
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై సమీక్ష చేసే హక్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేదని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు స్వామి తెలిపారు. ఆభరణాల మాయం ఆరోపణలను ప్రభుత్వం తేలిగ్గాకొట్టిపారే యడం సమంజసం కాదని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
నగల మాయం విషయంలో ప్రభుత్వంపైనే ఆరోపణలు వస్తున్నందున సీబీఐతో విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. టీటీడీని ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటకు తీసుకురా వాలన్నది తమ రెండో డిమాండ్ అని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. టీటీడీని ప్రభుత్వ నియంత్రణ నుంచి పూర్తిగా బయటకు తీసుకొచ్చి సాధువుల కమిటీ ఆధ్వర్యంలో నడపాల న్నారు. వయోపరిమితి నిబంధనల కింద టీటీడీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులను బలవంతంగా పదవీ విరమణ చేయించడం ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. అసలు రమణ దీక్షితులును తొలగించే అధికారం టీటీడీ బోర్డుకు లేదన్నారు. ఆయన తొలగింపుపై స్టే ఇవ్వాలన్నాదే తమ మూడో డిమాండ్ అని చెప్పారు.
రమణ దీక్షితులు భేటీ..: సుబ్రహ్మణ్య స్వామితో టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు బుధవారం ఢిల్లీలో సమావేశయమ్యారు. టీటీడీలో అక్రమాల విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన తర్వాత రమణ దీక్షితులు ఆయనతో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుప్రీంకోర్టులో కేసు దాఖలుకు సంబంధించి రమణ దీక్షితులు కీలకమైన సమాచారాన్ని సుబ్రహ్మణ్య స్వామితో పంచుకున్నట్టు తెలుస్తోంది.
బ్రాహ్మణుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ
సాక్షి, అమరావతి బ్యూరో: బ్రాహ్మణుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ తీరును నిరసిస్తూ బుధవారం విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరిగింది.