ఐదుగురు మిలిటెంట్ల హతం
ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో సైన్యం మిలిటెంట్లను చావుదెబ్బతీసింది. కుప్వారా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు లష్కరే తోయిబా అనుమానిత ఉగ్రవాదులను హతమార్చింది. మిలిటెంట్ల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. జోన్రెషి గ్రామంలో శుక్రవారం రాత్రి మొదలైన ఎన్‌కౌంటర్ శనివారం ఉదయం వరకు సాగింది. ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ చేశామని, ఓ ఇంట్లోని దాక్కున్న మిలిటెంట్లు పై అంతస్తులోంచి భారీగా కాల్పులు జరిపి, గ్రెనేడ్లు పేల్చారని ఆర్మీ ప్రతినిధి తెలిపారు. కాల్పులను తమ బల గాలు దీటుగా తిప్పికొట్టాయన్నారు. ఈ ఘటనలో వీరోచితంగా పోరాడి అమరులైన జవాన్లను నాయక్ షిండే శంకర్, గునేర్ సచ్‌దేవ్ మారుతిగా గుర్తించామన్నారు.
కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్
Published Sun, Feb 14 2016 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM
Advertisement
Advertisement