MP Subramanian Swamy
-
టీటీడీపై ఏపీ ప్రభుత్వం అజమాయిషీ చెలాయించకూడదంటూ పిటీషన్!
సాక్షి, హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అజమాయిషీ చెలాయించకూడదని బీజేపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. టీటీడీ ఒక స్వయం ప్రతిపత్తి విధానం కలిగి ఉండేలా ఉమ్మడి ధర్మాసనం ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు. ప్రభుత్వ అజామాయిషీ నుంచి టీటీడీని తప్పించాలని, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని పిటిషన్లో ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. మరి కొద్ది సేపట్లో ఈ పిటీషన్‌ను ఉమ్మడి ధర్మాసనం విచారించనుంది. -
టీటీడీలో ప్రభుత్వ జోక్యం కుదరదు
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై సమీక్ష చేసే హక్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేదని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు స్వామి తెలిపారు. ఆభరణాల మాయం ఆరోపణలను ప్రభుత్వం తేలిగ్గాకొట్టిపారే యడం సమంజసం కాదని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. నగల మాయం విషయంలో ప్రభుత్వంపైనే ఆరోపణలు వస్తున్నందున సీబీఐతో విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. టీటీడీని ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటకు తీసుకురా వాలన్నది తమ రెండో డిమాండ్ అని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. టీటీడీని ప్రభుత్వ నియంత్రణ నుంచి పూర్తిగా బయటకు తీసుకొచ్చి సాధువుల కమిటీ ఆధ్వర్యంలో నడపాల న్నారు. వయోపరిమితి నిబంధనల కింద టీటీడీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులను బలవంతంగా పదవీ విరమణ చేయించడం ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. అసలు రమణ దీక్షితులును తొలగించే అధికారం టీటీడీ బోర్డుకు లేదన్నారు. ఆయన తొలగింపుపై స్టే ఇవ్వాలన్నాదే తమ మూడో డిమాండ్ అని చెప్పారు. రమణ దీక్షితులు భేటీ..: సుబ్రహ్మణ్య స్వామితో టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు బుధవారం ఢిల్లీలో సమావేశయమ్యారు. టీటీడీలో అక్రమాల విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన తర్వాత రమణ దీక్షితులు ఆయనతో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుప్రీంకోర్టులో కేసు దాఖలుకు సంబంధించి రమణ దీక్షితులు కీలకమైన సమాచారాన్ని సుబ్రహ్మణ్య స్వామితో పంచుకున్నట్టు తెలుస్తోంది. బ్రాహ్మణుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ సాక్షి, అమరావతి బ్యూరో: బ్రాహ్మణుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ తీరును నిరసిస్తూ బుధవారం విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరిగింది. -
స్వామిపై బీజేపీ పెద్దల ఆగ్రహం!
బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి.. కేంద్రంలోని సీనియర్ మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులపై చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ పెద్దలకు చికాగు పుట్టిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు స్వామి పట్ల ఆగ్రహంతో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆర్ఎస్ఎస్ కూడా స్వామి వ్యాఖ్యలను సమర్థించదని బీజేపీ నేతలు చెప్పారు. కేంద్ర మంత్రులు, బ్యూరోక్రాట్లపై స్వామి చేసే వ్యక్తిగత ఆరోపణలను ఆర్ఎస్ఎస్ ఆమోదించదని తెలిపారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌ను పదవి నుంచి తొలగించాలని స్వామి డిమాండ్ చేయగా, బీజేపీ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. స్వామిది వ్యక్తిగత అభిప్రాయమని, ఆయన అభిప్రాయాలతో ఏకీభవించడంలేదని బీజేపీ స్పష్టం చేసింది. అరవింద్ పై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రులు సంప్రదాయ, లేదా మన దేశానికే చెందిన ఆధునిక దుస్తులు ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారు టై, కోట్ ధరిస్తే వెయిటర్లలా కనిపిస్తారంటూ స్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. స్వామి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో బీజేపీ పెద్దలకు కోపం తెప్పించినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
విదేశాలకు రహస్యాలు పంపారు!
► అందుకోసం షికాగో వర్సిటీ మెయిల్ ఐడీ వాడారు ► కావాలనే అధిక వడ్డీరేట్లతో పరిశ్రమల్ని మాంద్యంలోకి నెట్టారు ► ఆర్బీఐ గవర్నర్ రాజన్‌పై సుబ్రమణ్య స్వామి 6 ఆరోపణలు ► తక్షణం తొలగించాలంటూ ప్రధాని మోదీకి లేఖ న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై బీజేపీ పార ్లమెంటు సభ్యుడు సుబ్రమణ్య స్వామి మరోసారి విరుచుకుపడ్డారు. రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా అత్యంత ముఖ్యమైన పదవిలో ఉంటూ రహస్యమైన, కీలకమైన ఆర్థిక సమాచారాన్ని విదేశాలకు చేరవేశారనే తీవ్రమైన ఆరోపణ చేశారు. దీంతో పాటు మరో 5 ఆరోపణలు చే స్తూ... తక్షణం ఆయన్ను పదవి నుంచి తప్పించాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు మోదీకి ఆయనొక లేఖ రాశారు. ఐఎంఎఫ్‌లో ఒకనాడు చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేసిన రాజన్... వడ్డీ రేట్లు పెంచేటపుడు దానివల్ల జరిగే పర్యవసానాలు కూడా తెలుసుకుని ఉండాలని, తన చర్యలు దేశ ప్రయోజనాలకు విరుద్ధమని తెలిసి కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా వడ్డీ రేట్లు పెంచారని స్వామి ఆరోపించారు. అయితే భారతదేశంలో ఎక్కువ మంది పొదుపుపైన, వాటిపై వచ్చే వడ్డీపైన ఆధారపడతారు కనక వడ్డీరేట్లను భారీగా తగ్గించటం మంచిది కాదని గతంలో రాజన్ చెప్పటం ఈ సందర్భంగా గమనార్హం. అమెరికా గ్రీన్ కార్డు అలాగే ఉంది... ‘దేశీ పరిశ్రమల్ని బలవంతంగా మాంద్యంలోకి నెట్టడానికే రాజన్ వడ్డీరేట్లు తగ్గించలేదు. ఆర్బీఐ చట్టం అనుమతించకపోయినా ఆర్థిక సంస్థలు షరియా నిబంధనల ప్రకారం నడుచుకునేందుకు రాజన్ ఓకే అన్నారు. అమెరికాలో తనకున్న గ్రీన్ కార్డును అలాగే ఉంచుకుని... కీలకమైన రహస్య సమాచారాన్ని ప్రపంచమంతటికీ పంపించారు. ఇలా పంపించడానికి షికాగో యూనివర్సిటీ మెయిల్ ఐడీని ఉపయోగించుకున్నారు. పెపైచ్చు బహిరంగంగా మోదీని వ్యతిరేకించారు. కారణమేమిటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి అమెరికా ఏర్పాటు చేసుకున్న 30 మంది గ్రూపులో ఈయన కూడా సభ్యుడు’’ అంటూ స్వామి తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ప్రాథమిక ఆధారాలున్నాయి కనక ఆయన్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని మోదీని కోరారు. ఆర్బీఐ గవర్నర్ పదవిలో ఉన్నవారికి కాస్త దేశభక్తీ ఉండాలని చెప్పారాయన. రాజన్ వల్లే నిరుద్యోగులు పెరిగారు... అధిక వడ్డీ రేట్ల కోసం రాజన్ ఒత్తిడి చేయటం వల్ల పరిశ్రమలు మాంద్యంలోకి వెళ్లాయని, పలువురు నిరుద్యోగులయ్యారని స్వామి ఆరోపించారు. ప్రభుత్వ పరమైన పదవిలో ఉండి కూడా బహిరంగంగా మోదీ ప్రభుత్వాన్ని విమర్శించటం సరికాదన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై రఘురామ్ రాజన్ నుంచి ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు. కాగా, స్వామి ఆరోపణల నేపథ్యంలో రాజన్‌ను ఆర్బీఐ గవర్నరు పదవి నుంచి తప్పిస్తారా? అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను విలేకరులు ప్రశ్నించగా... బీజేపీ అధికారికంగా చెప్పే మాటల్నే తాను చెబుతానంటూ ఆయన తప్పించుకున్నారు. వ్యక్తిగత ఆరోపణల్ని ఆమోదించం: జైట్లీ ఎవరైనా సరే! వేరొకరిని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని చేసే విమర్శల్ని తాము ఆమోదించబోమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. స్వామి ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆర్బీఐ చాలా కీలకమైన వ్యవస్థ. దాని నిర్ణయాలు అందరినీ ప్రభావితం చేస్తాయి. ఆ నిర్ణయాలు సరైనవా? కావా? అన్నది చర్చించటంలో తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా చేసే విమర్శల్ని మేం ఆమోదించం’’ అన్నారాయన.