సాక్షి, హైదరాబాద్ : టీటీడీ చేపట్టిన మహా సంప్రోక్షణపై ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది. ఆగస్ట్ 9 నుంచి 17 వరకు టీటీడీ మహా సంప్రోక్షణను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం మహా సంప్రోక్షణను లైవ్‌లో ప్రసారం చేయడం కుదరన్న టీటీడీ నిర్ణయంపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గర్భగుడిలో కాకుండా బయటి సీసీ టీవీలకు ఎందుకు బంద్ చేస్తున్నారో తెలపాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఆగమ శాస్త్ర నిబంధనల రిపోర్టును టీటీడీ హైకోర్టుకు సమర్పించింది. గురువారం పిటిషన్‌ను విచారించిన హైకోర్టు టీటీడీ ఛానల్‌నైనా ప్రసారం చేయడానికి అభ్యంతరాలు ఏంటని ప్రశ్నించింది. కోర్టు అభ్యంతరాలపై సోమవారం నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశిస్తూ.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment