నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంది. రుణాల మంజూరు, పంపిణీని నిలిపివేయాలని ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్, ఆరోహణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, డీఎంఐ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవీ ఫిన్‌సర్వ్ లిమిటెడ్‌లకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది . అక్టోబరు 21న వ్యాపార కార్యకలాపాలు ముగిసిన అనంతరం నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొంది.
ఈ కంపెనీల వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్ (WALR), వాటి నిధుల వ్యయంపై విధించే వడ్డీ స్ప్రెడ్ పరంగా ఈ కంపెనీల ప్రైసింగ్ పాలసీలో గమనించిన మెటీరియల్ సూపర్‌వైజరీ లోపాల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇవి ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే.. ఆర్బీఐ రూల్స్ తెలుసా?
అయితే ఆయా కంపెనీలు తమ కస్టమర్లకు ఇతర సేవలను, రుణాల వసూలు, రికవరీ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థిక రంగంలో స్థిరత్వం కోసం, సంస్థలన్నీ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూసేందుకు ఆర్బీఐ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై చర్యలు చేపడుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment