let
-
హ్యాండ్ గ్రెనేడ్లు పేల్చేశారు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో గతేడాది దసరా ఉత్సవాల నేపథ్యంలో విధ్వంసాలకు కుట్ర పన్ని చిక్కిన లష్కరేతొయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాదుల నుంచి స్వాదీనం చేసుకున్న హ్యాండ్ గ్రెనేడ్లను పోలీసులు పేల్చేశారు. వీటిని భద్రపరచడం ముప్పుతో కూడిన వ్యవహారం, నిర్విర్యం చేయడం సాధ్యం కాకపోవడంతో సీసీఎస్ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ కేసు ఎన్ఐఏ బదిలీ కావడంతో ఈ మేరకు ఆ అధికారులకు సమగ్ర నివేదికను అందించింది. చైనా గ్రెనేడ్లు మనోహరాబాద్ మీదుగా... గత ఏడాది అక్టోబర్ 2న అరెస్టయిన ఉగ్రత్రయం అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్‌లు పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న హ్యాండ్లర్స్ ఫర్హతుల్లా ఘోరీ, సిద్ధిఖ్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మాజిద్ ఆదేశాల మేరకు పని చేశారు. దసరా రోజు నగరంలో విధ్వంసాలు సృష్టించేందుకు సిద్ధమైన వీరికి చైనాలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లను వారు పంపారు. డ్రోన్లద్వారా కశ్మీర్‌కు వచ్చిన వాటిని అక్కడ నుంచి మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ వరకు చేర్చిన స్లీపర్‌సెల్స్ ఓ రహస్య ప్రదేశంలో దాచాయి. అక్కడకు వెళ్లిన సమీయుద్దీన్ నాలుగు గ్రెనేడ్స్‌ను తీసుకువచ్చాడు. రెక్కీలు చేస్తుండగానే సిట్ అధికారులకు చిక్కారు. ఈ కేసుల్లో సీజర్ కీలకాంశం... ఈ తరహా ఉగ్రవాద సంబంధ కేసుల్లో నిందితుల నుంచి స్వాదీనం చేసుకున్న సీజర్ ప్రాపర్టీ నేరం నిరూపణలో కీలక ఆధారంగా మారుతుంది. దీంతోనే కోర్టులో నిందితులను దోషిగా నిరూపించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఉగ్రత్రయం నుంచి స్వాదీనం చేసుకున్న గ్రెనేడ్స్‌ను తొలుత కోర్టులో దాఖలు చేశారు. ఆ పై న్యాయస్థానం ఆదేశాల మేరకు తమ ఆ«దీనంలోనే భద్రపరిచారు. ఇవి ప్రమాదకరం కావడంతో తొలు త వీటిని నిర్వీర్యం చేసేందుకే పోలీసులు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే చైనాలో తయారైనవి కావడంతో ఆ ప్రయత్నం చేస్తే పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీంతో వీటిని పేల్చేయడమే మేలని భావించి, న్యాయస్థానం అనుమతి అనుమతి పొందారు. ఇటీవల బాంబు నిర్విర్యం బృందాల సమక్షంలో ఈ తంతు పూర్తి చేశారు. -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 15 కిలోల ఐఈడీ స్వాధీనం
శ్రీనగర్: నూతన సంవత్సర వేడుకల వేళ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. జమ్ముకశ్మీర్‌లోని ఉధంపుర్ జిల్లాలో సోమవారం భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బసంత్‌గఢ్ ప్రాంతంలో సిలిండర్ లాంటి బాక్సులో సుమారు 15 కిలోల ఐఈడీని అమర్చినట్లు గుర్తించామన్నారు. దాంతో పాటు సంఘటనా స్థలం నుంచి 300-400 గ్రాముల ఆర్డీఎక్స్, 7.62ఎంఎం కార్ట్రిడ్జెస్, ఐదు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేలుడు పదార్థాలతో పాటు కోడ్ లాంగ్వేజ్‌లో ఉన్న ఓ పత్రం, నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు సంబంధించిన గుర్తులు లభించినట్లు జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ముకేశ్ సింగ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. బసంత్‌గఢ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: కరోనా ఫోర్త్ వేవ్ భయాలు.. అక్కడ మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు! -
ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీ కోసం నయీం చిత్రీకరణ
సాక్షి, సిటీబ్యూరో: పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్ఈటీ) ఆదేశాల మేరకు సిటీకి వచ్చాడు... మారుపేరుతో పాస్‌పోర్ట్ పొందడానికి ప్రయత్నించాడు...ఓ వీడియో కెమెరాతో నగరం మొత్తం తిరుగుతూ కీలక ప్రాంతాలను చిత్రీకరించాడు...ఆ సమయంలో ఓ అనుమానాస్పద బ్యాగ్‌ను కలిగి ఉన్నాడు...ఉగ్రవాది షేక్ అబ్దుల్ నయీం అలియాస్ సమీర్ అలియాస్ నయ్యూపై నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందంలో (సిట్) నమోదైన కేసు పూర్వాపరాలివి. ఇతడిని పీటీ వారెంట్‌పై గురువారం రాత్రి ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి తీసుకువచ్చిన సిట్ పోలీసులు శుక్రవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. షేక్ సోహైల్ పేరుతో పాస్‌పోర్ట్‌కు... మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన నయీం ఇంజినీర్ అయినప్పటికీ ఎల్ఈటీకి సానుభూతిపరుడిగా మారాడు. పాకిస్థాన్‌లో ఉన్న ఆ సంస్థకు చెందిన వారి నుంచివచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నాడు. అందులో భాగంగానే ఇతడు 2007 ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చాడు. అప్పటికి సిటీలోనే ఉన్న ఇతడి సన్నిహితుడు షోయబ్ జాగీర్దార్ ఇతడిని రిసీవ్ చేసుకున్నాడు. హష్మత్పేటలోని తన బంధువు ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. స్టార్ లైన్ ట్రావెల్ ఏజెన్సీకి చెందిన ట్రావెల్ ఏజెంట్ నగేష్ సహకారంతో సికింద్రాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి దొంగ పాస్‌పోర్ట్ పొందడానికి ప్రయత్నించాడు. షేక్ సోహైల్ పేరుతో రూపొందించిన పత్రాలపై సికింద్రాబాద్ వచ్చిన సమీర్ సంతకాలు చేశాడు. అక్కడ నుంచి తిరిగి హష్మత్పేటలోని ఇంటికి వెళ్ళకుండా నగరంలోని కీలక ప్రాంతాలను చుట్టి వచ్చాడు. ఆ సమయంలో తనతో పాటు ఓ వీడియో కెమెరా తీసుకువెళ్లిన నయీం అనేక కీలక ప్రాంతాలను చిత్రీకరించాడు. ఓ అనుమానాస్పద బ్యాగ్‌ను తన వెంటే ఉంచుకున్నాడు. ఎల్ఈటీకి అందించడానికే సిటీలోని కీలక ప్రాంతాలు వీడియో తీశాడని, ‘ఆ బ్యాగ్’లో పేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులు ఆరోపించారు. కొన్నాళ్ల తర్వాత వెలుగులోకి... ‘సిటీ టూర్’ ముగించుకున్న నయీం మళ్ళీ తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. కొన్ని రోజులకు మళ్లీ ఎల్ఈటీ నుంచి ఇతడికి మరో సమాచారం అందింది. దాని ప్రకారం ఇతగాడు బంగ్లాదేశ్ వెళ్లి కొందరిని కలవాలి. అక్కడ నుంచి ముగ్గురు సుశిక్షుతులైన ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించి జమ్మూ కాశ్మీర్‌కు చేర్చాలి. కొన్ని నెలల పాటు పాక్‌లో శిక్షణ పొందిన ఈ ఉగ్రవాదుల్లో అక్కడి కరాచీ, హరిపూర్లకు చెందిన మహ్మద్ యూనస్, అబ్దుల్లాలతో పాటు కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన ముజఫర్ అహ్మద్ రాథోడ్ ఉన్నారు. కాశ్మీర్లో భారీ ఆపరేషన్‌కు ప్లాన్ చేసిన ఎల్ఈటీ దాని కోసమే వారిని పంపింది. 2007 ఏప్రిల్ 4న పశ్చిమ బెంగాల్లో ఉన్న 24 పరగణాల జిల్లాలోని పెట్రాపోల్ నుంచి ఈ నలుగురూ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. దీన్ని గమనించిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పట్టుకోవడంతో వీరిపై బన్గావ్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఎంతకీ నోరు విప్పని ఈ ఉగ్రవాదులకు పోలీసులు పాలిగ్రఫీ, నార్కో అనాలసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి నిజ నిర్థారణ పరీక్షలు చేసింది. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ కుట్రతో పాటు ‘సిటీ టూర్’ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సిట్ కుట్ర కేసు నమోదు చేసింది. అప్పట్లోనే సిటీకి తీసుకువచ్చి విచారించడంతో పాటు అభియోగపత్రాలు దాఖలు చేసింది. ఆ ముగ్గురికీ ఉరి శిక్ష విధింపు... పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారులు ఈ నలుగురిపై 2007 జూన్ 29న బన్గావ్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ కేసుల విచారణ జరుగుతుండగానే కోల్‌కతా పోలీసులు 2014 సెప్టెంబర్ 24న సమీర్‌లో మరో కేసుకు సంబంధించి ముంబై కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి తిరిగి హౌరా–ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కోల్‌కతాకు తీసుకువెళ్తుండగా... ఖర్సియా–శక్తి రైల్వేస్టేషన్ల మ«ధ్య తప్పించుకుని పారిపోయాడు. దీంతో మిగిలిన ముగ్గురిపై విచారణ పూర్తి చేసిన బన్గావ్ కోర్టు గత ఏడాది జనవరిలో ఉరి శిక్ష విధించింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న నయీంను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు 2017 నవంబర్ 29న లక్నోలో పట్టుకున్నారు. ఆపై విచారణ నిమిత్తం నయీంను ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంచారు. నగరంలోని సిట్‌లో నమోదైన కుట్ర కేసులో ట్రయల్ నిర్వహించాల్సి ఉండటంతో సిట్ నయీంను సిటీకి తీసుకువచ్చింది. -
సిటీకి ఉగ్రవాది సమీర్
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన (ఎల్ఈటీ) ఉగ్రవాది షేక్ అబ్దుల్ నయీం అలియాస్ సమీర్ అలియాస్ నయ్యూను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు సిటీకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న ఇతడిపై నాంపల్లి కోర్టు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ జారీ చేసింది. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోవడంలో దిట్టగా సమీర్‌కు పేరుంది. సాక్షి, సిటీబ్యూరో: పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబాకు చెందిన (ఎల్ఈటీ) ఉగ్రవాది షేక్ అబ్దుల్ నయీం అలియాస్ సమీర్ అలియాస్ నయ్యూను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు సిటీకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న సమీర్‌పై నాంపల్లి కోర్టు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ జారీ చేసింది. దీంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోవడంలో దిట్టగా పేరున్న సమీర్ 2007లో ఉత్తర మండలంలోని మహంకాళి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆపై 2014లో కోల్‌కతా పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇతడిని తీసుకురావడానికి పటిష్టమైన ఎస్కార్ట్‌ను ఢిల్లీ పంపినట్లు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఇతడిని 2007 ఏప్రిల్‌లో బంగ్లాదేశ్ సరిహద్దులు దాటుతుండగా బీఎస్ఎఫ్ అధికారులు వెస్ట్ బెంగాల్లో పట్టుకున్నారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు సమీర్ మరో అయిదుగురితో కలిసి ఆపరేషన్ ‘మాద్రా’ కోసం వస్తున్నట్లు గుర్తించారు. అదే ఏడాది మే 18న నగరంలోని మక్కా మసీదులో చోటు చేసుకున్న పేలుడు కేసులోనూ అనుమానితుడిగా మారాడు. దీంతో ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు విభాగం పీటీ వారెంట్‌పై 2007 జూన్ 6న ఇక్కడికి తీసుకువచ్చింది. విచారణ నేపథ్యంలోనే గతంలో కొన్నాళ్ల పాటు నగరంలో ఉన్న సమీర్ తన సహచరులు షోయబ్ జాగిర్దార్, ఇమ్రాన్, రఫీయుద్దీన్లతో కలిసి తప్పుడు పత్రాలతో పాస్‌పోర్ట్ పొందడానికి ప్రయత్నించినట్లు వెలుగులోకి రావడంతో మరో కేసు నమోదు చేశారు. తదుపరి విచారణలో నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో సిట్‌లో మరో కేసు (ఎఫ్ఐఆర్ నెం.100/2007) నమోదు చేసిన పోలీసులు కస్టడీలో ఉన్న సమీర్‌ను మహంకాళి ఠాణాలో ఉంచి విచారించారు. ఈ నేపథ్యంలోనే అతను 2007 జూన్ 18న అదును చూసుకుని తప్పించుకుని, పారిపోవడానికి ప్రయత్నించిన ఇతగాడిని వెంటాడిన అధికారులు కాస్తా దూరంలోనే పట్టుకున్నారు. దీనిపై మహంకాళి ఠాణాలో కేసు నమోదైంది. 2013 జూన్‌లో ఈ ఎస్కేప్ కేసు, ఏప్రిల్‌లో పాస్‌పోర్ట్ కేసు కోర్టులో వీగిపోయాయి. సమీర్‌పై దేశ వ్యాప్తంగా అనేక కేసులు నమోదై ఉండటంతో అయా పోలీసులు పీటీ వారెంట్లపై తరలిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే కోల్‌కతా పోలీసులు 2014 సెప్టెంబర్ 24న ముంబై కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి తిరిగి హౌరా–ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కోల్‌కతాకు తీసుకువెళ్తుండగా... ఖర్సియా–శక్తి రైల్వేస్టేషన్ల మ«ధ్య తప్పించుకుని పారిపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నయ్యూను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు 2017 నవంబర్‌లో లక్నోలో పట్టుకున్నారు. ఆపై విచారణ నిమిత్తం సమీర్‌ను ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంచారు. నగరంలోని సిట్‌లో నమోదైన కేసులో ట్రయల్ నిర్వహించాల్సి ఉండటంతో అధికారులు నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ తీసుకున్నారు. దీని ఆధారంగా సమీర్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీ నుంచి గురువారం రాత్రి సిటీకి తరలించారు. శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. ఆపై తదుపరి విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. -
‘పాక్‌లో ఉగ్రవాద తండాలను నిర్మూలించాలి’
ఐక్యరాజ్య సమితి : పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలను సమూలంగా నాశనం చేస్తేనే.. సరిహద్దుల్లో శాంతి ఏర్పడుతుందని భారత్ ఐక్యరాజ్యసమితిలో మరోసారి స్పష్టం చేసింది. ఉపఖండంలోని తాజా ఉగ్రవాద పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు భారత శాశ్వత ప్రతినిధి తన్మయలాల్ వివరించారు. ఆఫ్ఘనిస్తాన్, భారత్‌లోని ఉగ్రవాద చర్యలకు పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలే కారణమని ఆయన వివరించారు. తాలిబన్, హక్కానీ నెట్వర్క్, ఇస్లామిక్ స్టేట్, ఆల్ ఖైదా, వాటి అనుబంధ సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ల తండాలు పాకిస్తాన్లో విచ్ఛలవిడిగా ఉన్నాయని ఆయన వివరించారు. వీటికి చరమగీతం పాడితేనే ఉపఖండంలో శాంతి నెలకొంటుందని ఆయన ఐక్యరాజ్యసమితికి తెలిపారు. ఆఫ్గనిస్తాన్ సరిహద్దులోని ఉగ్రవాద తాండాలను నిర్మూలించాలని ఆయన సమితికి తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి పెంపొందితేనే.. ఉపఖండంలో పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తాయని ఆయన తెలిపారు. -
లష్కరే ఉగ్రవాదులే దాడి చేసింది
న్యూఢిల్లీ: దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన అమర్నాథ్ యాత్రికులపై దాడిని ఎవరు చేశారనే విషయాన్ని జమ్మూకశ్మీర్ భద్రతా బలగాలు వెల్లడించారు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. ఈ దాడి వ్యూహం పన్నిని కీలక సూత్రదారుడు అబూ ఇస్మాయిల్ అనే పాకిస్థాన్ ఉగ్రవాది అని కశ్మీర్ ప్రధాన పోలీసు అధికారి మునీర్‌ఖాన్ వార్తా సంస్థకు వెల్లడించారు. ఇస్మాయిల్‌తో సహా మరో ముగ్గురు ఈ దాడులకు పాల్పడినట్లు వివరించారు. ఈ సందర్భంగా అతడి ఫొటోను మీడియాకు విడుదల చేశారు. సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. మరో 32 మంది గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం స్థానిక పోలీసులు. సైనికులు సంయుక్తంగా గాలింపులు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో నేడు జమ్మూకశ్మీర్ అంతటా విశ్వహిందూ పరిషత్‌కు చెందిన కార్యకర్తలు, జమ్ముకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చాయి. మరోపక్క, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ లేఖలో పేర్కొన్నారు. -
పట్టుబడ్డ 44 మంది లష్కరే ముష్కరులేనా?
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా పట్టణంలో ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా మొదటిసారి పెద్ద ఎత్తున కార్డెన్ సెర్చ్ నిర్వహించింది. గంటలపాటు సాగిన ఈ దాడుల్లో పలు ఇండ్ల నుంచి పెద్ద ఎత్తున పెట్రోల్ బాంబులు, పాకిస్థాన్, చైనా జాతీయ జెండాలు లభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు 44 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. కాగా, ప్రస్తుతం ఆ యువకులను విచారిస్తోన్న బారాముల్లా పోలీసులకు పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా హెచ్చరికలు జారీచేసింది. ప్రతీకారం తప్పదని ఉగ్రవాదులు బెదిరించే ప్రయత్నం చేసినట్లు బారాముల్లా పోలీసులు మీడియాకు తెలిపారు. బారాముల్లా చరిత్రలోనే మొదటిసారిగా సోమవారం రాత్రి భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఖ్వాజీ హమన, గనాయి హమన్, తవీద్ గంజ్, జామియా సహా 10 కీలకమైన ప్రాంతాల్లో ప్రతి ఇంటినీ జల్లెడపట్టాయి. దాదాపు 700 ఇళ్లల్లో సోదాలు చేశామని, పెట్రోల్ బాంబులు, పాక్, చైనా జెండాలు స్వాధీనం చేసుకున్నామని, 44 మందిని అదుపులోకి తీసుకున్నామని రక్షణ శాఖ అధికార ప్రతినిధి మనీశ్ కుమార్ చెప్పారు. పెల్లెట్ దెబ్బలు తిన్న ఆందోళనకారులను కూడా పరామర్శించినట్లు చెప్పారు. లష్కరే హెచ్చరికల నేపథ్యంలో 44 మంది యువకులను విచారిస్తున్న ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ యువకులు నిజంగా ఉగ్రవాదులేనా? లేక సాధారణ పౌరులా అన్నది తెలియాల్సిఉంది. -
అబూ జుందాల్‌కు జీవితఖైదు
ముంబై: సుదీర్ఘ విచారణ తర్వాత ఔరంగాబాద్ ఆయుధాల అక్రమ రవాణా కేసులో ఉగ్రవాది సయ్యద్ జుబేదిన్ అన్సారీ అలియాస్ అబూ జుందాల్ కు జీవితఖైదు పడింది. గత వారమే జుందాల్, అతని గ్యాంగ్ ను దోషులుగా నిర్ధారించిన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (మోకా) కోర్టు మంగళవారం శిక్షలు ఖరారుచేసింది. అబూ జిందాల్ కాకుండా మరో ఆరుగురు దోషులకు జీవితఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కాగా, జుందాల్ పై 26/11 ముంబై దాడుల కేసు విచారణలో ఉంది. ఔరంగాబాద్ ఆయుధాల అక్రమరవాణా కేసులో మొత్తం 12 మంది దోషులుగా తేలారు. వారిలో అబూ జిందాల్ సహా మరో ఏడుగురికి జీవిత ఖైదు పడింది. ఇద్దరికి 14 ఏళ్లు, ముగ్గురికి 8 ఏళ్లు జైలు శిక్షలు పడ్డాయి. మోదీ హత్యకు కుట్ర 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని, విశ్వహిందూ పరిషత్ కీలక నేత ప్రవీణ్ తొగాడియానూ హత్య చేసేందుకు అబూ జుందాల్ అండ్ గ్యాంగ్ కుట్రపన్నారని పోలీసులు సాక్ష్యాధారాలతో నిరూపించడంతో శిక్షలు పడ్డాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన జుందాల్.. మాలేగావ్ కేంద్రంగా మోదీపై కుట్రలు పన్నాడు. ప్లానింగ్ లో భాగంగా 2006, మే 8న.. 30 కేజీల ఆర్డీఎక్స్, 10 ఏకే 47 తుపాకులు, 3,200 బులెట్లతో కారులో బయలుదేరిన జుందాల్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆయుధాలు పట్టుబడినప్పటికీ అబూ జుందాల్ మాత్రం తప్పించుకున్నాడు. ముంబై దాడుల్లో హస్తం బంగ్లాదేశ్ కు పారిపోయిన అబూ అక్కణ్నుంచి సౌదీకి, సౌదీ నుంచి పాకస్థాన్ కు వెళ్లాడు. 2008 నవంబర్ 26న లష్కరే తాయిబా ఉగ్రవాదులు బై మారణహోం సృష్టించిన సమయంలో అబూ పాకిస్థాన్ లోనే ఉన్నాడు. ముంబై దాడుల సూత్రధారి, లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కు అబూ అన్నిరకాలుగా సాయపడ్డాడని దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి. 2012లో అనూహ్యంగా సౌదీ అరేబియాలో పోలీసులకు పట్టుబడ్డ అబూ జిందాల్ ను నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా భారత్ కు తీసుకొచ్చారు. -
భారత్ లో విధ్వంసానికి ఐఎస్, ఎల్ఈటీ కుట్రలు
న్యూఢిల్లీ: భీకర ఉగ్రదాడులతో ప్రపంచానికి సవాల్ విసురుతున్న ఐఎస్ఐఎస్ కన్ను భారత్ పై ఇదివరకే ఉంది. మన ఇంటెలిజెన్స్ బృందాలు ఎక్కడికక్కడ ఐఎస్ ను నిర్వీర్యం చేయడంతో తోకముడిచింది. అయితే ఇప్పుడు మరో గుంటనక్క సాయంతో ఐఎస్ భారత్ లో విధ్వంసం సృష్టించాలనుకుంటోంది. తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రాలకు జారీచేసిన హెచ్చరికల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సిరియా, ఇరాక్ లలో ప్రాబల్యం ఉన్న ఐఎస్.. వివిధ దేశాల్లోని స్థానిక ఉగ్రమూకలతో సంబంధాలు పెట్టుకునే దిశగా ఎప్పటినుంచో పథకాలు రచిస్తోంది. ఆ క్రమంలోనే పాకిస్థాన్ కు చెందిన లష్కరే తాయిబా సంస్థతో టైఅప్ అయింది. 1990ల నుంచి భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోన్న లష్కరే సాయంతో మరిన్ని దాడులు జరపాలని ఐఎస్ భావిస్తున్నట్లు ఐబీ వర్గాలు పేర్కొన్నాయి. ఐఎస్ పథకం రూపొందస్తే, లష్కరే దానిని అమలు చేస్తుందని, వారికి ఆ అవకాశం కల్పించకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను ఐబీ హెచ్చరించింది. (చదవండి: ‘ఐఎస్ ఒంటరి తోడేలు దాడి’కి అవకాశం) -
‘26/11’ సూత్రధారిపై మరిన్ని అభియోగాలు
పాక్ ఉగ్రవాద నిరోధక కోర్టు రూలింగ్ లాహోర్: ముంబై మారణహోమం (26/11) సూత్రధారి, లష్కరే తోయిబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్‌తోపాటు మరో ఆరుగురు నిందితులపై వ్యక్తిగతంగా 166 మంది హత్యలకు పురికొల్పిన అభియోగాలు నమోదు చేయనున్నట్లు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు శుక్రవారం రూలింగ్ ఇచ్చింది. ఈ విషయాన్ని కోర్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో నిందితుల క్రాస్ ఎగ్జామినేషన్‌కు కోర్టు అనుమతించలేదన్నారు. కేసును బలోపేతం చేసేందుకు వీలుగా నిందితులపై అభియోగాల నమోదును సవరించాలంటూ ప్రాసిక్యూషన్ రెండు నెలల కిందట కోర్టులో దరఖాస్తు చేసింది. అలాగే మృతుల పోస్టుమార్టం నివేదికలను భారత ప్రభుత్వం పంపేలా కోరాలని విజ్ఞప్తి చేసింది. కాగా, కేసు తదుపరి విచారణ ఈ నెల 25న జరగనుంది. -
'ఇక్కడి' లైసెన్స్ తో 'అక్కడ' హాయిగా తిరగొచ్చు!
భారత్ లో డ్రైవింగ్ లైసెన్సు పొంది ఇతర దేశాలకు వెళ్ళే వారు అక్కడ వాహనాలు నడిపేందుకు తమ లైసెన్సు పని చేస్తుందా లేదా అన్నవిషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఒక్కో దేశంలో ఒక్కో నిబంధనలు కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ తో ప్రపంచంలో ఏఏ దేశాల్లో తిరిగేందుకు అనుమతులు ఉన్నాయో ఓసారి చూద్దాం. వాహనం నడిపేవారి వద్ద తప్పనిసరిగా రవాణా సంస్థ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్న నిబంధన సుమారు అన్ని దేశాల్లోనూ ఉంటుంది. అయితే అది ఇతర దేశాల లైసెన్సు అయినప్పుడు అక్కడ పనికి వస్తుందా లేదా అన్నది గమనించాలి. ముఖ్యంగా ఇండియాలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్సుతో ప్రపంచంలోని 14 దేశాల్లో డ్రైవింగ్ చేసేందుకు అనుమతులు ఉన్నాయి. రవాణా విభాగం అందించిన లైసెన్సు నియమావళిని బట్టి భారత్ లో అందించిన డ్రైవింగ్ లైసెన్స్ తో యూరప్ దేశాల్లో భాగమైన ఫిన్ ల్యాండ్ తోపాటు, మరో అందమైన దేశం, ప్రముఖ పర్యాటక దేశంగా పేరొందిన నార్వే, స్పెయిన్ లోనూ కూడ భారత్ డ్రైవింగ్ లైసెన్స్ తో డ్రైవింగ్ చేయొచ్చు. అమెరికా భూభాగానికి ఉత్తర భాగంలో ఉన్న కెనడా దేశంలో కూడ భారత ప్రభుత్వం జారీ చేసిన వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించవచ్చు. అక్కడ భారత్ లోని నియమావళికి సరిపోయేట్టుగానే డ్రైవింగ్ నిబంధనలు ఉంటాయి. అతిపెద్ద నయాగరా జలపాతంతో పర్యాటకులను ఆకట్టుకునే కెనడాకు ఒట్టావా రాజధాని. అలాగే మధ్యధరా సముద్రానికి ఉత్తర భాగాన ఉన్న ఇటలీలో కూడ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ తో హాయిగా వాహనాలు నడిపేందుకు అనుమతులు ఉన్నాయి. పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన మరో దేశం మారిషస్ లోనూ భారత డ్రైవింగ్ లైసెన్స్ ను వినియోగిచవచ్చు. అయితే సౌత్ ఆఫ్రికాలో మాత్రం భారత్ లో పొందిన లైసెన్స్ ప్రాంతీయ భాషలో లేకుండా ఇంగ్లీషులో ఉన్నట్లయితే ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. అడ్వెంచర్లకు ప్రసిద్ధి చెందిన న్యూజిల్యాండ్ లో మాత్రం అక్కడి రవాణా అధికారులు సూచించిన వాహనాలను మాత్రమే భారత్ లైసెన్స్ తో నడిపే అవకాశం ఉండగా... అస్ట్రేలియాలో భారత ప్రభుత్వం జారీ చేసిన అంతర్జాతీయ పర్మిట్ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ అయితే అక్కడి వాహనాలు నడిపేందుకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ప్రకృతి రమణీయ ప్రదేశాలకు నిలయమైన స్విట్జర్లాండ్ లోనూ భారత్ లైసెన్స్ తో కార్లు నడిపేయచ్చు. అయితే కొన్ని దేశాల్లో భారత్ డ్రైవింగ్ లైసెన్స్ ను వారి వారి భాషల్లోకి మార్పిడి చేయించిన అనంతరం వినియోగించే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా ఫ్రాన్స్ లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ను ఫ్రాన్స్ భాషలోకి మార్చుకోవాలి. అమెరికాలో అయితే ఏడాది పాటు భారత్ లైసెన్స్ కు ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా అనంతరం దీనితోపాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉన్న లైసెన్స్ ను అక్కడి భాషలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ లోనూ, యుకే లోనూ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది పాటు పనికొస్తే... జర్మనీలో ఆరు నెలల పాటు మాత్రేమే వినియోగించవచ్చు. -
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
ఐదుగురు మిలిటెంట్ల హతం ఇద్దరు జవాన్ల మృతి శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో సైన్యం మిలిటెంట్లను చావుదెబ్బతీసింది. కుప్వారా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఐదుగురు లష్కరే తోయిబా అనుమానిత ఉగ్రవాదులను హతమార్చింది. మిలిటెంట్ల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. జోన్రెషి గ్రామంలో శుక్రవారం రాత్రి మొదలైన ఎన్కౌంటర్ శనివారం ఉదయం వరకు సాగింది. ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ చేశామని, ఓ ఇంట్లోని దాక్కున్న మిలిటెంట్లు పై అంతస్తులోంచి భారీగా కాల్పులు జరిపి, గ్రెనేడ్లు పేల్చారని ఆర్మీ ప్రతినిధి తెలిపారు. కాల్పులను తమ బల గాలు దీటుగా తిప్పికొట్టాయన్నారు. ఈ ఘటనలో వీరోచితంగా పోరాడి అమరులైన జవాన్లను నాయక్ షిండే శంకర్, గునేర్ సచ్దేవ్ మారుతిగా గుర్తించామన్నారు. -
వారిని పాక్ ఏమీ చేయదు..
ముంబై దాడుల కేసులో సయీద్, లఖ్వీలపై లష్కరే, అల్ కాయిదా అంచనా: హెడ్లీ ముంబై: ముంబై దాడుల సూత్రధారులు హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్లపై పాకిస్తాన్ పైపై చర్యలు మాత్రమే తీసుకుంటుందని లష్కరే తోయిబా, అల్ కాయిదాలకు తెలుసని దాడుల సూత్రధారి, లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పాడు. ఆ దాడుల తర్వాత కొన్ని నెలల్లోలోపు భారత్‌లో మరో ఉగ్ర దాడికి ప్రణాళిక రచించామని శనివారమిక్కడి కోర్టుకు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపాడు. సోమవారం ప్రారంభమైన అతని వాగ్మూలం శనివారం ముగిసింది. ఈ విచారణను నిందితుడు అబు జుందాల్ న్యాయవాది క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వాయిదా వేసింది. ముంబై దాడుల తర్వాత సయీద్, లఖ్వీల భద్రతపై ఆందోళన చెందానని, దీనిపై లష్కరే కీలక వ్యక్తి సాజిద్ మీర్, అల్ కాయిదా సభ్యుడు అబ్దుల్ పాషా (గతంలో లష్కరే)తో సంప్రదింపులు జరిపానని హెడ్లీ వెల్లడించాడు. హెడ్లీ ఇంకా ఏం చెప్పాడంటే.. ► పాక్ కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎఫ్ఐఏ) లష్కరే సభ్యులను విచారిస్తున్న సమయంలో ‘ఓల్డ్ అంకుల్’(సయీద్), ‘యంగ్ అంకుల్’(లఖ్వీ) ఎలా ఉన్నారని మీర్‌ను అడిగా. యంగ్ అంకుల్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని మీర్ బదులిచ్చాడు. ఓల్డ్ అంకుల్ కూడా ఆరోగ్యంగా ఉన్నాడని అన్నాడు. అన్నీ సర్దుకొంటాయంటూ పాషా చెప్పాడు. సయూద్, లఖ్వీలతో పాటు ఇతర లష్కరే సభ్యులపై పాక్ నామమాత్రపు చర్యలే తీసుకుంటుందని పాషా అంతరార్థం. ► ముంబై దాడులు జరిగిన 8 నెలల తరువాత మీర్ నుంచి నాకో మెయిల్ వచ్చింది... ‘ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్’ చేయాలి అని. దీని అర్థం... భవిష్యత్ దాడులకు భారత్‌లో చోటు వెతకమని! ఈసారి ‘రాహుల్(భట్) సిటీ’లో దాడులు వద్దన్నా. రాహుల్ సిటీ అంటే ముంబై. ► ఇలియాస్ కశ్మీరీ(అల్ కాయిదా) కోరిక మేరకు 2009లో పుష్కర్, గోవా, పుణెల్లో రెక్కీ నిర్వహించా. ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు పుణెలోని భారత సైనిక దక్షిణ దళ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించా. ► శివసేన మాజీ సభ్యుడు రాజారామ్ రెగేతో సంబంధాలు ఏర్పరచుకోవాలని మీర్, ఇక్బాల్ నాకు చెప్పారు. 2008 మే 19న ఓ ఇన్వెస్ట్మెంట్ గురించి రెగే మెయిల్ పంపాడు. రాణా ఇన్వెస్ట్‌మెంట్‌కు సంసిద్ధత వ్యక్తం చేశాడు. కానీ ఇక్బాల్ ఉగ్రదాడులకూ సిద్ధంగా లేడు. సైన్యం, పార్లమెంట్‌కు సంబంధించిన సమాచారం మాత్రమే కావాలన్నాడు. రెగే ఆ పని చేయగలుగుతాడా అని అడిగాడు. శివసేన చీఫ్ బాల్ ఠాక్రే, ఆయన కుమారుడు ఉద్ధవ్లను అమెరికాకు పిలవాలని రెగేకు సూచించా. ముంబై దాడులతర్వాత అనేకసార్లు పాక్‌కు వెళ్లా. కానీ ఎఫ్ఐఏ నన్ను ఎన్నడూ విచారణకు పిలవలేదు. కాగా, కరాచీలోని కంట్రోల్ రూమ్ నుంచి లష్కరే సభ్యులకు, దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు మధ్య జరిగిన సంభాషణలను హెడ్లీ ముందుంచగా.. అబె కఫా, మీర్, అబు అల్ కమా గొంతులను గుర్తించగలిగాడు. -
నేడు ముంబై కోర్టులో హెడ్లీ సాక్ష్యం
ముంబై: ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ-అమెరికన్, లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ సోమవారం ముంబై కోర్టుకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యం ఇవ్వనున్నాడు. దాడుల కుట్రపై మరిన్ని వివరాలు బయటికొచ్చే అవకాశముంది. భారత న్యాయ చరిత్రలో భారతీయ కోర్టు ముందు ఒక ‘విదేశీ ఉగ్రవాది’ సాక్ష్యం ఇవ్వనుండడం ఇదే తొలిసారి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తెలిపారు. -
ఢిల్లీపై డ్రోన్ దాడులు ?
-
ఢిల్లీపై డ్రోన్ దాడులు ?
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు కొరకరాని కొయ్యగా మారిన ఉగ్రవాద సంస్థలు లష్కరే ఈ తోయిబా, జైషే భారత్‌లో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రచిస్తోందని సమాచారం ఉన్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీపై అది డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించాలని చూస్తోందని, అప్రమత్తంగా ఉండాలని మంగళవారం హెచ్చరించింది. గుర్తు తెలియని వ్యక్తులపై మరింత నిఘాను పెంచాలని, వారిని అదుపులోకి తీసుకొని విచారించాలని కూడా సూచించింది. కొందరు అనుమానితులు డ్రోన్ దాడులు జరిపేందుకు సహకరించే ప్రమాదం ఉందని చెప్పింది. దీంతోపాటు, భారత గగన తలంలోకి పైలెట్ రహిత విమానాలను ఏమాత్రం అనుమతించకూడదని హెచ్చరించింది. -
పాకిస్థానీ పట్టుబడినా పసిగట్టలేకపోయిన సిటీ పోలీసులు
నిందితుణ్ని మూడుసార్లు అరెస్టు చేసిన కాప్స్ లష్కరేతోయిబాలోనూ శిక్షణ తీసుకున్న నజీర్ హైదరాబాదీగానే పొరబడిన వైనం గుజరాత్ పోలీసుల విచారణలో దొరికిన జాడ సాక్షి, సిటీబ్యూరో: సిటీ పోలీసుల కేసుల దర్యాప్తు తీరు, నేరగాళ్ల విచారణ విధానాల్లో ఉన్న డొల్లతనం మరోసారి బయటపడింది. పాకిస్థాన్‌లో పుట్టి, ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్ఈటీ)లో శిక్షణ తీసుకుని, ఎలాంటి అనుమతులు లేకుండా నగరంలో దర్జాగా నివసించిన నజీర్ అహ్మద్ భట్ అధికారుల్ని చాలా తేలిగ్గా బోల్తా కొట్టించేశాడు. 2008 నుంచి వివిధ నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ మూడుసార్లు అరెస్టు అయినా... అతని నిజస్వరూపాన్ని మన పోలీసులు గుర్తించ లేకపోయారు. గుజరాత్ వద్ద అక్రమంగా సరిహద్దులు దాటుతూ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు దొరకడంతో అన్నీ బయటపడ్డాయి. ఆ అధికారుల సమాచారంతో కంగుతిన్న పోలీసులు పరిగెత్తుకుంటూ వెళ్లి పాత కేసులో పీటీ వారెంట్‌తో నిందుతుణ్ని నగరానికి తీసుకువచ్చారు. పాకిస్థానీ కావడంతో మరో కేసు నమోదు చేసి సీసీఎస్ ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు బదిలీ చేశారు. నజీర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించిన సిట్ అధికారులు అనేక వివరాలు సేకరించారు. అనుకోకుండా ఎల్ఈటీలోకి... కాశ్మీర్‌లోని కుప్వాడాకు చెందిన మహ్మద్ సికిందర్ భట్ పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు వలస వెళ్లాడు. ఇతడి కుమారుడే మహ్మద్ నజీర్ అహ్మద్ భట్ అలియాస్ హకీమ్ మహ్మద్ నజీర్ ఇన్క్విలాబ్. ఎనిమిదో తరగతి వరకు చదివిన నజీర్ 1987 నుంచి తన తండ్రితో కలిసి హెర్బల్ వైద్యం చేయడం ప్రారంభించాడు. ఈ వృత్తి కోసమే కరాచీకి మకాం మార్చిన నజీర్‌కు 2005లో ఎల్ఈటీకి చెందిన అబు తోలా ప్రభావానికి గురై ఉగ్రవాద సంస్థలో చేరేందుకు అంగీకరించాడు. అతడితో కలిసి కరాచీ నుంచి ముజఫరాబాద్ కొండల్లోని ఎల్ఈటీ ట్రైనింగ్ క్యాంప్‌నకు చేరుకున్న నజీర్.. మరో 300 మందితో కలిసి నాసిర్ జావేద్ నాయకత్వంలో 21 రోజుల పాటు శిక్షణ తీసుకున్నాడు. ట్రైనింగ్ పూర్తయిన తరవాత కూడా ఏడాది పాటు కరాచీలోనే ఉండి హెర్బల్ వైద్యం కొనసాగించాడు. 2006లో ఎల్ఈటీకే చెందిన సజీద్ సహకారంతో పాకిస్థాన్ పాస్‌పోర్ట్ పొందిన నజీర్ కరాచీ నుంచి విమానంలో నేపాల్ రాజధాని ఖాట్మండు చేరుకున్నాడు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోల్‌కతా, అట్నుంచి రైలులో ఢిల్లీ, ఆ నగరం నుంచి బస్సులో జమ్ము మీదుగా శ్రీనగర్ చేరుకున్నాడు. అక్కడ నజీర్‌ను పంపూర్కు చెందిన ఇక్బాల్, ఇమ్రాన్ రిసీవ్ చేసుకున్నారు. తుపాకులు కలిగిన వీరిద్దరూ రాత్రి వేళల్లో దోపిడీలకు పాల్పడేవారు. ఇన్స్పెక్టర్ను చంపేందుకు భయపడి... ఇలా నాలుగు రోజులు గడిచిన తరవాత వీరిని పింటూ అనే వ్యక్తి కలిసి లష్కరేతొయిబా టార్గెట్‌లో ఉన్న పంపూర్లోని షఖూర్ ఠాణా ఇన్స్పెక్టర్ను చంపాలని సూచించాడు. ఈ కుట్రలో భాగస్వామి కావడానికి నజీర్ ససేమిరా అనడంతో అతని పాస్‌పోర్ట్‌ను వారు చింపిపారేశారు. దీంతో నజీర్ తిరిగి ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడి కాశ్మీర్ గేట్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై డాక్టర్ నాయర్ రాసిన పుస్తకాన్ని కొనుగోలు చేశాడు. అందులో యునానీ వైద్యానికి సంబంధించిన విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్ చూసి సంప్రదించాడు. సదరు వ్యక్తి హైదరాబాద్‌కు రమ్మని కోరడంతో నజీర్ నేరుగా వచ్చి మలక్‌పేట్ ప్రాంతంలో అతడిని కలిశాడు. ఎలాంటి డిగ్రీలు లేకపోవడంతో సహకరించలేనని ‘ఆ స్థానికుడు’ చెప్పడంతో రెండు నెలల పాటు ఆస్పత్రులన్నీ తిరిగిన నజీర్.. మలక్పేట్లోనే ఓ గదిని అద్దెకు తీసుకుని క్లినిక్ ఏర్పాటు చేసి హెచ్ఐవీ బాధితులకు వైద్యం చేయడం ప్రారంభించాడు. అప్పటికే వివాహితుడైన నజీర్ వైద్యం కోసం వచ్చిన యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. 2007లో ఈ క్లినిక్‌ను బార్కస్ ప్రాంతానికి మార్చాడు. అక్కడ ‘హెచ్ఐవీ డిస్కవర్’ పేరుతో 17 పడకల ఆస్పత్రిగా తయారు చేశాడు. మూడుసార్లు అరెస్టు అయినా... ఎలాంటి విద్యార్హతలు లేని వైద్యుడిగా మోసాలు చేస్తున్నాడంటూ ఇంటి యజమాని చేసిన ఫిర్యాదు మేరకు 2008లో కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు నజీర్‌ను అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన నజీర్ మెహదీపట్నంలోని ఓ డిస్పెన్సరీలో కొంతకాలం పని చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇతడిపై క్రిమినల్ ట్రెస్పాస్ కేసు నమోదు కావడంతో హుమయూన్‌నగర్ పోలీసులు 2011లో అరెస్టు చేశారు. ఈ కేసు లోక్‌అదాలత్‌లో రాజీ కావడంతో తన మకాంను ఉప్పరపల్లికి మార్చిన నజీర్.. అక్కడ ‘నోవా డిస్పెన్సరీ’ పేరుతో మరో ఆస్పత్రిని ఏర్పాటు చేశాడు. ఇక్కడ పరిచయమైన టోలిచౌకికి చెందిన మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. గత ఏడాది మార్చిలో లంగర్‌హౌస్ పోలీసులు నజీర్‌ను మూడోసారి అరెస్టు చే శారు. ఇతడు జైల్లో ఉన్న సమయంలో పరిచయమైన బోగస్ తాంత్రికుడు మౌదూద్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహదేవ్ అలియాస్ లార్డ్ శివతో కలిసి ఏకంగా కానిస్టేబుల్ పైనే దాడి చేసిన కేసులో జైలుకు పంపారు. ఈ మూడు సందర్భాల్లోనూ ఏ ఒక్కసారీ తాను ఎల్ఈటీలో శిక్షణ పొందిన పాకిస్థానీ అని నజీర్ బయటపెట్టలేదు... పోలీసులు కనిపెట్టనూ లేదు. నజీర్ మలక్‌పేటలో ఉండగానే తప్పుడు వివరాలతో కొన్ని ధ్రువీకరణల్ని సైతం సమకూర్చుకున్నాడు. పాక్‌కు వెళ్తూ గుజరాత్లో చిక్కడంతో... సిటీలోని అనేక ఠాణాల్లో కేసులు నమోదై ఉన్న మౌదూద్ మాటలకు నజీర్ ఎంతో ప్రభావితమయ్యాడు. చివరకు పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో ఉన్న తన మొదటి భార్య పెద్ద కుమార్తెను ఇతడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ పనుల నిమిత్తమే గత ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్థాన్‌కు పయనయ్యాడు. గుజరాత్‌లోని వాంఖనీర్ మీదుగా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూ బీఎస్ఎఫ్ దళాలకు చిక్కాడు. వీరు నజీర్‌ను అక్కడి నారా పోలీసులకు అప్పగించగా వారి విచారణలో తన ‘ప్రస్థానం’ మొత్తం బయటపెట్టాడు. నారా పోలీసుల సమాచారం మేరకు అక్కడకు వెళ్లిన నగర పోలీసులు పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకువచ్చారు. అలా ఇతగాడు పాకిస్థానీ అని తెలుసుకున్న అధికారులు నజీర్పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సిట్‌కు బదిలీ చేశారు. గత నెల్లో న్యాయస్థానం అనుమతితో నజీర్‌ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు 23వ తేదీ వరకు వివిధ కోణాల్లో విచారించారు. ఈ నేపథ్యంలోనే ఇతడు నగరంలో ఉంటూనే ఓటర్ ఐడీ, ఆధార్, పాన్‌కార్డులతో పాటు డ్రైవింగ్ లెసైన్స్ కూడా తీసుకున్నాడని, రెండు బ్యాంకుల్లో అకౌంట్లు కూడా తెరిచాడని వెలుగులోకి వచ్చింది. లష్కరేతొయిబాలో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నా నజీర్‌లో అలాంటి ధోరణి లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే అన్ని రోజులు నిశ్చింతగా సిటీలో ఉన్న ఇతగాడు ఎలాంటి కుట్రలకైనా తేలిగ్గా పాల్పడే ప్రమాదం ఉండేది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి పోలీసుల విచారణ, దర్యాప్తు తీరుతెన్నుల్ని సమీక్షించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ ఇతర ఏజెన్సీలతో సమన్వయంతో పని చేయాల్సిన ఆవశ్యకతను నజీర్ ఉదంతం చెప్పకనే చెప్తోంది. -
తుండా కస్టడీపిటీషన్ పై నేడు విచారణ