సాక్షి, హైదరాబాద్: జీఎంఆర్‌కు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు విద్యుత్ పంపిణీ లెసైన్సు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ మేరకు ఈఆర్‌సీ చైర్మన్ భాస్కర్, సభ్యులు రాజగోపాల్‌రెడ్డి, అశోకాచారిలు శనివారం ఆదేశాలు జారీ చేశారు. విమానాశ్రయంలోని సెజ్ ప్రాంతానికి ప్రైవేటుగా విద్యుత్‌ను పంపిణీ చేసుకుంటామని, ఇందుకోసం లెసైన్సు ఇవ్వాలని ఈఆర్‌సీని జీఎంఆర్ కోరింది. అయితే ప్రైవేట్ విద్యుత్ పంపిణీ లెసైన్సు ఇవ్వాలంటే విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 14లో కొన్ని నిబంధనలున్నాయని.. ఈ నిబంధనలకు అనుగుణంగా జీఎంఆర్ సంస్థ లేదని డిస్కంలు వాదించాయి. ఈ వాదనతో ఈఆర్‌సీ ఏకీభవించింది. సెక్షన్ 14 ప్రకారం ఏ కంపెనీకైనా విద్యుత్ పంపిణీ లెసైన్స్ ఇవ్వాలంటే.. విద్యుత్ పంపిణీ చేసే ప్రాంత కనీస పరిధి మునిసిపల్ కార్పొరేషన్ లేదా మునిసిపాలిటీ లేదా రెవెన్యూ జిల్లా (ఆపరేషన్ సర్కిల్) అయి ఉండాలి. అలాగైతేనే విద్యుత్ పంపిణీ లెసైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం ఒక ప్రాంతానికి లేదా ఒక కంపెనీకి ఇవ్వకూడదని ఈ సెక్షన్‌లో స్పష్టంగా ఉంది. ఇందుకు పూర్తి భిన్నంగా కేవలం ఎయిర్‌పోర్టు ప్రాంతానికి మాత్రమే విద్యుత్ పంపిణీ లెసైన్సు ఇవ్వాలని జీఎంఆర్ కోరింది.
జీఎంఆర్‌కు ఈఆర్‌సీ షాక్!
Published Sun, May 18 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM
Advertisement
Advertisement