ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్‌బీఐ - ఎందుకంటే? | RBI Imposes Penalty On Five Cooperative Banks - Sakshi
Sakshi News home page

ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్‌బీఐ - ఎందుకంటే?

Jan 19 2024 2:28 PM | Updated on Jan 19 2024 2:46 PM

RBI Penalty On Five Cooperative Banks - Sakshi

రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన సహకార బ్యాంకులకు జనవరి 18న భారీ జరిమానా విధించింది. ఆర్‌బీఐ ఏ బ్యాంకులకు ఫైన్ వేసింది, ఎందుకు వేసిందనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఆర్‌బీఐ జరిమానా విధించిన బ్యాంకుల జాబితాలో ఎన్‌కెజిఎస్‌బి కో-ఆపరేటివ్ బ్యాంక్, ముంబైకి చెందిన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్, గుజరాత్‌కు చెందిన మెహసానా నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ది పాడి నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి.

కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎన్‌కెజిఎస్‌బి కో-ఆపరేటివ్ బ్యాంక్ RBI నిబంధనలను పాటించకపోవడం వల్ల రూ. 50 లక్షల జరిమానా విధించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆర్‌బీఐ ఈ బ్యాంకుకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.

ముంబైకి చెందిన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకుకు.. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) రూ. 15 లక్షలు జరిమానా విధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లాభం నుంచి విరాళం ఇస్తున్నప్పుడు ఆర్‌బీఐ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఈ ఫైన్ వేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా..

గుజరాత్‌కు చెందిన మెహసానా నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు RBI రూ.7 లక్షల జరిమానా విధించింది. రుణాలు, అడ్వాన్సులు ఇచ్చే సమయంలో నిబంధనలను ఈ బ్యాంక్ ఉల్లంఘించడం వల్ల జరిమానా విధించింది. మిగిలిన రెండు బ్యాంకులు కొన్ని నిబంధనలను పాటించకపోవడం వల్ల పెనాల్టీని విధించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement