
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ.. తక్షణమే భూసేకరణ ఆపేయాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది.
వికారాబాద్ జిల్లా దుండిగల్ మండలం హకీంపేట పరిధిలో 8 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా.. బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారంటూ బాధితులు న్యాయ పోరాటానికి దిగారు. హకీంపేటకు చెందిన శివకుమార్ బాధితుల తరఫున పిటిషన్ వేయగా.. అడ్వొకేట్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం.. భూసేకరణపై స్టే విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం.

Comments
Please login to add a commentAdd a comment