నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. | RBI Penalty On Four Co Operative Banks | Sakshi
Sakshi News home page

RBI: ఒకేసారి నాలుగు బ్యాంకులకు ఫైన్.. షాకిచ్చిన ఆర్‌బీఐ

Published Tue, Oct 17 2023 9:02 AM | Last Updated on Tue, Oct 17 2023 11:09 AM

RBI Penalty On Four Co Operative Banks - Sakshi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గత కొన్ని రోజులుగా నియమాలను అతిక్రమిస్తున్న బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం, భారీ జరిమానా విధించడం వంటివి చేస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా తాజాగా మరో నాలుగు బ్యాంకులకు జరిమానా విధించింది.

ఆర్‌బీఐ ఫైన్ వేసిన బ్యాంకుల జాబితాలో గుజరాత్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, మకరపురా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ & ది సెవలియా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి.

👉 గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 'గుజరాత్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్'  డిపాజిట్ ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించి మాత్రమే కాకుండా.. క్యాష్ రిజర్వ్ రేషియో మెయింటెనెన్స్‌కు సంబంధించి రూల్స్ పాటించనందుకు ఆర్‌బీఐ రూ. 4.50 లక్షలు ఫైన్ వేసింది.

👉 గుజరాత్‌లోని బాబ్రా కేంద్రంగా పని చేస్తున్న నాగరిక్ సహకారి బ్యాంకుకు కూడా రూ. 2 లక్షలు జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేటరీ యాక్ట్ - 1949లోని కొన్ని ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లగించిన కారణంగా ఈ ఫైన్ వేసినట్లు తెలుస్తోంది. 

👉 ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించడం, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు పంపాల్సిన నగదును పంపకపోవడం వల్ల మకరపురా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు రూ. 2 లక్షలు జరిమానా విధించింది.

👉 ది సెవాలియా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు ఆర్‌బీఐ రూ.50,000 జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పాటించకపోవడమే ఫైన్ వేయడానికి ప్రధాన కారణమని RBI స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్‌డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!

ఇప్పటికే చాలా కో-ఆపరేటివ్ బ్యాంకులు ఆర్‌బీఐ మార్గదర్శలకు పెడచెవిన పెట్టాయి. ఈ కారణంగానే లైసెన్స్ రద్దు చేయడం లేదా భారీ జరిమానాలు విధిస్తోంది. కాబట్టి ఒక వ్యక్తి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసే ముందు లేదా డబ్బు డిపాజిట్ చేసేముందు ఆ బ్యాంకు ఆర్ధిక స్థితిగతులను తప్పకుండా పరిశీలించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement