![20 NBFCs Surrender Registration to RBI](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/nbfc-.jpg.webp?itok=vjhKN0R7)
రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, ఐడీఎఫ్‌సీ లిమిటెడ్ తమ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌లను వెనక్కిచ్చేశాయి. ఇలా మొత్తం 20 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (సీవోఆర్)లను స్వాధీనం చేసినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఇందులో మనోవే ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎన్‌బీఎఫ్‌సీ వ్యాపారం నుంచి తప్పుకున్నాయి.
ఐడీఎఫ్‌సీ లిమిటెడ్, ఐడీఎఫ్‌సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ తదితర 16 సంస్థలు విలీనాల కారణంగా సీవోఆర్‌ను స్వాధీనం చేశాయి. వీటికి అదనంగా ఆర్‌బీఐ తనంతటగా 17 ఎన్‌బీఎఫ్‌సీల సీవోఆర్‌లను రద్దు చేసింది. వీటి రిజిస్టర్డ్ కార్యాలయం పశ్చిమబెంగాల్‌లో ఉన్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. మరోవైపు కామధేను ఫైనాన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ లైసెన్స్‌ను పునరుద్ధరించినట్టు ప్రకటించింది.
ఎన్‌బీఎఫ్‌సీ అంటే..
నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) అనేది కంపెనీల చట్టం, 1956 కింద నమోదైన ఒక కంపెనీ. ఇది రుణాలు ఇవ్వడం, ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు జారీ చేసిన షేర్లు, స్టాక్‌లు, బాండ్లు, డిబెంచర్లు, సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, బీమా వ్యాపారం, చిట్ వ్యాపారం వంటి కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటుంది.
ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులకు తేడా
ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలు ఇస్తాయి. పెట్టుబడులు పెడతాయి. కాబట్టి వాటి కార్యకలాపాలు బ్యాంకుల కార్యకలాపాలను పోలి ఉంటాయి. అయితే వీటి మధ్య ప్రధానంగా కొన్ని తేడాలు ఉన్నాయి. ఎన్‌బీఎఫ్‌సీ డిమాండ్ డిపాజిట్లను అంగీకరించదు. ఎన్‌బీఎఫ్‌సీలు చెల్లింపు, సెటిల్‌మెంట్ వ్యవస్థలో భాగం కావు. తమపైనే చెక్కులను జారీ చేయలేవు. బ్యాంకుల మాదిరిగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఎన్‌బీఎఫ్‌సీల డిపాజిటర్లకు అందుబాటులో లేదు.
Comments
Please login to add a commentAdd a comment