రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది, మరి కొన్ని బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసే దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఈ వరుసలో తాజాగా 'లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్' చేరింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆర్‌బీఐ ఉత్తరప్రదేశ్‌లోని కోఆపరేటివ్ కమిషనర్ & రిజిస్ట్రార్‌ను కూడా ఈ బ్యాంకును మూసివేయడానికి కావాల్సిన ఉత్తర్వు జారీ చేయాలని, సహకార బ్యాంకుకు లిక్విడేటర్‌ను నియమించాలని వెల్లడించినట్లు సమాచారం. బ్యాంకు దివాళా తీసిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ వద్ద తగిన మూలధనం లేకపోవడమే కాకుండా.. ఆదాయ అవకాశాలు కూడా లేకపోవడంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాల అనుమతిని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే లిక్విడేషన్ మీద ప్రతి డిపాజిటర్, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని రూ. 5 లక్షల వరకు పొందేందుకు అర్హులు.
ఇదీ చదవండి: 19 ఏళ్లనాటి కల.. ఇప్పుడు నిజమైంది.. ఈజ్‌మైట్రిప్ కో-ఫౌండర్
బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం, 99.53 శాతం డిపాజిటర్లు డిఐసిజిసి నుంచి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు అని ఆర్‌బీఐ తెలిపింది. మొత్తం మీద ఇకపై లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎలాంటి వ్యాపార లావాదేవీలు, బ్యాంకింగ్ కార్యకాలపు నిరవహించడం పూర్తిగా నిషేధం. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment