రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల ఎస్‌బీఎమ్ బ్యాంక్ (ఇండియా)కు భారీ జరిమానా విధించింది. ఇంతకీ ఈ బ్యాంకును జరిమానా ఎందుకు విధించింది? ఎంత జరిమానా విధించింది అనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.
ఆర్‌బీఐ షరతులను పాటించనందుకు ఎస్‌బీఎమ్ బ్యాంక్ (ఇండియా)కు ఏకంగా రూ. 88.70 లక్షలు జరిమానా విధించారు. అంతే కాకుండా.. తక్షణమే అమల్లోకి వచ్చేలా సరళీకృత రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద లావాదేవీలను నిలిపివేయాలని ప్రత్యేక సూచనలను జారీ చేశారు.
ఆర్‌బీఐ సూచించిన ఆదేశాలు పాటించడంలో ఎస్‌బీఎమ్ విఫలమైనందుకు బ్యాంకుకు రెండు వేర్వేరు నోటీసులు జారీ చేసింది. ఇందులో కారణాలను పేర్కొనాలని సూచించింది. పెనాల్టీ అనేది రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉంటుందని.. బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటును ప్రభావితం చేయడానికి ఉద్దేశించినది కాదని ఆర్బీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment