రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత కొన్ని రోజులుగా నియమాలను అతిక్రమించిన బ్యాంకులపై విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగానే కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా.. లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేస్తోంది.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని పూర్వాంచల్ సహకార బ్యాంకు లైసెన్సును ఆర్‌బీఐ రద్దు చేసింది. ఈ బ్యాంకు వద్ద తగినంత మూలధనం లేకవడంతో రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌ను మూసివేసి లిక్విడేటర్‌ను నియమించాలని ఉత్తర్‌ప్రదేశ్‌లోని కోఆపరేటివ్ కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌ను ఆర్‌బీఐ ఆదేశించినట్లు సమాచారం.
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని పూర్వాంచల్ సహకార బ్యాంకు లైసెన్సును ఆర్‌బీఐ రద్దు చేయడంతో.. లిక్విడేషన్ కింద్ ప్రతి డిపాజిటర్ తన డిపాజిట్ మొత్తాన్ని.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి మాత్రమే రూ. 5 లక్షల వరకు పొందేందుకు అర్హులు.
పూర్వాంచల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం.. దాదాపు 99.51 శాతం మంది డిపాజిటర్లు డిఐసిజిసి నుంచి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు అని ఆర్‌బీఐ తెలిపింది. సహకార బ్యాంకు ప్రస్తుత ఆర్థిక స్థితితో ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించలేదని ఆర్‌బీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment