రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత కొంత కాలంలో విధులను సరిగ్గా నిర్వర్తించని బ్యాంకుల లైసెన్సులు రద్దు చేయడం లేదా జరిమానాలు విధించడం వంటివి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో భాగంగానే మరో రెండు బ్యాంకులకు గట్టి షాక్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, 2023 ఆగష్టు 29న 'అజంతా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ & పూర్వాంచల్ కో-ఆపరేటివ్ బ్యాంక్'లపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ ఆదేశాలు ఆరు నెలల పాటు అమల్లో ఉండనున్నట్లు సమాచారం. బ్యాంకుల పనితీరు ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ రెండు బ్యాంకులు వాటి పనులను అవి స్వేచ్ఛగా చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలని తలపెట్టినప్పుడు తప్పకుండా ఆర్‌బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంది. అంతే కాకుండా ఈ బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లు లేదా ప్రాంగణాల్లో ప్రజల పరిశీలన కోసం RBI ఆదేశాల కాపీని ప్రదర్శించాల్సి ఉంది.
ఇదీ చదవండి: వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు.. ఎవరీ 'నిషా జగ్తియాని'?
ఈ బ్యాంకులలో అకౌంట్ ఉన్నవారు ఎలాంటి రెన్యూవల్ చేసుకోకూడదు, కొత్త లోన్స్ కూడా మంజూరు చేసే అవకాశం లేదు. అంతే కాకుండా కస్టమర్ల నుంచి ఎలాంటి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆర్‌బీఐ ఆదేశించింది. అయితే ప్రాపర్టీలను విక్రయించడం లేదా ట్రాన్స్‌ఫర్ వంటివి చేయాలంటే ఆర్‌బీఐ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి.
బ్యాంకుల డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కింద రూ. 5 లక్షల వరకు బీమా క్లెయిమ్ స్వీకరించే వెసులుబాటు ఉంటుంది. బ్యాంకులు పరిస్థితి మెరుగుపడే వరకు ఈ ఆంక్షలు ఇలాగే ఉంటాయి, ఆ తరువాత పరిస్థిని బట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment