
సాక్షి, హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అజమాయిషీ చెలాయించకూడదని బీజేపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. టీటీడీ ఒక స్వయం ప్రతిపత్తి విధానం కలిగి ఉండేలా ఉమ్మడి ధర్మాసనం ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు. ప్రభుత్వ అజామాయిషీ నుంచి టీటీడీని తప్పించాలని, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని పిటిషన్‌లో ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. మరి కొద్ది సేపట్లో ఈ పిటీషన్‌ను ఉమ్మడి ధర్మాసనం విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment