Indian Origin Girl Aditi Tripathi Has Visited 50 Countries Without Missing A School Day, Know About Her In Telugu - Sakshi
Sakshi News home page

స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..!

Published Sat, Jul 22 2023 12:13 PM | Last Updated on Sat, Jul 22 2023 1:26 PM

indian origin girl has visited 50 countries without missing a school day - Sakshi

10 ఏళ్ల చిన్నారి అదితి త్రిఫాఠి చిన్న వయసులోనే తన తల్లిదండ్రులతో పాటు 50 దేశాలు చుట్టివచ్చింది. ఈ నేపధ్యంలో అదితి ఒక్క రోజు కూడా స్కూలు మానకపోవడం విశేషం. యాహూ లైఫ్‌ యూకే తెలిపిన వివరాల ప్రకారం అదితి తన తండ్రి దీపక్‌, తల్లి అవిలాషలతో పాటు దక్షిణ లండన్‌లో ఉంటుంది. వారు యూకే అంతా చుట్టివచ్చారు. ఇప్పటివరకూ అదితి తన తల్లిదండ్రులతో పాటు నేపాల్‌, సింగపూర్‌,థాయ్‌లాండ్‌ తదితర ‍ప్రాంతాలను కూడా సందర్శించింది. 

ప్రత్యేక ప్రణాళిక ప్రకారం..
అవుట్‌లెట్‌ తెలిపిన వివరాల ప్రకారం అదితి తల్లిదండ్రులు తమ కుమర్తెతో పాటు ప్రపంచం చుట్టిరావాలని నిశ్చయించుకున్నారు. తమ కుమార్తె చదువుకు ఆటంకం కలగకుండా, ప్రపంచంలోని వివిధ దేశాలను చూపిస్తూ, విభిన్న సంస్కృతులు ఆహారరుచులపై అవగాహన కల్పిస్తూ, వివిధ ప్రాంతాల ప్రజలను అర్థం చేసుకునే అవకాశం కల్పించాలని అతిధి తల్లిదండ్రులు భావించారు. ఇందుకోసం వారు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. అదితి స్కూలుకు సెలవులు ఇచ్చిన రోజుల్లో వీరు పర్యటనలు కొనసాగించారు. ఇందుకోసం వారు 20 వేల పౌండ్లు(రూ.21 లక్షలకు పైగా..)ఖర్చు చేశారు.

విమానాశ్రయం నుంచి నేరుగా స్కూలుకు..
‘యాహూ’తో త్రిపాఠి మాట్లాడుతూ ‘తాము నేపాల్‌, భారత్‌, థాయ్‌ల్యాండ్‌లలోని విభిన్ని సంస్కృతులకు ఎంతో ప్రభావితమయ్యామన్నారు. అదితికి మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే తాము ప్రపంచయాత్ర ప్రారంభించామన్నారు. అదితికి ప్రతీవారంలో రెండు రోజులు స్కూలుకు సెలవు ఉంటుందన్నారు. తాము ప్రతీ శుక్రవారం అదితిని స్కూలు నుంచే నేరుగా పర్యటనలకు తీసుకువెళతామన్నారు. తిరిగి ఆదివారం రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగి వస్తామన్నారు. ఒక్కోసారి తాము సోమవారం ఉదయం పర్యటనల నుంచి తిరిగివస్తుంటామన్నారు. అటువంటి సందర్బాల్లో తమ కుమార్తె విమానాశ్రయం నుంచి నేరుగా స్కూలుకు వెళుతుందన్నారు. 

పర్యటనల కోసం పొదుపు
మెట్రో తెలిపిన వివరాల ప్రకారం అదితి తల్లిదండ్రులు అంకౌంటెంట్లుగా పనిచేస్తున్నారు. ఈ పర్యటల కోసం వారు తమ ఆదాయంలో నుంచి కొంతమొత్తాన్ని పొదుపు చేస్తుంటారు. ఇందుకోసం వారు బయటి ఆహారాన్ని తినరు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులోనే ప్రయాణిస్తుంటారు. వారు కారు కూడా కొనుగోలు చేయలేదు. కాగా అదితి ఇప్పటికే యూరప్‌లోని దాదాపు ప్రతీదేశాన్ని సందర్శించింది.
ఇది కూడా చదవండి: ఆమెకు 4 అడుగుల 7 అంగుళాల కురులు.. 100 ప్రపోజల్స్‌, రూ.2.6 కోట్ల ఆఫర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement