మరిన్ని బ్యాంకులకు ఫైన్.. కారణం ఇదే అంటున్న ఆర్‌బీఐ | RBI Imposes Penalty To Some More Banks; Check Details | Sakshi
Sakshi News home page

మరిన్ని బ్యాంకులకు ఫైన్.. కారణం ఇదే అంటున్న ఆర్‌బీఐ

Published Fri, Dec 1 2023 10:28 AM | Last Updated on Fri, Dec 1 2023 10:45 AM

RBI Penalty To Some More Banks Details - Sakshi

గత కొన్ని రోజులుగా భారతదేశం నిబంధనలను ఉల్లఘించే చిన్న, పెద్ద.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఏవైనా.. వాటిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే భారీ జరిమానాలు విధించడం, లైసెన్సులు రద్దు చేయడం వంటివి చేస్తోంది. తాజాగా మరి కొన్ని బ్యాంకులకు జరిమానా విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్‌ఎ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్‌ వంటి బ్యాంకుల మీద ఆర్‌బీఐ రూ. 10,000 (ఒక్కక్క బ్యాంకుకి రూ. 10000) జరిమానా విధించింది. నాన్-రెసిడెంట్ల నుంచి డిపాజిట్ల స్వీకరణపై ఆదేశాలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఈ మూడు బ్యాంకులపై మాత్రమే కాకుండా.. పాటలిపుత్ర సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పటాన్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, ద మండల్ నాగరిక్ సహకారి బ్యాంక్, ద బాలాసోర్ భద్రక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ద ధ్రంగధ్ర పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వంటి వాటికి కూడా జరిమానా విధించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే..

ఆర్‌బీఐ బ్యాంకులకు జరిమానాలు విధించించడం ఇదే మొదటి సారి కాదు, గత వారంలో రెండు ప్రభుత్వ రంగంలోని 'బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్' బ్యాంకులకు, ప్రైవేట్ రంగంలోని 'సిటీ బ్యాంకు'కు రూ. 10.34 కోట్లు జరిమానా విధించింది. దీన్ని బట్టి చూస్తే ఆర్‌బీఐ ఎంత పెద్ద బ్యాంకు మీద అయిన చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించడం లేదని స్పష్టమవుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement