breaking news
Vikarabad District Latest News
-
వైభవంగా ధ్యాన మహాయాగాలు
కడ్తాల్: మండల పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు ధ్యాన జనుల సందడితో వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న ధ్యానులతో, పత్రీజీ ధ్యాన మహాయాగాలు–4 బుధవారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయిఽ. ఉదయం సంగీత విధ్వాంసుడు సంజయ్కింగి బృందం ఆధ్వర్యంలో సామూహిక ప్రాతఃకాల సంగీత ధ్యానం నిర్వహించారు. అనంతరం ధ్యాన గురువు పరిణిత పత్రి ధ్యానులను ఉద్దేశించి ప్రసంగించారు. పత్రీజీ ఆశయ సాధనకు ధ్యానులు కృషి చేయాలన్నారు. ధ్యానం ద్వారం పొందిన జ్ఞానాన్ని దైనందిన జీవితంలో ఆచరించకపోతే ప్రయోజనం శూన్యమని తెలిపారు. జీవిత ధ్యేయం తనను తాను తెలుసుకోవాలనే పత్రీజీ ఇచ్చిన ఫార్మూల ఎంతో గొప్పదని కొనియాడారు. అనంతరం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ నిర్వాహకుడు శ్రేయాన్స్దాగా ప్రసంగిస్తూ.. ధ్యానంలో మనసు ఎప్పుడైతే శూన్యమవుతుందో మనల్ని మనం తెలుసుకోగలుతామని అన్నారు. కోట్లాది మంది ధ్యానులను పత్రీజీ తయారు చేశారని కొనియాడారు. అనంతరం పలు ఆధ్యాత్మిక పుస్తకాలను, నూతన సంవత్సర క్యాలండర్లను, ఎనిమిదేళ్ల పీఎంసీ చరిత్రపై రూపొందించిన పీఎంసీ సావనీర్‌ను పిరిమిడ్ ట్రస్ట్ సభ్యులు, మాస్టర్లతో కలిసి పరిణిత పత్రి, ట్రస్ట్ చైర్మన్ విజయ్‌భాస్కర్‌రెడ్డి ఆవిష్కరించారు. ధ్యాన వేదికపై కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ధ్యానుల, పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ధ్యానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మీడియా కో–ఆర్డినేటర్ భాస్కర్‌రెడ్డి, ట్రస్ట్ సభ్యులు హనుమంతరాజు, మాధవి, లక్ష్మి, నిర్మల, దామోదర్‌రెడ్డి, రవిశాసీ్త్ర, ఫౌండర్ బుద్ధ, సీఈఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నాలుగో రోజుకు చేరిన వేడుకలు -
రాకపోకలకు అడ్డుగా మట్టి దిబ్బలు
బడంగ్పేట్: అధికారుల మధ్య సమన్వయలోపం వాహనదారులకు శాపంగా మారింది. రోడ్డు విస్తరణలో భాగంగా పక్కనున్న భారీ వృక్షాలను తరలించి, దాని నుంచి వెలువడిన మట్టి కుప్పలను అక్కడే వదిలేయడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. బడంగ్పేట్ పరిధిలోని నాదర్గుల్ నుంచి గాంధీనగర్ వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వేయకుండా ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. దాదాపు 65 భారీ చెట్లను గుర్తించి వాటికి రంగులు వేసి నంబర్లతో మార్కింగ్ వేశారు. నెల రోజుల క్రితం చెట్లను వేళ్లతో సహా పెకిలించి క్రేన్ల సహాయంతో వేరే చోటుకు తరలించారు. అప్పుడు జేసీబీతో వేళ్లతో సహా పెకిలించేందుకు చెట్ల చుట్టూ మట్టిని తవ్వి అలాగే రహదారి పక్కన వదిలేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఏ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలో తెలియక స్థానికులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికై నా స్పందించి రోడ్డు పక్కన మట్టి కుప్పలు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఇసుక తరలిస్తున్నారని కర్రలతో దాడి
● ట్రాక్టర్ యజమానితో పాటు మహిళకు తీవ్రగాయాలు ● దాడికి పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు బషీరాబాద్: ఇసుక తరలించేందుకు వచ్చారని ఆరోపిస్తూ ఇద్దరు వ్యక్తులను తీవ్రంగా కొట్టి, గాయపర్చిన ఘటన కంసాన్పల్లి(బి)లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మైల్వార్ గ్రామానికి చెందిన దానం సాయిలు బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండు ట్రాక్టర్లు తీసుకుని, కంసాన్పల్లి రైతులు గొల్ల కృష్ణ, గొల్ల అశోక్‌కు చెందిన పొలం వద్దకు చేరుకున్నాడు. కూలీలతో కలిసి ఇక్కడ మేట వేసిన ఇసుకను తవ్వేందుకు ప్రయత్నిస్తుండగా, అక్కడే ఉన్న కృష్ణ, అశోక్ అడ్డుకుని, కర్రలతో దాడి చేశారు. సాయిలుతో పాటు యశోదమ్మ అనే మహిళను తీవ్రంగా గాయపర్చారు. హడలిపోయిన బాధితులు ట్రాక్టర్లు అక్కడే వదిలేసి ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ విషయమై బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాక్లర్లతో పొలం వద్దకు వెళ్తుండగా మధ్యలో అడ్డుకున్న కృష్ణ, అశోక్ తమపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారణ జరిపిన తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఐ విఠల్ ఇరువర్గాలతో మాట్లాడి, దాడికి పాల్పడిన ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
సామగ్రి ధ్వంసం కాలేదు
తాండూరు రూరల్: మండల పరిధి గౌతపూర్ పంచాయతీ కార్యాలయంలో ఎలాంటి సామగ్రి ధ్వంసం కాలేదని పంచాయతీ కార్యదర్శి ఫక్రోజి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ సర్పంచ్ రాజప్పగౌడ్ ఆరోపణలు అవాస్తమన్నారు. నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో గదులను శుభ్రం చేస్తున్న క్రమంలో ఉత్తమ అవార్డు జ్ఞాపిక, నేమ్‌బోర్డు, పాలకవర్గం శిలాఫలకం ఒక గదిలో భద్రపరిచామని పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో వాటన్నింటిని కార్యాలయంలో ప్రదర్శనకు పెడతామన్నారు. ఓడిపోయామని.. దాడికి పాల్పడి ● హత్యాయత్నం కేసులో ఆరుగురి రిమాండ్ ● వివరాలు వెల్లడించిన సీఐ రఘురాములు బంట్వారం: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయామన్న కక్షతో ప్రత్యర్థిపై హత్యాయత్నానికి పాల్పడిన ఆరుగురు నిందితులు కటకటాల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ధారూరు సీఐ రఘురాములు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. పాతకక్షల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో ఓడిపోయామన్న కోపంతో కోట్‌పల్లి సర్పంచ్ జంగం బసమ్మ భర్త సంగయ్యస్వామిపై ప్రత్యర్థులు దాడికి పథకం వేశారు. ఈ నెల 18న రాత్రి 10.40 గంటలకు స్వామి ఇంటి సమీపంలోనే హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కోట్‌పల్లికి చెందిన మహ్మద్ షకీర్, ఆనెం శివకుమార్, మహ్మద్ అక్రమ్, ఖురేషి అజ్మత్, మహ్మద్ షాన్వాస్, నక్కల బందెయ్యలను అనుమానితులుగా భావించి, అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించగా.. నేరం అంగీకరించారు. ఈ కేసులో లోతుగా విచారణ చేపడతామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని సీఐ తెలిపారు. రాజ్‌పాకాల కేసు వీడియోలు వైరల్ శంకర్పల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలపై మోకిల పీఎస్‌లో నమోదైన కేసు,చార్జిషీట్ అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతేడాది అక్టోబర్ 26న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలోని ఫాంహౌస్‌లో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించారని, ఇందులో విదేశీ మద్యం వినియోగించారనే అభియోగాలపై కేసు నమోదైంది. దీనిపై జూన్ 30నచార్జిషీట్ దాఖలు చేశారు. ఈఅంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసులో 35 మందిని విచారించిన తర్వాత, అనుమతి లేకుండా ఫాంహౌస్‌లో విదేశీ మద్యంతో పార్టీ చేసిన రాజ్ పాకాలపై, డగ్ర్ పరీక్షలో పాజిటివ్‌గా తెలిసిన విజయ్ మద్దూరిపై గతంలోనే చార్జిషీట్ దాఖలు చేశామని మోకిల సీప వీరబాబు తెలిపారు. స్వార్థ ప్రయోజనాలకు యూనియన్ పేరు వాడొద్దు షాద్‌నగర్‌రూరల్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) సంఘం పేరును తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే సహించేది లేదని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేరిబాయి గణేష్, మైల సైదులు హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని టీడబ్ల్యూజేఎఫ్ కార్యాలయంలో సంఘం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేందర్‌గౌడ్, నరేష్ అధ్యక్షతన సంఘం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ వ్యక్తిగత అవసరాల కోసం టీడబ్ల్యూజేఎఫ్ సంఘం పేరును తప్పుగా వాడుకుంటున్నాని, ఇది సరైన పద్దతి కాదని హితవు పలికారు. కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య కుత్బుల్లాపూర్: కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో మనస్తాపానికిలోనైన ఓ తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.. వివరాలిలా ఉన్నాయి.. కొంపల్లికి చెందిన కృష్ణ, నాగమణి(42) దంపతులు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు నెలల క్రితం వీరి కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి మనస్తాపానికి లోనైన నాగమణి బుధవారం ఉదయం ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి పోయింది. కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా ఫాక్స్‌సాగర్ సమీపంలో చెరువులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ కి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సహకారం అభినందనీయం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్‌రెడ్డి ● ఘనంగా వీడ్కోలు అనంతగిరి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్‌రెడ్డి బదిలీ అయ్యారు. జ్యుడీషి యల్ అకాడమికి వెళ్తున్న ఆయన్ను బుధవారం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు పలికారు. ఆయన మాట్లాడు తూ.. జిల్లా న్యాయవాదుల సహకారం బాగుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వైష్ణవి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నరసింహ, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నరేందర్, జీపీ శ్రీనివాస్‌రావు, బార్ అసోసియేషన్ సంయుక్త కా ర్యదర్శి ఆనంద్, సీనియర్ న్యాయవాదులు పర మానందరావు, కమాల్‌రెడ్డి, యాదవరెడ్డి, లవకుమార్, గోపాల్‌రెడ్డి, సంపూర్ణఆనంద్ పాల్గొన్నారు. -
క్రిస్మస్ శుభాకాంక్షలు
స్పీకర్ ప్రసాద్‌కుమార్ అనంతగిరి: ఏసుక్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకొని క్రిస్టియన్లకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు యావత్ ప్రపంచానికి మార్గదర్శకమన్నారు. క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ట్రెయినీ కలెక్టర్ చంద్రకిరణ్ అనంతగిరి: లక్ష్య సాధనకు ఏకాగ్రత ఎంతో అవసరమని ట్రెయినీ కలెక్టర్ చంద్రకిరణ్ అన్నారు. బుధవారం పట్టణంలోని సిద్ధార్థ స్కూల్లో నిర్వహించిన ఎఫ్ 5(ఫుడ్ ఫెస్టివల్) కార్యక్రమాన్ని విద్యా సంస్థల డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విజయ సంకల్పం సాధించాలంటే ఏకాగ్రతతో సాధన చేయాలన్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ విద్యా సంస్థల డైరెక్టర్లు సీ వేణు గోపాల్‌రావు, ఆర్ బదరీనాథ్, కూర జయదేవ్, డా. పీ కృష్టారెడ్డి, ప్రిన్సిపాల్ సభిత రాణి, సిబ్బంది మంజుల జాదవ్, విద్యార్థుల తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతగిరి: వినియోగదారుల హక్కులను కాపాడుతామని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుడు తను తీసుకున్న వస్తువుకు డబ్బులు చెల్లించిన రసీదు పొందాలన్నారు. వస్తువు నాణ్యతలో లోపం ఏర్పడితే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమావేశంలో డీఆర్ఓ మంగీలాల్, రేషన్ షాపు డీలర్లు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు. దౌల్తాబాద్: కోస్గి పట్టణంలో బుధవారం నిర్వహించిన సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మండలంలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు తరలివెళ్లారు. మండలంలోని 33 పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యులను ఆయా పంచాయతీల కార్యదర్శులు వాహనాల్లో తీసుకెళ్లారు. తుక్కుగూడ: ఆశ కార్యకర్తల సంక్షేమం కోసం తమ వంతు కృషి చేస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.లలితాదేవి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆశ కార్యకర్తలకు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసులు చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలోని 1,358 మంది ఆశ కార్యకర్తలకు చీరలు అందజేశామని చెప్పారు. ఆశాలకు ప్రభుత్వం ఏటా ఒక జత యూనిఫాం రూపంలో చీరలను అందిస్తుందన్నారు. ఆశాలు గ్రామీణ స్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ కొడంగల్ రూరల్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ కోరారు. బుధవారం నగరంలోని కాచిగూడలో నిర్వహించిన స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010 కంటే ముందుగా నియామకం అయిన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2025– 26 విద్యా సంవత్సరం పది పరీక్షల షెడ్యూల్‌ను యథావిధిగా ప్రకటించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షనర్ జీపీఎఫ్ నిధులు, టీఎస్జీ ఎల్ఐసీ నిధులు, పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలన్నారు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు బేసిక్ పే కల్పిస్తూ రెగ్యులరైజ్ చేయాలని కోరారు. -
కేసుల ఛేదనలో పురోగతి
వికారాబాద్: గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో సైబర్, ఇతర నేరాలు పెరిగాయని, కేసుల నమోదులో పారదర్శకంగా వ్యవహరించామని ఎస్పీ స్నేహమెహ్ర తెలిపారు. 2024తో పోలిస్తే ప్రధాన నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోందన్నారు. బుధవారం వికారాబాద్‌లోని జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2025లో నమోదైన నేరాలకు సంబంధించి వార్షిక నివేదికను వెల్లడించారు. ఎన్ఫోర్స్మెంట్, నిఘా వ్యవస్థల బలోపేతం, నిరంతర అవగాహన కార్యక్రమాలతో ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని పేర్కొన్నారు. మృతుల సంఖ్య తగ్గిందన్నారు. గుట్కా క్రయ విక్రయాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఇసుక దందాను సమర్థవంతంగా కట్టడి చేసినట్లు వివరించారు. డయల్ 100కు అత్యధిక ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇందులో ఈవ్ టీజింగ్ తదితర కేసులు ఉన్నాయన్నారు. వీటన్నింటిని పరిశీలించి పరిష్కరించామని పేర్కొన్నారు. ఈ ఏడాది కొత్తగా 1,741 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ కార్యక్రమాల ద్వారా బాలకార్మికులకు విముక్తి కల్పించామన్నారు. పోలీస్ శాఖను బలోపేతం చేయడం ద్వారా కేసుల ఛేదనలో మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములునాయక్, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, వికారాబాద్, పరిగి డీఎస్పీలు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ చాటిన సిబ్బందికి అభినందనలు అనంతగిరి: డిజిటల్ సేవల్లో ప్రతిభ చాటిన జిల్లా ఐటీ సెల్, ఈకాప్స్ పోలీసు అధికారులు రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ అడిషనల్ డీజీపీ వీవీ శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. జిల్లాలో సీసీటీ ఎన్ఎస్ (వెర్షన్ 1 – 2) సాఫ్ట్వేర్ వినియోగాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, డిజిటల్ సేవలను మరింత చేరువ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచినందుకు వీరికి ఈ రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో జిల్లా ఐటీ హెడ్ కానిస్టేబుల్ కేశవులు, కానిస్టేబుల్ శివశంకర్, పరిగి పోలీస్ స్టేషన్ ఈకాప్స్ కానిస్టేబుల్ బక్కరెడ్డి, యాలాల కానిస్టేబుల్ సందీప్ ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ స్నేహమెహ్ర వారిని అభినందించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని, అంకితభావంతో విధి నిర్వహణ చేయడం గర్వకారణమన్నారు. భవిష్యత్‌లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఎన్ఫోర్స్మెంట్, నిఘా వ్యవస్థలను బలోపేతం చేశాం గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య పెరిగింది రోడ్డు ప్రమాదాలు తగ్గాయి ఎస్పీ స్నేహమెహ్ర జిల్లాలో నమోదైన కేసులపై వార్షిక నివేదిక వెల్లడి -
నూతన జాయింట్ సెక్రటరీగా బద్యానాథ్‌చౌహన్
ఆమనగల్లు: తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం జాయింట్ సెక్రటరీగా ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్‌చౌహన్ ఎన్నికయ్యారు. నాంపల్లిలోని టీజీఓ భవన్లో బుధవారం ఫోరం ఎన్నికలు నిర్వహించారు. ఎలక్షన్ ఆఫీసర్‌గా కృష్ణయాదవ్, అసిస్టెంట్ ఆఫీసర్‌గా రామారావు వ్యవహరించారు. నూతన జాయింట్ సెక్రటరీగా ఎన్నికై న బద్యానాథ్చౌహన్ను ఫోరం అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఎకై ్సజ్ శాఖ అడిషనల్ కమిషనర్ ఖురేషీ, సురేశ్‌రాథోడ్ తదితరులు ఘనంగా సన్మానించారు. -
హైవేపై హోర్డింగ్‌ల తొలగింపు
యాచారం: అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే హోర్డింగ్‌లను అధికారులు తొలగిస్తున్నారు. పంచాయతీలకు ఆదాయం లేకుండా ప్రచారం కోసం వ్యాపారులు నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. జీపీలకు కనీస సమాచారం లేకుండా సాగర్ హైవేపై ఇబ్రహీంపట్నం మండల కేంద్రం నుంచి మాల్ వరకు వందలాదిగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రియల్ వెంచర్లు, వస్త్ర వ్యాపారం, విద్యాలయాలు, ఆస్పత్రుల తదితర ప్రైవేట్ వ్యాపార సంస్థల ప్రతినిధులు తమ ఇష్టానుసారంగా ప్రకటనలు ఏర్పాటు చేస్తున్నారు. అవి రోడ్డుకు దగ్గరగా ఉండడంతో రాకపోకలు సాగించే వాహనాలకు ఇబ్బందిగా మారి ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు అనుమతులు ఉండడంతోనే వ్యాపార సంస్థల ప్రతినిధులు తమ సంస్థల ప్రచారం కోసం హోర్డింగ్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారని ప్రజలు భావించారు. కానీ ఏ ఒక్క సంస్థ కూడా పైసా పన్ను చెల్లించకుండానే భారీ ఇనుప స్తంభాలు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా హోర్డింగ్‌లు బిగిస్తున్నారు. హైవేపై 200లకు పైగానే.. సాగర్ హైవేపై ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు 200లకు పైగానే భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యాచారం పంచాయతీ శ్రీలత ఆధ్వర్యంలో బుధవారం సాగర్ హైవేతో పాటు 24 గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను తొలగించేశారు. ఇకపై అనుమతి లేకుండా ప్రకటనలు చేయవద్దని సూచించారు. వ్యాపారులు తమ వ్యాపార విస్తరణ కోసం, వివిధ ఆఫర్ల పేరుతో హోర్డింగ్‌లు పెట్టి ప్రచారం నిర్వహించుకుంటున్నారు. పంచాయతీలకు ఆదాయం పెంచడం కోసమే హోర్డింగుల తొలగింపునకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఏ చిన్న హోర్డింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నా.. ఆ సంస్థకు ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన అనుమతి పత్రాలు, బాధ్యులైన వారి పేర్లతో కూడిన దరఖాస్తులు చేసుకుంటే నిర్ణయించిన ఫీజులు చెల్లించిన తర్వాత, నిర్ణీత గడువు వరకే అనుమతులు మంజూరు చేస్తారు. గడువు లోపు తొలగించకపోతే పంచాయతీ సిబ్బంది తొలగిస్తారు. లేని పక్షంలో ఆలస్యం కింద భారీ జరిమానాలు వసూల్ చేసే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశంతో కదిలిన యంత్రాంగం అనుమతులు లేకుండా ఏర్పాటు చేయొద్దని సూచన నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా జీపీల ఆదాయం పెంచడంపై అధికారుల కృషి -
విద్యారంగం నిర్వీర్యానికి కుట్ర
అనంతగిరి: విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తక్షణమే విరమించుకోవాలని వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్స్ ప్రధాన సంపాదకుడు మాణిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం అధ్యక్షతన బుధవారం వికారాబాద్‌లో సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాణిక్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్న లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. ఫైనాన్స్ బిల్లు సైతం పెన్షనర్లకు ఉరితాడుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఓ వైపు ప్రపంచం మొత్తం ఉపాధ్యాయుల కొరతతో కొట్టుమిట్టాడుతుండగా, ఇక్కడ మాత్రం 25 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన టీచర్లు సైతం టెట్ పరీక్ష రాయాలంటూ నిబంధనలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సర్వీస్‌లో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు పరీక్ష పాస్ కాకపోతే వృత్తిని వదుకోవాల్సిన దుస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్‌లో మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని ఇటీవల పలువురు ఎంపీలు సభ దృష్టికి తీసుకెళ్లినా, కేంద్ర విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లుగా విద్యారంగ పురోగమనంపై మాట్లాడటం మినహా ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రాములు, ఉపాధ్యక్షుడు బి.నర్సింలు, కోశాధికారి మొయిజ్ఖాన్, జిల్లా కార్యదర్శులు ఎన్.బాబురావు, టి.పవన్ కుమార్, బసప్ప, వెంకటయ్య, ముత్తప్ప, సలీం, నర్సింలు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను విరమించుకోవాలి లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్స్ ప్రధాన సంపాదకుడు మాణిక్‌రెడ్డి -
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
తాండూరు రూరల్: అంతారంలో..పరిగి: పశువుల పాకలో ఏసుక్రీస్తు ముస్తాబైన చర్చి క్రిస్మస్ శోభజిల్లాలో క్రిస్మస్ శోభ సంతరించుకుంది. లోకరక్షకుడు ఏసుక్రీస్తు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు క్రిస్టియన్లు సిద్ధమయ్యారు. ఆయా గ్రామాల్లోని చర్చిలను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. శిలువ, పశువుల పాక, మేరీమాత ప్రతిమ, క్రిస్మస్ తాత, క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. గురువారం పాస్టర్లు దైవ సందేశం వినిపించనున్నారు. – పరిగి -
‘పాలమూరు – రంగారెడ్డి’పై సర్కారు నిర్లక్ష్యం
● పది శాతం పనులు కూడా చేయలేదు ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి మీర్‌పేట: రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై బుధవారం మీర్‌పేటలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చెప్పిన వాస్తవాలను పక్కనపెట్టి కాంగ్రెస్ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 90 శాతం పనులు పూర్తయినా మిగతా 10 శాతం పనులను ఎందుకు పూర్తి చేయడం లేదో చెప్పాలన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడంతో పాటు ప్రాజెక్టుపై శీతకన్ను వేశారన్నారు. సీఎం తన సొంత నియోజకవర్గానికి మాత్రమే నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతులకు సాగు నీరందించాలన్న ఉద్దేశంతో కాళేశ్వరం, పాలమూరు వంటి రెండు పెద్ద ప్రాజెక్టులను నాడు కేసీఆర్ ప్రారంభించారన్నారు. 45 టీఎంసీలు ఎలా సరిపోతాయి? కేసులు కొట్టేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.30వేల కోట్లతో పాలమూరు పనులకు శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. అంతేకాక రూ.27వేల కోట్లతో రిజర్వాయర్ల పనులు కూడా పూర్తయ్యాయని, ఇంకా రెండు కిలోమీటర్ల కాలువ తవ్వితే నీళ్లు వస్తాయని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడు నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కేటాయించకపోగా, తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. 45 టీఎంసీలు సరిపోతాయని మంత్రి ఉత్తమ్ ఎందుకు లేఖ రాశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించారని, అలాంటి గొప్ప నేతను విమర్శించడం మాని, మిగిలిన పనులను ప్రభుత్వం పూర్తి చేయాలని ఎద్దేవా చేశారు. ఈ అంశంపై కేసీఆర్ అధ్యక్షతన తమ కార్యాచరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, హరీశ్వర్‌రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎకరాకు రూ.కోటి ఇవ్వండి
● గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు బాధితుల డిమాండ్ ● అందరికీ సమాన పరిహారం ఇవ్వాలని అభ్యర్థన ● నిర్వాసితులతో ఎంపీ మల్లు రవి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి సమావేశం కడ్తాల్: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో భూములు కోల్పోతున్న తమకు న్యాయమైన పరిహారం అందించాలని మర్రిపల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఎంపీ మల్లు రవి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు తదితరులు బుధవారం కలెక్టరేట్లో వీరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు సహకరిస్తామని, భూమి కొల్పోతున్న తమకు ఎకరాకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. ఎకరాకు రూ.25 లక్షల పరిహారం సరిపోదని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ మొదటి మార్గం రావిర్యాల నుంచి చివరి మార్గం ఆకుతోటపల్లి వరకు ఒకే విధమైన పరిహారం అందించాలని కోరారు. రూ.25 లక్షల పరిహారం.. అడిషనల్ కలెక్టర్, భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్లు మాట్లాడుతూ.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో పూర్తిగా భూమి కోల్పోతున్న బాధితులకు ఎకరాకు రూ.25 లక్షల పరిహారంతో పాటు ఆయా కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ రూ.5.60 లక్షల చొప్పున పరిహారం, కోల్పోయిన భూమి ఆధారంగా 60 గజాల నుంచి 480 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. న్యాయం జరిగేలా చూస్తాం.. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. గ్రీన్ ఫీల్డ్ బాధితులకు ప్రైవేట్ ఉద్యోగంతో పాటు, కడ్తాల్‌లో ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. మరింత మేలైన పరిహారం ఇచ్చే అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపల్లి గ్రామ సర్పంచ్ ఈర్లపల్లి రవి, రైతులు రచ్చ శ్రీరాములు, నారయ్య, మల్లేశ్‌గౌడ్, సత్తయ్య, యాదయ్య తదితరులు ఉన్నారు. -
‘డబుల్’ నిరసన
● అనర్హులు ఇళ్లు తీసుకున్నారని మహిళల ఆందోళన ● పేదలను గుర్తించాలని ప్రభుత్వానికి అభ్యర్థన తుక్కుగూడ: అర్హులైన తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ పలువురు మహిళలు నిరసన వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం తుక్కుగూడ జీహెచ్ఎంసీ డివిజన్ పరిధిలోని సర్ధార్‌నగర్‌లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామంలో నిర్మించిన డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం లాటరీ పద్ధతిన అర్హులకు కేటాయించిందని తెలిపారు. అయితే స్థానికంగా ఉన్న కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు వారి పలుకుబడిని ఉపయోగించి, ఒక్కొక్కరు మూడు, నాలుగు ఇళ్ల చొప్పున తీసుకున్నారని ఆరోపించారు. కొంత మందికి పట్టాలు ఇచ్చినా ఇళ్లు ఇవ్వలేదని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వమైనా అనర్హులను తొలగించి, పేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మంచాల: బొలెరో వాహనం ఫల్టీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మంచాల మండల పరిధిలోని రంగాపూర్ సమీపంలో కోళ్ల వంపు వాగు మలుపు వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం మండలం గడ్డ మల్లయ్య గూడెం గ్రామానికి చెందిన ఓడుసు శివ(25) అతని స్నేహితులు యావ శంకర్, ఎడ్ల నాగరాజుతో కలిసి లోయపల్లి నుంచి రంగాపూర్ వైపు బొలెరో వాహనంపై వస్తున్నారు. రంగాపూర్ సమీపంలో చేరుకోగానే కోళ్ల వంపు వాగు మలుపు వద్ద రోడ్డుపై అతి వేగంగా వచ్చి ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న శివకు బలమైన గాయాలవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న మంచాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. వెంటనే 108 అంబులెన్స్‌లో అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విలీనంపై వివరణ ఇవ్వండి
● ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాలతో నిర్ణయం? ● సమగ్ర పరిశీలనానంతరమే ఖరారు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్)కు బ్రేక్ పడింది. డివిజన్ల పునర్విభజన సహేతుకంగా లేదనే ఆరోపణల నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. నగర శివార్లలోని 20 పురపాలికలు, ఏడు నగర పాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ 300 వార్డులు పునర్విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రేపో, మాపో విడుదల కాగలదనుకుంటున్న తరుణంలో తాజా పరిణామం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక నోటిఫికేషన్ ఈ నెల 9వ తేదీన జారీ కాగా, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 22వ తేదీ వరకు కూడా ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించారు. పునర్విభజనపై దాదాపు 6వేల అభ్యంతరాలు, ఫిర్యాదులు అందాయి. వాటిల్లో అర్హత కలిగిన, సమంజసమైనవిగా భావించిన అన్నింటినీ పరిష్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, ముమ్మర కసరత్తుతో రేయింబవళ్లు పనిచేసి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఇక తుది నోటిఫికేషన్ జారీ కావడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వారి ఆదేశాల మేరకు తుది నోటిఫికేషన్‌ను పెండింగ్‌లో పెట్టినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఎందుకో..? వచ్చే సంవత్సరం జరగాల్సిన ఎస్ఐఆర్, జనగణనను దృష్టిలో ఉంచుకొని డీలిమిటేషన్‌ను త్వరితంగా పూర్తిచేయాలని పురపాలకశాఖ భావించింది. దానికి తగ్గట్టుగానే చకచకా డివిజన్లు, సర్కిళ్ల హద్దులకు ఈ నెలాఖరులోపు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించింది. పార్టీలకతీతంగా అటు ప్రజాప్రతినిధుల నుంచి, ఇటు ప్రజల నుంచి కూడా కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులందడం, పలువురు ప్రజాప్రతినిధులు లిఖితపూర్వకంగా అభ్యర్థనలు, తదితరమైన వాటి నేపథ్యంలో తుది నోటిఫికేషన్ వెలువరిస్తే, హడావుడిగా ముగించారని విమర్శలు వెల్లువెత్తుతాయనే అభిప్రాయంతో ప్రభుత్వం ప్రస్తుతానికి బ్రేకులు వేయాలని భావించినట్లు తెలిసింది. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం కావడంతో డివిజన్ల పేర్లు, హద్దులు, కార్పొరేషన్ల విభజనపై అచితూచి అడుగువేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలికి ఫిబ్రవరి పదోతేదీ వరకు గడువుండటాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని తుది నివేదికకకు విరామమిచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో సమీప మున్సిపాలిటీలను విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన న్యాయ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 28కి వాయిదా వేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపలి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డీనెన్స్‌లను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన బీ రాజు హైకోర్టులో మూడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్ తుక్కుగూడ మున్సిపాలిటీలో ఓటరు. వివాదాస్పదంగా విలీనం చేసిన మున్సిపాలిటీల్లో ఇది ఒకటి. పిటిషనర్ రాబోయే మున్సిపల్ ఎన్నికలకు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థి అని.. విలీనం కారణంగా భూభాగ పరిధి, పాలన, స్వరూపం, జనాభా మార్పులతో ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నారు. ఆర్డినెన్స్ జారీకి ముందు తుక్కగూడ కార్పొరేషన్‌తో సంప్రదింపులు జరపాల్సి ఉంది. అలా చేయకుండా ఏకపక్షంగా విలీనం చేపట్టినందున ఆర్డినెన్స్ 9, 10, 11ల అమలును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం–1955కు చేసిన సవరణలను ఆపి వేయాలి’అని కోరారు. కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
మీ డబ్బు.. మీ హక్కు
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ‘మీ డబ్బు.. మీ హక్కు’ అనే కార్యక్రమం ద్వారా ఖాతాదారులు అన్ క్లైమ్డ్ సొమ్మును తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుందని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకులు, బీమా సంస్థలు, పోస్టాఫీసుల్లో క్లైమ్డ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందేందుకు ప్రభుత్వం మీ డబ్బు మీ హక్కు అనే కార్యక్రమం చేపట్టిందన్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో 1,48,511 ఖాతాల్లో 30.44 కోట్ల రూపాయల అన్ క్లైమ్డ్ సొమ్ము ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 184 ఖాతాల్లోని 1.60 కోట్ల రూపాయలను సంబంధిత ఖాతాదారులు తిరిగి పొందారని తెలిపారు. ప్రజల సొమ్మును వారికే చేరాలనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ, డీఎఫ్ఎస్ వంటి జాతీయ స్థాయి సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలు ఉమ్మడిగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్ఓ మంగీలాల్, ఎల్‌డీఏం యాదగిరి, ఆర్బీఐ ఏజీఎం చేతన్ గోరేఖర్, యూబీఐఎస్బీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, హైదరాబాద్ కో ఆపరేటివ్ బ్యాంక్ అధికారులు, జీవిత బీమా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సజావుగా ధాన్యం సేకరించాలి ధారూరు: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని గట్టెపల్లిలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని, వెనక్కు పంపరాదని ఆదేశించారు. రైతులు దళారులను నమ్మి నష్టపోరాదని, కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే మద్దతు ధర వస్తుందన్నారు. కార్యక్రమంలో హరిదాస్‌పల్లి పీఏసీఎస్ సీఈఓ రవి, కేంద్ర నిర్వాహకులు తదితరలు పాల్గొన్నారు. -
క్రమశిక్షణ, సమన్వయం ముఖ్యం
అనంతగిరి: విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమన్వ యం ఎంతో ముఖ్యమని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నా రు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పని చేస్తున్న వివిధ విభాగాల పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి విభాగం పనితీరును, పెండింగ్‌లో ఫైళ్లను పరిశీలించారు. అనంతరం విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో క్రమశిక్షణ అనేది అత్యంత ప్రధానమైనదని, ప్రతి అధికారి సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కార్యాలయానికి వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విభాగాల మధ్య పరస్పర సమన్వయం ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. సహోద్యోగులందరూ ఒకే కుటుంబంలా కలిసి పనిచేయాలని సూచించారు. మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి పనిని ప్రణాళికాబద్ధంగా విభజించుకోవాలని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, విధుల్లో పారదర్శకతను పెంచాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బీ రాములు నాయ క్, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, ఏఓ ఖాజా మోహినొద్దీన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చండి
దోమ: ఎన్నికల సమయంలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు మాధవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు మండల కేంద్రమైన దోమ మెడికల్ ఆఫీసర్ రజితకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదని మండిపడ్డారు. కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలన్నారు. రూ.50 లక్షల ఇన్సూరెన్స్, మట్టి ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం, పండుగ సెలవులు జారీ చేయాలన్నారు. ఏఎన్సీ, పీఎన్సీ రద్దు చేయాలని కోరారు. రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించడంతోపాటు పారితోషికంలో సగం డబ్బును పెన్షన్ రూపంలో ఇవ్వాలన్నారు. ఏటా 20 రోజుల వేతనంతో కూడిన క్యాజువల్ లివ్స్, 6 నెలలు మెడికల్ సెలవులు ప్రకటించాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని కాటన్ యూనిఫాం అంద జేయాలని తెలిపారు. పీఆర్సీ ఎరియర్స్‌తో పాటు మూడు సంవత్సరాల లెప్రసీ సర్వే డబ్బులు, మూ డు రోజుల పల్స్ పోలియో డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో వి శ్రాంతి గది ఏర్పాటు చేసి ఇతరులకు ప్రవేశం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పనిభారం తగ్గించి పారితోషికం లేని పనులను చేయించరాదని కోరా రు. కార్యక్రమంలో మండల ఆశవర్కర్లు అతి యా బేగం, పద్మమ్మ, లక్ష్మి, రమాదేవి, బుడ్డమ్మ, యశో ద, మహేశ్వరీ తదితరులు పాల్గొన్నారు. -
లెక్కచెప్పాల్సిందే..
వికారాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి.. గెలిచిన వారు ఆనందంలో మునిగిపోయా రు. ఓటమి చవిచూసిన వారు అంతర్మథనం చేసుకుంటున్నారు.. ఎక్కడ లెక్క తప్పిందబ్బా అంటూ లెక్కలేసుకుంటున్నారు. ఓటమికిగల కారణాలను విశ్లేషిస్తున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం ఇక ఎవరితో మాకేంటని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే నామినేషన్ వేసిన నాటినుంచి పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు చేశారో వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే.. లేదంటే ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకా రం చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కలను బిల్లులతో సహా ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి 45 రోజుల్లోగా చూపించాల్సిందేనని నిబంధనలు వెల్లడిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని 594 గ్రామ పంచాయతీలు, 5,058 వార్డులకు ఈ నెలలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. తాండూరు రెవెన్యూ డివిజన్లోని 8 మండలాల్లో 11వ తేదీ, వికారాబాద్ రెవెన్యూ డివిజన్లోని 7 మండలాల్లో 14వ తేదీ, పరిగి సెగ్మెంట్లోని 5 మండలాల్లో 17వ తేదీ ఎన్నికలు జరిగాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పోలింగ్ తేదీకి పదిహేను రోజుల ముందు నిర్ణీత మండలాల్లో ప్రారంభమైంది. దీని ప్రకారం పోలింగ్ ముగిసిన 45 రోజుల్లోగా లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాలోని 594 జీపీలకు గాను 75 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యా యి. మిగతా వాటికి 1,933 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేశారు. 5,058 వార్డులు ఉండగా 1,252 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటికి 10,055 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరందరూ ఎన్నికల ఖర్చులు చెప్పాల్సిందే. నిబంధనలివే.. పెరుగుతున్న వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చును కూడా ఎన్నికల సంఘం నిర్ణయించింది. అభ్యర్థులు బ్యాంక్ ఖాతా నుంచే వ్యయం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 5 వేల జనాభా పైబడిన పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి వ్యయ పరిమితిని రూ.2.50 లక్షలు, వార్డుసభ్యులు రూ.50 వేల లోపే ఖర్చుచేయాలి. అదే విధంగా 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు పోటీచేసే సర్పంచ్ అభ్యర్థులు రూ. 1.50లక్షలు, వార్డు సభ్యులు రూ.30 వేల లోపే ఖర్చు చేయాలి. నామినేషన్ వేసిన తేదీ నుంచి పోలింగ్ ప్రక్రియ వరకు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలను 45 రోజుల్లోగా సమర్పించాలి. నూతన పంచాయతీరాజ్ చట్టం – 2018 ప్రకారం తాము చేసిన ఎన్నికల వ్యయాన్ని సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు గడువులోగా సమర్పించకపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గెలిచిన అభ్యర్థులు లెక్కలు చూపకుంటే అనర్హత వేటు కు గురవుతారు. అంతేకాకుండా ఆరేళ్లపాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. ఓడిపోయిన అభ్యర్థులు కూడా లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. చట్టం 237 ప్రకారం ఎన్నికల ఖర్చు వివరాలను అందించాలని అధికారులు కోరుతున్నారు. వాస్తవ లెక్కలు సమర్పించేనా? జిల్లాలో 594 పంచాయతీలు, 5,058 వార్డులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ వ్యయ పరిమితిని విధించింది. అయితే అభ్యర్థులు మాత్రం ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఐదు వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50లక్షలు, వార్డు అభ్యర్థులు రూ.50 వేలు ఖర్చు చేయాల్సి ఉండగా రూ.కోటికి పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. నిఘా పెట్టాల్సిన అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఏ మేరకు ఖర్చుల వివరాలు చూపుతారో చేచి చూడాల్సి ఉంది. -
ఓటరు జాబితాను సరిచేయండి
● డబుల్ ఓట్లను తొలగించాలి ● సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తాండూరు రూరల్: ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఉండరాదని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సూ చించారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2002 ఓటరు జాబితాను 2025 జాబి తాతో అనుసంధానం చేయాలన్నారు. 2002 లో ఉన్న ఓటర్లు ప్రస్తుత జాబితాలో ఉన్నారా లేదా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించా లని ఆదేశించారు. ఒక కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాండూ రు నియోజకవర్గంలో 269 పోలింగ్ కేంద్రాలు, 2 లక్షల 20 వేల మండి ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఓటర్లు తమ నివాస పత్రాలతో పాటు సరైన ఆధారాలు చూపించాలన్నారు. ఒక వ్యక్తి కి రెండు చోట్ల ఓట్లు ఉంటే ఒకదాన్ని తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ లలిత, బీఎల్ఓలు పాల్గొన్నారు.. -
జీపీల అభివృద్ధికి సహకరిస్తా
అనంతగిరి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే బాధ్యత సర్పంచ్‌లపై ఉంటుందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మండలం కొటాలగూడెం సర్పంచ్ బచ్చంగారి శ్వేత వేమారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ హాజరై మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం నూతన సర్పంచ్‌లకు వచ్చిందని, దీన్ని అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజారంజక పాల న సాగుతోందన్నారు. వికారాబాద్ నియోజకర్గంలో 137 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 105 స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సొంతం చేసుకున్నారని తెలిపారు. మరో 9 మంది రెబల్స్ విజయం సాధించారని చెప్పారు. ఈ విజయానికి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే కారణమన్నారు. అనంతరం నూతన పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర నాయకుడు రఘుపతిరెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రమేష్‌నాయక్, సీనియర్ నాయకులు అనంత్‌రెడ్డి, శశాంక్‌రెడ్డి, శ్రీనివాస్, మల్లేశం, రాములు నాయక్, వేణుగోపాల్, గురువారెడ్డి, ప్రహ్లాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త సర్పంచ్‌లకు గుర్తింపు కార్డులు
దుద్యాల్: ఇటీవలే ఎన్నికై న నూతన సర్పంచ్‌లకు పంచాయతీ రాజ్ శాఖ నుంచి మంగళవారం గుర్తింపు కార్డులు అందాయి. సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్‌లకు వెంటనే, ఇంత త్వరగా ఐడెంటిటీ కార్డులు అందడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. కొండగల్ నియోజకవర్గంలోని కోస్గిలో బుధవారం కొత్త సర్పంచ్‌లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. వీరితో కలిసి భోజనం చేస్తారు. ఈ నేపథ్యంలోనే సర్పంచ్‌లకు త్వరగా కార్డులు అందించినట్లు తెలుస్తోంది. సర్పంచ్ గుర్తింపు కార్డులు ఉన్న వారికి ప్రత్యేకంగా ఎలాంటి పాసులు అక్కర్లేదని సమాచారం. -
ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శం
పరిగి: ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని బృందావన్ గార్డెన్లో ప్రభుత్వం తరఫున క్రిస్మస్ విందు ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. ఏసు ప్రభువు ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారని తెలిపారు. కులమతాలకు అతీతంగా పండుగలను జరుపుకోవాలని సూచించారు. క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాల పండుగలను అధికారికంగా.. ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్లకు ప్రభుత్వం అండ తాండూరు: పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం అండ గా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్లో తాండూ రు క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ అంకిత్ అనురాగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది క్రిస్టియన్లు హాజర య్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం క్రిస్టియన్లుతో కలిసి ఎమ్మెల్యే విందు చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, చర్చి పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి -
వరివైపే మొగ్గు
● ఇతర పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడమే కారణం ● ప్రస్తుత సీజన్లో పెరగనున్న సాగు విస్తీర్ణం దౌల్తాబాద్: రైతన్నలు ఎక్కువగా వరిపంట వైపే మొగ్గు చూపుతున్నారు. అన్ని రకాల పంటల సాగుపై అవగాహన ఉన్న వారు సైతం వరినే ఎంచుకుంటున్నారు. తరచూ వరిసాగు చేయడంతో భూసారం తగ్గి అధిక దిగుబడి సాధించడం కష్టమే. మండలంలో గత యాసంగిలో సుమారు ఐదువేల ఎకరాల్లో వరిసాగు చేస్తే ప్రస్తుత సీజన్లో మరో వెయ్యి ఎకరాల్లో అదనంగా సాగు చేయనున్నట్లు అంచనా. చెరువులు, బావుల కింద ఎక్కువగా వరి వేస్తారు. మంచి దిగుబడులు వస్తుండటంతో ఇదే పంటను మళ్లీమళ్లీ వేస్తున్నారు. చెరుకు, చిరుధాన్యాలు, కూరగాయల సాగుకు యోగ్యమైన నేలలు ఉన్నా ఇవన్నీ దీర్ఘకాలిక, మద్దతు ధర లేని పంటలు కావడంతో వీటి జోలికి వెళ్లడం లేదు. దీనికి తోడు సరైన మార్కెటింగ్, రవాణా సౌకర్యం లేకపోవడంతో చెరకు, ఉద్యాన పంటలను తగ్గించారు. ప్రస్తుతం రైతులు వేసిన తుకాలు ఎదగకపోతే సంక్రాంతి తర్వాత పెసర, మినుము సాగు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో వ్యవసాయధికారులు రైతుల పొలాలకు వెళ్లి వారి భూమి పరీక్ష చేయించి వాటి ఫలితాలను కూడా అందించారు. నేల సారాన్ని బట్టి పంటలు వేయాలని చెబుతున్నారు. మండలంలోని రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాం. నీటి వనరులు లేని రైతులకు ఆరుడి పంట సాగు చేయాలని సూచించాం. భూసారాన్ని బట్టి నేలలో ఉన్న పోషకాలను వినియోగించుకుని వాటికి తగ్గ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించాం. – లావణ్య, ఏఓ, దౌల్తాబాద్ నాటుకు సిద్ధంగా నారు -
షార్ట్ సర్క్యూట్‌తో దుకాణం దగ్ధం
● రూ.6 లక్షల నష్టం ● ప్రభుత్వం ఆదుకోవాలనిబాధితుల వేడుకోలు యాలాల: షార్ట్ సర్క్యూట్‌తో కిరాణా దుకాణం దగ్ధమైన ఘటన మండలంలోని ముద్దాయిపేటలో సోమవారం రాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోచనగారి వినోద, వెంకటయ్యగౌడ్ దంపతులు తాండూరులోని ఎస్బీఐ(ఏడీబీ) నుంచి మూడేళ్ల క్రితం రూ.10 లక్షల రుణం తీసుకుని, వ్యాపారం చేస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి కొట్టు మూసేసి, వెనకాలే ఉండే ఇంటికి వెళ్లిపోయారు. అర్ధరాత్రి వేళ దుకాణంలో నుంచి మంటలు ఎగిసి పడటాన్ని గమనించిన స్థానికులు యజమానిని నిద్ర లేపి, మంటలు ఆర్పారు. అప్పటికే ఆలస్యం కావడంతో కొట్టులోని ఖరీదైన వస్తువులు, భారీ రిఫ్రిజిరేటర్, పప్పుల సంచులు, చక్కెర, పిండిబస్తాలు, గల్లాపెట్టెలోని నగదు, ఇతర సరుకులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో తనకు సుమారు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
రద్దీ బస్సుల్లో దుండగుల చేతివాటం
ధారూరు: బస్సుల్లోని రద్దీని దుండగులు ఆసరాగా చేసుకుంటున్నారు. కిక్కిరిసి ప్రయాణిస్తున్న బస్సుల్లో ఎక్కి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. డబ్బులు, నగలు, సెల్ఫోన్లు, బ్యాగులు ఇలా ఏది దొరికితే అది తస్కరిస్తున్నారు. టీజీ 34 జెడ్ 0022 నంబరు గల ఆర్టీసీ బస్సు మంగళవారం 114 మంది ప్రయాణికులతో నగరానికి బయలుదేరింది. ధారూరు సమీపంలోకి రాగానే ఓ ప్రయాణికుడు తన సెల్‌ఫోన్ పోయిందని గోల చేశాడు. దీంతో బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆపారు. దొంగిలించిన వారు ఫోన్ ఇవ్వాలని కోరినా ఎదరూ ముందుకు రాలేదు. పోలీసులు వచ్చినా ఫలితం లేకపోవడంతో, ఫిర్యాదు చేయాలని సూచించారు. -
చలికాలం కోడి పైలం
● పౌల్ట్రీల నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరి ● లేదంటే నష్టాలు వచ్చే ప్రమాదం షాబాద్ మండలం నరెడ్లగూడ గ్రామంలో ఉన్న ఫౌల్ట్రీ ఫాంలో పెరుగుతున్న కోళ్లు రక్షణ చర్యలు తప్పనిసరి చలికాలంలో పౌల్ట్రీ ఫారమ్‌లో నష్టాలు వాటిల్లకుండా రైతులు రక్షణ చర్యలు పాటించాలి. కోళ్ల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏవైనా సమస్యలు ఎదురైతే పశువైద్యాధికారులను సంప్రదించాలి. – చంద్రశేఖర్‌రెడ్డి, రేగడిదోస్వాడ పశువైద్యాధికారి షాబాద్: జిల్లాలోని పలువురు రైతులు వ్యవసాయంతో పాటు పౌల్ట్రీరంగాన్ని ఎంచుకుని ఆదాయం పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,780 కోళ్ల ఫారాలు ఉన్నాయి. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీనిపై రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి సలహాలు, సూచనలు.. ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు.. సాధరణంగా కోడి శరీర ఉష్ణోగ్రత 107 డిగ్రీల ఫారన్‌హీట్ ఉంటుంది. అయితే చలికాలంలో ఉష్ణోగ్రత లోపం వల్ల కూడా కోడి పిల్లలపై దుష్ప్రభావం పడుతుంది. అందువల్ల కోళ్లలో గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. లిట్టర్ నిర్వహణలో... చలి కాలంలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో లిట్టర్ గట్టిపడుతుంది. దీంతో ఈకొలై వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లిట్టర్లో ప్రతీ 100 చదరపు అడుగుల స్థలానికి 5–8 కిలోల పొడిసున్నం లేదా అమ్మోనియం సల్ఫేట్ లేదా ఆరు కిలోల సూపర్ పాస్పేట్ కలపాలి. లిట్టర్‌ను తరుచూ కదిలిస్తూ పొడిగా ఉండేలా చూడాలి. ఆహారం విషయంలో... శరీర ఉష్ణోగ్రత కాపాడుకోవడానికి కోళ్లు చలి కాలంలో దాణా ఎక్కువగా తీసుకుంటాయి. ఉష్ణోగ్రత తగ్గితే మేత వినియోగం 1.5 శాతం పెరుగుతుంది. మేత ఎక్కువగా తీసుకుంటున్నాయని దాణా తగ్గిస్తే ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి దాణా తగ్గించకుండా పోషకాలను సరిచేయాలి. తేమవల్ల నిల్వ ఉంచిన దాణా ముడిపదార్థాల్లో శిలీంద్రాలు వృద్ధి చెందుతాయి. తేమ 9శాతానికి మించితే అప్లోటాక్సిన్ సమస్య ఏర్పడుతుంది. దీని నివారణకు దాణాలో ఈస్టు కల్చర్ బైండర్సన్ రెండు కిలోల చొప్పున కలిపి అందించాలి. బ్రూడింగ్ విషయంలో... చలికాలంలో బ్రూడింగ్ నిర్వహణపై అత్యంత శ్రద్ధ వహించాలి. కోడి పిల్లలు మొదటి వారంలో 90– 95 డిగ్రీలు ఫారన్ హీట్, ఆ తర్వాత ప్రతీ వారానికి 5 డిగ్రీల ఫారన్ హీట్ చొప్పున తగ్గిస్తూ ఆరో వారానికి 70 డిగ్రీల ఫారన్‌హీట్ ఉండేలా చూసుకోవాలి. కేజ్ సిస్టమ్‌లో అయితే బ్రూగింగ్ షెడ్డు ఉష్ణోగ్రత 85 డిగ్రీల ఫారన్ హీట్, 25 శాతం తేమ ఉండే విధంగా చూడాలి. ఫారాల నిర్వహణలో... కోళ్లు చలిబారిన పడకుండా షెడ్ల చుట్టూ పరదాలు కట్టాలి. తగినంత వెచ్చదనం కోసం 16 గంటల పాటు లైటింగ్ ఏర్పాటు చేయాలి. షెడ్ల చుట్టూ పది అడుగుల దూరం వరకు పిచ్చి మొక్కలు, పొదలు తొలగించాలి. వంద అడుగుల కంటే ఎక్కువ పొడవుగా ఉండే ఫారాల్లో తాత్కలికంగా పార్టీషన్లు ఏర్పాటు చేసుకోవాలి. కోడి పిల్లలను కిక్కిరిసి ఉంచితే శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సరిపోయే స్థలం కేటాయించాలి. -
కేవీ కేంద్రాలతో లాభాల సాగు
మాడ్గుల: వ్యవసాయంలో అధిక లాభాలు ఆర్జించేలా కృషి విజ్ఞాన కేంద్రాలు ఆధునిక పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు చేరుస్తున్నాయని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధకులు, శాస్త్రవేత్త డా.చంద్రకాంత్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతు వేదికలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు దినోత్సవం సందర్భంగా భారతరత్న మాజీ ప్రధాని చౌధరీ చరణ్‌సింగ్ జయంతిని నిర్వహించారు. అనంతరం శాస్త్రవేత్త డా.చంద్రకాంత్ మాట్లాడుతూ.. కృషి విజ్ఞాన కేంద్రాల సాయంతో సేంద్రియ సాగు పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తోందన్నారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేంద్రీయ మెట్ట వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్లు శీకృష్ణ, రజిత, గౌతమ్ చౌహాన్, దిలీప్, ఏఓ అరుణకుమారి, కేవీకే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
పోలేపల్లిలో కొనసాగుతున్న ’రంగుల రగడ’
దుద్యాల్: మండల పరిధిలోని పోలేపల్లి గ్రామ పంచాయతీ భవనానికి వేసిన ‘రంగుల రగడ’ కొనసాగుతోంది. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలా రంగులు వేసిన పంచాయతీ భవనంలో తాము ప్రమాణ స్వీకారం చేయబోమని సోమవారం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. రంగులు మార్పిస్తామని చెప్పిన ఎంపీడీఓ హామీతో పంచాయతీ భవనం బయటే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం పలువురు బీఆర్ఎస్ నాయకులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందిన వ్యక్తి జాతీయ జెండాను అవమానించేలా పంచాయతీ కార్యాలయానికి రంగులు వేయించారని మండిపడ్డారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినా మండల అధికారులు పట్టించుకోవడం లేదని, త్వరలోనే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఉప సర్పంచ్ ఏదుల అనురాధ, వార్డు సభ్యులు విశాల్, బాల్‌రాజ్, రాములు, శారద, పద్మమ్మ, రేణుక, బీఆర్ఎస్ నాయకులు పుర్ర రాఘవేందర్, బుగ్గప్ప, తూర్పు శ్రీనివాస్, సుదర్శన్, కృష్ణయ్య, దశరత్, మల్లికార్జున్, విజయ్‌కుమార్, చంద్రప్ప తదితరులు తెలిపారు. -
కోడ్ ముగిసినా.. ముసుగు తీయరా!
తాండూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసి వారం రోజులు గడిచినా.. నేతల విగ్రహాల ముసుగు తొలగలేదు. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ యాదగిరి.. మున్సిపల్ పరిఽధిలోని జాతీయ, రాజకీయ నేతల విగ్రహాలకు తెల్లని దుస్తులను చుట్టేశారు. అయితే ఎన్నికలు ముగిసి, పాలకవర్గం కొలువుదీరినా.. నేటి వరకు ముసుగులు తొలగలేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకొని, వాటి ముసుగులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం -
ఆలూరులో హామీల అమలు
చేవెళ్ల: తనను సర్పంచ్‌గా గెలిపిస్తే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు ఆస్పత్రికి వెళ్లేందుకు ఉచిత ఆటో ప్రయాణం కల్పిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు ఆలూరు సర్పంచ్ కౌలంపేట భాగ్యమ్మశేఖర్ గౌడ్. సోమవారం ప్రమాణ స్వీకారం అనంతరం ఉచిత ఆటో సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం నూతన ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసి పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచారు. సేవలు వినియోగించుకునేందుకు ఫోన్ నంబర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. తన సొంత డబ్బులతో డ్రైవర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తానని స్పష్టంచేశారు. గ్రామస్తులకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు పి.రాంచంద్రయ్య, శ్రీశైలం, కె.ఆంజనేయులు, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు నుంచే సేవలు ప్రారంభించిన నూతన సర్పంచ్ -
సొంత డబ్బులతో పెన్షన్
కేశంపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని ప్రమాణ స్వీకారం రోజునే అమలు చేశారు సంగెం సర్పంచ్ వేణుగోపాలచారి. సర్పంచ్‌గా తనను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి పెన్షన్ మంజూరయ్యే వరకూ తన సొంత డబ్బులు అందజేస్తానని ప్రచారంలో పలువురురికి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం లక్ష్మమ్మ, నర్సింలుకు డబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షఖిల్, యెన్నం గోపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, సలీం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి కేంద్ర నిధులు
మొయినాబాద్‌రూరల్: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం సర్పంచ్ల ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా శ్రీరామ్‌నగర్, బాకారం, రెడ్డిపల్లి గ్రామాలలో బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని నూతన పాలకవర్గాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్‌నగర్ సర్పంచ్ గీతామైపాల్, ఉపసర్పంచ్ సుమలతమెన్రెడ్డి, బాకారం సర్పంచ్ ఎలిగని వెంకటేశ్‌గౌడ్, రెడ్డిపల్లి మాణిక్యం, మండల ఎంపీడీఓ సంధ్య, ఎంపీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ గౌతమ్‌కుమార్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, బీజేపీ నాయకులు చనివెల్లి ప్రభాకర్‌రెడ్డి, కంజర్ల ప్రకాశ్, తోక అంజన్‌కుమార్‌గౌడ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి -
కిచెన్‌షెడ్, అంగన్వాడీ.. వగైరా..
ధారూరు: మండలంలోని పలు పంచాయతీలకు సొంత భవనాలు లేకపోవడంతో సోమవారం నూతన సర్పంచ్‌లు కిచెన్‌షెడ్, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. మరి కొన్ని చోట్ల టెంట్ల కింద బాధ్యతలు తీసుకున్నారు. లక్ష్మీనగర్‌తండా సర్పంచ్ పూజ, నర్సాపూర్ సర్పంచ్ బీర్ల రాజు అంగన్వాడీ కేంద్రాల్లో బాధ్యతలు తీసుకున్నారు. కుమ్మర్‌పల్లి సర్పంచ్ వర్ాత్య దివ్వ కిచెన్‌షెడ్ ఎదుట, ధర్మాపూర్, పీసీఎం తండాల సర్పంచులు ఇళ్ల ముందు, అల్లాపూర్, నాగ్సాన్పల్లి, మోమిన్‌ఖుర్దు, రాజాపూర్, కొండాపూర్‌ఖుర్దు సర్పంచ్‌లు పాఠశాలల్లో, అంపల్లి సర్పంచ్ ఓ ఇంటి వద్ద గల షట్టర్ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. అల్లిపూర్‌లో గొట్టిముకుల వీరేశం(65) ఎక్కువ వయస్సున్న సర్పంచుగా, మహిళల్లో నాగారం సర్పంచ్ నీరటి లక్ష్మి(29) తక్కువ వయస్సున్న సర్పంచ్‌గా నిలిచారు. రేకుల షెడ్డులో.. తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం గిర్మాపూర్‌లో సోమవారం సర్పంచ్ శివరాం నాయక్, ఉప సర్పంచ్ లక్ష్మీకాంత్‌రెడ్డి మరో ఆరుగురు వార్డు సభ్యులు రేకుల షెడ్డులో ప్రమాణ స్వీకారం చేశారు. గిర్మాపూర్ను 2018లో పంచాయతీగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సొంత భవనానికి నోచుకోలేదు. గ్రామ మొదటి సర్పంచ్ శివరాం నాయక్‌తో తహసీల్దార్ వెంకట్‌ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వం నూతన భవనం నిర్మించాలని పాలకవర్గం కోరింది. 21 ఏళ్లకే సర్పంచ్ కొడంగల్ రూరల్: మండల పరిధిలోని చిట్లపల్లి సర్పంచుగా తలారి జ్యోతి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న జ్యోతి ఈసారి సర్పంచ్ బరిలో నిలిచి, తన ఓటు తనకే వేసుకున్నారు. 21 సంవత్సరాలకే గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికై అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇదిలా ఉండగా ఉప సర్పంచుగా సంగెం చంద్రకళ, వార్డు మెంబర్లుగా సాయిరెడ్డి, హబీబ్, శాంతమ్మ, బొర్ర వెంకటప్ప, బొర్ర కిష్టప్ప, మంజుళ, అమృతమ్మ, కుమ్మరి శ్రీనివాస్(కరాటే), పద్మమ్మ లు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సర్పంచు జ్యోతిని గ్రామస్తులు అభినందించారు. పాఠశాలలో.. మర్పల్లి: మండలంలోని గుర్రంగట్టు, శాపూర్, కుడుగుంట, నర్సాపూర్ పెద్ద తండా, జంశాద్పూర్, రామపూర్ గ్రామాల్లో పంచాయతీలకు సొంత భవనాలు లేవు. సోమవారం నూతన పాలకవర్గం సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు తీసుకున్నారు. మల్లికార్జున గిరి గ్రామంలో స్థానికులు చందాలు వేసుకొని నిర్మించిన భవనం వద్ద సర్పంచ్ భాగ్యమ్మ, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రామాపూర్ సర్పంచ్ రమాదేవి, వార్డు సభ్యులు అంగన్వాడీ కేంద్రంలో బాధ్యతలు చేపట్టారు. ధారూరు: కొండాపూర్ఖర్దులో పాఠశాల భవనంలో.. ధారూరు: కుమ్మర్‌పల్లిలో కిచెన్‌షెడ్ వద్ద ప్రమాణ స్వీకారం చేసిన పాలకమండలి ఇవే సర్పంచులప్రమాణ స్వీకార కేంద్రాలు -
ప్రారంభం
అట్టహాసంగా సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంపల్లె పాలనవికారాబాద్: రెండేళ్ల ప్రత్యేక పాలన తర్వాత గ్రామ పంచాయతీల్లో కొత్త సర్పంచులు కొలువుదీరారు. ఈ నెల 17తో ఎన్నికల ప్రక్రియ ముగియగా సోమ వారం జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కూడిన నూతన పాలక మండళ్లు కొలువు దీరాయి. గ్రామ ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేయించారు. దైవసాక్షిగా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో మొదటి రోజు పాలన ప్రారంభించారు. సత్తాచాటిన మహిళలు జిల్లాలో మొత్తం 594 పంచాయతీలు, 5,050 వార్డులు ఉండగా.. 75 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 594 మంది సర్పంచులు, 594 మంది ఉప సర్పంచులు, 4,464 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. 594 జీపీల్లో 278 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయగా మిగతా 316 పంచాయతీలను జనరల్‌కు కేటాయించారు. సగానికిపైగా గ్రామ పంచాయతీల్లో మహిళలు విజయం సాధించారు. అంటే వారికి కేటాయించిన జీపీలు కాకుండా అదనంగా 32 స్థానాల్లో గెలుపొందారు. 310 జీపీల్లో మహిళా సర్పంచులు, 284 పంచాయతీల్లో పురుష సర్పంచులు బాధ్యతలు స్వీకిరంచారు. ఆర్భాటంగా మొదటి గ్రామ సభలు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కొత్త పాలక మండళ్ల ఆధ్వర్యంలో మొదటి గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు చేపట్టాల్సిన పనులు, అభివృద్ధి పనులు, సమస్యలు వివరించారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని సర్పంచ్‌లు వివరించాయి. ఇదే సమయంలో ఆయా పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న నిధులు, అప్పుల గురించి చర్చించారు. పన్నులు, ఇతర వివరాలను గ్రామ కార్యదర్శులు చదివి వినిపించారు. అనేక మండలాల్లో పంచాయతీలకు సొంత భవనాలు లేక కిచెన్షెడ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, నూతన సర్పంచుల ఇళ్ల వద్ద ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. పంచాయతీలకు సొంత భవ నాలు ఏర్పాట్లు చేయాలని పలువురు కోరారు. జిల్లా వ్యాప్తంగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు 594 ఉప సర్పంచులు 594 వార్డు సభ్యులు 4,464 మహిళలకు కేటాయించిన స్థానాలు 278 గెలిచింది 310 జీపీల్లో.. 32 జనరల్ కేటగిరీల్లో విజయకేతనం -
మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలి
కొడంగల్: మున్నూరు కాపులు ఐకమత్యంగా ఉండాలని, రాష్ట్ర కమిటీ సభ్యత్వం తీసుకోవాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు పెద్ది పెంటయ్య అన్నారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కొడంగల్, ఉడిమేశ్వరం, పర్సాపూర్, దుద్యాల్, అలిఖాన్‌పల్లి, పాత కొడంగల్, కొండారెడ్డిపల్లి గ్రామ కమిటీ సభ్యులతో పాటు కొడంగల్, దుద్యాల్, దౌల్తాబాద్ మండల కమిటీలు, యువజన కమిటీలు, మహిళా కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యత్వం తీసుకోవాలన్నారు. తద్వారా రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. మున్నూరు కాపులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలన్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయంగా రాణించాలని సూచించారు. రాష్ట్ర మహాసభ ద్వారా విద్యార్థులకు కాచిగూడలో హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉపకార వేతనాలు, మెరిట్ స్కాలర్ షిప్పులు, పాఠ్యపుస్తకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పేదింటిలో పెళ్లి ఉంటే పుస్తె మెట్టెలు ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం కొడంగల్ సంఘం అధ్యక్షుడు బాకారం చంద్రశేఖర్ మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బోడుప్పల్ సంఘం నాయకులు ప్రకాశ్, యువ మండలి రాష్ట్ర కార్యదర్శి శంకర్, కొడంగల్ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లయ్య, కోశాధికారి నర్సిరెడ్డి, సంఘం ప్రతినిధులు రమేష్, అరిగె ఓం ప్రకాశ్, అనంత ప్రసాద్, నరేష్కుమార్, బిచ్చప్ప, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
టిప్పర్ డ్రైౖవర్‌పై కేసు నమోదు
బొంరాస్‌పేట: పనిచేస్తున్న కర్మాగారంలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందగా.. ఈ ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి చౌదర్పల్లి శివారు శ్రీసాయిలక్ష్మీ మెటల్ ఇండస్ట్రీస్‌లో గ్రామానికి చెందిన ఖాసీం పాషా(29) పదిహేనేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. లోడర్‌తో కంకర నింపుతున్న క్రమంలో టిప్పర్కింద కిందపడి పాష మృతి చెందాడు. మృతుడి భార్య గౌసియాబేగం ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్ అశోక్‌పై కేసు నమోదు చేశామని ఎస్ఐ బాలవెంకట రమణ తెలిపారు. ప్రాణం ఖరీదు రూ.20 లక్షలు! కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మృతు డి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేయగా.. రూ.20 లక్షలు పరిహారం ఇచ్చేందు కు యాజమాన్యం ఒప్పుకున్నట్లు సమాచారం. కారు ఢీకొని చిన్నారి మృతి పూడూరు: ప్రమాదవశాత్తు కారుఢీ కొని చి న్నారి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చన్గోముల్ ఎస్ఐ భరత్‌రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాకంచర్ల గ్రామంలో ఇంటి ముందు అడుకుంటున్న చిన్నారి సౌజన్య(7)ను అటుగా వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. బాలికను పరిగి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు. బస్టాప్‌లో ప్రమాదం వృద్ధురాలికి గాయాలు మొయినాబాద్: ఆర్టీసీ బస్సు చక్రం వృద్ధురాలి కాలుపై నుంచి వెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మొయినాబాద్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని చిలుకూరుకు చెందిన వృద్ధురాలు కుమ్మరి భారతమ్మ(70) సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో మొయినాబాద్‌కు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లేందుకు హైదరాబాద్ బస్టాప్‌లో ని ల్చుంది. చేవెళ్ల–హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైరు వృద్ధురాలు కాలుపైనుంచి వెళ్లింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్సకోసం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. బస్సును ఠాణాకు తరలించి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి యాచారం: బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన బదిమీది రాజు(40) సోమవారం మధ్యాహ్నం స్వగ్రామం నుంచి బైక్‌పై అత్తారిల్లు అయిన చింతపట్లకు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఓ వెంచర్ డివైడర్‌కు బైక్‌ను ఢీకొట్టి కిందపడి పోయాడు. తీవ్ర గాయాలైన ఆయన్ని గ్రామస్తులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య సునీత, నలుగురు పిల్లలు ఉన్నారు. వ్యక్తి అదృశ్యం మొయినాబాద్: తండ్రితో పాటు బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి బస్సు దిగి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన జీనగుర్తి నవీన్‌గౌడ్ భార్యాపిల్లలు, తండ్రితో కలిసి మణికొండలో నివాసం ఉంటున్నారు. కాగా ఈ నెల 19న ఉదయం 11 గంటలకు తాండూరుకు వెళ్లేందుకు తండ్రి దస్తయ్య, కొడుకు నవీన్‌గౌడ్ బస్సులో బయలుదేరారు. బస్సు మొయినాబాద్ బస్టాప్ వద్దకు చేరుకోగానే నవీన్‌గౌడ్ భార్యవద్దకు వెళ్తానని చెప్పి బస్సు దిగాడు. కానీ అక్కడి వెళ్లకుండా అదృశ్యమయ్యాడు. పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. స్ఫూర్తిప్రదాత శ్రీనివాసరామానుజన్ మైలార్‌దేవ్‌పల్లి: మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బాబుల్‌రెడ్డినగర్‌లోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా సోమవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య అతిథిగా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షులు ఎస్.వెంకటేష్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందిస్తాయన్నారు. పాఠశాలలో స్వయంగా విద్యార్థులు నిర్వహించిన గణిత క్విజ్లు, గణిత నమునాల ప్రదర్శన, సమస్య పరిష్కార కార్యక్రమాలు, సంఖ్యలతో వినోదాత్మక కార్యకలాపాలు విద్యార్థులను రోబో ఆన్సర్ చేసే విధానం పాఠశాలలో అందరినులను విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ గణిత ప్రతిభను ప్రదర్శించగా ప్రత్యేకంగా తయారు చేసిన గణిత నమూనాలు అందరి ప్రశంసలను పొందాయి. యాజమాన్యం బోయ లక్ష్మణ్, నాగలక్ష్మి, రాజేంద్రనగర్ మండల ప్రైవేటు పాఠశాలల అధ్యక్షులు ఎం.ప్రభాకరాచారి, ప్రధాన కార్యదర్శి జి.శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఇక ఔటర్‌కు అన్ని వైపులా రోడ్లు తళతళ
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు బంజారాహిల్స్ నుంచి ఫిల్మ్‌నగర్ మీదుగా శిల్పా లేఅవుట్ వరకు అక్కడి నుంచి నేరుగా ఔటర్‌కు చేరుకొనే విధంగా కొత్త ఎక్స్‌ప్రెస్ కారిడార్ నిర్మాణానికి నిర్ణయించింది. అలాగే బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించనున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు–డీపీఆర్)ను రూపొందించేందుకు కన్సల్టెన్సీ నియమాకానికి హెచ్ఎండీఏ తాజాగా టెండర్లను ఆహ్వానించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు సులభంగా రాకపోకలు సాగించేందుకు హెచ్ఎండీఏ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ రూట్లో డైరీఫామ్ వరకు ఎలివేటెడ్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మరోవైపు సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ వరకు మరో 23 కి.మీ.ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి టెండర్లు కూడా ఖరారయ్యాయి.ఓ బడా నిర్మాణ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రతిపాదన మేరకు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 నుంచి ఫిలింనగర్, జడ్జీస్ కాలనీ, దుర్గంచెరువు, టీ హబ్, శిల్పా లేఅవుట్ మీదుగా ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ వేను ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రోడ్డు గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పా లేఅవుట్ సమీపం వరకు వచ్చే ప్లైఓవర్ వరకు ఈ సరికొత్త రహదారికి ప్రణాళికలు రూపొందించారు. ఔటర్ నుంచి వచ్చేవారు నేరుగా నగరంలోకి చేరుకొనేందుకు, బంజారాహిల్స్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకొనేందుకు ఈ రహదారి దోహదం చేయనుంది.సుమారు 9 కి.మీ.మేర నిర్మాణం చేపట్టనున్నారు.ఈ రహదారిలో దాదాపు 6 నుంచి 7 కి.మీ.వరకు ఆరు లైన్ల స్టీల్ బ్రిడ్జిని నిర్మాణం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లను నిర్మించనున్నారు.వాహనాలు ఎక్కడా ఆపాల్సిన అవసరం లేకుండా నగరం నడిబొడ్డున ఈ ఎక్స్‌ప్రెస్ ఎలివేటెడ్ కారిడార్ రవాణా సదుపాయాన్ని అందజేయనుంది. ఇప్పటికే ఈ రోడ్డు కోసం హెచ్ఎండీఏ అధికారులు సర్వే పూర్తి చేశారు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నివేదికను తయారు చేసేందుకు తాజాగా కన్సల్టెన్సీ నియమాకానికి హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. వారం రోజుల్లోనే టెండర్లను ఖరారు చేసి కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు.మరో 90రోజులవ్యవధిలో ఎంపికై న కన్సల్టెన్సీ నివేదికను అందజేయవలసి ఉంటుంది. మరోవైపు షేక్‌పేట్ నాలా నుంచి సీబీఐటీ వరకు మరో రహదారి నిర్మాణానికి కూడా హెచ్ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది.షేక్‌పేట్ వైపు నుంచి వచ్చే వాహనదారులు ఈ మార్గంలో నేరుగా ఔటర్‌కు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. నగరంలోని అన్ని వైపుల నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డుకు, అలాగే ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి అన్ని వైపులా రీజనల్ రింగ్‌రోడ్డు వరకు రాకపోకలను సులభతరం చేసేందుకు రహదారుల అభివృద్ధి, విస్తరణకు విస్తృతమైన ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్‌కు ఎక్స్‌ప్రెస్ వే షేక్‌పేట్ నాలా నుంచి సీబీఐటీ వరకు విశాలమైన రహదారి శరవేగంగా సికింద్రాబాద్–డెయిరీఫామ్ ఎలివేటెడ్ కారిడార్ త్వరలో సికింద్రాబాద్–శామీర్‌పేట్ పనులు ప్రారంభం -
మహిళల భద్రతకు ప్రాధాన్యత
అనంతగిరి: జిల్లాలో మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నూతన బోరు పనులను ప్రారంభించారు. పెండింగ్ ఫైల్స్, రికార్డులు, బ్యారక్స్, రైటర్ రూంను పరిశీలించి పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసుల వివరా ల ను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వ ర న్యాయం జరిగేలా చూడాలన్నారు. మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల అత్యంత సున్నితంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి విడుదలైన నిధులను సద్వినియోగం చేసుకొని పోలీస్ స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ బీ సరోజ, ఎస్ఐలు అనిత, స్రవంతి, శ్వేత, రాణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ధ్యానం.. పరమ ఔషధం
కడ్తాల్: ధ్యానం పరమ ఔషధమని ధ్యాన గురువు పరిమళ పత్రి అన్నారు. మండల పరిధిలోని మహేశ్వర మహేశ్వర మహాపిరమిడ్‌లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు–4 సోమవారం రెండో రోజుకు చేరాయి. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సంజయ్ కింగీ ఆధ్వర్యంలో సామూహిక ప్రాతఃకాల సంగీత ధ్యానం నిర్వహించారు. అనంతరం ధ్యానగురువు పరిమళ పత్రి మాట్లాడుతూ.. ఆలోచనలను సరైన స్థితిలోకి తీసుకువెళ్లడమే ధ్యానమన్నారు. నోటి లోని మౌనం, మనసులోని శూన్యమే ధ్యానమని.. అది ఆచరణతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించడమే పత్రీజీ కోరుకున్నారని చెప్పారు. అనంతరం యోగా గురువు వెంకటేశ్ గురూజీ ధ్యానం, యోగా, ప్రాణాయామం గురించి వివరించారు. అనంతరం పలు ఆధ్యాత్మిక గ్రంథాలతో పాటు, మేగజైన్లను ట్రస్ట్ సభ్యులు, పిరమిడ్ మాస్టర్లతో కలిసి పరిమళ పత్రి ఆవిష్కరించారు. ధ్యాన వేదికపై కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ధ్యానుల, పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, మీడియా కో ఆర్డినేటర్ భాస్కరానందా, ట్రస్ట్ సభ్యులు హనుమంతరాజు, మాధవి, దామోదర్‌రెడ్డి, శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు. ఆకట్టుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం గురువుల ఆధ్యాత్మిక ధ్యాన సందేశాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. శాంతి, ధ్యాన సందేశం ఇచ్చిన శ్రీ కృష్ణ చాముండేశ్వరీ మహర్షిని సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తీకేయన్‌తో పాటు ట్రస్ట్ నిర్వహకులు ఘనంగా సన్మానించారు. అదే విధంగా కళాకారులు ఎంఎస్ పార్వతి బృదం ఆలపించిన గీతాలు, సంస్కృతి ముదాల్కర్ ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ధ్యాన వేడుకలకు సినీ స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ బ్రదర్స్, జ్యోతిష్య శాస్త్రవేత్త రవిశాస్త్రి హాజరయ్యారు. గురువుతో కలిసి ధ్యానం చేస్తున్న స్టంట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ సోదరులు కోలాటం ఆడుతున్న మహిళలు -
బాధ్యతగా పనిచేయండి
బషీరాబాద్: గ్రామాల అభివృద్ధికి పంచాయతీ కొత్త పాలకవర్గాలు బాధ్యతగా పనిచేయాలని, నిధులు ఇచ్చే బాధ్యత తనదని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం బషీరాబాద్, కాశీంపూర్ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22 నెలలుగా సర్పంచులు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయని, త్వరలో విడుదల కానున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో తాండూరు నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చి పంచాయతీలకు కేటాయిస్తామన్నారు. బషీరా బాద్ మేజర్ పంచాయతీ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తామని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి వసతిపై సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. మరో మూడు నెలల్లో మరోసారి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు మంజూరు కానున్నట్లు చెప్పారు. కాశీంపూర్నుఇందిరమ్మ పైలెట్ గ్రామంగా ఎంపిక చేశామనిఎమ్మెల్యే తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు మాధవరెడ్డి, బాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, సీనియర్ నాయకులు రాకేష్ మహరాజ్, రోహిత్ మహరాజ్, శంకర్‌రెడ్డి, కాలాల్ నర్సింలు, సుధాకర్‌రెడ్డి, ఖాలీద్, శ్రీనివాస్‌రెడ్డి, మాలే రాఘవేందర్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
సాగుకు సరిపడా యూరియా
అనంతగిరి: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలు ఇచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సంబంధిత అధికారులకు సూచించారు.సోమవారం కలెక్టరేట్లో నిర్వహించి న ప్రజావాణి కార్యక్రమానికి 25 ఫిర్యాదులు వచ్చా యి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజ లు ఇచ్చిన అర్జీలను పెండింగ్‌లో ఉంచదాదన్నారు. ప్రాధాన్యత క్రమంలో వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో సాగుకు సరిపడా యూరి యా అందుబాటులో ఉందని, రైతులు మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. మొబైల్ యాప్ వినియోగంపై పీఎస్‌లు, జీపీఓలు, వ్యవ సా య విస్తరణ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. కారక్రమంలో అదనపు కలెక్టర్ సుధీ ర్, ట్రైనీ కలెక్టర్ హర్స్ చౌదరి, డీఆర్డీఓ శ్రీనివాస్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన వికారాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో గల ఈవీఎం గోదాంను కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సోమవారం పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ అలీ పాల్గొన్నారు. -
యాచారం ఎస్బీఐ ఎదుట ధర్నా
యాచారం: చౌదర్పల్లి గ్రామ డ్వాక్రా సంఘాల మహిళలు సోమవారం రాత్రి యాచారం ఎస్బీఐ ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు. గతంలో ఇక్కడ మేనేజర్‌గా పనిచేసిన ఝాన్సీరాణి చౌదర్పల్లి గ్రామానికి చెందిన చెందిన డ్వాకా సంఘాల మహిళలకు అందాల్సిన రూ.కోట్లాది రుణాలను, కొంత మంది ఐకేపీ సిబ్బందితో కుమ్ముకై నకిలీ డాక్యుమెట్లు, ఫోర్జరీ సంతకాలతో బినామీల ఖాతాల్లో జమ చేసింది. డ్వాక్రా సంఘాల మహిళల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన డీఆర్డీఓ అధికారులు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇందుకు పూర్తి బాధ్యత మేనేజర్ ఝాన్సీరాణినేనని మహిళలు ఆరోపిస్తున్నారు. బదిలీ అయిన మేనేజర్ ఝాన్సీ చేత రికవరీ చేయించి మా పేర్ల మీదున్న అప్పులు చెల్లించాలని మహిళలు కొద్ది నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీ అయిన మేనేజర్ ఝాన్సీ సోమవారం ఎస్బీఐ బ్యాంకుకు విచారణ వచ్చినట్లు తెలుసుకున్న చౌదర్పల్లి డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు వచ్చి బ్యాంకు గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. సాగర్ హైవేపై ధర్నా చేసేందుకు యత్నిస్తుండగా యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి అక్కడకు వచ్చి మహిళలకు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై ప్రస్తుత మేనేజర్ మాన్యనాయక్ను సంప్రదించగా బదిలీ అయిన మేనేజర్ ఝాన్సీరాణి వచ్చింది, నిజమేనని వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. చౌదర్పల్లి ఘటనలో బదిలీ అయిన మేనేజర్ నుంచి వివరాల సేకరణ బినామీ ఖాతాలకు మళ్లించిన నిధులు చెల్లించాలని డ్వాక్రా మహిళడిమాండ్ -
28న క్రాస్ కంట్రీ పరుగుపందెం సెలక్షన్స్
తాండూరు టౌన్: పట్టణంలోని పాత శాలివాహన కళాశాల మైదానంలో ఈ నెల 28న బాలబాలికలకు క్రాస్‌కంట్రీ పరుగుపందెం పోటీలు, సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం రాములు, రాము, మధు సోమవారం సంయుక్త ప్రకటనలోతెలిపారు. అండర్ –16 బాల,బాలికలకు వేర్వేరుగా 2 కిలోమీటర్లు, అండర్ –18 బాలికలకు 4 కిలోమీటర్లు, బాలురకు 6 కిలోమీటర్లు, అండర్ –20 జూనియర్ మహిళలకు 6 కిలోమీటర్లు, జూనియర్ పురుషులకు 8 కిలో మీటర్లు, 20 ఏళ్లు పైబడిన పురుషులకు 10 కిలోమీటర్ల విభాగంలో క్రాస్‌కంట్రీ పరుగుపందెం పోటీలు ఉంటాయన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు వచ్చే నెల 4వ తేదీన గచ్చిబౌలిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. సెలక్షన్స్‌కు వచ్చే క్రీడాకారులు తహసీల్దార్‌చే ధ్రువీకరించిన ఒరిజినల్ జనన పత్రాన్ని తప్పకుండా తీసుకురావాలన్నారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ 9951343432, 6300075229 లలో సంప్రదించాలన్నారు. ఎన్నికల పారితోషికం చెల్లించాలి అనంతగిరి: పంచాయతీ ఎన్నికల్లో విధులు ని ర్వహించిన ఏఆర్ఓ,ఏఆర్ఓ–2, స్టేజ్–2 రిట ర్నింగ్ ఆఫీసర్లకు పారితోషికం చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, ప్ర ధాన కార్యదర్శి ఎం పాండు కోరారు. ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులందరికీ రూ.4,500, రూ.4 వేలు, రూ.3,500 చొప్పు న చెల్లించాలన్నారు.ఈ మేరకు సోమవారం జిల్లా పంచాయతీ అధికారి జయసుధకువినతిప త్రం అందజేశారు. అలాగే మే –2005 వేసవిలో 5 రోజుల వృంత్యంతర శిక్షణలో పాల్గొన్న ఎస్జీటీ, ఎస్ఏ, జీహెచ్ఎంలకు ఈఎల్స్ ఇవ్వాలని డీఈఓ రేణుకాదేవికి వినతిపత్రం అందజేశారు. వాహనాల పార్కింగ్‌కు వేలం అనంతగిరి: వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం వద్ద వాహనాల పార్కింగ్ డబ్బు వసూలు హక్కుకై బుధవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో నరేందర్, ధర్మకర్త పద్మనాభం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1, 2026 నుంచి డిసెంబర్ 31 2026 వరకు(ఏడాదిపాటు) వేలం వర్తిస్తుందన్నారు. ఆసక్తిగల వారు రూ.2 లక్షల నగదు రూపంలో డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు ఆలయ ఆవరణలో వేలం ఉంటుందన్నారు. ఉచితంగా నట్టల నివారణ మందు అనంతగిరి: గొర్రెలు, మేకల్లో నట్టల నివారణకు ఉచితంగా మందు పంపిణీ చేయనున్నట్లు జిల్లా పశు వైద్యాధికారి సదానందం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2 లక్షల గొర్రెలు, 3 లక్షల మేకలు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు వందశాతం సబ్సిడీపై నట్టల నివారణ మందుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పశు వైద్య శాఖ సిబ్బంది 50 బృందాలుగా ఏర్పడి జిల్లాలోని ప్రతీ గ్రామాన్ని సందర్శిస్తూ జీవాలకు మందు తాగిస్తారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఓవరాల్ చాంపియన్స్‌గా గురుకుల విద్యార్థులు అనంతగిరి: నగరంలోని శామీర్‌పేటలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జరిగిన ఉమ్మడి జిల్లా క్రీడా పోటీల్లో వికారాబాద్‌కు చెందిన మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్స్‌గా నిలిచారు. సోమవా రం కళాశాల ప్రిన్సిపాల్ మహబూబా ఫాతిమా విద్యార్థులను, పీడీ స్వాతిను అభినందించారు. -
అతివేగంగా వెళ్తున్న డీసీఎం బోల్తా
పరిగి: మద్యం మత్తులో డీసీఎం డ్రైవర్ పట్టణ కేంద్రంలో బీభత్సం సృష్టించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్ వైపు నుంచి సోమన్గుర్తి స్టీల్ ఫ్యాక్టరీకి స్క్రాప్ లోడ్‌తో అతివేగంగా, అజాగ్రత్తగా వస్తున్న డీసీఎం బహార్‌పేట్ మూల మలుపున చికెన్‌సెంటర్ ఎదుట బోల్తా పడింది. ఈ ప్రమాదంతో ఆటో, బైక్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్న చిన్నారి త్రుటిలో తప్పించుకుంది. జాలి కిందికి వెళ్లిన చిన్నారిని స్థానికులు వెంటనే స్పందించి రక్షించారు. రోడ్డు ప్రమాదం జరిగినా ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై డీసీఎం బోల్తా పడటంతో గంటకుపైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రమాణం చేయక ముందే హామీ నిలబెట్టుకుని
కేశంపేట: ఎన్నికల సమయంలో నాయకులు హా మీలు ఇస్తుంటారు.. మర్చి పోతుంటారు.. కానీ ఆ గ్రామంలో వార్డు సభ్యురాలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాన్ని ప్రమాణ స్వీకారం చేయక ముందే నిలబెట్టుకున్నారు. మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలోని 4వ వార్డు సభ్యురాలిగా పసుల స్వప్న ఎన్నికల బరిలో నిలిచారు. ప్రచారం నిర్వహిస్తుండగా నీటి సమస్యను కాలనీవాసుల ద్వారా తెలుసుకొని నూతనంగా బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం వార్డులో బోరు వేయించారు. త్వరలోనే మోటారును ఏర్పాటు చేసి కాలనీలో నీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు మల్లేశ్‌యాదవ్, మాజీ సర్పంచ్ నవీన్‌కుమార్, ఉప సర్పంచ్ దర్శన్, మాజీ మండల కో–ఆప్షన్ సభ్యులు జమాల్‌ఖాన్, నరేష్‌యాదవ్, కుంటి లక్ష్మయ్య, జగన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కృష్ణయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ముహూర్తానికి వేళాయే
● నేడు నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం ● ప్రత్యేక సమావేశంతో కొలువు దీరనున్న పాలకవర్గం ● త్వరలోనే శిక్షణ తరగతులుమూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యేకాధికారులు వారితో ప్రమాణం చేయించి బాధ్యతలు అప్పగిస్తారు. ఆ వెంటనే కొత్త పాలకవర్గం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. దీని కోసం గ్రామ సచివాలయాలు ముస్తాబయ్యాయి. బషీరాబాద్: గ్రామ పంచాయతీలకు 22 నెలలుగా కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలనకు నేటితో తెరపడనుంది. మండలంలోని 39 గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీర బోతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 22ను అపాయింట్మెంట్ డేగా ప్రకటించింది. దీంతో పంచాయతీరాజ్ అధికారులు కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2024 ఫిబ్రవరి 2 నుంచి పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతూ వచ్చింది. అయితే సోమవారంతో పాలనా పగ్గాలు కొత్త సర్పంచుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. అనంతరం సర్పంచ్ అధ్యక్షతన మొదటి సమావేశం జరుగుతుంది. మరోవైపు నూతన సర్పంచులకు, ఉప సర్పంచులకు ప్రభుత్వం ఈ నెలాఖరు నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ముస్తాబైన జీపీలు దోమ: మండల వ్యాప్తంగా మొత్తం 36 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటిని ఎన్నికలు నిర్వహించగా ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. సోమవారం వారి ప్రమాణ స్వీకారం జరగనుండగా, ఆయా జీపీలకు పంచాయతీ కార్యదర్శులు రంగులు వేసి ముస్తాబు చేస్తున్నారు. గూడులేని పంచాయతీలు! మండలంలో కాశీంపూర్, రెడ్డిఘనాపూర్, మంతట్టి, గొట్టిగఖుర్ధు, నవల్గా, నీళ్లపల్లి, కొర్విచెడ్, బసీరాబాద్, మైల్వార్, ఎక్మాయి, మంతన్‌గౌడ్‌తండా, జీవన్గీ జీపీలకు సొంత భవనాలున్నాయి. తొమ్మిది జీపీలు మల్కన్‌గిరి, బాద్లాపూర్, బాద్లాపూర్‌తండా, కంసాన్పల్లి(బి), బోజ్యానాయక్‌తండా, హంక్యానాయక్తండా, పర్శానాయక్తండా, గంగ్వార్, నంద్యనాయక్తండాలలో భవనాలు లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలు, అద్దె ఇళ్లల్లో తాత్కాలికంగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరుటకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే ఇస్మాయిల్‌పూర్, జలాల్పూర్, పర్వత్‌పల్లి, మర్పల్లి, బాబునాయక్‌తండా, ఇందర్‌చెడ్, క్యాద్గీరా, మాసన్పల్లి, కొత్లాపూర్, వాల్యానాయక్‌తండా, గొట్టిగఖుర్ధు పంచాయతీలకు కొత్త భవనాలున్నాయి. ఇవి కూడా ప్రారంభం కాకపోవడంతో అంగన్వాడీ, అద్దె ఇళ్లల్లో కొనసాగనున్నాయి. -
లోక్ అదాలత్‌లో 95 కేసులకు పరిష్కారం
తాండూరు: పట్టణంలోని న్యాయస్థానంలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శివలీల ఆధ్వర్యంలో జరిగిన లోక్ అదాలత్‌కు తాండూరు సబ్ డివిజన్ పరిధిలో నుంచి మొత్తం 95 కేసులు వచ్చాయి. ప్రిన్సిపల్ జేసీజే కోర్టుకు 78 కేసులు, అడిషనల్ జేసీజే కోర్టుకు 4, సైబర్ క్రైమ్ కేసులు 13 కేసులు న్యాయమూర్తి ముందుకు వచ్చాయి. ఈ కేసులను కొట్టి వేసి అర్జీదారులకు కక్షిదారులకు శాశ్వత పరిష్కారం కల్పించారు. కార్యక్రమంలో జాతీయ లోక్ అదాలత్ సభ్యులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత తాండూరు రూరల్: మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. చిట్టిఘనాపూర్, చంద్రవంచ గ్రామ శివారులో కాగ్నా నది నుంచి అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తాండూరు పట్టణానికి తరలిస్తున్నారు. ఇదంతా కొన్ని రోజుల నుంచి జరుగుతున్నా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. తాజాగా చిట్టిఘనాపూర్ కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తాండూరుకు తరలిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు బెల్కటూర్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కరన్‌కోట్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వినోద్ రాథోడ్ తెలిపారు. త్వరలో చంద్రవంచలో ఇసుక అక్రమ రవాణాను అరికడతామని ఎస్ఐ చెప్పారు. 28న దివ్యాంగుల సమావేశం అబ్దుల్లాపూర్‌మెట్: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డికి తెలంగాణ ప్రతిభావంతుల వికలాంగుల సేవా సంఘం సభ్యులు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ నెల 28న సంఘం తరఫున కుంట్లూరు డివిజన్ రాజీవ్‌గృహకల్పలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని ఎంపీని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బి.రాంచంద్రయ్య, సభ్యులు గ్యార మహేశ్, గొల్ల పాండు తదితరులు పాల్గొన్నారు. టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం షాద్‌నగర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం పట్టణంలోని మహబూబ్‌నగర్ రోడ్డుపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. షాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన జగన్(38) వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై షాద్‌నగర్‌కు వచ్చారు. పట్టణంలోని ముఖ్య కూడలి మీదుగా మహబూబ్‌నగర్ రోడ్డు వైపు వెళుతుండగా లావణ్య బార్ ఎదురుగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో వాహనం జగన్ పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ రాజేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. హుడాకాంప్లెక్స్: మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ డివిజన్లో అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి సన్నాహాలు చేపడుతున్నట్లు జిల్లా ఫైర్ అధికారి– 2 బి.కేశవులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫైర్‌స్టేషన్ నిర్మాణానికి గతంలో కలెక్టర్ 900 గజాల స్థలాన్ని సరూర్‌నగర్‌లో మంజూరు చేశారని అన్నారు. నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సరూర్‌నగర్, బాలాపూర్ ప్రజల సౌకర్యార్థం రెండేళ్ల క్రితం ఎల్బీనగర్ ఫైర్‌స్టేషన్ మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. -
న్యూఇయర్ వేడుకల్లో మద్యం వినియోగానికి అనుమతి తప్పనిసరి
శంషాబాద్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రాజేంద్రనగర్: నూతన సంవత్సరం ప్రారంభ వేడుకల్లో మద్యాన్ని వినియోగించాలనుకుంటే తప్పనిసరిగా ఎకై ్సజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని శంషాబాద్ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దేవేందర్ సూచించారు. ఈవెంట్లతో పాటు ఫంక్షన్ హాళ్లు, క్లబ్‌లు, ఫామ్‌హౌస్ తదితర ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మద్యం సేవిస్తే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఆదివారం ఉప్పర్‌పల్లిలోని స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గత సంవత్సరం స్టేషన్ పరిధిలో 20 ఈవెంట్లు నిర్వహించారన్నారు. వారందరికీ ఎకై ్సజ్ శాఖ తరఫున మద్యం వినియోగించేందుకు అనుమతులు ఇచ్చామన్నారు. అనుమతులు తీసుకోకుండా ఈవెంట్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్టేషన్లో సైతం దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉందన్నారు. వేడుకల్లో విదేశీ మద్యంతో పాటు ఇతర రాష్ట్రాల మద్యం, డ్యూటీ ఫ్రీ మద్యాన్ని వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని గమనించి ఎకై ్సజ్ శాఖ తరఫున అనుమతులు తీసుకోవాలని కోరారు. -
మా పొలంలోకి నాలా మళ్లించారు
శంకర్పల్లి: ప్రైవేట్ భవన నిర్మాణ సంస్థ తమ అధీనంలోని భూమిలో నక్ష నాలాని ఉందంటూ, రికార్డులు మార్చారంటూ శంకర్‌పల్లికి చెందిన రైతులు సానికే పాండు, కృష్ణ, ఆంజనేయులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్ సర్వే నం.24, 25లో తమ ముగ్గురు అన్నదమ్ములకు దాదాపు 12 ఎకరాల భూమి ఉందన్నారు. దీనిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే సర్వే నం.23లో ఓ పెద్ద భవన నిర్మాణ సంస్థ విల్లాల నిర్మాణం చేపట్టింది. దాంట్లో ఉన్న నక్ష నాలాని సర్వే నం.25లో ఉన్నట్లు అక్రమంగా రికార్డుల్లోకి ఎక్కించారని ఆరోపించారు. దీనిపై గత ఆరు నెలల నుంచి పోరాటం చేస్తూ, డిసెంబర్ 1న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు. డిసెంబర్ 3న హైకోర్టు న్యాయమూర్తి గతంలో ఉన్న మాదిరిగానే ఉన్నట్లు నక్ష నాలాని పునరుద్ధరించాలని సంబంధిత నీటి పారుదల, రెవెన్యూ అధికారులను ఆదేశించారని చెప్పారు. కోర్టు తీర్పు వచ్చినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మొర పెట్టుకున్నారు. ఇప్పటికై నా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
లోడర్ కిందపడి కార్మికుడి మృతి
బొంరాస్‌పేట: మండలంలోని చౌదర్పల్లి శివారులో గల శ్రీ సాయి లక్ష్మీ మెటల్ ఇండస్ట్రీస్‌లో ఆదివారం రాత్రి కార్మికుడు మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు, బృంధువుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఖాషీంపాషా(29) పదిహేనేళ్లుగా పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రాత్రి కంకర నింపుతున్న క్రమంలో లోడర్ కిందపడి చనిపోయాడు. శరీరంలోని సగభాగం పూర్తిగా దెబ్బతింది. పరిగి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యన మృతిచెందాడు. మృతదేహాన్ని కొడంగల్ మార్చురిలో ఉంచారు. మృతుడికి భార్య గౌసియాబేగం, ఐదేళ్ల కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కొడంగల్ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నీటూర్ గేటు సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ పట్టణానికి చెందిన వెంకటేశ్(33)కు ఇటీవల వివాహం జరిగింది. అత్తగారిల్లు కర్ణాటక రాష్ట్రంలోని బూర్గుపల్లి గ్రామానికి హైదరాబాద్ నుంచి బైక్‌పై వెళుతున్నాడు. ఈ క్రమంలో మండల పరిధిలోని నీటూర్ గ్రామ గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్ పై నుంచి లారీ వెళ్లడంతో శరీరభాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. గమనించిన పరిసరవాసులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి సంబంధీకుల ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలిబీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి మొయినాబాద్‌రూరల్: సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంపల్లి అనంతరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కాశీంబౌలిలో సర్పంచ్, వార్డు సభ్యులను ఆయన నాయకులతో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముదిగొండ రవియాదవ్, కాశీంబౌలి సర్పంచ్ రాజేందర్‌రెడ్డి, సుధాకర్‌యాదవ్, పరమేశ్, చిన్న పాల్గొన్నారు. -
కొహెడను డివిజన్‌గా ప్రకటించాలి
తుర్కయంజాల్: కొహెడ ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. తుర్కయంజాల్ సర్కిల్‌ను చార్మినార్ నుంచి ఎల్బీనగర్ జోన్లో చేర్చాలని, జీహెచ్ఎంసీ 53వ డివిజన్‌కు కొహెడ పేరు పెట్టాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇష్టానుసారంగా డివిజన్ల విభజన చేపట్టిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని అన్నారు. సుమారు 80వేలకు పైగా ఓటర్లున్న తుర్కయంజాల్ సర్కిల్‌ను రెండు డివిజన్లు మాత్రమే చేయడం ద్వారా పరిపాలన సౌలభ్యంగా ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మరో డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కోఆర్డినేటర్ కందాల బల్దేవ్ రెడ్డి, కో కన్వీనర్లు సింగిరెడ్డి రాంరెడ్డి, కొమిరిశెట్టి భిక్షపతి, అంగత్ కుమార్, నాయకులు బాల్‌రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు. -
ప్రకృతి విపత్తులపై మాక్ ఎక్సర్సైజ్
సాక్షి, సిటీ బ్యూరో: ప్రకత్తి విపత్తులపై నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో సోమవారం మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్‌న్స్ హాల్లో మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమ నిర్వహణపై అగ్నిమాపక, ఎన్ఆర్డీఎఫ్, మెడికల్ ,రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న, హైడ్రా డీఎఫ్ఓ యజ్ఞ నారాయణ, సీఈ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, బాధితుల తరలింపు, పునరావాస కేంద్రాల ఏర్పాట్లు, వైద్య సహాయం అందించే విధానంపై అవగాహన కల్పించడమే మాక్ ఎక్సర్సైజ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ ఈవెంట్ కు జిల్లా ఫైర్ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. అధికారులు తమ శాఖల ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో చేపట్టిన ఏర్పాట్లను నిర్దేశించిన సమయానికి పూర్తిచేసి అందుబాటులో ఉంచాలని, కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులకు నిర్వహణ విధివిధానాలపై సలహాలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్డీసీలు రవి, శ్రీనివాస్, ఎన్ఆర్డిఎఫ్ మేనేజర్ భూపేందర్ కుమార్, పోలీస్, రెవిన్యూ, జిహెచ్ఎంసి, విద్యు త్, ఆర్అండ్బీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నిందితులను కఠినంగా శిక్షించాలి
ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ తాండూరు టౌన్: వరకట్నం తేవాలంటూ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ, సీపీఎం, మహిళా, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల తాండూరు పట్టణం సాయిపూర్‌కు చెందిన అనూష(20)ను భర్త పరమేష్ అత్యంత దారుణంగా కర్రతో కొట్టి చంపిన విషయం విధితమే. మృతురాలి తల్లి చంద్రమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులను ఆదివారం వారు పరామర్శించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. అందరినీ ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుని భార్యను హత్య చేయడం దారుణమన్నారు. విచక్షణ కోల్పోయి, క్రూర జంతువులా ప్రవర్తించిన భర్త పరమేష్‌ను, కట్నం తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేసిన అత్త, మామలతో పాటు, హత్యకు కారకులైన వారి కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నేరాలకు కారణమైన డ్రగ్స్, మద్యం వంటి వాటిని అరికట్టడం, మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఇలాంటివి పునరావృతమైతే ప్రజల నుంచి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని కేఎన్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్, సీపీఎం నాయకుడు కె.శ్రీనివాస్, మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్, చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అలివేలు, మల్కయ్య, పి.శ్రీనివాస్, సాధిక్, శివకుమార్ తదితరులు హెచ్చరించారు. -
నేడు క్రిస్మస్ విందు
తహసీల్దార్ తారాసింగ్ తాండూరు రూరల్: నియోజకవర్గంలోని క్రిస్టియన్లకు సోమవారం ప్రభుత్వం తరఫున క్రిస్మస్ విందు ఇవ్వనున్నట్లు తహసీల్దార్ తారాసింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి హాజరవుతారన్నారు. క్రిస్టియన్లు విందుకు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి తాండూరు రూరల్: ఎల్మకన్నె గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గ్రామంలో నూతనంగా ఎన్నికై న సర్పంచ్ బ్యాగరి నరేష్ ఆదివారం హైదరాబాద్‌లో మహేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలోని కొత్త సర్పంచ్‌లకు అన్ని విధాలా అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వై రాములు, నాగప్ప, రాజు, నరేష్, చాకలి రాజు, అశోక్ తదితరులు ఉన్నారు. పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప పరిగి: రాజీయే రాజమార్గమని పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప అన్నారు. ఆదివారం పట్టణంలోని కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. 58 కేసులను ఇరువురి ఒప్పందంతో పరిష్కరించారు. 108 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పరిష్కరించి రూ.1,92,000 జరిమానా విధించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్షణికావేశంలో తప్పులు చేసి జైలుపాలు కావొద్దని సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి వేదిక అన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. కేసులు ఉన్న వారు ఎప్పుడైనా రాజీ కావచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వహబ్ తాండూరు టౌన్: మైనార్టీ ఉపాధ్యాయుల పట్ల విద్యాశాఖ అధికారులు చూపుతున్న వివక్షను వ్యతిరేకిస్తున్నట్లు మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వహబ్ అన్నారు. ఆదివారం ఆయన సమితి సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లోని జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న ఖలీల్ పాషాకు రావాల్సిన వేతనం, ఇంక్రిమెంట్లను విద్యాశాఖాధికారులు అకారణంగా నిలిపివేయడం సమంజసం కాదన్నారు. సాహితీవేత్త అవార్డు గ్రహీత అయిన ఆయనపై స్కూల్ హెచ్ఎం, ఎంఈఓ కావాలనే పక్షపాతం చూపుతున్నారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయానికి పాఠశాల ఎదుట టెంటు వేసుకుని శాంతియుత దీక్ష చేస్తున్నప్పటికీ వారిలో స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. మైనార్టీ ఉపాధ్యాయుని పట్ల అధికారులు చూపుతున్న వివక్షకు నిరశనగా రాష్ట్ర మైనార్టీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోనలు చేస్తామని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. దీనిపై సీఎంతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. వెంటనే ఖలీల్ పాషాకు న్యాయం చేయాలని లేకుంటే ఆమరణ నిరాహార దీక్షలకు సైతం వెనకాడేది లేదన్నారు. సమావేశంలో సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ వసీమ్, ముస్తఫా, ఎండి సమి, ఎండి సాదిక్, అంజద్ అలీ పాషా, ఫర్హాద్, వాసే, గౌస్, అబ్రార్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం నిధులతోనే అభివృద్ధి
● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ● బీజేపీ సర్పంచ్‌లకు సన్మానం అనంతగిరి: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి జరుగుతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని కొండా బాలకృష్టారెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేసి గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ పాలన వచ్చాకే గ్రామాల రూపు రేఖలన్నీ మారిపోయాయన్నారు. ప్రతి పల్లెకూ నేరుగా కేంద్రం నిధులు అందుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో రోజు వారి కూలీ ధరలు పెంచిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. పనిదినాలను పెంచడం జరిగిందన్నారు. గ్రామాల్లో వేస్తున్న రోడ్డన్నీ ఉపాధి హామీ పథకం కింద మంజూరైనవేని అన్నారు. రైతులకు ఏడాదిలో రెండు దఫాలుగా పంట పెట్టుబడి డబ్బు అందజేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. చేసిన పనులకు బిల్లులు మంజూరు కాలేదని, దీంతో సర్పంచ్‌లు అప్పులపాలయ్యారని పేర్కొన్నారు. సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు చేపట్టి అందరి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని, ఆ కుటుంబంలోనే ఇప్పుడు కొట్టాటలవుతున్నాయని ఆరోపించారు. నేటి పరిస్థితులను చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యేట్లున్నాయని ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు, జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సదానందారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్‌కుమార్, నాయకులు శివరాజు, మారుతీకిరణ్, వికారాబాద్ కోఆర్డినేటర్ వడ్ల నందు, కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రాచ శ్రీనివాస్‌రెడ్డి, కేపీ రాజు, విజయభాస్కర్, పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, పోకల సతీష్, రాజేందర్‌రెడ్డి,, సుచరితారెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పాలకులొచ్చేశారు..
వికారాబాద్: గ్రామ పంచాయతీ పాలకమండళ్లు సోమవారం కొలువుదీరనున్నాయి. ఈ నెల 20నే కొత్త సర్పంచులు బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్నా ముహూర్తాలు బాగాలేవనే అభ్యర్థన మేరకు ప్రభుత్వం 22వ తేదీకి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మార్చింది. దీంతో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఏర్పాట్లలో మునిగితేలారు. ముఖ్య నాయకులు, తెలిసిన వారిని ఆహ్వానిస్తున్నారు. 2019 జనవరిలో జీపీ ఎన్నికలు జరగ్గా 2024 జనవరితో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన సాగింది. ప్రస్తుతం కొత్త సర్పంచ్‌లు గెలిచిన నేపథ్యంలో ప్రత్యేక పాలనకు తెరపడింది. ముస్తాబైన పంచాయతీలు జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కొత్త పాలనకు కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి. సర్పంచులు కొత్త కుర్చీలు, ఫర్నీచర్ తెచ్చుకొని పాలన ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. మరోవైపు ఆత్మీయులు, బంధుమిత్రులను తమ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాలని ఆహ్వానిస్తున్నారు. అంతేకాకుండా గెలిచిన ఆనందంలో సన్నిహితులతో కలిసి విందులు, వినోదాలు చేస్తున్నారు. ఓడిపోయిన వారు బాధలో ఉండగా గెలిచిన వారు ఫాంహౌస్‌లు, పొలాలు, పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలు చేసుకోవడంలో మునిగిపోయారు. జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలు, 5,058 వార్డులు ఉన్నాయి. 75 జీపీలు ఏకగ్రీవం కాగా మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆర్థిక సంఘం నిధులపైనే.. పోలింగ్ ప్రక్రియ ముగిసిన రోజే ఉపసర్పంచ్‌లను కూడా ఎన్నుకున్నారు. ఈ నెల 17వ తేదీతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. 22న కొత్త పాలకమండళ్ల ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రమాణం చేయించడానికి జిల్లా పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త పంచాయతీలు కొలువుదీరిన అనంతరం మొదటి సమావేశం జరునుంది. జిల్లాకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు కూడా త్వరలో విడుదల కానున్నాయని పంచాయతీ అధికారులు తెలియజేస్తున్నారు. రెండేళ్లుగా సర్పంచులు లేకపోవటం, నిధుల విడుదల ఆగిపోవంతో ప్రస్తుతం పంచాయతీలు అభివృద్ధి కుంటుపడింది. అంతేకాకుండా గత పాలకుల హయాంలో చేసిన పనులకు సంబంధించిన రూ.30 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులలేమి, ప్రజా ప్రతినిధులు లేకపోవటంతో పంచాయతీలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రోడ్లు, వీధి దీపాల వంటి సమస్యలు పల్లెలను పట్టి పీడిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే సర్పంచులకు తిప్పలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేడే సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం స్వాగతం పలకనున్న కార్యదర్శులు జిల్లాలో 594 పంచాయతీలు, 5,058 వార్డులు గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలు సవాల్‌గా మారనున్న నిర్వహణ భారం 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆశలుకొత్తగా ఎన్నికై న సర్పంచులకు నూతనంగా రూపుదిద్దుకున్న పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. గ్రామపాలన, సర్పంచుల విధులు, బాధ్యతలు, నిధులు, హరితహారం, గ్రామాభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, అంతర్గత రోడ్లు నిర్మాణం తదితర వాటిపై అవగాహన కల్పించనున్నారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల వారీగా మూడు విడతలుగా ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన సామగ్రి, స్టేషనరీని సమకూర్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు తీసుకుంటే తమ గ్రామాలు, వార్డులు బాగుపడతాయని ఆయా ప్రాంతాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. -
కుష్టు రహిత సమాజమే లక్ష్యంగా..
కొడంగల్ రూరల్: కుష్టు వ్యాధిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి కార్యాచరణ మొదలు పెట్టింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ వ్యాధి గ్రస్తులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేయనుంది. ఇందుకోసం 698 మంది ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకుంటోంది. వ్యాధి వ్యాప్తి ఇలా.. కుష్టువ్యాధి అనేది లెప్రో మైక్రో బ్యాక్టీరియా, లెప్రమోటోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస ద్వారా బ్యాక్టీరియా ఇతరులకు చేరుతుంది. ఇది సోకిన ఏడు రోజుల వరకు బ్యాక్టీరియా బతికే ఉంటుంది. శరీరంపై తెల్టి, రాగి, స్పర్శలేని మచ్చలు, మొద్దుబారిన మచ్చలు రావడం, ఆ ప్రదేశంలో స్పర్శ లేకపోవడం, చేతి గోళ్లలో, నరాల్లో తిమ్మిర్లు రావడం, శరీరంపై వెంట్రుకలు రాలిపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. వైద్యుల సలహా మేరకు మందులు వాడితే వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ముందుగా గుర్తిస్తే మంచిది కుష్టు వ్యాధి అనేది అంత ప్రమాదకరమైనది కాదని, పూర్తిగా నయం కాని జబ్బేమి కాదని, నిర్లక్ష్యం చేస్తే మాత్రం కబళించే ప్రమాదం ఉంటుందని, మల్టీడ్రగ్ థెరపీతో నయం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా చికిత్స అందజేస్తున్నారు. ఇంటింటి సర్వే.. జిల్లాలో ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 698 మంది ఆశా కార్యకర్తలతో 1,99,465 కుటుంబాల్లో ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. రోజూ ఒక్కో బృందం 20 నుంచి 25 ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి కుటుంబంలో వారి ఆరోగ్య పరిస్థితి ఏంటన్నది గుర్తిస్తూ వ్యాధి సంబంధిత లక్షణాలున్న వారిని గుర్తిస్తూ పేర్లు, వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే వారి వివరాలను సేకరిస్తూ జిల్లా స్థాయి వైద్య బృందం 15 రోజులపాటు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే పూర్తి స్థాయిలో వైద్యం అందించనున్నారు. ఇప్పటికే జిల్లాలో 78 మందికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆశ కార్యకర్తలు ఇంటింటి సర్వే చేపడుతూ ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు కృషి చేయాలని, వ్యాధిగ్రస్తులకు వైద్య సహాయం అందిస్తూ వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అడుగులు అనుమానితులను గుర్తించే పనిలోవైద్య ఆరోగ్య శాఖ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా చికిత్స, మందులు కుష్టు వ్యాధిని అంతం చేయడమే ప్రభుత్వం లక్ష్యం. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయి నుంచి వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. వైద్యుల సూచనలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడడంతో వ్యాధి తగ్గుతుంది. – డాక్టర్ రవీంద్రయాదవ్, టీబీ, లెప్రసీ ప్రోగ్రామ్ జిల్లా అధికారి -
కక్ష సాధింపు చర్యలు సరికాదు
● ఉపాధి హామీ పథకం పేరు మార్పు దారుణం ● డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ ● వికారాబాద్ పట్టణంలో నిరసన ర్యాలీ అనంతగిరి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ అన్నారు. టీపీసీసీ పిలుపు మేరకు ఆదివారం వీబీ–జీ రామ్–జీ –2025 బిల్లుకు వ్యతిరేకంగా వికారాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ పార్కు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ పేరు మార్చినంత మాత్రాన ప్రజల నుంచి గాంధీ కుటుంబాన్ని దూరం చేయలేరన్నారు. ఈ బిల్లు తీసుకురావడం రాజకీయ కక్ష సాధింపు తప్ప, ప్రజలకు మంచి చేసే పని కాదన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్తో పల్లెల్లో ఎంతో మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు. ఈ పథకాన్ని రద్దు చేస్తే నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదానీ, అంబానీల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. కరోనా సమయంలో ఈ పథకం ద్వారా ఎంతోమందికి ఉపాధి లభించిందని గుర్తుచేశారు. ప్రజల పక్షాన ఉంటూ పోరాటం చేస్తామని తెలిపారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్, మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్, మహేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ డైరక్టర్ కిషన్‌నాయక్, ఆర్టీఏ మెంబర్ ఎర్రవల్లి జాఫర్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ రమేష్‌కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు ఎండీ హఫీజ్, గుడిసె లక్ష్మణ్, ఏఎంసీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు మల్లేశం, శ్రీనివాస్, సతీష్‌రెడ్డి, వహిద్మియా, శ్రీనివాస్‌గౌడ్, దీపు, వేణుగోపాల్ పాల్గొన్నారు. -
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
షాద్‌నగర్‌రూరల్: ప్రతిరోజు యోగా సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు ఆదివారం యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. యోగాతో అనేక దీర్ఘకాలిక రుగ్మతలకు ఉపశమనం లభిస్తుందని అన్నారు. నిత్యం యోగా సాధనతో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ విజయ్‌కుమార్, కేశంపేట సీఐ నరహరి, ఎస్ఐలు సుశీల, శ్రీకాంత్, రాంచంద్రయ్య, ప్రణయ్, రాజేశ్వర్, రవీందర్‌నాయక్, విజయ్, పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భూములు అప్పగిస్తే రూ.20 లక్షలు
● జనరల్ అవార్డు ప్రకటిస్తే రూ.7లక్షలే.. ● అదనపు బెనిఫిట్లు అందవని అధికారుల వెల్లడి దుద్యాల్: మండల పరిధిలోని లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల్లో ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక వాడ కొరకు గతంలో ప్రభుత్వం 1,175.35 ఎకరాల భూ సేకరణ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రైతులు అంగీకారం తెలుపుతూ దాదాపు వెయ్యి ఎకరాల భూ సేకరణ పూర్తయింది. మిగిలిన 175.35 ఎకరాల భూమిని రైతులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. పలు మార్లు రెవెన్యూ అధికారులు లగచర్ల గ్రామంలో అభిప్రాయ సేకరణ సమావేశాలు నిర్వహించి సంబంధిత రైతులకు వివరించారు. భూములు ఇవ్వకుంటే జనరల్ అవార్డు కింద కోర్టు అప్పగిస్తామని రైతులకు చెప్పారు. ఇలా చేస్తే ఎకరాకు దాదాపుగా రూ.7 లక్షలు మాత్రమే వస్తాయని, అదనపు బెనిఫిట్లు రావని రైతులకు వివరించారు. అక్టోబర్ 23న సమావేశం నిర్వహించి చివర అవకాశం కల్సిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌లు వివరించారు. రైతుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రెండు రోజుల క్రితం ప్రభుత్వం 175.35 ఎకరాల భూమికి సంబంధించి 58 మంది రైతులకు జనరల్ అవార్డు ప్రకటిస్తున్నట్లు ప్రకటన వెళ్లడించారు. ఇప్పటికై న రైతులు సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే మేలు చేకూరే అవకాశం ఉందని తెలుస్తుంది. జనరల్ అవార్డు కింద కోర్డుకు అప్పగిస్తే ఎకరాకు రూ.7 లక్షల వరకు మాత్రమే వస్తాయని, లేదని అంగీకారం తెలిపి భూములు అప్పగిస్తే ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల డీటీసీపీ లేఅవుట్ కల్గిన ఇంటి స్థలం, ఒక ఇందిరమ్మ ఇళ్లు, పారిశ్రామిక వాడలో కుటుంబానికి ఒక ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వం కోర్డుకు అప్పగించక ముందే రైతులు నిర్ణయం తీసుకుంటే లబ్ధిచేకూరుతుందని, లేదంటే నష్టం పోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రైతులు అంగీకారం తెలుపుతారో..లేదో వేచి చూడాలి. -
సంప్రదాయాలను కాపాడుకోవాలి
ఇబ్రహీంపట్నం రూరల్: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు పేర్కొన్నారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సంస్కృతి, విలువలను, భవిష్యత్తరాలకు అందించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రిన్స్‌పల్ మధుకర్ స్వామి, పల్లవి గ్రూపు డైరెక్టర్ నిహారిక, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు -
నిందితులను శిక్షించాలి
తాండూరు: కోట్‌పల్లి సర్పంచ్ బసమ్మ భర్త సంగయ్యపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని వీరశైవ సమాజం సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం వారు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యకు ఫిర్యాదు చేశారు. అనంతరం పలువురు మాట్లాడారు. దాడిలో గాయపడిన సంగయ్య ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. కార్యక్రమంలో సమాజం సభ్యులతో పాటు సర్పంచ్‌లు మైలారం రాజ్‌కుమార్, పటేల్ విజయ్‌కుమార్, మాజీ కౌన్సిలర్ లింగదల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం యథావిధిగా ప్రజావాణి సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు చెప్పారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. సాక్షి,సిటీబ్యూరో: వరదలు, పరిశ్రమల ప్రమాదాల నివారణపై ఈ నెల 22న సాయంత్రం మాక్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నట్లు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేనిమను చౌదరి తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చర్లపల్లి స్మార్ట్ టెర్మినల్ వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలి, ప్రాణనష్టం తగ్గించేందుకు ఏ చర్యలు తీసుకోవాలి, వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అనే అంశాలపై ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రయోగాత్మకంగా అవగా హన కల్పించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.మేడ్చల్: ఎల్లంపేట్ మున్సిపాలిటీ రావల్కోల్ కు చెందిన రవీందర్ శబరిమల యాత్రలో మృతి చెందాడు. రావల్కోల్ గ్రామస్థులు తెలిపిన మేరకు.. రవీందర్(42) మేడ్చల్‌లో బోర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం గ్రామ అయ్యప్పభక్తులతో కలిసి శబరి యాత్రకు వెళ్ళాడు. పళని సుబ్రమణేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శనివారం కాలినడకన కొండ ఎక్కాడు. కొండ ఎక్కి దేవుడి దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉండగా అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానిక ఆసుపత్రి కి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని మేడ్చల్‌కు తరలిస్తున్నారు. చంచల్‌గూడ: తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి సర్టిఫికెట్లు జారీ చేసిన ఇద్దరిపై మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. చార్మినార్ తహసీల్దారు నిహారిక ఫిర్యాదు మేరకు.. చావణీకి చెందిన నహిదాబేగం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు రెన్యువల్ చేయాలని మహ్మద్మూసా అనే వ్యక్తి మండల కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. వీటిని పరిశీలించిన తహసీల్దారు తన నకిలీ సంతకం, కార్యాలయం సీల్ గతేడాది జారీ అయినట్లు గుర్తించారు.దీంతో మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్టిఫికెట్లు తీసుకొచ్చిన మహ్మద్ ముసాతో పాటు నహిదాబేగంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వెంగళరావునగర్: సైబర్ నేరాలపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నగరంలో ప్రతిరోజు కోటి రూపాయల వరకు ఈ తరహా నేర గాళ్ళు కొట్టేస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ తెలియజేశారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీ శ్రీసాగి రామకృష్ణంరాజు కమ్యూనిటీహాల్లో శనివారం సైబర్‌క్రైమ్‌పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కమిషనర్ సజ్జనర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సగటున రూ.250 కోట్ల మేర నగదును సైబర్ దొంగలు దోచుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా నగర ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహనా శిబిరాల ద్వారా చైతన్య పరుస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, సైబర్ క్రైమ్, వెస్ట్‌జోన్ డీసీపీలు వి.అరవింద్‌బాబు, సిహెచ్.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కోళ్లపడకల్ ఉప సర్పంచ్‌గా మల్లేశ్
మహేశ్వరం: కోళ్లపడకల్ గ్రామ ఉప సర్పంచ్‌గా ఆవుల మల్లేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికలో ఐదుగురు వార్డు సభ్యులు ఆయన పేరును ప్రతిపాదించి, మద్దతు తెలపడంతో ఎంపీడీఓ శైలజ, రిటర్నింగ్ అధికారి రాంప్రసాద్‌రెడ్డి ఎన్నికను ధ్రువీకరించారు. అనంతరం మల్లేశ్ మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన వార్డు సభ్యులు, గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, మల్లేశ్ గతంలో కూడా ఉప సర్పంచ్‌గా గ్రామానికి సేవలందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గజవాడ నరేష్, కాడిగళ్ల శివరాములు, మోడి గాయత్రి, నాగుల వసంత తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ పదవి.. రాజకీయాలకు తొలిమెట్టు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మోమిన్‌పేట: స్థానిక సమస్యలపై దృష్టి సారించి పాలనపై పట్టు సాధించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మల్లారెడ్డిగూడెం సర్పంచ్ నిర్మలా ఉపేందర్‌రెడ్డి శనివారం బీజేపీలో చేరారు. ఈ మేరకు కిషన్ రెడ్డి నగరంలోని తన నివాసంలో వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయంగా రాణించేందుకు సర్పంచ్ తొలిమెట్టు అన్నా రు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటరు వడ్ల నందు, విక్రంరెడ్డి, గ్రామస్తులు ఉన్నారు. సర్పంచ్‌కు మీనాక్షినటరాజన్ అభినందనలు అనంతగిరి: వికారాబాద్ మండల ఎర్రవల్లికి చెందిన ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్ కుమారుడు రబ్బానీ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో జాఫర్ తన కుమారుడితో కలిసి హైద్రాబాద్‌లో కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె రబ్బానీని అభినందించారు. మరో భూ సేకరణకు నోటిఫికేషన్ దుద్యాల్ తహసీల్దార్ కిషన్ దుద్యాల్:ప్రభుత్వం మండల పరిధిలో 139.98 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తహసీల్దార్ కిషన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామంలోని సర్వేనంబర్ 363లో 85 మంది రైతుల నుంచి అసైన్డ్ భూములకు సేకరించనుందని తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో పారిశ్రామిడ ఏర్పాటుకు ఈ భూసేకరణ చేపడుతున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఏడాది క్రితం మండల పరిధిలోని లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు 1,175.35 ఎకరాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు సంబందించిన 1,10 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మిగలిన 74.35 ఎకరాలకు రైతులు అంగీకారం తెలపకపోవడంతో ప్రభుత్వం జనరల్ అవార్డు ప్రకటించింది. ఇటీవల హకీంపేట్, పోలేపల్లి గ్రామాలకు సంబంధించి 55.36 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం విదితమే. ఎర్త్ సెంటర్‌కు ‘ఆట’ ప్రతినిధులు కడ్తాల్: మండల పరిధిలోని అన్మాస్‌పల్లి సమీపంలోని ‘ది ఎర్త్ సెంటర్’ను అమెరికాతెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధులు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్ పర్సన్ లీలాలక్ష్మారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మారెడ్డితో సమావేశమయ్యారు. భూగ్రహం సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ కోసం కలిసి పనిచేయడానికి అవకాశాలపై చర్చించారు. సీజీఆర్, ఆటా సంయుక్తంగా అటు అమెరికాలో, ఇటు భారతదేశంలో చేపట్టబోయే పర్యావరణ కార్యక్రమాలపై ప్రాథమికంగా చర్చలు జరిపారు. సీనియర్ జర్నలిస్ట్, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 15 సంవత్సరాలుగా సీజీఆర్ సంస్థ చేపడుతున్న పర్యావరణ హిత కార్యక్రమాలను ‘ఆట’ ప్రతినిధులకు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు సీజీఆర్ సంస్థ చేపడుతున్న సేవలు బాగున్నాయిని వారు కితాబిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి, ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్‌రెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు. -
పరిషత్ ఎన్నికలపై పార్టీల నజర్
కొడంగల్: పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములను సమీక్షించుకున్న పార్టీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించాయి. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం వేట ప్రారంభించాయి. రిజర్వేషన్ ఏదైనా.. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారి వివరాలను ఇప్పటికే సేకరించి పెట్టుకుంటున్నాయి. అధికారికంగా రిజర్వేషన్లు ఖరారయ్యాక అభ్యర్థిని వెతకటం కన్నా.. ముందస్తుగా ఒక అంచనాకు రావాలనే ఆలోచనతో ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలను పక్కనబెట్టి పార్టీ సూచించిన అభ్యర్థిని గెలిపించాలని, ఆయా పార్టీల నేతలు సూచిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీలో ఆశావహుల నుంచి పోటీ పెరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో అన్ని ప్రాదేశిక స్థానాల్లో విజయం సాధించాలని హస్తం పార్టీ ఆరాట పడుతోంది. బీఆర్ఎస్ సైతం మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, మహేష్ రెడ్డి, రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌లు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. బీజేపీ పలు మండలాల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆశావహులు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రణాళికాబద్ధంగా.. ఇటీవల తమ పార్టీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందిన స్థానాల్లో ఎంపీటీసీ ఎన్నికల్లోనూ సత్తాచాటాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ మేరకు కొంత ముందస్తుగానే అభ్యర్థులను ఎంపిక చేసుకుని, ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని యోచిస్తున్నాయి. ఈ క్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపైనా అంతర్గతంగా కసరత్తు చేస్తున్నాయి. ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది.. గెలిచే సత్తా ఎవరికి ఉంది.సామాజిక, రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి.. తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. రేపు సర్పంచ్ల ప్రమాణ స్వీకారం ఈనెల 22న సోమవారం ఉదయం ఆయా మండలాల్లో కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వార్డు సభ్యులతో ఆయా గ్రామాల్లోనే ప్రమాణ స్వీకారం చేయించాలని అధికారులు భావిస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో కొత్తగా సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేయనున్నారు. వివరాలు ఎంపీటీసీ స్థానాలు 227 జెడ్పీటీసీ స్థానాలు 20 ఎంపీపీ 20 -
పల్లెలకు కొత్తకళ
యాలాల: రెండేళ్ల అనంతరం గ్రామసచివాలయా లు కళకళలాడనున్నాయి. రేపు సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. అంతకు ముందే పంచాయతీ కార్యాలయ భవనాలను సుందరీకరిస్తున్నారు. రంగులతో ముస్తాబు చేయించారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. సామగ్రి ఏర్పాటు జిల్లాలో మొత్తం 194 పంచాయతీలు ఉన్నాయి. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించగా అధికార కాంగ్రెస్ ముందంజలో ఉంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం హోరాహోరీగా పోరాడింది. బీజేపీ పట్టుకో సం ప్రయత్నించింది. కొత్తగా పాలకవర్గం తమ పరిపాలనను ప్రారంభించేందుకు అనువుగా గ్రామ సచివాలయాలను తీర్చిదిద్దుతున్నారు. భవనాలకు రంగులతో పాటు కొత్తగా కుర్చీలు, పాలకవర్గ సభ్యుల వివరాలను భవనాల గోడలపై రాయించారు. కొన్ని పంచాయతీల్లో ప్రధాన వీధు ల్లో భారీ ఎల్ఈడీలను ఏర్పాటు చేయించారు. రేపు ప్రమాణస్వీకారం నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఈ నెల 20న చేపట్టాలని తొలుతు అనుకున్నారు. 20న శనివారం కావడంతో తేదీని మార్చాలని కొందరు నేతలు ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ సమయాన్ని ఈ నెల 22కు మార్చుతున్నట్లు పంచాయతీ రాజ్‌శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. బాధ్యతలే ముందు.. దుద్యాల్: సర్పంచ్‌గా గెలిచాడు. ప్రమాణం చేయలేదు. అయినా బాధ్యతలను ఎరిగి.. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చాడు. నీటి కటకట తీర్చి, ప్రజల మన్ననలు పొందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి సంట్రకుంటతండాకు సరఫరా అయ్యే బోరు మోటార్ నెల రోజుల క్రితం మరమ్మతుకు గురైంది. దీంతో తండాలో నాటి నుంచి తాగునీటి సమస్య నెలకొంది. రోడ్డు పనులు జరుగుతుండడంతో పైప్‌లైన్ లీకేజీ కారణంగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచి, సమస్య జఠిలంగా మారింది. దీంతో తండా వాసులు వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కొత్త సర్పంచ్ మాణిక్య నాయక్.. బోరు మోటార్‌కు శనివారం మరమ్మతు చేయించి, నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో గ్రామస్తులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన వెంట స్థానికులు బాబు నాయక్, వార్డు సభ్యుడు రాహుల్ ఉన్నారు. కొలువుదీరనున్న సర్పంచులు సమస్యలు తీరినట్లే..దౌల్తాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల ఘట్టం ముగిసింది. నూతన సర్పంచులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. రెండేళ్ల పాటు పంచాయతీల్లో ప్రత్యేక పాలన కొనసాగినప్పటికీ.. సమస్యలు పేరుకుపోయి.. పాలన అస్తవ్యస్తంగా మారిందని, కొత్త సర్పంచుల రాకతో ఇక సమస్యలు తీరినట్లేనని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా.. అభివృద్ధి పనుల్లో వేగం పెరగనుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. గడిచిన కాలంలో స్థానిక పాలకులు లేక బోసిన గ్రామ సచివాలయాలకు కొత్తకళ సంతరించుకుంది. భవనాలను రంగులు వేయించి, విద్యుత్ దీపాలతో కళకళలాడేలా చేస్తున్నారు కార్యదర్శులు. కావాల్సిన సామగ్రిని సమకూరుస్తున్నారు. రెండేళ్ల అనంతరం కొత్త పాలకులుకొలుదీరనుండటంతో పల్లెల్లో సందడి నెలకొంది. వారికి స్వాగతం పలికేందుకు కార్యదర్శులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా గ్రామ సచివాలయాలను తీర్చిదిద్దుతున్నారు. కావాల్సిన సామగ్రిని సమకూరుస్తుండగా.. ఇక సమస్యలు తీరినట్లేనని, గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
భవిష్యత్తు ఏఐదే
మొయినాబాద్: భవిష్యత్తు మొత్తం కృత్రిమ మేధస్సు (ఏఐ)తోనే కొనసాగుతుందని ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ యెజ్ఞ నారాయణ అన్నారు. అజీజ్‌నగర్‌లోని కేఎల్‌హెచ్ క్యాంపస్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన థింక్ ఏఐ– 2025 సదస్సు శనివారం ముగిసింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన నిపుణులు ఏఐ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కొన్నేళ్లలో ఏఐ యుగం రాబోతోందని, కొత్త కొత్త ఆవిష్కరణలపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సదస్సులో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, స్పీచ్, సిగ్నల్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై నిపుణులు చర్చించారు. సదస్సులో కేఎల్‌హెచ్ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవీష్, కోయిర్ ఎర్త్ టెక్నాలజీస్ నుంచి డాక్టర్ అమిత్ వర్మ, డెలాయిట్ తరఫున డాక్టర్ సుబ్రజిత్, టీయూ బెర్లిన్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి
నందిగామ: సరుకులతో పరిశ్రమ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే లారీ డ్రైవర్ గుండె పోటుకు గురై మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రంగాపూర్‌లో చోటు చేసుకుంది. నందిగామ ఇన్స్పెక్టర్ ప్రసాద్ కథనం ప్రకారం .. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాలూల్(37) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామ శివారులోని పీఅండ్‌జీ పరిశ్రమలో ఆదివారం సరుకులను లోడ్ చేసుకొని హైదరాబాద్ వైపు బయలుదేరాడు. లారీ నందిగామ మండలం రంగాపూర్ వద్దకు చేరుకోగానే జాలూల్కు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో లారీని రోడ్డు పక్కన నిలిపాడు. స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరకు చికిత్స నిమిత్తం వెళ్లాడు. డాక్టర్ వచ్చే లోపే కుప్పకూలి మృతి చెండాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టరం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. -
పోటీ పరీక్షల్లో ఎదురులేని శ్రీకాంత్
మర్పల్లి: మర్పల్లి మండలం తుమ్మలపల్లికి చెందిన ధనసిరి శ్రీకాంత్ ఉద్యోగ పరీక్షల్లో సత్తాచాటుతున్నారు. గ్రామానికి చెందిన పోచమ్మ, పెంటయ్య దంపతుల కుమారుడైన ఆయన అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీకాం పూర్తిచేశారు. గతంలో గ్రూప్– 4 సర్వీస్‌లో వార్డు ఆఫీసర్‌గా పనిచేశారు. అనంతరం గ్రూప్– 2 ద్వారా మండల పంచాయతీ అధికారిగా ఎంపికై , ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్– 3 ఫలితాల్లోనూ ట్రెజరీ విభాగంలో సీనియర్ అకౌంటెంట్‌గా ఎంపికయ్యారు. ఇలా రాసిన ప్రతీ పరీక్షలో సత్తాచాటుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీకాంత్. కిరాణా దుకాణం దగ్ధం దౌల్తాబాద్: ప్రమాదవశాత్తు ఓ కిరాణా దుకాణం దగ్ధమైంది. ఈ సంఘటన మండల పరిధి బిచ్చాల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందినవెంకటప్ప.. కిరాణ షాపు నిర్వహిస్తున్నారు. ఎప్పటి లాగే శుక్రవారం రాత్రి షాపు మూసి, పక్కనే ఉన్న ఇంట్లోనిద్రించారు. అర్ధరాత్రి వేళలో షాపులో నుంచి మంటలు రావడాన్ని చుట్టుపక్కల వారు గమనించారు. వెంటనే ఫైర్‌ఇంజన్‌ను రప్పించి, మంటలను ఆర్పించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడుతెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. బాధితుడికి ఆర్థిక సహాయంఅందేలా చూస్తానని సర్పంచ్ వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఠాణా పనులు మళ్లీ షురూ దుద్యాల్: దుద్యాల్ గేట్ దగ్గర నిర్మిస్తున్న ఠాణా పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో బేస్మెంట్ చుట్టూ నీరు చేరడంతో అధికారులు పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఠాణాను హకీంపేట్‌కు తరలిస్తారని వదంతులు వచ్చాయి. ఇప్పటికే హకీంపేట్‌లో మరో పీఎస్ మంజూరైన విషయం విదితమే. దుద్యాల్ గేట్ దగ్గర నిర్మిస్తున్న ఠాణాకు దాదాపు రూ.3.5 కోట్లు నిధులు మంజూరయ్యాయి. -
బీజేపీ విధానాలను ఎండగడుతాం
తాండూరు: కేంద్రంలోని బీజేపీ సర్కార్ మతవిద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొంటోందని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ జా దవ్ విమర్శించారు.శనివారం ఆయన తాండూ రు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరు ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చి న వెంటనే నల్లధనాన్ని తెచ్చి పేదలకు రూ. 15లక్షల చొప్పున ఖాతాల్లో జమచేస్తామని మోసం చేసిందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స మయంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక కీలకంగా ఉందన్నారు. జవహర్లాల్ నెహ్రూ కుటుంబానికి చెందిన పత్రిక కావడంతో బీజేపీ ప్రభు త్వం పత్రికపై విషం చిమ్మిందన్నారు. కోర్టులో పత్రికను అనుకూలంగా తీర్పు రావడంతో పాటు కేసు డిస్మిస్ చేసిందన్నారు. 2005లో నా టి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేసిందన్నారు. 20 ఏళ్లుగా ఈ పథకం ద్వారా ఎంతో మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి ల భించిందన్నారు. కొన్నాళ్లుగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వస్తోందన్నారు. ఇటీవల పథకం పేరు మార్చిందని మండిపడ్డారు. తాండూరులోని సిమెంట్ పరిశ్రమ ఇప్పటికే అదాని చేతిలోకి వెళ్లిందన్నారు. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గాంఽధీ పార్కు వరకు నిరసన ర్యాలీ,గాంఽధీ పార్కులో ధర్నా చేపడతామన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్ర తి నిధులు,నాయకులు పార్టీ శ్రేణులు, మద్దతు దారులు పెద్దఎత్తున హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాల, నాయకులు తదితరులున్నారు. -
మాస్టర్ ప్లాన్.. అట్టర్ ఫ్లాప్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) మాస్టర్‌ప్లాన్ లోపభూయిష్టంగా ఉందని, అందులో రైతులకు తీరని అన్యాయం జరిగిందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ రైతులు, పేదలు, అమాయకులు, తమ సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. మాస్టర్‌ప్లాన్ వల్ల 50 వేల మందికిపైగా రైతుల భూములు 11 ఏళ్లుగా కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయని, వాటిని బహుళ వినియోగ జోన్లోకి మార్చకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయారని విస్మయం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్–2013 లోని లోపాలపై శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, సామాజిక కార్యకర్త కరుణా గోపాల్, ఆదర్శరైతు వెంకట్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. బౌరంపేట్ మాజీ సర్పంచ్ డాక్టర్ ఎస్.మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రభుత్వం భూములను విక్రయించి భారీ ఎత్తున సొమ్ము చేసుకోవడం ప్రజాహితం కాదని దత్తాత్రేయ అన్నారు. రైతులు, సాధారణ ప్రజలకు భూమితోనే ఆత్మగౌరవం, సమాజంలో హోదా లభిస్తాయని అన్నారు. మాస్టర్‌ప్లాన్ వల్ల రైతులు ఏళ్ల తరబడి తమ భూములను సద్వినియోగం చేసుకోలేని దుస్థితి నెలకొనడం దారుణమన్నారు. కన్జర్వేషన్ జోన్లో ఉన్న రైతుల భూములను వెంటనే బహుళ వినియోగంలోకి మార్చాలని కోరారు. మాస్టర్‌ప్లాన్ లోపాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్రమైన నివేదికను అందజేసేందుకు త్వరలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జోన్ మార్పిడి కోసం రైతుల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్రంలో భూసేకరణ చేస్తే రైతులు పండుగ చేసుకుంటారని, అక్కడ బయటి వాళ్లకు అమ్ముకుంటే ఎకరానికి రూ.70 లక్షల వరకు లభిస్తుందని, ప్రభుత్వం భూసేకరిస్తే మార్కెట్ రేట్ ప్రకారం రూ.కోటి చొప్పున అందజేస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ ఔటర్‌రింగ్ రోడ్డుకు భూమి సేకరించడంతోనే నగరంలో భూసమస్య మొదలైందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు బాధిత రైతులు పాల్గొన్నారు. హెచ్ఎండీఏ తీరు లోపభూయిష్టంగా ఉందన్న వక్తలు కన్జర్వేషన్ జోన్‌లోని రైతుల భూములకు తీరని అన్యాయం రౌండ్‌టేబుల్ సమావేశంలో దత్తాత్రేయసహా పలువురి ధ్వజం -
పనితీరు నచ్చి కాంగ్రెస్‌లో చేరిక
పరిగి: ప్రజాపాలన పనితీరు నచ్చి నూతన సర్పంచ్‌లు స్వచ్ఛందంగా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని నలుగురు సర్పంచ్‌లు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఆర్ మాట్లాడుతూ.. పరిగి మండలం రావుపల్లి సర్పంచ్ మంజుల, కుల్కచర్ల మండలం లాల్‌సింగ్‌తండా సర్పంచ్ శ్రీనివాస్, దోమ మండలం బట్లచందారం సర్పంచ్ పద్మమ్మ, గండీడ్ మండలం ఆశిరెడ్డిపల్లి సర్పంచ్ భగవంత్‌రెడ్డిలు పార్టీలో చేరారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను అమలు చేసిందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. జిల్లాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధికంగా పరిగి నియోకవర్గంనుంచి గెలుపొందారన్నారు. పేదల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పరశురాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కృష్ణ, ఏబ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు అవగాహన కల్పించండి
అనంతగిరి: ప్రజల జీవితాలను కాపాడాల్సిన బా ధ్యత అధికారులదేనని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం ఆయన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రతలపై సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలు జరగకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులపై గుంతలను పూడ్చివేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. జాతీయ రహదారుల అనుసంధాన రోడ్లను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. మలుపులు ఉన్న రోడ్లను గుర్తించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారుల జంక్షన్లలో సోలార్ వీధిలైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మనందరి భాద్యత అన్నారు. ఆర్టీసీ డ్రైవర్లకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేపట్టి వైద్య సేవలు అందించాలని డిపో మేనేజర్‌కు సూచించారు. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు చెప్పా రు. మోతాదుకు మించి రవాణా చేపడుతున్న వా హనాలను గుర్తించి వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న వాహనాలపై దృష్టి సారించాలని, రవాణ, మైనింగ్ అధికారులు ఉమ్మడి తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, అదనపు ఎస్పీ బి.రాములు నాయక్, రవాణా అధికారి వెంకట్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ జాఫర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
చెస్‌తో మేధోశక్తి పెంపు
తాండూరు టౌన్: ఈ నెల 15న ప్రారంభమైన చెస్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం అట్టహాసంగా ముగిసాయి. ఆర్బీఓఎల్(రాడికల్ బయో కెమికల్ ఆర్గానిక్స్), ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో అండర్–14, అండర్–16 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. అండర్ 14 విభాగంలో క్రిత్విక్ చాంపియన్ షిష్(విశ్వవేద), రన్నర్‌గా రాంచరణ్ (కేవీసీహెచ్), అండర్–16 విభాగంలో విన్నర్‌గా ప్రజ్యోత్ (సెయింట్ మేరీస్), రన్నర్‌గా ఓంకార్ (గౌతమి) నిలిచారు. విజేతలకు ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళారెడ్డి మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధోశక్తి పెంపుదలకు చెస్ పోటీలు ఉపకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య గౌడ్, హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్, ట్రెస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి అభిలాష్ రెడ్డి, ప్రైవేటు పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, రవీందర్ రెడ్డి, మోహనకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షురాలు జెసింత, ఓం ప్రకాష్ సోమాని, ఆలంపల్లి శ్రీనివాస్, కొట్రిక నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆర్బీఓఎల్ ఎండీ సరళారెడ్డి -
‘ఉపాధి హామీ’ రద్దుకు కేంద్రం కుట్ర
అనంతగిరి: ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ అన్నారు. శనివారం వికారాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆయన పార్టీ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా ఏకమై కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్ట పరిరక్షణకు ఊరూరా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కూలీని రూ.307 నుంచి రూ.600 లకు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, సుదర్శన్, సతీశ్, నవీన్‌కుమార్, యాదయ్య, శ్రీనివాస్, పవన్, కృష్ణ, దావిద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. పథకం పేరు మార్పు సరికాదు పరిగి: ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం పేరు మార్పు సరికాదనిసీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడువెంకట య్య అన్నారు. ఇందుకు నిరసనగా శనివారం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ లో వీబీ రామ్‌జీ బిల్లు ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. ప్రజలకు అందించాల్సిన అవసరాలను తప్పించుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. బిల్లు రద్దు చేసేంత వరకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రయ్య, సత్తయ్య, రఘురాం, మహిపాల్, యాదగిరి పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయండి
దోమ: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నూతన సర్పంచ్‌లు పనిచేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సూచించారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో గుండాల నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ స్వల్ప తేడాతో ఓటమి చెందినప్పటికీ ఉపసర్పంచ్ కేశవులు, వార్డు సభ్యులు కుర్వ అంజిలయ్య, బోయిని లక్ష్మి, లక్ష్మిబాయి, రాములు నాయక్, హర్య నాయక్ మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు మెరుగైన పాలనను అందించేందుకు సర్పంచులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అఽధికారంలో ఉన్నప్పటికి గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర నిధులు తప్పనిసరి వస్తుంటాయని, వాటితో గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, సీనియర్ నాయకుడు జగత్‌రెడ్డి, నేతలు, తదితరులు పాల్గొన్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి -
ఎవె‘న్యూ’ విచిత్రం.!
యాలాల: కోకట్–బాగాయిపల్లి మార్గంలో ఎవెన్యూ ప్లాంటేషన్(రోడ్డుకిరువైపులా మొక్కలు నాటడం) కార్యక్రమంపై మండలవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ సిబ్బంది వ్యయప్రయాసాలకోర్చి నాటిన మొక్కలను, మండల అధికారులకు సమాచారం లేకుండా తొలగించారు. తొలగించిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను ఏర్పాటు చేసి ప్రతి రోజు నీళ్లు పడుతుండడం చూసిన ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 6,695 మొక్కలకు రూ.97వేల ఖర్చు 2022–23 సంవత్సరానికి గాను మండల ఉపాధి హామీ సిబ్బంది ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా కోకట్ నుంచి బాగాయిపల్లి వరకు ఆర్అండ్బీ రోడ్డుకిరువైపులా మొక్కలు నాటించారు. గుల్మోర్, కానుగ, సిస్సు, రేయిన్ ట్రీ, కోనోకార్పస్ తదితర మొక్కలను ఉపాధి సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించారు. కోకట్ పంచాయతీ పరిధిలో రెండు వర్క్ ఐడీల పేరిట మొక్కల ఏర్పాటుకు గుంత తీయడం, నీళ్లు పట్టడం, కూలీల ఖర్చుల కలుపుకొని మొత్తం 6,695 మొక్కలకు గాను రూ.97,402లను ఖర్చు చేయగా, రాఘవాపూర్ పంచాయతీలో పరిధిలో రెండు వర్క్ ఐడీలు కలుపుకొని 11,051 మొక్కలకు గాను రూ.1.61 లక్షలను ఖర్చు చేశారు. ఈ పనులకుగాను ఎఫ్ఏ, టీఏ, ఈసీలు నిత్యం పర్యవేక్షించడం ఆ మొక్కలు భారీగా పెరిగి రోడ్డుకిరువైపులా అందంగా మారాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల కొందరూ జేసీబీలతో పెరిగిన మొక్కలను తొలగించారు. తొలగించిన మొక్కల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసి ప్రతి రోజు నీరు పడుతున్నారు. రోడ్డుకిరువైపులా ఏపుగా పెరిగిన మొక్కలను అనవసరంగా తొలగించి, మళ్లీ యథాస్థానంలో కొత్త మొక్కలు నాటడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ తీవ్ర విమ ర్శలు వినిపిస్తున్నాయి. కాగా కొత్తగా మొక్కలునాటే ప్రక్రియను కడా(కొడంగల్ ఏరియా డెవలెప్మెంట్ అథారిటి)వాళ్లు చేపడుతున్నారని సమాచారం. ఈ విషయాన్ని అటు మండల అధికారులు, సంబందిత శాఖ అధికారులు ధ్రువీకరించడం లేదు. కోకట్–బాగాయిపల్లి మార్గంలోఏపుగా పెరిగిన చెట్ల తొలగింపు తొలగించిన స్థానంలో మళ్లీ ప్లాంటేషన్ ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ ప్రజల ఆగ్రహం కలెక్టర్ ఫిర్యాదు చేశాం ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను తొలగించే విషయంలో అధికారికంగా మాకు ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది కలెక్టర్ నిర్ణయిస్తారు. గతంలో నాటిన మొక్కలు ధ్వంసమయ్యాయనేది వాస్తవం. – శ్రావణ్‌కుమార్, ఆర్అండ్బీ డీఈఈ తాండూరు విచారణ చేపడుతున్నాం కోకట్ మార్గంలో రోడ్డుకిరువైపులా పెరిగిన మొక్కలను తొలగించిన అధికారులు, వ్యక్తుల గురించి మాకు సమాచారం లేదు. గతంలో ఇదే ప్రదేశంలో ఉపాధి హామీలో భాగంగా మొక్కలు నాటినట్లు రికార్డులు ఉన్నాయి. మండల అధికారులకు ఈ విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కొత్త మొక్కలు నాటే వ్యక్తుల వివరాలు సైతం మాకు తెలియదు. సంబంధిత వ్యక్తుల విషయమై విచారణ చేపడుతున్నాం. – శ్రీనిజ, ఎంపీడీఓ యాలాల మండలం -
గ‘లీజు’దందా!
తాండూరు: తాండూరు పట్టణంలో ప్రభుత్వ భూ ముల ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. అధికారుల చేతివాటం.. ప్రజా ప్రతినిధుల అండదండలతో వందల ఎకరాల సర్కారీ భూ ములు పరాధీనంలోకి వెళ్తున్నాయి. లీజు పేరిట కొందరు స్థలాలను సొంతం చేరుకుంటే.. మరి కొందరు చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కాందిశీకులకు చెందిన 484 చదరపు గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు హైదరాబాద్ మార్గంలోని సర్వే నంబర్ 129లో 1.36 ఎకరాలు.. గొల్ల చెరువు సమీపంలోని సర్వే నంబర్ 111లో గల (ఆర్డీఓ కార్యాలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలం) భూమి పరాధీనం పాలయ్యింది. ఓ వ్యాపారి కుటుంబం పట్టణ నడి బొడ్డున ఉన్న రూ.100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి దుకాణ సముదాయాలు నిర్మించి ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా అద్దెల రూపంలో దండుకొంటున్నాడు. అక్రమ రిజిస్ట్రేషన్ తాండూరు పట్టణ నడి బొడ్డున సర్వే నంబర్ 135లో 40.31 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇట్టి స్థలాన్ని రెవెన్యూ అధికారులు 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. ఇక్కడ చాలా కాలంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా ఆస్పత్రి, పాత మున్సిపల్ కార్యాలయం, మున్సిపల్ పార్కు, టెలిఫోన్ భవన్, న్యాయస్థానం, ఓల్డ్ క్లబ్, డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నారు. ఇందులోని కొంత భూమిని దశాబ్దాల క్రితం సినిమా ఽథియేటర్ నిర్వహణ కోసం లీజుకు ఇచ్చారు. మూడేళ్ల క్రితం గడువు ముగిసింది. ఇంతవరకు బాగానే ఉన్నా మిగిలిన భూమిని కొంత మంది అక్రమార్కులు కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వ్యాపారం కోసం విచ్చి.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం చాలా ఏళ్ల క్రితం తాండూరుకు వలస వచ్చింది. పట్టణంలో వ్యాపారం ప్రారంభించింది. ఆయిల్, దాల్ మిల్లుల పేరిట దశాబ్దాల క్రితం సర్వే నంబర్ 135లోని ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకుంది. కొన్నేళ్ల క్రితం లీజు గడువు ముగిసింది. అంతకుముందే ఆయిల్ మిల్ మూత పడింది. లీజుకు తీసుకున్న స్థలానికి ఇరువైపులా జాతీయ రహదా రి ఉండటంతో సదరు వ్యాపారి కుటుంబంలోని నలుగురు సోదరులు ప్రభుత్వ భూమిని పంచుకున్నారు.ఆయిల్ మిల్ ప్రాంగణంలో విలాసవంతమైన ఇళ్లు నిర్మించుకున్నారు. అంతటితో ఆగకుండా రోడ్డుకు ఇరువైపులా దుకాణాలను ఏర్పాటు చేసి లక్షల రూపాయలను అద్దెల రూపంలో వ సూలు చేస్తున్నారు. అంతేకాకుండా హోల్ సేల్ ఏ జెన్సీలు నిర్వహిస్తున్నారు. ఉపాధి కోసం వచ్చి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బషీరాబాద్, తాండూరు మండలాల్లో.. మండల కేంద్రమైన బషీరాబాద్‌లోని సర్వే నంబర్ 60లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని, తాండూరు పట్టణంలోని కాందిశీకుల స్థలాన్ని ఇదే కుటుంబానికి చెందిన ఓ వ్యాపారి కబ్జా చేశాడు. ఈ విషయమై గతంలో పలుమార్లు స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాలు చేశారు. కాందిశీకుల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని రెండు రోజుల క్రితం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులను వివరణ కోరిగా తమకు ఆ భూములతో ఎలాంటి సంబంధం లేదని సమాధానం చెప్పారు. ఆయిల్ మిల్ పేరిట లీజు -
పరువు పైసలు
పాయె!కొడంగల్: మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళ ఓట మిని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయింది. ఫలితాలు తనకు అనుకూలంగా రాలేదని మానసిక క్షోభకు గురైంది. గ్రామంలో తన పరువు పోయిందని భావించింది. దీంతో మొ దటి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితం వచ్చిన వెంటనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించడంతో గండం గడిచింది. ఇలాంటి ఘటనలు మరి కొన్ని జరిగినా వెలుగులోకి రాలేదు. పరువు పోతుందని బయటకు చెప్పడం లేదు. అతి నమ్మకమే నట్టేట ముంచింది పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలనే అతి విశ్వాసం.. అతి నమ్మకంతో మూడు విడతల్లోనూ పోటికి దిగిన పలువురు అభ్యర్థులు ఓటమితో కుంగిపోతున్నారు. ప్రజల్లో తమకున్న గుర్తింపు వల్ల గెలుస్తామని భావించారు. పార్టీల మద్దతు గ్రామ పెద్దల అండదండలతో ఓట్లు వస్తాయని అనుకున్నారు. విజయం నల్లేరుపై నడకే అని గుడ్డిగా నమ్మారు. ఓట్లు వేసే ప్రజల నాడీ తెలుసుకోలేక పోయారు. దీంతో ప్రజలు ఓటు వేయకపోవడంతో ఓటమి పాలయ్యారు. ఆయా పార్టీల్లోని సర్పంచ్ అభ్యర్థులు తమ ఓటమిని జీర్ణించు కోలేకపోతున్నారు. గతంలో తాము చేసిన పనులను చూసి ప్రజలు తిరిగి తమకే పట్టం కడతారని అనుకున్నారు. తాజా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పోటికి దిగినా వారిని ప్రజలు ఆదరించలేదు. ఎన్నికల్లో అప్పులు చేసి ఖర్చు పెట్టినా ఓటమి తప్పలేదు. దీంతో పరువు పాయే పైసలు పాయే దేవుడో అంటూ విలపిస్తున్నారు. అప్పులు చేసి మరీ.. పలువురు సర్పంచ్ పదవిపై ఆశతో ఎన్నికల్లో ఎలాగైనా పోటి చేసి గెలవాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ పోటీకి దిగారు. అయినా ప్రజలు కనికరించలేదు. దీంతో అటు పదవి రాక పోగా ఇటు అప్పులు మిగిలాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక అయమయంలో ఉన్నారు. ఎంపీటీసీ కోసం పైరవీలు సర్పంచ్ పదువులకు పోటీ చేసి ఓడిన వారు త్వరలో వచ్చే ఎంపీటీసీ జెడీపీటీసీ ఎన్నికల్లో పోటీకి దిగాలని ఆలోచిస్తున్నారు. సానుభూతి ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు. పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి గ్రామాల్లో పోయిన పరువును దక్కించుకోవాలని ఆలోచిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో నేర్చుకున్న గుణపాఠం ఒక అనుభవంగా మార్చుకొని వచ్చే ఎన్నికల్లో విజయం ప్రయత్నాలు చేస్తున్నారు. -
విపత్తులపై మాక్ ఎక్సర్ సైజ్
అనంతగిరి: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఈ నెల 22న జిల్లాలో ప్రయోగాత్మకంగా మాక్ ఎక్సర్ సైజ్ కార్యక్రమం నిర్వహించనున్న ట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఇందుకు ఆయా శాఖల అధికారులు సిద్ధం కావాలని సూచించారు. శుక్రవారం నగరంలోని టీజీఐసీసీసీ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎన్డీఎంఏ మేనేజర్ సుధీర్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ హసనైన్, తెలంగాణ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణరావు, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..వరదలు, పరిశ్రమల్లో ప్రమాదాలు,విపత్తులు సంభవించిన సమ యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై మాక్ ఎక్సర్ సైజ్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, అడిషనల్ ఎస్పీ రామునాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 23న ‘మీ డబ్బు.. మీ హక్కు’ మీ డబ్బు.. మీ హక్కు అనే అంశంపై ఈ నెల 23న ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్లెయిమ్ చేసుకోని ఆర్థిక పరమైన ఆస్తులను ప్రజలు తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. కలెక్టరేట్లో ఈ నెల 23వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరం కొనసాగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాణ్యత తప్పనసరి జిల్లా పరిషత్ భవన నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన పనులను అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈవో సుధీర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమావేశ మందిరం, చైర్మన్, సీఈఓ ఛాంబర్లు, వివిధ నిర్మాణాలను పరిశీలించారు. జెడ్పీ ఆవరణ పచ్చదనంతో ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పంచాయత్ రాజ్ ఈఈ ఉమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా రేణుక ఎల్లమ్మ జాతర
సిడె ఊరేగింపు, అమ్మవారికి పూజలు చేస్తున్న పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు యాలాల: మండలంలోని ముద్దాయిపేటలో కొలువుదీరిన రేణుక ఎల్లమ్మ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు సిడె ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మొక్కిన మొక్కులు తీర్చే ఎల్లమ్మగా పేరుగాంచిన ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి దర్శించుకున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఎల్లమ్మ జాతరను ఈ సారి కూడా ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూ జలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పంతుల రుద్రమణి, ఎంపీటీసీ మాజీ సభ్యులు దేవ గారి రాములు,మాజీ సర్పంచ్‌లు బిచ్చన్నగౌడ్, క్రిష్ణయ్యగౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు భానుప్రసాద్‌గౌడ్ మహేందర్‌రెడ్డిని ఆలయ కమిటీ తరఫున ఘనంగా సన్మానించారు.శనివారం చుక్కాబోనాలు, ఆదివారం రథోత్సవం నిర్వహించనున్నారు. -
హస్తంలో లుకలుకలు
వికారాబాద్: కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న వివాదాలు ముదిరి పాకాన పడ్డాయి. రెండు వర్గాల మధ్య నెలకొన్ని లొల్లి పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరింత రాజుకుంది. ఓ వర్గం నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో వర్గం నాయకులు చింపేయడంతో వివాదం బట్టబయలైంది. ఆరు నెలలుగా వికారాబాద్ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతల మధ్య నెలకొన్న వర్గపోరుతో పార్టీ కేడర్ సతమతమవుతోంది. పట్టణ, మండల నాయకుల మధ్య నెలకొన్న వైరం స్పీకర్‌కు తలనొప్పులు తెచ్చి పెడుతోంది. ఇటీవలి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వికారాబాద్ మండల అధ్యక్షుడి తల్లి సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించింది. ఆమెను ఓడించేందుకు పట్టణ అధ్యక్షుడు, అతని అనుచరగనం ఇతర పార్టీలతో చేతులు కలిపారని మండల నేతలు ఆరోపించారు. ఈ విషయం మీడియా ముందు బట్టబయలు చేయడంతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన పట్టణ అధ్యక్షుడి ఫ్లెక్సీని చించేశారు. ఓ వర్గం నాయకులను ఓడించేందుకు మరో వర్గం నేతలు పక్క పార్టీలతో చేతులు కలిపారు. వారిని ఫాంహౌస్‌కు పిలిపించుకుని విందులు ఇవ్వడం లాంటివి చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇలాంటి ఘటనలే పరిగి, తాండూరు నియోజకవర్గాల్లోనూ చోటు చేసుకున్నాయి. తమ పార్టీ నేతలవల్లే తాము ఓటమిపాలయ్యామని హస్తం నేతలు ఆరోపించారు. స్పీకర్ సమక్షంలో.. ఏడాది నుంచి వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అధికార పార్టీ నేతలు రెండుగా విడిపోయారు. వారి మధ్య నెలకొన్న వివాదాలు పలు సందర్భాల్లో బయటపడుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లు పట్టణ కాంగ్రెస్‌లో రెండు వర్గాలు ఉండగా.. తాజాగా పట్టణ, మండల నాయకుల మధ్య వివాదం తలెత్తింది. పరిస్థితిని అంచనా వేసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఇరువర్గాల వారిని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించినట్టు సమాచారం. పార్టీ ముఖ్యనేతల సమక్షంలో పంచాయితీ నిర్వహించి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల ఓటమికి యత్నించిన వారిని మందలించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు పార్టీని వీడాలనే ఆలోచనకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. నలుగుతున్న అధికారులు అధికార పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు అధికారులకు సంకటంగా మారుతన్నాయి. ఈ పరిస్థితి వికారాబాద్, తాండూరు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. గ్రూపు తగాదాలతో అటు మున్సిపల్ అధికారులు ఇటు పోలీసులు సతమతమవుతున్నారు. తమకు తెలియకుండా పట్టణంలో ఏ పని చేయకూడదని పార్టీ పట్టణ ముఖ్య నాయకుడొకరు కొంతకాలంగా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తమ కాలనీల్లో పనులు చేయటానికి అతని పెత్తనం ఏంటని మరికొంత మంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ ముఖ్య నేత జులూంతో విసిగిపోయిన పోలీసులు, మున్సిపల్ అధికారులు, పార్టీ నేతలు ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇంతకాలం ఓపిక పడుతూ వచ్చిన స్పీకర్ కూడా ఆ ముఖ్య నాయకుడిపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపై ఎవరూ ఆ నేత మాట వినాల్సిన పని లేదని స్పీకర్ అధికారులు, పోలీసులకు సూచించినట్టు సమాచారం. వర్గపోరుతో కేడర్ సతమతం -
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
● పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం ● మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిగి: రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇందకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. పరిగి మండలంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లను శుక్రవారం నివాసంలో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీకి మంచి ఫలితా లు వచ్చాయన్నారు. పరిగి మండలంలోని 30 జీపీల్లో ఎన్నికలు జరిగితే ఏకంగా 19మంది బీఆర్ఎస్ సర్పంచ్‌లు గెలుపొందారని తెలిపారు. అధికార పార్టీకి కేవలం 10 సర్పంచ్ స్థానాలు మాత్రమే వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 50శాతం కన్న తక్కువ సీట్లు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ మద్దతుదారులపై దాడులు చేయడం, కేసులు పెట్టడం వంటివి చేశారని ఆరోపించారు. అయినా అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎక్కడ చూసినా తమ హయాంలో జరిగిన అభివృద్ధే కనిపిస్తోందన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. గెలుపొందిన సర్పంచ్‌లకు అందుబాటులో ఉంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్‌రెడ్డి, వెంకటయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలనే ఎంచుకోవాలి
నవాబుపేట: అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులు ఎంచుకోవాలని హైటెక్ సీడ్ కంపెనీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేనేజర్ భరత్‌రెడ్డి సూచించారు. మండలంలోని గుబ్బడిపత్తేపూర్ గ్రామంలో శుక్రవారం రైతులకు పంటల సాగు, ఎరువుల వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అనేక సీడ్ కంపెనీలు విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నారన్నారు. అందులో నాణ్యమైన, అధిక దిగుబడులను ఇచ్చే విత్తనాలను రైతులు ఎంచుకోవాలని సూచించారు. హైటెక్ సీడ్ మొన్నజొన్న 5106, 3206 తెల్ల జొన్న విత్తనాలు అత్యధిక నాణ్యత, అధిక దిగుబడులు సాధించాయన్నారు. వివిధ రకాల పంటల సాగు, ఎరువుల వాడకాన్ని వివరించారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు రాఘవేంద్ర, రాజు, సంతోష్ పాల్గొన్నారు. నాడు కారోబార్.. నేడు సర్పంచ్ కుల్కచర్ల: ఎన్నికలంటే నే ఎన్నో ఆసక్తికర సంఘటనలకు నిలయం. కుల్కచర్ల మండలంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎర్రగోవింద్ తండా పంచాయతీలో గత సర్పంచ్ హ యాంలో రాజునాయక్ కారోబార్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కారోబార్‌గా పని చేసిన చోటే సర్పంచ్‌గా బాధ్యతలు తీసుకోవడంతో స్థానికులు అభినందిస్తున్నారు. -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే టీఆర్ఆర్
పరిగి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శుక్రవారం పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీ ఎన్నికల్లో పరిగి నియోజకవర్గంలో 206 స్థానాలకు గాను 137 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందడంపై సీఎం అఽభినందించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి సూచించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. తపస్ జిల్లా అధ్యక్షుడిగా సంగమేశ్వర్ అనంతగిరి: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జిల్లా నూతన అధ్యక్షుడిగా వికారాబాద్‌కు చెందిన కూర సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా గాజుల బస్వరాజు ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. శుక్రవారం పట్టణంలోని స్వాగత్ కన్వెన్షన్‌లో తపస్ జిల్లా ముఖ్య ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బాకారం మల్లయ్య, కోశాధికారిగా గొల్ల రమేష్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంగమేశ్వర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమ స్యలపై పోరాటం చేస్తామన్నారు. తన ఎన్నికకు సహకరించి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల పరిశీలకులు జనార్దన్‌రెడ్డి, చంద్రమౌళి, అనంత్‌రెడ్డి, హనుమప్ప, అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈకేవైసీ చేయించుకోండి కొడంగల్: రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని సివిల్ సప్లయ్ అధికారులు సూచించారు. లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు వెళ్లి బయో మెట్రిక్ విధానంలో వేలి ముద్రలు పెట్టాల్సి ఉంటుందన్నారు. కొడంగల్ మండలంలో 746 అంత్యోదయ కార్డులు, 14,618 ఆహార భద్రత కార్డులు ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు కార్డుల ద్వారా 55,179 మంది బియ్యాన్ని తీసుకుంటున్నారని అన్నారు. అందులో 32,921 మంది మాత్రమే ఈ కేవైసీ చేయించుకున్నట్లు తెలిపారు. మిగిలిన వారు వేలి ముద్రలు వేయాలని కోరారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి అనంతగిరి: వైద్య శాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్ల పెండింగ్(లెప్రసీ సర్వే, పల్స్ పోలి యా) బిల్లులు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారిగా చంద్రయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆశావర్కర్లతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ఆశా వర్కర్లకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మంగమ్మ, మాధవి, పద్మ, అనురాధ, అరుణ, కౌసల్య, జగదేవి, మునిబాయి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శంగా తీర్చిదిద్దేందుకే
నా తల్లిదండ్రులు పాలకూర్ల లక్ష్మమ్మ, రాములుగౌడ్ గత ముప్పై ఏళ్లుగా ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా నిత్యం ప్రజల్లో ఉంటూ గ్రామానికి సేవలు అందించారు. ఉన్నత చదువులు చదివిన నేను కొంత కాలం బిజినెస్‌తో పాటు, జర్నలిస్ట్‌గా పనిచేశా. స్థానిక యువత అభిప్రాయం మేరకు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్‌గా పోటీ చేశా. అమ్మానాన్నల దీవెనలు, యువత ప్రోత్సాహం, గ్రామస్తుల ఆశీర్వాదంతో సర్పంచ్‌గా విజయం సాధించా. – పి.మహేందర్‌గౌడ్, ఎంబీఏ, సర్పంచ్, చరికొండ ● -
హత్యకేసులో ముగ్గురికి రిమాండ్
తాండూరు టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపిన కేసులో ముగ్గురికి రిమాండ్ విధించినట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన పరమేశ్, తన భార్య అనూష (20)ను వరకట్నం తీసుకురావాలంటూ గురువారం కర్రతో కొట్టి దారుణంగా హత్య చేసి పరారైన విషయం విదితమే. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతురాలి భర్త పరమేశ్, అతని తల్లిదండ్రులు లాలమ్మ, మొగులప్పను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కీలకంగా మారిన సీసీ పుటేజీ.. ఈ హత్య కేసులో నిందితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయిన పుటేజీ కీలకంగా మారింది. ఈ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం లావుపాటి కర్రతో అనూష తలపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్నట్లు నిక్షిప్తమైంది. -
అమ్మానాన్న అడుగుజాడల్లో..
మా నాన్న బుగ్గయ్యగౌడ్ సింగిల్‌విండో డైరెక్టర్‌గా, గ్రామ సర్పంచ్‌గా, ఏఎంసీ వైస్ చైర్మన్‌గా, ఎంపీపీగా సేవలందించారు. అమ్మ ఉమావతి ఎంపీటీసీగా పనిచేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో నిత్యం ప్రజలతో మమేకమయ్యేవారం. నేను కూడా ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ ఎన్నికల్లో నిలిచి, విజయం సాధించా. ప్రజలకు అందుబాటులో ఉండి, సేవలందిస్తా. – పాలకూర్ల కరుణాకర్‌గౌడ్, ఎంబీఏ, బీటెక్, (ఎల్ఎల్బీ), సర్పంచ్, ఎక్వాయిపల్లి ● -
సమస్యలపై అవగాహన ఉంది
గ్రామ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంది. నా భర్త నిరంతరం అనేక పోరాటాలు చేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు, రేషన్‌కార్డులు, పింఛన్లు ఇవ్వాలని పోరాడారు. మైనింగ్ కంపెనీని నిలిపేయాలని ప్రజల పక్షాన నిలిచారు. మా గ్రామం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో నాకు అవకాశం వచ్చింది. స్థానిక సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తాం. ప్రజల ఆకాంక్షల మేరకు వారితో కలిసి పనిచేస్తా. – సంధ్యవెంకటేశ్గౌడ్, ఎమ్మెస్సీ, సర్పంచ్, ముద్వీన్ ● -
చదువులో రాణించి.. పాలనకు ఏతెంచి
అబ్దుల్లాపూర్‌మెట్: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని 14 మంది సర్పంచుల్లో ఆరుగురు మహిళా సర్పంచులు విజయం సాధించారు. అందులో ఐదుగురూ విద్యావంతులు కావడంతో పాటు, 35 ఏళ్లలోపు వయసున్న వారే కావడం గమనార్హం. విద్యలో ఉన్నతంగా రాణించిన వీరు, మహిళా ప్రజాప్రతినిధులుగా గెలుపొందడంతో స్థానిక సమస్యలను తెలుసుకుని, పరిష్కరిస్తారనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ కవాడిపల్లి సర్పంచ్‌గా గెలుపొందిన కొలన్ లక్ష్మీప్రసన్న ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించి, రాజకీయశాస్త్రంలో డాక్టరేట్ సాధనలో ఉన్నారు. అమెరికా, యూరప్‌లో నోవార్టిస్, మైక్రోసాప్ట్ వంటి బహుళజాతీయ సంస్థల్లో పనిచేశారు. ఈమె మామ గతంలో సర్పంచ్‌గా పనిచేశారు. ఇక ప్రజాప్రతినిధిగా.. ఈమె మందుగుల విజయ. అబ్దుల్లాపూర్‌మెట్ సర్పంచ్‌గా విజయం సాధించారు. త్వరలోనే సర్పంచ్‌గా గ్రామ పాలనా పగ్గాలు అందుకోనున్నారు. ఎంసీఏ పూర్తి చేసిన ఈమె ఇప్పటివరకు గృహిణిగా ఉన్నారు. ఇక ప్రజాప్రతినిధిగా కొనసాగనున్నారు. ఇంటి నుంచి.. గ్రామ సేవకు బలిజగూడ గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికై న ఉప్పు మాధవి ఇంటర్ చదివి ప్రస్తుతం గృహిణిగా ఉన్నారు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొంది, ప్రజా సేవలో నిమగ్నమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎంపీటీసీగా ఓడినా.. మజీద్‌పూర్ సర్పంచ్‌గా విజయం సాధించిన మేడిపల్లి ప్రియ బీఎస్సీ, బీఈడీ చదివారు. గతంలో ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ ఏమాత్రం అధైర్య పడకుండా సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఉన్నత విద్యనభ్యసించి.. అనాజ్‌పూర్ సర్పంచ్‌గా ఎన్నికై న రాచపాక నవనీత బీకాం, బీఈడీ చదివారు. ప్రస్తుతం గృహిణిగా ఉన్న ఆమె ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఈమె తోటి కోడలు తాజా, మాజీ ఎంపీటీసీగా పనిచేశారు. తొలి ప్రయత్నంలోనే సర్పంచ్‌గా గెలుపొందిన ఆమె ప్రజా సేవకు సై అంటున్నారు. -
భార్యాభర్తలు వార్డు సభ్యులుగా గెలుపు
ఇబ్రహీంపట్నం రూరల్: భార్యాభర్తలు వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. భర్తకు ఉప సర్పంచ్ పదవి వరించింది. ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో ప్రజలు వినూత్న తీర్పు ఇచ్చారు. అదే గ్రామానికి చెందిన కావలి వెంకటేశ్, సుధారాణి దంపతులు పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా పోటీలో నిలిచారు. భర్త వెంకటేశ్ 4వ వార్డు సభ్యులుగా, భార్య సుధా 7వ వార్డు సభ్యులుగా బరిలో నిలిచారు. బీఆర్ఎస్ ప్యానెల్లో ఇద్దరు విజయం సాధించారు. దీంతో భర్త వెంకటేశ్‌కు ఉప సర్పంచ్‌గా అవకాశం వచ్చింది. మూడు సార్లు వార్డు సభ్యుడిగా గెలిచిన రమేశ్.. ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం గ్రామంలో గొరిగే రమేశ్ 1వ వార్డు సభ్యునిగా పోటీ చేసి గెలుపొందాడు. దీంతో అతను మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. భర్తకు ఉప సర్పంచ్‌గా అవకాశం -
మైనార్టీ విద్యార్థులకు చేయూత
జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి రాజేశ్వరి అనంతగిరి: మైనార్టీ విద్యార్థుల ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోందని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి రాజేశ్వరి శుక్రవారం ఓ ప్రకటనలోతెలిపారు. ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంలో విదేశాల్లో ఉన్నతవిద్య చదువుతున్న మైనార్టీ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జనవరి 20 వరకు కలెక్టరేట్లోని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 79933 57103లో సంప్రదించాలన్నారు. యాలాల: జుంటుపల్లి రామస్వామి ఆలయ మాజీ చైర్మన్ హన్మంత్‌రావు దేశ్‌ముఖ్(48) శుక్రవారం మృతి చెందారు. నిత్యం బీపీ ట్యాబెట్లు వేసుకునే ఆయన పది రోజులుగా నిర్లక్ష్యం చేయడంతో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ పురుషోత్తంరావు, సర్పంచ్ శ్రీవాణి రమేశ్‌గౌడ్, మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి, రాఘవేందర్రావు, గ్రామ పెద్దలు పార్థసారథి, రవీందర్రావు తదితరులు ఉన్నారు. మహిళ దుర్మరణం నందిగామ: స్కూటీని కారు ఢీకొట్టడంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని మేకగూడ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కోనకాని సుమిత్ర(30) శుక్రవారం మధ్యహ్నం స్కూటీపై పొలం వద్దకు బయలుదేరింది. కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కారు అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి స్కూటీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సుమిత్ర తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కొడుకులు ఉండగా, భర్త ఇటీవలే మృతి చెందాడు. కందుకూరు: లేమూరు పరిధిలోని రోబోమాటిక్ కంపెనీ ఫారెస్ట్ ఫెన్సింగ్‌లో చిక్కుక్కున్న జింక పిల్లను గ్రామస్తులు కాపాడారు. మాజీ సర్పంచ్ పరంజ్యోతి ఆధ్వర్యంలో శుక్రవారం అటవీ సిబ్బంది అందజేశారు. వీరిలో శ్రీకాంత్, కార్తీక్, అనిరుధ్, ఆకాష్, రోబోమాటిక్ కంపెనీ సిబ్బంది ఉన్నారు. తుర్కయంజాల్: సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నాయి. శుక్రవారం కమ్మగూడలోని ఇందిరమ్మ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న కాట్రావత్ సంజయ్ అనే బాలుడిపై ఓ వీధి కుక్క దాడి చేసింది. గాయాలపాలైన చిన్నారిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ● కుటుంబ సభ్యులంతా కలిసి దాయాదిపై దాడి ● చికిత్స పొందుతున్న బాధితుడు యాచారం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ అభ్యర్థి.. తన పరాజయానికి కారణమయ్యాడంటూ ఓ వ్యక్తిని చితకబాదారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎనిమిదో వార్డు సభ్యుడిగా పోటీ చేసిన బోద్రమోని రవీందర్ 7 ఓట్లతో తేడాతో ఓటమిపాలయ్యాడు. తనకు ఓటేయకపోగా, పరాజయానికి కారణమయ్యాడంటూ దాయాది బోద్రమోని మల్లేశ్‌పై అనుమానం పెంచుకున్నాడు. రెండు రోజులుగా అతని కదలికలపై నిఘా పెట్టాడు. శుక్రవారం ఉదయం మల్లేశ్ తన పిల్లలను స్కూల్ బస్ ఎక్కించేందుకు బైక్‌పై వెళ్తుండగా అడ్డుకున్న రవీందర్, అతని తల్లి నాగమణి, తండ్రి నారాయణ, తమ్ముడు రాజేశ్ కలిసి చితకబాదారు. తీవ్ర గాయాలైన మల్లేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు. -
అమరుల ఆశయ సాధనకు సైకిల్ యాత్ర
చేవెళ్ల: తెలంగాణ అమరుల ఆశయ సాధన, గ్రామంలో బెల్టుషాపులు తొలగింపు, ఉద్యమకారులకు గుర్తింపు, పాలకుల్లో మార్పు డిమాండ్లతో ఓ వార్డు సభ్యుడు చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం చేవెళ్లకు చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలం నాగసాన్‌పల్లికి చెందిన ఎన్నారం యాదయ్య ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో నాగసాన్పల్లి 1వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. తన గ్రామంలో పైడిమాండ్లను అమలు చేయాలని కోరుతూ గురువారం ఉదయం అసెంబ్లీకి సైకిల్‌యాత్ర ప్రారంభించారు. రాత్రి చేవెళ్ల పరిధిలోని దామరగిద్దకు చేరుకున్న ఆయన అక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం చేవెళ్లలోని అంబేడ్కర్, పూలే, జగ్జీవన్‌రామ్, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, పండుగల సాయన్న, దొడ్డి కొమురయ్య, ప్రొఫెసర్ జయశంకర్, ఇంద్రారెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పిచారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు యాదయ్య ఆలోచనను అభినందించారు. అనంతరం యాదయ్య మాట్లాడుతూ.. సైకిల్ యాత్ర ద్వారా ముందు అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తానని, అనంతరం అసెంబ్లీకి చేరుకుని, అవకాశం కల్పిస్తే ఎమ్మెల్యేలు, మంత్రులకు తన డిమాండ్లను చెబుతానని స్పష్టం చేశారు. చేవెళ్ల నాయకులు టేకుపల్లి శ్రీనివాస్‌యాదవ్, అబ్దుల్ గని, బస్తేపూర్ నర్సింలు తదితరులు యాదయ్యకు వీడ్కోలు పలికారు. -
ముక్కిపోతున్న దొడ్డుబియ్యం
కొడంగల్: మండల పరిధిలో 31 రేషన్ దుకాణాల్లో 750 క్వింటాళ్ల దొడ్డు ముక్కిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా లెక్కిస్తే వేలాది క్వింటాళ్ల బియ్యం నిల్వలు నిరుపయోగంగా ఉన్నాయి. జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడంతో పిండిలామారి పనిరాకుండా పోతున్నాయి. కొంత మంది డీలర్లు వాటిని అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పందికొక్కుల పాలు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి వినియోగదారులకు అందజేశారు. జూన్‌లో చివరి వరకు దుకాణాలను తెరిచి సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. జూలై, ఆగస్టులో దుకాణాలను తెరవకపోవడంతో మిగిలిన దొడ్డు బియ్యం పంది కొక్కుల పాలైంది. బియ్యానికి పురుగు పట్టి పిండిలా మారాయి. మిగులు బియ్యాన్ని రేషన్ దుకాణాల్లో ఉంచడంతో సన్న బియ్యానికి సైతం పురుగుపడుతోంది. గ్రామాల్లో రేషన్ దుకాణాలు చిన్న గదుల్లో ఉన్నాయి. వాటిలో నిల్వలు ఉంచడం ఇబ్బందిగా మారిందని డీలర్లు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలాది క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిరుపయోగంగా ఉన్నాయి. వర్షాకాలంలో వానలకు తడిసి ముద్దయ్యాయి. తరలించాలని డిమాండ్ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 588 రేషన్ దుకాణాల ద్వారా 8,97,270 మంది వినియోగదారులకు ప్రతీనెలా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబంలో ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు. జిల్లాలో 2.09 లక్షల ఆహార భద్రత కార్డులు, 25వేల అంత్యోదయ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతీ నెలా జిల్లా పరిధిలో 5,200 టన్నుల బియ్యం అలాట్మెంట్ ఉంది. ఈ లెక్కన జిల్లాలోని మొత్తం రేషన్ దుకాణాల్లో మిగిలి ఉన్న బియ్యం వేలాది క్వింటాళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని దొడ్డు బియ్యం తరలించాలని డీలర్లు కోరుతున్నారు. కొడంగల్‌లో 750 క్వింటాళ్ల మిగులు జిల్లా వ్యాప్తంగా వేలాది క్వింటాళ్లు డీలర్ల దగ్గరే మగ్గుతున్న పాత స్టాక్ రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందంగా మారింది జిల్లా సివిల్ సప్లై అధికారుల తీరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ఉగాది కానుకగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించింది. దీంతో మార్చి వరకు రేషన్ డీలర్ల దగ్గర మిగిలిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు లెక్కకట్టి ఉంచారు. తొమ్మిది నెలలు గడుస్తున్నా వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. కొడంగల్ మండలంలో 31 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల పరిధిలో మొత్తం 750 క్వింటాళ్ల దొడ్డు బియ్యం మిగిలి ఉన్నాయి. వాటిని అధికారులు తరలించక ముక్కిపోతున్నాయి. పది నెలలుగా ఒక్క దగ్గర ఉండడం వల్ల ఎలుకలు, పందికొక్కులకు ఆహారంగా మారింది. చిన్న గ్రామాల్లో డీలర్ల దగ్గర మిగులు బియ్యాన్ని నిల్వ చేసుకోవడం ఇబ్బందిగా మారింది. అధికారులు స్పందించి త్వరగా తరలించాలి. – కె.నర్సిరెడ్డి, రేషన్ డీలర్, కొడంగల్ -
ప్రజలకు అందుబాటులో ఉండండి
దోమ: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కార మార్గం చూపేలా సర్పంచ్‌లు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సూచించారు. శుక్రవారం పరిగి పట్టణంలోని ఆయన నివాసంలో దోమ మండలం గంజిపల్లి సర్పంచ్ కేతావత్ మంజుల, ఆమె పాలకవర్గం మాజీ ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విరక్తితో ఉన్నారన్నారు. ఇందుకు నిదర్శనం స్థానిక సంస్ఠల ఎన్నికలే అన్నారు. దోమ మండలంలో పది సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ కై వసం చేసుకుందన్నారు. ప్రజా ప్రతినిధులు, నూతన సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంజిపల్లి మాజీ సర్పంచ్ కల్పన, బీఆర్ఎస్ నేతలు వెంకటేశ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి -
బీజేపీ కుట్రలు సాగవు
అనంతగిరి: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. పార్టీ అధిష్టానం పిలుపు మేర కు గురువారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టా రు. ముందుగా క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాడు దేశ స్వాతంత్య్రోద్యమంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎంతో కీలకంగా పనిచేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచే మా పార్టీ అధినేతలపై అక్రమ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.బీజేపీ పెట్టిన అక్రమ కేసులను నేషనల్ హెరాల్డ్ వ్యవహారా నికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ చార్జిషీట్ స్వీకరించలేమని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసిందన్నారు. అక్రమ కేసులతో పీడించాలనుకుంటే చూస్తు ఊరుకోబోమన్నా రు. ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీకి చెంప పెట్టులాంటిదన్నారు. ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు పెట్టి అణచివేయాలనుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి,రత్నారెడ్డి, మల్లేశం, పెండ్యాల అనంతయ్య, గుడిసె లక్ష్మణ్, శ్రీనివాస్, లక్ష్మ ణ్, రెడ్యానాయక్, దీపు, వెంకట్‌రెడ్డి, అబ్దుల్ ఖాలెద్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమం అభివృద్ధికి పట్టం
పరిగి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి పంచాయతీ ఎన్నికల్లో పరిగి ప్రజలు పట్టం కట్టారని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిగి నియోజకవర్గంలో 206 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 137 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారన్నారు. జిల్లాలోనే అత్యధిక స్థానాలను గెలుచుకుంది పరిగిలోనే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి ఘనత సీఎం రేవంత్‌రెడ్డికు దక్కుతుందన్నారు. సర్పంచ్‌లకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. పంచాయతీల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయిస్తామన్నారు. పరిగిని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని అన్నారు. జిల్లాను లక్ష కోట్ల నిధులతో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. కొత్త సర్పంచ్ల ప్రమాణస్వీకారం రోజే పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ఏబ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, పూడూరు మండల అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్, నాయకులు చిన్ననర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి -
పంట మార్పిడి తప్పని సరి
మోమిన్‌పేట: వ్యవసాయంలో రైతులు తప్పని సరి గా పంట మార్పిడి పద్ధతి పాటించాలని కేంద్రియ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఇన్చార్జ్ సునీత సూచించారు. గురువారం మండలంలోని చక్రంపల్లిలో రబీ సాగులో సమగ్ర సస్యరక్షణపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు పంట మార్పిడి తప్పనిసరి అన్నారు. సాగులో పురుగు ఉధృతి తెలుసుకునేందుకు ఎర పంటలు, మిత్ర పురుగులు పెంపకం, విత్తన శుద్ధి చేయాలన్నారు. శత్రు పురుగులను గుర్తించి వెంటనే నాశనం చేస్తేనే పంట దిగుబడులో నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. మొక్కజొన్నలో కత్తెర పురుగును నివారించకపోతే మొక్క పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. లింగార్షక బుట్టలు వాడే విధానాన్ని రైతులకు వివరించారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు వెంకట్‌రెడ్డి, ఉదయశంకర్, హొన్నప్పగౌడ, ఏఓ రామకృష్ణారెడ్డి, సర్పంచ్ బాలరాజుగౌడు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం ఇలాకాలో హస్తం హవా
అత్యధిక సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్న కాంగ్రెస్ మద్దతుదారులుకొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు సొంతం చేసుకున్నారు. మెజార్టీ గ్రామాలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా జరిగిన మూడు విడతల ఎన్నికల్లోనూ ఇదే జోరు కనిపించింది. కాంగ్రెస్ ఊపును చూసి పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి నుంచే ప్రాదేశిక స్థానాల్లో పోటీ చేయడానికి పోటీ పెరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు డిమాండ్ పెరిగింది. కొత్త సర్పంచులే గెలిపిస్తారని పలువురు ఆశావహులు భావిస్తున్నారు. మూడు విడతల్లోనూ.. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 11న జరిగాయి. కొడంగల్, దుద్యాల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్ మండల్లాలోని 262 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 179 మంది, బీఆర్ఎస్ మద్దతుదారులు 72 మంది, బీజేపీ తరఫున ఇద్దరు, ఇతరులు 9 మంది విజయం సాధించారు. కొడంగల్ మండలంలో ఒకటి, దౌల్తాబాద్‌లో మూడు, బొంరాస్‌పేటలో 7, దుద్యాల్‌లో 2, తాండూరు మండలంలో ఆరు, బషీరాబాద్‌లో 5, యాలాలలో 10, పెద్దేముల్లో 5 గ్రామాల్లో సర్పంచు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండో విడతలో.. రెండో విడత ఎన్నికలు ఈ నెల 14న జరిగాయి. వికారాబాద్, ధారూర్, మోమిన్‌పేట, నవాబుపేట, బంటారం, మర్పల్లి, కోట్‌పల్లి మండలాల్లోని 175 గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 110 మంది, బీఆర్ఎస్ మద్దతుదారులు 34, బీజేపీ 8 మంది, ఇతరులు 23 మంది గెలిచారు. కొడంగల్ నియోజకవర్గంలో.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యాల్, కోస్గి, గుండుమాల్, మద్దూరు, కొత్తపల్లి మండలాల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. కొడంగల్ మండలంలో 25 గ్రామ పంచాయతీలకు గాను 24 గ్రామాలను కాంగ్రెస్ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. దుద్యాల్‌లో 20 జీపీలకు గాను 15 కాంగ్రెస్, నాలుగు బీఆర్ఎస్, ఒకరు స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. బొంరాస్‌పేట మండలంలో 35 పంచాయతీలకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు 29 మంది, బీఆర్ఎస్ మద్దతుదారులు ఐదుగురు, ఒకరు స్వతంత్రులు విజయం సాధించారు. దౌల్తాబాద్ మండలంలో 33 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ 22 మంది, బీఆర్ఎస్ 10 మంది, ఒకరు స్వతంత్రఅభ్యర్థులు గెలిచారు. ఇదే ఊపు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సర్పంచ్‌లతో సఖ్యతగా ఉంటూ ప్రాదేశిక స్థానాలను సొంతం చేసుకునేందుకు బాట వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలు సైతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి చేరువ కావాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ పార్టీ తరఫున గెలిచిన వారి అండదండలతో ముందుకు సాగాలని భావిస్తున్నారు. తుది పోరులో.. మూడో విడత ఎన్నికలు ఈ నెల 17న జరి గాయి. పరిగి, పూడూరు, చౌడాపూర్, దోమ, కుల్కచర్ల మండలాల్లో 157 గ్రామాలకు గానూ కాంగ్రెస్ మద్దతుదారులు 100 మంది, బీఆర్ఎస్ 42 మంది, బీజేపీ ముగ్గురు, ఇతరులు 12 మంది గెలిచారు. మూడు విడతల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ అధిక పంచాయతీల్లో విజయం సాధించింది. -
మత్తుకు బానిస కావొద్దు
మొయినాబాద్: విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో డీఎస్పీ సైదులు అన్నారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్ రెవెన్యూలో ఉన్న కేఎల్‌హెచ్ యూనివర్సిటీలో గురువారం ఎన్ఎస్ఎస్ యూని ట్, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో లైన్స్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సహకారంతో మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వాడకం పబ్ సంస్కృతి, ఆన్లైన్ బెట్టింగ్ వంటి చెడు అలవాట్లకు దారితీస్తుందని అరు. కేసులు నమోదైతే విద్యార్థులు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. వృత్తిపరమైన అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. యువత, విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉండి.. మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ రామకృష్ణ, అధ్యాపకులు మల్లేష్, చంద్రశేఖర్, వెంకటరాజు, భవానిసుష్మ, దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
విజయవంతం చేయాలి
వేడుకలను విజయవంతం చేయాలని మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పిరమిడ్ ఆవరణలో గురువారం ట్రస్ట్ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకల్లో భాగంగా వివిధ దేశాలు, రాష్ట్రా లకు చెందిన గురువులు, ఆధ్యాత్మికవేత్తలు, మేధావులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాన సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. ప్రతిరోజు 25 వేల మంది ధ్యానులు, సందర్శకులు హాజరుకానున్నారని, ఈమేరకు 10 లక్షల మందికి ఉచి త అన్నదానం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పా రు. 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. సమావేశంలో ట్రస్ట్ సభ్యులు దామోదర్‌రెడ్డి, మాధవి, జేజీ నారాయణ, చంద్రశేఖర్, మహేశ్వరి, మీడియా ఇన్చార్జి భాస్కరానంద, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్‌నాయక్, సర్పంచ్‌లు సేవ్యా, శ్రీను పాల్గొన్నారు. -
ధ్యాన యాగం.. ఆధ్యాత్మిక యోగం
కడ్తాల్: ధ్యాన మహాయాగం కోసం మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం ముస్తాబవుతోంది. మండల కేంద్రం సమీపంలోని పత్రీజీ శక్తి స్థల్లో ఈ నెల 21న (ఆదివారం) వేడుకలు ప్రారంభమై, 31 వరకు కొనసాగనున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ప్రముఖ ఆధ్యాత్మిక, ధ్యాన గురువులు హాజరుకానున్నారు. ఈ మేరకు ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పదమూడు సంవత్సరాలుగా.. 13 సంవత్సరాలుగా ఏటా డిసెంబర్లో ఇక్కడ ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగం నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ, విదేశాల నుంచి వేలాది మంది ధ్యానులు తరలిరానున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఉత్సవాలను విజయవంతం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలకు వచ్చే ధ్యానులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నారు. ఉచిత అన్నదాన కేంద్రం, శాశ్వత గదులతో పాటు తాత్కాలిక వసతి గృహాలు, కుటీరాలు నిర్మిస్తున్నారు. వేడుకలు జరిగినన్ని రోజులు ధ్యానం చేసేందుకు వీలుగా భారీ సభా ప్రాంగణం, ప్రత్యేకంగా అలంకరించిన పెద్ద వేదిక సిద్ధం చేస్తున్నారు. శుద్ధమైన తాగునీటి సౌకర్యంతో పాటు, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలు.. ధ్యాన మహాయాగంలో భాగంగా ప్రతిరోజు పత్రీజీ వీడియో సందేశం, ప్రముఖ ధ్యాన గురువులు, ఆధ్యాత్మిక వేత్తలు, పిరమిడ్ మాస్టర్ల ఆధ్యాత్మిక సందేశాలు ఉంటాయి. నిత్యం ఉదయం 5 నుంచి 8.30 గంటల వరకు సామూహిక వేణుగాన ధ్యానం, అఖండ ధ్యానం, ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ధ్యాన గురువుల సందేశాలు, గురు సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. -
‘ఉపాధి’కి సరికొత్త రూపు
దుద్యాల్: ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు 20 ఏళ్లుగా అమలులో ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో కొత్త చట్టం తేనుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ–జీ రామ్ జీ) పేరును ప్రతిపాదించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన విషయం తెలిసిందే. దీంతో ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు నిబంధనలు సైతం మారనున్నాయి. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది ఉపాధి పొందుతున్నారు. అయితే పథకం అమలులో లోపాలు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. నిధుల దుర్వినియోగం, డిజిటల్ హాజరును పక్కదారి పట్టించడం, చేపట్టిన పనులకు పెట్టిన ఖర్చులకు పొంతన లేకపోవడం వంటి అనేక లోపాలు ఈ వ్యవస్థలో కనిపించనట్లు సమాచారం. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేసి మరింత ఆధునిక, పారదర్శక విధానాలతో కూడిన కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈ బిల్లుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వలసలను నియంత్రించడం వంటి లక్ష్యాలను చేరుకునేందుకు ఉపయోగపడుతుంది. రైతులు, కూలీలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమగ్ర ప్రయోజనాలు చేకూరేలా ఈ చట్టాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. పని దినాలు పెంపు ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని దినాలు కల్పించేవారు.కొత్త చట్టంతో 125 రోజుల పనిది నా లు కల్పించనున్నారు. పెంచిన రోజుల్లో నైపు ణ్య అవసరమైన పనులు చేయడానికి ముందుకొచ్చే వారికి మాత్రమే 125 రోజులు వర్తస్తాయి. పని దినాలు పెరగడంతో కూలీలకు వార్షిక ఆదాయం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సకాలంలో వేతనాల చెల్లింపు కూలీలకు ప్రతి వారం వేతనాలు చెల్లించాలని, గరిష్టంగా పదిహేను రోజులు మించి ఆలస్యం చేయరాదని బిల్లులో స్పష్టంగా పొందుపరిచినట్లు తెలుస్తోంది. దీంతో కూలీలు పని చేసిన వారం నుంచి రెండు వారాల్లో వేతనాలు అందుకోవచ్చు. గతంలో ఆరు నెలలైనా వేతనాలు అందని పరిస్థితి ఉండేది. వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని రైతులు డిమాండ్ చేస్తు న్నారు. పొలాల్లో విత్తనాలు వేస్తున్న సమయంలో, కలుపు తీసే తరుణంలో, ఇతర వ్యవసాయ పనులకు ఉపాధి కూలీలను కేటాయిస్తే రైతుకు కొంత భారం తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పెరిగిన దినసరి కూలీల రేట్లకు వ్యవసాయం చే యాలంటేనే అన్నదాతలు జంకుతున్నారు. పెట్టు బడులు అధికమవుతున్నాయని రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మండలంలో ఉపాధి కూలీలు మండల వ్యాప్తంగా 20 గ్రామ పంచాయతీల్లో 4,459 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. అందులో ఎస్సీలు 1,234 మంది, ఎస్టీలు 1,807 మంది, ఇతరులు 3,613 మంది ఉన్నారు. -
రూ.42 కోట్ల పత్తి కొనుగోళ్లు
దుద్యాల్: చెరువుల కింద యాసంగి వరి సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే దుద్యాల్ గ్రామంలోని గోపన్ చెరువు కిందనున్న 120 ఎకరాల పొలాలకు సాగు నీరు అందించేందుకు జేసీబీతో కాలువల మరమ్మతులు గురువారం చేపట్టారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటలు నిండాయి. నీరు సాఫీగా చివరి పొలం వరకు సులువుగా అందేందుకు కాలువలు పూడిక చేపట్టినట్లు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య తెలిపారు. పనులు పూర్తవ్వగానే నీటి విడుదలకు తీర్మానం చేసి పంటలను సాగుకు ముందుకెళ్తామని పేర్కొన్నారు. బంట్వారం: యూరియా బుకింగ్ యాప్‌పై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా బంట్వారం, కోట్‌పల్లి మండలాల్లోని రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు వీసీని తిలకించారు. యూరియా బుకింగ్‌కు సంబంధించిన పలు అంశాలపై అధికారులు వీసీలో సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓలు కరుణాకర్‌రెడ్డి, శ్రావ్య, ఏఈఓలు సందీప్, మశ్చేందర్ డీలర్లు, రైతుల తదితరులు పాల్గొన్నారు. -
భవనం నుంచి జారిపడి మేసీ్త్ర మృతి
శంకర్పల్లి: నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి ప్రమాదవశాత్తు ఓ మేసీ్త్ర కాలు జారి పడి మృతి చెందిన సంఘటన శంకర్పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన జాహంగీర్ అలం, అనరులోహక్ సోదరులు. ఇద్దరూ కలిసి ఏడు నెలల క్రితం బతుకుదెరువు నిమిత్తం శంకర్పల్లి పట్టణానికి వచ్చి మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనరులోహక్(31) గురువారం పట్టణంలోని శాంటమ్ హోమ్స్‌లో సీలింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి పోయాడు. దీంతో తోటి మేసీ్త్రలు, కూలీలు శంకర్‌పల్లిలోని ఓ ఆసుపత్రికి, తర్వాత పటాన్ చెరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మేసీ్త్ర మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భవన నిర్మాణ యాజమాన్యం కార్మికులకు ఎలాంటి భద్రతని ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుని సోదరుడు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ప్రమాణస్వీకారాన్ని ఆపేయండి
తాండూరు రూరల్: గాజీపూర్‌లో ఈనెల 11న నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు సర్పంచ్ ప్రమాణ స్వీకారాన్ని ఆపేయాలని కోరుతూ గురువారం ఎన్నికల కమిషనలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్నను కలిసి, మద్దతుకోరారు. వీరిలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు తిప్పన్నచారి, మాజీ సర్పంచులు ఈడ్గి సాయిలుగౌడ్, తలారి వీరప్ప, ఉప సర్పంచ్ గడ్డమీది ఏల్లప్ప, వార్డు సభ్యులు మంగళి భీమప్ప, కారుకొండ అనిల్ తదితరులు ఉన్నారు. గాజీపూర్వాసుల ఫిర్యాదు -
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
దోమ: జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన ఆర్మీ జవాన్ అంత్యక్రియలు గురువారం మండలంలోని దాదాపూర్ గ్రామంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఈ గ్రామానికి చెందిన తోకని అంజయ్య, తల్లి కనకమ్మ కుమారుడు శ్రీనివాస్(22) రెండేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. పంజాబ్ రాష్ట్రంలో అతను విధులు నిర్వహిస్తుండగా, ఈ నెల 16న తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో అధికారులు అక్కడే వైద్య పరిక్షలు అందించారు. పరిస్థితి విషమించి మృతి చెందారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఆర్మీ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే టి.రామ్మెహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి హాజరై మృతదేహానికి నివాళులర్పించారు. -
పారదర్శకంగా గ్రామాభివృద్ధికి కృషి
నవాబుపేట: సర్పంచ్ అంటే పదవి కాదని, ప్రజలకు సేవ చేసే మార్గమని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు గురువారం ఎమ్మెల్యే నివాసంలో ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరినీ శాలువా, పూలమాలలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామస్తులు మీపై ఉంచిన విశ్వాసం ఎంతో గొప్పదన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టి, పారదర్శకంగా గ్రామాభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు మల్లారెడ్డి, నాగిరెడ్డి, ప్రభాకర్, రంగారెడ్డి, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
● ధాన్య సేకరణలో వేగం పెంచాలి ● డీసీఎస్ఓ సుదర్శన్ దుద్యాల్: రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా.. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యంను నిల్వ ఉంచరాదని, సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్వహకులు, రైస్ మిల్లర్లకు జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శన్ సూచించారు. దుద్యాల్ రైతు వేదికలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. మాట్లాడారు. నిర్లక్ష్యం చేయకుండా రైతులు తెచ్చిన వరిని ఎప్పటికప్పుడు విక్రయించి మిల్లర్లు తరలించాలని సూచించారు. బిల్లులు సకాలంలో వారి ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైస్ మిల్లర్లతో ఫోన్లో మాట్లడుతూ.. వాహనాల్లో వచ్చిన ధాన్యంను వెంటనే అన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. నిల్వ ధాన్యం తరలింపు హస్నాబాద్ గ్రామంలో పది రోజులుగా కొనుగులు ప్రక్రియ నిలిచిపోవడంతో బుధవారం రైతులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ‘దయుంచి.. స్పందించి’ ధాన్యం కొనండి శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. కొనుగోలు కేంద్రం వద్ద ట్రాక్టర్లలో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొడంగల్, గౌరారంలోని రైస్ మిల్లర్లకు పంపించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ ఖలీల్ పాషా, కొనుగోలు కేంద్రం నిర్వహకుడు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
కుష్టు అనుమానితుల గుర్తింపు
కొడంగల్ రూరల్: లెప్రసీ వ్యాధిగ్రస్తులను(కుష్టు) గుర్తించేందుకు వైద్యాధికారులు గురువారం నుంచి సర్వేను ప్రారంభించారు. గ్రామాల్లో ఉదయం ఆశ కార్యకర్తలు ఇంటింటి సర్వేలో అనుమానితులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్, పాతకొడంగల్ గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తుండగా ఏఎన్ఎంలు పరిశీలించారు. ఈ నెల 31వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నట్లు ఏఎన్ఎంలు తెలిపారు. పరిశీలన సమయంలో అనుమానితులుగా గుర్తిస్తే సంబంధిత వ్యక్తుల ఫోన్ నంబర్, ఆధార్‌కార్డు జిరాక్స్, ఇంటి చిరునామాలను సేకరిస్తూ ఉన్నతాధికారులకు రిపోర్టు చేయనున్నట్లు సూచించారు. పూర్తి స్థాయి పరిశీలన అనంతరం వ్యాధి ఉన్నట్లు గుర్తించివారికి మందులు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎం మనెమ్మ, ఆశ కార్యకర్తలు మంజుల, రాధ, ఇందిరమ్మ, సునిత, అనిత తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ దుద్యాల్: మండల వ్యాప్తంగా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే సర్వే గురువారం ప్రారంభమైంది. గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేపడుతున్నారు. దుద్యాల్, లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, ఈర్లపల్లి, గౌరారం, చెట్టుపల్లి తండా, అల్లిఖాన్‌పల్లి, వాల్యా నాయక్ తండా, నాజుఖాన్‌పల్లి, చిలుముల్ మైల్వార్ తదితర గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఒక్క ఆశ కార్యకర్త ప్రతి రోజు 20 ఇళ్లను సర్వే చేస్తున్నారు. ప్రారంభమైన లెప్రసీ సర్వే -
అంత్యక్రియలకు ఖర్చులు ఇవ్వండి
కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన మున్సిపల్ స్టాఫ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తాండూరు టౌన్: మున్సిపల్ కార్మికులు మరణిస్తే వారి అంత్యక్రియల నిమిత్తం ఖర్చులు చెల్లించాలంటూ తాండూరు మున్సిపల్ స్టాఫ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు గురువారం పట్టణ మున్సిపల్ కమిషనర్ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల కార్మికులు మృతి చెందితే వారి అంత్యక్రియల నిమిత్తం రూ.20 వేలు అందజేయాలని నిబంధనల్లో ఉన్నప్పటికీ మున్సిపల్ కార్యాలయం నుంచి ఇవ్వడం లేదన్నారు. అనారోగ్యం కారణంగా గురువారం మృతి చెందిన జోన్ 3లో విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికురాలు నర్సమ్మ అంత్యక్రియల ఖర్చులకు నగదు అందజేయాలని కమిషనర్‌ను కోరినట్లు యూనియన్ నాయకులు గోపాల్, అశోక్, వెంకటప్ప, యాదగిరి, భాస్కర్, రమేష్, రాములు తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన రూ.10 వేలు అంత్యక్రియల ఖర్చులకు అందజేశారన్నారు. నిబంధనల్లో పొందుపరిచిన విధంగా భవిష్యత్‌లో కార్మికులకు ఆర్థికసాయం అందజేయాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. -
బడా నేతలకు ఝలక్!
యాచారం: గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాజకీయ నేతలను ఖంగు తినేలా చేశాయి. పార్టీలోనే కీలక పదవులు.. కానీ సొంత గ్రామాల్లో మాత్రం ప్రజల నుంచి వారికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎం పార్టీలో కీలక పదవుల్లో కొనసాగుతున్న నేతల స్వగ్రామాల్లో వారు పోటీలో నిలబెట్టిన సర్పంచ్, వార్డు సభ్యులు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. రూ.లక్షలాధి ఖర్చు చేసి, కాళ్లకు గజ్జలు కట్టి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా తమ మద్దతుదారులను గెలిపించుకోకపోవడం గమనార్హం. ఏళ్లుగా రాజకీయాల్లో అరితెరిన నాయకులు ఓటమిపాలు కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. మద్దతు దారుల ఓటమిని తెలుసుకున్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు తమ పార్టీ నేతల వద్ద ఆరా తీసినట్లు తెలిసింది. యాచారంలో ఉల్టా.. పల్టా! మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో మేజర్ గ్రామాలైన యాచారంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్న కొప్పు బాషా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా తన భార్య కొప్పు సుకన్య(మాజీ ఎంపీపీ)ను పోటీలో నిలబెడితే ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న అంగోత్ వెంకటేష్ తక్కళ్లపల్లి తండాలో తన భార్య విజయను బరిలో పెడితే ఓడిపోయారు. గునుగల్లో పీఏసీఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి సర్పంచ్‌గా పోటి చేసి ఓటమి పాలయ్యారు. మంతన్‌గౌరెల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్ తన మద్దతుదారుడైన పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాదయ్యగౌడ్ను సర్పంచ్‌గా పోటీలో నిలబెడితే పరాజయం చెందారు. నక్కర్తమేడిపల్లిలో సీపీఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ తన భార్య లావణ్యను సర్పంచ్ బరిలో నిలబెడితే ఓటమి చెందారు. నందివనపర్తిలో మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, సీనియర్ నేత బిలకంటి చంద్రశేఖర్రెడ్డిలు కాంగ్రెస్ నుంచి పేరుమల్ల రవిని పోటిలో నిలబెడితే పరాజయం చెందారు. ఆయా పార్టీల్లో కీలక నేతలున్న గ్రామాల్లో వారి మద్దతుదారులు ఓటమిపాలు కావడంతో మండలంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఊర్లల్లో బోల్తాపడిన ఉద్దండులు పంచాయతీ ఎన్నికల్లో పలువురికి భంగపాటు ఊహించని ఓటమితో అంతర్మథనం రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వైనం -
నిద్రలోనే నూరేళ్లు నిండాయి
● ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం ● దుకాణంలోకి దూసుకెళ్లిన కారు మైలార్‌దేవ్‌పల్లి: అతివేగం.. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. బతుకుదెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన తండ్రీకొడుకులు అసువులు బాశారు. నిద్రలోనే వారికి నూరేళ్లు నిండాయి. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై విశ్వనాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ హుస్సేన్ అనే యువకుడు తన స్నేహితులు మరో ఐదుగురితో కలిసి శంషాబాద్ నుంచి ఇన్నోవా కారులో తెల్లవారుజామున తిరిగి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన ప్రభు మహారాజ్ కుటుంబ సభ్యులు దుర్గానగర్ ప్రాంతంలో దుప్పట్లు, రగ్గుల విక్రయ దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రోజు మాదిరిగానే వారు దుకాణంలో నిద్రకు ఉపక్రమించారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో కారు అతివేగంతో వచ్చి అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో నిద్రిస్తున్న ప్రభు మహరాజ్ (60), దీపక్ (25), సంతునాథ్ (27)పై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రభు మహరాజ్, దీపక్ అక్కడికక్కడే మృతి చెందారు. సంతునాథ్కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న సయ్యద్ హుస్సేన్ నిద్ర మత్తులో ఉండటంతో పాటు మంచు కురుస్తుండటంతో కారు బీభత్సం సృష్టించిందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జోక్యం చేసుకోలేం..
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై పిటిషన్ల దాఖలు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని వార్డుల్ఢసంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. డీలిమిటేషన్లో భాగంగా చేపట్టిన జనాభా వివరాలు, మ్యాప్‌లు బహిర్గతం చేయడంతో వచ్చే నష్టమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 24 గంటల్లో వాటిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. వీటిపై అభ్యంతరాలు సమర్పించేందుకు పిటిషనర్లు, ప్రజలకు మరోరెండు రోజులు అవకాశం ఇచ్చింది (వాస్తవానికి ఈ నెల 17తో అభ్యంతరాలకు గడువు ముగిసింది). విభజనలో లోపాలున్నాయన్న పిటిషనర్ల వాదనపై.. ఇప్పుడు జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. నిబంధనలు పాటించలేదు.. జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్యను పెంచుతూ వెలువడిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ పొన్న వెంకట్ రమణ, మరో ఇద్దరు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్లు (వార్డుల డీలిమిటేషన్) నిబంధనలు, 1996 ప్రకారం నిర్దేశించిన విధానాన్ని పాటించకుండా నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఈ ప్రక్రియ చట్ట వ్యతిరేకం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. అలియాబాద్ ప్రాంతాన్ని రెండు వార్డులుగా విభజించడంతో ప్రజా సౌకర్యాల లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ప్రస్తుత డీలిమిటేషన్ స్థానిక స్వపరిపాలనకు అంతరాయం కలిగిస్తుందన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన అధ్యయన నివేదిక ఆధారంగా, జీవో 266 ప్రకారం డీలిమిటేషన్ కసరత్తు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. ఆ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. అభ్యంతరాలపై రెండ్రోజులు గడువు పెంచిన హైకోర్టు మ్యాప్‌లు, జనాభా లెక్కలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని సూచన స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వుల జారీకి న్యాయస్థానం విముఖత విస్తృత అధ్యయనం చేసిన తర్వాతే.. ‘డీలిమిటేషన్ నిబంధనల్లోని 5వ నిబంధన ప్రకారం తాజా జనాభా లెక్కల ఆధారంగా వార్డుల ఏర్పాటు తప్పనిసరి. వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం 10 శాతానికి మించకూడదు. విభజన తర్వాత వార్డుల జనాభా గణాంకాలను వెల్లడించలేదు. ప్రాథమిక నోటిఫికేషన్లో మ్యాప్‌లు, సరిహద్దు వివరణ, ఇంటి సంఖ్య వివరాలు లేవు. ఇలా ఉంటే ప్రజలు వార్డు పరిమితులను గుర్తించడం అసాధ్యం. అలాగే ప్రభుత్వం పరిపాలనా, భౌగోళిక సామీప్యతను ఉల్లంఘించింది. కొన్ని వార్డులు బహుళ అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి వెళ్లాయి. ప్రాథమిక నోటిఫికేషన్‌ను జీహెచ్ఎంసీ ప్రతినిధి జనరల్ బాడీ ముందు సరిగా ఉంచలేదు’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వార్డుల విభజన ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదన్నారు. విస్తృత అధ్యయనం, చర్చల తర్వాత చేపట్టామన్నారు. ‘ఇది ప్రజలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ వరకు మున్సిపాలిటీల విస్తరణతో పరిపాలనలో సత్ఫతాలిస్తుంది. ఇప్పటికే 3,102 అభ్యంతరాలు వచ్చాయి. ప్రతిదానికీ ఒక ప్రత్యేక సంఖ్య కేటాయించాం. అన్ని అభ్యంతరాలను పరిశీలించి, తగిన విధంగా స్పందిస్తాం’ అని చెప్పారు. పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జె. ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను అర్థవంతంగా పరిగణించలేదని, వార్డుల వారీగా జనాభా డేటాను బహిర్గతం చేయలేదన్నారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి.. వార్డుల విభజన ప్రక్రియను నిలిపివేయడానికి నిరాకరించారు. కాగా.. పారదర్శకత అవసరమని నొక్కి చెప్పారు. వార్డుల వారీగా జనాభా వివరాలు, ప్రామాణీకరించిన మ్యాప్‌లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రజలు రెండు రోజుల వ్యవధిలో మరిన్ని అభ్యంతరాలు లేవనెత్తవచ్చని హైకోర్టు సూచించింది. -
పోలింగ్ కేంద్రంలో ఇరువర్గాల దాడి
పరిగి: పోలింగ్ కేంద్రంలో జరిగిన ఇరు వర్గాల దాడిలో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన మాధారం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మూడో విడత ఎన్నికలో భాగంగా పోలింగ్ కేంద్రంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. ఓ సర్పంచ్ అభ్యర్థిపై ఓ వర్గం వారు దాడి చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ దాడిలో గాయపడిన ఓ వర్గానికి చెందిన రాములును పరిగి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మరో వర్గంపై దాడి చేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయించారు. ఎంపీ నిధులతో అభివృద్ధి అనంతగిరి: బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచిన గ్రామాల్లో ఎంపీ నిధుల కింద రూ.10 లక్షలు మంజూరు చేసుకుని, అభివృద్ధి చేస్తామని బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు అన్నారు. వికారాబాద్ మండలం మైలార్ దేవరాంపల్లి గ్రామంలో ఉపసర్పంచ్‌గా గెలుపొందిన బసంత బస్వలింగంను బుధవారం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధిలో కేంద్రం ఇచ్చిన నిధులే ఉన్నాయన్నారు. పీఎం నరేంద్రమోదీ గ్రామాలభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న భావనతో అన్ని విధాలా నిధులు కేటాయించనున్నారని పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో గ్రామాలను తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బస్వలింగం పాల్గొన్నారు. పోలింగ్ ప్రశాంతం: కలెక్టర్ అనంతగిరి: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం పరిగి నియోజకవర్గంలోని 5 మండలాల్లో 83.56 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించారని తెలిపారు. చేవెళ్ల: సర్పంచ్‌లందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని రేగడిఘనాపూర్ గ్రామ సర్పంచ్‌గా గెలిచిన తిప్పని మాధవిరాంరెడ్డి, ఉపసర్పంచ్ మహేశ్వరీరాములు, ఎన్కేపల్లి సర్పంచ్ బి.మహిపాల్‌రెడ్డి, ముడిమ్యాల సర్పంచ్ గౌడిచర్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన సర్పంచ్‌లు, వార్డుసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడే పోటీ ఉండాలని, గ్రామాల అభివృద్ధికి అంతా కలిసిమెలసి పనిచేసుకోవాలని సూచించారు. అభివృద్ధికి తనవంతు కృషిని అందిస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు పి.ప్రభాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. గ్రామాల అభివృద్ధికి సహకారం శంకర్పల్లి: మండలంలోని సంకేపల్లి గ్రామ సర్పంచ్ దేశ్‌పాండే శ్రీనివాస్ బుధవారం వార్డు సభ్యులు, మద్దతుదారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే
షాబాద్: పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన మండల సర్పంచ్‌లను జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్‌రెడ్డి అభినందించారు. బుధవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు అవినాశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని, ఎన్నికలు ఏమైనా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నూతన సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అంతారం, లక్ష్మరావుగూడ తదితర గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు అవినాశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ మేరకు ఆయన వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు నర్సింగ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్‌రెడ్డి -
నాడు ఒక్క ఓటుతో భర్త ఓటమి
నేడు మెజార్టీతో భార్య విజయం దౌల్తాబాద్: గత ఎన్నికల్లో మండలంలోని చల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో అతని భార్య రోజా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో చల్లాపూర్ సర్పంచ్ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. అప్పట్లో రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి చెందారు. ప్రస్తుతం ఈ జీపీని బీసీ మహిళకు కేటాయించారు. దీంతో రమేష్ తన భార్య రోజాను కాంగ్రెస్ మద్దతుతో బరిలో దింపారు. ఆమె సమీప ప్రత్యర్థిపై 558 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గ్రామస్తులు రమేష్ దంపతులను ఘనంగా సన్మానించారు. సర్పంచ్‌లకు పూర్తి సహకారం మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి తాండూరు రూరల్: నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. నూతన సర్పంచులకు పూర్తి సహకారం అందిస్తానని మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. పెద్దేముల్ సర్పంచ్‌గా ఎన్నికై న డీవై చిన్న నర్సింలును బుధవారం సన్మానించారు. అనంతరం గ్రామంలోని జితేందర్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీల అభివృద్ధికి ఎమ్మెల్సీ నిధుల మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మంచన్‌పల్లి పొలాలకు కోట్‌పల్లి ప్రాజెక్టు నుంచి నీరు వదలాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు ఫోన్ చేసి కోరారు. కార్యక్రమంలో నాయకులు గాజీపూర్ నారాయణరెడ్డి, లక్ష్మారెడ్డి, మహిపాల్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, నరేష్‌రెడ్డి, రవిశంకర్, మ ధుసూదన్రెడ్డి, గోపాల్‌రెడ్డి, అంజిల్‌రెడ్డి, నారాయణ గౌడ్, రాములు నాయక్, గోపి నాయక్, మన్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పరిగిలో ‘కారు’ జోరు
19 స్థానాల్లో బీఆర్ఎస్, 12 చోట్ల కాంగ్రెస్, ఒకచోట బీజేపీ పరిగి: మండలంలో బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. ఈ జీపీలో మొత్తం 32 గ్రామ పంచాయతీలు ఉండగా రెండు ఏకగ్రీవం అయ్యాయి. 30 పంచాయతీలకు పోలింగ్ జరగ్గా 19 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు సొంతం చేసుకున్నారు. 12 స్థానాలను కాంగ్రెస్, ఒకచోట బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందడంపై ఆ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ బిల్లును ఉపసంహరించుకోవాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప యాలాల: ఉపాధి హా మీ పథకంలో మా ర్పులకు గాను తెస్తున్న 20 25 కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించు కోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప డిమాండ్ చేశారు. 2005 తెచ్చిన చట్టాన్ని రద్దు చేసి 2025 పేరతో 197 బిల్లును కేంద్ర ప్రభు త్వం తీసుకువస్తోందని, ఈ బిల్లు చట్టమైతే తలలేని మొండెంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బిల్లులో ఉపాధి అవకాశాలు, మెరుగుపరిచే చర్యల గురించి ప్రస్తావన లేదన్నారు.కొత్త బిల్లులో పని దినాలు 125 రోజులకు పెంచుతున్నట్లు చెప్పి, 60 రోజులు పని నిషేధం విధించారన్నారు. ఇప్పటి వరకు 90 శాతం కేంద్రం వాటా, 10 శాతం రాష్ట్రం వాటా ఉండేదని, ప్రస్తుత బిల్లు చట్టమైతే రాష్ట్రాల వాటా 40 శాతం ఉండాలనే నిబంధన పథకాన్ని నిర్వీర్యం చేసే పనికి నిదర్శనమన్నారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సలామ్.. సీమాసుల్తానా బషీరాబాద్: బాధ్యతలు తీసుకోకముందే బాధ్యతెరిగిన ఓ నూతన సర్పంచ్ యాక్షన్‌లోకి దిగారు. గ్రామ సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. సొంత డబ్బు ఖర్చు చేసి తాగునీటి సమస్యకు చెక్ పెట్టి అందరి మన్ననలు పొందుతున్నారు. బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామ సర్పంచ్‌గా వరుసగా రెండో సారి ఎన్నికై న సీమాసుల్తానా గ్రామ సమస్యలపై ఫోకస్ పెట్టారు. పలు కాలనీల్లో పాడైన బోరుబావులకు, మోటార్లకు మరమ్మతులు చేయిస్తున్నారు. కొత్త మోటార్లు బిగిస్తున్నారు. మొదటి వార్డు ఉప్పరివాడ, రెండో వార్డు బీసీ కాలనీలో పాడైన రెండు చేతి పంపులను తొలగించి వాటి స్థానంలో కొత్త బోరు మోటార్లు బిగించారు. 4వ వార్డు మద్దూర్ వాడ, 7వ వార్డు టవర్ గల్లీ, 8వ వార్డు జోగు కాలనీల్లో కాలిపోయిన మూడు బోరు మోటార్లకు బుధవారం మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను రెండోసారి సర్పంచ్‌గా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుర్వ తమ్మణ్ణ, మాజీ వైస్ ఎంపీపీ అబ్దుల్ ఖాలీద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సాయిచరణ్ ఆమనగల్లు: జాతీయ స్థాయి అండర్–17 విభాగం కబడ్డీ పోటీలకు మండల పరిధిలో ని దయ్యాలబోడు తండాకు చెందిన ఎన్.సాయిచరణ్ ఎంపిక్యాడు. ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సాయి చరణ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపాడు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లో నిర్వహించనున్న జాతీయ పోటీలకు ఆయన్ను ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ మాధవరావు, అధ్యాపకబృందం విద్యార్థిని అభినందించారు. -
ఆక్రమణలు తొలగించాల్సిందే
తాండూరు టౌన్: మున్సిపల్ పరిధిలో రోడ్లను ఆక్ర మించి వ్యాపారం చేసుకుంటున్న వారు స్వచ్ఛందంగా వాటిని తొలగించాలని, లేకుంటే తామే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ యాదగిరి హెచ్చరించారు. మూడు రోజుల్లోగా ఆక్రమణల తొలగింపు ప్రక్రియ పూర్తికావాలని ఆదేశించారు. బుధవారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం నుంచి మార్కెట్ వరకు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తెలిపారు. వార్డుల్లో విద్యుద్దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి సమస్యల తక్షణపరిష్కారం కోసం సంబంధించిన ఇన్‌చార్జ్‌ల పేర్లు, ఫోన్ నంబర్లను గోడలపై రాశామన్నారు. ఫోన్ చేసి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అయినా పరిష్కారం కాకపోతే నేరుగా కార్యాలయానికి వచ్చి అక్కడి రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలోటౌన్ ప్లానింగ్ అధికారులు వంశీధర్, నరేష్, ప్రియ, శానిటరీ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, ఉమేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికతో సాగండి
దుద్యాల్: మండలంలోని హకీంపేట్ శివారులో చేపట్టిన పారిశ్రామిక వాడ, ఎడ్యుకేషన్ హబ్ పనుల్లో వేగం పెంచాలని, ప్రణాళికతో ముందుకు సాగాల ని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి పారిశ్రామిక వాడ, ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించారు. ఏఏ విద్యాసంస్థలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారని ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. పారిశ్రామిక వాడ ఏర్పాటుతో అనేక కంపెనీలు వస్తాయని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యత ఉండాలని సూచించారు. ముందుగా రోడ్డు పనులను పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ కవిత, డీఈ శేషగిరి, ఎడ్యుకేషన్ హబ్ చీఫ్ ఇంజనీర్ షఫీ, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్, డీఈఈ రాజయ్య, ఏఈలు విజయ భాస్కర్ రెడ్డి, జనార్దన మూర్తి, తహసీల్దార్ కిషన్, ఆర్ఐ నవీన్ కుమార్, సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రోహింగ్యా యువకుడి దారుణ హత్య
పహాడీషరీఫ్: బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శరణార్థులుగా నివాసం ఉంటున్న బర్మా దేశస్తుల(రోహింగ్యాలు) క్యాంప్‌లో ఓ యువ కుడు హత్యకు గురయ్యాడు. ఇన్స్పెక్టర్ ఎం. సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయల్ కాలనీలోని బర్మా(మయన్మార్) క్యాంప్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఆ దేశానికి చెందిన ముర్షీద్(19), అబ్దుల్లా (20) మద్యం మత్తులో చిన్న చిన్న విషయాలను మనసులో ఉంచుకొని పరస్పరం దూషించుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన అబ్దుల్లా ఇంట్లోకి వెళ్లి చాకు తీసుకొచ్చి ముర్షీద్ వీపు, మెడ భాగాలలో విచక్షణా రహితంగా 15 పోట్ల వరకు పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న మహేశ్వరం ఏసీపీ జానకీ రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్‌లు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. చిరు వివాదంతోనే 15 కత్తి పోట్లు పొడిచాడా? అనే అనుమానాలు కూడా స్థానికంగా వ్యక్త మవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల పరిధిలో వరుసగా జరుగుతున్న ఇలాంటి నేరాల పట్ల స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. -
గోపాల్ ‘తీన్’మార్!
దోమ: మండలంలోని పెద్దతండాచిన్నతండా పంచాయతీలో బుధ వారం నిర్వహించిన సర్పంచ్ ఓట్ల కౌంటింగ్ నువ్వా..నేనా.. అన్నట్లగా సాగింది. ఇక్కడ కాంగ్రెస్ బలపర్చిన నేనావత్ లక్ష్మణ్, బీఆర్ఎస్ మద్దతుతో ఆంగోత్ గోపాల్ బరిలో ఉన్నారు. వీరి మధ్య సాగిన ఉత్కంఠ పోరులో ప్రత్యర్థి లక్ష్మణ్‌పై మూడు ఓట్ల స్వల్ప తేడాతో గోపాల్ విజయం సాధించారు. ‘గండిపేట’లోకి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు మొయినాబాద్: హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందిస్తున్న గండిపేట జలాశయం గలీజవుతోంది. సెప్టిక్ ట్యాంకులోని మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలో వదులుతున్నారు. ఈ తతంగం ఏన్నాళ్ల నుంచి జరుగుతుందోగాని బుధవారం స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని జలమండలి అధికారులకు అప్పగించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ పక్కనే గండిపేట జలాశయం ఉంది. బుధవారం ఇక్కడ ఉన్న కట్టపై ఓ సెప్టిక్ ట్యాంక్ నుంచి మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలోకి వదులుతున్నారు. దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్‌ను నిలదీశారు. స్థానికులు జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నరహరి అక్కడికి చేరుకుని డ్రైవర్‌ను ప్రశ్నించారు. శివనాయక్‌కు సంబంధించిన వాహనమని.. హిమాయత్‌నగర్ గ్రామంలో నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి వదులుతున్నట్లు డ్రైవర్ చెప్పాడు. దీంతో డీజీఎం నరహరి మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
పార్టీలకతీతంగా కలిసి పనిచేయాలి
ఎమ్మెల్యే కాలె యాదయ్యచేవెళ్ల: స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని రావుపల్లి గ్రామ సర్పంచ్ గోటూరి రాంచంద్రయ్యగౌడ్, వార్డుసభ్యులతో కలిసి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను సన్మానించి.. స్వీట్లు తినిపించారు. ఆయనను కలిసిన వారిలో పీఏసీఎస్ డైరెక్టర్ కేసారం నరేందర్, ఉపసర్పంచ్ అనూషఅంజన్కుమార్, వార్డుసభ్యులు మల్లీశ్వరి, జ్యోతి వెంకటేశ్, గోపాల్, మాజీ ఉపసర్పంచ్ నాగిరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, గ్రామ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరిక.. మండలంలోని నాల్యట గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఎల్లయ్య, తన అనుచరులతో మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో న్యాలట గ్రామ నాయకులు, యవకులు ఉన్నారు. -
బీఆర్ఎస్ సర్పంచ్‌లను కాంగ్రెస్‌లోకి తీసుకోం
తాండూరు రూరల్: బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను కాంగ్రెస్‌లోకి తీసుకునే ప్రసక్తే లేదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తన అనుచరులతో పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ సర్పంచులను తీసుకుంటే గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు మొదలై, ఘర్షణలు చెలరేగే ఆస్కారం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎవరూ అపోహలకు పోవద్దని, కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి, అవకాశాలు వస్తూనే ఉంటాయని, అప్పటి వరకూ వేచి చూడాలని దిశానిర్దేశం చేసినట్లు వినికిడి. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన మాట వినేవారికే అవకాశం ఇస్తానని చెప్పినట్లు తెలిసింది. అనంతగిరి: పనికోసం ఇంటి నుంచి వెళ్లిన కూలీ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ భీంకుమార్ తెలిపిన ప్రకారం.. చేవెళ్ల మండలం ఆలూరుకు చెందిన సాలె రమేశ్ కుటుంబంతో కలిసి వికారాబాద్‌లో నివసిస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో అతని భార్య లలిత ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పీఎస్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు. -
కొనుగోల్‌మాల్!
బషీరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఐకేపీ నిర్వాహకులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు పంచాయతీ ఎన్నికల్లో తలమునకలవడంతో రైస్ మిల్లర్ల కనుసన్నల్లో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా తూకాలు వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్తాకు 40.6 కిలోలు తూకం వేయాల్సి ఉండగా ఐకేపీ, సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రాల్లో 42.250 కిలోల నుంచి గరిష్టంగా 42.5 కేజీలుగా తూకాలు వేస్తున్నారు. ఇలా ఒక్కో బస్తాకు అదనంగా 1.65 కిలోల నుంచి రెండు కిలోల వరకు రైతుల నుంచి ధాన్యం అదనంగా లూటీ చేస్తున్నారు. మిల్లర్ల మాయాజాలం జిల్లాలో 29 ఐకేపీ కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇప్పటి వరకు 2,252 మంది రైతుల నుంచి 2,58,315 బస్తాల ధాన్యం సేకరించారు. అయితే పాడి క్లీనర్ వేస్తే బస్తాకు 40.600 కేజీలు తూకం వేయాలని, శుభ్రంలేని వడ్లు గరిష్టంగా 41 కిలోలు వరకు తూకాలు వేయొచ్చని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇక్కడే మిల్లర్లు మాయాజాలం చేస్తున్నారు. బస్తాకు కనీష్టంగా 42 కిలోల ధాన్యం లేకుంటే లారీలను వాపస్ పంపిస్తామని, అంతకంటే అదనంగా తూకాలు వేసి పంపితే ‘గుడ్‌విల్’ఉంటుందని ఆఫర్ ఇచ్చారు. దీంతో ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాలు రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. బషీరాబాద్ మండలంలోని కాశీంపూర్ కొనుగోలు కేంద్రంలో బస్తాకు 42.250 తూకం వేస్తుంటే.. యాలాల మండల కేంద్రంలోని కొనుగోలు సెంటర్లో గరిష్టంగా 42.500 కేజీలు తూకం వేస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే రోజుల తరబడి వారి ధాన్యం తూకం వేయకుండా కాలయాపన చేస్తున్నారు. 3,874 క్వింటాళ్లు ధాన్యం దోపిడీ జిల్లాలో నేటికి 2,58,315 బస్తాలు తూకాలువేసి మిల్లులకు పంపించారు. అయితే ఒక్కోబస్తాకు కనీసం 1.5 కిలోలు చొప్పున లెక్క గట్టినా 3,874 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కలిసి దోపిడీకి ప్పాడినట్లు తేటతెల్లమవుతోంది. ఒక్క క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,390 చొప్పున దోపిడీ జరిగిన ధాన్యం విలువ రూ.9.25 లక్షల విలువ చేస్తుంది. ఇది కేవలం ఐకేపీ కేంద్రాల్లో ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లకు సంబంధించిన అంచనా మాత్రమే. ఇంకా సొసైటీల ద్వారా జరిగిన కొనుగోళ్లలోనూ ఇదే తరహా దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. ఇంతా జరుగుతున్నా జిల్లా సివిల్ సప్లై అధికారులు గానీ, డీఆర్డీఓ ఉన్నతాధికారులు స్పందించకపోవడం శోచనీయం. మిల్లర్ల కనుసన్నల్లో కొనుగోలు కేంద్రాలు ఒక్కో బస్తాపై రెండు కిలోల అదనంగా తూకం లేబర్ చార్జీల పేరిట క్వింటాల్‌కు రూ.50 వరకు వసూళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు ధాన్యం అమ్మేందుకు తీసుకువస్తే బస్తాకు 42.2 కిలోల చొప్పున తూకం వేశారు. 364 బస్తాలకు 582 కిలోల ధాన్యం అదనపు తూకంతో దోచుకున్నారు. దీంతో సుమారు రూ.13 వేలు నష్టపోయా. అధికారులను ప్రశ్నిస్తే తూకాలు వేయకుండా అడ్డుకుంటున్నారు. – ప్రశాంత్‌రెడ్డి, రైతు, రెడ్డిఘణాపూర్ -
కన్నతల్లే కర్కశురాలై
● అపార్ట్మెంట్ పైనుంచి బిడ్డను కిందకు తోసేసిన వైనం ● అక్కడికక్కడే మృతిచెందిన ఏడేళ్ల చిన్నారి మల్కాజిగిరి: కుటుంబ కలహాలు..క్షణికావేశం..ఓ చిన్నారి ప్రాణం తీసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే హంతకురాలైంది. తన ఏడేళ్ల బిడ్డను అపార్టుమెంట్ మూడో అంతస్తు పైనుంచి కిందకు నెట్టేసి దుర్మార్గానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపురి కాలనీలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ మేరకు మంగళవారం ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ తెల్పిన మేరకు..వసంతపురి కాలనీలోని గురుకృప అపార్ట్మెంట్ మూడో అంతస్తులో డేవిడ్, మోనాలిసా దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమారుడు, ఏడేళ్ల వయసున్ను కుమార్తె షరోన్ మేరీ ఉన్నారు. మేరీ స్ధానిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతోంది. మోనాలిసా ఒక మత ప్రచార సంస్ధలో పనిచేస్తుండగా, డేవిడ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇటీవల ఇంటి వద్దనే ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి వీరిద్దరు గొడవ పడుతున్నట్లుగా తెలిసింది. సోమవారం సాయంత్రం షరోన్ మేరీ తన తల్లి మొబైల్ ఫోన్ చూస్తుండగా ఆగ్రహించిన మోనాలిసా ఒక్కసారిగా బాలికను పైనుంచి కిందకు విసిరేసిందని భర్త డేవిడ్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన మేరీని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. భర్త డేవిడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భిన్న వాదనలు.. చిన్నారి మృతికి భార్యా భర్తల మధ్య కలహాలా..లేక దేవుడిపై నమ్మకం విషయంలో తలెత్తిన విభేదాలా అని స్థానికంగా భిన్నకథనాలు విన్పిస్తున్నాయి. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వారు మాత్రం మోనాలిసా రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చేదని, ఆమె మానసిక స్థితి బాగాలేదన్న విషయం తమకు తెలియదంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలు ఏమైనా వస్తువులు కిందకు పడేస్తుంటారని, అదే విధంగా ఆదివారం కూడా ఏమైనా పడేశారేమోనని చూస్తే చిన్నారి రక్తం మడుగులో కనిపించందని ఓ వృద్ధురాలు తెలిపింది. ఆమె మానసిక స్థితి బాగాలేదని బంధువులు చెబుతున్నప్పటికీ, కుటుంబ సభ్యులు, భర్త ఫిర్యాదులో ఆ విషయాన్ని తెలియజేయలేదని, దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
గెస్ట్ లెక్చరర్ నియామకాల్లో అవకతవకలు
తాండూరు టౌన్: అతిథి అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ ఆరోపించారు. ఇందులో జిల్లా నోడల్ అధికారి శంకర్‌నాయక్ పాత్రపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం తాండూరు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తాజా నియామకాల సందర్భంగా పదేళ్లకు పైగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న మహేశ్‌తో పాటు పలువురిని అకారణంగా తొలగించడం అన్యాయమన్నారు. అనుభవం, అర్హత ఉన్న అధ్యాపకులు ఏళ్ల తరబడిగా చాలీచాలని జీతానికి సేవలందిస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారన్నారు. వారిని తొలగించడం సబబు కాదన్నారు. అతిథి అధ్యాపకుల నియామకాల్లో జరిగిన అవకతవకలపై ఇంటర్మీడియెట్ జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్‌పై ఆరోపణలున్నాయని, తక్షణమే ఆయనపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, నాయకులు వెంకటేశ్, అనిత, జగదీశ్వరి, రాజు, జోసఫ్, బాబా గౌడ్, నరేందర్, రమేశ్, యాసర్ తదితరులు ఉన్నారు. బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్ -
ఇనుప పైపు పడి వ్యక్తికి గాయాలు
దుద్యాల్: బోరు వేసే వాహనం నుంచి ఇనుప పైపు పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని సంట్రకుంట తండాలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాథోడ్ వెంకటేశ్ తన పొలంలో బోరు వేయడానికి వాహనాన్ని పిలిపించి వేయించారు. ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఇనుప పైపులు వాహనంలో సరిగా అమర్చకపోవడంతో పక్కన ఉన్న వెంకటేశ్‌పై పడ్డాయి. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అతడిని కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రసుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. మానసిక స్థితి సరిగా లేక వెళ్లిపోయిన వైనం యాలాల: మానసిక పరిస్థితి సరిగా లేని ఓ యువకుడు ఇంటి నుంచి ఐదేళ్ల క్రితం వెళ్లి పోయాడు. ప్రస్తుతం అతడు కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు అక్కడి అధికారులు తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యాలాల మండలానికి చెందిన శంకర్ మానసిక పరిస్థితి బాగా లేదు. ఐదేళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయి రైలెక్కి కేరళ రాష్ట్రానికి వెళ్లిపోయాడు. అప్పట్లో అతడి గురించి కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కేరళలో ఉంటున్న శంకర్‌ను అక్కడి ఓ స్వచ్ఛంద సంస్థ గుర్తించి వివరాలు సేకరించగా, తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ముద్దాయిపేట అని తేలింది. దీంతో అక్కడి యంత్రాంగం స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. వాట్సాప్‌లో ఫొటో పంపడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గుర్తు పట్టారు. దీంతో శంకర్‌ను కేరళ నుంచి తెలంగాణకు బుధవారం తీసుకురానున్నట్లు తెలిపారు. తాండూరు రూరల్: రైతుల పొలాల వద్ద ఉన్న బోరు మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ సంఘటన మండల పరిధిలోని వీర్ శెట్టిపల్లి, బెల్కటూర్, ఎల్మకన్నె గ్రామాల్లో చోటు చేసుకుంది. బాధిత రైతులు తెలిపిన ప్రకారం.. వీర్‌శెట్టిపల్లి, బెల్కటూర్, ఎల్మకన్నె గ్రామాలు కాగ్నావాగు పరివాహన ప్రాంతాల్లో ఉన్నాయి. వాగులోంచి బోరు మోటార్ల ద్వారా నీటిని పొలాలకు పారిస్తుంటారు. గుర్తు తెలియని దుండగులు ఆ బోరు మోటార్లను దొంగలిస్తున్నారని రైతులు వాపోతున్నారు. వీర్‌శెట్టిపల్లిలో బొప్పి హన్మంత్, బక్క మల్లప్ప, గుడిసె నర్సింలు, బలిజ జగదీశ్, పరమేశ్, గుడిసె అనంతప్ప, తూర్పు మల్లప్ప ఎల్మకన్నె గ్రామ రైతుల బోరు మోటర్లు చోరికి గురైనట్లు రైతులు చెప్పారు. ఈ మేరకు మంగళవారం కరన్‌కోట్ ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు. దోమ: జ్వరంతో బాధ పడుతూ ఓ ఆర్మీ ఉద్యోగి సోమవారం మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. దోమ మండలంలోని దాదాపూర్ గ్రామానికి చెందిన తోకని అంజయ్య, కనకమ్మల రెండో కుమారుడైన శ్రీనివాస్(22) రెండేళ్ల క్రితం ఆర్మీలో జవాన్‌గా చేరారు. ప్రస్తుతం పంజాబ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన రెండు రోజుల పాటు తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. ఆర్మీ ఆస్పత్రిలో వైద్యం పొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయారు. ఈ విషయం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం దాదాపూర్‌లో అధికారిక లాంఛనాలతో శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య కడ్తాల్: మండల పరిధిలోని పల్లెచెలకతండాకు చెందిన దంపతులు వరుసగా సర్పంచ్ పదవులను అలంకరించారు. 2018లో జీపీగా ఆవిర్భవించిన ఈగ్రామంలో 2019లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా, ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. దీంతో తండాపెద్దలు సమావేశమై లోకేశ్నాయక్ను ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఈనెల 14న జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ వచ్చింది. దీంతో లోకేశ్‌నాయక్ సతిమణి నీలావతి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసి, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి అంజమ్మపై 35 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
ఆమే కీలకం
● మండలంలోని పది గ్రామాల్లో మహిళా ఓటర్లే అధికం ● సర్పంచ్ ఎన్నికల్లో గెలుపోటములను శాసించనున్న అతివలు ఇబ్రహీంపట్నం: మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు, 140 వార్డులకు బుధవారం నిర్వహించనున్న ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తాజా ఓటరు జాబితా ప్రకారం మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 31,835 మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు 15,780, మహిళలు 16,053 మంది, ఇతరులు ఇద్దరున్నారు. పురుషులకంటే 273 మంది మహిళలే అధికంగా ఉన్నారు. ఒక్కో ఓటు కీలకమే.. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డుల ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. అవే ఫలితాలను తారుమారు చేస్తాయి. ఏ ఒక్క ఓటు చేజారకుండా అభ్యర్థులు తీవ్రంగా కసరత్తు చేశారు. అతి తక్కువగా కర్ణంగూడలో .. మండలంలో అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామం కర్ణంగూడ. ఈ గ్రామంలో కేవలం 697 మంది ఓటర్లే ఉండటం గమనార్హం. అదేవిధంగా అత్యధికంగా దండుమైలారంలో 4,959 మంది ఉన్నారు. సుమారు రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికల కోసం నిరీక్షించిన అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో గెలవడం ఓ పరీక్షలా మారింది. అంగ, అర్థ, బంధు బలగాలతో ప్రచారంతోపాటు, ఓటర్లకు తాయిలాలను సమర్పించి ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో ఆయా పార్టీల మద్దతుదారులు బరిలో ఉన్నారు. అధికార, ప్రతిపక్ష నేతలతో పంచాయతీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం సాగింది. ఇక ఓటర్ల తీర్పు ఏరకంగా ఉంటుందో వేచిచూడాల్సిందే. గ్రామాల వారీగా ఓటర్ల వివరాలు గ్రామపంచాయతీ పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు మొత్తం చర్లపటేల్ గూడ 951 941 – 1,892 దండుమైలారం 2,456 2,503 – 4,959 ఎలిమినేడు 1,653 1,734 – 3,387 కప్పపహాడ్ 909 935 – 1,844 కర్ణంగూడ 339 358 – 697 ముకునూర్ 591 579 1 1,171 నాగన్‌పల్లి 865 864 1 1,730 నెర్రపల్లి 710 542 – 1,052 పోచారం 1,083 1,088 – 2,171 పోల్కంపల్లి 1,646 1610 – 3,256 రాయపోల్ 2,475 2,481 – 4,956 తుర్కగూడ 505 546 – 1,051 తులేకలాన్ 942 1,000 – 1,942 ఉప్పరిగూడ 855 872 – 1,727 -
ఆయుర్వేదంలో హన్మంత్‌కు డాక్టరేట్
బొంరాస్‌పేట: పదిహేనేళ్లుగా ఆయుర్వేద వైద్యసేవలందిస్తున్న గుంజ హన్మంత్ డాక్టరేట్ పట్టా పొందారు. లింగన్పల్లికి చెందిన ఆయన ప్రకృతిలో ఉన్న వనమూళికలను ఆయుర్వేదంగా మార్చి ప్రజలకు వైద్యం అందిస్తున్నందుకు గాను చైన్నెలోని గ్లోబల్ హ్యూమన్ పీస్ వర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ (ఆయుర్వేదం) ఈ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా హన్మంత్ మాట్లాడుతూ తన ఆయుర్వేద విద్యకు పునాదులు వేసిన డాక్టర్ చెన్మూర్ నారాయణరెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి, హీరాలాల్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరిగి: రాష్ట్రంలో పరిగి నియోజకవర్గాన్ని మోడ ల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మె ల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మున్సిపల్ పరిధిలోని తిరుమల వెంచర్లో రూ.20 లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్, తుంకుల్‌గడ్డలో రూ.15లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగి ప్రాంత అభివృద్ధే తన లక్ష్యమన్నారు. ఓపెన్ జిమ్‌ను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. తుంకుల్‌గడ్డలో విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంత్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, పట్టణ అధ్యక్షుడు కృష్ణ, గోపాల్, చిన్న నర్సింలు తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు జిల్లా వైద్యాధికారి స్వర్ణలత పరిగి: నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి స్వర్ణలత అన్నారు. మంగళవారం ఆమె పట్టణకేంద్రంలోని విజేత ఆస్పత్రికి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులు లేక పోవడంతో నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. నోటీలసుకు వెంటనే వివరణ ఇవ్వాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రిలో అనుమతులు ఉన్న చికిత్సలే నిర్వహించాలన్నారు. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం షాద్‌నగర్‌రూరల్: పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని గిరిజన గురుకులాల రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం ఫుడ్ ఫెస్ట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్‌రెడ్డి విద్యార్థినులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు పౌష్టికాహారంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె, మైక్రోబయోలజీ హెడ్ కళాజ్యోతి, బోటనీ హెడ్ స్పందన పాల్గొన్నారు. -
● సాధారణ ఎన్నికల జిల్లా అధికారి షేక్ యాస్మిన్ బాష
పరిగి: మూడో విడత పంచాయితీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల జిల్లా అధికారి షేక్ యాస్మిన్ బాష సూచించారు. మంగళవారం ఆమె పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా యాస్మిన్‌బాష మాట్లాడుతూ.. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను సరిచూకోవాలన్నారు. పోలింగ్‌లో లోపాలు ఉంటే వెంటనే సమాచారం అందించాలన్నారు. ఆమె వెంట డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్వరి, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. -
వనజీవి రామయ్య బయోపిక్
అనంతగిరి: పద్మశ్రీ అవార్డు గ్రహీత, పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసి కోటి మొక్కలు నాటిప వనజీవి రామయ్య జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తున్నారు. మంగళవారం చిత్ర యూ నిట్ వికారాబాద్ సమీపంలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో, పట్టణంలో పలు ప్రాంతాల్లో పలు సీన్ లు చిత్రీకరించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడ మే లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణ ఫిలిం బ్యా నర్ పై ఈ డాక్యుమెంటరీని నిర్మిస్తున్నట్లు డైరక్టర్ వేముగంటి తెలిపారు. వనజీవి రామయ్య పాత్రలో న టుడు బ్రహ్మాజీ నటించగా, ఆయన భార్య పాత్రలో నాగరాణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా బల్లె మోహన్, రైటర్ డాక్టర్ కళారంగా, కెమెరామెన్‌గా కేవీ రమణ, సహ నిర్మాత రవీందర్ నాథ్, నటులు జోగిని శ్యామల, ప్రభావతి, సిద్దిపేట తిరుపతి, వెంకట్, పైడిపల్లి, చైతన్య, వేణు గోపాల్, రవీంద్రనాథ్, దివాకర్ పాల్గొన్నారు. -
విజేతలెవరో?
ఇబ్రహీంపట్నం: నియోజకవర్గంలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు బుధవారం పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 73 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు, వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల ఉంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. విజేతలెవరో తేలి పోనుంది. అలుపెరుగని ప్రచారం వారం రోజులుగా ఇంటింటికీ, గడపడపకూ తిరిగి అభ్యర్థులు విస్తృత ప్రచారం సాగించారు. ప్రచార ఘట్టంలో ఎవ్వరినీ కాదనకుండా హామీల వర్షం గుప్పించారు. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు, ఆకట్టుకునేందుకు మందు, విందు, గిఫ్ట్‌లు, నగదు చెల్లింపులు చేశారు. ప్రత్యర్థి అంత ఇచ్చాడంటే దానికంటే కొంత ఎక్కువిచ్చేందుకు సైతం వెనుకాడలేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతూ తాయిలాలు సమర్పించుకున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేల వరకు వెచ్చించినట్టు సమాచారం. పైకి గంభీరంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల మత్రం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారోనన్న ఆందోళన వారిలో నెలకొంది. ఆదరించేనా.. తిరస్కరించేనా.. లక్షలు ఖర్చు చేసినా ఓటర్లు తమను ఆదరిస్తారా.. అందలం ఎక్కిస్తారో లేదోనన్న భయం అభ్యర్థులను వెంటాడుతోంది. శతవిధాలా ప్రయత్నించినా ఓటరు నాడిని మాత్రం పసిగట్టలేకపోయారు. చివరి నిమిషంలో ఏం జరుగుతుందో.. ఓటరు కరుణా కటాక్షాలు ఎవరిపై ఉంటాయోనని టెన్షన్‌తో గడుపుతున్నారు. ఏలాగైన విజయం సాధించాలనే పట్టుదలతో చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. గ్రామంలో ఓటు ఉండి ఇతర ప్రాంతాల్లో నివసించే వారిని రప్పించి ఓట్లు వేసేవిధంగా ఎవరికివారే ఏర్పాట్లు చేశారు. ఇందుకు ప్రత్యేక సదుపాయాలు, ప్యాకేజీలు సమర్పించారు. కొన్నిచోట్ల తమ స్థాయికి మించి ఖర్చు చేశారు. బుధవారం సాయంత్రంతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఓటర్లు ఎవరిని తిరస్కరిస్తారో.. ఎవరికి పట్టం కడతారో తేటతెల్లం కానుంది. -
నేడే ఫైనల్
వికారాబాద్/పరిగి: మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది మండల కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన గ్రామాలకు మంగళవారమే చేరుకున్నారు. పోలీసు బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు. మొత్తం 157 గ్రామపంచాయతీలు ఉండగా ఇప్పటికే 18 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 139 స్థానాలకు గాను 289 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,336 వార్డులకుగాను 138 వార్డులు ఏకగ్రీవం కాగా 1,198 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. బుధవారం ఉగయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు పోలింగ్ ఉంటుంది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఐదు మండలాలకు 1,202 టీంలు ఎన్నికలు నిర్వహించనున్న పరిగి, పూడూరు, దోమ, కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో ఇప్పటికే ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. రెండు దఫాలుగా రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి శిక్షణను పూర్తి చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారితో పాటుగా పీఓలు, ఓపీఓలు విధులు నిర్వహిస్తారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఈ ఎన్నికలకు గాను 1,470 మంది పీఓలు, 1,726 మంది ఓపీఓలు, ఇద్దరు సభ్యులుండే టీంలు 988, ముగ్గురు సభ్యులుండే టీంలు 214 కలుపుకొని మొత్తం 1,202 టీంలు ఎన్నికల విధుల్లో పాల్గొంటాయి. 2,718 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీపీఓ జయసుధ ఇతర జిల్లా అఽధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు 45 రూట్లు ఎన్నికల నిర్వహణకుగాను 45 రూట్లుగా విభజించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండడానికి గాను 800 మంది పోలీసుసిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నా రు. స్థానిక పోలీసు సిబ్బందితో బటయ నుంచి వచ్చిన (సుమారు 150 మంది) స్పెషల్ పోలీసు లు సైతం ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. మూడు విడతల ఎన్నికలకు గాను ఎప్పటికప్పుడు శాంతిభద్రతల సమస్యలను తెలుసుకోవడానికి ఎస్పీ కార్యాలయంలో పోలీసు కంట్రోల్‌రూం ఏర్పాటుచేశారు. మండలానికి ఒకరు చొప్పున డీఎస్పీ, సీఐలను నియమించి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్వేచ్ఛగా ఓటేసేలా.. కలెక్టర్ ప్రతీక్‌జైన్ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం ఓటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేశారు. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక ప్రతిభావంతులకు ఓటు వేసే సమయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీల్ చైర్లు తదితర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రలోభాల పర్వంలో మునిగిపోయారు. ఓటర్ను పోలింగ్ బూత్‌కు తరలించేందుకు శాయశక్తులు ఒడ్డుతున్నారు. ఏకగ్రీవమైన పంచాయతీలు మూడో విడతలో ఐదు మండలాల్లో 157 పంచాయతీలకు గాను 18 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పంచాయతీల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు 17 మంది ఉండగా కుల్కచర్ల మండలం దాస్యనాయక్ తండా నుంచి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కవిత సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. తుది విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఏకగ్రీవ సర్పంచ్‌లు వీరే..గ్రామం సర్పంచ్ పూడూరు కొత్తపల్లి దీపికారెడ్డి పరిగి మండలం మల్కచెర్వుతండా గోపాల్ రూప్సింగ్ తండా రమణిబాయి దోమ లింగన్‌పల్లి గోపాల్ కిష్టాపూర్ వరలక్ష్మి దోర్నాల్‌పల్లి సత్యానారాయణరెడ్డి పెద్దతండా సురేఖ చెట్లగొల్కతండా కవిత కుల్కచర్ల తిర్మలాపూర్ మాధవి బోట్యానాయక్ తండా సంతోశ్ ఎత్తక్వాతండా సీతారామ్ దాస్యనాయక్ తండా కవిత చౌడాపూర్ కిష్టంపల్లి రాధిక వాల్యానాయక్ తండా నర్సింహ నాయక్ కొత్తపల్లి రజిత నీర్సాబ్ తండా నారాయణ మక్తవెంకటాపూర్ కవిత లింగన్నపల్లి కిష్టమ్మ -
●విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
దోమ: సమస్యాత్మక గ్రామాలపై పటిష్ట నిఘా పెట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. మంగళవారం ఆమె దోమ ఎన్నికల నిర్వహణ తీరుపై మండల ఎన్నికల సహాయ అఽఽధికారి గ్యామాను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు తగు సూచనలు ఇచ్చారు. ప్రతీ ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని చెప్పారు. విధు ల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దన్నారు. మహేశ్వరం: మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు లు, అధికారులకు సహకరించాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం ఆయ న ఏసీపీ జానకిరెడ్డి, సీఐ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు అయ్యే వరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమతి లేని వారిని, ఓటరు కానివారిని పోలింగ్ బూత్‌ల్లోకి అనుమతించొద్దని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
ఇందిరమ్మ రాజ్యంతోనే అభివృద్ధి
● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ● పలు గ్రామాల్లోపంచాయతీ ఎన్నికల ప్రచారందోమ: ఇందిరమ్మ రాజ్యంతోనే అభివృద్ధి సాఽ ద్యమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం తన స్వగ్రామం శివారెడ్డిపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు లక్ష్మమ్మతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం బొంపల్లి, బాస్పల్లిలో అభ్యర్థులు బోయిని సంతోష, తలారి అనంతయ్య తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే వచ్చాయని, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీలు, వీధి దీపాలు, మంచినీటి వసతి కల్పిస్తున్నారని స్పష్టంచేశారు. అధికార పార్టీకి సంబంధించిన వారిని గెలిపించుకుంటేనే పల్లెల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. -
అభివృద్ధిలో కలిసి సాగండి
అనంతగిరి: ప్రజల ఆదరణతో సర్పంచ్‌లుగా గెలిచిన వారు గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలని శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. విజయం సాధించిన పలువురు సర్పంచ్‌లు వికారాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపిస్తున్నాని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని, మిగిలిన సమయంలో అందరూ కలిసి, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ -
సత్తాచాటారు.. సర్పంచ్‌లయ్యారు
శంకర్పల్లి: చిన్నచిన్న సంఘటనలు మినహా ఆదివారం నిర్వహించిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఈఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన కొండకల్ అభ్యర్థి ఎరుకల శేఖర్ 730 ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలుపొందగా, ఎల్వర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మద్దతుదారులు మారెపల్లి భాగ్యలక్ష్మి 721 ఓట్లతో భారీ విజయం సాధించారు. గోపులారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తంగెడపల్లి రవీందర్‌రెడ్డి హోరాహోరీ పోరులో 10 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. కుర్వగూడ ‘సర్పంచ్ హ్యాట్రిక్’ షాబాద్: మండల పరిధిలో కుర్వగూడ సర్పంచ్ బుయ్యని సంధ్యరాణి హ్యాట్రిక్ విజయం సాధించారు. వరుసగా మూడోసారి ఆమె గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా మండలంలో బీఆర్ఎస్ సత్తాచాటింది. మొత్తం 41 పంచాయతీలు ఉండగా, 22 జీపీలను గులాబీ సానుభూతిపరులే సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ 17, బీజేపీ, ఇండిపెండెంట్‌కు చెరో స్థానం దక్కింది. ఒక్క ఓటు తేడాతో విజయం కడ్తాల్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో నార్లకుంటతండా సర్పంచ్ స్థానానికి హోరాహోరీగా పోటీ సాగింది. ఒకేఒక్క ఓటు తేడాతో అంగోతు రాంచందర్‌నాయక్ విజయం సాధించారు. తండాలో మొత్తం 462 ఓట్లు ఉండగా, 423 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన అంగోత్ రాంచందర్‌నాయక్‌కు 206 ఓట్లు రాగా, కాంగ్రెస్ బలపరిచిన జాటవత్ రమేశ్‌కుమార్‌కు 205 ఓట్లు వచ్చాయి. నోటాకు 3 ఓట్లు పడగా, 9 ఓట్లు చెల్లకుండాపోయాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో రాంచందర్‌నాయక్ విజయం సాధించారు. ఆ రెండు గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ చేవెళ్ల: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఘర్షణలకు దారితీసిన రెండు గ్రామాల్లో సోమవారం పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సింగప్పగూడ, రేగడిఘనాపూర్‌లో ఆదివారం స్వల్ప ఘర్షణలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ రెండు గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సాధారణ పరిస్థితులు వచ్చే వరకు పికెటింగ్ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు తుర్కయంజాల్: జీహెచ్ఎంసీ ఇటీవల ప్రకటించిన వార్డులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తుర్కయంజాల్ బీజేపీ నాయకులు సోమవారం కమిషనర్ కర్ణన్‌ను కలిసి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్త కాలనీలు, ఇళ్లలో నివసిస్తున్న జనాభా ఆధారంగా విభజన చేపట్టాలని కోరారు. తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్లను మొత్తం నాలుగు డివిజన్లుగా చేయాలని, కోహెడ పేరుతో ఓ డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రజలకు సుపరిపాలన అందించాలి
బంట్వారం: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ అన్నారు. కోట్‌పల్లి సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన జంగం బసమ్మను సోమవారం ఆయన మండల కేంద్రంలో శాలువా పూలమాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంగయ్య స్వామి, జ్ఞానేశ్వర్, సమ్మయ్య, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు కేశంపేట: ఆర్టీసీ బస్సును కారు వెనుక నుంచి ఢీకొన్న సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం డిపోకు చెందిన బస్సు ఆదివారం రాత్రి శంషాబాద్ నుంచి మిడ్జిల్‌కు వెళ్తుండగా మండల పరిధిలోని కొత్తపేట శివారులో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. కారును డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి బస్సును ఢీ కొట్టాడని, బస్సు వెనుక భాగం ధ్వంసం అయిందని బస్సు డ్రైవర్ అబ్ధుల్లా సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ నరహరి తెలిపారు. కారు ఢీకొని యువకుడికి గాయాలు కేశంపేట: బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధుతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన కొప్పు నందు ఆదివారం రాత్రి షాద్‌నగర్ నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా కేశంపేట శివారులో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు సోమవారం బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలి రంగారెడ్డి డీఈఓ సుశీందర్‌రావు మహేశ్వరం: విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్లు దోహదపడతాయని జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు అన్నారు. మండల పరిధిలోని తుమ్మలూరు సమీపంలో ఉన్న భాష్యం బ్లూమ్స్ స్కూల్లో సోమవారం జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సైన్స్ అంటే కేవలం పుస్తకాల్లో ఉన్న విషయాలు మాత్రమే కాదన్నారు. మన చుట్టూ జరిగే విషయాలను గమనించడం కూడా సైన్సేనని పేర్కొన్నారు. అంతకు ముందు జిల్లాలోని పలు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు వివిధ ప్రయోగాలు చేసి ప్రదర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి కస్నా నాయక్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రయోగం కొందుర్గు: మహేశ్వంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో కొందుర్గు ఉన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. పాఠశాలలో చదివే మణితేజ తయారు చేసిన ప్రయోగం రాష్ట్రస్థాయికి ఎంపికై నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపీనాథ్ తెలిపారు. ప్రాజెక్టు తయారీలో సైన్స్ టీచర్ రామకృష్ణ సహకరం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మణితేజను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
కేంద్ర నిధులతోనే గ్రామాభివృద్ధి
పరిగి: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప అన్నారు. సోమవారం ఆయన పట్టణ కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు. మురుగు కాల్వలశుభ్రం, వీధి దీపాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుత్నుఆయని చెప్పారు. ఉచిత రేషన్ బియ్యం కేంద్రమే అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంచందర్, రాము యాదవ్, పెంటయ్యగుప్తా, బాలకృష్ణారెడ్డి, శ్రీనివాస్, సురేశ్, నర్సింలు, రాంచందర్ పాల్గొన్నారు.ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఈశ్వరప్ప -
కన్హాలో ఏపీ సీఎం సందడి
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ, శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమ్లేష్ పటేల్‌తో కలిసి ఆశ్రమ పరిసరాలను పరిశీలించారు. శాంతివనంలోని పచ్చదనాన్ని, బాయోచార్, రెయిన్ ఫారెస్ట్, టిష్యూ కల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ రంగాలతో పాటు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు కన్హాకు వచ్చిన చంద్రబాబు సాయంత్రం 4గంటల వరకు ఉన్నారు. ఆశ్రమంలోని ప్రతీ అంశాన్ని ధ్యాన గురువు కమ్లేష్ పటేల్‌ను అడిగి తెలుసుకున్నారు. కన్హాలో పచ్చదనం బాగుందని, ఏపీలో సైతం కన్హా శాంతి వనాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది. కాగా చంద్రబాబు కన్హాను సందర్శించేందుకు వచ్చిన విషయం తెలిసిన మీడియా కన్హా ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. వ్యక్తిగత పర్యటన అని చెప్పారు. శాంతివనంలో పచ్చదనం బాగుందని కితాబు మీడియాకు అనుమతి ఇవ్వని నిర్వాహకులు వ్యక్తిగత కార్యక్రమమని వెల్లడి -
గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
● మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి ● నూతన సర్పంచ్‌లకు సన్మానం తాండూరు రూరల్: గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. పెద్దేముల్ మండలం మంబాపూర్ సర్పంచ్ భార్గవిశ్రీనివాస్, ఉప సర్పంచ్ మోహిజ్‌ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధన్‌రాజ్, జ్యోతి, శ్రీదేవి, స్వరూప, అశోక్, అనంతయ్య, నవీన్, సత్తార్మియా, లాజర్, ఎల్లప్ప, పుల్లప్ప పాల్గొన్నారు. గౌతాపూర్‌లో ఎమ్మెల్సీ సందడి.. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో మండలి చీఫ్ మహేందర్‌రెడ్డి సందడి చేశారు. గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ రాజప్పగౌడ్ ఇంట్లో నిర్వహించిన అయ్యప్ప పడిపూజకు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన రాంచెంద్రారెడ్డి ఇంటికి వెళ్లి నూతన సర్పంచు జెన్నె సుజనను సన్మానించి, కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు జెన్నె నాగప్ప, సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు తదితరులు ఉన్నారు. -
బీఆర్ఎస్తోనే ప్రజాసంక్షేమం
● మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ● పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం పరిగి: బీఆర్ఎస్ హయంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పాలేపల్లిలో సోమవారం సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జగన్మోహన్రెడ్డి కుమారుడు అజయ్‌కుమార్‌రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉప్పరి యశోదతిరుపతి, నాయకులు పురుషోత్తం, గంపురి, ఆంజనేయులు, మణికంఠ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. హామీల అమలులో విఫలం.. కుల్కచర్ల: బండవెల్కిచర్లలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి జ్యోతిలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కోప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకునేలా ప్రయత్నిస్తున్నారని, వీరి కుయుక్తులను నమ్మకుండా బీఆర్ఎస్ పార్టీ బలర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలన్నారు. -
రూ.10 కోట్ల మద్యం పంచేశారు!
● ‘ఫ్రెండ్లీ’గా వ్యవహరించిన పోలీసులు ● నామమాత్రపు తనిఖీలతోనే సరి ● నేతల ఒత్తిళ్లతో శంకర్పల్లి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు యథేచ్ఛగా మద్యం సరఫరా చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల్లో లక్షలాది రూపాయల సరుకు తీసుకెళ్తున్నా.. ఎక్కడికి, ఎందుకు వెళ్తుందోనని కూడా చూడటం లేదు. ఎవరైనా ఈవిషయాన్ని అడిగినా అదేం లేదు.. అని చెబుతుండటం గమనార్హం. కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే రూ.10 కోట్ల వరకు మద్యం సరఫరా చేసినట్లు తెలుస్తోంది. నిత్యం పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు తమ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నిత్యం మందు పార్టీలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేయకూడదని, ప్రలోభ పెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారాలను అడ్డుకోవాల్సిన ఆయా శాఖల అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అర్ధరాత్రి అనుకున్న చోటికి.. శంకర్పల్లి మండల పరిధిలో మొత్తం పది మద్యం దుకాణాలు ఉన్నాయి. అభ్యర్థులు తమకు అనువుగా ఉన్న షాపుల యజమానులతో మాట్లాడుకుని ఇక్కడి నుంచే మద్యం సరఫరా చేసుకున్నారు. ఈ సమయంలో అభ్యర్థి తరఫు వారు కాకుండా, షాపులకు సంబంధించిన వ్యక్తుల ద్వారా అర్ధరాత్రి వేళ అనుకున్న చోటికి తరలించారు. ఇవన్నీ గమనిస్తున్న పోలీసులు దుకాణదారులకు ఫ్రెండ్లీగా వ్యవహరించారన్నది బహిరంగ రహస్యం. తనిఖీలు, కేసులు అంతంతే.. మండలంలో రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ అవి తూతూమంత్రంగానే పని చేశాయి. పలు గ్రామాల్లో మద్యం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినప్పటికీ.. పోలీసులు తమకేంటి అన్న విధంగా వ్యవహారించారని అభ్యర్థుల మద్దతుదారులు వాపోయారు. మరికొన్ని గ్రామాల్లో భారీ ఎత్తున మద్యం పట్టుబడితే, పరిచయం ఉన్న నాయకులు ఫోన్లు చేయడంతో కొంత మేర పట్టుకున్న కేసులు నమోదు చేసి మమ అనిపించారు. -
ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి
ఆమనగల్లు: ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ కోరారు. మాడ్గుల మండలం కొల్కులపల్లిలో సోమవారం సర్పంచ్ అభ్యర్థి బట్టు ధర్మారెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్‌పార్టీ అమలు సాధ్యం కాని అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కేవలం మాయమాటలు చెబుతూ ప్రజలను వంచిస్తున్న పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఆమనగల్లు సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ -
రచ్చకెక్కిన ‘పంచాయితీ’
● వ్యతిరేకంగా పనిచేశావంటూ ఫ్లెక్సీ చించివేత ● పరిస్థితిని చక్కదిద్దిన స్పీకర్ ప్రసాద్కుమార్అనంతగిరి: వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఫ్లెక్సీ రగడ చోటు చేసుకుంది. పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా పనిచేస్తున్నావంటూ ఆరోపిస్తూ.. ఓ నేత అక్కడి ఫ్లెక్సీలో ఉన్న మరో నాయకుడి చిత్రాన్ని తొలగించగా.. ఎందుకు అలా చేశావంటూ సదరు నేత ప్రశ్నించాడు. పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా పనిచేస్తున్నావంటూ ఒకరినొకరు ప్రశ్నించుకోగా.. ఇరు వర్గాల గులాబీ శ్రేణులుకల్పించుకొని మరింత ఆజ్యం పోశారు. పరిస్థితి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ దృష్టికి వెళ్లగా.. ఇరువురితో మాట్లాడి సయోధ్య కుదిర్చి, పరిస్థితిని చక్కదిద్దారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్పీకర్‌ను కలిసేందుకు వచ్చి.. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. మదన్‌పల్లి సర్పంచ్‌గా రాజశేఖర్‌రెడ్డి తల్లి విజయలక్ష్మి విజయం సాధించగా.. వారంతా సోమవారం కార్యాలయంలో స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లారు. కాగా.. అక్కడ ఉన్న పలు ఫ్లెక్సీల్లో సుధాకర్‌రెడ్డి చిత్రంఉండగా.. గమనించిన పలువురు మా అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశావంటూ ఆగ్రహిస్తూ.. ఆయన చిత్రాన్ని తొలగించారు. దీంతో గందరగోళం నెలకొంది. కొద్దిసేపటికీ స్పీకర్ అక్కడికి చేరుకున్నారు. నూతన పాలకవర్గ సభ్యులు ఆయనను కలుస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లెక్సీల్లో తన బొమ్మను తొలగించారనే విషయం సుధాకర్‌రెడ్డికి, ఆయన అనుచరులకు తెలియగా.. వారు అక్కడికి చేరుకున్నారు. ఎందుకిలా చేశావంటూ రాజశేఖర్‌రెడ్డిని ప్రశ్నించారు. పార్టీలో ఉంటూ ఇలా వ్యతిరేకంగా పనిచేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. దీంతో ఇరువురి వాగ్వివాదం చేసుకోగా.. స్పీకర్ కల్పించుకుని వారిద్దరితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. -
అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
ఆమనగల్లు: అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల మండలం కొల్కులపల్లి, నర్సాయిపల్లి, మాడ్గుల, రామ్దుగ్యాల గ్రామాలలో సోమవారం కాంగ్రెస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థులకు ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రచారం నిర్వహించారు. కొల్కులపల్లిలో అభ్యర్థి బట్టు అనురాధతో కలిసి భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. గ్రామాల అభివృద్ధి, సామాజిక న్యాయం, నిరుపేదల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ బట్టు కిషన్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి, నాయకులు కొండల్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, యాదయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
పరిగి: నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వాసుచంద్ర అన్నారు. ఇటీవల లక్ష్మీదేవిపల్లి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు ఇద్దరు కార్మికులు మృతి చెందారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశాల మేరకు సోమవారం విచారణ కమిటీ అధికారులు ఫ్యాక్టరీని సందర్శించారు. ఫ్యాక్టరీ నిర్వహణ, సేఫ్టీ కిట్స్ వినియోగం, నిబంధనలు సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. అనంతరం డీఆర్డీఓ పీడీ మాట్లాడుతూ.. విచారణ కమిటీలో పోలీసు, వైద్యశాఖ, కార్మిక శాఖ, కాలుష్య నివారణ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. విచారణ వివరాలతో కలెక్టర్‌కు నివేదికను అందిస్తామన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఫ్యాక్టరీపై చర్యలుంటాయని చెప్పారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వాసుచంద్ర


