వాత తమ భూములు తీసుకోవాలి కాని, అదేమీ చేయకుండా భూ సమీకరణకు వస్తే అంగీకరించబోమని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు.రైతు నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి వారు సైతం చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపడుతూ రైతులు భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. గతంలో తీసుకున్న భూములకు రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లు కాగితాల మీదే ఉన్నాయి తప్ప ఎవరికి అందలేదు. ఎకరాకు 1200 గజాలు ఇస్తామని ప్రభుత్వం తెలిపే డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదట. నెల రోజుల నుంచి రియల్ ఎస్టేట్ రంగం మరీ కుదేలైందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం తెలిపిన దాని ప్రకారం రైతులకు ఇచ్చిన ప్లాట్లను అన్ని సదుపాయాలతో అభివృద్ది చేయాలి. ఆ పని ఇంతవరకు మొదలే కాలేదు. రైతులు ఎక్కడ భూమి ఇస్తారో, అక్కడే ప్లాట్లు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఆ పని చేయకుండా ఒక గ్రామంలో ఒక సంస్థకు భూమి కేటాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థ అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడానికి వీలు లేకుండా రైతులు అడ్డుకున్నారట.మరోవైపు చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమం పెట్టి క్వాంటమ్ వ్యాలీ అని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అని, ఆదాని క్రీడా నగరమని, ఔటర్ రింగ్ రోడ్డు, ఆ రోడ్డు చుట్టూ హైటెక్ సిటీ అని విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఆ వార్తలను పతాక శీర్షికలుగా వండి వారుస్తోంది. ఇదంతా ఎప్పటికి అవుతుందో తెలియని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ.31 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం టెండర్లు మాత్రం రూ.ఏభై వేల కోట్లకు పైగానే పిలిచిందట. ఈ నిర్మాణాలన్నీ పూర్తి కావడానికి మూడు, నాలుగేళ్లు పట్టవచ్చని ప్రభుత్వమే చెబుతోంది. ప్రభుత్వ భవనాల నిర్మాణం వల్ల రియల్ ఎస్టేట్ ఎంతమేర పుంజుకుంటుందో చెప్పలేం. వ్యాపార, పారిశ్రామిక రంగంలో కొత్త సంస్థలు వస్తే కొంత అభివృద్ది ఉండవచ్చు. కాని ప్రస్తుత పరిస్థితి అంత అనువుగా లేదు.ఎంతో అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరంలోనే రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన రీతిలో సాగడం లేదన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఇంకో మాట చెప్పాలి. విశాఖ వంటి నగరంలో పెద్ద కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం అమరావతిలో మాత్రం కొన్ని సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లకు చెల్లించాలని అంటోంది. ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో ఎకరా ఇరవై కోట్లకు పైగానే అమ్ముడు పోతుందని తెలిపారట. భూముల అమ్మకం ద్వారా అప్పులు తీర్చుతామని చెబితే అదెప్పుడు ఆరంభం అవుతుందని ప్రపంచ బ్యాంక్ అడిగితే ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు మల్లగుల్లాలు పడుతోంది.అమరావతి ద్వారా సంపద సృష్టి ఎప్పటి నుంచి మొదలు అవుతుందని ఒక విలేకరి చంద్రబాబును అడిగితే అది నిరంతర ప్రక్రియ అని, మూడేళ్లలో సెట్ అవుతుందని, ఆ తర్వాత దాని ప్రభావం ఉంటుందని జవాబు ఇచ్చారు. ఒకప్పుడు ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ నగరం అని చంద్రబాబు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు వేల కోట్ల అప్పులు చేయాల్సి వస్తోంది. అయినా రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వం కోరుకున్న రీతిలో సాగడం లేదు. ఈ వ్యాపారం సంగతి ఎలా ఉన్నా, ప్రభుత్వం రైతులకు మేలు చేయదలిస్తే పంజాబ్‌లో మాదిరి ప్యాకేజీని, ప్రత్యేకించి కౌలు మొత్తాన్ని పెంచితే కొంతవరకు మంచిదేమో ఆలోచించాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

చరిత్ర సృష్టించిన స్టోక్స్!.. ఇంగ్లండ్ ఆలౌట్.. స్కోరెంతంటే!
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు శతకం సాధించిన సారథుల సరసన చేరాడు. ఇంగ్లండ్ తరఫున ఈ ఫీట్ నమోదు చేసిన తొలి కెప్టెన్‌గానూ చరిత్రకెక్కాడు.ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య నాలుగో టెస్టులో స్టోక్స్.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చాడు. సాయి సుదర్శన్ (61), శుబ్‌మన్ గిల్ (12)ల రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చిన స్టోక్స్.. శార్దూల్ ఠాకూర్ (41), వాషింగ్టన్ సుందర్ (27), అన్షుల్ కంబోజ్ (0) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.141 పరుగులుఅనంతరం బ్యాటింగ్‌లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఇరగదీశాడు. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా స్టోక్స్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ బాది వంద పరుగుల మార్కు దాటాడు. మొత్తంగా 198 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్.. 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 141 పరుగులు సాధించాడు. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు క్యాచ్ ఇవ్వడంతో స్టోక్స్ శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేసిన కెప్టెన్లు వీరే🏏డెనిస్ అట్కిన్సన్ (వెస్టిండీస్)- 1955లో ఆస్ట్రేలియా మీద🏏గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)- 1966లో ఇంగ్లండ్ మీద🏏ముష్తాక్ మొహమ్మద్ (పాకిస్తాన్)- 1977లో వెస్టిండీస్ మీద🏏ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్)- 1983లో టీమిండియా మీద🏏బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)- 2025లో టీమిండియా మీదఇంగ్లండ్ ఆలౌట్.. స్కోరెంతంటే?ఇదిలా ఉంటే.. 544/7 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్ కాసేపటికే లియామ్ డాసన్ (26) వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అతడు బౌల్డ్ అయ్యాడు. స్టోక్స్ వికెట్‌ను జడేజా దక్కించుకున్నాడు. అదే విధంగా.. బ్రైడన్ కార్స్ (47)ను వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్ 157.1 ఓవర్లలో 669 పరుగులు స్కోరు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 311 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.భారత బౌలర్లలో జడ్డూ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్, బుమ్రా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్𝘾𝙖𝙡𝙢, 𝘾𝙤𝙤𝙡, 𝘾𝙚𝙣𝙩𝙪𝙧𝙞𝙤𝙣 🔥#BenStokes shows great composure, calmly facing 6 dot balls on 99 before finally reaching a well-earned century with a confident shot 🙌#ENGvIND 👉 4th TEST, DAY 4 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/xkvCs073fI pic.twitter.com/TzhM6CBR6L— Star Sports (@StarSportsIndia) July 26, 2025

ఆ దేవుడు నన్నైనా తీసుకు పోవాల్సింది: ఓ తల్లి కన్నీటి రోదన
రాజస్తాన్ ఝలవార్ జిల్లా ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో ఏడుగురు పిల్లలు మృత్యవాత పడగా, 25 మంది వరకూ గాయపడ్డారు. శుక్రవారం(జూలై 25) ఉదయం 8.30గం.ప్రాంతంలో మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనంలోని ఓ తరగతి పైకప్పు కుప్పకూలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులు అప్పుడే క్లాస్ రూమ్‌కు వచ్చి కూర్చున్న సమయంలో జరగడంతో స్కూల్‌కు ఆలస్యంగా వెళ్లినా ఇంత దారుణం జరిగేది కాదని, బాధిత తల్లి దండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నన్ను తీసుకుపోయినా బాగుండు..తనకు తోడుగా ఉన్న ఇద్దరు పిల్లలు ఆ స్కూల్ పై కప్పు కుప్పకూలిన ఘటనలో మృత్యువాత పడటంతో ఓ తల్లి రోదిస్తున్న తీరు హృదయాల్ని కలిచి వేస్తోంది. ఆ దేవుడు ఇంత పని చేస్తాడనుకోలేదని తనను ఒంటరిని చేసి పిల్లల్ని తీసుకుపోయాడని కన్నీటి పర్యంతమవుతోంది. ‘ ఆ దేవుడు నా పిల్లలకి జీవితాన్నిచ్చి, నన్ను తీసుకుపోయినా బాగుండు. వాళ్లు లేకుండా నేను ఏం చేసేది. పిల్లలు ఇక తిరిగి రారని తెలిసి నా ఇళ్లు ఒంటరిదైంది. పిల్లలు ఆడుకునే ఆట స్థలం వారి కోసం ఎదురుచూస్తోంది. వారితో ఆటలు ఆడుకునే నేను ఇక ఎవ్వరితో ఆడుకోవాలి. నా కూతురు, నా తనయుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. ఇక నాకు ఈ జీవితం ఎందుకు?’ అంటూ ఆమె బోరున విలపిస్తోంది. స్కూల్ టీచర్లు బయట ఏం చేస్తున్నారు?స్కూల్ పైకప్పు కూలిన ఘటనలో మృతి చెందింది అంతా చిన్నారులే. ఈ ఘటనలో ఏ టీచర్‌కు ఏమీ కాలేదు. ఇప్పుడు ఇదే అంశాన్ని లేవనెత్తింది ఇద్దరి పిల్లల్ని కోల్పోయిన తల్లి. ఆ సమయంలో స్కూల్‌కు ఎవరైతే టీచర్లు వచ్చారో వారంతా బయటే ఉండటంతో బ్రతికి పోయారని, పిల్లల్ని లోపలికి పంపి బయట టీచర్లు ఏం చేస్తున్నారని ఆ తల్లి ప్రశ్నిస్తోంది. స్కూల్లో పిల్లల సంరక్షణ చూసుకోవాల్సిన టీచర్లు.. తమ పిల్లల్ని మాత్రం వారు పొట్టనపెట్టుకున్నారని చెదిరిన హృదయంతో విలపిస్తోంది. 2 ఏళ్ల మీనా, 6 ఏళ్ల కన్హాలను కోల్పోవడంతో ఆ తల్లి బాధ వర్ణనాతీతంగా మారింది. ఇక ప్రభుత్వాలు ఎందుకు?స్కూల్ పైకప్పు కూలిన ఘటనలో అది ప్రభుత్వ పాఠశాల కావడం మరో చర్చకు దారి తీసింది. స్కూల్ పైకప్పుకు మరమ్మత్తులు చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది,. ప్రభుత్వాలు ఉన్నా కనీసం స్కూళ్లను కూడా బాగు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ స్కూల్ మరమ్మత్తులు కోసం చిన్నారులే స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదని సమాచారం. చిన్నబోయిన గ్రామం..ఆ ఘటనలో మృతి చెందిన చిన్నారుల్లో 12 ఏళ్ల చిన్నారులు ఐదుగురు ఉన్నారు. పాయల్, ప్రియాంక, కార్తీక్, మీనా, కుందన్లు 12 ఏళ్ల వయసు గల పిల్లలు కాగా, ఎనిమిదేళ్ల హరీష్, ఆరేళ్ల కన్హాలు ఉన్నారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో కన్హానే అత్యంత పిన్నవయసు గల చిన్నారి. చిన్నారుల మృత్యువాతతో మనోహర్ థానాలోని పిప్లోడి గ్రామం చిన్నబోయింది. ఎక్కడ చూసినా విషాద చాయలే కనిపిస్తున్నాయి. ఎంతో సరదాగా స్కూల్‌కు వెళ్లిన ఆ చిన్నారులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ గ్రామంలో శ్మశాన వైరాగ్యం కనిపిస్తోంది. మృతదేహాలు అప్పగింత.. ఆ ఏడుగురు చిన్నారుల మృతదేహాలను ఈరోజు(శనివారం, జూలై 26) ఆయా కుటుంబాలకు అప్పగించారు. ఝల్వార్ ఎస్ఆర్జీ హాస్పిలల్ మెడికల్ కాలేజ్‌లో పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం మార్చురీ నుంచి ఆ మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించారు. తమ పిల్లల మృతదేహాలను చూసి బోరున విలిపిస్తున్న తల్లి దండ్రులు ఒకవైపు, కన్నీళ్లను అదిమిపెట్టుకుని పిల్లల ముందు అలా కూర్చిండిపోయి మౌనంగా రోదిస్తున్న పేరెంట్స్ మరొకవైపు. అంతా హృదయ విదారకంగా మారింది.

ఎన్టీఆర్కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే 'దేవర' సినిమా దీన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తారక్ చేసిన తొలి బాలీవుడ్ మూవీ 'వార్ 2'. ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే శుక్రవారం చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది. మరోవైపు హీరోలు చేసిన హృతిక్, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువ అనేది కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్)పాన్ ఇండియా కల్చర్ పెరిగిన తర్వాత మన హీరోలు ఇక్కడే సినిమాలు చేస్తూ హిందీలో డబ్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం యష్ రాజ్ స్పై యూనివర్స్‌లోని 'వార్ 2'లో భాగమయ్యాడు. అయితే తారక్‌ది విలన్ రోల్ అని టాక్ నడుస్తోంది. ట్రైలర్లోనూ నెగిటివ్ టచ్ ఉన్నట్లే చూపించారు. మరి అందరూ అనుకుంటున్నట్లు ఎన్టీఆర్ విలన్ లేదా మరో హీరోనా అనేది మూవీ వస్తే గానీ తెలియదు. అయితే ప్రస్తుతం తారక్‌కి ఉన్న ఫేమ్ దృష్ట్యా అందరి కంటే ఇతడికే ఎక్కువగా నిర్మాతలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.'వార్ 2'లో నటించినందుకు గానూ ఎన్టీఆర్‌కు ఏకంగా రూ.60 కోట్ల వరకు పారితోషికం ఇచ్చారట. హృతిక్ రోషన్‌కి రూ.45 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. హీరోయిన్గా చేసిన కియారా అడ్వాణీకి రూ.15 కోట్లు, దర్శకుడు అయాన్ ముఖర్జీకి రూ.32 కోట్లు అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీనిబట్టి చూస్తుంటే హృతిక్‌పై అటు ట్రైలర్లోనే కాదు రెమ్యునరేషన్ విషయంలోనూ తారక్ డామినేషన్ చూపించినట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)

అందుకు రెడీ అన్న పాక్.. భారత్ స్పందన కోసం ఎదురుచూపు
భారత్‌తో చర్చలకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందంటూ ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగశాఖ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ఆయా అంశాలపై చర్చలకు ఇస్లామాబాద్ సిద్ధమంటూ పునరుద్ఘాటించారు. దీనిపై భారత్ తుది నిర్ణయం తీసుకోవాలన్న దార్.. ఆ దేశ అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు బంతి.. భారతదేశ కోర్టులో ఉందంటూ దార్ వ్యాఖ్యానించారు.వాణిజ్యం నుంచి ఉగ్రవాద వ్యతిరేక చర్యలు వంటి వివిధ అంశాలపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘అర్థవంతమైన చర్చలు’ అవసరమంటూ ఆయన నొక్కి చెప్పారు. కాశ్మీర్, భద్రత, ఆర్థిక సంబంధాలతో సహా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి చర్చలు తిరిగి ప్రారంభించాలని దార్ పిలుపునిచ్చారు.కాగా, పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ కఠిన వైఖరి అవలంబించిన సంగతి తెలిసిందే. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు ఆ దేశంతో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను కట్ చేసింది. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌తో పాటు పీవోకేలో ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. భారత్ మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు మే 10వ తేదీన ఒక అంగీకారానికి రావడం తెలిసిందే.

తల్లా? పెళ్లామా?
తల్లా? పెళ్లామా? అనే పరిస్థితిలో.. ఎవరి మాటకు విలువ ఇవ్వాలో తెలియక మదనపడే వాళ్లే మన మధ్యే కనిపిస్తుంటారు. అయితే అలాంటి మానసిక సంఘర్షణలో నలిగిపోతున్న ఓ వ్యక్తికి.. భారత సర్వోన్నత న్యాయస్థానం హితబోధ చేసింది.ఆ భార్యభర్తలిద్దరూ.. మనస్పర్థలతో దూరంగా ఉంటున్నారు. భర్త అమెరికాలో ఉండగా.. పెద్ద కూతురు అతని తల్లి(నాన్నమ్మ) దగ్గర, మైనర్ కొడుకు మాత్రం భార్యతో ఉంటున్నాడు. ఈ తరుణంలో కలిసి ఉండడం కుదరని భావించిన ఆ జంట కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం.. జస్టిస్ బీవీ నాగరత్న, కేవీ విశ్వనాథన్ ఈ పిటిషన్‌ను విచారించారు. ఈ క్రమంలో వర్చువల్ విచారణకు హాజరైన ఆ దంపతులు ధర్మాసనం సమక్షంలోనే వాదులాడుకున్నారు.తనపై తన భార్య తప్పుడు క్రిమినల్ కేసు పెట్టిందని ఆ భర్త, తన భర్త తనను పట్టించుకోవడం మానేశాడని ఆ భార్య పరస్పరం ఆరోపించుకున్నారు. ఈ తరుణంలో బెంచ్ జోక్యం చేసుకుంది.మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడుకుని పిల్లల కోసం కలిసి జీవించాలని ధర్మాసనం ఆ జంటకు సూచించింది. అయితే పదే పదే ఆ వ్యక్తి తన తల్లి ప్రస్తావన తీసుకురావడాన్ని గమనించిన జస్టిస్ నాగరత్న.. కుటుంబాల్లో గొడవలు భార్యల మాటల్ని భర్తలు పెడచెవిన పెట్టినప్పుడే మొదలవుతాయని వ్యాఖ్యానించారు.‘‘తమ మాట కంటే తల్లుల మాటకు భర్తలు ఎక్కువ విలువ ఇచ్చినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అలాగని తల్లిని పక్కనపెట్టాలని మేం అనడం లేదు. భార్యలు చెప్పేది కూడా వినాలి. భర్తలు భార్యల భావాల్ని గౌరవించాల్సిందే’’ అని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో భర్త తన కుమారుడిని చూడలేదని చెప్పడంతో, కోర్టు ఆ భార్య తీరును తప్పుబట్టింది. ఒక పిల్లవాడు తన తండ్రి, సోదరిని చూడకుండా ఉండడం సరికాదని అభిప్రాయపడింది. మధ్యవర్తిత్వ సమయంలోనైనా ఆ పిల్లాడి చూపించాలని, పిల్లల శ్రేయస్సు కోసం సమస్యలు పరిష్కరించుకుని కలిసి జీవించాలని మరోసారి ఆ జంటకు సూచిస్తూ కేసు వాయిదా వేసింది.మరో కేసులో.. విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగండని ఓ జంటకు సుప్రీం కోర్టు సూచించింది. భార్య, ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని బాలాకోట్ దాడుల్లో పాల్గొన్న యుద్ధ విమాన పైలట్ ఒకరు కోర్టును ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కోరారాయన. అయితే.. జీవితం అంటే ప్రతీకారం తీర్చుకోవడం కాదని, సర్దుకుపోయి ముందుకు సాగాలని ఆ జంటకు ధర్మాసనం సూచించింది.

వాళ్లకి బ్రెయిన్ అవసరం లేదట : హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గొయెంకా (Harsh Goenka)ఎక్స్‌లో మరో ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. ఎప్పటికప్పుడు ఆసక్తికర అంశాలతో నెటిజన్లను ఆలోచింప చేసే ఆయన తాజా ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. యూకే గ్లోబల్ ఎగ్జిక్యూటివ్‌తో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఒక గ్లోబల్ CEO భారతీయ నిపుణుల మేధో సామర్థ్యాలను ఎలా అవమానించారో తెలుపుతూ ట్వీట్ చేశారు. అందుకే నిపుణులంతా భారతీయ కంపెనీలవైపు మొగ్గు చూపుతున్నారంటూ చురకలంటించారు. హర్ష్ గోయెంకా ట్వీట్ ఆన్లైన్లో తీవ్ర చర్చకు దారి తీసింది. హర్ష్‌గోయెంకా ట్వీట్: "భారతీయ అనుబంధ సంస్థ, అత్యంత ప్రగతిశీల సంస్థకు చెందిన గ్లోబల్ CEO నాతో ఇలా అన్నాడు. ‘‘బ్రెయిన్, చేతులు, కాళ్లు అవసరం లేకుండా కేవలం ప్లాన్‌ను అమలు చేసే ఇంజీన్‌లా నా భారతీయ CEO ఉండాలని కోరుకుంటా.. అని అన్నట్టు అని గోయెంకా గుర్తు చేసుకున్నారు. "ఈ విధానం వల్లే ఇప్పుడు భారతీయ కంపెనీలలో పనిచేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు " అని ఆయన పేర్కొన్నారు.ఈపోస్ట్ నెట్టింట చర్చకు దారితీసింది. ముఖ్యంగా, భారతీయ సంతతికి చెందిన టెక్ నిపుణులు ప్రపంచంలోని కొన్ని అగ్రశ్రేణి కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు, నూతన ఆవిష్కరణలతో టాప్‌లో కంపెనీలను నడిపిస్తున్న తరుణంలో హర్ష్ గోయెంకా ట్వీట్ విశేషంగా నిలిచింది."సో నయా వలసవాద వైఖరులు కొనసాగుతూనే ఉన్నాయి అన్నది నిజమన్నమాట అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఈ మనస్తత్వం వల్లే భారతీయ నిపుణులు స్వదేశీ కంపెనీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మెషీన్లలా పనిచేయం కాదు...మెదళ్ళకు విలువ ఇవ్వాలనుకుంటున్నాము" అని మరొకరు రాశారు.చదవండి : కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!బెన్‌హాన్స్ ఫార్మా MD ఎలియా జయరాజ్, “భారత జట్టును చేతులు, కాళ్ళు లేకుండా చేయాలనే UK CEO ప్లానా ఇది? ఒక క్రికెట్ స్టార్‌ను బంతిని అలా ఫెచ్ చేయమని అడిగినంత కామెడీగా ఉంది. TCS వంటి భారతీయ సంస్థల వైపు ఐటీ నిపుణులు పరిగెత్తడంలో ఆశ్చర్యం లేదు , అక్కడ వారు తమ తెలివితేటలను ప్రదర్శించగలరు. 2024లో రిటెన్షన్ (ఉద్యోగుల కొనసాగింపు) 10 శాతం బెటర్‌గా ఉందని నాస్కామ్ చెబుతోంది. భారతీయ CEOలు అవకాశాన్ని వాడుకోండి.. లేదంటే మీకు నష్టం అని వ్యాఖ్యానించారు. “ఇది బహుశా ఫార్మా లేదా ఆర్థిక సేవల సంస్థ అయి ఉండాలి. మరే ఇతర రంగంలోనూ బ్రిటీషోళ్లకి అంత సీను లేదు” అని మరొకరు కమెంట్ చేశారు. ఇది చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు

‘దేశానికి రక్షణ కల్పించండి.. మీ సమస్యలతో మేం పోరాడుతాం’
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా సైనికుల కుటుంబాలకు న్యాయసహాయం అందించనున్నారు. ‘నల్సా వీర్ పరివార్ సహాయతా యోజన 2025’ పేరుతో ఈ కొత్త కార్యక్రమం ద్వారా భారతీయ సైనికులకు సాయం చేయనున్నారు. సొంత ఊళ్లకు దూరంగా దేశం కోసం సేవలందిస్తున్న సైనికులు, తమ కుటుంబ సభ్యులు కొన్నిసార్లు స్థానికంగా న్యాయపరమైన వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో దేశం కోసం సుదూర ప్రాంతాల్లో పోరాడుతున్న సైనికులు స్వగ్రామాలకు రావడం కష్టంగా మారుతుంది. అలాంటివారికి, తమ కుటుంబ సభ్యులకు న్యాయసేవ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ సూర్యకాంత్ శ్రీనగర్‌లో జరిగిన కార్గిల్ విజయ్ దివాస్ సదస్సులో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈమేరకు నిర్ణయం తీసుకోవడం సైనికులకు ఎంతో వెసులుబాటు కల్పిస్తుందని నమ్ముతున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో సాయుధ దళాలు చేసిన త్యాగాలను చూసి తీవ్రంగా చలించిపోయానని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. న్యాయవ్యవస్థ వారి శ్రేయస్సుకు మరింత ప్రత్యక్షంగా దోహదపడే మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..ఈ కార్యక్రమం ఉద్దేశం..సైనికులు విధుల్లో ఉన్నప్పుడు అపరిష్కృత ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, భూ సమస్యలు, ఇతర చట్టపరమైన విషయాల నుంచి ఉపశమనం కలిగించేలా న్యాయసేవ అందిస్తారు.సైనికులు వృత్తిపరమైన కారణాలతో కోర్టుకు హాజరు కాలేకపోయినా, కోర్టులో కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించడానికి నల్సా రంగంలోకి దిగుతుంది.ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఇతర పారామిలటరీ బలగాలు దీని పరిధిలోకి వస్తారు.ప్యానెల్ లాయర్లు, పారాలీగల్ వాలంటీర్లకు సులభంగా అందుబాటులో ఉండేలా రాష్ట్రాల్లోని సైనిక్ వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేస్తారు.కేసు పురోగతిని పర్యవేక్షించడానికి, సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారించడానికి వీరు తోడ్పాటు అందిస్తారు.
ఔషధవనంలో అపురూప ఆలయం
IND vs AUS: ధావన్ ధనాధన్.. పఠాన్ విధ్వంసం.. యువీ ఫెయిల్
పాపం పావురం.. కాపాడండి ప్లీజ్.. వీడియో వైరల్
ఒక్కపూట భోజనం.. మంచినీళ్లతో కడుపు నింపుకుంటున్నా: ఏడ్చేసిన నటి
పూల డ్రస్సులో తమన్నా.. నితిన్ భార్య స్పెషల్ పోస్ట్
రిటైల్ స్థలాల్లోనూ హైదరాబాద్ టాప్
‘ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని సిట్ సేకరించలేదు’
తొలి ఓవర్లో రెండు వికెట్లు.. కష్టాల్లో టీమిండియా!.. గంభీర్‌పై ఫ్యాన్స్ ఫైర్
అక్రమ మద్యం కేసు.. ‘సిట్’ మరో కొత్త నాటకం
చరిత్ర సృష్టించిన స్టోక్స్!.. ఇంగ్లండ్ ఆలౌట్.. స్కోరెంతంటే!
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్‌కాట్ దెబ్బ
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
బగారా రైస్. చికెన్ కర్రీతో టీచర్ల విందు..కట్ చేస్తే కలెక్టర్..!
తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు
హరి హర వీరమల్లు.. హిట్టా..! ఫట్టా..!
'మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది': అనసూయ
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
హైదరాబాద్‌లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
త్వరలో 25000 మంది ఉద్యోగాలు కట్..
ఔషధవనంలో అపురూప ఆలయం
IND vs AUS: ధావన్ ధనాధన్.. పఠాన్ విధ్వంసం.. యువీ ఫెయిల్
పాపం పావురం.. కాపాడండి ప్లీజ్.. వీడియో వైరల్
ఒక్కపూట భోజనం.. మంచినీళ్లతో కడుపు నింపుకుంటున్నా: ఏడ్చేసిన నటి
పూల డ్రస్సులో తమన్నా.. నితిన్ భార్య స్పెషల్ పోస్ట్
రిటైల్ స్థలాల్లోనూ హైదరాబాద్ టాప్
‘ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని సిట్ సేకరించలేదు’
తొలి ఓవర్లో రెండు వికెట్లు.. కష్టాల్లో టీమిండియా!.. గంభీర్‌పై ఫ్యాన్స్ ఫైర్
అక్రమ మద్యం కేసు.. ‘సిట్’ మరో కొత్త నాటకం
చరిత్ర సృష్టించిన స్టోక్స్!.. ఇంగ్లండ్ ఆలౌట్.. స్కోరెంతంటే!
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్‌కాట్ దెబ్బ
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
బగారా రైస్. చికెన్ కర్రీతో టీచర్ల విందు..కట్ చేస్తే కలెక్టర్..!
తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు
'మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది': అనసూయ
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
హైదరాబాద్‌లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
త్వరలో 25000 మంది ఉద్యోగాలు కట్..
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
విశ్వంభరకు బై బై
సినిమా

ఎన్టీఆర్ 'కొత్త' ఇల్లు.. ఫ్రెండ్స్‌తో పార్టీ!
ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' సినిమా బిజీలో ఉన్నాడు. వచ్చే నెల 14న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ట్రైలర్ విడుదల చేయగా.. స్పందన బాగానే వచ్చింది. తారక్ అభిమానులకు యాక్షన్ మూవీ చూడబోతున్నామని అంచనాలు పెంచేసుకున్నారు. మరోవైపు ఇతడి ఇంట్లో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఎన్టీఆర్కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?)అయితే ఈ ఫొటోలు ఎన్టీఆర్‌కి చెందిన జూబ్లీహిల్స్ ఇంటివి అని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ఇక్కడ రెనోవేషన్ పనులు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు అవి పూర్తి కావడంతో ఎన్టీఆర్ కుటుంబం.. స్నేహితులతో కలిసి సింపుల్‌గా ఈ ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కొత్తగా అమర్చిన వాల్ ఫ్రేమ్స్, షాండిలీయర్స్, బెడ్ రూమ్స్ లాంటివి ఈ ఫొటోల్లో కనిపిస్తున్నాయి. చూస్తుంటే తారక్ ఇంటి కోసం కాస్త గట్టిగానే ఖర్చు చేసినట్లు కనిపిస్తున్నాడు.'వార్ 2' రిలీజ్‌కి రెడీ కాగా.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు నెల్సన్.. ఎన్టీఆర్‌తో సినిమాలు చేయనున్నారు. వీటితో పాటు 'దేవర 2' కూడా లైన్లో ఉంది. మరి వీటిలో ఏది ముందు ఏది తర్వాత వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)

ప్రియురాలితో ఎక్కువసేపు గడపాలనుంది: విజయ్ దేవరకొండ
హిట్టు కోసం ఆరాటపడుతున్నాడు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). వరుస వైఫల్యాలతో సతమతవుతున్న అతడు కింగ్డమ్ మూవీపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 31న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ తమిళ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.సినిమా వల్లే..విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సినిమా వల్ల సమాజంలో నాకంటూ పేరుప్రఖ్యాతలు వచ్చాయి. జనాల ప్రేమ దొరికింది. సినిమాల్లోకి రాకపోయుంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలుసు. అలాంటి జీవితం నాకొద్దు. కానీ సినిమాల్లో మునిగిపోయి పర్సనల్ లైఫ్‌ను మిస్ అవుతున్నాను. మన లైఫ్‌లో బంధాలు అన్నింటికన్నా ముఖ్యమైనవి. గత రెండేళ్లలోనే నాకు వీటి విలువ బాగా తెలిసొచ్చింది. గర్ల్‌ఫ్రెండ్‌కు నో టైమ్ఈ రెండుమూడేళ్లలో నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు. అమ్మానాన్నకు సమయం కేటాయించలేదు. గర్ల్ ఫ్రెండ్‌కు కూడా కాస్తైనా టైం ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్‌తో కూడా గడపలేదు. ఇవన్నీ నన్ను బాధిస్తుండేవి. సడన్‌గా ఒకరోజు నాకు నేనే రియలైజ్ అయ్యాను. ఇలా బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దని పద్ధతి మార్చుకున్నాను. కుటుంబసభ్యులతో పాటు నా జీవితంలో ఉన్న అందరికీ సమయం కేటాయిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.ప్రేమలో..కాగా విజయ్ దేవరకొండ.. హీరోయిన్ రష్మిక మందన్నాతో చాలాకాలంగా ప్రేమలో ఉన్నాడు. చాలాసార్లు తాను సింగిల్ కాదని హింటిచ్చాడు. విజయ్, రష్మిక.. ఛాన్స్ దొరికినప్పుడల్లా వెకేషన్‌కు చెక్కేస్తుంటారు. వీరిద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు.చదవండి: తరచు బరువు తగ్గి, పెరగడం వెనుక కారణం అదే..: విద్యా బాలన్

'అతడు' రీరిలీజ్.. కలెక్షన్స్ అంతా 'గుప్పెడు గుండెల' కోసమే
సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'అతడు' రీరిలీజ్ కానుంది. 2005లో విడుదలైన ఈ సినిమా ఆయన పుట్టినరోజు సందర్భంగా (ఆగష్టు 9) మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. జయభేరి ఆర్ట్ పతాకంపై మురళీ మోహన్ నిర్మించారు. అప్పట్లో ఈ చిత్రానికి రూ. 7 కోట్లకు పైగానే బడ్జెట్ అయినట్లు సమాచారం. అయితే, తాజాగా ఒక మీడియా సమావేశాన్ని మేకర్స్ నిర్వహించారు. అతడు రీరిలీజ్ ద్వారా వచ్చే డబ్బును మహేశ్ బాబు ఫౌండేషన్ కోసం వినియోగిస్తామని ఆయన టీమ్ ప్రకటించింది.మహేశ్ బాబు ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన నమ్రత, మహేశ్‌కు వచ్చిందని ఆయన టీమ్ తాజాగా పేర్కొంది. మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా అతడు సినిమా ఆగష్టు 9న రీరిలీజ్ కానుందన్నారు. ఈ మూవీకి వచ్చే కలెక్షన్స్ మొత్తం మహేశ్‌బాబు ఫౌండేషన్‌కు ఉపయోగిస్తామని ఆయన టీమ్ తెలిపింది. ముఖ్యంగా చిన్న పిల్లల గుండే ఆపరేషన్స్, పేద పిల్లల చదువు కోసం ఈ డబ్బు ఉపయోగిస్తామన్నారు. గతంలో రీరిలీజ్ అయిన పోకిరి, ఒక్కడు, బిజినెస్ మేన్ వంటి సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ కూడా ఫౌండేషన్ కోసం ఉపయోగించామని పేర్కొన్నారు. ప్రతి ఏడాది మహేశ్ బాబు బర్త్‌డే నాడు తను నటించిన సినిమాలలో ఏదో ఒకటి రీరిలీజ్ అవుతుంది. తమ అభిమాన హీరో స్థాపించిన ఫౌండేషన్ కోసం సాయంగా ఉండాలని ఆయన ఫ్యాన్స్ భారీగా సినిమా చూసేందుకు వెళ్తారు.మహేశ్ బాబు ఫౌండేషన్ గురించిపేద పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలతో పాటు విద్య, ఆరోగ్యానికి సంబంధించిన ఇతర సేవలను కూడా మహేశ్ ఫౌండేషన్ అందిస్తుంది. ఈ సంస్థకు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రి రెయిన్బోతో భాగస్వామ్యం కలిగి ఉంది. దీనికి అంబాసిడర్‌గా మహేష్ బాబు కొనసాగుతున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 4,500 కంటే ఎక్కువ ఉచిత గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ట్రస్ట్ బాధ్యతలన్నీ నమ్రతా శిరోద్కర్ దగ్గరుండి చూస్తుంటారు.#AthaduHomeComing :MB ఫౌండేషన్ IDEA #MaheshBabu & #Namratha గారిది, ఇప్పటి దాకా వచ్చిన రీ రిలీజ్ వసూళ్లు అంతా పిల్లల హార్ట్ ఆపరేషన్ కి, EDUCATION కి ఉపయోగపడుతుంది.#Athadu కలెక్షన్స్ కూడా ఫౌండేషన్ కే..#AthaduSuper4K #Athadu4K pic.twitter.com/CNyrp4Ui3m— IndiaGlitz Telugu™ (@igtelugu) July 26, 2025

తరచు బరువు తగ్గి, పెరగడం వెనుక కారణం అదే..: విద్యా బాలన్
నిర్భయమైన వైఖరి స్వీయ వ్యక్తీకరణకు పేరుగాంచిన విద్యాబాలన్, నటన, గ్లామర్ల కలబోతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. దక్షిణాది నటి సిల్క్ స్మిత జీవిత కధ ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ ద్వారా సౌత్ ప్రేక్షకల ప్రశంసలూ దక్కించుకున్న విద్యాబాలన్‌కు తరచుగా ఎదురయే విమర్శ, లేదా సలహా ఏదైనా ఉందంటే అది ఆమె ఓవర్ వెయిట్ గురించి మాత్రమే. గతంలోనూ కొన్నిసార్లు బరువు పెరిగి తగ్గి, పెరిగి...మార్పులకు గురవుతున్న విద్యాబాలన్... ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల సందర్భంగా తన శరీరపు బరువు విషయంలో సంవత్సరాలుగా తనపై వచ్చిన విమర్శల నేపధ్యంలో ఈ సమస్యను అధిగమించడానికి తాను పడిన వ్యయ ప్రయాసల్ని ఆమె వెల్లడించింది.‘ నేనొక సిగ్గుపడని ఆశావాదిని నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. బరువు తగ్గడానికి నేను చేయని పోరాటం లేదు. నిజాయితీగా చెప్పాలంటే, ఆ విషయానికి వస్తే నాలో ఏ తప్పు లేదని నేను అనుకుంటున్నాను అంటుందామె. బరువుపై విమర్శలను చూసి బెదిరిపోని ఆమె మనస్తత్వం, విమర్శలను తట్టుకోవడానికి సినీరంగంలో కొనసాగడానికి సహాయపడిందని ఆమె అభిప్రాయపడుతోంది. ‘‘ఆ వైఖరి నాకు సహాయపడింది. నేను ప్రధాన పాత్రలు పోషించడం కొనసాగించాను ఎలాంటి అభద్రతాభావాలు నన్ను ఎప్పుడూ వెనక్కి నెట్టలేదు‘ అంటూ ఓవర్ వెయిట్ అనే సమస్యను జయించడానికి ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో చెప్పకనే చెబుతుందామె.‘నా జీవితాంతం, నేను సన్నగా మారడానికి ప్రయత్నించాను. తీవ్రమైన ఆహార నియమాలు పాటించాను. అన్ని రకాల వ్యాయామాలను చేశాను. కొన్నిసార్లు బరువు తగ్గాను, కానీ మళ్లీ తిరిగి బరువు పెరిగిపోయేదాన్ని.‘ అంటూ గుర్తు చేసుకుంది.ఇటీవల బాగా వెయిట్ లాస్ అయి స్లిమ్ గా కనపడుతున్న విద్యాబాలన్...ఈ సంవత్సరం ప్రారంభంలో చెన్నైకి చెందిన పోషకాహార సంస్థ తో కనెక్ట్ అయినప్పుడు తన సమస్య ఏమిటో తనకి అర్ధం అయిందని చెప్పింది. ‘వారు నాకు, ’మీది కొవ్వు కాదు, అది ఇన్ఫ్లమేషన్’ అని చెప్పారు. అది నా విషయంలో గేమ్–ఛేంజర్ గా పనిచేసింది అని ఆమె వివరించింది తాను స్వతహాగా శాఖాహారిని అని కూరగాయలు తింటున్నా కూడా బరువు పెరగడానికి కారణం ఈ సంస్థను కలిసిన తర్వాత తనకు అర్ధమైందని అంటోంది. ‘‘ అన్ని కూరగాయలు ఆరోగ్యకరమైనవని మనం అనుకుంటాము, కానీ అది నిజం కాదు. మీ శరీరానికి ఏది సరైనదో మీరు అర్థం చేసుకోవాలి. మరొకరికి పనికొచ్చేది మీకు పనికి రాకపోవచ్చు. అదే విధంగా పాలకూర సొరకాయ వంటి కొన్ని నాకు సరిపోవని నాకు అంతకు ముందు తెలియదు’’ అంటూ వెల్లడించింది.ఆత్మవిశ్వాసం అద్దం నుంచి రాదు అది లోపలి నుంచి వస్తుంది అని అంటున్న విద్య... దీర్ఘకాలంగా తాను చేస్తున్న బరువుపై పోరాటంలో సరైన సక్సెస్‌నే సాధించారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె తన ఆహారంలో ‘ఇన్ఫ్లమేషన్ను తొలగించే‘ విధానాన్ని అవలంబించింది, శరీర బరువు త్వరగా తగ్గించగలిగింది. అవగాహనతో కూడిన ఈ విజయం ఇకపైనా కొనసాగిస్తుందని ఆమె అభిమానులు ఆశించవచ్చు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ మిస్సయ్యాడు! సౌతాఫ్రికా స్టార్ ప్రపంచ రికార్డు
సౌతాఫ్రికా యువ క్రికెటర్ జోరిచ్ వాన్ షాల్విక్ (Jorich Van Schalkwyk) సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూత్ వన్డేల్లో డబుల్ సెంచరీ (Double Century) సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. జింబాబ్వే అండర్-19 జట్టుతో మ్యాచ్ సందర్భంగా జోరిచ్ ఈ ఘనత సాధించాడు.విధ్వంసకర ఇన్నింగ్స్మూడు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా అండర్-19 జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో మొదటి వన్డేలో జోరిచ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ టీ20 మాదిరి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు.కేవలం 153 బంతుల్లోనే 215 పరుగులు సాధించాడు జోరిచ్. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 19 ఫోర్లతో పాటు 6 సిక్సర్లు ఉన్నాయి. జోరిచ్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా సౌతాఫ్రికా 385 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో జింబాబ్వే 107 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలగా.. 278 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది.యూత్ వన్డేల్లో తొలి ద్విశతకంఈ మ్యాచ్ సందర్భంగా యూత్ వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా జోరిచ్ రికార్డు సాధించాడు. గతంలోనూ అతడు 200 పరుగుల మార్కుకు దగ్గరగా వచ్చి మిస్సయ్యాడు. బంగ్లాదేశ్ అండర్-19 జట్టుతో జరిగిన యూత్ వన్డేలో జోరిచ్ 156 బంతుల్లో 164 పరుగులు సాధించాడు.నాటి మ్యాచ్‌లో బంగ్లా విధించిన లక్ష్యాన్ని సౌతాఫ్రికా 44.4 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టపోయి ఛేదించింది. అలా ఆరోజు బంగ్లాపై విజయంలో కీలక పాత్ర పోషించిన జోరిచ్ వాన్ షాల్విక్.. తాజాగా జింబాబ్వేతో రికార్డు డబుల్ శతకంతో మెరిశాడు.వైభవ్ సూర్యవంశీ మిస్సయ్యాడుఇదిలా ఉంటే.. భారత్ అండర్-19 జట్టు ఇటీవల ఇంగ్లండ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాలుగో యూత్ వన్డేలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కేవలం 52 బంతుల్లోనే శతకం సాధించి.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 78 బంతుల్లో 143 పరుగులు సాధించాడు. 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఈ మేర భారీ శతకం నమోదు చేశాడు. అయితే, దీనిని డబుల్ సెంచరీగా మలచలేకపోయాడు.అలా వైభవ్ మిస్సయిన ప్రపంచ రికార్డును జోరిచ్ తాజాగా తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా భారత్ తరఫున యూత్ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా అంబటి రాయుడు కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్‌తో 2002 నాటి మ్యాచ్‌లో రాయుడు 177 పరుగులు సాధించాడు. అతడి తర్వాతి స్థానాల్లో రాజ్ అంగద్ బవా (2022లో ఉగాండాపై 162), మయాంక్ అగర్వాల్ (160), శుబ్‌మన్ గిల్ (160), వైభవ్ సూర్యవంశీ (143) ఉన్నారు.చదవండి: ‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ లేదు’

గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సరైన వ్యూహాలు అమలు చేయడంలో విఫలమయ్యాడని ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ అన్నాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో బౌలర్ల సేవలు సరిగ్గా వినియోగించుకోలేకపోయాడంటూ పెదవి విరిచాడు. శుక్రవారం నాటి తొలి సెషన్లో స్పిన్నర్ల చేతికి బంతిని ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో 1-2తో టీమిండియా వెనుకబడి ఉంది. మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులో గెలిస్తేనే గిల్ సేనకు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే డ్రా కోసం టీమిండియా ప్రయత్నించడమే ఉత్తమంగా కనిపిస్తోంది.358 పరుగులకు ఆలౌట్‌టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు దీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్.. శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 544 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ కంటే 186 పరుగుల ఆధిక్యం సంపాదించింది.భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్టీమిండియా బౌలర్ల వైఫల్యం కారణంగా ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (113 బంతుల్లో 84), బెన్ డకెట్ (100 బంతుల్లో 94) మరోసారి ‘బజ్‌బాల్’ శైలిలో రెచ్చిపోయారు. మరోసారి జో రూట్ తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ రికార్డు శతకం (150)తో చెలరేగగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (77 నాటౌట్) కూడా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆతిథ్య జట్టుకు ఈ మేర ఆధిక్యం లభించింది.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేస్‌లో పదును తగ్గగా.. మహ్మద్ సిరాజ్‌తో పాటు అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ ముగ్గురూ తలా ఒక వికెట్ దక్కించుకోగా.. ఇక శార్దూల్ ఠాకూర్ మరోసారి విఫలమయ్యాడు. అయితే, స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటారు.గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదుఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ తీరుపై మైకేల్ వాన్ విమర్శలు గుప్పించాడు. ‘‘నేనే గనుక గిల్ స్థానంలో ఉండి ఉంటే.. స్పిన్నర్లతో రోజును ఆరంభించేవాడిని. కనీసం వారికి రెండు- మూడు ఓవర్లు వేసే అవకాశం ఇచ్చేవాడిని.కానీ గిల్ అలా చేయలేదు. అందుకు కారణమేమిటో అతడే వివరించాలి. అతడు వ్యూహాత్మక తప్పిదాలు చేశాడు’’ అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. ఇక దురదృష్టవశాత్తూ బుమ్రా కూడా ఈ పిచ్‌పై రాణించలేకపోయాడని.. సిరాజ్ మాత్రం ఫర్వాలేదనిపించాడన్నాడు. అదే విధంగా.. గంటకు 78- 81 మైళ్ల వేగంతో బౌలింగ్ చేసే శార్దూల్ ఠాకూర్ నుంచి ఇక్కడ మెరుగైన ప్రదర్శన ఆశించడం కూడా తప్పేనని వాన్ అభిప్రాయపడ్డాడు. ఇక అన్షుల్ కొత్త వాడని.. ఆదిలోనే అతడు అద్భుతాలు చేయలేడని పేర్కొన్నాడు. వీరందరితో నెగ్గుకురావడం కాస్త కష్టమేనంటూ ఒకానొక సందర్భంలో గిల్‌కు మద్దతు పలికాడు.చదవండి: AUS vs WI: టిమ్ డేవిడ్ మెరుపు సెంచరీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్

షోయబ్ మాలిక్ ఆల్‌రౌండ్ షో.. సౌతాఫ్రికాపై పాక్ ఘన విజయం
ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్- 2025 టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్‌గా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం లీసెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఛాంపియన్స్‌ను 31 పరుగుల తేడాతో పాకిస్తాన్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్ సాధించింది.పాక్ బ్యాటర్లలో ఉమర్ అమీన్(58) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షోయబ్ మాలిక్(46) కీలక నాక్ ఆడాడు. అతడితో పాటు ఆసిఫ్ అలీ(23), షర్జీల్ ఖాన్(19) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఓలీవర్ రెండు, విజోలన్, డుమినీ, పార్నల్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా ఛాంప్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేయగల్గింది. సఫారీ బ్యాటర్లలో మోర్నే వాన్ వైక్(44) మినహా మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో హాఫీజ్, తన్వీర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాలిక్, రియాజ్, సోహిల్ ఖాన్, వసీం తలా వికెట్ సాధించారు. కాగా పాకిస్తాన్ ఛాంపియన్స్, ఇండియా ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా డబ్ల్యూసీఎల్ మెనెజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.

'మరి ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తారా.. మీకంటే అనిల్ కుంబ్లే బెటర్'
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వంటి స్పిన్నర్లు కాస్త పర్వాలేదన్పించినప్పటికి.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి ప్రధాన పేసర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు. వికెట్ల విషయం పక్కన పెడితే సరైన లైన్ అడ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు.సరైన వేగంతో బౌలింగ్ చేయడంలో కూడా ఫాస్ట్ బౌలర్లు విఫలమయ్యారు. అరంగేట్ర బౌలర్ అన్షుల్ కాంబోజ్ది సైతం ఇదే కథ. ఓ వికెట్ పడగొట్టినప్పటికి భారీ పరుగులు మాత్రం సమర్పించుకున్నాడు. భారత బౌలర్లను సునాయసంగా ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. స్టోక్స్ సేన ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో బౌలింగ్ యూనిట్‌పై భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ విమర్శల వర్షం కురిపించాడు. ముఖ్యంగా అరంగేట్ర ఆటగాడు అన్షుల్ కాంబోజ్, మహ్మద్ సిరాజ్‌లను సిద్ధూ టార్గెట్ చేశాడు."మాంచెస్టర్‌లో మహ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోజ్ గంటకు 120 నుంచి 130 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తున్నారు. స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా ఈ వేగంతో బౌలింగ్ చేయగలడు. కాంబోజ్ తొలి టెస్టు ఆడుతున్నప్పటికి ఈ రకమైన బౌలింగ్ చేయడం సరికాదు. వికెట్లు తీయకపోయినా కనీసం బ్యాటర్లను కట్టడి చేయాలి.అదేవిధంగా శార్ధూల్ ఠాకూర్‌ను తిరిగి మళ్లీ జట్టులోకి ఎందుకు తీసుకున్నారో నాకు ఆర్ధం కావడం లేదు. అతడు బ్యాటింగ్‌లో 30 నుంచి 40 పరుగుల వరకు జట్టుకు అందించవచ్చు. కానీ బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. వికెట్ల విషయం పక్కన పెడితే, ప్రసిద్ద్ కృష్ణలా 15 ఓవర్లు పాటు పరుగులు ఎక్కువగా ఇవ్వకుండా బౌలింగ్ చేయగలడా? అదేవిధంగా మూడో రోజు ఆటలో 68 ఓవర్ జడేజాతో బౌలింగ్ చేయంచడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే గత మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన సుందర్‌ను అంత అలస్యంగా ఎటాక్‌లోకి ఎందుకు తీసుకొచ్చారు? సుందర్ ఒక అద్బుతమైన స్పిన్నర్. ఈ మ్యాచ్‌లో అతడు హ్యారీ బ్రూక్‌కు వేసిన డెలివరీ నాకు దిగ్గజ స్పిన్నర్ ఎరపల్లి ప్రసన్నను గుర్తు చేసింది" అని తన యూట్యూబ్ ఛానల్లో సిద్దూ పేర్కొన్నాడు.
బిజినెస్

యూకే కార్బన్ ట్యాక్స్ విధిస్తే ఎలా?
ఇండియా-బ్రిటన్ దేశాల మధ్య దాదాపు 99% వాణిజ్య వస్తువులపై సుంకాలను నియంత్రించేలా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై ఇరు దేశాల ప్రతినిధులు అధికారికంగా సంతకాలు చేశారు. అయితే భారత ఎగుమతులపై యూకే ప్రతిపాదిత కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (సీబీఏఎం) ప్రభావం ఎలా ఉండబోతుందోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీబీఏఎం అనేది 2027లో యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రవేశపెడుతున్న వాతావరణ సంబంధిత సుంకం. ఇతర దేశాల ఉత్పత్తుల దిగుమతులపై వాటి కర్బన ఉద్గారాల ఆధారంగా పన్ను విధిస్తారు.కార్బన్ పన్నులకు సంబంధించిన స్పష్టమైన నిబంధనలను ఎఫ్‌టీఏలో చేర్చలేదు. అయితే భవిష్యత్తులో యూకే కార్బన్ లెవీల ఒప్పందం కింద భారతదేశ వాణిజ్య ప్రయోజనాలపై ప్రభావం చూపితే దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు యూకే నుంచి భారత్ దౌత్య హామీని తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న సీబీఏఎంను అమలు చేసేందుకు యూకే ప్రస్తుతం సన్నాహక దశలో ఉంది. ఇది అమల్లోకి వస్తే ప్రధానంగా ప్రభావితం చెందే వస్తువులు కింది విధంగా ఉన్నాయి.అల్యూమినియంసిమెంట్ఎరువులుహైడ్రోజన్స్టీల్ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులు దేశీయ వస్తువుల మాదిరిగానే కార్బన్ నిబంధనలకు లోబడి ఉండేలా చూడటం యూకే లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్‌టీఏలో సీబీఏఎం సంబంధిత నిబంధనలు చేర్చబడనప్పటికీ భారతదేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఒక ‘వెర్బల్ నోట్(అధికారిక దౌత్య హామీ)’ని కుదుర్చుకున్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. దీనిప్రకారం..‘యూకే సీబీఏఎం భారత ఎగుమతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తే, ఎఫ్‌టీఏ కింద మార్కెట్ యాక్సెస్ రాయితీలను హరిస్తే భారత్ తిరిగి సమతుల్యత చర్యలు తీసుకోవచ్చు’ అని సీనియర్ అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఐటీకి ముందుంది మంచి కాలం
కొన్ని నెలలుగా ఐటీ పరిశ్రమలో చెప్పుకోదగిన లాభాలు ఉండడంలేదు. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీలు పోస్ట్ చేస్తోన్న ఫలితాల్లో చాలాభాగం లేఆఫ్స్, డిస్క్రీషనరీ వ్యయాన్ని తగ్గించుకోవడం వల్ల ఒనగూరిందే. అయితే సమీప భవిష్యత్తులో వీటిలో మార్పు రాబోతుందని అంచనాలు వెలువడుతున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా ఆధునీకరణ, మెరుగైన డిజిటల్ అనుభవాల కోసం ఐటీ కంపెనీల కస్టమర్లు వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, బీమా, రిటైల్ రంగాల్లో విచక్షణాత్మక ఐటీ వ్యయం తిరిగి గాడినపడుతుందనే సంకేతాలు వస్తున్నాయి.వ్యయాలు పెంపుస్థూల ఆర్థిక ఒడిదుడుకులు, అంతర్జాతీయ టారిఫ్ అనిశ్చితుల మధ్య మొత్తం టెక్ బడ్జెట్లు స్తంభించాయి. సాంప్రదాయ ఐటీ కార్యకలాపాలను కంపెనీలు జాగ్రత్తగా నిర్వహిస్తున్నాయి. అయితే కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈమేరకు ఐటీ కస్టమర్ కంపెనీలు తమ వ్యయాన్ని పెంచుతున్నాయి. ఇది ఐటీ రంగానికి కలిసొచ్చే అంశం. వినియోగదారులు ఏఐ వాడకంవైపు మొగ్గు చూపడం కూడా ఐటీకి ఊతం ఇస్తుంది. జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రధాన యూఎస్ బ్యాంకులు ఏఐకి సంబంధించి ప్రయోగాత్మక దశలను దాటి పూర్తి స్థాయి, ఉత్పత్తి గ్రేడ్ ఏఐను వాడుతున్నాయి. ఈ పరివర్తన వ్యాపార ఫలితాలకు నేరుగా దోహదం చేస్తుంది.ఏఐతో మేలు..మల్టీ బిలియన్ డాలర్ల టెక్ బడ్జెట్ ఉన్న సంస్థలు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గణనీయమైన వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లు ఫారెస్టర్ ప్రిన్సిపల్ అనలిస్ట్ బిశ్వజీత్ మహాపాత్ర అన్నారు. స్పష్టమైన ఉత్పాదకత లాభాల కోసం ఏఐ ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. హైపర్-పర్సనలైజేషన్తో మెరుగైన కస్టమర్ అనుభవం చేకూరుతుందని చెప్పారు. ఏజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇది ఐటీ కంపెనీలకు లాభాలు తెస్తుందని చెప్పారు. ప్రముఖ సంస్థల ఐటీ వ్యయంలో 50% కంటే ఎక్కువ కృత్రిమ మేధ, డేటా ఆధునీకరణ, కస్టమర్-ఫేసింగ్ ఇన్నోవేషన్ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..పూర్తి స్థాయిలో కేటాయింపులు పెండింగ్..ఐటీ కంపెనీల కస్టమర్ సంస్థల విచక్షణ వ్యయంలో రికవరీ ఇంకా విస్తృతంగా లేదని నిపుణులు చెబుతున్నారు. అనేక సంస్థలు ఐటీ స్పెండింగ్ కోసం ఇంకా పూర్తి స్థాయిలో కేటాయింపులు జరపడంలేదు. దాంతో మొత్తం టెక్ బడ్జెట్లు 2026 ఆర్థిక సంవత్సరంలో ఫ్లాట్‌గా లేదా స్వల్ప లాభాల్లో మాత్రమే పెరుగుతాయని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఏఐ పుణ్యామా అని ఐటీ వ్యయంలో కొంత పురోగతి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తుంది.

కురిసిన చినుకుల్లా బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. వరుసగా రెండు రోజుల నుంచి తగ్గిన పసిడి ధరల్లో ఈ రోజు కూడా ఊరట లభించింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

హైదరాబాద్‌లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..
హెచ్ఎండీఏ లే అవుట్ల్లో స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ సర్కార్ నుంచి అనుమతి లభించకపోవడంతో అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఆరు నెలల క్రితమే భూముల విక్రయం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆన్లైన్ బిడ్డింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ అప్పట్లో రియల్ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొనడం వల్ల విరమించుకున్నారు. కొద్ది రోజులుగా ‘రియల్’ రంగంలో సానుకూల వాతావరణం నెలకొంది. ఇటీవల హౌసింగ్‌బోర్డు స్థలాల అమ్మకాలకు సముచితమైన స్పందన లభించింది. మరోవైపు నగర శివార్లలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణరంగం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ భూములకు సైతం డిమాండ్ బాగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొనుగోలుదారుల ఆసక్తి..ప్రైవేట్ వెంచర్ల కంటే హెచ్ఎండీఏ లే అవుట్లలో కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. రోడ్లు, పారిశుద్ధ్య, మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించడం, ఎలాంటి వివాదాలు లేని స్థలాలు కావడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు మొదలుకుని సంపన్నులు, బిల్డర్లు, రియల్టర్లు తదితర అన్ని వర్గాలకు చెందిన వాళ్లు కూడా హెచ్ఎండీఏ భూములను, స్థలాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. గతంలో వివిధ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ విక్రయించిన స్థలాలకు భారీ ఎత్తున స్పందన లభించడమే ఇందుకు నిదర్శనం. కాలయాపన ఎందుకు.. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇన్ముల్‌నెర్వా, లేమూరు, కుర్మల్‌గూడ, తొర్రూరు, ప్రతాప్‌సింగారం తదితర ప్రాంతాల్లో స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని చోట్ల హెచ్ఎండీఏ సొంత స్థలాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేయగా, ప్రతాప్‌సింగారం, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేశారు. ఈ వెంచర్లలో రైతులకు 60 శాతం ప్లాట్లు కేటాయించగా చెందిన మిగతా 40 శాతం స్థలాల్లో ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా స్థలాలను విక్రయించవచ్చు. ‘ప్రస్తుతం అన్ని విధాలుగా సానుకూలంగా ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటేనే కొనుగోలుదార్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభిస్తుంది’ అని హెచ్ఎండీఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.బుద్వేల్, మోకిల వంటి చోట్ల గతంలో హెచ్ఎండీఏ స్థలాలకు భారీ స్పందన లభించింది. ప్రస్తుతం అక్కడ ఇంకా కొన్ని స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కోకాపేట్లో ఎకరం రూ.వంద కోట్లకు అమ్ముడైంది. బుద్వేల్‌లోనూ భారీ ఆదాయం లభించింది. వివిధ ప్రాంతాల్లో ఎన్నారైలు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఆశించే మధ్యతరగతి వర్గాలు సైతం హెచ్ఎండీఏ స్థలాలను కొనుగోలు చేశాయి.ఇదీ చదవండి: ‘జీఎస్టీ అమల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి’కాసులుంటేనే పరుగులు.. సికింద్రాబాద్ నుంచి డెయిరీఫాం, శామీర్‌పేట్ మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్లతో పాటు ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. డెయిరీఫాం ఎలివేటెడ్‌కు, గ్రీన్‌ఫీల్డ్ రోడ్లకు టెండర్లు కూడా ఖరారయ్యాయి. దీంతో నిధుల కేటాయింపు హెచ్ఎండీఏకు ఒక సవాల్‌గా మారింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూములను, ప్లాట్లను విక్రయించడం వల్ల కనీసం రూ.5000 కోట్ల వరకు ఆర్జించే అవకాశం ఉంది.
ఫ్యామిలీ

కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు
వ్యాపారవేత్త, నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, సంజయ్ కపూర్ ఆకస్మికమరణంపై ఆమె తల్లి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మరణించిన నెల రోజుల తర్వాత తన కొడుకు మరణాన్ని అనుమానాస్పదం అని పేర్కొంటూ కొన్ని దిగ్భ్రాంతికర వాదనలు చేశారు. సంజయ్ మరణం తర్వాత ప్రజలు, కుటుంబ వారసత్వాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.సోనా కామ్స్టార్ మాజీ ఛైర్మన్ సంజయ్ కపూర్ (కెనడాలో జూన్ 12న) పోలో ఆడుతూ మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తేనెటీగ కుట్టడం వలన గుండెపోటు వచ్చి చివరికి అతని మరణం సంభవించిందని వార్తలొచ్చాయి. తాజాగా ఆయనతల్లి రాణి కపూర్ తన కొడుకు ఆకస్మిక మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. కొడుకు మరణం అనుమానాస్పదం, అంతేకాదు సోనా కామ్స్టార్వార్షిక సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయమని కోరుతూ లేఖ రాశారు. తన కొడుకు మరణంపై అనేక చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదని వాపోతోంది. తన ఏకైక కుమారుడు మరణంపై వచ్చిన వార్తలన్నీ ఊగాహానాలేనని, యూకేలో చెప్పుకోలేని పరిస్థితులలో చనిపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సార్లు అడిగినా తన కొడుకు మరణానికి సంబంధించిన వివరాలు అందండం లేదు. సంబంధిత సమాధానాలు, పత్రాలు నాకు అందలేదు. ఇంత దుఃఖంలో కొంతమంది కుటుంబ వారసత్వాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారుఅంతేకాదు సంజయ్ కపూర్‌కు ఖాతాలకు యాక్సెస్‌ను కూడా నిరాకరించారట. సంజయ్ మరణించిన ఒక నెలలోనే ఎంపిక చేసిన కొద్దిమందికే దీనికి అవకాశం కల్పించారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. తనకు అర్థం కాని పత్రాలపై సంతకం చేయమని బలవంతం చేశారని కూడా పేర్కొన్నారు. ఏమి రాసి సందో అర్థం చేసుకునేంత భావోద్వేగ స్థితిలో తాను లేనని, తీవ్ర మానసిక, మానసిక వేదన పడుతోంటే, నాలుగ్గోడల మధ్య పత్రాలపై సంతకం చేయమని బలవంతం చేశానంటూ షాకింగ్ వాదనలు చేశారు.ఏజీఎం ఆపాలని లేఖ, లేని పక్షంలో కేసు అవుతుందని హెచ్చరికతన దివంగత భర్త సురీందర్ కపూర్ ఎస్టేట్‌కు ఏకైక లబ్ధిదారురాల్ని తానేని, సోనా కామ్‌స్టార్‌తో సహా సోనా గ్రూప్‌లో మెజారిటీ వాటాదారుని రాణీ తన లేఖలో పేర్కొన్నారు. సంజయ్ కపూర్ తల్లిగా మాత్రమే కాకుండా, కపూర్ కుటుంబ అధిపతిగా, కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా తాను వ్రాస్తున్న ఈ లేఖను బోర్డు,వాటాదారులు నిర్లక్ష్యం చేస్తే కంపెనీ యొక్క దుర్వినియోగం నమ్మక ఉల్లంఘన కేసు అవుతుందని కూడా ఆమె స్పష్టం చేశారు.మరోవైపు AGM ఇప్పటికే ప్రారంభమైందని, సంజయ్ కపూర్ భార్య ప్రియా సచ్దేవ్ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి.కాగా పలు నివేదిక ప్రకారం, రూ. 39 వేల కోట్ల ఆస్తిని సంజయ్ కపూర్, అతని ఇద్దరు సోదరీమణులు, సూపర్నా మోట్వానే , మందిరా కపూర్ మధ్య విభజించే అవకాశం ఉంది. దీనిపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, సంజయ్ తన సోదరి మందిరాతో గత నాలుగేళ్లుగా వివాదం నడుస్తోంది. ఇది ఇలా ఉంటే సంజయ్మరణం తరువాత అతని మూడవ భార్య ప్రియా సచ్దేవ్ను కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా జెఫ్రీ మార్క్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు.

కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్, ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ (Anil Ambani) ఆస్తులపై ఈడీ దాడుల నేపథ్యంలో ఆయన ప్రేమ కథ మరోసారి వార్తల్లో నిలిచింది. 1991లో అప్పటి బాలీవుడ్ నటి టీనా మునిమ్‌ను (Tina Munim) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాహం వెనుక పెద్ద స్టోరీనే నడించిందట. మొదట్లో అనిల్, టీనా ప్రేమకథను అంబానీ కుటుంబం (Ambani family) అంగీకరించ లేదట. అవును.. వివరాలు తెలుసుకుందాం.కేవలం నటి అన్న కారణంగానే టీనాను ఇంటి కోడలిగా తెచ్చుకునేందుకు తమ చిన్న కొడుకు అనిల్ అంబానీ -టీనాను ప్రేమను తొలుత తల్లిదండ్రులు ధీరూభాయ్ , కోకిలాబెన్ అంబానీ వ్యతిరేకించారట. కానీ ఒపిగ్గా ఎదురు చూసి, తల్లిదండ్రులను ఒప్పించుకుని మరీ తమ ప్రేమను గెలిపించుకున్నారు అనిల్ అంబానీ -టీనా మునిమ్. అంతేకాదు అన్యోన్య దాంపత్యంతో తమ ప్రేమ అమరమని నిరూపించుకున్నారు. అనిల్ టీనాను తొలుత ఎక్కడ చూశాడంటే1983లో వార్టన్లో MBA పూర్తి చేసిన తర్వాత, అనిల్ మొదటిసారిగా టీనాను ఒక వివాహంలో తొలిసార చూశాడు. తొలి చూపులోనే ఆమెపై ప్రేమ చిగురించింది. సాంప్రదాయ హిందూ వివాహంలో బ్లాక్ సారీలో ప్రత్యేకంగా కనిపించిన టీనాను అనిల్‌ను దృష్టిని ఆకర్షించింది. కానీ అప్పుడు వారిద్దరూ మాట్లాడుకోలేదు. కానీ కొన్ని నెలల తర్వాత ఒక పరస్పర స్నేహితుడు వారిని ఫిలడెల్ఫియాలో పరిచయం చేశాడు.అపుడు టీనా పెద్దగా పట్టించుకోలేదు. కానీ 1986లో మరోసారి టీనా మేనల్లుడు ద్వారా అనిల్ టీనా కలయిక వీరి జీవితాలను మలుపు తిప్పింది. అనిల్ ప్రపోజల్ ప్లాన్, ముఖేష్ అంబానీ ఏం చేశారంటేఅనిల్ అంబానీ పెళ్లి ప్రపోజల్ ప్లాన్‌తో టీనా మునిమ్‌ను తన తల్లిదండ్రులు ధీరూభాయ్, కోకిలాబెన్ అంబానీలకు పరిచయం చేశాడు. ఈ సందర్బంలోనే ఆమెకు ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కానీ అనిల్ అలా బయటికి వెళ్లగానే అక్కడే వున్న సోదరుడు ముఖేష్ టీనాకు ఆ రహస్యాన్ని చెప్పడంతో ప్రపోజల్ ప్లాన్ చెడిపోయిందట. (Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!)అటు తమ చిన్న కుమారుడు ఒక నటితో ప్రేమలో ఉన్నాడని తెలిసి అంబానీ కుటుంబం ఆ సంబంధాన్ని వ్యతిరేకించింది. దీంతో అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ వేరే దారిలేక అనిల్ టీనా విడిపోవాల్సి వచ్చింది.టీనా ఇంటీరియర్ డిజైనర్ కోర్సు చేయడానికి అమెరికా వెళ్లిపోయింది. అనిల్‌తో సంబంధాలు దాదాపు కట్ అయిపోయాయి. ఇక్కడ అనిల్ మాత్రం ఎన్ని పెళ్లి సంబంధాలు తెచ్చినా, అన్నింటినీ తిరస్కరిస్తూ వచ్చాడు. అలా నాలుగేళ్లు గడిచిపోయాయి. అయితే లాస్ ఏంజిల్స్‌లో భూకంపం రావడంతో అనిల్ పరిగెత్తుకుంటూ ప్రియురాలికి దగ్గరికి వెళ్లిపోయాడు.చదవండి: జిమ్‌కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్‌లుక్ వైరల్ మరోవైపు టీనాను వివాహం చేసుకునేందుకు అనిల్ కుటుంబం ఎట్టకేలకు ఒప్పుకుంది. కానీ టీనా అనిల్‌ను పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న క్రమంలో అనిల్ గట్టిగా పట్టుబట్టడంతో ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న టీనా రెక్కలు కట్టుకుని మరీ ఇండియాలో వాలిపోయింది. అలా కుటుంబ ఆమోదంతో 1991, ఫిబ్రవరి 2న సాంప్రదాయ గుజరాతీ పద్ధతిలో వివాహం జరిగింది. ఇపుడు కోకిలాబెన్‌కు టీనా కూడా ఇష్టమైన కోడలు. తమ ప్రేమను గెలిపించుకునేందుకు అనిల్-టీనా చూపించిన ఓర్పు, పట్టుదల వారి అమర ప్రేమకు చిహ్నంగా నిలిచింది. అలా మూడు దశాబ్దాలకు పైగా అనిల్-టీనా వైవాహిక జీవితం కొనసాగుతోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, జై అన్మోల్ ,జై అన్షుల్ ఉన్నారు.

ఎవరీ లండన్ చాయ్‌వాలా.. ఏంటి ప్రత్యేకత?
ఇండియన్ కల్చర్‌లో టీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంటికి గెస్టులు ఎవరు వచ్చినా ముందుగా టీయిచ్చి మాటలు కలుపుతాం. మిత్రులు, సావాసగాళ్లతో చాయ్‌లు తాగుతూ చేసే చర్చలకు అంతే ఉండదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాయ్ పే చర్చ చాలా ఫేమస్ అయింది. తనను తాను చాయ్‌వాలాగా ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. పీఎం మోదీకి చాయ్ అందించి వైరల్ అయ్యాడో యువ చాయ్‌వాలా. అది కుడా లండన్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో. ఇద్దరు ప్రధానులకు చాయ్ పోసిన కుర్రాడి పేరు అఖిల్ పటేల్.భారత్, బ్రిటన్ దేశాల మధ్య గురువారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. ఈ సందర్భంగా లండన్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం అయిన చెకర్స్‌లో కీలక భేటీ జరిగింది. యూకే పీఎం కీర్ స్టార్మర్, ప్రధాని మోదీ కీలకాంశాలపై చర్చలు సాగించారు. పచ్చికలో ఏర్పాటు చేసిన ఒక టీ స్టాల్లో తాజాగా తయారు చేసిన భారతీయ మసాలా చాయ్‌ను ఇరువురు అగ్రనేతలు ఆస్వాదించారు. తర్వాత ఈ ఫొటోలను మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "చెకర్స్‌లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో 'చాయ్ పే చర్చా'... భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని రాశారు. View this post on Instagram A post shared by Amala Chai | Masala Chai (@amala_chai)మోదీ షేర్ చేసిన ఫొటోలో.. సాంప్రదాయ భారతీయ కుర్తాలో ఒక యువకుడు.. ఇద్దరు ప్రధానులకు చాయ్ సర్వ్ చేస్తునట్టు కనబడింది. ముఖ్యంగా టీస్టాల్ బ్యానర్‌పై రాసివున్న క్యాప్షన్ అందరినీ ఆకర్షించింది. "తాజాగా తయారుచేసిన మసాలా చాయ్. భారతదేశం నుంచి వచ్చించి, లండన్‌లో తయారైంది అని రాసుంది. ఇరువురు అగ్రనేతలకు చాయ్ అందించిన ఆ యువకుడి పేరు అఖిల్ పటేల్. అమలా చాయ్ పేరుతో యూకేలో ఆయన బిజినెస్ చేస్తున్నారు.‘Chai Pe Charcha’ with PM Keir Starmer at Chequers...brewing stronger India-UK ties! @Keir_Starmer pic.twitter.com/sY1OZFa6gL— Narendra Modi (@narendramodi) July 24, 2025 ఒక చాయ్‌వాలాకు మరో చాయ్‌వాలా..భారత్, బ్రిటన్ ప్రధానులకు చాయ్ అందించి అపరూప క్షణాలకు సంబంధించిన వీడియోను అఖిల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమలా చాయ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రీల్‌ను షేర్ చేశారు. కీర్ స్టార్మర్తో కలిసి మోదీ.. టీస్టాల్ వద్దకు రావడం.. మీరు ఇండియా రుచులను ఆస్వాదిస్తారు అంటూ స్టార్మర్తో మోదీ చెప్పడం వంటివి వీడియోలో ఉన్నాయి. "ఇందులో ఏలకులు, జాజికాయ, నల్ల మిరియాలు ఉన్నాయి" అని కప్పుల్లో టీ పోస్తూ పటేల్ చెప్పాడు. ప్రధాని మోదీకి టీ గ్లాస్ అందిస్తూ.. ఒక చాయ్‌వాలాకు మరో చాయ్‌వాలా (Chaiwala) టీ అందిస్తున్నాడు అనగానే.. మోదీ గట్టిగా నవ్వేశారు. కీర్ స్టార్మర్ చాయ్ తాగుతూ చాలా బాగుందని కితాబిచ్చారు. ఎవరీ అఖిల్ పటేల్?భారత మూలాలు కలిగిన అఖిల్ పటేల్.. 2019లో తన అమ్మమ్మ ప్రేరణతో అమలా చాయ్‌ను ప్రారంభించాడు. అతడి అమ్మమ్మ 50 ఏళ్ల క్రితం లండన్‌కు వలసవచ్చి స్థిరపడ్డారు. పటేల్ లింక్డ్ఇన్ బయో ప్రకారం.. అతడు లండన్‌లోని హాంప్స్టెడ్లోని యూనివర్సిటీ కాలేజ్ స్కూల్లో చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE) నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc), మేనేజ్మెంట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేశాడు.చదవండి: మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారు?చిన్నతనంలో తన అమ్మమ్మ పెట్టే మసాలా చాయ్ అంటే అఖిల్‌కు చాలా ఇష్టం. అయితే బయట తాగే చాయ్‌లలో ఇలాంటి రుచి లేదని గమనించాడు. తన అమ్మమ్మ ఫార్ములాతో బ్రిక్ లేన్ ప్రాంతంలో అమల చాయ్ పేరుతో టీస్టాల్ ప్రారంభించాడు. అస్సాం, కేరళ రైతుల నుంచి నేరుగా తేయాకులు, సుగంధ ద్రవ్యాలు తెప్పించుకుని వాటితోనే మాసాలా చాయ్ తయారు చేస్తాడు. అందుకే అమల చాయ్‌కు తక్కువ కాలంలోనే బాగా పేరొచ్చింది. తాజాగా ఇద్దరు ప్రధాన మంత్రులకు మసాలా చాయ్ అందించి ప్రపంచం దృష్టిలో పడ్డాడు అఖిల్ పటేల్.

క్రీడలలో ఎథిక్స్ & లీడర్షిప్ 7వ ప్రపంచ సదస్సులో శ్రీ శ్రీ రవిశంకర్ కీలకోపన్యాసం
వరల్డ్ ఫోరమ్ ఫర్ ఎథిక్స్ ఇన్ బిజినెస్ - WFEB (World Forum for Ethics in Business)నిర్వహించిన క్రీడలలో నైతికత, నాయకత్వంపై 7వ ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో శ్రీ శ్రీ రవిశంకర్ కీలకోపన్యాసం చేశారు.7వ వరల్డ్ సమ్మిట్ ఆన్ ఎథిక్స్ అండ్ లీడర్షిప్ ఇన్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో విలువలు రాజీపడితే విజయం నిజంగా కొనసాగుతుందా లేదా అనే దానిపైనా, తీవ్ర ఒత్తిడి ఉన్న ప్రపంచంలో సమగ్రతతో గెలవడానికి ఏమి అవసరమో అనే దానిపై ఆలోచనాత్మక ఆలోచనల మార్పిడిలో క్రీడలు, రాజకీయాలు, వ్యాపారం, విద్యాసంస్థలు, NGOలు , థింక్ ట్యాంక్‌ల నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురితో చర్చించింది.క్రీడలలో, మీరు గెలుస్తారు లేదా మీరు ఇతరులను గెలిపించుకుంటారు" అని రవిశంకర్ తన ముఖ్యోపన్యాసంలో పేర్కొన్నారు. ఈ రోజుల్లో యుద్ధాలు క్రీడలుగా, క్రీడలు యుద్ధాల్లా జరుగుతున్నాయని రవిశంకర్ వ్యాఖ్యానించారు. ఆటల్లో జయాపజయాలను రెండింటినీ స్వీకరించాలన్నారు. ఆట అనే చర్య ఆనందాన్ని తెస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మనం సహజంగానే క్రీడలలో నైతికంగా ఉంటాం ,లేదంటే క్రీడా రంగాలు హింసాత్మకంగా మారిపోతాయన్నారు.బిడ్డ నడవడం ప్రారంభించినంత సహజంగా క్రీడలుంటాయిని మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని పడవేస్తాయన్నారు. క్రీడలు ,సంగీతం ఉన్నప్పటికీ, ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది ఒంటరిగా, నిరాశ, అసంతృప్తులతో బాదపడుతున్నారని ఇది ఆలోచించాల్సిన విషయమని రవిశంకర్ గుర్తు చేశారు మనం మొత్తం జీవితాన్ని ఒక క్రీడగా తీసుకోగలిగితే, ప్రపంచంలో యుద్ధం ఉండదు, గుండెల్లో మంటలు ఉండవు, అపనమ్మకం ఉండదు అని గురుదేవ్ అన్నారు"ఫుట్‌బాల్ నాకు స్వేచ్ఛగా మారింది," అని ఫలస్తీనియన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు సహవ్యవస్థాపకురాలు హనీ తల్జీహ్ పంచుకున్నారు. "అది కేవలం ఆట కాదు, అది ఓ ప్రకటన. ఇది కదలడానికి, మాట్లాడడానికి, కలలు కనడానికి ఓ హక్కు.అడ్డంకులను ఛేదించడంలో , అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంలో క్రీడలు పోషించగల పాత్రను దృష్టిలో ఉంచుకుని, పాలస్తీనా మహిళా ఫుట్‌బాల్ జట్టు మొదటి కెప్టెన్ హనీ థాల్జీ ఇలా వ్యాఖ్యానించారుఈ మధ్య కాలంలో రికార్డులు నెలకొల్పడం, ఖ్యాతిని సాధించడం అనే లక్ష్యాల్లో నైతిక ఉల్లంఘనలు తీవ్రమైన అంశంగా మారాయి. వీటి వల్ల ప్రేక్షకుల విశ్వాసం దెబ్బతింటోంది. అదే సమయంలో, క్రీడాస్ఫూర్తి, క్రీడా నైపుణ్యం మరియు నైతికత ఒక ఆట యొక్క స్ఫూర్తిని ఎలా ఉద్ధరిస్తాయి, మొత్తం తరాన్ని ఏకం చేస్తాయి మరియు ప్రేరేపిస్తాయి అనేదానికి తగినంత ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.క్రీడలు శాంతిని నెలకొల్పడానికి ఒక సాధనంగా, లింగ సమానత్వం, మానసిక ఆరోగ్యం, గరిష్ట పనితీరు మరియు దీర్ఘాయువు మరియు క్రీడలలోనే కాకుండా జీవితంలో మరియు నాయకత్వంలో ఉత్తమంగా ఉండటానికి ఏమి అవసరమో అనే దానిపై సమ్మిట్‌లో ఆకర్షణీయమైన చర్చలు జరిగాయి. ఫెయిర్ ప్లే, టీమ్ స్పిరిట్ ,ఓర్పు వంటి రంగాల నుండి పాఠాలు రాజకీయాలు మరియు వ్యాపారంలో నైతిక నాయకత్వాన్ని ఎలా రూపొందిస్తాయో కూడా సదస్సులో చర్చకు వచ్చింది.ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన 17 ఏళ్ల కామ్య కార్తికేయన్; ఒలింపిక్ బంగారు పతక విజేత, 400 మీటర్ల హర్డిల్స్‌లో మాజీ ప్రపంచ రికార్డు హోల్డర్ కెవిన్ యంగ్; ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులైన స్వ్యటోస్లావ్ యురాష్; పాలస్తీనా ఫుట్‌బాల్ మార్గదర్శకుడు హనీ థాల్జీ; యూరో '96 ఛాంపియన్, టీవీ పర్సనాలిటీ థామస్ హెల్మెర్; ఆసియా క్రీడలలో స్వర్ణం గెలుచుకున్న భారతదేశపు తొలి మహిళా గుర్రపు స్వారీ దివ్యకృతి సింగ్ ఇతర ప్రముఖ వక్తలలో ఉన్నారు.క్రీడా స్ఫూర్తి మరియు నైతికతలో ఒక ప్రమాణాన్ని నిర్దేశించే ప్రదర్శనలను ఎథిక్స్ ఇన్ స్పోర్ట్స్ అవార్డులతో సత్కరించింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ జెర్డాన్ షకీరికి 'క్రీడ ద్వారా ఏకీకరణ, న్యాయబద్ధత, అంతర్ సాంస్కృతిక సంభాషణకు అతని దీర్ఘకాల నిబద్ధత' కోసం అత్యుత్తమ వ్యక్తిగత అవార్డును ప్రదానం చేశారు. క్రీడలలో మానసిక ఆరోగ్యానికి అత్యుత్తమ సహకారం మానసిక ఆరోగ్యం, క్రీడలో న్యాయబద్ధత , యువ మహిళా అథ్లెట్లకు మద్దతు కోసం ఆమె వాదనకు గాను ఎలైట్ స్విస్ రోవర్ జీనిన్ గ్మెలిన్కు లభించింది.ఐక్యరాజ్యసమితిలో ప్రత్యేక సంప్రదింపుల హోదా కలిగిన వరల్డ్ ఫోరం ఫర్ ఎథిక్స్ ఇన్ బిజినెస్, రెండు దశాబ్దాలకు పైగా నైతిక వాదనలో ముందంజలో ఉంది. శ్రీ శ్రీ రవిశంకర్ దార్శనికత ప్రకారం, విలువలు పనితీరు విరుద్ధమైనవి కావు.అవి విడదీయరాని మిత్రులు అనే సందేశాన్ని ప్రచారం చేయడానికి WFEB యూరోపియన్ పార్లమెంట్, FIFA, మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ మరియు జెనీవాలోని UN వంటి ప్రపంచ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉందని నిర్వాహకులు ప్రకటించారు.
ఫొటోలు
అంతర్జాతీయం

అంతా ఉత్తుత్తే.. మస్క్ మీద ప్రేమ ఒలకబోస్తున్న ట్రంప్
వాష్టింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టెస్లా సీఈవో,అపర కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘నాకు మస్క్ కావాలి. మస్క్‌తో కలిసి పనిచేయాలని ఉంది. మస్క్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే భారీ సబ్సిడీలు తీసేస్తానని అందరూ అంటున్నారు. ఇది నిజం కాదు! నేను మస్క్‌ను, అలాగే అమెరికాలోని అన్ని వ్యాపారాలను అద్భుతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’అని ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. తాజా, ట్రంప్ ట్వీట్‌తో గత కొంతకాలంగా ట్రంప్-మస్క్‌ల మధ్య కొసాగుతున్న మాటల యుద్ధానికి పులిస్టాప్ పెట్టినట్లైంది. ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్- మస్క్‌లు స్నేహితులు. కానీ బిగ్ బ్యూటీఫుల్ బిల్లుతో మిత్రలు కాస్తా బద్ద శత్రువుల్లా మారారు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లాంతా నాన్సెస్ అని మస్క్ అంటే.. మస్క్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం రాయితీలు ఇవ్వబోదని వార్నింగ్ ఇస్తూ కయ్యానికి కాలుదువ్వారు.అదిగో అప్పడే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ ప్రయోమం అందంటూ మస్క్ వరుస ట్వీట్లు, అమెరికాలో ప్రస్తుతం ఉన్న రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ది అమెరికా పార్టీ పేరుతో కొత్త పార్టీ అంటూ హడావిడి చేశారు. ఉన్నట్లుండి ఏమైందో ఏమో మస్క్ సైలెంట్ అయ్యారు.ఈ క్రమంలో ట్రంప్ కూడా ఓ మెట్టుదిగొచ్చాడు. ట్రూత్ పోస్టులో ఎలాన్ మస్క్ కంపెనీలపై సబ్సిడీలు తొలగిస్తానన్న ఆరోపణలను ఖండించారు. మస్క్ కంపెనీలతో పాటు అమెరికాను అభివృద్ధి చేస్తానంటూ ట్వీట్లో చెప్పడంతో వ్యాపార వర్గాల్లోనే కాదు రాజకీయాల్లో సైతం ఆసక్తికరంగా మారింది.

పత్రాలన్నీ వెంట ఉండాల్సిందే
వాషింగ్టన్: అసలు కంటే కొసరు పనే ముఖ్యమన్న తరహా లో అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎలాగూ వీసా నిబంధనలు, ఎయిర్‌పోర్ట్‌లో క్షుణ్ణంగా తనిఖీలు దాటుకొని అమెరికాలోకి అడుగుపెట్టినా దాదాపు ప్రతి ఒక్క అమెరికాయేతర వ్యక్తులంతా ఎక్కడ పడితే అక్కడ అధికారులు అడిగే అన్ని రకాల డాక్యుమెంట్లను చూపించాల్సిందేనని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్స్(సీబీపీ) విభాగం హెచ్చరికలు జారీచేసింది. గ్రీన్‌కార్డ్ సాధించిన వ్యక్తులు సహా అమెరికా పౌరసత్వం పొందని వారంతా నిరంతరం తమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను తమ వెంటేసుకుని తిరగాల్సిందేనని సీబీపీ పే ర్కొంది. అధికారులు అడిగినప్పుడు చూపించకపోతే జరిమానా ముప్పు తప్పదని, కొన్ని సార్లు అత్యల్పస్థాయి నేరాభియోగాలను సైతం ఎదుర్కో వాల్సిఉంటుందని సీబీపీ హెచ్చరించింది. 18 ఏళ్లు, ఆపైబడిన వారందరికీ ఇదే నియమం వర్తించనుంది. దీంతో విద్య, ఉద్యోగాల కోసం వచ్చే భారతీ యులు, వారి వెంట వచ్చే కుటుంబసభ్యులు, చిన్నారులకు కొత్త సమస్య వచ్చిపడింది. సినిమా, షాపింగ్, పార్క్, హోటల్, ఆస్పత్రి, రైల్వేస్టేషన్.. ఇలా ఎక్కడికి వెళ్లినా ముఖ్యమైన రిజిస్ట్రేషన్ పత్రా లు పట్టుకెళ్లడమంటే ఎంతో ఇబ్బందితో కూడిన వ్యవహారం. అక్రమంగా వలసవచ్చారని ఏ క్షణాన ఎవరిపై అనుమానం వచ్చినా వెంటనే అధికారులు సోదాలు, తనిఖీలుచేసేందుకు వీలుగా విదేశీయు లకు ఈ అడ్వైజరీని జారీచేసినట్లు సీబీపీ తెలిపింది.

భగ్గుమన్న సరిహద్దు వివాదం
బ్యాంకాక్: థాయ్‌లాండ్–కాంబోడియాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు వివాదం తీవ్రరూపం దాల్చింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల సైనికులు గురువారం ఉదయం తుపాకులు, ఫిరంగులు, రాకెట్లతో కాల్పులకు దిగారు. థాయ్‌లాండ్ వైమానిక దాడులను సైతం ప్రారంభించింది. ఈ ఘటనల్లో 12 మంది చనిపోయారు. వీరిలో 11 మంది పౌరులు కాగా, ఒక సైనికుడు ఉన్నారని థాయ్ తాత్కాలిక ప్రధాని ఫుంథమ్ వెచాయచై తెలిపారు. మరో నలుగురు సైనికులు 25 మంది వరకు పౌరులు గాయపడ్డారన్నారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను కాంబోడియా విడుదల చేయలేదు. ఘర్షణల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులు భయంతో ఇళ్లను వదిలి పారిపోతున్నట్లు తెలిపే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. సరిహద్దుల్లోని కనీసం ఆరు ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నట్లు థాయ్ రక్షణ శాఖ తెలిపింది. ఏం జరిగిందంటే..ప్రాచీన ‘ట మ్యుయెన్ థోమ్’ఆలయం సమీపంలోనే గురువారం ఉదయం ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ మొదటగా మొదలైంది. ఘర్షణకు కారణం మీరంటే మీరేనని ఎవరికి వారు ఆరోపణలు సంధించుకుంటున్నారు. సరిహద్దుల్లోని తమ సైనిక స్థావరాలకు సమీపంలో డ్రోన్ కనిపించగా కొద్దిసేపటికే ఆరుగురు కాంబోడియా సైనికులు దూసుకొచ్చారని, ఘర్షణను నివారించేందుకు ప్రయత్నిస్తుండగానే వారు కాల్పులకు దిగారని థాయ్ ఆర్మీ తెలిపింది. ఆస్పత్రిపైనా కాంబోడియా దాడులు చేసిందని ఆరోపించింది. అందుకే, తాము సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేపట్టినట్లు అనంతరం ప్రకటించింది. తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే ఆత్మ రక్షణ చర్యలను తీవ్రతరం చేస్తామని థాయ్ ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, థాయ్ సైన్యం తమ ప్రాంతంలోకి ముందుగా డ్రోన్‌ను పంపించిందని, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని కాంబోడియా ఆర్మీ పేర్కొంది. పురాతన ప్రియా విహియార్ ఆలయంలోని రహదారిపై థాయ్ జెట్ విమానాలు బాంబులు విసిరాయని ఆరోపించింది. థాయ్ దురాక్రమణను వెంటనే నిలిపివేసేందుకు భద్రతా మండలిని సమావేశపర్చాలని కాంబోడియా ప్రధాని హున్ మనెత్ ఐరాసకు తాజాగా లేఖ రాశారు.పేలిన మందుపాతరబుధవారం వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో మందుపాతర పేలి థాయ్‌లాండ్ సైనికుడొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో థాయ్ ప్రభుత్వం కాంబోడియా రాయబారిని బహిష్కరించడంతోపాటు ఆ దేశంలోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది. కాంబోడియాతో గల ఈశాన్య సరిహద్దు క్రాసింగ్‌లన్నిటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తమ పౌరులను కాంబోడియా వీడాలని కోరింది. ప్రతిగా కాంబోడియా సైతం థాయ్‌తో దౌత్య సంబంధాలను కనీస స్థాయికి తగ్గించుకుంటున్నట్లు తెలిపింది. బ్యాంకాక్‌లోని తమ దౌత్య సిబ్బంది మొత్తాన్ని వెనక్కి పిలిపించుకుంది. థాయ్‌లాండ్ దౌత్య సిబ్బంది మొత్తం తమ దేశం విడిచివెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. తమ ఉబోన్ రట్చంథని ప్రావిన్స్‌లో బుధవారం మందుపాతర పేలి ఐదుగురు గాయపడినట్లు థాయ్‌లాండ్ ప్రభుత్వం తెలపగా తమ ప్రియా విహియార్ ప్రాంతంలో ఈ పేలుడు చోటుచేసుకుందని కాంబోడియా అంటోంది.వెయ్యేళ్ల ఆలయమే కేంద్రంగాభారతదేశాన్ని పాలించిన గుప్తులు, పల్లవ చక్రవర్తుల ప్రాబల్యం అప్పట్లో థాయ్‌లాండ్, కాంబోడియాల దాకా విస్తరించింది. పల్లవుల కాలంలో 11వ శతాబ్దంలో ఖ్మెర్ రాజులు నిర్మించిన మూడు హిందూ ఆలయాలున్నాయి. ఈ ఆలయా ల్లో శివలింగం, సంస్కృత లిపిలో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి. ఇక్కడి ప్రసత్తా మ్యుయెన్ థోమ్ అనే శివాల యా న్ని 11వ శతాబ్దంలో ఉదయాదిత్యవర్మన్–2 అనే రాజు నిర్మించాడు. దాంగ్రెక్ పర్వతాల్లో పురాతన ఖ్మెర్ హైవేను కాంబోడి యాలోని అంగ్కోర్ను థాయ్‌లాండ్‌లోని ఫిమయితో కలిపే మార్గంలో ఈ ఆలయం ఉంది. దీని ప్రకారం ఖ్మెర్ సామాజ్య సరిహద్దులపై తమకే హక్కుందని కాంబోడియా అంటుండగా, థాయ్‌లాండ్ అంగీకరించట్లేదు. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాలు రెండు దేశాల మధ్య వివాదంతో మరోసారి తెరపైకి వచ్చాయి. ఫ్రాన్స్ ఇచ్చిన మ్యాప్‌తో వివాదంథాయ్లాండ్లోని సురిన్ ప్రావిన్స్, కాంబోడియా లోని ఒద్దార్ మియాంచే ప్రావిన్స్‌ల పొడవునా ఉన్న వెయ్యేళ్లనాటి ప్రాచీన శివాలయం ‘టమ్యుయెన్ థోమ్’ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. థాయ్‌లాండ్, కాంబోడియాలు గతంలో ఫ్రాన్స్ వలస పాలనలో ఉన్నాయి. ఆ సమయంలో 1907లో రెండు దేశాల సరిహద్దులను విభజిస్తూ ఫ్రాన్స్ ఒక మ్యాప్‌ను రూపొందించింది. ఈ మ్యాప్‌లో పేర్కొన్న భూ భాగం తమదేనని కాంబోడియా అంటుండగా, థాయ్‌లాండ్ అది అస్పష్టంగా ఉందని వాదిస్తోంది. దీనిపై కాంబోడియా అంతర్జాతీయ న్యాయ స్థానానికి వెళ్లగా 1962లో అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో అప్పటి నుంచీ తరచూ చోటుచేసుకుంటున్న సైనిక ఘర్షణల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాంబోడియా 2011లో మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం 2013లో మరోసారి కాంబోడియాకే ఆ దేవాలయ ప్రాంతంపై హక్కుందంటూ మరోసారి ప్రకటించింది. థాయ్‌లాండ్ మాత్రం ఈ తీర్పును అంగీకరించడంలేదు.

ఇక స్వేచ్ఛా వాణిజ్యం
లండన్: భారత్, బ్రిటన్ సంబంధాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. పరస్పర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెండు రెట్లు పెంచుకోవాలని వ్యూహాత్మక భాగస్వామ్యపక్షాలైన భారత్, యూకే నిర్ణయించుకున్నాయి. అమెరికా వాణిజ్య విధానాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి. భారత ప్రధాని మోదీ గురువారం లండన్‌లో యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘యూకే–ఇండియా విజన్ 2035’ రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. అధికారికంగా సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)గా పిలుస్తున్న డీల్‌పై మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, బ్రిటిష్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల భారత్, యూకే మధ్య వాణిజ్యం ఏటా 34 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తు న్నారు. ఎఫ్‌టీఏపై సంతకాలు జరగడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారత్, యూకే సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక దినమని అభివరి్ణంచారు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్లు తెలిపారు. కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. యూరోపియన్ యూనియన్(ఈయూ) తా ము బయటకు వచి్చన అనంతరం కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగానే.. కీర్ స్టార్మర్తో చర్చల అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు యూకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, యూకే ఐక్యంగా పనిచేస్తున్నాయని చెప్పా రు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్నారు. భారత్‌కు ఎనలేని మేలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్‌కు ఎనలేని మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమకు బ్రిటిష్ మార్కెట్లో నూతన అవకాశాలు లభిస్తాయన్నారు. భారతీయ యువత, రైతులు, మత్స్యకారులతోపాటు సూక్ష్మ, చిన్న, మ ధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) లబ్ధి చేకూరుతుందని స్పష్టంచేశారు. భారతీయ వ్రస్తాలు, పాదరక్షలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, సముద్ర ఆహారం, ఇంజనీరింగ్ వస్తువులకు యూకే మార్కెట్లోకి ప్రవేశం లభిస్తుందన్నారు. ‘విజన్–2030’ రోడ్‌మ్యాప్‌పై ఇండియా, యూకే అంకితభావంతో ముందుకెళ్తున్నాయని ఉద్ఘాటించారు.మోదీకి స్టార్మర్ విందు యూకే పర్యటన కోసం బుధవారం రాత్రి లండన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచి్చన ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలికారు. లండన్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని తన నివాసంలో గురువారం మోదీకి బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్, యూకే కలిసికట్టుగా పనిచేస్తాయని స్టార్మర్ అన్నారు. రెండు దేశాలు సహజ భాగస్వామ్య పక్షాలు అని మోదీ చెప్పారు. చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాయని తెలిపారు. డబుల్ కంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్(డీసీసీ)పై ఏకాభిప్రాయానికి వచ్చామని వెల్లడించారు. రెండు దేశాల్లో టెక్నాలజీ, ఫైనాన్స్‌తోపాటు సేవల రంగానికి మేలు జరుగుతుందన్నారు. సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. భారత్–యూకే సంబంధాలపై మోదీ క్రికెట్ పరిభాషలో వివరణ ఇచ్చారు. కొన్నిసార్లు స్వింగ్ అండ్ మిస్ ఉండొచ్చని, అయినప్పటికీ ఎప్పటికీ స్ట్రెయిట్ బ్యాట్‌తో ఆడుతూనే ఉంటామన్నారు. హైస్కోరింగ్తోపాటు బలమైన భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టంచేశారు. మోదీ, స్టార్మర్ ‘బకింగ్హమ్ స్ట్రీట్ క్రికెట్ క్లబ్’ క్రీడాకారులతో సంభాíÙంచారు. ఒప్పందంతో లాభమేంటి? వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది అమల్లోకి వస్తే జరిగేది ఏమిటంటే.. → బ్రిటిష్ ఉత్పత్తులపై ఇండియాలో సగటు సుంకాలు 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గిపోతాయి. → బ్రిటన్ నుంచి విస్కీ, చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింకులు, కాస్మెటిక్స్, కార్లు, వైద్య పరికరాలు భారత మార్కెట్లోకి విస్తృతంగా ప్రవేశిస్తాయి. → బ్రిటిష్ విస్కీపై ప్రస్తుతం విధిస్తున్న 150 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం 75 శాతానికి తగ్గిస్తుంది. రాబోయే పదేళ్లలో 40 శాతానికి తగిస్తుంది. అంటే బ్రిటిష్ విస్కీ ఇండియాలో చౌకగా లభిస్తుంది. → భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను యూకే సర్కార్ సగానికి తగ్గిస్తుంది. వ్రస్తాలు, పాదరక్షలు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిపోతాయి. → ప్రధానంగా భారతీయ రైతులకు భారీ లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులపై యూకేలో టారిఫ్‌లు దాదాపు 95 శాతం తగ్గుతాయి. జర్మనీ, నెదర్లాండ్స్‌తోపాటు ఈయూ రైతులతో సమానంగా, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే భారతీయ రైతులు లాభపడతారు. ఇండియా నుంచి దిగుమతి అయ్యే తేయాకు, పండ్లు, కూరగాయలు, మసాలా పొడులు, తృణధాన్యాలు, పచ్చళ్లు, రెడీ–టు–ఈట్ ఆహారం, పండ్ల గుజ్జుతోపాటు శుద్ధి చేసిన ఆహారంపై టారిఫ్‌లు సున్నాకు పడిపోతాయి. → మత్స్య, సముద్ర ఉత్పత్తులపై సుంకాలను 99 శాతం తగ్గించబోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడులో చేపలు, రొయ్యల పెంపకం చేస్తున్న రైతులకు లాభమే. → ఇండియా నుంచి యూకేకు దిగుమతి అయ్యే స్మార్ట్ఫోన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇన్వర్టర్లపై ఎలాంటి టారిఫ్ ఉండదు. → దేశీయ మద్యం ఉత్పత్తులు, పానీయాలు యూకే మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. సంప్రదాయ గోవా ఫెనీ, నాసిక్ వైన్స్, కేరళ కల్లు ఇందులో ఉన్నాయి. → ఎఫ్టీఏతో రానున్న మూడేళ్లలో ఇండియా నుంచి యూకేకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 20 శాతానికి పైగా పెరుగుతాయని అంచనా. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. → దేశీయ రైతులు, పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని పాడి ఉత్పత్తులు, వంట నూనెలు, యాపిల్స్‌ను ఎఫ్‌టీఏ నుంచి భారత ప్రభుత్వం మినహాయించింది. బ్రిటన్ నుంచి వచ్చే ఈ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఉండబోదు. మీరు ఆంగ్ల పదాలు వాడొచ్చు ఎఫ్‌టీఏపై సంతకాల తర్వాత మోదీ, స్టార్మర్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టార్మర్ స్పీచ్‌ను హిందీలోకి అనువాదం చేస్తున్న దుబాసీ కొంత ఇబ్బందిపడ్డారు. ఆయనకు అప్పటికప్పుడు సరైన హిందీ పదాలు తగల్లేదు. అది గమనించిన మోదీ ‘‘ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మీరు మధ్యలో ఆంగ్ల పదాలు వాడొచ్చు. దాని గురించి చింతించకండి’’ అని సూచించారు. దుబాసీ క్షమాపణ కోరగా, ఫర్వాలేదని మోదీ అన్నారు. ఇదంతా చూసిన స్టార్మర్ చిరునవ్వు చిందించారు.
జాతీయం

వీసాల ఆలస్యాన్ని పట్టించుకోండి
న్యూఢిల్లీ: అమెరికా విద్యార్థి వీసాల జారీలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని ఆ దేశ ఉన్నతాధికార వర్గాల దృష్టికి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. కొంతకాలంగా విద్యార్థి వీసా దరఖాస్తుల స్క్రీనింగ్ తదితరాలను అమెరికా కఠినతరం చేయడం తెలిసిందే. దాంతో వీసా అపాయింట్మెంట్లు పొందడమే విద్యార్థులకు చాలా కష్టంగా మారిపోయింది. ఫలితంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ అమెరికా విదేశాంగ శాఖ వర్గాలతో, ఢిల్లీలోని ఆ దేశ దౌత్య కార్యాలయంతో దీనిపై లోతుగా చర్చించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌సింగ్ ఈ మేరకు వెల్లడించారు. భారత విద్యార్థుల ఆందోళనలను ఎప్పటికప్పుడు అమెరికా దృష్టికి తీసుకెళ్తున్నట్టు ఆయన వివరించారు. శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత సమాధానమిచ్చారు. అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించేవారు తదితరులను దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు అన్నిరకాల చర్యలూ తీకుంటున్నట్టు జూన్ 18న విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసిందని మంత్రి గుర్తు చేశారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి వీసాల జారీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి 14 మంది భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యుల బృందం కూడా కృషి చేస్తోంది. దెబోరా రాస్ వీరికి నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారత విద్యార్థుల వాటా ఏటా 900 కోట్ల డాలర్ల మేరకు ఉంటుందని ఆమె అన్నారు. అంతేగాక పరిశోధనలు, ఇన్నొవేషన్లలో వారిది కీలక పాత్ర గుర్తు చేశారు. కొత్త వీసాల జారీని ఆపేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్లన్నింటినీ ట్రంప్ సర్కారు గత మేలో ఆదేశించడం తెలిసిందే. రెండు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు విద్యార్థి వీసాల ప్రాసెసింగ్ గత నెల మొదలైంది. కొత్త నిర్దేశకాల ప్రకారం వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ కార్యకలాపాలు, సోషల్ మీడియా ఖాతాల తనిఖీ (వెట్టింగ్)ను అమెరికా పెద్ద ఎత్తున చేపట్టింది. ఇందుకు వీలుగా సోషల్ ఖాతాల వివరాలను పబ్లిగ్గా అందుబాటులో ఉంచాల్సిందిగా ఆశావహులందరికీ సూచించింది.అక్రమ వలసలపై... అమెరికాలోకి అక్రమ వలసలు, మనుషుల అక్రమ రవాణా కట్టడిలో ఆ దేశ ప్రభుత్వంతో నిరంతరం టచ్‌లో ఉన్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభకు వివరించారు. వాటికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ–మైగ్రేట్ పోర్టల్, సోషల్ మీడియా హ్యాండిళ్లు తదితరాల ద్వారా ఈ విషయంలో విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అడ్వైజరీలు జారీ చేస్తున్నట్టు చెప్పారు.

జువెనైల్ జస్టిస్ బోర్డుకు వెళ్లండి..!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తాజాగా ఓ అరుదైన కేసును విచారించింది. ఈ కేసులో నిందితుడు 1988లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష సైతం అనుభవించాడు. 2024లో ఇందుకు సంబంధించి దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలిపివేసింది. నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. నేరానికి పాల్పడినట్లు చెబుతున్న సమయంలో తన వయస్సు 16 ఏళ్లేనంటూ రుజువులు చూపాడు. దీంతో, అతడిని తిరిగి జువెనైల్ జస్టిస్ బోర్డుకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించడం గమనార్హం. రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి 1988లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విచారించిన కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అతడు రాజస్తాన్ హైకోర్టులో సవాల్ చేయగా శిక్షను నిలుపుదల చేస్తూ 2024లో ఆదేశాలిచ్చింది. అనంతరం నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఘటన జరిగిన సమయంలో తన వయస్సు 16 ఏళ్లు మాత్రమేనంటూ అతడు స్కూలు రికార్డులను రుజువులుగా చూపాడు. 1972 జూలై ఒకటో తేదీ పుట్టిన తేదీ అయినందున నేరానికి పాల్పడినప్పటికి తనింకా మైనర్‌నే అంటూ వాదించాడు. ఈ నెల 23న కేసు విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ మసీహ్‌ల ధర్మాసనం..వైద్య పరీక్షలు, బాధితురాలు, సాకు‡్ష్యల వాంగ్మూలాలు సరిగ్గానే ఉన్నాయని పేర్కొంది. అయితే, నిందితుడు అందజేసిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అతడు మైనరేనని నిర్థారణయిందని పేర్కొంది. ఇన్నేళ్ల తర్వాత అతడిని మైనర్‌గా పేర్కొనడం సరికాంటూ రాజస్తాన్ ప్రభుత్వ న్యాయవాది వాదించగా చట్ట ప్రకారం సరైందేనని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో తగు ఆదేశాల కోసం అజ్మీర్‌లోని జువెనైల్ జస్టిస్ బోర్డును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. నిబంధనల ప్రకారం జువెనైల్ జస్టిస్ బోర్డు దోషిని గరిష్టంగా మూడేళ్లపాటు ప్రత్యేక షెల్టర్‌కు పంపించే అవకాశముంది.జువెనైల్ జస్టిస్ చట్టం ఏం చెబుతోంది? జువెనైల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్)చట్టం–2015 ప్రకారం నేరం జరిగినప్పటికి ఆ వ్యక్తి వయస్సు 18 ఏళ్లు లోపు ఉండాలి. ఈ కేసుల్లో నిందితులను జువెనైల్ జస్టిస్ బోర్డులే విచారించాలి. సాధారణ కోర్టులు కాదు. వీరికి జీవిత కారాగారం, మరణ శిక్ష వంటివి విధించరాదు. ఈ చట్టంలోని సెక్షన్ 18ని అనుసరించి దోషులుగా తేలిన వారిని కౌన్సెలింగ్ చేయడం లేదా గరిష్టంగా మూడేళ్లపాటు జువెనైల్ హోంలో ఉంచడం వంటి చర్యలు చేపట్టవచ్చు. అయితే, నేరం జరిగిన సమయంలో అమల్లో ఉన్న జువెనైల్ జస్టిస్ చట్టం–1986ను అనుసరించి 16 ఏళ్లలోపు వారిని బాలురనీ, బాలికలైతే 18 ఏళ్లుగా నిర్వచించారు. 2015 చట్టం ప్రకారం సుప్రీంకోర్టు బాలబాలికల వయస్సును సమానంగా 18 ఏళ్లుగా నిర్ణయించింది. నిందితుడి ప్రస్తుత వయస్సు, గడిచిన సమయంతో సంబంధం లేకుండా బాల నేరస్థుల వాదనలు చెల్లుబాటు అవుతాయని తాజా కేసు తెలియజేస్తోంది. తీవ్రమైన నేరాల కేసుల్లో సైతం బాల నేరస్తులను భిన్నంగా చూడాలనే సూత్రానికి ఇది బలం చేకూరుస్తోంది.

జీఎస్టీ అమల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీలను మరింత లోతుగా స్రూ్కటినీ చేస్తూ, వాటి ఆధారంగా జీఎస్టీని దూకుడుగా అమలు చేస్తే మొదటికే మోసం రావొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో హెచ్చరించింది. దీనివల్ల చిన్న వ్యాపారులు తిరిగి నగదు లావాదేవీల వైపు వెళ్లిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలా జరగకుండా జీఎస్టీ అమలు విషయంలో జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని నివేదిక సూచించింది. యూపీఐ చెల్లింపుల ఆధారంగా జీఎస్టీ నోటీసులు వస్తుండటంతో, కర్ణాటకలోని చిన్న వ్యాపారులు మళ్లీ నగదు లావాదేవీల వైపే మొగ్గు చూపుతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. పరోక్ష పన్నుల విధానం వల్ల జవాబుదారీతనం, ఆదాయం మరింతగా పెరిగినప్పటికీ, చిన్న ట్రేడర్లపై జరిమానాలు వేయకుండా, వారికి సాధికారత కల్పించినప్పుడే దీర్ఘకాలంలో ఇది విజయవంతం అవుతుందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. యూపీఐలాంటి డిజిటల్ లావాదేవీల ఆధారంగా బెంగళూరులోని పలువురు చిన్న ట్రేడర్లు, దుకాణదారులకు అసంబద్ధ స్థాయిలో ట్యాక్స్ నోటీసులు రావడాన్ని తన నివేదికలో ప్రస్తావించింది. ఈ అంశంపై కర్ణాటకలోని చిన్న వ్యాపారులు జూలై 23 నుంచి మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలను తలపెట్టారు. టాప్ 5 రాష్ట్రాల వాటా 50 శాతం.. జీఎస్టీ అమలు, మొత్తం చెల్లింపుదారుల్లో టాప్ 5 రాష్ట్రాల వాటా సుమారు 50 శాతంగా ఉంటోందని నివేదిక పేర్కొంది. చెల్లింపుదారుల్లో మహిళల వాటా (ప్రతి అయిదుగురిలో ఒకరు) పెరుగుతోందని వివరించింది. ప్రస్తుతం 1.52 కోట్ల పైగా గూడ్స్, సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలాంటి రాష్ట్రాలు పెద్దవి, సంపన్నమైనవి అయినప్పటికీ, మొత్తం జీఎస్డీపీలో ఆయా రాష్ట్రాల వాటాతో పోలిస్తే క్రియాశీలక జీఎస్టీ ట్యాక్స్‌పేయర్ల వాటా తక్కువగానే ఉంటోంది. అదే సమయంలో మొత్తం జీఎస్డీపీలో ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, గుజరాత్ల వాటా తక్కువే అయినప్పటికీ మొత్తం జీఎస్టీ ట్యాక్స్‌పేయర్లలో ఆయా రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉంటోంది.

లోక్‌సభలోనే అభిశంసన చర్యలు
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానాన్ని మాత్రమే లోక్‌సభలో చర్చకు స్వీకరించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఆ తర్వాత ఆయనపై విచారణ కోసం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తారని తెలిపాయి. జస్టిస్ వర్మ అవినీతికి పాల్పడినట్లు కమిటీ విచారణలో తేలితే అభిశంసన ప్రక్రియ ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. జస్టిస్ వర్మ అభిశంసన కోసం రాజ్యసభలో ఇప్పటికే విపక్ష ‘ఇండియా’ కూటమి ఒక తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానాన్ని అప్పటి ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ స్వీకరించడం వివాదాస్పదంగా మారింది. చివరకు అదే ఆయన పదవికి ఎసరుపెట్టింది. రాజ్యసభలో ప్రతిపక్షాల తీర్మానాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టబోతున్నట్లు తెలిసింది. జస్టిస్ వర్మ విషయంలో తామే పైచేయి సాధించాలని అధికార బీజేపీ నిర్ణయించుకుంది. ఆయనను పార్లమెంట్లో అభిశంసించడం ద్వారా న్యాయ వ్యవస్థలో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమన్న సంకేతాలను ఇవ్వదలిచింది. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ కంటే పార్లమెంటే అత్యున్నతం అని తేల్చిచెప్పాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.
ఎన్ఆర్ఐ

అమెరికా నాసా ఎన్ఎస్ఎస్ ఐఎస్డీసిలో సత్తా చాటిన విద్యార్థులు
బంజారాహిల్స్: అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్‌డీఎస్ కాన్ఫరెన్స్‌లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో నాసా ఏర్పాటు చేసిన ఐఎస్‌డీఎస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి 475 మంది విద్యార్థులు హాజరైతే అందులో 67 మంది భారత దేశం నుంచి పాల్గొనగా 45 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉండటం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు. అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని తాము వరల్డ్ నెం1.గా నిలిచామని తెలిపారు. వీటిలో వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ 3 ప్రాజెక్టులు, వరల్డ్ సెకండ్ ప్రైజ్ 4 ప్రాజెక్టులు, వరల్డ్‌లో మూడో ప్రైజ్ కింద 10 ప్రాజెక్టులు గెలుచు కోవడంతో పాటు 43 ప్రాజెక్టులకు హానరబుల్ మెన్షన్స్ సాధించాయని తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి మరే ఏ ఇతర పాఠశాల నుంచి విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనలేదన్నారు.ఈ కాన్ఫరెన్స్‌లో ఆర్టిస్టిక్ కేటగరిలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీం తమదేనని ఆమె వెల్లడించారు.

అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో నాట్స్ సేవా కార్యక్రమాలు
డాలస్, టెక్సాస్ : భాషే రమ్యం .. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేలా అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో కార్యక్రమాన్నిచేపట్టి వీధులను శుభ్రం చేసింది. ఫ్రిస్కో నగరంలో ఫీల్డ్స్ పార్క్‌వేలో చెత్తను తీసేసి.. అక్కడ వీధిని శుభ్ర పరిచింది. దాదాపు 20 మందికి పైగా తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరిలో అవగాహన పెంచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25 పౌండ్లకు పైగా చెత్తను సేకరించి ఆ వీధిని బాగుచేసింది. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించే లక్ష్యాలు నెరవేరుతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులకు సామాజిక బాధ్యతను నేర్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకీ , పెద్దలకీ మరియు మద్దతు అందించిన దాతలకు నాట్స్ డాలస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ. శ్రావణ్ నిడిగంటిలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర , మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె,డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న, వంశీ వేనాటి, కిరణ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఈ తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డాలస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.

పేద పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు నాట్స్ ముందడుగు
డాలస్, టెక్సాస్: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. ఆకలితో ఆలమటిస్తున్న పేద పిల్లలకు పోషకాహారం అందించేందుకు రంగంలోకి దిగింది. తాజాగా నాట్స్ డాలస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్లు కలిసి పేద పిల్లలకు ఆహారం అందించేందుకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధం చేశాయి. రిచర్డ్సన్ నగరంలో దాదాపు 20 మంది తెలుగు యువతీ, యువకులు, పెద్దలు.. 133 బాక్సుల పౌష్టికాహారాన్ని ప్యాక్ చేశారు. ఇందులో 28,728 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 78 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించేలా ఫుడ్ ప్యాకింగ్ చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల మార్గదర్శకత్వంలో పలువురు నాట్స్ యువ వాలంటీర్లు కుటుంబ సమేతంగా పాల్గొని వేల సంఖ్యలో ఆహార కిట్లను సిద్ధం చేశారు నాట్స్ డాలస్ చాప్టర్ యువతను ప్రోత్సహిస్తూ, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలా పేద పిల్లలకు పౌష్టికాహారం సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని బాపు నూతి అన్నారు. సేవా కార్యక్రమాల్లో విద్యార్ధులను భాగస్వామ్యులను చేయటం చాలా సంతోషంగా ఉందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని రాజేంద్ర మాదల అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని నున్న, సౌజన్య రావెళ్ల డాలస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహకోశాధికారి రవి తాండ్ర, మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న తదితరులు పాల్గొన్నారు. డాలస్ చాప్టర్ టీం, నాట్స్ సలహాదారు బృందం సభ్యుల సహకారంతో ఇంత మంచి సేవా కార్యక్రమం చేపట్టినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి నాట్స్ డాలస్ విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై నాట్స్ సంతాపం
ప్రముఖ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 750 సినిమాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన కోట తెలుగు వారి మనస్సుల్లో చెరిగి పోని ముద్ర వేశారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. తండ్రిగా, తాతగా, కామెడీ విలన్‌గా, పోలీసుగా, మాంత్రికుడిగా ఎన్నో పాత్రలను పోషించిన కోటను తెలుగు వారు ఎన్నటికి మరిచిపోలేరని ఓ ప్రకటనలో తెలిపారు. కోట మృతి పట్ల నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చింది. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.కాగా ‘కోట’గా పాపులర్ అయిన నటుడు కోట శ్రీనివాసరావు (83) జూలై 13 తెల్లవారుజామున హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో కన్నుమూసారు. 83వ పుట్టినరోజు జరుపుకున్న కేవలం మూడు రోజులకే ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక శకం ముగిసింది అంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
క్రైమ్

పాదపూజ చేసినా.. కనికరించని భర్త
దొడ్డబళ్లాపురం: వివాహిత అనుమానాద స్థితిలో మృతి చెందిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా అంచెపాళ్యలో చోటుచేసుకుంది. అంచెపాళ్యలలో అభిషేక్, స్పందన(24) దంపతులు నివాసం ఉంటున్నారు. కాలేజీకి వెళ్లే సమయంలో స్పందన అభిషేక్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం అభిషేక్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. కట్నం కోసం స్పందనను వేధించేవారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన బాధలు చెప్పుకుని ఏడ్చేది. ఇటీవల ఇరు వైపుల పెద్దలు మాట్లాడి రూ.5 లక్షలు ఇప్పించారు. గురువారం భీమన అమావాస్య నేపథ్యంలో భర్తకు పాదపూజ చేసిన స్పందన శుక్రవారం ఉదయం విగతజీవిగా మారింది. స్పందన మృతి చెందినట్లు తల్లితండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు వచ్చి బోరున విలపించారు. అయితే స్పందనను అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ హత్య చేశారని మృతురాలి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

కుప్పం: వివాహితుడి ప్రేమతో మోసపోయి..
కుప్పం: ప్రియుడు మోసం చేశాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ అతని ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కుప్పం మండలం, మార్వాడకు చెందిన వెంకటేష్ కుమారుడు వాసు ఓ ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ మెన్‌గా పనిచేస్తున్నారు. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో కడప పట్టణం, వూటుకూరు ప్రాంతానికి చెందిన ప్రశాంతితో పరిచయం ఏర్పడింది. ఈమె వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో మహిళా సెక్యూరిటీ కానిస్టేబుల్. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే.. అప్పటికే వాసుకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని అతను ప్రశాంతికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వాసు పనిచేస్తున్న ఫైనాన్స్‌లో గొడవలు రావడంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో ఆరు నెలల క్రితం ప్రొద్దుటూరు వదిలి వాసు స్వగ్రామానికి వచ్చేశాడు. అప్పటి నుంచి ప్రశాంతితో మాట్లాడడం తగ్గించేశాడు. అతనిపై అనుమానంతో గురువారం ఆమె మార్వాడ గ్రామానికి వచ్చి విచారించడంతో అసలు విషయం బయటపడింది. అప్పటికే భార్యాబిడ్డలతో కలిసి ఉన్న వాసును చూసి తట్టుకోలేకపోయింది. ప్రియుడి ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ప్రశాంతిని కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు. కాలిన గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలొదిలింది. ప్రేమ ముసుగులో మోసం చేసిన ప్రియుడు వాసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
తల్లి ఏమరపాటు ఆ పసిబిడ్డ ప్రాణం తీసింది. హడావిడిలో.. కిటికీని ఆనుకుని ఉన్న చెప్పుల స్టాండ్ మీద మూడున్నరేళ్ల చిన్నారిని కూర్చోబెట్టింది. అయితే ఆ చిన్నారి వెనక్కి దొర్లడంతో.. 12వ అంతస్తు నుంచి కిందపడి మరణించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరింది.ముంబైలోని నియగావ్ నవకర్ సిటీలో బుధవారం సాయంత్రం ఘోరం జరిగిపోయింది. అన్వికా ప్రజాప్రతి అనే చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్మెంట్ 12వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం 8గం. సమయంలో బయటకు వెళ్లేందుకు అన్వికా, ఆమె తల్లి వచ్చారు. తన బిడ్డ బయట తిరుగుతున్న విషయం గమనించిన తల్లి..ఆమె దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో చిన్నారిని షూ ర్యాక్ మీద కూర్చోబెట్టింది. అయితే చిన్నారి నిల్చుని ఒక్కసారిగా కూర్చునేందుకు ప్రయత్నించి.. వెనక్కి పడిపోయింది. ఆ ఘటనతో గుండెపగిలిన ఆ తల్లి సాయం కోసం కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు రక్తపు మడుగులో పడిన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియోను చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వల్ల ఏడాదిలో ప్రాణాలు పోతున్న చిన్నారుల సంఖ్య.. వేలల్లోనే ఉంటోందని యూనిసెఫ్ నివేదిక చెబుతోంది. View this post on Instagram A post shared by NDTV Marathi (@ndtvmarathi)

HYD: ప్రేమ జంటకు ఆశ్రయమిస్తే కటకటాల్లోకే!
ఫిలింనగర్: ప్రేమ జంటకు ఆశ్రయం ఇచ్చినందుకు యువతీ, యువకులను ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ప్రేమజంట మధ్య విబేధాలు రావడంతో సదరు బాలిక ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆమె మైనర్ కావడంతో ఆమె ప్రియుడిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో భాగంగా బాధితురాలు తమకు ఫిలింనగర్‌లోని బీజేఆర్‌నగర్‌లో నివసించే కోనె అఖిల్ అనే యువకుడు తన గదిలో ఆశ్రయం ఇచి్చనట్లు చెప్పింది. దీంతో బాలికతో పాటు ఆమె ప్రియుడికి చట్టవిరుద్ధంగా గదిని ఇచ్చినందుకుగాను పోలీసులు కోనె అఖిల్, అతడికి సహాయపడిన నిఖిత అనే యువతిని గురువారం అరెస్టు చేశారు. బీజేఆర్నగర్ బస్తీకి చెందిన యువకుడు, మైనర్ బాలిక ప్రేమించుకున్నారు. వీరిద్దరూ తరచూ కలుసుకునేందుకు అఖిల్ పలుమార్లు తన గదిని ఇచ్చాడు. అంతేగాక ఇదే బస్తీలో నివసించే నిఖిత అనే యువతి కూడా వీరికి పలుమార్లు ఆశ్రయం కల్పించింది. ఇలా గదులు ఇవ్వడం చట్టవిరుద్ధం కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గదులు ఇచ్చిన వారిని కూడా నిందితులుగా చేర్చి అరెస్టు చేశారు. బస్తీల్లో, కాలనీల్లో, అపార్ట్మెంట్లలో ఎవరైనా స్నేహితులకు తమ గదులను ఇస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ సంతోషం హెచ్చరించారు. ముఖ్యంగా ఫిలింనగర్ 18 బస్తీల్లో కొందరు ప్రేమ జంటలకు తమ గదులను వాడుకునేందుకు ఇస్తున్నట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయని, వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ఇళ్ల యజమానులు తమ ఇళ్లల్లో అద్దెకు ఉంటున్న వారి ఇంటికి ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో తెలుసుకుని అనుమానాస్పదంగా ఉంటే బయటకు పంపించాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.