సాక్షి, తిరుమల : దైవ దర్శనానికి వచ్చే భక్తుల జేబులు గుళ్ల చేస్తున్న తిరుమలలోని హోటళ్లపై తీసుకున్న చర్యల గురించి హైకోర్టు ధర్మాసనానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నివేదిక సమర్పించింది. పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల దగ్గర హోటల్ యాజమాన్యాలు అక్రమంగా అధికమొత్తంలో వసూలు చేస్తున్నారని ఓ భక్తుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై స్పందించిన ధర్మాసనం టీటీడీ నివేదిక కోరింది. ఈ మేరకు టీటీడి హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
హోటళ్లపై తనిఖీలు చేసి, అక్రమాలకు పాల్పడుతున్న వారి లైసెన్సులను రద్దు చేశామని ఆ నివేదికలో టీటీడీ తెలిపింది. వాటి స్థానంలో కొత్త టెండర్లు వేశామని, అక్రమాలకు తావివ్వకుండా ఒక నూతన సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చామని పేర్కొంది. టీటీడి ఇచ్చిన నివేదికపై వివరణ ఇవ్వడానికి నాలుగు వారాల సమయం కావాలని పిటిషనర్ కోరాడు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 24కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment