Cooperative banks
-
ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్బీఐ - ఎందుకంటే?
రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన సహకార బ్యాంకులకు జనవరి 18న భారీ జరిమానా విధించింది. ఆర్బీఐ ఏ బ్యాంకులకు ఫైన్ వేసింది, ఎందుకు వేసిందనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఆర్బీఐ జరిమానా విధించిన బ్యాంకుల జాబితాలో ఎన్‌కెజిఎస్‌బి కో-ఆపరేటివ్ బ్యాంక్, ముంబైకి చెందిన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్, గుజరాత్‌కు చెందిన మెహసానా నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ది పాడి నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎన్‌కెజిఎస్‌బి కో-ఆపరేటివ్ బ్యాంక్ RBI నిబంధనలను పాటించకపోవడం వల్ల రూ. 50 లక్షల జరిమానా విధించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆర్బీఐ ఈ బ్యాంకుకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. ముంబైకి చెందిన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకుకు.. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) రూ. 15 లక్షలు జరిమానా విధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లాభం నుంచి విరాళం ఇస్తున్నప్పుడు ఆర్బీఐ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఈ ఫైన్ వేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా.. గుజరాత్‌కు చెందిన మెహసానా నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు RBI రూ.7 లక్షల జరిమానా విధించింది. రుణాలు, అడ్వాన్సులు ఇచ్చే సమయంలో నిబంధనలను ఈ బ్యాంక్ ఉల్లంఘించడం వల్ల జరిమానా విధించింది. మిగిలిన రెండు బ్యాంకులు కొన్ని నిబంధనలను పాటించకపోవడం వల్ల పెనాల్టీని విధించినట్లు సమాచారం. -
17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ
2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏకంగా 17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. గత 9 సంవత్సరాల కాలంలో ఒకే ఏడాది ఇన్ని బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం ఇదే మొదటిసారి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రూల్స్ అతిక్రమించిన బ్యాంకుల లైసెన్సులను ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది. ఇందులో లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్, శ్రీ శారదా మహిళా కో- ఆపరేటీవ్ బ్యాంక్, హరిహరేశ్వర్ సహకార బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి. ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన 17 బ్యాంకులలో 6 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులే ఉండటం గమనార్హం. ఈ బ్యాంకులు గ్రామీణ బ్యాంకుల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, పనితీరు విషయంలో అంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఆర్బీఐ లైసెన్స్ రద్దు చేసింది. 2022లో 12 సహకార బ్యాంకులు లైసెన్స్ క్యాన్సిల్ చేసిన RBI, 2023లో 17 బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది. 2014 తర్వాత మొత్తం 60 సహకార బ్యాంకులు కనుమరుగైనట్లు సమాచారం. ఇందులో అర్బన్, రూరల్ బ్యాంకులు రెండూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే బ్యాంకుల పనితీరు సరిగ్గా లేకపోతే ఆ బ్యాంకులు కాలంలో కలిసిపోతాయని తెలుస్తోంది. ఇదీ చదవండి: అనంత్ అంబానీ ఎలాంటి కారులో కనిపించారో చూసారా.. వీడియో ఆర్బీఐ.. బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు గత ఏడాది లెక్కకు మించిన బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది. ఇందులో కేవలం ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే కాకుండా, ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నియమాలను అతిక్రమించిన ఏ బ్యాంకుకైనా పనిష్మెంట్ తప్పదని స్పష్టంగా తెలుస్తోంది. చిన్న బ్యాంకుల్లో పొదుపు చేయకపోవడం ఉత్తమం! ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బు చిన్న చిన్న బ్యాంకుల్లో కాకుండా పెద్ద బ్యాంకులలో దాచుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. చిన్న బ్యాంకుల్లో ఎక్కువ మొత్తం దాచుకుంటే, అలాంటి బ్యాంకుల పనితీరు సరిగ్గా లేనప్పుడు ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే.. ఆ భారం సదరు వినియోగదారుడు కూడా భరించాల్సి ఉంటుంది. -
బంగారు రుణాలపై గురి
సాక్షి, అమరావతి: రైతుల వ్యవసాయ, కుటుంబ అవసరాలను తీర్చడంలో సహకార బ్యాంకులు వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. పంట రుణాలకే పరిమితం కాకుండా ఇతర రుణాల మంజూరులోనూ ముందుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో నాలుగేళ్లలో బంగారంపై రికార్డు స్థాయిలో రూ.15,076 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. ఈ ఏడాది కనీసం రూ.10 వేల కోట్ల విలువైన గోల్డ్ లోన్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే విషయంలో వాణిజ్య బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, కార్పొరేట్ ఫైనాన్స్ వ్యాపార సంస్థలు ముందుంటున్నాయి. మెజార్టీ జాతీయ బ్యాంకులు తమకు నిర్ధేశించిన పంట రుణ లక్ష్యాలను అధిగమించేందుకు పెద్దఎత్తున బంగారంపై రుణాలు ఇస్తూ వాటిని పంట రుణాలుగా చూపిస్తున్నాయి. కార్పొరేట్ ఫైనాన్స్ సంస్థలు రెండు నిమిషాల్లోనే బంగారు రుణాలంటూ భారీ వ్యాపారం చేస్తున్నాయి. ఇవి డిమాండ్‌ను బట్టి ఏకంగా 15 నుంచి నుంచి 36 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. నెల రోజులకు ఒకలా.. రెండు నెలలకు మరోలా.. ఆరు నెలలు, ఏడాది కాల పరిమితితో ఒక్కో రీతిలో వడ్డీ వసూలు చేస్తున్నాయి. నాలుగేళ్లలో రూ.15,076 కోట్ల రుణాలు నాలుగేళ్ల క్రితం ఏటా రూ.500 కోట్లకు మించి బంగారు రుణాలిచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది ప్రస్తుతం ఏటా రూ.3,769 కోట్లకుపైగా రుణాలు ఇస్తున్నారు. 2018–19 వరకు ఏటా వెయ్యి కోట్లకు మించి బంగారు రుణాలు మంజూరు చేసే పరిస్థితి ఉండేది కాదు. బంగారు రుణాలపై వసూలు చేసే వడ్డీ శాతాన్ని తగ్గించడంతో పాటు పీఏసీఎస్ స్థాయి వరకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో పాటు నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో రుణాలు మంజూరు చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో బంగారు రుణాలకు ప్రాధాన్యత సహకార బ్యాంకులు బలోపేతం అయ్యేందుకు బంగారు ఆభరణాలపై రుణాల మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆప్కాబ్ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సహకార బ్యాంకులు పంట రుణాలతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున గోల్డ్ లోన్స్‌ను సైతం ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం మూడేళ్ల క్రితం వడ్డీ రేట్లను సవరించడం కలిసొచ్చింది. గతంలో 2 లక్షలకు పైబడిన గోల్డ్ లోన్లపై 10.6 శాతం ఉన్న వడ్డీ రేటును 8.50 శాతానికి.. రూ.2 లక్షల లోపు రుణాలపై 10.1 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించాయి. ఆరు నెలలకే తిరగరాసేలా మార్పు చేశారు. ఫలితంగా బంగారు రుణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ప్రత్యేక దృష్టి పెట్టాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలిచేలా పంట రుణాలతో పాటు వ్యవసాయ, కుటుంబ అవసరాల కోసం మంజూరు చేసే బంగారు రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. రైతుల అవసరాలకు తగినట్టుగా తక్కువ వడ్డీకే బంగారు రుణాలు మంజూరు చేస్తున్నాం. ఏటా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకెళ్తున్నాం. – మల్లెల ఝాన్సీ, చైర్పర్సన్, ఆప్కాబ్ -
పట్టణ కోపరేటివ్ బ్యాంకులకు నాలుగు అంచెల విధానం!
ముంబై: అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు వాటి డిపాజిట్ల పరిమాణం ఆధారంగా... నాలుగు అంచెల సులభ నియంత్రణ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఆయా బ్యాంకుల ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేయడమే దీన్ని ఉద్ధేశ్యంగా పేర్కొంది. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పట్టణ కోపరేటివ్ బ్యాంకుల బలోపేతానికి పలు సిఫారసులు చేయడం గమనార్హం. బ్యాంకులు పనిచేస్తున్న ప్రాంతం, వాటి డిపాజిట్ల ఆధారంగా నాలుగు అంచెల నియంత్రణ విధానాన్ని సూచించింది. నెట్‌వర్త్, సీఆర్ఏఆర్, బ్రాంచ్‌ల విస్తరణ, వాటి రుణాల ఎక్స్పోజర్ పరిమితులు ఆధారంగా భిన్నమైన నియంత్రణ విధానం అవసరమని కమిటీ అభిప్రాయపడింది. ఈ సిఫారసుల్లో చాలా వాటిని ఆర్బీఐ ఆమోదించడం గమనార్హం. అందులో భాగంగా తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఒకే జిల్లాలో పనిచేస్తున్న టైర్–1 కోపరేటివ్ బ్యాంకులకు కనీస నెట్‌వర్త్ రూ.2 కోట్లు, ఇతర అన్ని పట్టణ కోపరేటివ్ బ్యాంకులకు రూ.5 కోట్ల నెట్‌వర్త్ ఉండాలని ఆర్బీఐ నిర్ణయించింది. నిజానికి అర్బన్ కోపరేటివ్ బ్యాంకుల్లో చాలా వరకు ఈ నిబంధనలను ఇప్పటికే పాటిస్తున్నాయి. -
వ్యవ'సాయం'పై..అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు!
కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవల్మెంట్ బ్యాంక్స్(ఏఆర్‌డీబీఎస్)కు కీలక ఆదేశాలు జారీ చేశారు. అగ్రికల్చర్ సెక్టార్, ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇతర మౌలిక సదుపాయాల కోసం దీర్ఘ కాలిక రుణాల్ని అందించాలని సూచించారు. ఏఆర్‌డీబీఎస్-2022నేషనల్ కాన్ఫిరెన్స్‌లో అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా.. చిన్న చిన్న వ్యవసాయ క్షేత్రాలకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేలా సహకార బ్యాంకులు కృషి చేయాలని అన్నారు. అంతేకాదు దేశంలో సాగునీటిని పెంచేందుకు సహకార బ్యాంకులు రుణాలు అందించడంపై దృష్టి సారించాలని చెప్పారు. అమెరికా తర్వాత మనమే అమెరికా తర్వాత అత్యధికంగా మనదేశంలోనే 49.4 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మొత్తం వ్యవసాయ భూమికి నీటిపారుదల సౌకర్యం ఉంటే..మిగిలిన ప్రపంచ దేశాల్ని పోషించగలిగే సత్తా భారత్‌కు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. "గత 90 సంవత్సరాలుగా సహకార సంఘాల ద్వారా దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ అందిస్తున్నాం. కాని అది కాస్త తగ్గినట్లు సంబంధిత డేటాను చూస్తే అర్ధమవుతుంది. దీర్ఘకాలిక ఫైనాన్సింగ్‌లో అనేక అడ్డంకులు ఉన్నాయని, సహకార స్ఫూర్తితో వాటిని అధిగమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.సహకార బ్యాంకులు.. బ్యాంకులుగా మాత్రమే పని చేయకూడదని, నీటిపారుదల వంటి వ్యవసాయ మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి ఇతర సహకార కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని అమిత్ షా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చదవండి: 'ఇదేం పద్ధతయ్యా.. ఎలాన్ మస్క్ కొత్త రగడ' -
‘సహకార’ అప్పు.. దాడుల ముప్పు!
సాక్షి, హైదరాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది రైతుల పరిస్థితి. ఒకవైపు అకాల వర్షాలతో పంట నష్టపోగా, మరోవైపు యాసంగిలో వరి వేయొద్దని ప్రభుత్వం చెప్పడంతో అనేకచోట్ల పొలా లు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రుణాలు చెల్లించాలంటూ రైతుల ఇళ్లపై సహకార బ్యాంకులు దాడులు చేస్తున్నాయి. కొద్దిమొత్తంలో అప్పులు తీసుకున్న స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద కుటుంబాలను కూడా వదలడంలేదు. బాధితులను బయటకు పంపి ఇళ్లను సీజ్ చేస్తున్న ఘటనలు పలు జిల్లాల్లో చోటుచేసుకుంటున్నాయి. సహకార రుణాల్లో 90 శాతం మేర రైతులవే.. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 9 డీసీసీబీలున్నాయి. వాటి పరిధిలో 372 బ్రాంచీలున్నాయి. మరో 820 సహకార సంఘాలున్నాయి. ఆయా సహకార బ్యాంకులు దాదాపు 10 లక్షల మంది రైతులకు రుణాలిచ్చాయి. రైతాంగానికి, వివిధ వర్గాల ప్రజలకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రుణాలను, పంట రుణాలను, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ పథకాల కింద రుణాలను అందిస్తుంటాయి. భూములను, ఇళ్ల స్థలాలు, ఇతర ఆస్తులను తనఖా పెట్టుకొని కూడా దీర్ఘకాలిక రుణాలు ఇస్తాయి. వివిధ రకాల వ్యాపార రుణాలు మంజూరు చేస్తుంటాయి. డ్వాక్రా గ్రూపులకు జాయింట్ లయబుల్ గ్రూపు (జేఎల్‌జీ)లకు కూడా అప్పులు ఇస్తున్నాయి. అయితే మొత్తం సహకార రుణాల్లో 90 శాతం మేర రైతులవే. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్(టెస్కాబ్) లెక్కల ప్రకారం.. రైతుల వద్ద మొత్తం రూ.5,310 కోట్ల బకాయిలు పేరుకుపోగా, ఇప్పటివరకు రూ. 2,752 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.2,558 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో దీర్ఘకాలిక రుణాలు రూ.738 కోట్లు, పంటరుణాలు రూ.1,820 కోట్లు ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక రుణాల వసూళ్లపైనే డీసీసీబీలు దృష్టి సారించాయి. ఈ రుణాలు తీసుకున్న రైతులే 2 లక్షల మంది ఉంటారు. వీరిలో దాదాపు లక్షన్నర మందికిపైగా బకాయిపడినట్లు సమాచారం. రుణాలు చెల్లించనివారి ఇళ్లలోని వస్తువులు, వంటసామగ్రి, బియ్యం జప్తు చేయటం వంటి చర్యలకు సహకార బ్యాంకు అధికారులు పాల్పడుతున్నారు. ఇళ్లను సీజ్ చేస్తుండటంతో పలు కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అయితే రుణమాఫీ పరిధిలోని పంట రుణాల సొమ్మును వసూలు చేయబోమని, అంతకుమించి బకాయి పడితే మాత్రం వదలబోమని అధికారులు అంటున్నారు. బకాయిలు పేరుకుపోయినందునే.. ఇప్పటికే అనేక సహకార బ్యాంకులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. డీసీసీబీల పరిధిలో పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోయాయి. వాటిని వసూలు చేయాలని డీసీసీబీలు నిర్ణయించాయి. అయితే రైతుల ఇళ్లకు తాళాలు వేయడం మాత్రం సరికాదని నా ఉద్దేశం. – మురళీధర్, ఎండీ, టెస్కాబ్ -
ఆర్బీఐ మార్గదర్శకాలపై అసంతృప్తి.. సుప్రీంకు కేరళ సర్కార్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI మార్గదర్శకాలపై కేరళ ప్రభుత్వం అసంతృప్తితో రగిలిపోతోంది. ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీలు, కోఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ నియంత్రణ ఆదేశాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉంది. ఆర్బీఐ తాజా గైడ్‌లైన్స్ ప్రకారం.. కోఆపరేటివ్ సొసైటీలు ‘కోఆపరేటివ్ బ్యాంక్’ అనే పదాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. ఓటింగ్ హక్కు లేని సభ్యుల నుంచి సహకార సంఘాలు డిపాజిట్లు తీసుకోకుండా నిషేధం విధించింది. ఈ మార్గదర్శకాల వల్ల 1,625 ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీలు, వేలకొద్దీ ఇతర కోఆపరేటివ్ బ్యాంకుల నిర్వహణకు ఆటంకాలు ఎదురుకానున్నాయి. అందుకే ఆర్బీఐ గైడ్‌లైన్స్‌పై సుప్రీంను ఆశ్రయించాలని కేరళ ప్రభుత్వం అనుకుంటోంది. ఈ మేరకు కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్, అడ్వొకేట్ జనరల్‌తో భేటీ అయ్యి చర్చలు జరుపుతున్నారు. అయితే ఆర్బీఐ మాత్రం సెప్టెంబర్‌లో పార్లమెంట్ జారీ చేసిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారమే ముందుకు పోతున్నట్లు చెప్తోంది. ఇదిలా ఉంటే ఈ చట్టం కేరళలో మాత్రమే పటిష్టంగా అమలు కావడం లేదని కేంద్రం భావిస్తోంది. ఈ తరుణంలోనే కేంద్రం ఆర్బీఐపై ఒత్తిడి చేస్తుండగా.. ఈ రెండు ఆదేశాలపై సుప్రీం కోర్టు ఊరట ఇచ్చినప్పటికీ రాజకీయ ఉద్దేశాలతోనే కేంద్రం ఇలా ప్రవర్తిస్తోందంటూ కేరళ కోఆపరేషన్ మినిస్టర్ వీఎన్ వాసవన్ ఆరోపిస్తున్నారు. 60 శాతం కోఆపరేటివ్ సొసైటీల కార్యకలాపాలు సజావుగా సాగడం బహుశా కేంద్రానికి కంటగింపుగా మారిందేమోనని ఆయన అంటున్నారు. క్లిక్ చేయండి: ఆ ఛార్జీల మోతపై క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ -
అవుట్ సోర్సింగ్ పాలసీపై గైడ్‌లైన్స్ విడుదల
ముంబై: కీలకమైన నిర్వహణ సేవలను అవుట్సోర్స్ (ఇతరులకు అప్పగించడం) చేయరాదంటూ కోపరేటివ్ బ్యాంకులను (సహకార బ్యాంకులు) ఆర్బీఐ ఆదేశించింది. ‘‘కోపరేటివ్ బ్యాంకులు ఆర్థిక సేవలను అవుట్సోర్స్ చేసుకోవచ్చు. కానీ, కీలక నిర్వహణ విధులైన.. విధానాల రూపకల్పన, ఇంటర్నల్ ఆడిట్, నిబంధనల అమలు, కేవైసీ నిబంధనల అమలు, రుణాల మంజూరు, పెట్టుబడుల నిర్వహణ సేవలను ఇతరులకు అప్పగించొద్దు’’ అని ఆర్బీఐ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కోపరేటివ్ బ్యాంకులు ఆర్థిక సేవలను అవుట్సోర్స్ చేసే విషయంలో రిస్క్ నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. రిస్క్ పర్యవేక్షణ కోసం నిపుణులను (మాజీ ఉద్యోగులు సైతం) నిబంధనల మేరకు నియమించుకోవడానికి వీలు కల్పించింది. అవుట్సోర్స్ అంటే.. కోపరేటివ్ బ్యాంకుల కార్యకలాపాలను మూడో పక్షం నిర్వహించడంగా స్పష్టత ఇచ్చింది. వ్యయాలను తగ్గించుకునేందుకు, నిపుణుల సేవలను పొందేందుకు కోపరేటివ్ బ్యాంకులు పలు కార్యకలాపాలను అవుట్సోర్స్ ఇస్తుంటాయి. ఇలా సేవలను వేరే వారికి అప్పగించే విషయంలో వచ్చే సమస్యలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు నిబంధనలను తీసుకొచ్చింది. చదవండి: ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్ష్యం దిశగా పెట్టుబడుల ఉపసంహరణ -
కోపరేటివ్‌లపై రాజకీయ పెత్తనానికి చెక్
ముంబై: పట్టణ సహకార బ్యాంకుల (అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు) విషయంలో ప్రమాణాలను బలోపేతం చేస్తూ ఆర్బీఐ పలు నూతన నిబంధనలను తీసుకొచ్చింది. అర్బన్ కోపరేటివ్ బ్యాంకుల ఎండీలు, హోల్‌టైమ్ డైరెక్టర్ల (డబ్ల్యూటీడీలు) విషయంలో అర్హత ప్రమాణాలను పటిష్టం చేసింది. ఈ పోస్ట్‌లకు ఎంపీలు, ఎంఎల్ఏలు, మున్సిపల్ కార్పొరేషన్ల పాలకమండలి సభ్యులను అనర్హులుగా ప్రకటించింది. అలాగే, స్థానిక పాలక మండళ్ల సభ్యులు, వ్యాపారంలో ఉన్నవారు, ఏదైనా కంపెనీతో సంబంధం ఉన్నవారు కూడా అనర్హులుగా నిర్దేశించింది. ఎండీ, డబ్ల్యూటీడీ పోస్ట్‌లకు కనీసం పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా ఫైనాన్స్‌లో అర్హత ఉండాలని నిబంధన విధించింది. చార్టర్డ్/కాస్ట్ అకౌంటెంట్, ఎంబీఏ (పైనాన్స్) లేదా బ్యాంకింగ్, కోపరేటివ్ బిజినెస్ మేనేజ్మెంట్లో డిప్లోమా కలిగి ఉండాలని పేర్కొంది. 35–70 ఏళ్ల వయసు పరిమితిని ప్రవేశపెట్టింది. అంతేకాదు కనీసం ఎనిమిదేళ్ల పని అనుభవం కూడా ఉండాలని ప్రతిపాదించింది. కనీసం రూ.5,000 కోట్లు అంతకుమించిన ఆస్తులు కలిగిన అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు చీఫ్ రిస్క్ ఆఫీసర్ నియమించుకోవడం తప్పనిసరి చేస్తూ ఆర్బీఐ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. చదవండి: జీడీపీలో 56 శాతానికి బ్యాంకింగ్ రుణాలు -
బ్యాంకులకు మంచి రోజులు వచ్చాయి
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల కోసం సహకార బ్యాంకులను అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పునూరు గౌతమ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకులకు మంచి రోజులు వచ్చాయని, బ్యాంక్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వైఎస్సార్ టీయూసీ సహకార సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘‘ 1987 నుండి బ్యాంకింగ్ వ్యవస్థను నీరుకార్చారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలోని కార్మిక వర్గానికి పెద్ద పీట వేశారు. వారికి నెలకు 16,000 రూపాయలు ఇస్తున్నారు. సహకార సంస్థ కోసం గతంలో సీఎం జగన్ మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. మా ప్రభుత్వంలో ధర్నాలు ఉండవు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కార్మికులను మోసం చేశారు. ముఖ్యమంత్రి ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.వైఎస్సార్ టీయూసీలోకి 15000 మంది వచ్చారు. సహకార ఉద్యోగులకు ప్రమోషన్లు త్వరలోనే వస్తాయ’’ని అన్నారు. ఏపీ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎండీ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ గతంలో ఐసీఐసీ బ్యాంక్‌తో సహకార బ్యాంక్‌ను టీడీపీ విలీనం చేయబోయింది. సహకార బ్యాంక్ వ్యవస్థలో కొత్త విధానాన్ని తెస్తున్నా’’మన్నారు. -
ఇకపై ఆర్బీఐ పర్యవేక్షణలో సహకార బ్యాంకులు
ఢిల్లీ : బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఆమోదం తెలిపారు. సహకార బ్యాంకుల నిర్వహణ, నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ, సహకార, రాష్ట్ర సహకార బ్యాంకులను భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) పర్యవేక్షణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 24న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 1540 సహకార బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి రానున్నాయి. ఇందులో ప్రభుత్వ బ్యాంకులతోపాటు 1482 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, 58 మల్టీస్టేట్ కోఆపరేటివ్ బ్యాకులు ఉన్నాయి. దీంతో కోఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ నియంత్రణలోకి తీసుకువచ్చే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఫ్రిబవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలనుకున్నప్పటికీ, కరోనా కేపథ్యంలో అది సాధ్యం కాలేదు. దీంతో తాజాగా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం సహకార బ్యాంకులకు కూడా బ్యాంకింగ్ రెగ్యలేషన్ యాక్ట్, 1949 వర్తించే విధంగా సవరణలు చేశారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి సహకార బ్యాంకులను మరింత బలోపేతం చేయనుంది. ఇతర బ్యాంకులతో పాటు సహకార బ్యాంకుల్లో పాలన, పర్యవేక్షణను మెరుగుపరిచేందుకు బ్యాంకింగ్ నియంత్రణ కోసం ఆర్బీఐతో ఇప్పటికే అందుబాటులో ఉన్న అధికారాలను ఈ ఆర్డినెన్స్ మరింత విస్తరించనుంది. అయితే ఈ సవరణలు రాష్ట్ర సహకార చట్టాల కింద ఉన్న సహకార సంఘాల రాష్ట్ర రిజిస్ట్రార్లతో పాటు ప్రాథమిక వ్యయసాయ క్రెడిట్ సొసైటీలకు(పీఏసీఎస్) వర్తించదు. బ్యాంకింగ్ రెగ్యలేషన్ చట్టంలో ఉన్న సెక్షన్ 45 ప్రకారం బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూడాలి. ప్రజల ఆసక్తి , డిపాజిటర్లతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడటానికి చర్చలు పాటు ఎలాంటి మారిటోరియం లేకుండా బ్యాంకింగ్ పునర్నిర్మాణం లేదా సమ్మేళనం కోసం ఈ ఆర్డినెన్స్‌ను తెచ్చినట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. (ఆర్డినెన్స్ గెజిట్ నోటిఫికేషన్ కొరకు) -
డీసీసీబీ, డీసీఎంఎస్‌లన్నీ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల మేనేజింగ్ కమిటీ సభ్యుల (డైరెక్టర్ల) పదవులు మంగళవారం ఎన్నికలు జరగకుండానే అన్నీ ఏకగ్రీవమయ్యాయి. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అవన్నీ ఏకగ్రీవమైనట్లు తెలంగాణ సహకార శాఖ అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర ఒక ప్రకటనలో వెల్లడించారు. టీఆర్ఎస్కు చెందిన వారే ఎక్కువ కైవసం చేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో పాత జిల్లాల ప్రకారం 9 డీసీసీబీ, 9 డీసీఎంఎస్‌లకు ఎన్నికల ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. ఇక డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు ఈ నెల 29న జరుగుతాయని ఆమె తెలిపారు. దీని కోసం ఆ రోజు నామినేషన్లు స్వీకరిస్తామని, పరిశీలన అనంతరం రహస్య విధానంలో ఓటింగ్ జరిపి ఎన్నుకుంటామన్నారు. కాగా డీసీసీబీలకు 20 మంది చొప్పున గ్రూప్ ఏలో 16, గ్రూప్ బీలో నలుగురు, అలాగే డీసీఎంఎస్‌లకు 10 మంది చొప్పున గ్రూప్ ఏలో ఆరుగురు, గ్రూప్ బీలో నలుగురు డైరెక్టర్లను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు డైరెక్టర్ల పదవుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున నామినేషన్లు వేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కొన్ని రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులు లేక వాటికి నామినేషన్లు దాఖలుకాలేదు. 9 డీసీసీబీల్లో 180 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వివిధ జిల్లాల్లో 33 రిజర్వుడ్ డైరెక్టర్ పదవులకు సభ్యులు లేక ఎవరూ నామినేషన్ వేయలేదు. అలాగే 9 డీసీఎంఎస్‌లలో 90 డైరెక్టర్ పదవులకు నామినేషన్లు వేయాల్సి ఉండగా, 16 డైరెక్టర్ పదవులకు రిజర్వుడ్ సభ్యులు లేక నామినేషన్లు దాఖలుకాలేదు. మిగిలిన వాటికి ఇద్దరు లేదా ముగ్గురు నామినేషన్లు వేశారు. అయితే మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన నామినేషన్ల ఉపసంహరణతో అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్‌లు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. రిజర్వుడ్ స్థానాలకు కొన్నిచోట్ల సభ్యులు లేకపోవడంతో అన్ని డీసీసీబీల్లోని 180 డైరెక్టర్ పదవులకుగాను, 147 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ఇక అన్ని డీసీఎంఎస్‌లకు 90 మంది డైరెక్టర్ పదవులకుగాను, 74 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ఇదిలావుండగా రిజర్వుడ్ కేటగిరీలో ఎన్నిక జరగని 33 డీసీసీబీ డైరెక్టర్, 16 డీసీఎంఎస్ డైరెక్టర్ పదవులకు ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించే అవకాశముంది. సంబంధిత చైర్మన్లు, వైస్ చైర్మన్లు కోరితే వాటికి ఎన్నిక జరుగుతుందని సహకారశాఖ అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర తెలిపారు. 5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక.. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) చైర్మన్‌ను వచ్చే నెల ఐదో తేదీన ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మూడో తేదీన జారీ చేస్తామని సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 904 ప్యాక్స్లకు ఇటీవల చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్న అనంతరం, వారు డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లను ఏకగ్రీవం చేసుకున్నారు. -
సహకార బ్యాంక్‌లకు ఇంచార్జ్ కమిటీల నియామకం
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం 13 జిల్లాల సహకార సెంట్రల్ బ్యాంక్‌లకు పర్సన్ ఇంచార్జ్ కమిటీలను నియమించింది. ప్రతి డీసీసీబీకి 7గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లాల వారీగా డీసీసీబీ చైర్పర్సన్ల వివరాలు.. 1) శ్రీకాకుళం- పాలవలస విక్రాంత్ 2) విజయనగరం- మరిసర్ల తులసి 3) విశాఖపట్నం- సుకుమార్ వర్మ 4) తూర్పుగోదావరి- అనంత ఉదయ్‌భాస్కర్ 5) పశ్చిమగోదావరి- కవురు శ్రీనివాస్ 6) కృష్ణా జిల్లా- యార్లగడ్డ వెంకటరావు 7) గుంటూరు- రాతంశెట్టి సీతారామాంజనేయులు 8) ప్రకాశం- మాదాసి వెంకయ్య 9) నెల్లూరు- ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి 10) చిత్తూరు- ఎం.రెడ్డమ్మ 11) కర్నూల్- మాధవరం రామిరెడ్డి 12) వైఎస్సార్ కడప- తిరుపాల్ రెడ్డి 13) అనంతపురం- బోయ వీరాంజనేయులు -
కోపరేటివ్ బ్యాంకులకు చికిత్స!
ముంబై: కోపరేటివ్ బ్యాంకుల మెరుగైన నిర్వహణకు అవసరమైతే చట్టంలో సవరణలు తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇటీవలే ఆర్బీఐ ఆంక్షల పరిధిలోకి వెళ్లిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) డిపాజిటర్ల ఆగ్రహాన్ని మంత్రి గురువారం ముంబై వచ్చిన సందర్భంగా స్వయంగా చవిచూశారు. దక్షిణ ముంబైలోని బీజేపీ కార్యాలయం వద్దకు పీఎంసీ బ్యాంకు డిపాజిటర్లు చేరుకుని తమ డబ్బులను పూర్తిగా తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు డిపాజిటర్లను మంత్రి లోపలకు తీసుకెళ్లి, స్వయంగా మాట్లాడి వారి ఆందోళనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కోపరేటివ్ బ్యాంకుల్లో పాలన మెరుగ్గా ఉండేందుకు చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖల కార్యదర్శులు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌తో ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోపరేటివ్ బ్యాంకుల చట్టంలో లోపాలు ఉన్నాయని తాను భావించడం లేదన్నారు. కాకపోతే, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు తిరిగి చోటు చేసుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని, అందుకే ప్యానెల్ ఏర్పాటు అని చెప్పారు. అవసరమైతే కోపరేటివ్ బ్యాంకుల చట్టాలకు సవరణలను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చేపడతామని తెలిపారు. ప్రభుత్వ పాత్ర పరిమితమే.. బహుళ రాష్ట్రాల్లో పనిచేసే కోపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ నియంత్రిస్తుందని డిపాజిటర్లకు చెప్పినట్టు మంత్రి వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వ పాత్ర పరిమితమేనన్నారు. కాకపోతే డిపాజిటర్ల అత్యవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్‌ను కోరతానని ఆమె హామీ ఇచ్చారు. పీఎంసీ బ్యాంకులో రుణాల కుంభకోణం వెలుగు చూడడం, ఎన్పీఏల గణాంకాల్లో బ్యాంకు అక్రమాలకు పాల్పడడంతో ఆర్బీఐ ఆంక్షలను అమలు చేసిన విషయం గమనార్హం. ఒక్కో ఖాతా (సేవింగ్స్, కరెంటు, డిపాజిట్) నుంచి గరిష్టంగా రూ.10,000 మాత్రమే ఉపసంహరణకు అనుమతించింది. పీఎంసీ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా తన మొత్తం రుణాల్లో (సుమారు రూ.9వేల కోట్లు) 70% మేర హెచ్‌డీఐఎల్ ఖాతా ఒక్కదానికే ఇవ్వడం గమనార్హం. వృద్ధి కోసం ప్రోత్సాహకాలు దేశం ఆర్థిక మందగమనం ఎదుర్కొం టోందని ప్రభుత్వం అంగీకరిస్తుందా? అన్న ప్రశ్నకు... మంత్రి నిర్మలా సీతారామన్ సూటి సమాధానం దాటవేశారు. రంగాలవారీగా అవసరమైన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. సాయం అవసరమైన అన్ని రంగాలకు ఉపశమనం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. -
సోమవారం బ్యాంకులకు సెలవు!
ముంబై: బ్యాంకులు ఏప్రిల్ 1వ తేదీ సోమవారం పనిచేయవు. మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి (2018–19) సంబంధించి ఖాతాల ముగింపును (యాన్యువల్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్) పురస్కరించుకుని వాణిజ్య, సహకార బ్యాంకులు పనిచేయవని ఆర్బీఐ పేర్కొంది. ప్రభుత్వ లావాదేవీలకు ఆదివారం సేవలు కాగా ఆర్థిక సంవత్సరం చివరిరోజుకావడంతో (మార్చి 31) ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్లకు అలాగే చెల్లింపుల లావాదేవీల నిర్వహణకు సంబంధిత ప్రత్యేక బ్యాంక్ బ్రాంచీలు పనిచేస్తాయి. ‘‘పే అండ్ అకౌంట్ బ్యాంక్ బ్రాంచీలు అన్నీ మార్చి 31న పనిచేయలని కేంద్రం సూచించింది’’ అని ఆర్బీఐ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ఆర్టీజీఎస్, నిఫ్ట్ వంటి అన్ని ఎలక్ట్రానిక్ లావాదేవీ సమయాలు ఇందుకు అనుగుణంగా పొడిగించడం జరిగింది. -
సహకార బ్యాంకుల్లో 1,100 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల్లో ఖాళీగా ఉన్న 1100 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహకార బ్యాంకుల్లో పరిస్థితిపై రాష్ట్రస్థాయిలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ ఉన్నతస్థాయి కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. సమావేశంలో వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి సహా పలువురు నాబా ర్డు, సహకార బ్యాంకుల అధికారులు పాల్గొ న్నారు. ఈ సమావేశం వివరాలను పార్థసారథి ఒక ప్రకటనలో వెల్లడించారు. టెస్కాబ్, డీసీసీబీల్లో 600 క్లరికల్, ఆఫీసర్ స్థాయి పోస్టులను.. 500 డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. డ్రైవర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారని, త్వరలో వాటికి సంబంధించి ఉత్తర్వులు వెలువడతాయన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్ డీసీసీబీలు బలహీనంగా ఉన్నాయని తేల్చినట్లు చెప్పారు. వాటిల్లో ఐదు శాతంపైగా నిరర్ధక ఆస్తులున్నాయని, వాటిని బలోపేతం చేసేందుకు ప్రణాళిక రూపొందించనున్నామని అన్నారు. అలాగే హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ డీసీసీబీలకు పూర్తిస్థాయి సీఈవోలను నియమించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. -
కోపరేటివ్ బ్యాంకులు ఆ డిపాజిట్లు స్వీకరించవు
న్యూఢిల్లీ : రద్దయిన నోట్ల డిపాజిట్‌కు గడువు ముగిసినప్పటికీ నల్లధనం వివరాల వెల్లడికి మరో అవకాశమిస్తూ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద పాత నోట్లను డిపాజిట్ల చేసుకోవచ్చని కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు ఈ నోట్లను ఏ బ్యాంకుల్లోనైనా నల్లకుబేరులు డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ ఈ అనుమతి ఇప్పటినుంచి సహకార బ్యాంకుల్లో వర్తించదు. పీఎంజీకేవై కింద పాత నోట్లను కోపరేటివ్(సహకార) బ్యాంకులు స్వీకరించవని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. దీనికి గల ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు అనంతరం కోపరేటివ్ బ్యాంకుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆదాయపు పన్ను శాఖ గుర్తించడమే. కొన్ని సహకార బ్యాంకుల అకౌంట్లలో తీవ్రమైన వైరుధ్యాలు, అవకతవకలు కనిపించినట్టు ఐటీ డిపార్ట్మెంట్ ఆర్బీఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో పీఎంజీకేవై కింద స్వీకరించే డిపాజిట్లను కోపరేటివ్ బ్యాంకులు స్వీకరించవని ప్రభుత్వం తెలిపింది. పీఎంజీకేవై కింద డిపాజిట్ చేసే నగదుపై 50 శాతం పన్నును అకౌంట్ హోల్డర్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ నగదులో25 శాతం మొత్తాన్ని సదరు ఖాతాదారు నాలుగేళ్ల వరకూ వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. అయితే ఈ స్కీమ్‌ను కూడా వాడుకోకుండా తమంతట తాముగా మొత్తాన్ని వెల్లడించని వ్యక్తులపై మాత్రం కఠినంగా వ్యవహరించడం తథ్యమని కేంద్రం హెచ్చరించింది. -
‘చిన్న మొత్తాలకు’ పాత నోట్లు చెల్లవు
సహకార బ్యాంకులకు సరిపడా నగదు సాయం చేయండి: ఆర్బీఐ న్యూఢిల్లీ/ముంబై: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డిపాజిట్లకు రద్దైన రూ. 500, రూ. వెయ్యి నోట్లను అంగీకరించకూడదని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం స్పష్టం చేసింది. బ్యాంకుల సందేహాల నేపథ్యంలో పూర్తి స్థారుు సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామంది. పోస్టాఫీసు డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సుకన్య సమృద్ధి వంటి పథకాలు ఇందులోకి వస్తారుు. సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు(ఆర్ఆర్బీ)లకు సరిపడా నగదు సరఫరా చేయాలని ఆర్బీఐ బ్యాంకుల్ని కోరింది. విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు సరిపడా కొత్త నోట్లు రైతులకు చేరేలా చూడాలని సూచించింది. వారానికి రూ. 10 వేల కోట్ల చొప్పున పంట రుణాల కోసం సహకార సంఘాలకు రూ. 35 వేల కోట్లు అవసరమున్నట్లు గుర్తించామని తెలిపింది. 10 వేల లోపు పెళ్లి ఖర్చుకు నో డిక్లరేషన్ పెళ్లి కోసం రూ. 2.5 లక్షల విత్‌డ్రాకు నిబంధనలు పెట్టిన ఆర్బీఐ... తాజాగా కొంత సడలింపునిచ్చింది. రూ. 10 వేల లోపు పెళ్లి ఖర్చులకు డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదని తెలిపింది. చిన్న వర్తకుల కోసం.. చిన్న వర్తకుల కోసం ఆర్బీఐ ప్రత్యేక చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రీపెరుుడ్ పేమెంట్ ఇన్స్ట్రమెంట్స్(పీపీఐ)లను రూ. 20 వేల పరిమితి వరకూ వర్తకుల ఖాతాలకు పంపొచ్చు. వర్తకుడు ఆ పీపీఐను తన ఖాతాకు నెలకు రూ. 50 వేలదాకా బదిలీ చేయొచ్చు. కాగా, దేశవ్యాప్తంగా 2.2 లక్షల ఏటీఎంలకు గాను 82,500 ఏటీఎంలలో కొత్త నోట్ల విత్‌డ్రాకు అనుగుణంగా మార్పు చేశారు. బ్యాంకుల్లో అక్రమాలపై ఆగ్రహం రద్దైన నోట్ల మార్పిడి, డిపాజిట్ల సమయంలో కొందరు బ్యాంకు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ‘అధికారులు అక్రమార్కులతో కలసి రూ. 500, రూ. వెరుు్య నోట్ల మార్పిడి, డిపాజిట్ల సమయంలో అక్రమాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై నిఘా పెంచి అడ్డుకట్ట వేయండి. రద్దైన నోట్ల వివరాలు, ఖాతాలో డిపాజిట్ చేసే పాతనోట్ల మొత్తాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. నోట్ల మార్పిడి సమయంలో ఖాతాదారుడు, నోట్ల వారీగా అన్ని వివరాలు నమోదు చేయాలి. ఎప్పుడు అడిగినా వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి’ అని పేర్కొంది. ఐఆర్సీటీసీ బుకింగ్‌పై సేవాపన్ను రద్దు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో రైలు టికెట్లు బుక్ చేసుకునేవారికి నవంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకూ సర్వీస్ ట్యాక్స్ ను రైల్వే రద్దు చేసింది. నవంబర్ 28 వరకూ ఎయిర్ పోర్టుల్లో పార్కింగ్ ఫీజును కేంద్రం రద్దు చేసింది. -
సహకార బ్యాంకుల్లో పెద్దనోట్లు నిరాకరణ
- రైతుల ఆందోళన రామన్నపేట: నల్గొండ జిల్లా రామన్నపేటలోని సహకార బ్యాంకుల్లో, సింగిల్ విండో సొసైటీల్లో రూ.500, రూ.1000 నోట్లు తీసుకోకపోవడంతో రైతులు మంగళవారం ధర్నా చేశారు. విత్తనాల కోసం వచ్చిన రైతులు తమ వద్ద ఉన్న రూ.500, రూ.1000 రూపాయల నోట్లను తెచ్చారు. అయితే సహకార బ్యాంకు, సింగిల్ విండో సొసైటీల్లో ఆ నోట్లు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. భువనగిరి రోడ్డుపై ధర్నా చేయడంతో రాకపోకలు స్తంభించాయి. -
అన్ని సహకార బ్యాంకులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్
ముంబై: రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకులు వారి వినియోగదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను అందించడానికి ఆర్బీఐ అంగీకరించింది. ఇప్పటి వరకు పట్టణ సహకార బ్యాంకులకు మాత్రమే కొన్ని షరతులతో వాటి వినియోగదారులకు ఇంటర్నెట్ బ్యాం కింగ్‌ను అందించే వెసులుబాటు ఉంది. పట్టణ సహకార బ్యాంకులకు రూపొందించిన నిబంధనలను సవరించి ఇకపై అన్ని సహకార బ్యాంకులను ఒకే రకమైన నిబంధనలను జారీ చేశామని ఆర్బీఐ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం.. అన్ని సహకార బ్యాంకులు కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్‌ను అమలు చేయాలి. వారి కస్టమర్లకు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను అందించడానికి వీలుగా బ్యాంకులు ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 6కు మారాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను అందించే క్రమంలో వన్ టైమ్ పాస్వర్డ్ వంటి పద్ధతులను పాటించాలి. అన్ని సహకార బ్యాంకులు వారి వినియోగదారులకు ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి సేవలు మినహా బ్యాలెన్స్ విచారణ, అకౌంట్ స్టేట్మెంట్ డౌన్లోడ్, చెక్‌బుక్ సప్లై అభ్యర్థన వంటి నాన్ ఫండ్ ట్రాన్స్ఫర్ సేవలను అందించొచ్చు. దీనికి ఆర్బీఐ అనుమతి అవసరం లేదు. సహకార బ్యాంకులు ఒకవేళ ట్రాన్సాక్షన్తో కూడిన సేవలను పొందాలని భావిస్తే.. దానికి ఆర్ బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆర్బీఐ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 10 శాతం కన్నా తక్కువగా ఉండకూడదు, నెట్‌వర్త్ రూ.50 కోట్లకు పైగా ఉండాలి వంటి పలు షరతులను విధించింది. -
‘సహకార’లో మిశ్రమ ఫలితాలు
- ముంబై బ్యాంక్‌లో, పుణేలో ఎన్సీపీ విజయం - సింధుదుర్ గలో టచ్‌లోకి వచ్చిన రాణే - నాందేడ్‌లో ఓటమి పాలైన అశోక్ చవాన్ ప్యానెల్ - కనిపించని శివసేన ప్రభావం సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని సహకార బ్యాంకులకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీల నాయకులు తమ ప్రాబల్యాన్ని మరోమారు నిరూపించుకున్నారు. నగర్ జిల్లాలో రాధాకృష్ణ విఖే పాటిల్, పుణేలో అజీత్ పవార్, బీడ్ జిల్లాలో పంకజా ముండే-పాలవే, జల్గావ్లో ఏక్నాథ్ ఖడ్సే, లాతూర్‌లో దిలీప్ దేశ్‌ముఖ్, ముంబై బ్యాంక్‌లో ప్రవీణ్ దరేకర్, సింధుదుర్గ్ జిల్లాలో నారాయణ్ రాణే తదితర వర్గాల ఆధీనంలోకి బ్యాంకు అధికారాలు వెళ్లాయి. కాగా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడిగా నియమితుడైన అశోక్ చవాన్‌కు తన సొంత జిల్లా నాందేడ్‌లో గట్టి దెబ్బ తగిలింది. చవాన్ స్థానిక ఎంపీ అయినప్పటికీ బ్యాంకు ఎన్నికల్లో మాత్రం ఆయన ప్రాబల్యం కనిపించలేదు. ముంబైలో బీజేపీ ప్యానెల్ జోరు.. ముంబై బ్యాంక్ ఎన్నికల్లో ఇటీవల ఎమ్మెన్నెస్ నుంచి బీజేపీలో చేరిన ప్రవీణ్ దరేకర్‌కు చెందిన సహకార్ ప్యానెల్ చేతిలో శివప్రేరణ (శివ సేన) ప్యానెల్ ఓటమిపాలైంది. మొత్తం 21 స్థానాలుండగా, 15 స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో సహకార్ ప్యానెల్‌కు 13 స్థానాలు, శివసేన కేవలం రెండు స్థానాలు దక్కాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోని ముంబై బ్యాంక్‌లో ఆధిపత్యం చెలాయించాలని శివసేన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. శివసేన ఎంపీ సంజయ్ రావుత్ సోదరుడు, ఎమ్మెల్యే సునీల్ రావుత్‌కు ఎన్నికల బాధ్యతలు అప్పగించినా ఫలితం మాత్రం దక్కలేదు. పుణేలో ఎన్సీపీ వర్గం విజయ దుందుభి: పుణే జిల్లా సహకార బ్యాంకు ఎన్నికల్లో అజీత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. మొత్తం 21 స్థానాల్లో 17 ఎన్సీపీ ప్యానెల్ దక్కించుకుంది. అందులో ఆరు స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 13 ఎన్సీపీ దక్కించుకుంది. ఏకగ్రీవం అయిన వాటిలో నాలుగు స్థానాలు ఎన్సీపీవి ఉన్నాయి. కాంగ్రెస్, ఇండిపెండెంట్లు ఇద్దరు చొప్పున గెలిచారు. సింధుదుర్గ్‌లో రాణే ‘కమ్ బ్యాక్’: సింధుదుర్గ్ జిల్లా బ్యాంకు ఎన్నికల్లో రాణేకు ‘కమ్ బ్యాక్’ లభించినట్లయింది. కాంగ్రెస్‌కు చెందిన సంకల్ప సిద్ధి ప్యానెల్‌కు 12 స్థానాలు లభించాయి. పోటీ ప్యానల్ శివసేనకు చెందిన సహకార్ వైభవ్ ప్యానెల్‌కు కేవలం రెండు స్థానాలు మాత్రమే లభించాయి. బీడ్‌లో ముండే పైచేయి: బీడ్ జిల్లా బ్యాంక్‌లో పంకజా ముండే-పాలవే వర్గం పైచేయి సాధించింది. మొత్తం 19 స్థానాల్లో 16 ముండే వర్గానికి దక్కాయి. ఎన్సీపీ కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. జల్గావ్లో ఖడ్సే వర్గం విజయం: జల్గావ్ జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే వర్గం విజయ ఢంకా మోగించింది. ఇక్కడ ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు తదితర హేమాహేమీలు బరిలో దిగారు. మొత్తం 21 స్థానాల్లో ఖడ్సే వర్గం 17 స్థానాలు దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది. నగర్లో బాలాసాహెబ్ థోరాత్: నగర్లో రాధాకృష్ణ విఖే పాటిల్, బాలాసాహెబ్ థోరాత్ ప్యానల్ మధ్య గట్టి పోటీ ఎదురైంది. మొత్తం 21 స్థానాల్లో 11 స్థానాలు థోరాత్ వర్గానికి రాగా 10 స్థానాలు విఖే పాటిల్ వర్గానికి వచ్చాయి. సాతారాలో ఎన్సీపీ హవా: సాతారా జిల్లాలో ఎన్సీపీ ప్యానెల్ విజయ కేతనం ఎగురవేసింది. మొత్తం 21 స్థానాల్లో ఏకంగా 19 స్థానాలు ఎన్సీపీ వర్గం కైవసం చేసుకుంది. రెండు స్థానాలు ఇండిపెండెంట్లకు లభించాయి. కాగా, ఈ ఎన్నికల్లో ఇండిపెండెంటుగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే విలాస్‌కాకా పాటిల్ కూడా గెలిచారు. లాతూర్‌లో దేశ్‌ముఖ్ ప్యానెల్ పైచేయి: లాతూర్ జిల్లాలో దిలీప్రావ్ దేశ్‌ముఖ్ ప్యానెల్ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 19 స్థానాల్లో 17 దేశ్‌ముఖ్ వర్గం దక్కించుకుంది. మిగతా రెండు రమేశ్ కరాడ్(బీజేపీ) వర్గానికి వచ్చాయి. నాందేడ్‌లో చవాన్‌కు ఎదురు దెబ్బ నాందేడ్ జిల్లాలో అశోక్ చవాన్‌కు చెందిన కిసాన్ సమృద్ధి ప్యానెల్‌ను శేత్కరి వికాస్ ప్యానెల్ (శివసేన, బీజేపీ, ఎన్సీపీ కూటమి) ఓడించింది. మొత్తం 21 స్థానాల్లో శేత్కారికి 16 వచ్చాయి. చవాన్ వర్గం కేవలం ఐదు స్థానాలతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. బాంద్రా తూర్పు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పరాజయమైన తరువాత జరుగుతున్న ఈ ఎన్నికలను చవాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపు కోసం ఆయన శాయశక్తులా ప్రయత్నించారు. కాషాయ కూటమితో పాత మిత్రపక్షం ఎన్సీపీ జత కట్టడంతో ఓటమి తప్పలేదు. -
వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.10 వేల కోట్లు
నాబార్డు సీజీఎం జీజీ మమెన్ ఏలూరు : రాష్ట్రంలో వ్యవసాయ, పంట ఉత్పత్తుల కోసం సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులకు 2014-15లో రూ.10 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ జీజీ మమెన్ అన్నారు. ఏలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 500 సహకార సంఘాలకు టర్మ్లోన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రైతులకు ప్రోత్సహిం చడంతో పాటు చైతన్యపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,500 కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. రుణమాఫీతో బ్యాంకింగ్ వ్యవస్థ చిన్నాభిన్నం రుణమాఫీని ప్రోత్సహించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని, ప్రతి ఒక్కరూ రుణం రద్దువుతుందనే ఆలోచనలో ఉంటే బ్యాంకు కార్యకలాపాలు ఎలా సాగుతాయని ఆయన ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న రైతులకు మాఫీ చేయడం సమంజసం కాని తరచూ రుణమాఫీలు చేయడం సరికాదన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకు న్న దృష్ట్యా రిజర్వ్ బ్యాంకు నిర్ణయానికి అనుగుణంగా తాము దీనిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డీసీసీబీ పనితీరు సంతృప్తికరం జిల్లా సహకార బ్యాంకు పనితీరు సంతృప్తికరంగా ఉందని మమెన్ అన్నారు. డిపాజిట్ల సేకరణలో గ్రామీ ణ సహకార సంఘాలు అగ్రస్థానంలో ఉండాలని, ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా లో వ్యవసాయాభివృద్ధికి నాబార్డు సాయంపై ఈనెల 30లోగా ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. లాభాల బాటలో 233 సొసైటీలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 253 సొసైటీలకుగాను 233 లాభాల బాటలో ఉన్నాయన్నారు. ప్రతి ఏటా రూ.70 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు సొసైటీల ద్వారా బంగారంపై వ్యవసాయ రుణాలు ఇస్తున్నామని చెప్పారు. అనంతరం మమెన్ను దుశ్శాలువాతో సత్కరించారు. డీ సీసీబీ సీఈవో వీవీఎన్ ఫణికుమార్ మాట్లాడుతూ తమ బ్యాంకు గతేడాది రూ.1.68కోట్ల లాభం ఆర్జిస్తే ఈ ఏడాది రూ.3 కోట్లపైబడి లాభం రావచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అనంతరం రైతు చైతన్య కరపత్రాలను మమెన్ విడుదల చేశారు. డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, డెరైక్టర్లు అమృతమ్మ, డీసీసీబీ జీఎం మాధవి, కె.శ్రీనివాస్, డీజీఎం శ్రీదేవి, రమణమ్మ, ఐసీడీపీ పీవో పాల్గొన్నారు. అనుబంధ రంగాలకు చేయూత జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలకు నాబార్డు చేయూతనందిస్తుందని సీజీఎం జీజీ మమెన్ అన్నారు. స్థానిక వైభవ్ అపార్ట్‌మెంట్స్‌లో నాబార్డు కార్యాల యాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల అధికారులతో, బ్యాంకర్లతో సమన్వయంగా పనిచేసి సమగ్ర వ్యవసాయాభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. ఆంధ్రా బ్యాంకు డీజీఎం నాగరాజునాయుడు, ఎల్డీఎం ఎం.లక్ష్మీనారాయణ, నాబార్డు ఏజీఎం హరిగోపాల్, వ్యవసాయశాఖ జేడీ వి.సత్యనారాయణ, పశుసంవర్ధకశాఖ జేడీజ్ఞానేశ్వర్, మత్స్యశాఖ డీడీ వి.కృష్ణమూర్తి, డీసీసీబీ సీఈవో వీవీఎన్ ఫణికుమార్, ఉద్యానశాఖ ఏడీ సుజాత పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు ‘సహకారం’ అందించండి
మోర్తాడ్, న్యూస్‌లైన్: స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైన గెలవాలన్న తపనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన సంస్థలను సైతం తమ స్వార్థం కోసం వినియోగించుకుంటోంది. స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగేలా సహకార సంఘాల చైర్మన్లు కృషి చేయాలని సహకార బ్యాంకు పాలకవర్గం ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాలో ఎక్కువ మంది సహకార సంఘాల చైర్మన్లు కాంగ్రెస్‌కు చెందినవారు ఉన్నారు. సహకార బ్యాంకు పాలకవర్గ సభ్యులలో కూడా ఎక్కువ మంది పార్టీ మద్దతుదారులే. సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్నవారికి ఎన్నికల తర్వాత కొత్త రుణాలు ఇస్తామని, రుణ పరిమితిని పెంచుతామని హామీలు ఇచ్చి పార్టీకి ఓట్లు వేయించాలని సహకార బ్యాంకు పాలక వర్గం అనధికారికంగా తీర్మానించి సంఘాల చైర్మన్లకు అందించింది. గెలిపించే బాధ్యత జిల్లాలో 142 సహకార సంఘాలు ఉండగా ఇందు లో దాదాపు 90 మంది సహకార సంఘాల చైర్మ న్లు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఉన్నారు. ఎన్నిక ల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను సహకార సంఘాల చైర్మ న్లు తీసుకోవాలని పాలకవర్గం సూచించింది. తమ పార్టీకి చెందిన చైర్మన్లు ఉన్న సహకార సంఘాల తో కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచేందుకు వినియోగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగానే బ్యాంకు పాలకవర్గం సభ్యులతో సంఘాల చైర్మన్లకు మౌఖిక ఆదేశాలిప్పించారు. రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు అయిన సహకార సంఘాలు చివరకు రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మారాయని పలువురు విమర్శిస్తున్నారు. -
రూ.50వేల పైబడిన చెక్కులపై నగదు చెల్లింపులకు నో
ముంబై: మనీలాండరింగ్‌కి అడ్డుకట్ట వేసేందుకు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు చేపట్టింది. రూ. 50,000 దాకా విలువ చేసే చెక్కులకు మాత్రమే నగదు రూపంలో చెల్లింపులు జరపాలని, అంతకు మించితే నగదు చెల్లింపులు జరపరాదని గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులను ఆదేశించింది. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి నగదు బదిలీ సర్వీసులను బ్యాంకులు వినియోగించుకోవాలని ఆర్బీఐ నోటిఫికేషన్లో సూచించింది. మరోవైపు, కరస్పాండెంట్ బ్యాంకింగ్ ఒప్పందాల విషయంలో బ్యాంకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. -
‘సహకారం’ కరువైంది!
ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్ : ఎమ్మిగనూరు సహకార బ్యాంక్ అధికారులు, సిబ్బంది మామూళ్ల మత్తులో తూగుతుండడం.. వారికి, ఫీల్డ్‌స్టాఫ్‌కు మధ్య కోల్డ్‌వార్ నడస్తుండడంతో రైతులకు చేయూత కరువవుతోంది. వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అన్నదాతను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు వివిధ రంగాలు ముందుకు వస్తున్నాయి. కానీ రైతుల సామూహిక పెట్టుబడులు, టర్నోవర్‌తో ఏర్పాటైన సహకారబ్యాంక్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కర్షకులను పక్కన బెట్టి కమర్షియల్‌గా ఆలోచిస్తూ స్వాహా పర్వానికి తెరలేపుతోంది. ఎమ్మిగనూరు సహకార బ్యాంక్‌లో పంట రుణాలు పొందేందుకు రైతులు కూడా మామూళ్లు ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కేడీసీసీ బ్యాంక్‌కు, గ్రామీణ సింగిల్‌విండో సొసైటీలకు అనుసంధానంగా పని చేస్తున్న ఎమ్మిగనూరు సహకార బ్యాంక్ రైతులకు అన్ని విధాలా చేయూతనివ్వాల్సి ఉంది. బ్యాంకు పరిధిలో కడిమెట్ల, ఎమ్మిగనూరు, నందవరం, మంత్రాలయం, కలుదేవకుంట సింగిల్‌విండో సంఘాలు ఉన్నాయి. 39,553 మంది రైతులు సహకార సంఘాల సభ్యులుగా ఉన్నారు. వారిలో 6,889 మంది రైతులకు మాత్రమే పంటరుణాలు అందుతున్నాయి. మిగిలిన వారి గురించి అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాంకు అధికారులు మాత్రం మొత్తం రూ.12 కోట్ల రుణాలను రైతుల మధ్య టర్నోవర్‌గా చూపుతున్నారు. ఈ యేడాది వ్యక్తిగత రుణాల కింద రూ.96 లక్షలను ఉద్యోగులు, వ్యాపారులకు అందజేశారు. రూ.65 లక్షలు గోల్డ్‌లోన్‌ను రుణాలుగా మార్చారు. కానీ ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన ఎస్టీ లోన్లను ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడం వివాదాస్పదమవుతోంది. బ్యాంక్‌సిబ్బంది, ఫీల్డ్ స్టాఫ్ మధ్య ఏర్పడ్డ వివాదం, మామూళ్ల పంపిణీలో తేడాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పైసలిస్తేనే పంటరుణాలు ఎమ్మిగనూరు సహకార బ్యాంక్ స్థాయిని పెంచి కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సేవలు అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దాన్ని ఆసరాగా చేసుకుని స్థానిక అధికారులు, సిబ్బంది స్వాహాలపర్వానికి తెరలేపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మిగనూరు సింగిల్‌విండో సొసైటీలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది బినామీల పేరుతో ఏకంగా రూ.9 లక్షలను స్వాహాచేశారు. విషయం వెలుగులోకి వచ్చి ఆరు నెలలైనా జిల్లా సహకార బ్యాంక్ అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఫలితంగా విచారణ పూర్తయి, ఆడిట్ జరిగే వరకూ ఆ సొసైటీ పరిధిలోనే రైతులకు పంటరుణాలు అందటం కష్టమే. బ్యాంక్ కార్యాలయంలో కొంతమంది చేతివాటం బ్యాంక్ ప్రతిష్టను మరింత భ్రస్టుపట్టించింది. వ్యక్తిగత లోన్లకుగాను లక్ష రూపాయలకు రూ.3 వేలు చొప్పున ముడుపులు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. రైతులకిచ్చే దీర్ఘకాలిక రుణాలకు కూడా స్థాయిని బట్టి పర్సెంటేజీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మామూళ్లు ఇవ్వలేదనే ఉద్దేశంతోనే ఈ ఖరీఫ్‌లో రైతులకు పంపిణీ చేయాల్సిన రూ.60 లక్షలను ఇవ్వకుండా కేంద్రబ్యాంక్కు రిటర్న్ చేసినట్లు సమాచారం. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎమ్మిగనూరు బ్రాంచ్‌లో జరుగుతున్న వ్యవహారాలపై విచారణ చేపట్టాలని రైతులు, రైతుసంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.