
డ్యూటీ వద్దు.. డ బ్బే ముద్దు..
మామునూరు : నవ్విపోతురుగాక మాకేటి సిగ్గు.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వరంగల్ ఆర్డీఏ కార్యాలయం లో పనిచేస్తున్న హోంగార్డులు. లెసైన్స్ కోసం కార్యాల యానికి వస్తున్న వాహనదారులను క్రమపద్ధతిలో పం పించి, పనులను వేగవంతం చేసేందుకు పాటుపడాల్సి న హోంగార్డులు విధులను పక్కనపెట్టి అవినీతి దందా కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయి తే అసలు పనులను పక్కనపెట్టి.. అక్రమ సంపాదన కో సం కక్కుర్తి పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేం పట్టిందిలే అన్నట్లుగా వ్యవహరి స్తున్నారు. దీంతో హోంగార్డుల దందా మూడు పువ్వు లు.. ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో నాలుగేళ్ల నుంచి 13 మంది హోంగార్డులు పనిచేస్తున్నా రు.
అయితే లెసైన్స్ కోసం కార్యాలయానికి వస్తున్న వాహనదారులకు తగిన సమాచారం అందిస్తూ, వారికి సహాయపడాల్సిన హోంగార్డులు అక్రమ సంపాదనకు అలవాటుపడ్డారు. కార్యాలయం బయట లెసైన్స్‌లు ఇప్పిస్తున్న ఏజెంట్ల సంపాదనను ప్రత్యక్షంగా గమనిం చిన హోంగార్డులు తాము కూడా కొంత సంపాదించుకోవాలని భావించారు. దీంతో లెసైన్స్‌ల కోసం ఆర్టీఏ కార్యాలయానికి వస్తున్న వాహనదారులతో ముందుగా నే మాట్లాడుకుని వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే తమ అక్రమదందాను గమనిస్తున్న అధికారులను మచ్చిక చేసుకు ని వారికి కూడా తమ సంపాదనలో కొంతవాటా ఇస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, లెసైన్స్‌లు ఇప్పిస్తున్న హోంగార్డుల నెల సంపాదన సుమారు రూ. 60 వేల పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీఏలో నాలుగేళ్ల నుం చి పనిచేస్తున్నప్పటికీ తమ విధులను మార్చకుండా ఆర్‌ఐ స్థాయి అధికారులను హోంగార్డులు మచ్చిక చేసుకుంటున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఏజెం ట్లను భయబ్రాంతులను గురిచేస్తూ తమ దందాకు అడ్డురాకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, హోంగార్డుల అక్రమ దందాకు సుమారు 100 మంది అనుచరులు పరోక్షంగా సహకరిస్తున్నట్లు సమాచారం.