కరాచీ: పాక్‌లో వెలుగు చూసిన ఘోర నిజం తెలిస్తే మనం ముక్కున వేలేసుకుంటాం. కానీ పాక్ ప్రజలు మాత్రం భయంతో వణికిపోవాల్సిందే. దీనికి కారణం పాకిస్తాన్‌లో పనిచేసే పైలట్లలో ముప్పై శాతం మంది బోగస్ పైలట్లు అని ఆ దేశ మంత్రే పార్లమెంటు సాక్షిగా వెల్లడించారు. అంటే ప్రతి ముగ్గురు పైలట్లలో ఒకరు ఫేక్ పైలట్ అన్నమాట. కరాచీలో జరిగిన విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ విస్తుపోయే విషయం బయటపడింది. ('దయచేసి మమ్మల్ని క్షోభ పెట్టకండి')
దీని గురించి బుధవారం ఆ దేశ పౌర విమానయాన శాఖ మంత్రి గులామ్ సర్గార్ ఖాన్ మాట్లాడుతూ.. "పాక్‌లో 860 మంది పైలట్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 262 మంది పరీక్ష రాయనేలేదు. వారికి బదులుగా డబ్బులిచ్చి వేరొకరిని పరీక్షకు పంపించారు. కనీసం వీరికి విమానం నడపడంలో అనుభవం కూడా లేదు" అని తెలిపారు. అంటే ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలపై ఎంత పట్టింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం నకిలీ లైసెన్సులు పొందిన 150 మందిని విధుల నుంచి తొలగించడం అక్కడి ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త. ఇక పాకిస్తాన్‌లోని కరాచీలో మే 22న అత్యంత ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 97 మంది మరణించారు. (ఆ భయం వల్లే విమానం కుప్పకూలింది!)
Comments
Please login to add a commentAdd a comment