'ఇక్కడి' లైసెన్స్ తో 'అక్కడ' హాయిగా తిరగొచ్చు! | 14 Countries That Will Let You Drive On An Indian Driver’s Licence | Sakshi
Sakshi News home page

'ఇక్కడి' లైసెన్స్ తో 'అక్కడ' హాయిగా తిరగొచ్చు!

Published Thu, May 19 2016 10:46 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

'ఇక్కడి' లైసెన్స్ తో 'అక్కడ' హాయిగా తిరగొచ్చు! - Sakshi

'ఇక్కడి' లైసెన్స్ తో 'అక్కడ' హాయిగా తిరగొచ్చు!

భారత్ లో డ్రైవింగ్ లైసెన్సు పొంది ఇతర దేశాలకు వెళ్ళే వారు అక్కడ వాహనాలు నడిపేందుకు తమ లైసెన్సు పని చేస్తుందా లేదా అన్నవిషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే డ్రైవింగ్ లైసెన్స్  ఒక్కో దేశంలో ఒక్కో నిబంధనలు కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్  లైసెన్స్ తో ప్రపంచంలో ఏఏ దేశాల్లో తిరిగేందుకు అనుమతులు ఉన్నాయో ఓసారి చూద్దాం.

వాహనం నడిపేవారి వద్ద తప్పనిసరిగా రవాణా సంస్థ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్న నిబంధన సుమారు అన్ని దేశాల్లోనూ ఉంటుంది. అయితే అది ఇతర దేశాల లైసెన్సు అయినప్పుడు అక్కడ పనికి వస్తుందా లేదా అన్నది గమనించాలి. ముఖ్యంగా ఇండియాలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్సుతో ప్రపంచంలోని 14 దేశాల్లో డ్రైవింగ్ చేసేందుకు అనుమతులు ఉన్నాయి. రవాణా విభాగం అందించిన లైసెన్సు నియమావళిని బట్టి భారత్ లో అందించిన డ్రైవింగ్ లైసెన్స్ తో యూరప్ దేశాల్లో భాగమైన ఫిన్ ల్యాండ్ తోపాటు, మరో అందమైన దేశం,  ప్రముఖ పర్యాటక దేశంగా పేరొందిన నార్వే, స్పెయిన్ లోనూ కూడ భారత్ డ్రైవింగ్ లైసెన్స్ తో డ్రైవింగ్ చేయొచ్చు. అమెరికా భూభాగానికి ఉత్తర భాగంలో ఉన్న కెనడా దేశంలో కూడ భారత ప్రభుత్వం జారీ చేసిన వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించవచ్చు. అక్కడ భారత్ లోని నియమావళికి సరిపోయేట్టుగానే డ్రైవింగ్ నిబంధనలు ఉంటాయి. అతిపెద్ద నయాగరా జలపాతంతో పర్యాటకులను ఆకట్టుకునే కెనడాకు  ఒట్టావా రాజధాని. అలాగే మధ్యధరా సముద్రానికి ఉత్తర భాగాన ఉన్న ఇటలీలో కూడ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ తో హాయిగా వాహనాలు నడిపేందుకు అనుమతులు ఉన్నాయి. పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన మరో దేశం మారిషస్ లోనూ భారత డ్రైవింగ్ లైసెన్స్ ను వినియోగిచవచ్చు. అయితే సౌత్ ఆఫ్రికాలో మాత్రం భారత్ లో పొందిన లైసెన్స్ ప్రాంతీయ భాషలో లేకుండా ఇంగ్లీషులో  ఉన్నట్లయితే ఎటువంటి అభ్యంతరాలు ఉండవు.   

అడ్వెంచర్లకు ప్రసిద్ధి చెందిన న్యూజిల్యాండ్ లో మాత్రం అక్కడి రవాణా అధికారులు సూచించిన వాహనాలను మాత్రమే భారత్ లైసెన్స్ తో నడిపే అవకాశం ఉండగా... అస్ట్రేలియాలో భారత ప్రభుత్వం జారీ చేసిన అంతర్జాతీయ పర్మిట్ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ అయితే అక్కడి వాహనాలు నడిపేందుకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ప్రకృతి రమణీయ ప్రదేశాలకు నిలయమైన స్విట్జర్లాండ్ లోనూ భారత్ లైసెన్స్ తో కార్లు నడిపేయచ్చు. అయితే కొన్ని దేశాల్లో భారత్ డ్రైవింగ్ లైసెన్స్ ను వారి వారి భాషల్లోకి మార్పిడి చేయించిన అనంతరం వినియోగించే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా ఫ్రాన్స్ లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ను ఫ్రాన్స్ భాషలోకి మార్చుకోవాలి. అమెరికాలో అయితే ఏడాది పాటు భారత్ లైసెన్స్ కు ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా అనంతరం దీనితోపాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉన్న లైసెన్స్ ను అక్కడి భాషలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ లోనూ, యుకే లోనూ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్  ఏడాది పాటు పనికొస్తే... జర్మనీలో ఆరు నెలల పాటు మాత్రేమే వినియోగించవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement