సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల కోసం సహకార బ్యాంకులను అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పునూరు గౌతమ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకులకు మంచి రోజులు వచ్చాయని, బ్యాంక్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వైఎస్సార్ టీయూసీ సహకార సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘‘ 1987 నుండి బ్యాంకింగ్ వ్యవస్థను నీరుకార్చారు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలోని కార్మిక వర్గానికి పెద్ద పీట వేశారు. వారికి నెలకు 16,000 రూపాయలు ఇస్తున్నారు. సహకార సంస్థ కోసం గతంలో సీఎం జగన్ మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. మా ప్రభుత్వంలో ధర్నాలు ఉండవు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కార్మికులను మోసం చేశారు. ముఖ్యమంత్రి ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.వైఎస్సార్ టీయూసీలోకి 15000 మంది వచ్చారు. సహకార ఉద్యోగులకు ప్రమోషన్లు త్వరలోనే వస్తాయ’’ని అన్నారు.
ఏపీ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎండీ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ గతంలో ఐసీఐసీ బ్యాంక్‌తో సహకార బ్యాంక్‌ను టీడీపీ విలీనం చేయబోయింది. సహకార బ్యాంక్ వ్యవస్థలో కొత్త విధానాన్ని తెస్తున్నా’’మన్నారు.
Comments
Please login to add a commentAdd a comment