హైదరాబాద్ : ఇళ్లల్లో పెంచుకునే కుక్కలకు లైసెన్స్ తప్పని సరి అని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి గురువారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆయన కార్పోరేషన్ అధికారులను ఆదేశించారు. అలాగే లైసెన్స్ లేని కుక్కలను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో కుక్కల దాడిలో గాయపడిన వారి సంఖ్య రోజూరోజుకు పెరుగుతుంది. అందులోభాగంగా ఇళ్లలో పెంచుకునే కుక్కలకు లైసెన్స్లు తప్పని సరి చేయాలని కమిషనర్ నిర్ణయించారు.