కావేరీ సీడ్స్ లైసెన్స్ తాత్కాలిక రద్దు
అమరావతి: కావేరీ సీడ్స్ లైసెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. కావేరీ సీడ్స్‌కు చెందిన ‘జాదూ’ పత్తి విత్తనాల నాణ్యత సరిగ్గా లేదని గుంటూరు జిల్లా చిలకలూరిపేట, అచ్చంపేట మండలాల రైతులలు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన వ్యవసాయశాఖ అధికారులు నివేదిక తయారుచేశారు. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని కావేరీ సీడ్స్ లెసైన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు రద్దు ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపింది.