సహకార బ్యాంకులకు సరిపడా నగదు సాయం చేయండి: ఆర్‌బీఐ
న్యూఢిల్లీ/ముంబై: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డిపాజిట్లకు రద్దైన రూ. 500, రూ. వెయ్యి నోట్లను అంగీకరించకూడదని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం స్పష్టం చేసింది. బ్యాంకుల సందేహాల నేపథ్యంలో పూర్తి స్థారుు సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామంది. పోస్టాఫీసు డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సుకన్య సమృద్ధి వంటి పథకాలు ఇందులోకి వస్తారుు. సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు(ఆర్‌ఆర్‌బీ)లకు సరిపడా నగదు సరఫరా చేయాలని ఆర్‌బీఐ బ్యాంకుల్ని కోరింది. విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు సరిపడా కొత్త నోట్లు రైతులకు చేరేలా చూడాలని సూచించింది. వారానికి రూ. 10 వేల కోట్ల చొప్పున పంట రుణాల కోసం సహకార సంఘాలకు రూ. 35 వేల కోట్లు అవసరమున్నట్లు గుర్తించామని తెలిపింది.
10 వేల లోపు పెళ్లి ఖర్చుకు నో డిక్లరేషన్
పెళ్లి కోసం రూ. 2.5 లక్షల విత్‌డ్రాకు నిబంధనలు పెట్టిన ఆర్‌బీఐ... తాజాగా కొంత సడలింపునిచ్చింది. రూ. 10 వేల లోపు పెళ్లి ఖర్చులకు డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదని తెలిపింది.
చిన్న వర్తకుల కోసం.. చిన్న వర్తకుల కోసం ఆర్‌బీఐ ప్రత్యేక చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రీపెరుుడ్ పేమెంట్ ఇన్‌స్ట్రమెంట్స్(పీపీఐ)లను రూ. 20 వేల పరిమితి వరకూ వర్తకుల ఖాతాలకు పంపొచ్చు. వర్తకుడు ఆ పీపీఐను తన ఖాతాకు నెలకు రూ. 50 వేలదాకా బదిలీ చేయొచ్చు. కాగా, దేశవ్యాప్తంగా 2.2 లక్షల ఏటీఎంలకు గాను 82,500 ఏటీఎంలలో కొత్త నోట్ల విత్‌డ్రాకు అనుగుణంగా మార్పు చేశారు.
బ్యాంకుల్లో అక్రమాలపై ఆగ్రహం
రద్దైన నోట్ల మార్పిడి, డిపాజిట్ల సమయంలో కొందరు బ్యాంకు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. ‘అధికారులు అక్రమార్కులతో కలసి రూ. 500, రూ. వెరుు్య నోట్ల మార్పిడి, డిపాజిట్ల సమయంలో అక్రమాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై నిఘా పెంచి అడ్డుకట్ట వేయండి. రద్దైన నోట్ల వివరాలు, ఖాతాలో డిపాజిట్ చేసే పాతనోట్ల మొత్తాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. నోట్ల మార్పిడి సమయంలో ఖాతాదారుడు, నోట్ల వారీగా అన్ని వివరాలు నమోదు చేయాలి. ఎప్పుడు అడిగినా వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి’ అని పేర్కొంది.
ఐఆర్‌సీటీసీ బుకింగ్‌పై సేవాపన్ను రద్దు
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లో రైలు టికెట్లు బుక్ చేసుకునేవారికి నవంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకూ సర్వీస్ ట్యాక్స్ ను రైల్వే రద్దు చేసింది. నవంబర్ 28 వరకూ ఎయిర్ పోర్టుల్లో పార్కింగ్ ఫీజును కేంద్రం రద్దు చేసింది.
‘చిన్న మొత్తాలకు’ పాత నోట్లు చెల్లవు
Published Wed, Nov 23 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
Advertisement